ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
కాలముల సూచనలుSIGNS OF THE TIMES డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే సంస్కరణ ఉదయము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, డిసెంబర్ 27, 2015 "ఓ యీ వేషధారులారా, మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు; కాని ఈ కాలముల సూచనలు వివేచింప లేరు?" (మత్తయి 16:3). |
పరిశయ్యలు సద్దూకయ్యులు క్రీస్తు కాలములో రెండు ప్రధాన మత గుంపులు. వారు ఆకాశము నుండి ఒక ప్రత్యేక సూచన అడిగారు. కాని వారికి అప్పటికే ఒక సూచన తరువాత ఒకటి పొందుకున్నారు – క్రీస్తు వారి మెస్సయా అని నిరూపిస్తూ. ఆయన ఐదు వేల మందికి ఆహారము పెట్టాడు – అద్భుత రీతిగా ఐదు రొట్టెలను రెండు చేపలను ఆశీర్వదించి (మత్తయి 14:15-21). ఆయన గలిలియ సముద్రముపై, నడిచాడు (మత్తయి 14:22-33). ఆయనను ముట్టిన అనేక మందిని ఆయన స్వస్థ పరిచాడు (మత్తయి 14:36). ఆయన కనానీయురాలి కుమార్తెను బాగు చేసాడు (మత్తయి 15:21-28). ఆయన అనేక మంది గుడ్డి వారిని, మూగవారిని, "ఇంకా అనేకులను" బాగు చేసాడు (మత్తయి 15:29-31). ఆయన రెండవ అద్భుతములో నాలుగు వేల మందికి ఆహారము పెట్టాడు – ఏడూ రొట్టెలను "కొన్ని చేపలను" ఆశీర్వదించుట ద్వారా" (మత్తయి 15:32-39). సూచన వెంబడి సూచన వెంబడి సూచన వారికి ఇవ్వబడింది – యేసు వారి మెస్సీయా అని చూపిస్తూ. కాని ఇప్పుడు వారు ఇంకొక సూచన అడుగుతున్నారు. మేత్యూ హెన్రీ, గొప్ప ఆంగ్ల వ్యాఖ్యనికుడు, అన్నాడు వారు "ఆకాశము నుండి ఒక సూచన" అడిగారు, ఆయనను నమ్మకూడదని కాదు. "ఆకాశము నుండి" సూచన అడిగారు దానిని సాతానుకు ఆపాదించడానికి, "ఆకాశ మండల అధికారి." క్రీస్తు సాతాను కొరకు కాని, దేవుని కొరకు కాదు అని వారు నిరూపించదలచారు (Matthew Henry’s Commentary on the Whole Bible, Hendrickson Publishers, 1991 reprint, volume 5, p. 182). క్రీస్తు వారికి చెప్పాడు, "వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచన క్రియ నడుచుకున్నారు; అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని, మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదు..." (మత్తయి 16:4). ప్రవక్త యోనాను గూర్చిన సూచన మృతులలో నుండి క్రీస్తు పునరుత్థానము నకు సూచన. "యోనా మూడు రాత్రిబవాళ్ళు తిమింగలము ["సముద్ర భూతాలను"] కడుపులో ఎలాగుండెనో; అలాగే మనష్య కుమారుడు మూడు రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును" (మత్తయి 12:40). యోనా చేప కడుపులోని బయటకు వచ్చినట్టుగా, క్రీస్తు కూడ శారీరకంగా సమాధి నుండి లేస్తాడు (cf. J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, p. 69; note on Matthew 12:40). క్రీస్తు మృత శరీరము లేచుట అనే సూచన మాత్రమే వారికిచ్చాడు. ఇప్పుడు మనము పాఠ్య భాగములోని మాటలు చూద్దాం, "ఓ యీ వేష ధారులారా, మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు; కాని ఈ కాలముల సూచనలు వివేచింప లేరు?" (మత్తయి 16:3). ఆకాశమును చూచి వారు వాతావరణము గూర్చి చెప్పగలరు. కాని వారు ఆత్మీయంగా గుడ్డివారు వారి మధ్య క్రీస్తు జరిగించిన సూచనలు, అద్భుతాలు, అర్ధము చేసుకోలేదు. ఈనాడు కూడ అలాగే ఉంది. మన చుట్టూ సూచనలున్నాయి మనము యుగాంతమునకు అతి సమీపంగా ఉన్నామని చెప్పడానికి. క్రీస్తు రెండవ రాకడ యుగ సమాప్తి సమీపిస్తున్నాయి. అంతము దగ్గరగా ఉంది. ఆశ్చర్యముగా, ఈనాడు చాలా తక్కువ బోధ ఉంది – లేనేలేదు! ఇది చాల సంవత్సరాలుగా ప్రసిద్ధ విషయము. బిల్లీ గ్రేహం తన ప్రతీ ప్రసంగాన్ని కూటాలలో సూచనలతో ముగించే వాడు. కాని కొద్ది మంది బోధకులు ఇప్పుడు అలా చేస్తున్నారు. యేసు అడిగిన ప్రశ్నే వారిని అడుగుతాను, "ఈ కాలముల సూచనలు వివేచింపలేరా?" (మత్తయి 16:3). మీరు కాలము యొక్క సంకేతాలను చూస్తారా? మీరు యీ ప్రపంచ యుగ సమాప్తిని సమీపిస్తున్నారు అనుకుంటారా? ప్రతి ఒక సందర్భం కూడా రాబోవు కాలానికి నిజాలను చూపిస్తుంది. యుగ సమాప్తికి చాలా దగ్గరగా ఉంది. "ఈ కాలముల సూచనలు వివేచింపలేరా?" (మత్తయి 16:3). I. అంతము సమీపంగా ఉందనడానికి మొదటి సూచన విగ్రహారాధన ఎక్కువవడం పాశ్చాత్య ప్రపంచములో, మిగిలిన చోట్ల, ఈనాడు క్రీస్తు నుండి వైదొలగడం. అమెరికా ఈనాడు మొదటి పేజీ కధను ఇంకా శీర్షిక ఇచ్చారు, "సర్వే: ఎక్కువ మంది అమెరికన్లు మతము నుండి వెళ్ళిపోతున్నారు" (USA Today, March 7, 2002, pp. 1A, 1D, 7D). ఇక్కడా అమెరికా దేశములో ప్రజలు క్రైస్తవ్యాన్ని వదిలేస్తున్నారు యునైటెడ్ కింగ్ డమ్ యూరపు మిగిలిన స్థలాలలో చేసినట్టు. ఏడు రాష్ట్రాలలో, శాతములు ఇలా ఉన్నాయి, "మతము లేదు" అనేవారివి: వాషింగ్టన్ 25% నిజంగా చూపించేది పాత హిప్పీలు – వాస్తవానికి – వారు వారినే ఆరాధించుకుంటున్నారు గుడిలో ఉండకుండా, హెబ్రీయులకు 10:25 లో బైబిలు బోధిస్తున్నట్టు. వారు ఆరాధిస్తారు సేవిస్తారు "సృష్టి కర్త కంటే సృష్టిని" (రోమా 1:25). "వారే