ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
రాత్రిలో దర్శనములు –
|
యేసు మృతులలో నుండి లేచాడు. దానిని గూర్చి సందేహము అవసరము లేదు. ఆయన సమాధి రోమీయులచే బంధింపబడినది, రోమా సైనికులు వారి జీవితాలతో దానిని కాపాడారు. కానీ ఈస్టర్ ఆదివారం ఉదయం దేవుని భారీ రాతి దూరంగా వెళ్లి మరియు రోమా మూతను కొల్లగొట్టాడు. యేసు ప్రాతఃకాలపు వెలుగులో సమాధిలో నుండి నడిచి బయటికి వచ్చారు. కాళీ సమాధి మృతులలో నుండి ఆయన పునరుత్తానాన్ని ప్రకటిస్తుంది! యేసు మృతులలో నుండి లేచాడు. దానిని గూర్చి సందేహము అవసరము లేదు. ఆయన పునరుత్తానమైన తరువాత వందల మంది ఆయనను సజీవంగా చూసారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, "అటు పిమ్మట, ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి యున్నారు కొందరు నిద్రించిరి...అటు తరువాత, ఆయన యాకోబునకు; అటు తరువాత అపోస్తలులకందరికినీ కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను" (I కొరిందీయులకు 15:6-8). "ఆయన శ్రమపడిన తరువాత, నలుబది దినముల వరకు వారి కగబడుచు, దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తానూ సజీవంగా కనపర్చుకొనెను" (అపోస్తలుల కార్యములు 1:3). డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, యేసును ఆయన పునరుత్థానము తరువాత వాస్తవికంగా వందల మంది ఆనంద భరిత సాక్ష్యాన్ని గూర్చి ఆలోచించండి, కొంతమంది మళ్ళీ మళ్ళీ నలభై దినాల[గా] చూసారు...వాస్తవికంగా మృతులలో నుండి యేసు లేచాడని వందల మంది ప్రత్యక్ష సాక్షులు అంగీకరించారు. ఆయన మృత శరీరాన్ని [ఈస్టరు] తరువాత చూశానని ఏ ఒక్క వ్యక్తి చెప్పలేదు, రుజువునకు వ్యతిరేకంగా కూడ ఎవరు మాట్లాడలేదు. ప్రత్యక్ష సాక్షులు [చెప్పారు] వారు రక్షకుని తాకారని, ముట్టుకున్నారని, ఆయన చేతులలోను కాళ్ళలోను ఉన్న ముళ్ళు గాయాలను ముట్టారని, ఆయనను చూసారని, నలభై రోజులు ఆయనతో సహవాసము కలిగి యున్నారని... రుజువు ఎంత అత్యానందంగా ఉందంటే నమ్మడానికి ఇష్టము లేనివారు రుజువును పరిశీలించడానికి ఇష్ట పడనివారు దానిని తిరస్కరిస్తారు. బైబిలు చెప్తున్నా దానిలో ఆశ్చర్యము లేదు యేసు "ఆయన శ్రమ పడిన తరువాత [మరణము] తరువాత అనేక ప్రమాణములను చూపి తన్నును తానూ సజీవునిగా కనపరచు కొనెను," అపోస్తలుల కార్యములు 1:3 (John R. Rice, D.D., Litt.D., The Resurrection of Jesus Christ, Sword of the Lord Publishers, 1953, pp. 49-50). ఖాళీ సమాధి, వందల కొలదీ ప్రత్యక్ష సాక్షులు, మృతులలో నుండి క్రీస్తు పునరుత్థానమునకు బలమైన రుజువు. అయిననూ విచిత్రమైన