Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




కన్యకు జననము గూర్చిన ఋజువులు

PROOFS OF THE VIRGIN BIRTH
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ సాయంత్రము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, డిసెంబర్ 13, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, December 13, 2015

"ఆలకించుడి, కన్యక గర్భవతియై, కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును" (యెషయా 7:14).


కన్యక క్రీస్తు జననమునకు ఇది తేటయైన ప్రవచనము – పాత నిబంధన లేఖనాలలో ఇవ్వబడింది. ఈ గొప్ప క్రైస్తవ సిద్ధాంతంతో కొంతమందికి సమస్యలున్నాయి. వారి నిజమైన సమస్య ఎలాంటి అద్భుతాల యందు వారికి నమ్మిక ఉండదు. లౌకిక మానవత అద్భుత అవకాశాలను వారి నుండి దొంగిలించింది – దేవుని కూడ వారి నుండి దొంగిలించింది!

కొంతకాలము క్రితము మన సంఘములో స్తీన్స్ యొక్క "బహిష్కరింపబడెను" సినిమా చూపించాము. నా మట్టుకు, ఆ సినిమాలోని ఆసక్తికర భాగము, డాక్టర్ రిచర్డ్ డాకిన్స్ తో స్తీన్స్ చేసిన ఇష్టా గోష్టి. డాక్టర్ డాకిన్స్ మన కాలపు ప్రాముఖ్య పరిణమికుడు. అనాది కాలపు విషయాలతో పరిణామిక ప్రక్రియను గూర్చి కేసు తయారు చేసాడు. కాని, ఇతర పరిణామికుల వలే, జీవిత ఆరంభమును గూర్చి వివరించుటలో సందిగ్ధత ఎదుర్కొన్నాడు. స్టీన్ గారు ఈ ప్రశ్నపై ఒత్తిడి తెచ్చాడు. డాకిన్స్ పెదవి బాగా దగ్గరగా చూడవచ్చు. స్టీన్ బలవంత పెట్టాడు ప్రశ్నవేసి – "మొదటిగా జీవితమూ ఎక్కడ నుండి వచ్చింది?" డాకిన్స్ నుదటిపై చెమట బిందువులు వచ్చాయి. చివరకు డాకిన్స్ అన్నాడు వేరే ఉపగ్రహము నుండి జీవులు వచ్చి భూమిపై "విత్తి" ఉండవచ్చు. స్టీన్ గారు ఎగిరి గంతేశాడు. "అంటే నీ అర్ధము వేరే ఉపగ్రహము నుండి జీవులు భూమికి జీవాన్ని తీసుకు వచ్చాయా?" "ఔను" అని అన్నప్పుడు, తనను సినిమా తీసున్నారు అనే సంగతి డాకిన్స్ మర్చి పోయాడనుకుంటాను. తరువాత అతడు స్టీన్ గారిపై దావా వేయ ప్రయత్నించారు ఆ సినిమా భాగము తొలగించాలని. కాని తానూ సంతకము చేసిన ఒప్పందము ఆ దావా గెలవడంలో అడ్డుపడింది.

ఎంత విడ్డూరము! అంతరిక్ష నౌకలో ఉన్న చిన్న వ్యక్తులు మన ఉపగ్రహములోనికి మొదటి జీవం తీసుకురావడం! చిన్న పిల్లల సామాజిక మిధ్య కధలా అనిపిస్తుంది! ఒకవేళ డాకాన్స్ వ్యర్ధ అభిప్రాయము నిజమైన, అది ఇంకా వివరించలేదు వేరే ఉపగ్రహముపై జీవితమూ ఎలా ప్రారంభ మైయిందో! కనుక మనం చూస్తాం, స్టీన్ సినిమాలో, లౌకిక మానవతారులు ఎంత మేరకు వెళ్తారో మన ఉపగ్రహముపై దేవుడు జీవాన్ని సృస్టించుట అనే అద్భుతాన్ని తప్పించుకోడానికి.

