ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
సంఘర్షణతో కూడిన జీవితంA LIFE OF CONFLICT డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, ఏప్రిల్ 3, 2016 "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ప్రధానులతోనూ, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులను లోక నాధులతోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:12). |
ఈ ఉదయాన్న మనము మంచి సమయము కలిగియున్నాము. మన సంఘమునకు తిరిగి జీవము వస్తుంది. కాని దీనిలో తీవ్ర విషయము ఉంది. ఏది తీవ్రమైనది ఏది సంతోషకరమైనది మనము చూడకపోతే, మనము జయమును చూడము. డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు, "అపూర్వమైన వాటి తెర ఇక్కడ కొద్దిగా తీయబడింది మనకు సంక్షిప్త విషయాన్ని ఇవ్వడానికి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న అద్భుత ఆత్మీయ శక్తులను గూర్చిన విషయము. దేవుడు 'వేల కొలది దేవదూతలను సృష్టించాడు' (హెబ్రీయులకు 12:22), మరియు వాస్తవానికి సృష్టించబడిన ఆత్మలలో మూడవ వంతు దేవునికి ఆయన ప్రజలకు వ్యతిరేకంగా పోరాడుచున్న సాతానును వెంబడించాయి (ప్రకటన 12:4, 7). ఈ [దయ్యపు శక్తులు] అంధకార సంబంధ శక్తులుగాను, లోకపు దురాత్మలను సమూహముగా ఏర్పాటు చేయబడ్డాయి" (Henry M. Morris, Ph.D., The New Defender’s Study Bible, Word Publishers, 2006; note on Ephesians 6:12). "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ప్రధానులతోనూ, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులను లోక నాధులతోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడు చున్నాము" (ఎఫెస్సీయులకు 6:12). క్రైస్తవ జీవితం సంఘర్షణ జీవితము అని ఈ వచనము చూపిస్తుంది. కాని చాలామంది క్రైస్తవులు అది మర్చిపోయారు, మన సంఘములో కూడ. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఎంత తరుచుగా మనము భావిస్తాము క్రైస్తవ జీవితము ఒక యుద్ధమని, యుద్ధ భూమి అని?...నేను చెప్తున్నాను క్రైస్తవ సంఘము ఈ గొప్ప నూతన నిబంధన సత్యాన్ని మర్చిపోయింది...నేననుకుంటాను [మనలో చాలామంది] క్రైస్తవ జీవితము సంఘర్షణతో కూడిన జీవితము అని మర్చిపోయారు...మనము యుద్ధము చెయ్యకపోతే, మనము అంతరించి పోతాము [ఓడిపోతాము]; మనము శత్రువు చేతిలో చిక్కిపోటాము" (Martyn Lloyd-Jones, The Miracle of Grace and Other Messages, Baker Book House, 1986, pp. 105, 106). మనకు ఒక భావన ఉంది మార్పు మనకు సరిపోతుందని అవసరమని. మనము అనుకుంటాము క్రైస్తవ జీవితము మార్పు నొందిన తరువాత "విశ్రాంతి పొందుతున్న నిశ్చల స్థితియని" – డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ చెప్పినట్టు (ఐబిఐడి., పేజీ 105). సత్యము నుండి ఏదీ దూరముగా ఉండలేదు! మన పాఠ్యభాగము చెప్తుంది మనము సాతానుతోనూ దెయ్యముల తోనూ నిరంతర సమరము కొనసాగించాలని! కొన్నిసార్లు