రుజువు క్రీస్తు శిష్యుల మారిన జీవితాలు. లేచిన క్రీస్తును చూచుట ద్వారా ఈ మనష్యులు పూర్తిగా మారిపోయారు. వారు పిరికి వారై, భయంతో బంధించుకున్న గదిలో ఉన్నారు. కానివారు లేచిన క్రీస్తును చూచినా తరువాత, ఆయన సజీవుడై ఉన్నాడని వారు ధైర్యముగా బోధించారు – ఆయన మృతులలో నుండి లేచాడని చెప్పారు! అలా బోధించినందుకు వారు ప్రతి ఫలము పొందుకున్నారు! పేతురు –మరణము వరకు కొట్టబడి తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. (The New Foxe’s Book of Martyrs, Bridge-Logos Publishers, 1997, pp. 5-10; Greg Laurie, Why the Resurrection?, Tyndale House Publishers, 2004, pp. 19-20). ఈ మనష్యులు భయంకర శ్రమల ద్వారా వెళ్ళారు, అందరు ముఖ్యంగా యోహాను భయంకర మరణాలు పొందుకున్నారు. ఎందుకు వారికి అది సంభవించింది? అలా వారికి ఎందుకు జరిగిందంటే వారు యేసు క్రీస్తును సజీవంగా చూసామని చెప్పారు, మృతులలో నుండి లేచాడని చెప్పారు! వారు చూడని దాని కొరకు మనష్యులు శ్రమ పడరు చనిపోరు! ఈ మనష్యులు క్రీస్తును చూసారు "సజీవంగా ఆయన [మరణం] తరువాత, అనేక ప్రమాణముల ద్వారా ప్రభువు [వారిచే] చూడబడ్డారు నలభై దినముల [వరకు]" (అపోస్తలుల కార్యములు 1:3). వృద్ధాప్యములో, మరుగుతున్న నూనెలో ఆయన శరీరం వేయబడింది, అపోస్తలుడైన యోహాను అంటాడు, "జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో, మేమేమి వింటిమో కన్నులారా ఏది చూచితిమో, ఏదినిదానించి కనుగొంటిమో మా చేతులు దేని దాకి చూచేనో అదే మీకు తెలియచేయుచున్నాము" సజీవుడైన క్రీస్తు విషయంలో (I యోహాను 1:1). ఈ మనష్యులను నమ్మవచ్చని నేను చెప్తున్నాను! మృతులలో నుండి లేచిన క్రీస్తును గూర్చి బోధించుట వలన వారు శ్రమ పడి చనిపోయారు. వారు చూడని దాని కొరకు మనష్యులు శ్రమ పడి చనిపోరు! ఈ మనష్యులు క్రీస్తును చూసారు, ఆయన ముట్టుకున్నారు, ఆయన సమాధిలో నుండి లేచిన తరువాత! అందుకే చిత్రహింసలు మరణము బోధింపకుండా వారికీ ఆపలేకపోయాయి, "క్రీస్తు మృతులలో నుండి లేచి యున్నాడు!" తోమా గదిలో ఉంచబడియున్నాడు, ఇప్పుడు శిష్యులు ఆఖరిసారిగా తిరిగి లేచిన యేసును చూస్తున్నారు. "పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము" పొందే వరకు ఆయన వారిని యేరూషలేములో కనిపెట్టమని చెప్పాడు. యేసు అన్నాడు, "అయిననూ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు, మీరు శక్తి నొందెదరు: కనుక మీరు యేరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను" (అపోస్తలుల కార్యములు 1:8). ఇది మన సంఘానికి తీసుకొని వస్తుంది, డౌన్ టౌన్ లాస్ ఏంజిల్స్ సివిక్ కేంద్రము, నడిబొడ్డున. నేను చెప్తాను, దేవుని కృప చొప్పున, మన సంఘములో అమెరికా సంయుక్త రాష్ట్రములో అందరి కంటే చక్కని క్రైస్తవులు మన దగ్గర ఉన్నారు! మరియు ప్రపంచములోనే చక్కని యవ్వన క్రైస్తవ గుంపు మనకున్నారు! సిగ్గు లేకుండా చెప్తున్నాను ఎందుకంటే అది చేసింది నేను కాదు. ఘనత అంతా "ముప్పై-తొమ్మిది" మందికి చెప్తుంది, పనిచేస్తున్న చిన్న గుంపు పెద్దలతో నిండిన వారు వారి సమయాన్ని డబ్బును వెచ్చించి మన సంఘ భవనాన్ని దివాలా నుండి కాపాడారు, 400 మంది సంఘ పెద్దలు విడిపోయి దారుణంగా బయటకు వెళ్లి పోయినప్పుడు. యేసు నామమునకు స్తోత్రము! ఆయన మనలను జయము ద్వారా నడిపించాడు! ఆ ఘనత మన సంఘ యవనస్తులకు కూడ చెందుతుంది. వారు అసాధారణ ప్రార్ధనా యోధులు. వారు ప్రార్ధనలో ఒక గంట గడుపుతారు – బోధించడం బైబిలు పఠనము కాకుండా, కేవలము ప్రార్ధన మాత్రమే – ప్రతీవారము గంటకు పైగా. ఈ యవ్వన పురుషులు స్త్రీలు మరో రెండు ప్రార్ధనా గుంపులు కలిగియున్నారు ప్రతీవారం కలుసుకొని గంటకు పైగా ప్రార్ధిస్తారు దేవుడు మన మధ్యకు ఉజ్జీవము పంపాలని. వారి ప్రార్ధనలకు జవాబు వచ్చింది లోకము నుండి చాలామంది మార్పు నొందారు. ఈ కాలములో వారము రోజులలో పదమూడు మంది మార్చబడ్డారు మన సంఘములో వారి ప్రార్ధనల ద్వారా. వారిలో ఒకరు 89 సంవత్సరాల నాస్తికుడు. మరియొకరు 86 సంవత్సరాల కేతలిక్కు. మరియొకరు ఒక స్త్రీ ఆమె 40 సంవత్సరాల నుండి క్రీస్తును తిరస్కరిస్తూ వస్తుంది. ఇంకొకరు జీవితమంతా సాతాను బంధకాలలో ఉన్నారు. మిగిలిన తొమ్మిది మంది యవనస్తులు లోకము నుండి వచ్చిన వారు, మనము సువార్తీకరణ చేస్తున్న కళాశాలల నుండి వచ్చియున్నారు. యేసు నామమునకు స్తోత్రము! ఆత్మలను సంపాదించడంలో ఆయన మనకు మాదిరి! డాక్టర్ డేవిడ్ రాల్స్టన్ మన సంఘములో గతవారపు అంతములో బోధించారు. ఆయన ఒక మిస్సేనరీ, మరియు "దేశాలకు క్రీస్తు" సంస్థకు వ్యవస్థాపకుడు. డాక్టర్ రాల్స్టన్ మన సంఘపు ఫోటో పేస్ బుక్ పేజీలో పెట్టారు – ఈ మాటలతో. డాక్టర్ రాల్స్టన్ అన్నాడు, గతరాత్రి నేను [శనివారము రాత్రి] మరియు ఈ [ఆదివారము] ఉదయము డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్ బాప్టిస్టు టేబర్నేకల్ లో నేను బోధించాను, ఇక్కడ డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారు సంఘ కాపరి. అద్భుతమైన ఆరాధనలు, ప్రతీ కుర్చీ నిండిపోయింది, సగము మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులు! యేసు నామమునకు స్తోత్రము! ఆయన నామములు దేవుడు ప్రార్ధనలకు జవాబు ఇస్తాడు! ఈ సంఘము భూమి మీద ఉన్న బంగారము