సి. ఎస్. లూయిస్ అన్నాడు, "అద్భుతము అనే పదము నేను ఉపయోగిస్తాను సృష్టి అసాధారణ మనవ శక్తితో జోక్యము చేసుకుంది అనే అర్ధాన్ని చెప్పడానికి." మళ్ళీ, సి. ఎస్. లూయిస్ అన్నాడు, "దేవుని ఒప్పుకుంటే, అద్భుతాన్ని కూడ ఒప్పుకోవాలా? నిజంగా, నిజంగా." (అద్భుతాలు, పేజీలు 105, 9).

సి. ఎస్. అర్ధమేమిటంటే దేవుడుంటే అద్భుతాలు సాధ్యము. చిన్న ఆకుపచ్చ మనష్యులు వచ్చి భూమిపైకి జీవము తేనక్కర లేదు. దేవుడుంటే (శూన్యము నుండి) జీవాన్ని సృష్టించగల సమర్ధుడు. యేసు అన్నాడు, "దేవునికి సమస్తము సాధ్యమే" (మార్కు 10:27).

నాతల్లి తన 80 వ ఏట మార్పు నొందింది. ఆమె మారుతుంది అనుకోవడానికి ఎ చిన్న కారణము లేదు. లేనేలేదు. నేను వివరాలకు వెళ్లి చెప్పగలను ఆమె మార్పు ఒక అద్భుతమని, కాని ఈరాత్రి అది చెప్పెను. ఆమె మార్పు ముందు సంభవించిన ఒక అద్భుతము మీకు చెప్తాను. నేను నా కుటుంబంతో న్యూయార్క్ పట్టణములో ఉన్నాను. నాతల్లి మూడు వేల మైళ్ళ దూరమున్న, లాస్ ఎంజిలాస్ లో ఉంది. నేను ప్రార్ధిస్తున్నాను అకస్మాత్తుగా, నా ప్రార్ధనల మధ్యలో, నాతల్లి రక్షింపబడుతుందని అనిపించింది. నేను డాక్టర్ కాగన్ కు ఫోను చేసి వెళ్లి నాతల్లిని క్రీస్తు వద్దకు నడిపించమని చెప్పను. ఆయన భయపడ్డాడు ఎందుకంటే మునుపు ఆమెను కలిసినప్పుడు అతనిపై అరిచింది. కాని నేను బలవంత పెట్టాను ఆమె రక్షింపబడుతుందని దేవుడు నాతో చెప్పాడని చెప్పను. కనుక అతడు ఆమె స్థలానికి వెళ్లి తనను నడిపించి, చాలా సులువుగా, ఆమెను క్రీస్తు నోద్దకు నడిపించాడు – ఆమె జీవితమంతా మారిపోయింది. అవును, అది ఒక అద్భుతము. కాని అది ఒక్కటే ఒక్కానించి ఇక్కడ చెప్పడం లేదు. ఆమె మారుతుందని నాకు అకస్మాత్తుగా ఎలా తెలిసింది? ఆమె నుండి నేను మూడు వేల మైళ్ళ దూరంలో ఉన్నాను. ఆమెతో ఫోనులో మాట్లాడలేదు. కాని నాకు తెలుసు. ఎలా? అద్భుతము. ఒక అద్భుతము ద్వారా అది దేవుడు నాతో చెప్పాడు. అది అంత సామాన్యము.

నాతల్లి కూడ అద్భుతాలు నమ్మరు. ఆమె లౌకిక మానవతా వాది పరిణామికురాలు. అక్కడా మూడవ అద్భుతము వచ్చింది. మొదటిది, ఆమె మారుతుందని దేవుడు నాతో చెప్పాడు. రెండవది, ఆమె మారింది. కాని మూడవ అద్భుతము, చాలా రీతులుగా, అతి గొప్పది – నా విషయంలో.

ఆమె మారిన కొన్ని నెలల తరువాత, నేను ఆమెను ఇలియానాతో మా అబ్బాయిలతో నా సహోదరుని ఇంటికి తీసుకెళ్ళాను. అతని దగ్గర తాగుబోతులు చాలామంది ఉన్నారు. ఒకరి భార్య సగము తాగిఉంది. నేను బోధకుడనని ఆమెకు తెలుసు, కనుక ఎదురుగా, బల్లపై కూర్చుంది, మాట్లాడడం ప్రారంభించింది. "ఆ అద్భుతాలు ఎలా సంభవించాయి? కొన్ని చేష్టలతో ఆయన 5,000 మందికి ఎలా భోజనము పెట్టాడు? మృతులలో నుండి ఆయన ఎలా లేపాడు? ఎర్ర సముద్రము ఎలా పాయలయింది? హా, హా, హా!"