తెలివైన వారిని చెప్పుకుంటారు [ఎక్కువ హెప్పీ తరము వారు]... అవివేకులయ్యారు" (రోమా 1:22). క్రీస్తు చెప్పాడు నిజ క్రైస్తవ ప్రేమ పాశ్చాత్య ప్రపంచములో అంతరించి పోతుంది అంతము సమీపించే కొద్ది: "అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ [చల్లారును]" (మత్తయి 24:12). పాత హిప్పీ తరము వారు 51 నుండి 71 మధ్య వయస్సులో ఉంటారు. ఈపాత హిప్పీలు మీ యవనస్తులతో అబద్ధము చెప్పారు. వారు మీతో చెప్పారు మీరు బయటకు వెళ్లి సృష్టితో ఉండవచ్చని గుడికి వెళ్ళ నవసరము లేదని. ఈ మత్తులో ఉన్న పాత హిప్పీలు మీకు అబద్ధము చెప్పారు! అది అబద్ధము! అది అబద్ధము! అది అబద్ధము! "మీ తల్లికి గుడి లేకపోతే, మీ తండ్రికి దేవుడు ఉండడు!" మూడవ శతాబ్దములో సిప్రియన్ చెప్పింది వారికి చెప్పండి! (ఎడి 200-258). నేను సిప్రియన్ తో ఏకీభవిస్తున్నానని వారితో చెప్పండి! గొప్ప సంస్కరణ కర్త జాన్ కేల్విన్ అదే విషయము చెప్పాడు! నీకు తల్లిగా స్థానిక సంఘము లేకపోతే, దేవుని నీకు తండ్రిగా కలిగి యుండలేవు! సిడ్రియన్ జీవితంలో చాలా ఆలస్యముగా మారాడు. కార్తేజ్ పట్టణంలో, ఆఫ్రికాలో అతిపెద్ద సంఘానికి అతడు కాపరిగా ఎన్నికయ్యాడు. పెద్ద కాపరులందరికి సమాన అధికారము ఇవ్వాలి, అనే విషయంలో అతడు రోమా బిషఫ్ తో గొడవ పడ్డాడు. స్టీఫెన్, రోమా పోప్, సిడ్రియన్ ఉరివేస్తానని భయపెట్టాడు సంఘ క్రమ శిక్షణ విషయంలో తన బలమైన అభిప్రాయాలను బట్టి. చాలామంది సంఘాలు వదిలి పెట్టారు కఠిన రోమా హింసల వలన. సిడ్రియన్ వాదించాడు వారు తిరిగి సంఘాలలో చేరకూడదు కఠినమైన పశ్చాత్తాపము లేకుండా. పోపు స్టీఫెన్ వాదించాడు శ్రమల వలన బయటికి వెళ్ళిన వారిని సులభంగా తిరిగి తీసుకోవాలని. సిడ్రియన్ వాదించాడు అంత సులభంగా, చేర్చుకోకూడదని. రోమా పోపు సిడ్రియన్ ను తల నరికిస్తానని భయపెట్టినప్పుడు, అతడు చివరకు విగ్రహాధికులచే చంపబడి, హత సాక్షి అయ్యాడు. సంఘ క్రమ శిక్షణ విషయంలో అతడు బాగా జ్ఞాపకం ఉంచుకోబడ్డాడు. సిడ్రియన్ సంఘాన్ని స్థానిక సంఘానిగా గుర్తించి, దానిని "కనబడే సంఘము" అనిపిలిచాడు. అతడు అనుకున్నాడు కనిపించే స్థానిక సంఘమును విడిచిన వారు హింసల ద్వారా వారు తీవ్ర పరీక్ష ద్వారా వెళ్లి పశ్చాత్తాప పడిన తరువాతే స్థానిక సంఘములో తిరిగి చేర్చుకోబడాలి. అంటే, సిడ్రియన్ ఆది ప్రోటేస్టంట్ లాంటి వాడు. అతడు చెప్పింది పోపు స్టీఫెన్ విని ఉంటే ఈనాడు కేథలిక్ సంఘము చిన్నగా ఉండి ఉండేది, కాని బలముగా ఉండేది. నేను