Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




దెస్సలొనీకయ క్రైస్తవులను మీకు
ఉదాహరణగా చేసుకోండి

MAKE THE THESSALONIAN CHRISTIANS
YOUR EXAMPLE!
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ సాయంత్రము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, డిసెంబర్ 27, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, December 27, 2015

"తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తు నందును ఉన్న దెస్సలొనీకయులకు సంఘమునకు పౌలును, సిల్వాను, తిమోతిను, శుభమని చెప్పి వ్రాయునది: కృపయు, సమాధానమును, శుభమును, మీకు కలుగును గాక" (I దెస్సలొనీకయులకు 1:1).


ప్రుధొమ్ గారు కొన్ని క్షణాల క్రితం I దెస్సలొనీకయులకు ఒకటవ అధ్యయము చదివారు. దెస్సలొనీక పట్టణములో ఉన్న ఆదిసంఘము యొక్క చిత్రాన్ని అది మనకు ఇస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను సుమారు 50 ఎ.డి. లో వ్రాసాడు. పౌలు వ్రాసిన తోలి పత్రిక ఇది. కొన్ని నెలల వయసు గలిగిన సమాజానికి అతడు ఇది వ్రాసాడు. అపోస్తలుల కార్యములు 17 ప్రకారము పౌలు వారితోపాటు మూడు సబ్బాతు దినములు ఉన్నాడు. నమ్మని యూదుల గుంపు అతనిని త్వరగా ఆ పట్టణములో నుండి తరిమి వేసింది పౌలు సీలలకు వ్యతిరేకంగా – ఇలా అరుస్తూ, "భూమిని తలక్రిందులు చేయువారు [ఇక్కడకు] వచ్చియున్నారు" (అపోస్తలుల కార్యములు 17:6). వారన్నారు సంఘ నాయకుడు, జాసన్, కైసరు న్యాయశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు ఇంకొక రాజు యేసు ఉన్నాడని చెప్పడం ద్వారా. వారు జాసన్ ను ఇతర క్రైస్తవులను బంధించి, విడిచి పెట్టారు. 3 వ అధ్యాయము, 2వ వచనములో పౌలు వాగ్ధానము చేస్తున్నారు తిమోతిని పంపుతానని "మిమ్ములను స్థిర పరచుటకు, ఆదరించుటకును" (I దెస్సలొనీకయులకు 3:2).

ఇప్పుడు మనము I దెస్సలొనీకయులకు మొదటి అధ్యయము చూద్దాం. మనం చూస్తాం చిన్న బలమైన గుర్తింప దగ్గ సంఘాన్ని, మూడు వారాలు మాత్రమే పౌలు అక్కడ ఉన్నప్పటికినీ, వారి సంఘము కేవలము ఒక సంవత్సరము వయసు ఉన్నప్పటికినీ. ఇది అద్భుత సంఘము, ఆదర్శ సంఘము దానిని అనుకరించడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. మొదటి అధ్యయము ఎనిమిది అంశాలు ఉన్నాయి మన సంఘము వాటిని వెంబడించాలి.

1. మొదటిది, వారు దేవునిలో ఉన్నారు క్రీస్తులో ఉన్నారు.

"తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తు నందును ఉన్న దెస్సలొనీకయులకు సంఘమునకు పౌలును, సిల్వాను, తిమోతిను, శుభమని చెప్పి వ్రాయునది: కృపయు, సమాధానమును, శుభమును, మీకు కలుగును గాక" (I దెస్సలొనీకయులకు 1:1).

