Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సిలువపై యేసు యొక్క
చివరి ఏడూ మాటలు

THE SEVEN LAST WORDS
OF JESUS ON THE CROSS
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, మార్చి 20, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 20, 2016

"వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, దానిని కల్వరి అనబడు చోటుకు వచ్చినప్పుడు, అక్కడ ఆయనను హింసింప చేసారు, అక్కడ కుడి వైపున, ఒకనిని ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడ సిలువ వేసిరి" (లూకా 23:33).


యేసు యొక్క శారీరక శ్రమ తీవ్రమయింది. అది కొరడాచే చర్మముపై కొట్టబడినప్పుడు ఆయన వీపుపై లోతైన గాయము అవడంతో ప్రారంభమయింది. అలా నలుగగొట్టడం ద్వారా చాలా మంది చనిపోయారు. తరువాత, ముళ్ళ కిరీటాన్ని ఆయన తలపై దించారు. పదునైన ముళ్ళు ఆయన నెత్తిపై ఉన్న చర్మములో గుచ్చుకొని, రక్తము ఆయన ముఖముపై ప్రవహించింది. వారు ఆయనను ముఖముపై కొట్టి, ఉమ్మివేసి, వారి చేతులతో ఆయన గడ్డాన్ని చీల్చారు. తరువాత వారు యేరూషలేము వీధుల ద్వారా, ఆయనను సిలువ మోయించి శిక్ష విధించే కల్వరి వరకు తీసుకెళ్ళారు. చివరిగా, ఆయన కాళ్ళకు, చేతుల దిగువ బాగాన మేకులు కొట్టారు. ఆలా ఆయన సిలువ వేయబడ్డాడు. బైబిలు చెప్తుంది:

"నిన్ను చూచి [ఆయన ఆకారము] ఏ మనిషి రూపము [చాలా వికారమని] కంటే అతని ముఖమును, [నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని] చాలామంది ఎలాగు విస్మయమొందిరో" (యెషయా 52:14).

హాలీవుడ్ నటులు సినిమాలలో యేసును ప్రదర్శించడం చూడడం మనకు అలవాటు అయింది. ఈ సినిమాలు లోతైన భయాన్ని సిలువ వేసేటప్పుడు ఊడ్ క్రూరత్వాన్ని సరిపడినంతగా చూపించవు. యేసు వాస్తవంగా సిలువపై అనుభవించిన దానిని మనం సినిమాలో చూసే వానితో పోలిస్తే అసలు లెక్కలోనికి రాదు. "క్రీస్తు తపన"లో ఆయనకు నిజంగా ఏమి జరిగిందో చూస్తాం. అది నిజంగా భయంకరం.

ఆయన పుట్టెపై భాగము తెరుచుకుంది. ఆయన ముఖముపై మెడపై రక్తము ప్రవహించింది. ఆయన కళ్ళు పూర్తిగా మూతలు పడిపోయాయి. ఆయన ముక్కు బహుశా పగిలిపోయింది ఆయన బుగ్గ ఎముక కూడ. ఆయన పెదవులు పగిలి రక్తము కారుతుంది. ఆయనను గుర్తు పట్టడం కష్టతరం.

అయినను ప్రవక్తయైన యెషయా సేవకుని శ్రమను గూర్చి అదే ముందుగా తెలియ చేసాడు, "ఏ మనిషి రూపము కంటెను అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారము ఆయెను" (యెషయా 52:14). అపహాస్యం చెయ్యడం ఉమ్మివేయడం కూడ ముందుగానే ప్రవక్త ఊహించాడు: "కొట్టువానికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని; ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు" (యెషయా 50:6).

ఇది మనలను సిలువ దగ్గరకు చేరుస్తుంది. యేసు రక్తాన్ని కారుస్తూ, అక్కడ సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువపై వేలాడుతుండగా, ఆయన ఏడూ చిన్న మాటలు పలికాడు. యేసు సిలువపై పలికిం ఆ ఏడు చివరి మాటలను మనము ఆలోచించాలని నేను ఆశిస్తున్నాను.

I. మొదటి మాట – క్షమాపణ.

"వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, దానిని కల్వరి అనబడు చోటుకు వచ్చినప్పుడు, అక్కడ ఆయనను సిలువ వేసారు, అక్కడ కుడి వైపున, ఒకనిని ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడ సిలువ వేసిరి. యేసు, తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు; గనుక వీరిని క్షమించుమని చెప్పెను" (లూకా 23:33-34).