ఒప్పింపబడ్డాను మనకు కొత్త తరము బాప్టిస్టు బోధకులు కావాలి ఈ ఆదిమ కాపరిలాగే కచ్చితంగా ఉండేవారు సంఘ క్రమ శిక్షణ విషయంలో. సిడ్రియన్ జాన్ కేల్విన్ మాటల్లో, నేను చెప్తాను, "తల్లికి సంఘము లేకపోతే, తన తండ్రిని దేవుడు ఉండడు" (cf. J. D. Douglas, Who’s Who in Christian History, Tyndale House, 1992, pp. 186-187). నేను సిడ్రియన్ తో ఏకీభవిస్తానని చెప్పండి. అతడు విశ్వాసపు హత సాక్షి. మీరు స్థానిక సంఘములో నమ్మకంగా ఉండాలనే విషయంలో నేను అతనితో ఏకీభవిస్తాను. అతనితోనూ, సంస్కర్త జాన్ కేల్విన్ తోనూ ఏకీభవిస్తాను. సంఘాలను వదిలి పెట్టాలని మీతో చెప్పువారు అబద్దికులు. ఆదివారం గుడికి వెళ్ళకుండా క్రైస్తవులమని చెప్పావారు అబద్దికులు. "క్రైస్తవ్యము" స్థానిక సంఘపు సమర్పణ లేకుండా ఉండడు ఆఖరి దినాలకు సూచన. అది సాతాను నుండి వచ్చు అబద్ధము! "మీరు కాలముల సూచనలను వివేచింపలేరా?" (మత్తయి 16:3). II. అంతమునకు రెండవ సూచన మత్తు పదార్ధాల ద్వారా వచ్చిన మానసిక తికమక, అంతులేని టెలివిజన్, గంటల కొద్ది విడియో గేములు, "అంతర్జాలము వాడుక," అశ్లీల చిత్రాలు చూడడం. బైబిలు చెప్తుంది ఆఖరి దినాలలో మానవులు జంతువుల కంటే పాపమూ విషయంలో అధ్వానమవుతారని. బైబిలు చెప్తుంది, "అంత్యదినములలో అపాయకరమైన, కాలములు వచ్చునని తెలిసి కొనుము. ఎలాగనను మనష్యులు... అజితెంద్రియులను, క్రూరులు అగుదురు" (II తిమోతి 3:1, 3). గ్రీకు పదము అనువాదము "పెరిలెస్" కొత్త నిబంధనలో ఒక దగ్గరే ఉంది, గదర దయ్యము పట్టిన మనిషి విషయములో. మనకు చెప్పబడింది "మిగుల ఉగ్రుడు" (మత్తయి 8:28). గ్రీకు పదము అనువాదము "క్రూరత్వము" నకు "పెరిలియస్" అని II తిమోతి 3:1 లో ఉన్నది. పదము "చెలోఫోస్" అంటే, "భయంకరము, ఉగ్రత, రౌద్రము" (బలమైనది). అది పెరుగుతున్న ప్రజల సంఖ్యను చూపిస్తుంది – "భయంకరము, ఉగ్రత రౌద్రము." ప్రతి రోజు వార్తలలో చూస్తాము. వోర్ట్ వర్త్ టెక్సాస్ స్త్రీ ని గూర్చిన వార్త, మీకు గుర్తుందా? ఆమె నర్సుకు సహాయకారి. "ఎకటసీ" అనే మందు ఆమె తీసుకుంటుంది. ఆమె కారుతో ఒకని గుద్ది పగిలిన అద్దములో అతని ముఖము ఇరుక్కుపోగా ఇంటికి అలాగే వచ్చింది. గరాజ్ లోని వచ్చి తలుపు లేసేసింది. అతడు అద్దములో మూడు రోజులున్నాడు, నెమ్మదిగా రక్తము పోయి చనిపోయాడు. రోజుకు ఏడుసార్లు ఆమె అతడు చనిపోయాడా లేదా చూడడానికి వెళ్ళింది. చివరకు మూడు రోజుల తరువాత అతడు చనిపోయాక, కారులో తీసుకెళ్ళి పార్కులో పాతిపెట్టింది. ద