Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




క్రీస్తు యొక్క శ్రమలు!

THE SUFFERINGS OF CHRIST
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, జనవరి 31, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, January 31, 2016

"మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు యీ రక్షణను గూర్చి పరిశీలించుచు, తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు సాక్ష్యమిచ్చును: వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు, ముందుగా సాక్ష్య మిచ్చునప్పుడు, ఆ ఆత్మయే కాలమును ఎట్టి క్రీస్తు శ్రమలను గూర్చియు, కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి" (I పేతురు 1:10-11).


పాత నిబంధన ప్రవక్తలు క్రీస్తు ఆత్మచే వ్రాసారు. మళ్ళీ మళ్ళీ బైబిలు చెప్తుంది పాత నిబంధనలోని, ప్రతి పదము, దేవుని నుండి ఇవ్వబడింది. వారికి కూడా అర్ధము కాని కొన్ని విషయాలు ప్రవక్తలు వ్రాసారు. పట్టుదలతో తాత్పర్యము వారు వెదికారు. యెషయా 53 మరియు కీర్తనలు 22 ప్రవచనాత్మకంగా చెప్తున్నాయి "క్రీస్తు శ్రమను గూర్చి" (I పేతురు 1:11).

ఇప్పుడు పదకొండవ వచనము చివరి నాలుగు పదాలు, "క్రీస్తు యొక్క శ్రమలు," మీరు జాగ్రత్తగా చూడాలని ఆశిస్తున్నాను "టా ఇస్ క్రిస్టాన్ పాతే మాట," క్రీస్తు యొక్క "పాతేమాట." గ్రీకు పదము అర్ధము "నొప్పులు" లేక "శ్రమలు." అది ద్వంద్వము – ఒక నొప్పి కంటే ఎక్కువ, ఒక శ్రమ కంటే ఎక్కువ. "క్రీస్తు యొక్క శ్రమలు."

పేతురు భూమి మీద తన ఆఖరి దినాలలో క్రీస్తు శ్రమల ద్వారా వెళ్లడాన్ని గూర్చి మాట్లాడాడు. క్రీస్తు మన పాపల నుండి రక్షించడానికి చాలా శ్రమల ద్వారా వెళ్ళాడు.

I. మొదటిది, గెత్సమనే వనంలో ఆయన శ్రమ.

సిలువ వేయబడే ముందు రాత్రి ఆయన శ్రమలు మొదలయ్యాయి. ప్రభు రాత్రి భోజనము అయ్యే సరికి అర్ధరాత్రి అయింది. యేసు శిష్యులను ఇంటి నుండి బయటికి తీసుకెళ్ళాడు. అంధకారంలో బయటికి వెళ్ళారు. వారు కెద్రోను వాగు దాటి ఒలీల కొండను సమీపించి, గెత్సమనే వనంలో అందకారంలోనికి ప్రవేశించాడు. ఎనిమిది మంది శిష్యులతో యేసు చెప్పాడు, "నేను అక్కడికి వెళ్లి ప్రార్ధన చేసి వచ్చు వరకు, మీరిక్కడ కూర్చోండి" (మత్తయి 26:36). ఆయన పేతురు, యాకోబు మరియు యోహానులను వనము లోపలి తీసుకెళ్ళాడు. క్రీస్తు వారిని అక్కడ విడిచి పెట్టి ఇంకా ముందుకు వెళ్లి, ఒలీవల చెట్టు క్రింద, దేవునికి ఒంటరిగా ప్రార్ధించాడు.

ఇప్పుడు "క్రీస్తు యొక్క శ్రమలు" ఆరంభమయ్యాయి (I పేతురు 1:11). గమనించండి, మనవ హస్తము ఆయనను ముట్టలేదు. గమనించండి, ఆయన అంధకారంలో గెత్సమనే వనంలో ఒలీవల చెట్టు క్రింద, ఆయనకు శ్రమలు ప్రారంభమయ్యాయి. అక్కడ, వనంలో, మానవాళి పాప భారము ఆయనపై మోపబడింది, దానిని ఆయన "ఆయన శరీరములో" భరించాడు, ఉదయాన్న సిలువకు (I పేతురు 2:24). అప్పుడు యేసు చెప్పాడు,

"అప్పుడు యేసు మరణము అగునంతగా, నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది... నా తండ్రీ, సాధ్యమైతే, యీ గిన్నె నా యెద్ద నుండి తొలగి పొనిమ్ము" (మత్తయి 26:38, 39).