సీల మరియొక పేరు సిల్వాను. వారు విగ్రహాదీకులైనప్పటికినీ, ఇప్పుడు వారు "తండ్రి దేవునిలో ఉన్నారు," "ప్రభువైన యేసు క్రీస్తు నందు ఉన్నారు." ఈ సంఘాన్ని గూర్చి పౌలు ఇదే చెప్తున్నాడు. అలా మీరు సంఘములో "చేరగలరు." సంఘపు పుస్తకములో మీ పేరు వ్రాయబడడం ద్వారా కాదు. "దేవునిలో" "క్రీస్తులో" ఉండడం ద్వారా. అది మిమ్ములని నిజమైన సంఘ సభ్యులుగా చేస్తుంది. యేసు ప్రార్ధిస్తూ ఇలా అన్నాడు, "తండ్రీ నాయందు నీవును; నీయందు నేను ఉన్నలాగున, తండ్రీ, వారును, మనయందు ఏకమై, ఉండవలెను" (యోహాను 17:21). మీరు యేసు తోనూ తండ్రి దేవునితోను ఏకమవాలి, సంఘములో చేరడానికి! వేరే మార్గము లేదు. మీరు క్రీస్తు "లో" ఉంటారు లేక క్రీస్తు "బయట" ఉంటారు. అందుకే మేము మీకు చెప్తున్నాము క్రీస్తు నొద్దకు రమ్మని, క్రీస్తును నమ్మమని, క్రీస్తుపై అనుకోమని. అది జరిగినప్పుడు నీవు సంఘ సభ్యుడవవుతావు. మన సంఘములో చేరడానికి వేరే మార్గము లేదు. యేసు అన్నాడు, "నీవు తిరిగి జన్మించాలి" (యోహాను 3:7). సంఘానికి "రావడం" "ప్రభువైన యేసు క్రీస్తు నందు ఉండడం కాదు" (I దెస్సలొనీకయులకు 1:1).

నిజమైన సంఘము ఎవరితో ఏర్పాటు చేయబడిందంటే "ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నవారితో." మిగిలిన వారంతా సంఘాన్ని దర్శిస్తున్నారు కాని, నిజంగా అందులో భాగము కాదు. ఇది నోవాహు ఓడలాంటిది. నోవాహు దశాబ్దాలు పాటు ఓడను నిర్మించాడు. చాలామంది వచ్చి అతని పెద్ద ఓడను చూసారు. బహుశా వారు దాని చుట్టూ తిరిగి ఉంటారు, కొందరులోపల కూడ చూసి ఉంటారు, తరువాత వెళ్లి పోయి ఉంటారు. కాని జల ప్రళయము వచ్చినప్పుడు వారు ఓడ "లో" లేరు. కాబట్టి గొప్ప జల ప్రలయములో వారు మునిగి పోయారు. యేసు అన్నాడు, "[నోవాహు] దినముల వలే, మనష్యు కుమారుని రాకడయు ఉండును" (మత్తయి 24:37). దేవుని తీర్పు ఈ లోకము మీదికి వచ్చినప్పుడు మీరు నిస్సహాయులుగా ఉంటారు "ప్రభువైన యేసు క్రీస్తు నందు లేకపోతే" దెస్సలొనీక సంఘపు ప్రజల వలే.

2. రెండవది, వారు ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము, ప్రేమ నిరీక్షణ కలిగియున్నారు.

3 వ వచనము చూడండి.

"విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన, మీ ఓర్పు" (I దెస్సలొనీకయులకు 1:3).

అపోస్తలుడైన పౌలు జ్ఞాపకము చేసుకున్నాడు దెస్సలొనీక సంఘములోని క్రైస్తవులు క్రైస్తవ ప్రేమతో పని చేసారు. క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా వాని పని ఉద్భవించింది. వారు చేసిన పని "ప్రేమతో కూడిన ప్రయాస." వారికి ఓర్పు, సహనము ఉన్నాయి, "ప్రభువైన యేసు క్రీస్తు నందలి నిరీక్షణ" ద్వారా. I కొరిందీయులకు 13 లో పౌలు అన్నాడు, "విశ్వాసము, నిరీక్షణ, [క్రైస్తవ ప్రేమ] ఈమూడును నిలుచును; వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే" (I కొరిందీయులకు 13:13).