లోకము నుండి మార్చబడినందుకు నేను సంతోషిస్తుంటాను. సంఘములో పెరుగు పిల్లలకు అది చాలా సులువు. అంతా వారికి వెండి పళ్ళెములో ఇవ్వబడింది. వారు సంఘములో ఉండడానికి కష్టపడనక్కర లేదు పోట్లాడ అవసరము లేదు. నేను గుడిలో పెరిగి ఉంటే, నేను మొదటి నుండి గ్రహించి ఉండే వాడిని కాదు నా సంరక్షకుని తక్కువ చెయ్యకూడదని, నేను భయంకర యుద్ధములో ఉన్నానని – నేను ఆ సంఘర్షణను నాకు నేనుగా ఎదుర్కోడానికి చాలా బలహీనుడనని! అందుకే నా జీవిత వచనము ఇలా మారింది, "నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్పీయులకు 4:13). నాకు, ఆ వచనము అర్ధము ఈ పోరాటము ద్వారా, సాతానుతో యుద్ధము చేయడానికి, నేను చాలా బలహీనుడనని. ఒక దాని తరువాత మరియొక యుద్ధము చేయడానికి కేవలము క్రీస్తు మాత్రమే నాకు శక్తి నివ్వగలడు. ఎవరో నాతో అన్నారు. నేను కొట్లాటల గురించి చూస్తానని. అది నిజము కాదు నిజము ఏమిటంటే ఇతర ప్రసంగీకులు చేసినట్టు నేను పారిపోను. మీరు పారిపోకపోతే సంఘర్షణ ద్వారా వెళ్తారు. ఎందుకు? ఎందుకంటే దెయ్యము నిజము కాబట్టి! చాలాసార్లు నేను ఎంతో బలహీనుడనై నిస్సహాయుడనై పడిపోయే వరకు వచ్చాను. ఆ సందర్భాలలో పాఠ్యభాగము చెప్పుకుంటూ బలహీన చంచల విశ్వాసముతో ఆ సందేశానికి అంటి పెట్టు కొని ఉండేవాడిని, "నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను." నాలాంటి బలహీనుడు మాత్రమే ఆ వాగ్ధానపు విలువను చూడగలడు! నా జీవిత కథను రాయమని లెస్లీ నన్ను అడిగింది. 150 పేజీలు వ్రాసాను – తరువాత ఆపేసి ప్రక్కన పెట్టేసాను. నేననుకున్నాను అలాంటి నిరుత్సాహ పరచే పుస్తకాన్ని చదవడానికి ఎవరు ఆసక్తి చూపారని – ఎందుకంటే అది సంఘర్షణ కథ, యుద్ధ భూమి, ఓటమి – సుదీర్ఘ సంఘర్షణ జీవితము, కొన్ని వెలుగుమయ ఘట్టాలు మాత్రమే ఉన్నాయి! చివరకు నేను దేవునితో అన్నాను మన సంఘము ఉజ్జీవము అనుభవించే వరకు దానిని నేను ముగించలేనని – తద్వారా మంచి ముగింపు వస్తుంది. దేవుడు నాతో చెప్పినట్టు అనిపించింది, "సరే, రోబర్ట్, అది ప్రక్కను పెట్టి ఉజ్జీవము కొరకు కనిపెట్టు – మరియు, నేను అది పంపకపోతే, నీవు అది ముగించ లేవు." కాని కొన్నిసార్లు సువార్త బోధించే సంఘములో నేను ఎదగనందుకు సంతోషిస్తుంటాను. నశించు ఏకాంత లోకములో నుండి వచ్చాను గొప్ప యుద్ధానికి సిద్ధ పర్చబడ్డాను, ఎందుకంటే నాకు మొదటి నుండి తెలుసు క్రైస్తవునిగా జీవించడం చాలా కష్ట తరమని, వేసే ప్రతి అడుగు క్రీస్తు ఇచ్చే శక్తితో వెయ్యాలని, లేనిచో నేను నిత్యత్వములో నశించి పోతానని! అందుకే నేను కాపరినయ్యాను. నేను మారిన తరువాత నేను యుద్ధములో ఉండాలని నాకు తెలుసు. నేను నిరంతరమూ యుధ్హములో ఉండకపోతే దేవుని నుండి వైదొలుగుతాను. ఇరవై సంవత్సరాలలో నేను రక్షణ పొందాక అది నాకు తెలుసు. ఇతరులు సౌకర్య జీవితము జీవించవచ్చు, నేను నిరంతరము యుద్ధములోనే ఉండాలి –యేసు వలే, పౌలు వలే, హెబ్రీయులకు పదకొండవ అధ్యాయములోని ఇతర విశ్వాస