ఈ ప్రార్ధనకు ఆధునిక తర్జుమా చెప్తుంది యేసు సిలువ నుండి విడిపింపబడడానికి అడుగుతున్నాడు అని. కాని ఆ అభిప్రాయానికి విలువ ఇచ్చే లేఖనము నేను కనుగొనలేదు. నేను నమ్ముతాను డాక్టర్ జాన్ ఆర్. రైస్ మరియు డాక్టర్ జే. ఆలివర్ బస్ వెర్ సరియైన తర్జుమా ఇచ్చాడని. ఇద్దరు సువర్తికులు డాక్టర్ రైస్ వేదాంతి డాక్టర్ బస్ వెల్ అన్నాడు క్రీస్తు ప్రార్దన, "ఈ గిన్నె నానుండి తొలగింపుము," అంటే మరణపు "గిన్నె" – పాప భారము క్రింద శ్రమ – గెత్సమనే వనంలో! యేసు దిగ్బ్రాంతిలో ఉన్నాడు. ఆయన వనంలో చనిపోబోతున్నాడు. డాక్టర్ బస్ వెల్ అన్నాడు యేసు ప్రార్ధించాడు "వనంలో మరణము నుండి విడుదల కొరకు, సిలువపై తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి" (J. Oliver Buswell, Ph.D., A Systematic Theology of the Christian Religion, Zondervan, 1971, part III, p. 62). డాక్టర్ రైస్ అన్నాడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, "ఆ రాత్రి మరణపు గిన్నె తప్పిపోవాలని ప్రార్ధించాడు తద్వారా యేసు మరునాడు సిలువపై చనిపోవడానికి" (John R. Rice, D.D., Litt.D., The Gospel According to Matthew, Sword of the Lord Publications, 1980, p. 441). "అసాధారణంగా ఆయన శరీరము బల పరచ బడకపోతే, క్రీస్తు తప్పని సరిగా ఆరాత్రి వనంలో చనిపోయి ఉండేవాడు" (రైస్, ఐబిఐడి., పేజీ 442). మీ పాప భారము ఆయనను గెత్సమనేలో చంపేసి ఉండేది.

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుతున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

యేసు ఆ రాత్రి మన పాపాలు ఆయనపై మోపబడినప్పుడు భయంకర భయాన్ని అనుభవించాడు. ఆయన వేదన ఎంత అధికంగా ఉందంటే చెమట "గొప్ప బిందువుల వలే" ఆయన చర్మము నుండి కారింది. ప్రవక్త అన్నాడు,

"నిశ్చయంగా అతడు, మన రోగములను భరించెను" (యెషయా 53:4).

"యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను" (యెషయా 53:6).

మనం ఎంత త్వరితంగా యోహాను 3:16 చదువుతాం,

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన అద్వితీయ కుమారుడుని అనుగ్రహించెను..." (యోహాను 3:16).

గెత్సమనేలో నొప్పి, శ్రమ, భయము ద్వారా వెళ్ళడానికి! ఆరాత్రి యేసు భరించిన ఆ భయంకర శ్రమను గూర్చి మనం ఎంత తక్కువగా ఆలోచిస్తాము! జోషఫ్ హార్ట్ అన్నాడు,

దైవ కుమారుని శ్రమను చూడు,
   మూర్చపోతూ, మూలుగుచు, రక్తము చెమట వలే కారుస్తూ!
అమితమైన లోతైన దైవిక ప్రేమ!
   యేసు, మీ ప్రేమ ఎంత గొప్పది!
("మీ తెలియని శ్రమలు" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768;
      స్వరము '"అది అర్ధ రాత్రి, ఒలీవ కొండపై").

"క్రీస్తు యొక్క శ్రమలు" (I పేతురు 1:11).

నేను తరుచు అనుకుంటాను గెత్సమనేలో, మొదటి శ్రమ చాల గొప్పది. మనవ హస్తము ఆయనను ఇంకా తాకలేదు. కాని దేవునిచే నీ పాపము ఆయనపై మోపబడినప్పుడు ఆయన మనసు పగిలింది – ఆయన చర్మము నుండి రక్తము చెమట బిందువుల వలే కారింది! విలియమ్ విలియమ్స్ అన్నాడు,

మానవాళి ఎనలేని నేరారోపణ భారము
   రక్షకునిపై వేయబడింది;
దుఃఖకరమైన విషయంతో, వస్త్రము వలే, ఆయన
   పాపుల నిమిత్తము ధరించాడు,
పాపుల నిమిత్తము ధరించాడు.
   ("వేదనలో ప్రేమ" విలియమ్ విలియమ్స్ చే, 1759;
స్వరమునకు "అద్భుత మాధుర్యము సింహాసనా సీనమయింది").