టరాలాజీ, కౌంటీ టెక్సాస్ న్యాయవాది ప్రకటించాడు, "క్రూరమైనది. హృదయము లేనిది? మానవత్వము లేనిది? అమానుషాన్ని ఇప్పుడే తిరిగి నిర్వచించాయి" (Los Angeles Daily News, March 8, 2002, p. 1). గుర్తుంచుకోవాలి ఈమె నర్సుకు సహకారి. ఇంకొకటి గమనించాలి ఈ స్త్రీ క్రైస్తవురాలు. ఇప్పుడు మనకు భయంకర హంతకులున్నారు క్రైస్తవులని పిలుచుకుంటారు! మీరు అది నమ్మరా! నిజ క్రైస్తవులు అలా చెయ్యరు! "ఏకటసీ" గాని ఎ ఇతర మందు గాని ఒక్కసారి కూడ తీసుకోకూడదు దెయ్యముతో పట్టబడే అవకాశము ఉంది. దెయ్యము గలవారు ఉగ్రులు, భయంకరులు అదుపు ఉండదు. వీధులన్నీ ఈనాడు దెయ్యము పట్టిన వాళ్లతో నిండి ఉన్నాయి. వారు అంతా టెలివిజన్ సినిమాలతోను ఉన్నారు. సినిమాలు క్రూరత్వముతో, భయంకరత్వముతో, హత్యలతో, హింసలతో, రక్తముతో నిండియున్నాయి. ప్రతి సంవత్సరము ఇంకా ఘోరమవుతుంది! అమెరికన్లు ప్రాచీన రోమనుల వలే రక్త దాహము కలిగి ఉన్నారు – వారు క్రైస్తవులను సింహాలకు వేసారు – క్రైస్తవులు ముక్కలుగా చీల్చి వేయబడుతుంటే ఆనందించే వారు! తరము అంతా దెయ్యలచే ప్రభావితం అవుతుంది. చాలామంది ఈ దెయ్యము పట్టిన వారు చేయగలిగింది అంతా చేస్తారు మీరు స్థానిక సంఘము వదిలి పెట్టేటట్టు చెయ్యడానికి. ఇరవై సంవత్సరాల క్రితం, మన సంఘాన్ని వదిలిన చాలామంది, అతర్జలములో మనపై దాడి చేసి దయ్యము పట్టిన వారిలా చేస్తారు. నేను ఒప్పింపబడ్డాను వారిలో కొంతమంది నేరుగా సాతాను ఆధీనంలో ఉన్నారు. మనము వారిని యఫ్ బిఐ (FBI) కు తిప్పాలి వారి దాడులు ఆపడానికి! వారికీ దేవుని భయము లేదు. కాని ఎఫ్ బిఐ (FBI) వారిని ఆపింది! ప్రభువుకు స్తోత్రము! బైబిలు చెప్తుంది, "[మీరు, మూర్ఖులగు, ఈ తరము వారికి వేరై, బలమైన] రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను" (అపోస్తలుల కార్యములు 2:40). మానసిక అస్థిరత దెయ్యపు ఉగ్రరూపము ఈనాటి ప్రజలలో ఉంది అంతము సమీపానికి అది సూచన. "కాలముల సూచనలను మీరు వివేచింపరా?" (మత్తయి 16:3). III. అంతమునకు మూడవ సూచన ప్రపంచమంతటా ఉగ్రవాదము పెరిగిపోవడం. టైం మేగజైన్ చెప్పింది: 10-కిలోటన్ [అణు] యుద్ధ అస్త్రము న్యూయార్క్ పట్టణంలో గుర్తింప బడింది? అది జరగలేదు. కాని జరిగి ఉండేది. మనలను మనము సమర్ధించుకోగలమో లేదో టైం కు కచ్చితంగా తెలియదు. ఆ కధానిక ఈ మాటలతో ముగిసింది, "ఇప్పుడు మనము ఎదుర్కొంటున్నాం. పెద్ద ప్రశ్న ఏంటంటే సమయములో చేసామా లేదా" (ఐబిఐడి., పేజీ 37). టైం మేగజైన్ ఇంకా