నేను ఒక్కమాట చెప్పలేదు. నా సహోదరుని ఇంటిలో గొడవ ప్రారంభించాలనుకోలేదు. నాతల్లి నా ప్రక్కన కూర్చుంది. అకస్మాత్తుగా ఆమె కళ్ళు మెరవడం చూసాను. ఆమె కళ్ళు అలా మెరుస్తున్నప్పుడు ఆమెకు ఎదురు మాట్లాడడం లేదు! ఆ తాగుబోతు స్త్రీతో పెద్ద స్వరముతో, ఇలా అన్నాడు, "నీవు దేవుని నమ్ముతావు, అవునా?" పాపమూ ఆమె భయపడింది. ముఖము తెల్లబారింది. చిన్న స్వరముతో ఆమె అన్నారు, "సరే, ఊ...ఔను." తల్లి ఆమెను తీక్షణంగా చూసి, ఇంకా గట్టి స్వరంతో, అన్నారు, "అప్పుడు నీ సమస్య ఏమిటి?" ఇంటిలో పూర్తి నిశ్శబ్దము. అద్భుతాలను గూర్చిన వాదన అంతటితో ఆగిపోయింది!

చూడండి, దేవుని యందు నమ్మిక ఉంచితే – అప్పుడు సి. ఎస్. లూయిస్ చెప్పినట్టు – అద్భుతాలకు వ్యతిరేకంగా వాదన ఉండదు! యేసు చెప్పినట్టు, "దేవునితో సమస్తము సాధ్యమే." అది మనలను కన్యకను క్రీస్తు జననము దగ్గరకు తీసుకెళ్తుంది. నేను రెండు "ఋజువులు" ఇస్తాను క్రీస్తు యొక్క కన్యకా జననమును గూర్చి. కాని ఈ "ఋజువులు" మిమ్ములను ఒప్పింప చేస్తాయి మీరు దేవుని యందు నమ్మిక ఉంచితే. దేవుని ఉనికిని నమ్మడాన్ని తిరస్కరించే వారిని అవి ఒప్పింప లేవు.

I. మొదటిది, కన్యకకు క్రీస్తు జననము పాత నిబంధన గ్రంధముచే రుజువు చేయబడింది.

కన్యకకు క్రీస్తు జననము యొక్క మొదటి ప్రవచనము ఏదేను వనంలో కనిపిస్తుంది, మన ఆదిమ తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకంగా పాపమూ చేసిన కొంతసేపటికి. శోధించు సాతాను మాట విని, పాపము చేసారు. దేవుడు సాతానుతో చెప్పాడు,

"మరియు నీకు స్త్రీకి నీ సంతానమునకు, ఆమె సంతానమునకును వైరము కలుగ చేసెదను; అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమే మీద కొట్టుదురని చెప్పెను" (ఆదికాండము 3:15).

ఇక్కడ దేవుడు కన్యకకు జననమును గూర్చిన మొదటి ప్రవచనము ఇచ్చాడు. స్త్రీ సంతానము సర్పము యొక్క తలను చితుకకొట్టును. లూథరన్ పాత నిబంధన వేత్త డాక్టర్ క్లాస్ వేస్టర్ మాన్ (1909-2000) అన్నాడు, "ఇరేనియస్ దినముల నుండి (130-202) క్రైస్తవ సంస్కృతీ పాఠ్య భాగాన్ని అర్ధము చేసుకుంది క్రీస్తును గూర్చి ప్రవచనాన్ని (మరియా కూడ). ‘స్త్రీ సంతానము’ ఒక ఉద్భవించిన వ్యక్తి [క్రీస్తు]ను గూర్చి చెప్పబడింది ఆయన సర్పము [సాతాను] తలను చితుక త్రొక్కాడు...ఈ వివరణ ఇరేనియస్ నుండి కేథలిక్ మరియు సువార్తిక సంప్రాదాయము చరిత్ర ద్వారా కొనసాగుతుంది" (Claus Westermann, Ph.D., Genesis 1-11: A Commentary, Augsburg, 1984, p. 260).

డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు, "’స్త్రీ సంతానము’ హవ్వ భవిష్యత్తు [సంబంధిత] సంతానానికి సంబంధించినది అతనికి ఇహలోకపు తండ్రి ఉండదు. జీవశాస్త్రము ప్రకారము, స్త్రీ సంతానము ఉత్పత్తి చేయదు...బైబిలు వినియోగము ఎల్లప్పుడూ పురుష విత్తనమును గూర్చి మాట్లాడుతుంది. ఈ వాగ్ధానపు విత్తనము, అద్భుతంగా, గర్భములో [మరియా యొక్క] ఉంచబడాలి. ఈ విధంగా, ఆయన [క్రీస్తు] పాపపు స్వభావము ధరించుకోడు ఎందుకంటే అదే ఆదాము ఇతరుల కుమారులను పాపమూ నుండి రక్షకునిగా ఉండడానికి అనర్హునిగా చేస్తుంది. ఈ ప్రవచనము తేటగా కన్యకు క్రీస్తు జననమును తెలియ చేస్తుంది" (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishing, 1995, p. 13; note on Genesis 3:15).

మన ప్రారంభపు పాఠ్యభాగము కూడ పాత నిబంధన నుండి తీసుకొనబడినది. యెషయా ప్రవక్త అన్నాడు,

"ఆలకించుడి, కన్యకా గర్భవతియై, కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును" (యెషయా 7:14).

ఆంగ్ల పదము "కన్యక" హెబ్రీ పదము "అలమా" నుండి అనువదింప బడినది. ఇది అవివాహిత స్త్రీని సూచిస్తూ పాత నిబంధనలో ఏడూ సార్లు వచ్చింది. ఎడ్వర్డ్ ఇ. హిండ్ సన్ అన్నాడు, "అది [వాడకము] ఎప్పుడు కన్యకను సూచిస్తుంది. బైబిలు అల్మా వాడకము తేటగా వివాహ స్త్రీని గూర్చి కాదు, అవివాహిత స్త్రీని గూర్చి మాత్రమే" (Edward E. Hindson, “Isaiah’s Immanuel,” Grace Journal 10, Fall, 1969, p. 7). గొప్పవేత్త జె. గ్రెషమ్ మచ్చేన్ అన్నాడు, "పాత నిబంధనలో అల్మా ఏడూ సార్లు వచ్చింది ఆ పదము కన్యకను గూర్చి మాత్రమే" (J. Gresham Machen, Ph.D., The Virgin Birth of Christ, Baker Book House, 1965, p. 288).

కాని గొప్ప ఋజువు "అల్మా" అంటే "కన్యక" అని ఇది క్రీస్తు పూర్వము 200 సంవత్సరాల ముందు రబ్బీల నుండి గ్రహింపబడినది. డబ్భై మంది గొప్ప బోధకులు పాత నిబంధన హెబ్రీ బైబిలును గ్రీకులోనికి అనువదించారు, ఆ బాష రోమా సామ్రాజ్యములో చాలామంది యూదులు మాట్లాడేవారు. ఈ బోధకులు గొప్ప హెబ్రీ వేత్తలుగా ప్రపంచములో ఆ సమయంలో, క్రీస్తుకు 200 సంవత్సరాల ముందు పరిగణించబడ్డారు. ఈ యూదా బోధకులు "అల్మా" అనే హెబ్రీ పదాన్ని యెషయా 7:14 లోనిది గ్రీకు పదము "పర్తేనోస్" నుండి అనువదించారు – కన్యకను మాత్రమే చూపిస్తుంది – పురుషునితో లైంగిక సంబంధము లేని స్త్రీ. 70 మంది బోధకులు పాత నిబంధనను గ్రీకులోనికి అనువదించారు. దీనిని సెప్టుయజింట్ అని పిలుస్తారు. డాక్టర్ బెన్ విధరింగ్ టన్ III అన్నాడు "అల్మా" అంటే అర్ధము "కన్యక," "కాకపోతే అసాధ్యము కాకపోయినా చాలా కష్టము చూడడానికి ఎందుకు [బోధకులు] ఎల్ ఎక్స్ ఎక్స్ [ద సేప్టుయుజింట్] ‘పార్తనోస్’ పదాన్ని గ్రీకు సమాన పదంగా ఎందుకు ఉపయోగించారో" (Ben Witherington III, Ph.D., “The Birth of Jesus,” Dictionary of Jesus and the Gospels, InterVarsity Press, 1992, p. 64).