అందుకే యేసు సిలువకు వెళ్ళాడు – మన పాపాన్ని క్షమించడానికి. యేరూషలేమునకు వెళ్ళక మునుపే ఆయనకు తెలుసు ఆయన చంప బడతాడని. కొత్త నిబంధన గ్రంధము చెప్తుంది ఆయన బుద్ధి పూర్వకంగా సిలువ వేయబడడానికి అనుమతించుకున్నాడని మన పాప పరిహారార్ధము.

"ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మ విషయంలో బ్రతికింపబడెను" (I పేతురు 3:18).

"లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను" (I కొరిందీయులకు 15:3).

యేసు ప్రార్ధించాడు, "తండ్రీ, వీరిని క్షమించుము," సిలువపై ఆయన వ్రేలాడతుండగా. దేవుడు ఆయన ప్రార్ధనకు జవాబు ఇచ్చాడు. యేసునందు పూర్తిగా విశ్వసించిన ప్రతి ఒక్కరు క్షమింపబడ్డాడు. సిలువపై ఆయన మరణము మీ పాపానికి వెల చెల్లిస్తుంది. ఆయన రక్తము మీ పాపాలను కడిగేస్తుంది.

II. రెండవ మాట – రక్షణ.

యేసుకు ఇరువైపులా, ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు.

"వ్రేలాడబడిన ఆ నేరస్తులలో [దొంగలు] ఒకడు, ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా వీధిలో ఉన్నావు, గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే? మనము చేసిన వాటికి నిజానికి పొందుకున్నాము; తగిన ఫలము పొందుచున్నాము: గాని ఈయన ఏ తప్పిదమును [తప్పు] చేయలేదని చెప్పెను. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనేను. అందుకాయన, వానిలో నేడు, నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నా వనెను"” (లూకా 23:39-43).

రెండవ దొంగ మార్పు చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది చూపిస్తుంది

1. రక్షణ బాప్తిస్మము ద్వారా లేక సంఘ సభ్యత్వము ద్వారా రాదు – దొంగ ఈ రెండు పనులు చెయ్యలేదు.

2. రక్షణ మంచి భావన ద్వారా రాదు – దొంగకు చెడు భావనలు ఉండేవి – అతడు సిలువ వేయబడ్డాడు పాప ఒప్పుకోలులో ఉన్నాడు.

3. రక్షణ ముందుకు రావడం ద్వారా చేతులెత్తడం ద్వారా రాదు – అతని చేతులకు సిలువపై మేకులు కొత్తబడ్డాయి, అతని కాళ్ళకు కూడ.

4. రక్షణ "యేసును మీ హృదయములోనికి రమ్మనడం" ద్వారా రాదు. అలా చెయ్యమని ఎవరైనా దొంగతో ఉంచుకోమని చెప్పి ఉంటే అతడు ఆశ్చర్య పోయి ఉండేవాడు!

5. రక్షణ "పాపి ప్రార్ధన" చేయడం ద్వారా రాదు. దొంగ ఆ ప్రార్ధన చెయ్యలేదు. అతడు తనను జ్ఞాపకము ఉంచుకోమని యేసును అడిగాడు.

6. రక్షణ జీవించే విధానము మార్చడం ద్వారా రాదు. అలా చేయడానికి దొంగకు సమయము లేదు.


దొంగ రక్షింపబడ్డాడు అదే విధముగా నీవు కూడ రక్షింపబడాలి:

"ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు" (అపోస్తలుల కార్యములు 16:31).

హృదయ పూర్వకంగా యేసును నమ్ము, ఆయన ఆయన రక్తము ద్వారా నీతిద్వారా నిన్ను రక్షిస్తాడు, ఆయన సిలువ వేయబడిన దొంగను రక్షించినట్లు.

III. మూడవ మాట – మమకారము.

"ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియము, మగ్ద లేనే మరియము యేసు సిలువ యెద్ద నిలుచుండిరి. యేసు తన తల్లిని చూచి, తన తల్లి, తానూ ప్రేమించిన శిష్యుడను దగ్గర, నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీకుమారుడు అని తన తల్లితో చెప్పను! తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను! ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకొనెను" (యోహాను 19:25-27).