వీరుల వలే! పౌలు యవన తిమోతికి చెప్పినప్పుడు నాకు తెలుసు ఇది, "విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి" (I తిమోతి 6:12). మళ్ళీ, ఆ యవనస్తునికి అపోస్తలుకు ఇలా చెప్పాడు, "క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే, నాతో కూడ శ్రమను అనుభవించుము" (II తిమోతి 2:3). నేను కష్టాన్ని సహించవలసి వచ్చింది. విశ్వాసపు మంచి పోరాటము పోరాడవలసి వచ్చింది – యేసు క్రీస్తు సైనికుని వలే! క్రైస్తవుని వలే జయము పొందడానికి నాకు వేరే మార్గము లేదు. అన్నట్టు, చాలా సార్లు బైబిలు కాకుండా మనస్తత్వ శాస్త్రముతో ఆలోచిస్తాము. మనము బైబిలు బట్టి వెళ్తే ఎందుకు క్రైస్తవుడు పోరాడాలో అర్ధము అవుతుంది. మొన్నటి రాత్రి ఒక యవనస్తుడు నాతో అన్నాడు నేను నన్ను గూర్చి ఎక్కువ చెప్పుకుంటానని. తరువాత అతనన్నాడు, "ఇది యవనస్తుల సంఘాము కాబట్టి నీవు అలా చేస్తున్నావని అనుకుంటున్నాను." అది మంచి తలంపు. నేను నా గత జీవితానికి వెళ్లి మన సంఘపు యవనస్తులకు సహాయపడే విషయాలు చెప్తాను. నేను ప్రసంగా వేదికపై నిలబడి వేదాంతముపై మీకు ఉపన్యాసము చెయ్యకూడదు – లేక కొన్ని బైబిలు వచనాలు వివరించకూడదు. లేఖనాలు ఎలా ఉన్నాయో చెప్పాలి అది నా జీవితంలో ఎంత ప్రాముఖ్యమో చెప్పాలి – మీ జీవితంలో కూడ. నేను పాఠ్య భాగము చదువుతాను, "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ప్రధానులతోనూ, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులను లోక నాధులతోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడు చున్నాము" (ఎఫెస్సీయులకు 6:12). దాని అర్ధము ఏంటో మీకు చెప్తాను. తరువాత నా జీవితంలో అది ఎలా నిజమయిందో చెప్తాను. నేను చెప్తున్నాను, "క్రైస్తవ జీవితము, మొదటి నుండి చివరి వరకు, సంఘర్షణ జీవితము – సాతానుతో దెయ్యములతో ఆత్మీయ పోరాటముతో కూడిన జీవితము." మీరు మారిన తరువాత మీ సమస్యలు ముగుస్తాం అని మీరు అనుకోకూడదు! అది మీ పోరాటానికి యుద్ధానికి ఆరంభము మాత్రమే! డాక్టర్ హెచ్. ఎల్. విల్లింగ్ టన్ స్వతంత్ర విశ్వ విద్యాలయానికి చెందిన వాడు అన్నాడు, యేసు లోకములో ఉన్నప్పటి ఆయన పరిచర్యలో గొప్ప దెయ్యపు కార్యకలాపాలు ఉండేవి...పౌలు ప్రకారము [I తిమోతి 4:1-3] అలాంటి భయంకర స్థితి మళ్ళీ రావచ్చు మన ప్రభువు రెండవ రాకాడ [ముందు] ముందు. గొప్ప ఉద్యమముల వెనుక దెయ్యపు ప్రభావము ఉంది (H. L. Willmington, D.D., Signs of the Times, Tyndale House Publishers, 1983, p. 45). నాకనిపిస్తుంది ప్రతీ సంవత్సరము దయ్యపు కార్యకలాపాలు వేగవంతంగా పెరిగిపోతున్నాయి. నేను కళాశాలలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉండేది, కాని ఇప్పుడు ఒక యవనస్థుడు కళాశాలలో విశ్వవిద్యాలయములోనో హాజరు అవుచున్నప్పుడు, శోధింపబడకుండా ఉండలేకపోతున్నాడు, దానినే "దయ్యపు ప్రభావము" అని డాక్టర్ విల్లింగ్ టన్ చెప్పాడు. సాతాను ఉద్దేశము మిమ్ములను