విశ్వాసము నిరీక్షణ, ప్రేమ లేకుండా, ప్రజలు సంఘములోనికి రావడం మనం చూస్తాం. కాని వారు ఎక్కువ కాలము సంఘములో ఉండరు. వారు స్నేహితుల కోసం గుడికి వస్తారు. వారు గుడిలో ఇతరులతో నవ్వులాట సహవాసము ఇతరులతో కలిగి యుండి ఆనందిస్తారు. కాని తరువాత, "[ఒక] [పరీక్షా] సమయంలో పడిపోతారు" (లూకా 8:13). అది తరుచు కొత్త సంవత్సరం ప్రారంభంలో జరుగుతూ ఉంటుంది. వారు క్రిస్మస్ నూతన సంవత్సరం సమయాల్లో ఎక్కువ పరిహాసాన్ని సంఘపు వినోదాలలో కలిగి ఉంటారు. కాని తరువాత జనవరి వస్తుంది. కొంత పరిహాసము పోతుంది. ఇప్పుడు క్రిస్మస్ సమయంలో ఉన్నంత ఆనందము ఇప్పుడు వారికి ఉండదు. కావున వారు "పడిపోతారు." వారు కేవలము వినోదానికి ఆటలకు గుడికి వస్తున్నట్టు ఇది తెలియ చేస్తుంది. వారికి క్రీస్తుతో సంబంధము లేదు. వారు ఎన్నడు "ప్రభువైన యేసు క్రీస్తులో లేదు." కనుక పడిపోయి ఎప్పుడు మారదు. వారు దెస్సలొనీక సంఘస్తులలా వారు అవలేదు! అది మీకు జరగకూడదని నేననుకుంటాను!

3. మూడవది, వారు దేవునిచే ఎన్నిక చేయబడినవారు.

నాల్గవ వచనము చూడండి.

"దేవుని వలన, ప్రేమింపబడిన వారలారా, మీరు ఏర్పరచబడిన సంగతి" (I దెస్సలొనీకయులకు 1:4).

పౌలు వారిని "సహోదరులు" (అన్నలు) అని పిలుస్తున్నాడు ఎందుకంటే వారు దేవునిచే రక్షణ నిమిత్తము ఎన్నిక చేయబడ్డారు. పౌలు మళ్ళీ వారి ఎన్నికను గూర్చి II దెస్సలొనీకయులకు 2:13 లో, మళ్ళీ చెప్తున్నాడు, "దేవుడు మొదటి నుండి రక్షణ నిమిత్తము మిమ్ములను ఎన్నిక చేసుకున్నాడు." మొదటి నుండి దేవుడు కొంతమందిని రక్షింపబడుటకు ఎన్నిక చేసుకుంటాడు. మనము ఆయనను ఎన్నుకోలేదు. ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఎఫెస్సీ పత్రికలో, పౌలు చెప్పాడు, "జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు" (ఎఫెస్సీయులకు 1:4). యేసే అన్నాడు, "మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను" (యోహాను 15:16).

ఇది ఒక మర్మము, మన సహజ తెలివి తేటలు దీనిని పూర్తిగా అర్ధం చేసుకోలేవు. కాని ఇది పూర్తిగా సత్యము. యాభై ఏడూ సంవత్సరాల క్రితం నేను బోధించడానికి పిలువబడ్డాను. సంఘములో చాలామంది యవనస్తులు మంచి క్రైస్తవ గృహాల నుండి వచ్చిన వారు ఉన్నారు. కాని వారు మంచి క్రైస్తవ గృహాల నుండి వచ్చినప్పటికినీ, వారు మార్పు చెందలేదు, చివరకు గుడి నుండి వెళ్ళిపోయారు. ఎన్నో మెరుగైన విషయాలు కలిగి ఉన్నప్పటికినీ, వారు రక్షింపబడడానికి దేవునిచే ఏర్పాటు చేయబడలేదు. అయినను నేను అక్కడ ఉన్నాను, విడాకుల ద్వారా పతనమైన కుటుంభము నుండి వచ్చిన ఒక పేద అబ్బాయిని. నేను పడలేదు – నేను, యాభై ఏడూ సంవత్సరాల తరువాత కూడ, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. నేను దానిని ఎలా వివరించగలను? నేను దానిని వివరించలేను. నేను యేసు చెప్పింది చెప్పగలను, "మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, కాని నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను." ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి, చాల కష్ట సమయాల ద్వారా చాల విచారాల ద్వారా వెళ్ళాను, పడిపోకుండా! దెస్సలొనీక సంఘములోని క్రైస్తవుల విషయములలో కూడ అది వాస్తవమే. "ప్రియ సహోదరులారా, దేవునిచే మీ ఎన్నికను, ఎరుగుడి."

