ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నశించు వారిని తప్పించుటRESCUE THE PERISHING డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంత్రము, ఫిబ్రవరి 14, 2016 "నీ మనసు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుమని చెప్పెను" (లూకా 22:32). |
ఎన్ఐవి, చాల ఇతర ఆధునిక తర్జుమాలు, దానిని వేరుగా చూపిస్తాయి. అవి అంటాయి, "నీవు తిరిగి వచ్చినప్పుడు, నీ సహోదరులను స్థిర పరుచుము" (ఎన్ఐవి). ఈ ఉదయము మీతో చెప్పాను ఒక ప్రఖ్యాత నూతన నిబంధన వేత్త వారితో ఏకీభవించడం లేదు. నేను మీతో చెప్పాను డాక్టర్ మార్కస్ బాక్ మొహెల్ అన్నాడు, "’నీవు తిరిగినప్పుడు [వెనుకకు మళ్ళినప్పుడు],’ ఎన్నో తర్జుమాలు అంగీకరించినా, దానికి గ్రీకులో ఆధారము లేదు" (Markus Bockmuehl, Ph.D., Simon Peter in Scripture and Memory, Baker Academic, 2012, p. 156). ఆయన చూపించాడు గ్రీకు పదము "ఎఫిస్ట్రెఫో" అనగా "మార్చబడిన" అని అర్ధము లూకా సువార్తలో (ఐబిఐడి.). డాక్టర్ బాక్ మొహెల్ ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయములో బైబిలు ఆదిమ క్రైస్తవ పఠనాలలో అధ్యాపకుడు. ఆయన చూపించిన పేతురు ఎప్పుడు మార్చబడ్డాడంటే అతడు పాపపు ఒప్పుకోలు ద్వారా వెళ్లి లేచిన క్రీస్తును ఎదుర్కొన్నప్పుడు. అదే నా అభిప్రాయము కూడ, ఒక ఆక్స్ ఫర్డ్ వేత్త దానిని సమర్ధించడం నాకు ఆనందంగా ఉంది! మళ్ళీ, కేజెవి సరిగ్గా ఉంది ఆధునిక తర్జుమాలు తప్పుగా ఉన్నాయి. ఎందుకు ఆధునిక తర్జుమాలు తప్పు? ఎందుకంటే అవి "మార్పిడి"ని అర్ధము చేసుకోలేదు. అవి దానిని "నిర్ణయముగా" ఆలోచించాయి. కాని పాత కేజెవి అనువాదకులకు నిజ మార్పిడిని గూర్చి తెలుసు – అందుకే వారు "ఎఫిస్ట్రెఫో" ను సరిగ్గా – "మార్చబడిన" అని అనువాదించారు. "నీవు మార్చబడిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుమని చెప్పెను" (లూకా 22:32). ఇది ఒక గొప్ప పాఠ్యభాగము, నేను దాని నుండి రెండు విషయాలు ప్రస్తావిస్తాను. I. మొదటిది, పేతురుకు ఉండవలసిన నిజ మార్పిడిని గూర్చి క్రీస్తు మాట్లాడాడు. మార్పులోని మొదటి భాగం దేవుని ఆత్మ ఒప్పుకోలు కార్యము. "ఆయన వచ్చి, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొనచేయును" (యోహాను 16:8). పురిటాన్ రచయిత విలియం గుత్రీ (1620-1665) అన్నాడు, "సామాన్యంగా ప్రభువు ఒక ఆత్మలో తన స్వంత మార్గము సిద్ధ పరుస్తాడు అవమానము కలిగించుట ద్వారా, మానవుడు తన పాపాన్ని దౌర్భాగ్యాన్ని కనుగొనేటట్టు