"క్రీస్తు యొక్క శ్రమలు" (I పేతురు 1:11).

మొదటిది, గెత్సమనే వనంలో ఆయన శ్రమలు.

II. రెండవది, ఆయన పరాభవముతో కూడిన శ్రమ.

"క్రీస్తు యొక్క శ్రమలు" ప్రారంభమయ్యాయి. ఇంకా చాలా జరుగ నున్నాయి. సైనికులు దివిటీలతో గెత్సమనే వనమునకు వచ్చారు. అబద్ధపు అభియోగముతో వారు యేసును బంధించారు. వారు ప్రధాన యాజకునికి ఆయనను అప్పగించారు.

"అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అరచేతితో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడో, ప్రవచింపు, మనిరి" (మత్తయి 26:67-68).

"కొందరు ఆయన మీద ఉమ్మివేసి, ఆయన ముఖమునకు ముసుగువేసి, ఆయనను గుద్దుచు, ప్రవచింపుమని, ఆయనతో చెప్పసాగిరి: బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి" (మార్కు 14:65).

జోసెఫ్ హార్ట్ అన్నాడు,

చూడు ఎంత ఓర్పుతో యేసు నిలబడ్డాడో!
   ఈ భయంకర స్థలంలో అవమానింపబడ్డాడు!
పాపులు శక్తిమంతుని చేతులను బంధించారు,
   వారి సృష్టి కర్త ముఖముపై ఉమ్మివేసారు.
("ఆయన తపన" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768; స్వరము
   "అది అర్ధరాత్రి, ఒలీవల కొండపై").

"సైనికులు ఆయనను విచారించు ప్రాంగణములోనికి, ప్రవేశ పెట్టారు; సమూహ మంతటిని పిలిచారు. ఆయనకు ఉదారంగు వస్త్రము ధరింప చేసారు, ముండ్ల కిరీటము ఉంచారు, ఆయన తలపై, యూదుల రాజా నీకు శుభమని చెప్పి, ఆయనకు వందనము, చేయసాగిరి! మరియు రెల్లుతో ఆయన తలమీద కొట్టి, ఆయన మీద ఉమ్మివేసి, మొకాల్లని ఆయనకు నమస్కారము చేసిరి" (మార్కు 15:16-19).

ప్రవక్తయైన యెషయా ద్వారా, యేసు చెప్పాడు,

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని: ఉమ్మి వేయువారికిని అవమాన పరచు వారికిని నా ముఖము దాచుకోనలేదు" (యెషయా 50:6).

ప్రవక్తయైన మీకా అన్నాడు,

"వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు" (మీకా 5:1).

"అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొనిపోయి, ఆయన యెద్ద సైనికులను సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించిరి. ముండ్ల కిరీటమును అల్లి, ఆయన తలకు పెట్టి, ఒక రెళ్ళు ఆయన కుడి చేతిలో నుండి: ఆయన యెదుట, మోకాళ్ళని పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని, ఆయనను అపహసించిరి! ఆయన మీద ఉమ్మివేసి, ఆరెల్లును తీసుకొని, దానితో తలమీద కొట్టిరి" (మత్తయి 27:27-30).

ఆయనకు వెండి బంగారముల కిరీటము లేదు,
   ఆయన పట్టుకోవడానికి మకుటము లేదు;
కాని ఆయన నుదుట నుండి రక్తము కారింది మరకలు ఆయన ధరించాడు,
   ఆయన ధరించడానికి పాపులు ఆయనకు కిరీటాన్ని ఇచ్చారు.
కఠినమైన సిలువ ఆయనకు సింహాసనము అయింది,
   హృదయాల లోనే ఆయన రాజ్యము ఉంది;
ఆయన తన ప్రేమను రక్త వర్ణములో వ్రాసాడు,
   ఆయన తలపై ముండ్ల కిరీటము ధరించాడు.
("ముండ్ల కిరీటము" ఇరా ఎఫ్. స్టాయ్ ఫిల్ చే, 1914-1993).
      (“A Crown of Thorns” by Ira F. Stanphill, 1914-1993).

"అప్పుడు పిలాతు యేసును పట్టుకొని, ఆయనను కొరడాలతో కొట్టించెను" (యోహాను 19:1).

ప్రవక్తయైన యెషయా ద్వారా, యేసు చెప్పాడు,

"కొట్టు వారికి నా వీపును అప్పగించితిని" (యెషయా 50:6).