ఇంకొక విషయము చెప్పనివ్వండి. మీరు ఏర్పరచబడిన వారిలో లేకపోతే, మిమ్ములను రక్షించడానికి మేము ఏమి చెయ్యలేము. అంతేకాకుండా, నిన్ను నీవు రక్షించు కోవడానికి ఏమి చేసుకోలేవు! అందుకే కొంతమంది సంవత్సరాలుగా సువార్త వింటారు కాని రక్షింపబడరు. వారిని వినే చెవులు లేవు, యేసును విశ్వసించే హృదయాలు లేవు. వారు "పొందుకోరు." ఫిలిప్ చాన్ అన్నాడు అతని మనసు గుండ్రంగా తిరిగింది, ఎలాగు రక్షింపబడాలో తెలుసుకోవడానికి. ఒక ఆదివారము ఉదయము, దేవుడు అతని హృదయాన్ని తెరిచాడు యేసును నమ్మాడు. కాని ఎన్నిక చేయబడని వారికి అలాంటి అవకాశము ఉండదు. దారి మనసూలు గుండ్రంగా తిరుగుతుంటాయి, ఎలాగు రక్షింపబడాలో తెలుసుకోవడానికి – చివరకు చనిపోయి అగ్ని గుండములో మునిగే వరకు. ఏర్పాటు నీ ఎన్నిక కాదు. ఏర్పాటు "దేవునిచే" జరుగుతుంది, 4 వ వచనము చెప్తున్నట్టు.

4. నాల్గవది, వారు పదాలను నేర్చుకోవడం మాత్రమే కాకుండా, శక్తి ద్వారా సువార్తను పొందుకున్నారు.

దయచేసి 5 వ వచనము చూడండి.

"మా సువార్త మాటతో మాత్రమూ గాక, శక్తి తోనూ, పరిశుద్ధత్మతోను, సంపూర్ణ నిశ్చయత తోనూ మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును; మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారిమై యుంటిమో మీరు ఎరుగుదురు" (I ధెస్సలొనీకయులకు 1:5).

పౌలు ఇక్కడ "మన సువార్త" అంటున్నాడు ఎందుకంటే అది అతనిచే, సీలచే, బోధింపబడినది. వేరే చోట అతడు "దేవుని సువార్త" అంటున్నాడు (రోమా 1:1) "క్రీస్తు సువార్త" అని కూడ (I ధెస్సలొనీకయులకు 3:2).

సువార్త ధెస్సలొనీకయులకు శక్తితో వచ్చింది. I కొరిందీయులకు పౌలు చెప్పాడు,

"నా మాటలు నా బోధ మానవ జ్ఞాన యుక్తమైనవి కావు, కాని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరచునవి" (I కొరిందీయులకు 2:4).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ -జోన్స్ అన్నాడు, "అపోస్తాలుడు...మానవ తలాంతుల మీద పద్దతుల మీద ఆధారపడలేదు. అది ‘ఆత్మా మరియు శక్తి యొక్క ప్రదర్శన’" (క్రీస్తులో కనుగోనలేని నిధులు, పేజి 56).