చేస్తాడు, తద్వారా తనకు గ్రహింపు కలుగ చేస్తాడు, వైద్యుడు క్రీస్తు యేసు తనకు అనివార్యమని" (William Guthrie, The Christian’s Great Interest, The Banner of Truth Trust, 1969 reprint, page 193). పేతురుకు ఇదే సంభవించింది క్రీస్తు సిలువ వేయబడే ముందు రాత్రి. పదాలు "నీవు మార్చబడిన తరువాత…" చూపిస్తుంది పేతురు ఇంకా మార్చబడలేదని, క్రీస్తును మూడు సంవత్సరాలుగా వెంబడించినప్పటికినీ. ఆ రాత్రి, కొంతమంది దానిని "శుభ శుక్రవారము" అని పిలుస్తారు, పేతురు చివరకు గ్రహించగలిగాడు అతడు గర్వముతో నిండిన స్వనీతిమంతుడైన పాపియని. తన హృదయ మంతటితో యేసును ప్రేమించినట్టు నటించాడు. కాని అతడు పరీక్షింపబడినప్పుడు ప్రభువును కాదన్నాడు. ఒక యువతి చెప్పింది అతడు క్రీస్తు అనుచరుడని. పేతురు క్రీస్తును కాదన్నాడు. ఇంకొక అమ్మాయి చెప్పింది, "వీడును నజరేయుడైన యేసుతో ఉన్నవాడే" (మత్తయి 26:71). పేతురు శపించుకొని ఒట్టు పెడతాడా, "ఆ మనష్యుడు ఎవరో నాకు తెలియదా" (26:72). పేతురు అన్నాడు, "నేను అబద్దమాడితే, నేను శపింపబడతాను" (థామస్ హెల్). యేసు పేతురుతో చెప్పాడు తను ఆయనను కోడి కూయక మునుపు మూడుసార్లు బొంకుతాడని. అప్పుడే కోడి కూస్తుంది! "మరియు పేతురు వెలుపలికి పోయి, సంతాప పడి ఏడ్చెను" (లూకా 22:62). "ఏడ్చుటకు" గ్రీకు పదము అర్ధము "బిగ్గరగా అరిచాడు, నిట్టూర్చాడు" (బలంగా). "సంతాప పడి" కి గ్రీకు పదము "పిక్రోస్." దాని అర్ధము "భయంకరంగా" (బలంగా). సువార్తిక ఒప్పుకోలు కలిగిన ప్రతి ఒక్కడు అంత భయంకరంగా నిట్టూరుస్తాడని నేను చెప్పడం లేదు. కాని మనము సాధారణంగా ఒప్పుకోలు పొందిన వారి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తాము. నిజమైన శాస్త్రీయ ఉజ్జీవాలలో తరుచు ఒప్పుకోలు పొందిన వారిలో భయంకరమైన ఏడ్పు చూస్తాము. చైనాలో సంభవించిన ఉజ్జీవమును గూర్చి విడియోలు నేను చూసాను పదుల కొలది ప్రజలు, పాపపు ఒప్పుకోలులో భయంకరంగా ఏడవడం చూస్తాము. ఇంగ్లాండ్ లో 1823 లో కోర్నిస్ ఉజ్జీవములో, విలియం కార్వోస్సో నశించు ప్రజలను గూర్చి మాట్లాడినప్పుడు ప్రజలు "నిస్పృహతో కూడిన ఆత్మలతో మోకాళ్ళపైబడి, వారి ఆత్మల రక్షణార్ధము దేవునితో వేదన చెందారు" (Paul E. Cook, Fire From Heaven, p. 87). దేవుడు ఉజ్జీవమును పంపినప్పుడు ఈనాడు చైనాలో మరియు ఇతర మూడవ ప్రపంచపు దేశాలలో, ఇదే జరుగుతుంది. ఇక్కడ కూడ, మన దేవుడు లేని బౌతికవాద దేశమైన అమెరికాలో కూడ, 1960 ప్రాంతములో నేను ఉజ్జీవ సమయంలో వందలాది మంది