వారు ఆయన వీపును ముక్కలుగా కొట్టారు. అది భయంకరంగా కనిపించింది. అలా దెబ్బలు తినడం ద్వారా చాలామంది చనిపోయారు. ఆయన ఎముకలు మీరు చూడాలి. ఎముకల వరకు వెనుక చీల్చబడింది.

ముళ్ళతో ఆయన ఆలయము కూల్చబడింది,
   ప్రతీ భాగము నుండి రక్తము ప్రవహించింది;
ఆయన వీపు నలుగ గొట్టబడింది,
   కాని పదునైన దెబ్బలు ఆయన హృదయాన్ని చీల్చివేసాయి.
("ఆయన తపన" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768; స్వరము
   "అది అర్ధరాత్రి, ఒలీవ కొండపై").
(“His Passion” by Joseph Hart, 1712-1768; to the tune of
      “‘Tis Midnight, and on Olive’s Brow”).

"క్రీస్తు యొక్క శ్రమలు" (I పేతురు 1:11).

మొదటిది, గెత్సమనేలో ఆయన శ్రమలు. రెండవది, ఆయన పరాభవముతో కూడిన శ్రమ.

III. మూడవది, సిలువపై ఆయన శ్రమ.

గెత్సమనే వనంలో ఆయన చెమట రక్తము బిందువుల వలే కారుచుండగా, యేసు ముఖముపై కొట్టబడ్డాడు. తరువాత ఆయన నలుగ గొట్టబడ్డాడు ఆయన శరీరము ఎముకలు కనబడే వరకు కొట్టబడినప్పుడు. తరువాత ముండ్ల కిరీటము క్రూరంగా ఆయన తలపై ఉంచబడింది, ఆయన కళ్ళ మీదుగా రక్తము కారునట్లుగా.

ఆయన అప్పటికే సగం చనిపోయాడు వారు ఆయనను సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు,

"వారు యేసును తీసుకొని పోయిరి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటుకి వెళ్ళెను...అక్కడ వారు ఆయనను సిలువ వేసిరి" (యోహాను 19:17-18).

వారు పెద్ద మేకులను ఆయన చేతులకు కాళ్ళకు కొట్టి, సిలువ మ్రానుపై ఉంచారు. వారు సిలువను ఎత్తారు యేసు నొప్పితో శ్రమతో వేలాడుచున్నాడు. జోసెఫ్ హార్ట్ అన్నాడు,

దిగంబరంగా శాపగ్రస్తమైన మానుకు మేకులు కొట్టబడ్డాడు,
   భూమికి పైన ఆకాశానికి బహిర్గతమయ్యాడు,
గాయాలు రక్తముల దృశ్యముతో,
   గాయమైన ప్రేమ విషాద వ్యక్తత.

జాగ్రత్తగా విను! ఆయన భయంకర కేకలు ఎంత అమానుషము
   దేవదూతలను కదిలించాయి, వారు చూచుచుండగా;
ఆయన స్నేహితులు రాత్రి ఆయనను విడిచి పెట్టారు,
   ఇప్పుడు ఆయన దేవుడు కూడా తనను విడిచి పెట్టాడు!
("ఆయన తపన" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768; స్వరము
   "అది అర్ధరాత్రి, ఒలీవల కొండపై").
(“His Passion” by Joseph Hart, 1712-1768; to the tune of
      “‘Tis Midnight, and on Olive’s Brow”).

"మరియు...ఇంచుమించు మూడు గంటలప్పుడు, యేసు, ఏలీ, ఏలీ, లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను? ఆ మాటకు, నాదేవా, నాదేవా, నన్నెందుకు విడిచితివి అని అర్ధము?" (మత్తయి 27:46).

దీనిని మన తలలు అర్ధము చేసుకోలేవు. లూథర్ అన్నాడు అది మానవ పదాలచే వివరింపబడనిదని. అంటే మనం దానిని పూర్తిగా అర్ధము చేసుకోలేము, తండ్రీ కుమారుని నుండి తిరిగి పోవడం – మరియు యేసు మన పాపములకు వెల చెల్లించడానికి ఒంటరిగా మాత్రమే చనిపోయాడు!

"క్రీస్తు... అనీతిమంతుల కొరకు, నీతిమంతుడైన క్రీస్తు, మనలను దేవుని వద్దకు తెచ్చుటకు ఒక్కసారే శ్రమపడెను..." (I పేతురు 3:18).