ఇలా చెప్పింది, నిపుణులు అంటున్నారు ఉగ్రవాదులు అమెరికాను ముప్పు కలిగించాలని ప్రయత్నిస్తున్నారు, ఇంకా తనను దాడి నుండి రక్షించుకోవడానికి ఇంకా ఆదేశము ఏమి చెయ్యడం లేదు. ముస్లీము తీవ్రవాదులు దెర్మోఅణుబాంబులను న్యూయార్క్ పైన గాని లాస్ ఎంజిలాస్ పైన గాని వేస్తారా? టైం మేగజైన్ అనుకుంటుంది వారు అలా చేస్తారని. న్యుటర్స్, బ్రిటిష్ వార్తా సంస్థ, భయపెట్టే నివేదిక ఇచ్చింది దాని శీర్షిక, "సమాచారము చూపిస్తుంది ప్రపంచము దొంగిలింపబడిన అణు సామాగ్రి చేతిలో ఉంది" (March 6, 2002, www.reuters.com). స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయము యొక్క డాక్టర్ ల్యుడ్ మిలా జైట్ సేవా అన్నాడు, “ఇది నిజంగా భయపెట్టేదిగా ఉంది." అంతర్జాతీయ పరిశోధకులు అన్నారు వారు తయారు చేసిన ప్రపంచపు పూర్తి స్థాయి సమాచారము పోయింది, దొంగిలింపబడింది, అణు సామాగ్రికి సంబంధించినది – అణు సామగ్రి యురేనియం ప్లుటోనియం వీటికి లెక్కలేదు. ర్యూటర్ వార్తా సంస్థ చెప్పింది, "సత్యాలు మరుగుబడ్డాయి" (ఐబిఐడి). ఇప్పుడు ఇరాన్ అణు ఆయుధాలు చేస్తుంది అమెరికా ఇశ్రాయేలుపై దాడి చెయ్యడానికి. ఎవరు వారిని ఆపుతారు? ఒబామా గాని హిల్లరీ క్లింటన్ గాని ఆపలేరు! వారు ఇరాన్ తో ఒప్పందము కుదుర్చుకున్నారు అణు ఆయుధాలు తయారు చెయ్యడానికి! దేవుడే మనకు సహాయము చెయ్యాలి! అలాంటి నాయకత్వములో మనము ఈనాడు భయంకర పరిస్థితిలో ఉన్నాము! ధర్మోఅణు అగ్ని తుఫానులో ప్రపంచము పేలిపోతుందా? బైబిలు చెప్తుంది: "నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా; మనష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయిరి..." (ప్రకటన 16:8-9). ఇలాంటి అగ్ని తుఫాను ఇరాను ద్వారా దేవుడు రప్పిస్తాడేమో? లాస్ ఎంజిలాస్ అణు అగ్ని గంధకములతో కాలిపోతే, మీకు ఏమి జరుగుతుంది? లోకము అగ్నిలో ఉన్నప్పుడు మీరు ఏమి చేస్తారు? అణుబాంబులతో దాడి జరిగితే మీరు ఎక్కగా దాగుకుంటారు? బిల్లీ గ్రేహం తన యవ్వన దినాలలో అగ్ని తీర్పును గూర్చి ఇలా అన్నాడు: ప్రపంచ తీర్పును గూర్చి ప్రవక్తలు మాట్లాడినప్పుడు, లేక పేతురు తరము అంతములో వచ్చే అగ్నిని గూర్చి చెప్పినప్పుడు, అతడు సామాస్య అగ్నిని గూర్చి చెప్పడం లేదు. అది అగ్ని గంధకము, అణు శక్తి విడుదల అణువుల విభజన... తప్పకుండా అది మూర్ఖపు లోకముపై అగ్ని తీర్పు (Billy Graham, World Aflame, Doubleday, 1965, pp. 246-247). లాస్ ఎంజిలాస్ పై దేవుని ఉగ్రత