యవనస్తులు లోతైన పాపపు ఒప్పుకోలులో ఏడవడం చూసాను. ప్రస్తుతము కూడ, మన స్వంత సంఘములో, మన విచారణ గదిలో ప్రవేశించిన వారిలో పాపపు ఒప్పుకోలుతో కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటారు. అసాధారణమైన ప్రజలు, లోలోపల ఆలోచించు వారు, తరుచు లోతైన ఆవేదనలో పరిశుద్ధాత్మ దేవుడు వారి పాపాలను చూపించినప్పుడు వారు చాల ఎక్కువగా ఏడుస్తారు. గమనించండి – వారి గురించి వారు విచార పాడడం లేదు. మీ గురించి మీరు విచారపడితే మీరు మార్చబడలేరు. నీ పాపమును బట్టి నీవు విచార పడాలి. ఇది కొత్తేమి కాదు. పేతురు ఒక్కడే కాదు అతడు మార్చబడే ముందు ఒప్పుకోలు ద్వారా వెళ్ళినది. అపోస్తలుడైన పౌలు కూడ దీని ద్వారా వెళ్ళాడు. పౌలు ఎంతగానే నొచ్చుకోబడి ఇలా అన్నాడు, "అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడి పించును?" (రోమా 7:24). పెంతేకోస్తూ దినమున పాపపు ఒప్పుకోలు మూడు వేలమందికి జరిగింది. "వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును, కడమ అపోస్తలులను అడిగిరి" (అపోస్తలుల కార్యములు 2:37). పాతకాలపు వ్యాఖ్యాత మేత్యూ హెన్రీ అన్నాడు, "పాపులు, వారి కన్నులు తెరవబడినప్పుడు, వారి పాపమును చిట్టి హృదయములో నొచ్చుకుంటారు… ఎవరైతే నిజంగా వారి పాపాల గురించి విచార పడతారో, వాటిని గూర్చి సిగ్గు పడతారో, వారు వాటి పర్యావసానములను గూర్చి భయపడతారు, హృదయములో నొచ్చుకుంటారు... ‘నా మంచి అభిప్రాయాలు నాపై నాకున్న నమ్మకము నన్ను విఫల పరిచింది’" (Matthew Henry’s Commentary on the Whole Bible; note on Acts 2:37). దేవుడిచ్చిన ఒప్పుకోలు ఉన్నవారు ఏడ్చారు. యేసు వెనుక నిలువబడి పాపపు స్త్రీ ఏడ్చింది. "ఆయన ఆమెతో అన్నాడు, నీ పాపములు క్షమింపబడి యున్నవి అని" (లూకా 7:48). పాత రోజులలో మార్చబడిన వారు బలమైన పాపపు ఒప్పుకోలు కలిగి యేసు నొద్దకు వచ్చేవారు. పేతురు పౌలు కాకుండా, ఇతరులు కూడ. అగస్టీన్ మార్పును గూర్చి చదవండి. లూథరు మార్పును గూర్చి చదవండి. జాన్ బన్యన్, జార్జి వైట్ ఫీల్డ్, జాన్ వెస్లీ, హొవెల్ హేరిస్, స్పర్జన్, 1949-52 మధ్యలో లూయిస్ దీవిలో యవనస్తులను చూడండి. వాళ్ళందరూ లోతైన పాపపు ఒప్పుకోలు కలిగిన వారే. ఒక అమ్మాయి చెప్పడం విన్నాను, "నాతో నేను విసిగి పోయాను" యేసును విశ్వసించే ముందు. ఇప్పుడు వినండి పీటర్ బొహ్లెర్ కౌంట్ జిన్ జెండోర్ఫ్ కు వ్రాసిన ఉత్తరము జాన్ వెస్లీ మార్పును గూర్చి. అతడు లేచి అన్నాడు, "456 పాట పాడదాము, ‘నా ఆత్మ నీ ముందు సాగిల