అంతటికంటే నాకు చాలా ఎక్కువ. అంతర్జాలములో జరుగుచున్న పరిచర్య "ఈలోకపు చెప్పలేనంత నదుల రాగి కంటెను, వజ్రముల కంటెను నాకు చాలా ఎక్కువ." ఇది మీకు చిన్న విషయముగా అనిపించవచ్చు, కాని ఈ సంఘము ప్రపంచంలో నాకు చాల ప్రాముఖ్యమైనది! నా జీవితమూ, నా ప్రేమ నీకిచ్చుచున్నాను, ఈ సంఘము ఎంత ధననిదో చూడడము మాత్రమే కాకుండా – ఈ సంఘము ఎలా ఉండాలో, ఎలా ఉండగలదో, దేవుని కృప చేత, ఎలా ఉండబోతుందో నేను చూస్తున్నాను! రాత్రి దర్శనములలో ఈ ఆవరణము యొక్క ప్రతీమూల యవనస్తులతో నింపబడడం చూస్తున్నాను! ఈ దర్శనాలలో నేను దేవుని ఆత్మ ఉజ్జీవముల తరంగాలుగా వచ్చుట నేను చూస్తున్నాను! యేసు క్రీస్తును వారి స్వంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన యవనస్తుల సంతోషపు ముఖాలను నేను చూస్తున్నాను! రాత్రి దర్శనములలో పాతకాలపు మెథడిస్టుల వలే, బాప్టిస్టుల వలే ప్రేస్బి టేరియన్ ల వలే, యవనస్తులు ఏడ్చుట ప్రార్ధించుట సంతోషముతో కేకలు వేయుట, నేను చూస్తున్నాను! సువార్త బోధకులకు యవనస్తులు వారి జీవితాలను అర్పించుకుంటున్నట్లు నేను చూస్తున్నాను – కొంతమంది యేసు క్రీస్తు కొరకు మిస్సేనరీలుగా వెళ్ళడం చూస్తున్నాను! నేను అద్భుత సంఘాన్ని చూస్తున్నాను, ప్రజ్వరిల్లేది – దేవుని ప్రేమ ఈ స్థలము నుండి ప్రారంభమై మన దేశము, ప్రపంచమంతటిలో ఉన్న అంధకార స్థలాలకు నేను వెళ్ళడం చూస్తున్నాను! నేను చూస్తున్నాను యేసు క్రీస్తు పైకెత్తబడి ఆయన ప్రేమను పైనుండి వందల కొలది నశించు ఒంటరి ఆత్మలపై లోకమంతటా, ఈ సంఘ పరిచర్య ద్వారా జరగడం నేను చూస్తున్నాను! రాత్రి దర్శనాలలో వారు ఇలా పాడడం నేను వింటున్నాను, నా కొరకు మరణించిన ఆయన కొరకు నేను జీవిస్తాను, నాతో కలిసి పాడండి! నా కొరకు మరణించిన ఆయన కొరకు నేను జీవిస్తాను, నేను త్వరలో 75 సంవత్సరాల వాడనవుతాను. చనిపోక ముందు ఇవన్నీ చూడకపోవచ్చు. కాని ఇప్పటికే చూసాను వాటిని – రాత్రి దర్శనాలలో! గ్రిఫిత్ గారు, దయచేసి శ్రీమతి క్రిస్టిన్ సెన్స్ చక్కనిపాట పాడడంలో సహాయ పాడండి, "నా దర్శన మంతా నింపండి." దయచేసి నిలబడండి. పాటల కాగితంలో ఆరవ పాట. నా దర్శనమంతా నింపండి, రక్షకా, నేను ప్రార్ధిస్తున్నాను, ఈ ప్రసంగాన్ని నేను చైనాకు ఆఫ్రికాకు వెళ్ళిన గొప్ప మిసేనరీ మాటలతో ముగిస్తున్నాను, ఆయన పేరు చార్లెస్ టి. స్టడ్ (1860-1931). జీవితం ఒకటే, మీరు బ్రతికినంత కాలము ఆ మాటలను మర్చిపోకండి. నాతో పాటు చెప్పండి. జీవితం ఒకటే, డాక్టర్ కాగన్ గారు, దయచేసి ప్రార్ధనలో నడిపించండి. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: అపోస్తలుల కార్యములు 1:1-9. |