తీర్పు వచ్చినప్పుడు, తప్పించుకోడానికి మీరు ఏమి చేస్తారు? ముస్లీము తీవ్రవాదులు మన పట్టణాలపై "అణు బాంబులను" పేల్చి వేస్తే, వాస్తవంగా నరక రంద్రాలు చేస్తే, మీరు ఎక్కడ దాక్కుంటారు? ఏ మారని వ్యక్తి దేవుని అగ్నికి సిద్ధ పరచ బడలేదు ఆఖరి దినాలలో ఆయన పంపేదానికి. సిద్ధపరచబడిన ఒకటే మార్గము ఈలాంటి బైబిలు నమ్మే సంఘములోనికి వచ్చి ప్రతీ ఆదివారము హాజరు అవడము. మీ జీవితమూ దానిపై ఆధార పడినట్లు ప్రసంగాలు వినండి. తరువాత, తప్పకుండా, నిర్ధారణ చేసుకోండి, మీరు మార్పు నొందునట్లు – ఇంకొక తప్పిపోయిన సంఘస్థుని వలే వద్దు. అందుకే మీరు నేరుగా యేసు క్రీస్తు నొద్దకు రావాలి, ఆయన పాపియైన మానవునికి పరిశుద్ధ దేవునికి మధ్యవర్తి. క్రీస్తు సిలువపై భయంకర మరణము పొందియున్నారు మీ పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము. మీ పాపములు కడిగి వేయబడునట్లుగా సిలువపై ఆయన రక్తము కార్చాడు. క్రీస్తు శారీరకంగా మృతులలో నుండి లేచి ఆకాశానికి ఆరోహనుడయ్యాడు, దేవుని కుడి పార్శ్వాన ఆశీనుడయ్యాడు. నీవు క్రీస్తు నొద్దకు, మాత్రమే రావాలి, రక్షింప బడడానికి. మార్పు నొందడానికి యేసును విశ్వసించాలి. తరువాత నూతన నిభందన బాప్టిస్టు సంఘము పూర్తి సహవసములోనికి వచ్చి బాప్మిస్మము ద్వారా సభ్యత్వము పొందుకోవాలి. నీవు మారినప్పుడు మాత్రమే నీవు సురక్షితంగా ఉంటావు ఈ దుష్ట పట్టణానిపై అగ్ని తీర్పు వచ్చినప్పుడు. క్రీస్తును నమ్ము. ఇప్పుడే అలా చెయ్యి – ఇంకా సమయము ఉండగానే! ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము అబెల్ ప్రుదోమ్: మత్తయి 16:1-4.
|
ద అవుట్ లైన్ ఆఫ్ కాలముల సూచనలు SIGNS OF THE TIMES డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే "ఓ యీ వేషధారులారా, మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు; కాని ఈ కాలముల సూచనలు వివేచింప లేరు?" (మత్తయి 16:3). I. అంతము సమీపంగా ఉందనడానికి మొదటి సూచన – విగ్రహారాధన ఎక్కువవడం పాశ్చాత్య ప్రపంచములో, మిగిలిన చోట్ల, ఈనాడు క్రీస్తు నుండి వైదొలగడం, హెబ్రీయులకు 10:25; రోమా 1:25, 22; మత్తయి 24:12.
II. అంతమునకు రెండవ సూచన – మత్తు పదార్ధాల ద్వారా వచ్చిన మానసిక తికమక, అంతులేని టెలివిజన్, గంటల కొద్ది విడియో గేములు, "అంతర్జాలము వాడుక," అశ్లీల చిత్రాలు చూడడం, II తిమోతి 3:1, 3; మత్తయి 8:28;
III. అంతమునకు మూడవ సూచన – ప్రపంచమంతటా ఉగ్రవాదము పెరిగిపోవడం, ప్రకటన 16:8-9. |