ధెస్సలొనీక ప్రజలు వారి బైబిలు తెరచి, చెప్పింది రాసుకోలేదు! సువార్త పరంగా బోధించడానికి అది మార్గము కాదు. సువార్త బోధకు అది అడ్డు బండ. అంటే ప్రొజెక్టర్లు వాడడం. ఆధునిక అనువాదములు. వారు పెన్సిళ్ళు పారేసి, ప్రొజెక్టర్లు ఆపేసి, అభిషేకముతో గొప్ప పాత కింగ్ జేమ్స్ బైబిలు నుండి వారు బోధించాలంటాను. మనం పరిశుద్ధాత్మపై ఆధారపడాలి, ఆధునిక గమ్మత్తులపై కాదు! ఈ ధెస్సలొనీక ప్రజలు పరిశుద్ధాత్మ శక్తితో బోధించారు అలా వారు బలంగా మార్పు నొందారు. ఎలా మార్పు నొందాలో నేను మీకు బోధించలేను. అందుకే దేవుని సన్నిధి కొరకు తదేకంగా ప్రార్దిస్తాము, పరిశుద్ధాత్మ నిజత్వము కోసం. ఆయన మాత్రమే సత్యాలు మీ కొరకు తెరచి క్రీస్తు నొద్దకు నడిపిస్తాడు. ఈ ప్రజలు పరిశుద్ధాత్మ బోధ ద్వారా మారారు, కాని మనం ఈనాడు చాలా ప్రసంగ వేదికల నుండి పొడి పొడిగా ఉంటే బైబిలు బోధల వలన కాదు! దౌక్యపు కరువు ఉంది ఎందుకంటే మన బోధలో పరిశుద్ధాత్మ శక్తి లేదు, వారికి ఉన్నట్టు.

5. ఐదవది, వారు శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు పౌలు సీలల ఉదాహరణను వెంబడించారు.

దయచేసి 6 వ వచనము చూడండి.

"పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, మమ్మును ప్రభువును పోలి, నడుచు కొననివారైతిరి" (I ధెస్సలొనీకయులకు 1:6).

వారు పౌలును సీలను, క్రీస్తును (వెంబడించే) వారు అయ్యారు – "మహాశ్రమలు" కలిగినప్పటికినీ (గొప్ప ఉపద్రవము). వారి శ్రమలలో పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన ఆనందము, వారికి ఉంది. అపోస్తలుడైన పేతురు అన్నాడు,

"ప్రియులారా, మిమ్మును శోదించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహా శ్రమను గూర్చి, మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్య పడుకుడి: క్రీస్తు మహిమ, బయలు పరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించుడి; అది, నిమిత్తము క్రీస్తు శ్రమలలో, మీరు పాలి వారై యున్నంతగా సంతోషించుడి" (I పేతురు 4:12-13).

డాక్టర్ ధామస్ హెల్ అన్నాడు, "నూతన నిబంధన గ్రంధము ప్రకారము, క్రీస్తు కొరకు శ్రమను సహించుట ఆనంద కరమైన ఆధిక్యత (అపోస్తలుల కార్యములు 5:41; I పేతురు 4:13). సంతోషముతో శ్రమను సహించే సంఘము బలమైన సంఘముగా [అవుతుంది], దాని సాక్ష్యము శక్తివంతమైనది" (Thomas Hale, M.D., The Applied New Testament Commentary, Kingsway Publications, 1997; comment on I Thessalonians 1:6).

మన సంఘము భయంకర సంఘ విభజన ద్వారా వెళ్ళడం ద్వారా బలపడింది. అందుకే మనకు "పరిశుద్ధత్మలో ఆనందముంది." మనలను దర్శించే బోధకులు మన ఆనందాన్ని చూసి ఆశ్చర్య పోతూ ఉంటారు! అగ్ని మట్టి శ్రమల ద్వారా ధెస్సలొనీక సంఘము వెళ్లినట్టు, అలా మనం తయారు అయ్యాము!