లోకములో పాపముతో పీల్చడం. "తను నిలుచున్నాననుకొను వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను" (I కొరిందీయులకు 10:12). మనము దెయ్యములతో పోరాడకపోతే త్వరలో, దేవునితో సంబంధము కోల్పోతాము. నీ ప్రార్ధనా జీవితములో నీ మొదటి స్థానము తేటగా తెలుస్తుంది. నీవు మునుపు ప్రార్ధించినట్లుగా చెయ్యకపోతే, దాని అర్ధము నీవు దేవుని తిరస్కరిస్తున్నావని, లేక శోధనకు చోటు ఇస్తున్నావని అర్ధము. డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ వైపుకు వినండి. ఇలా అన్నాడు, ఆదిమ దినాలలో...మన తండ్రులు పాపాన్ని నమ్మారు సాతాను ఒక శక్తిగా నమ్మారు, మరియు వారు ఇంకో వైపు దేవుని ఆయన నీతిని పరలోకాన్ని కూడ నమ్మారు... ఈ శక్తులు ఒకదానికొకటి వ్యతిరేకించుకొని, నిత్యత్వములో లోతైన సమాధిలో, సంధి అవని శత్రుత్వములో. మనిషి...ఏదో ఒక వైపు ఉండాలి – మధ్యస్తంగా ఉండలేదు. అతనికి జీవన్మరణ సమస్య, పరలోకము నరకము, దేవుని [వైపు] ఉండాలని నిర్ణయించుకుంటే, దేవుని శత్రువులతో బాహాటపు యుద్ధాన్ని కలిగియుంటాడు. ఆ పోరాటము నిజము భయంకరం [భూమి మీద] జీవితము ఉన్నంత కాలము కొనసాగుతుంది...అతడు ఎలాంటి లోకములో జీవిస్తున్నాడో మర్చిపోలేడు – అది యుద్ధ భూమి, చాలామంది దానిలో గాయ పరచబడ్డారు నరకబడ్డారు...దురాత్మలు అతని నాశనము చేస్తాయి, కాని సువార్త శక్తి ద్వారా తనను రక్షించడానికి క్రీస్తు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. విడుదల కోసం అతడు విశ్వాసముతో విధేయతతో దేవుని వైపు రావాలి. మన పూర్వికులు అలా అనుకున్నారు, అది, మనం నమ్ముతాం, అది బైబిలు బోధిస్తుంది. ఇప్పుడు, ఈ సందేశంలో ఏమి సంతోషము లేదని దయచేసి అనుకోవద్దు! బహుశా ఉంది! మనకు సహవాసము ఉంది! మనం కలిసి భోజనము చేస్తున్నాం పార్టీలు చేసుకుంటున్నాం! మనం కలిసి పార్కులో ఆటలు ఆడుతున్నాం. కాని ఇవే అంతము కాదు. ప్రతీ వినోదము సహవాసము వెనుక మనం గుర్తుంచుకోవాలి ఒక యుద్ధము ఉందని – క్రైస్తవ జీవితము సంఘర్షణతో యుద్ధముతో కూడినదని! కొంత విరామము తీసుకోవచ్చు, కాని తిరిగి మనం తిరిగి యుద్ధానికి వెళ్తాము. అందుకే యవనస్తులు మన గుడిలో ప్రతివారము కలిసి గంట ప్రార్ధనలో గడుపుతున్నారు. ప్రార్ధన చాలా అవసరము లేనిచో, సాతాను మనలను ఓడిస్తుంది! అందుకే మనం సువార్త వినడానికి బయటికి వెళ్లి నశించు వారిని గుడికి తీసుకొని వస్తాం. సువర్తీకరణ చాలా అవసరము, లేనిచో సాతాను మనలను ఓడిస్తుంది! అందుకే ప్రసంగ వేదిక నుండి బలమైన ప్రసంగాలు బోధింపవలసి వస్తుంది. బలమైన ప్రసంగాలు చాలా అవసరము, లేనిచో సాతాను మనలను ఓడిస్తుంది! ఇంకొక విషయము. ఇటీవల నా బోధలో బలహీనత నేను గమనించాను, అది ముందుగా గమనించనందుకు మీకు క్షమాపణ చెప్తున్నాను! నేను చెప్పినట్టు, క్రైస్తవ జీవిత యుద్ధము మీరు మారినప్పుడు ఆగిపోదు! ఓ, కాదు! మార్పు యుద్ధానికి ఆరంభము! యేసు అన్నాడు, "మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుకువగా ఉండి, ప్రార్ధన చేయుడి" (మార్కు 14:38). మీరు గుడికి రావచ్చు, మారినట్టు అనిపించవచ్చు, కాని మెలకువగా ఉండి ప్రార్ధించకపోతే మీరు శోధనలోను శ్రమలోను పడిపోతారు. మీరు లోకస్తులై రక్షణానందం కోల్పోతారు. మీలో కొందరు గురువారము రాత్రి జరిగే ప్రార్ధాన కూటానికి రారు. గమనించండి! మీరు ఇప్పటికే అరణ్య వాసములో అడుగు పెట్టాము! క్రైస్తవ జీవితము లోకముతో, శరీరముతో, దెయ్యముతో సంఘర్షణతో కూడినది. మీరు సాతాను ఉచ్చులో పడతారని, తుడిచి పెట్టబడతారని – చెడు లోకపు అంధకారములో పడిపోతారని గమనించాలి. ఎవరో అన్నారు, "అలా చెప్పవద్దు! అలా చెప్పవద్దు! వేరేవారిని భయపెడుతుంది!" అవును, తరువాత, వారు అలా భయపెట్టబడాలి! "పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే" (మత్తయి 22:14). నేను వారిని భయపెట్టకపోతే, వేరేది జరుగుతుంది! ఏర్పరచబడిన వారే రక్షింపబడతారు నేను ఏమి చెప్పినా చెప్పక పోయినా ఇలాంటి ప్రసంగంలో! మన సంఘ చీలికలో చాలామంది తుడుచుకుపోయారు. మన సంఘ జీవితంలో మోసపోకండి, వారు మోసపోయినట్లుగా. ఏమి మారలేదు! "దెయ్యము మన కొరకు దిగి వస్తుంది, గొప్ప ఉగ్రతతో, ఎందుకంటే వానికి తెలుసు సమయము తక్కువగా ఉందని" (ప్రకటన 12:12). మీరు లోకానికి మిమ్మును ఇచ్చుకుంటే, దెయ్యము మీ మనస్సాక్షిని చంపుతుంది. తరువాత మేము చెప్పేది ఏమి కూడ మిమ్ములను తిరిగి రప్పించజాలదు! ఏ ఒక్క వ్యక్తి కూడ తిరిగి మన దగ్గరకు రావడం చూడలేదు! ఏ ఒక్కరు కూడ! "మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు, మెలకువగా ఉండి ప్రార్ధాన చేయుడి" (మార్కు 14:38). తరువాత, మీరు కృపలో ఎదగడం లేదు లేక పడిపోవడం లేదు! మధ్యస్థ భూమి లేదు! డాక్టర్ టోజర్ చెప్పినట్టు, లోకము "ఒక యుద్ధభూమి, చాలామంది గాయపడ్డారు చంపబడ్డారు"(ఐబిఐడి.). "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ప్రధానులతోనూ, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులను లోక నాధులతోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడు చున్నాము" (ఎఫెస్సీయులకు 6:12). అవును, నిజంగా దెయ్యము ఉంది. మీరు రక్షింపబడకపోతే, వాడు మీ మనసులో వింత తలంపులు పెడుతుంటారు. వాడు మీరు యేసును నమ్మకుండా "ఇది" లేదా "అదీ" చెప్తుంటాడు. ప్రజలు యేసును నమ్మకుండా కొన్నిసార్లు వాడు భయపెడుతుంటాడు. దానిలో అర్ధము లేదు, కాని వారు వానిని నమ్ముతారు – యేసును తిరస్కరిస్తారు. మీరు సాతాను శోధనలను ఎదుర్కొని ఇప్పుడే యేసు వద్దకు రండి. యేసు మాత్రమే ఆయన ప్రశస్త రక్తములో మీ పాపలన్నింటిని కడగగలడు. యేసు మాత్రమే నిన్ను రక్షించ గలడు, ఈ దేశపు ఈ ప్రపంచపు చెడు తనము నుండి ఆయనే మిమ్మును భద్రపరచగలడు. దయచేసి నిలబడి ఏడవ పాట పాడండి. క్రైస్తవుడా, పరిశుద్ధ భూమి మీద ఉన్నవారిని చూచుచున్నావా, ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: ఎఫెస్సీయులకు 6:10-18. |