పడ్తుంది.’" పాడుచుండగా తరుచు తన కళ్ళల్లో నుండి నీరు తుడుచుకున్నాడు, వెంటనే తన పడక గదిలోనికి నన్ను పిలిచాడు ఒప్పుకున్నాడు సత్యాన్ని గూర్చి ఒప్పుకోలు పొందాడని నేనతనికి చెప్పాను [రక్షించే] విశ్వాసాన్ని గూర్చి ఇంకా అతడు దాని గూర్చి వివాదింప లేదు, కాని ఈ కృపను పొందుకోలేక పోయాడని గ్రహించాడు. అలాంటి విశ్వాసాన్ని అతడు ఎలా పొందుకున్నాడు? అతడు ఇతరుల వలే పెద్ద పాపాలు చెప్పలేదు. నేను జవాబిచ్చాను రక్షకుని నమ్మక పోవడం పాపమని, క్రీస్తును వేదకాలని, ఆయనను కనుగొనే వరకు వెదకాలని. నేను బలముగా కదిలింపబడ్డాను తన కొరకు ప్రార్ధించాలి విమోచ కాని వేడుకున్నాను ఈ పాపిపై కృప చూపమని. ప్రార్ధన తరువాత వెస్లీ అన్నాడు రక్షించు విశ్వాస వరము తన కున్నప్పుడు, వేరే ఏ అంశము మీద అతడు బోధించలేదు... నేను దృడంగా అతని బ్రతిమాలాను రక్షకుని కృప దూరంగా ఉందని కాని, భవిష్యత్తు లోనిదని కాని అనుకోవద్దని, అది ప్రస్తుతానికి సంబంధించినదని, దగ్గరగా ఉందని నమ్మాలని, యేసు హృదయము తెరువబడి ఉందని తన కొరకైన ఆయన ప్రేమ గొప్పదని. అతడు తీవ్రంగా ఏడ్చాడు తనతో పాటు ప్రార్ధించమని నన్ను అడిగాడు. నేను నిజంగా చెప్పగలను జాన్ వెస్లీ ఒక పేద, హృదయము పగిలిన పాపి, శ్రేష్టమైన నీతిని గూర్చి ఆకలి కలిగినవాడు, యేసు క్రీస్తు యొక్క నీతిని బట్టి కాకుండా, అది ఇప్పటి వరకు తనతోనే ఉంది. సాయంకాలము అతడు I కొరిందీయులకు 1:23, 24 పై బోధించాడు, "మేము సిలువ వేయబడిన క్రీస్తును బోధించు చున్నాము..." అతనికి నాలుగు వేలమంది వినేవారు ఉన్నారు అందరు విభ్రాంతి నొందే రీతిలో ఆయన మాట్లాడాడు... ఆయన తొలి మాటలు, "నేను సవినయంగా ఒప్పుకుంటున్నాను నేను సిలువ వేయబడిన యేసును గూర్చి బోధించుటకు యోగ్యుడను కాదు." ఈ ప్రసంగము ద్వారా చాలామంది మేల్కొనబడ్డారు (quoted in John Greenfield, When the Spirit Came: The Moravian Revival, Strategic Press, no date, p. 28). జాన్ వెస్లీ అక్కడ నిలబడి, తన బుగ్గల మీదుగా కన్నీరు కారుస్తూ, క్రీస్తు ద్వారా రక్షణను గూర్చి బోధించాడు – అతడు మర్చబడక మునుపు! యాభై సంవత్సరాల తరువాత, చనిపోతున్నప్పుడు, మళ్ళీ మళ్ళీ ఆయన గుస గుసలాడడం వారు విన్నారు, నేను పాపులలో ప్రధాన పాపిని, యేసు బంధింపబడే రాత్రి ఆ అనుభవము పేతురు కు కలిగింది. డాక్టర్ థామస్ హెల్ ఆ పిట్ట కథ చెప్పాడు, ఒక ప్రాచీన రచయితచే చెప్పబడింది తన తదుపరి జీవిత కాలములో, ఎప్పుడైతే పేతురు కోడి కూత విన్నాడో, అతడు ఏడ్చేవాడు, ఎందుకంటే అతడు ప్రభువును కాదన్న రాత్రిని అతడు జ్ఞాపకము చేసుకున్నాడు (Thomas Hale, M.D., The Applied New Testament Commentary, Kingsway Publications, 1997, p. 286; note on Mark 14:72). II. రెండవది, మార్పు నొందిన తరువాత పేతురు చేయబోయేది క్రీస్తు చెప్పాడు. "నీవు మార్చబడిన తరువాత, నీ సహోదరులను బలపరుచుము" (లూకా 22:32). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "పేతురు తరువాత తన సహోదరులను బలపరచగలిగినాడు. పరీక్షింపబడిన వ్యక్తీ ఇతరులకు నిజంగా సహాయ పడగలడు" (బైబిలు ద్వారా; గమనిక లూకా 22:32). పాపపు ఒప్పుకోలు ద్వారా వెళ్ళిన వ్యక్తీ పాపపు ఒప్పుకోలు కలిగిన ఇతరులకు సహాయ పడగలడు. యేసుచే రక్షింపబడిన వ్యక్తి యేసు ద్వారా రక్షింపబడేలా ఇతరులకు సహాయము చేస్తాడు. తను ఎంత బలహీనుడో తెలుసుకున్న వ్యక్తి బలహీనులకు సహాయము చేయగలడు. నేను ఎప్పుడు జాన్ వెస్లీని ప్రేమించాను. నేను అతని ప్రేమించడానికి ఒక కారణము, నాలాగే, అతను అనుకున్నాడు కచ్చితమైన బ్రతుకు బ్రతికితే రక్షింపబడగలడని. నేను సరిగ్గా అలానే అనుకున్నాను. అతడు మొరాబియన్ మిస్సెనరీ, పీటర్ బొహ్ లేర్ కు చెప్పాడు, తనకు రక్షించే విశ్వాసము లేదని. బొహ్ లేర్ అన్నాడు వెస్లీ అనుకున్నాడని, "అతడు అలాంటి విశ్వాసాన్ని ఎలా పొందాడని? అతడు ఇతరుల వలే ఎక్కువ పాపాలు చెయ్యలేదు." అది వెస్లీకి ఆటంకబండ, నాకు కూడ. బొహ్ లేర్ తనతో చెప్పాడు యేసును నమ్మక పోవడం కూడ పాపమేనని. "అతడు భయంకరంగా యేడ్చి తన కొరకు ప్రార్ధించమని నన్ను అడిగాడు." అతడు యేసుచే రక్షింపబడిన తరువాత, జాన్ వెస్లీ తన జీవిత కాలమంతా నశించు పాపులకు సహాయము చెయ్యడానికి సహోదరులను బలపరచడానికి వినియోగించాడు. అతడు ప్రతి సంవత్సరము గుఱ్ఱముపై 4,500 మైళ్ళు ప్రయాణించి, ప్రతి రోజు రెండు లేక అంతకంటే ఎక్కువ ప్రసంగాలు బోధించి, తన మిగిలిన జీవిత కాలమంతా గడిపాడు! కొన్ని నిమిషాల క్రితం గ్రిఫిత్ గారు పాడిన పాట వెస్లీచే బాగుగా వ్రాయబడింది. నశించు వారిని తప్పించుడి, చనిపోవు వారి కొరకు పట్టించుకోండి, పల్లవి నాతో పాడండి! నశించు వారిని తప్పించుడి, చనిపోవు వారి కొరకు పట్టించుకోండి, "నీవు మార్చబడినప్పుడు, నీ సహోదరులను స్థిర పరచుము" (లూకా 22:32). ఒకడు నిజంగా మార్చబడ్డాడని మనం ఎలా చెప్పగలం? వారి నిజంగా రక్షింపబడ్డారని మీరు ఎలా చెప్పగలరు? "నీవు మార్చబడినప్పుడు, నీ సహోదరులను స్థిర పరచుము." నీవు మార్పిడి చెందినప్పుడు క్రీస్తు నీ ఆశలను మార్చేస్తాడు. మునుపు నీవు ఎక్కువగా