ఒక బలమైన క్రైస్తవుడవాలంటే శ్రమల ద్వారా వెళ్ళాల్సిందే. కేవలము బైబిలు పఠనము ద్వారా బలమైన క్రైస్తవులు తయారు కాదు. పరీక్షల ద్వారా శ్రమ పడినప్పుడు అది మనలను బలంగా చేస్తుంది. వేరే మార్గము లేదు! అపోస్తలుడైన పౌలు అంతియొకయలో నూతన క్రైస్తవులకు ఇలా చెప్పాడు, "[అనేక శ్రమల] అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను" (అపోస్తలుల కార్యములు 14:22). కష్టాలు, ఒత్తిడిలు, శ్రమలు బలమైన క్రైస్తవులను తాయారు చేయడం మాత్రమే కాకుండా – అది గోధుమల నుండి గురుగులను వేరుచేస్తుంది. చిన్న ఒత్తిడి వస్తే, మార్పు నొందని వారు గుడిని వదిలి పెట్టి లోకంలోనికి వెళ్ళిపోతారు – అది మనం తరుచు చూస్తాం. కాని పరీక్షల ద్వారా వెళ్ళిన వారు గొప్ప క్రైస్తవులవుతారు, శ్రీమతి సాలాజర్, ప్రుధొమ్ గారు, శ్రీమతి బెబౌట్, డాక్టర్ కాగన్, గ్రిఫిత్ గారు, నా భార్య, డాక్టర్ చాన్, ఇంకా మన సంఘములో చాలామంది వలే – "39 మంది" వీరు మన సంఘాన్ని కాపాడారు సంఘ విభజన సమయంలో. వారి వలే నీవు ఉండాలనుకుంటే, నీవు కొన్ని కష్టాల ద్వారా వెళ్ళవలసిందే! దేవుడు కష్టాలను వాడుకుంటాడు క్రైస్తవులను బలంగా చెయ్యడానికి! గొప్ప పాత పాట ఇలా చెప్తుంది,

మహాశ్రమల ద్వారా నీ మార్గము నింపబడినప్పుడు,
నా కృప, చాలు, నీకు అనుగ్రహిస్తుంది;
అగ్ని నీకు హాని చేయదు; నేనే రూపొందించాను
మలినము దహించడానికి, బంగారముగా రూపొందించడానికి.
("పునాది ఎంత స్థిరంగా ఉంది" జార్జి కీత్ చే, 1638-1716;
"కే" రిప్పన్ చే పాటల ఎన్నిక, 1787).
(“How Firm a Foundation” by George Keith, 1638-1716;
      “K” in Rippon’s Selection of Hymns, 1787).

నాకు తెలుసు నా జీవితంలో కూడ అది వాస్తవము. పరీక్షలు శ్రమలు నేను వెళ్ళినవి కాపరి నవ్వడానికి నా వేదాంత కళాశాలయే. పరీక్షల ద్వారా కాపరినవడం నేర్చుకున్నాను! సిలువ పాఠశాలను గూర్చి నేను దేవునికి వందనస్తుడను, అది మన అద్భుత సంఘములో గొప్ప క్రైస్తవులను తీర్చి దిద్దడానికి సహాయపడుతుంది!

6. ఆరవది, వారు ఇతర క్రైస్తవులకు మాదిరి కరమయ్యారు.

7వ వచనము చూడండి,

"కాబట్టి మాసి దోనియలోను అకయలోను విశ్వాసులందరి కిని మాదిరి అయితిరి" (I ధెస్సలొనీకయులకు 1:7).