తన తల్లిని చూసుకోమని యేసు యోహానుకు చెప్పాడు. నీవు రక్షింప బడిన తరువాత క్రైస్తవ జీవితము చాలా ఉంది. నీవు చాలా విషయాలు చూసుకోవాలి. క్రీస్తు తన ప్రియ తల్లిని అపోస్తలుడైన యోహానుకు అప్పగించాడు. ఆయన నిన్ను స్థానిక సంఘానికి అప్పగిస్తాడు. క్రైస్తవ జీవితంలో ఎవరు అలా చెయ్యలేరు స్థానిక సంఘ పట్టించుకోవడం మమకారము లేకుండా. ఇది ఒక సత్యము తరుచు ఈనాడు మరువ బడుతుంది.

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని [యేరూషలేములో] వారితో చేర్చుచుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).

IV. నాల్గవ మాట – ఆవేదన.

"మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటికమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు, యేసు, ఏలీ, ఏలీ, లామాసబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను? ఆ మాటకు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్ధము? " (మత్తయి 27:45-46).

యేసు వేదనతో కూడిన, కేక త్రిత్వము నిజత్వమును చూపిస్తుంది. తండ్రియైన దేవుడు తిరిగి పోయాడు, కుమారుడైన దేవుడు సిలువపై మీ పాపాలను మోస్తున్నప్పుడు. బైబిలు చెప్తుంది:

"దేవుడొక్కడే, దేవునిడిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు" (I తిమోతి 2:5).

V. ఐదవ మాట – శ్రమ.

"అటు తరువాత, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని, యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు, నేను దప్పిగొనుచున్నాను అనెను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి యుండెను: కనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి, ఆయన నోటికి అందించిరి" (యోహాను 19:28-29).

ఈ వచనము చూపిస్తుంది యేసు గొప్ప శ్రమ ద్వారా వెళ్ళాడని మన పాపాలకు క్రయధనము చెల్లించడానికి:

"మన అతిక్రమముల బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను" (యెషయా 53:5).

VI. ఆరవ మాట – నెరవేర్పు.

"యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని, చెప్పి, తలవంచి ఆత్మను అప్పగించెను" (యోహాను 19:30).

ఇప్పటి వరకు నేను చెప్పినది ఒక కేథలిక్ బోధకుని ద్వారా ఇవ్వబడ వచ్చును. కాని ఈ ఆరవ మాట ప్రొటెస్టెంట్ సంస్కరణను, బాప్టిస్టుల యొక్క విశ్వాసమును తరతరాలుగా అణచి వేస్తుంది. యేసు అన్నాడు, "సమప్తమాయెను."

"సమాప్త మాయెను" అన్నప్పుడు, యేసు సరియేనా ఆ విషయంలో? కేథలిక్ సంఘము, "కాదు" అని చెప్తుంది. వారంటారు ఆయన కొత్తగా సిలువ వేయబడాలి, నూతనంగా అర్పింపబడాలి ప్రతి ఆరాధనలో కూడ. కాని బైబిలు అది తప్పు అని చెప్తుంది.

"యేసు క్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడియున్నాము" (హెబ్రీయులకు 10:10).

"ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులును చేసియున్నాడు" (హెబ్రీయులకు 10:14).

"మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసి వేయలేని, ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును: ఈయనయైతే [యేసు], తరువాత పాపముల నిమిత్తమై సదాకాలము నశించు ఒక్క బలిని అర్పించి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయేను" (హెబ్రీయులకు 10:11-12).

యేసు మానవ పాపాల నిమిత్తము, ఒక్కసారిగా సిలువపై, ప్రాయశ్చిత్తము చెల్లించాడు.

యేసు అంతా చెల్లించాడు,
     నేను ఆయనకు ఋణ గ్రస్తుడను;
పాపము మరకను ఉంచి వేసింది,
     ఆయన దానిని హిమము వలే తెల్లగా కడిగాడు.
("యేసు అంతా చెల్లించాడు" ఎల్విన యం. హాల్ చే, 1820-1889).
(“Jesus Paid It All” by Elvina M. Hall, 1820-1889).

VII. ఏడవ మాట - దేవునికి అప్పగించుకొనుట.

"అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, కేకవేసి, తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా ననెను: ఆయన ఈలాగు చెప్పి, ప్రాణము విడిచెను" (లూకా 23:46).

యేసు మరణమునకు ముందు తండ్రియైన దేవునికి తన ఆఖరి ప్రకటనలో తన్ను తానూ పూర్తిగా అప్పగించుకోవడం చూపిస్తున్నాడు. గొప్ప స్పర్జన్ చెప్పినట్లు, ఇది యేసు మొదటి నమోదు అయిన మాటలను ప్రతిబింబింపచేస్తుంది, "నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని [మీరెరుగరా]?" (లూకా 2:49). మొదటి నుండి చివరి వరకు, యేసు దేవుని చిత్తము జరిగించాడు.