ప్రేమించిన దానిని ప్రక్కన పెట్టి సహోదరులను ఎక్కువగా ప్రేమిస్తావు. నీ హృదయమంతటితో సంఘాన్ని ప్రేమిస్తావు. నీ ఆత్మ అంతటిలో నిజ క్రైస్తవులను ప్రేమిస్తావు. వారిని బలపరచడానికి సహాయము చేయడానికి నీవు చేయ దలుచుకున్న దంతా చేస్తావు. వారి కొరకు ప్రార్ధన చేస్తారు వారికి సహాయము చేస్తావు క్రీస్తుకు కలిగిన హృదయము తో వారిని ప్రేమిస్తావు. అపోస్తలుడైన యోహాను దానిని చాలా తేట పరిచాడు. అతనన్నాడు, "మనము సహోదరులను ప్రేమించుచున్నాము, గనుక మరణమునుండి జీవములోనికి దాటి యున్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణము నిలిచి యున్నాడు" (I యోహాను 3:14). నీవు మార్చబడినావని చెప్పడానికి అది ఒక మార్గము. నీవు నిజంగా సంఘములో ఉన్న సహోదర సహోదరీలను ప్రేమిస్తావు, వారికి సహాయ పడడానికి చేయగలిగినంతా చేస్తావు. చూడండి లారా మరియు కరేన్ మరియు ఇతర కొత్త అమ్మాయిలూ శ్రీమతి హైమర్స్ ఎలా సహాయ పడుతున్నారో! వారు మార్చబడి నారని చెప్పగలము! కాని ఇంకొక మార్గము కూడ ఉంది నీవు మార్చబడ్డావని చెప్పడానికి. బైబిలులో లూకా 14 చూడండి. స్కోఫీల్ద్ పథన బైబిలులో 1096 పేజీలో ఉంది. ఇది గొప్ప పెండ్లి విందు ఉపమానము. యీ గొప్ప విందు ఏర్పాటు చేసిన "వ్యక్తి" క్రీస్తు. ప్రజలను ఆహ్వానించడానికి ఆయన పంపిన సేవకులు నిజ క్రైస్తవులు. నిజ క్రైస్తవుని తో యేసు ఏమి చెప్తున్నాడో చూడండి. అది 23 వ వచనంలో ఉంది. నిలబడి గట్టిగా చదవండి. "అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు, నీవు రాజ మార్గముల లోనికిని, కంచెలలోనికి వెళ్లి లోపలి వచ్చుటకు, అక్కడి వారిని బలవంతము చేయుము " (లూకా 14:23). కూర్చోండి. పెన్సిల్ గాని పెన్ను గాని తీసుకొని "నీవు నీవు రాజ మార్గముల లోనికిని, కంచెలలోనికి వెళ్లి లోపలి వచ్చుటకు, అక్కడి వారిని బలవంతము చేయుము" క్రింద గీత గీయండి (లూకా 14:23). అదే మనం చేస్తాం ప్రతి గురువారము రాత్రి, శనివారము రాత్రి, ప్రతి ఆదివారము మధ్యాహ్నము. ఆత్మలను రక్షించాలని ప్రతి ఒక్కరిని బయటకి పంపిస్తాము. కాని నేను చూస్తాను కొందరు నిలబడి మాట్లాడుతూ, ఎదో చేస్తూ ఉంటారు సమయము గడపడానికి. కనుక వారు ఒక పేరు కూడ తీసుకురారు అనుసరించడానికి, లేక కొన్ని పేర్లు కూడ తేరు. పేర్లు తీసుకురాని వారి విషయం ఏముంటుంది? రెండిలో ఒకటి: వారు నశించి పోయి ఉండాలి, లేక వెనక్కు పోయి ఉండాలి. మంచి క్రైస్తవులు నశించి వారి వెంట వెళ్తారు. రక్షింపబడని వెనక్కి పోయిన వారు అవివేకంగా సమయము వృధా చేస్తారు. మీరు