"మన అతిక్రమములను బట్టి అతడు గాయ పర్చబడెను, మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

అది మహిమాయుక్త సిద్ధాంతము నెరవేర్పు విషయంలో – క్రీస్తు మన పాపాల పరిహారార్ధము సిలువపై మరణించడం. ఆయన నీ పాప పరిహారార్ధం, నీ స్థానంలో చనిపోయాడు! బైబిలు చెప్తుంది,

"లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను" (I కొరిందీయులకు 15:3).

"విచారాల వ్యక్తి," ఏమి పేరు
   దిగివచ్చిన దైవ కుమారునికి
నశించు పాపులకు పునరుద్ధరించడానికి!
   హల్లెలూయా! ఎలాంటి రక్షకుడు!

సిగ్గును పరిహాసాన్ని భరిస్తూ,
   నా స్థానంలో ఖండింపబడి నిలబడ్డాడు;
నా క్షమాపణను ఆయన రక్తములో ముద్రించాడు;
   హల్లెలూయా! ఎలాంటి రక్షకుడు!

చనిపోవడానికి ఆయన పైకెత్తబడ్డాడు,
   "సమాప్తమైనది," అది ఆయన కేక;
ఇప్పుడు పరలోకంలో ఎత్తుగా హెచ్చింపబడ్డాడు;
   హల్లెలూయా! ఎలాంటి రక్షకుడు!
("హల్లెలూయా, ఎలాంటి రక్షకుడు" ఫిలిఫ్ పి. బ్లిస్ చే, 1838-1876).
       (“Hallelujah, What a Saviour” by Philip P. Bliss, 1838-1876).

నీవు నీ పాప ఆరోపణ నుండి శిక్ష నుండి రక్షింప బడ గోరుచున్నావా? అప్పుడు నీవు సామాన్య విశ్వాసముతో యేసు దగ్గరకు రావాలి. పరలోకములో దేవుని కుడి పార్శ్వమున ఉన్న ఆయన దగ్గరకు రా. నేను నిన్ను బతిమాలుచున్నాను, నా హృదయము మనసు అంతటితో, ఇప్పుడే యేసు నొద్దకు రమ్ము! ఆయనలో విశ్రమించు. ఆయనను నమ్ము. ప్రతీ పాపాన్ని ఆయన కడిగివేస్తాడు. ఆయన నీకు స్వచ్చమైన నివేదికలు ఇస్తాడు. కాలమంతటికి, నిత్యత్వానికి నీ ఆత్మను ఆయన రక్షిస్తాడు – అంతము లేని లోకములో. నీవు! అవును, నీవే! నీవు నీ పాప ఆరోపణ నుండి శిక్ష నుండి "క్రీస్తు యొక్క శ్రమలచే" నీవు రక్షింపబడగలవు (I పేతురు 1:11) యేసు నొద్దకు రమ్ము. ఆయన నీ పాపాన్ని కడిగి నీ ఆత్మను రక్షిస్తాడు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: యెషయా 53:1-6.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"ముండ్ల కిరీటము" (ఇరా ఎఫ్. స్టాన్ ఫిల్ చే, 1914-1993)/
"వేదనలో ప్రేమ" (విలియం విలియమ్స్ చే, 1759).
“A Crown of Thorns” (by Ira F. Stanphill, 1914-1993)/
“Love in Agony” (by William Williams, 1759).


ద అవుట్ లైన్ ఆఫ్

క్రీస్తు యొక్క శ్రమలు

THE SUFFERINGS OF CHRIST

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు యీ రక్షణను గూర్చి పరిశీలించుచు, తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు సాక్ష్యమిచ్చును: వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు, ముందుగా సాక్ష్య మిచ్చునప్పుడు, ఆ ఆత్మయే కాలమును ఎట్టి క్రీస్తు శ్రమలను గూర్చియు, కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి" (I పేతురు 1:10-11).

I. మొదటిది, గెత్సమనే వనంలో ఆయన శ్రమ, మత్తయి 26:36; I పేతురు 2:24;
మత్తయి 26:38, 39; లూకా 22:44; యెషయా 53:4, 6; యోహాను 3:16.

II. రెండవది, ఆయన పరాభవముతో కూడిన శ్రమ, మత్తయి 26:67-68; మార్కు 14:65; మార్కు 15:16-19; యెషయా 50:6; మికా 5:1; మత్తయి 27:27-30; యోహాను 19:1.

III. మూడవది, సిలువపై ఆయన శ్రమ, యోహాను 19:17-18; మత్తయి 27:46;
I పేతురు 3:18; యెషయా 53:5; I కొరిందీయులకు 15:3.