కఠిన శతాధి పతులలో ఒకడు ఆయన సిలువ వేసిన వాడు ఈ ఏడు మాటలు విన్నాడు. శతాధిపతి చాలామంది సిలువ వేయబడడం చూసాడు, కాని అతడు యేసు చనిపోయినట్లుగా ఎవరును చనిపోవడం ఆయన చూడలేదు, ఆయన తన ప్రాణ రక్తము ప్రవహిస్తుండగా అద్భుతమైన ప్రసంగము బోధించాడు.

"శతాధిపతి జరిగినది చూచి, ఈ మనష్యుడు నిజముగా నీతిమంతుడై యుండేనని, చెప్పి, దేవుని మహిమ పరచెను" (లూకా 23:47).

శతాధిపతి యేసును గూర్చి ఇంకా ఎక్కువ ఆలోచించి, అతడు ఇలా అన్నాడు,

"నిజముగా ఈ మనష్యుడు దేవుని కుమారుడే" (మార్కు 15:39).

ఆయన దేవుని కుమారుడు! ఆయన లేచియున్నాడు – జీవిస్తున్నాడు, శారీరకంగా – మృతులలో నుండి లేచాడు. ఆయన పరలోకమునకు ఆరోహనుడయ్యాడు. ఆయన దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింప బడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31).

దేవుని నమ్మితే సరిపోతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాని వారిది తప్పు. దేవునిలో నమ్మక ముంచి ఎవరు రక్షింపబడలేరు. యేసే స్వయంగా చెప్పాడు, "నాద్వారా తప్ప ఎవడును, తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6). డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ అన్నాడు, "క్రీస్తు దేవుని సమీపించడానికి అనేక మార్గాలలో ఒక మార్గము కాదు, అనేక మార్గాలలో ఆయన శ్రేష్టమైన మార్గము కాదు; ఆయన మాత్రమే మార్గము" (ఆవిశిష్ట క్రైస్తవుడు, పేజీ 135). మీరు యేసును నమ్మకపోతే, మీరు నశించిపోతారు. నీవు ఎంత "మంచి" వాడవైనప్పటికినీ, నీవు ఎంత తరుచుగా గుడికి హాజరవుచున్నప్పటికి, బైబిలు చదువుచున్నప్పటికినీ, నీవు యేసును నమ్మకపోతే నీవు నశించి పోయినట్టే. "నా ద్వారా తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు." యేసు మాత్రమే కేవలము తన రక్తము ద్వారా నీ పాపములను శుద్ధి చేస్తాడు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: మార్కు 15:24-34.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
     "ఆశీర్వాద విమోచకుడు" (ఆవిస్ బర్జేసన్ క్రిస్టియాన్ సేన్ గారిచే, 1895-1985).
     “Blessed Redeemer” (by Avis Burgeson Christiansen, 1895-1985).


ద అవుట్ లైన్ ఆఫ్

సిలువపై యేసు యొక్క
చివరి ఏడూ మాటలు

THE SEVEN LAST WORDS
OF JESUS ON THE CROSS

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, దానిని కల్వరి అనబడు చోటుకు వచ్చినప్పుడు, అక్కడ ఆయనను హింసింప చేసారు, అక్కడ కుడి వైపున, ఒకనిని ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడ సిలువ వేసిరి" (లూకా 23:33).

(యెషయా 52:14; 50:6)

I.    మొదటి మాట – క్షమాపణ, లూకా 23:33-34; I పేతురు 3:18; I కొరిందీయులకు 15:3.

II.   రెండవ మాట – రక్షణ, లూకా 23:39-43; అపోస్తలుల కార్యములు 16:31.

III.  మూడవ మాట – మమకారము, యోహాను 19:25-27; అపోస్తలుల కార్యములు 2:47.

IV.  నాల్గవ మాట – ఆవేదన, మత్తయి 27:45-46; I తిమోతి 2:5.

V.   ఐదవ మాట – శ్రమ, యోహాను 19:28-29; యెషయా 53:5.

VI.  ఆరవ మాట – నెరవేర్పు, యోహాను 19:30; హెబ్రీయులకు 10:10;
హెబ్రీయులకు 10:14, 11-12.

VII. ఏడవ మాట - దేవునికి అప్పగించుకొనుట, లూకా 23:46; లూకా 2:49; 23:47;
మార్కు 15:39; అపోస్తలుల కార్యములు 16:31; యోహాను 14:6.