అలా వెనక్కి పోయి ఉంటె, చూసుకోండి! మీరు పశ్చాత్తాపపడకపోతే రక్షనానాందము కోల్పోతారు. యేసు మీతో చెప్తున్నాడు, "నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, మారు మనస్సు పొంది, ఆ మొదటి క్రియలను చేయుము" (ప్రకటన 2:5). "మొదటి క్రియలను చేయుము." ఆత్మల సంపాదనకు తిరిగి వెళ్ళండి. పేర్లు తీసుకు రండి. మునుపు చేసినట్లు మొదటి క్రియలు చేయండి. కాని మీలో కొందరు ఎప్పుడు అలా చెయ్యలేదు. చెయ్యాలను కోలేదు, చేద్దామనుకోవడం లేదు కూడ. మీ కళ్ళు తలుక్కుమంటాయి మీ ముఖాలు కఠినమవుతాయి. మీరనుకుంటారు, "యితడు ఆ పని చెయ్యడానికి నన్ను ఉపయోగించుకోలేదు!" ఎందుకు కాదు? సరే, దీనిని బట్టి మీరు మార్చబడలేదని చెప్పవచ్చు. మీరు కనిపెడుతున్నారు మేము మీకు "బోధించాలని" ఎలా మర్చబడాలో క్రీస్తుకు విదేయులవడానికి ఉద్దేశము లేకుండా. క్రీస్తు అంటున్నాడు, "లోపలి రమ్మని బలవంత పెట్టుడి" – మీరంటారు, "లేదు, నేను క్రీస్తుకు లోబడను!" అమాయకుడా! అవివేకి! అలా చేస్తే నీకు ఎసులో సమాధానము సంతోషము ఉండదు! యీగొప్ప పట్టణములో వందల కొలది నశించు ఒంటరి యవనష్టులు ఉన్నారు. ఎవరైనా వస్తారని వారిపై దయ చూపిస్తారని, వారిపై ఆసక్తి కనపరుస్తారని, మంచి మార్గము చూపిస్తారని ఎదురు చూస్తున్నారు. నువ్వే నశించిపొతే వారిని సహాయ పడలేవు. వారి నిమిత్తము, నేను నిన్ను బతిమాలుచున్నాను నీవు పశ్చాత్తాప పడి యేసును నమ్మమని. విశ్వాసము ద్వారా యేసు నొద్దకు రమ్ము. నీ జీవితాన్ని ఆయన ఆధీనంలో పెట్ట. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్తములో నీ పాపాల నుండి శుభ్రంగా కడిగేస్తాడు. నశించు వారిని తీసుకు రావడానికి సహోదరులకు సహాయ పడడానికి ఆయన నిన్ను బయటికి పంపిస్తాడు! "నీవు మార్చబడిన తరువాత, నీ సహోదరులను స్థిర పరుచుము " (లూకా 22:32). మీ పాటల కాగితంలో ఉన్న ఆరవ పాటను దయచేసి నిలబడి పాడండి. తెలియ చేస్తాయి! అది కాపరి స్వరము నేను వింటున్నది, డాక్టర్ చాన్ గారు, దయచేసి ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: లూకా 22:31-34.
|
ద అవుట్ లైన్ ఆఫ్ నశించు వారిని తప్పించుట RESCUE THE PERISHING డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే "నీ మనసు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుమని చెప్పెను" (లూకా 22:32).
I. మొదటిది, పేతురుకు ఉండవలసిన నిజ మార్పిడిని గూర్చి క్రీస్తు మాట్లాడాడు,
II. రెండవది, మార్పు నొందిన తరువాత పేతురు చేయబోయేది క్రీస్తు చెప్పాడు,
|