డాక్టర్ ధామస్ హెల్ అన్నాడు,

ఈ ధెస్సలొనీక క్రైస్తవులు శ్రమను సంతోషముతో సహించారు కాబట్టి నమ్మకంగా క్రీస్తును అనుకరించారు కాబట్టి, వారు [మాదిరి అయ్యారు], ఉదాహరణగా నిలిచారు, మాసిదొనియ, గ్రీసు ఉత్తర ప్రాంతములో ఉన్న మిగిలిన అందరి [క్రైస్తవులకు] మాదిరిగా నిలిచారు. ఈ ధెస్సలొనీకయు క్రైస్తవులు మనకు కూడ మాదిరిగా ఉండాలి! అప్పుడు...మనము కూడ ఇతరులకు మాదిరిగా ఉంటాం (ibid.; note on I Thessalonians 1:7).

7. ఏడవది, వారు ఆత్మలను రక్షించు వారు.

8 వ వచనము చూడండి,

"ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసి దోనియలోను అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని యెడల ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయేను; గనుక మేమేమియు చెప్పవలసిన అవస్యము లేదు" (I ధెస్సలొనీకయులకు 1:8).

వారు సువార్తను వారి చుట్టూ "మ్రోగించారు." వారు ఆత్మలను గెలిచి సంఘములోనికి తీసుకొచ్చారు. వారు సేవా మనసు కలిగిన ఆత్మల సంపాదకులు. అవునట్టు, ఇది చెయ్యడానికి సంవత్సరాల బైబిలు పఠనము కారణమూ కాదు. డాక్టర్ హెల్ అన్నాడు, "గుర్తుంచుకోండి, పౌలు ఈ పత్రిక వ్రాసే సరికి ఈ సంఘానికి సంవత్సరము వయసు కూడ లేదు. ఇది చిన్న, హింసింపబడిన సంఘము. వారి విశ్వాసము, అన్ని చోట్ల తెలియ పర్చబడింది" (ibid.; note on I Thessalonians 1:8).

ఒక బలమైన క్రైస్తవుడవడానికి త్వరితంగా ఒక మార్గము ఆత్మల సంపాదకుడవు కావాలి, ఇలాగే ఇప్పుడే! సువర్తీకరణ నుండి పేర్లు తీసుకొని వచ్చు వారు త్వరగా బలపడతారు. కేవలము గుడికి వచ్చేవారు ఎన్నడు పరిపక్వత కలిగిన క్రైస్తవులుగా మారరు. మీలో కొంతమంది అది ఆలోచించాలి! అది మీ సమస్యా? ఆత్మలను సంపాదించకుండా నిజమైన బలమైన క్రైస్తవునిగా ఉన్న వాడిని నేనెన్నడు చూడలేదు – వారు నశించు వారిని గుడికి వచ్చేటట్టుగా చేసి అలా రక్షింపబడేలా చేస్తారు. మీకు సువార్తీకరణ యందు ఆసక్తి లేకపోతే, నేను నమ్ముతాను నీవెప్పుడు ఒక బలమైన క్రైస్తవునిగా కాలేవు. గత 57 సంవత్సరాలుగా పరిచర్యలో ఉంటూ అది నా అభిప్రాయము.

8. ఎనిమిదవది, వారు ఇదంతా చేయగలిగారు ఎందుకంటే వారు క్రీస్తులో నిజమైన మార్పును అనుభవించారు.

9 మరియు 10 వచనాలు చూడండి,

"మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియ చెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగును దేవునికి దాసులగుటకును; దేవుడు మృతులలో నుండి యేసు అనగా, రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరోగాతిలో ఆ సంగతి వారే తెలియ చేయుచున్నారు" (I ధెస్సలొనీకయులకు 1:9-10).

వారు విగ్రహాల నుండి దేవుని వైపు తిరిగారు, సజీవుడైన నిజ దేవుని సేవించడానికి. మార్పు నొందాడానికి, నీ జీవితంలోని పాపములను తిరగాలి. అంతే కాదు. నీ పాపమూ నుండి క్రీస్తు వైపు తిరగాలి, యేసు అన్నాడు, "నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6). నీవు నీ స్వార్ధ పూరిత పాప భూ ఇష్ట బ్రతుకు నుండి క్రీస్తు వైపు మరలకపోతే, నీవు రక్షింపబడనేరవు, నీ జీవిత కాలమంతా ఈ గుడ్కి నీవు హాజరు అవుచున్నప్పటికినీ! నీవు తిరగాలి యేసును నమ్మాలి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా నీ పాపాలు కడగబడాలి! అప్పుడు నీ నిరీక్షణ క్రీస్తు నందు మాత్రమే ఉంటుంది, నీవు క్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షణ ఆనందముతోను ఎదురు చూస్తావు!

మీరు ఈ ప్రసంగపు ముద్రింపబడిన ప్రతి మీతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని నా ప్రార్ధన – ఒకసారి కాదు, చాలాసార్లు చదవాలి! ధెస్సలొనీకయు సంఘములోని ప్రజల వలే మీరు గొప్ప క్రైస్తవులు కావాలని నా ప్రార్ధన! ఆమెన్. డాక్టర్ చాన్, ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోమ్: I దెస్సలోనీకయులకు 1:1-10.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"యేసు కొరకు జీవించుట" (ధామస్ ఓ. చిషోమ్ చే, 1866-1960).
“Living for Jesus” (by Thomas O. Chisholm, 1866-1960).


ద అవుట్ లైన్ ఆఫ్

దెస్సలొనీకయ క్రైస్తవులను మీకు
ఉదాహరణగా చేసుకోండి

MAKE THE THESSALONIAN CHRISTIANS
YOUR EXAMPLE!

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తు నందును ఉన్న దెస్సలొనీకయులకు సంఘమునకు పౌలును, సిల్వాను, తిమోతిను, శుభమని చెప్పి వ్రాయునది: కృపయు, సమాధానమును, శుభమును, మీకు కలుగును గాక" (I దెస్సలొనీకయులకు 1:1).

(అపోస్తలుల కార్యములు 17:6; I దెస్సలొనీకయులకు 3:2)

I.    మొదటిది, వారు దేవునిలో ఉన్నారు క్రీస్తులో ఉన్నారు,
I దెస్సలొనీకయులకు 1:1; యోహాను 17:21; 3:7;
మత్తయి 24:37.

II.   రెండవది, వారు ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము, ప్రేమ నిరీక్షణ కలిగియున్నారు, I దెస్సలొనీకయులకు 1:3;
I కొరిందీయులకు 13:13; లూకా 8:13.

III.  మూడవది, వారు దేవునిచే ఎన్నిక చేయబడినవారు,
I దెస్సలొనీకయులకు 1:4; II దెస్సలొనీకయులకు 2:13; ఎఫెస్సీయులకు 1:4; యోహాను 15:16.

IV.  నాల్గవది, వారు పదాలను నేర్చుకోవడం మాత్రమే కాకుండా, శక్తి ద్వారా సువార్తను పొందుకున్నారు,
I దెస్సలొనీకయులకు 1:5; రోమా 1:1;
I దెస్సలొనీకయులకు 3:2; I కొరిందీయులకు 2:4.

V.   ఐదవది, వారు శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు పౌలు సీలల ఉదాహరణను వెంబడించారు, I దెస్సలొనీకయులకు 1:6;
I పేతురు 4:12-13; అపోస్తలుల కార్యములు 14:22.

VI.   ఆరవది, వారు ఇతర క్రైస్తవులకు మాదిరి కరమయ్యారు,
I దెస్సలొనీకయులకు 1:7.

VII. ఏడవది, వారు ఆత్మలను రక్షించు వారు,
I దెస్సలొనీకయులకు 1:8.

VIII. ఎనిమిదవది, వారు ఇదంతా చేయగలిగారు ఎందుకంటే వారు క్రీస్తులో నిజమైన మార్పును అనుభవించారు,
I దెస్సలొనీకయులకు 1:9-10; యోహాను 14:6.