ఈ ఋజువు లన్నీ చూపిస్తున్నాయి బోధకులు యెషయా 7:14 ను ఇలా అనువదిస్తున్నప్పుడు సరియే అని

"ఆలకించుడి, కన్యకా గర్భవతియై, కుమారుడ్ని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును" (యెషయా 7:14).

చరిత్రలో కన్యకగా ఉండి, అసాధారణ విధంగా గర్భవతి అయిన స్త్రీ, క్రీస్తు తల్లియైన మరియ, మాత్రమే.

II. రెండవది, కన్యకకు క్రీస్తు జననము కొత్త నిబంధన గ్రంధముచే ఋజువు చేయబడినది.

దయచేసి, బైబిలు తెరచి మత్తయి 1:23 చూడండి.

"ఇదిగో, కన్యక గర్భవతియై, కుమారునిని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు, ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున, దేవుడు మనకు తోడని అర్ధము" (మత్తయి 1:23).

మరియు మోసేపుకు ప్రధానము చేయబడినది. వారు ఏకము కాక మునుపు "ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను" (మత్తయి 1:18). సహజంగా మోసేపు అనుకున్నాడు ఆమె జారత్వము జరిగించిందని. ఆమెను ప్రక్కను పెట్టి వివాహము చేసుకోకుండా ఉండడం ద్వారా ఆమెను అవమానించడం ఆయనకు ఇష్టము లేదు. ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఈ సమస్యను గూర్చి ఆలోచిస్తున్నాడు. ప్రభువు దూత ప్రత్యక్షమై అతనితో ఇలా చెప్పింది, "నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకు: ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ [నుండి] కలిగినది." అప్పుడు దూత యెషయా 7:14 ను మోసేపు కు చెప్తుంది,

"ఇదిగో, కన్యక గర్భవతియై, కుమారునిని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు, ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున, దేవుడు మనకు తోడని అర్ధము" (మత్తయి 1:23).

అవునట్టు, పరిశుద్ధత్మచే మత్తయి 1:23కు సేప్టుజింట్ అనువాదము తీసుకొని వెల్లబడింది. కనుక "పార్తనోస్" దేవుని వాక్యముచే ప్రేరేపింపబడిన దయినది.

నూతన నిబంధన గ్రంధము ద్వారా వెళ్దామని నిర్ణయించుకున్నాను యేసును బాగుగా ఎరిగిన వారు ఆయన కన్యక జననమును గూర్చి ఏమని తలుస్తున్నారో తెలుసుకోడానికి. ఆయనతో పాటు జీవించిన వారు ఏమనుకున్నారో ఒక కాగితము పై వ్రాసుకున్నాను.

అయన తండ్రియైన మోసేపుతో, ప్రారంభించాను. మోసేపు ఆయన కన్యక జననము నమ్మాడు.

"మోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము, తన భార్యను చేర్చుకొనెను: ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను: అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను" (మత్తయి 1:24-25).

తరువాత, మరియ. మోసేపు వలే, కన్యక జననమును నమ్మకుండా ప్రారంభించింది. ఆమె అన్నాడు, "నేను పురుషుని ఎరుగనిదాననే, ఇదేలాగు జరుగును?" (లూకా 1:34).

"దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి, నిన్ను కమ్ముకోనును: గనుక పుట్టబోవు శిశువు పరిశుద్దుడై దేవుని కుమారుడగును" (లూకా 1:35).

"దేవునికి అసాధ్యమైనది ఏమియు లేదు" (లూకా 1:37).

అప్పుడు మరియ కన్యక నుండి జననమును నమ్మింది, ఆమె చెప్పింది, "ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను."

"పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అగును" (లూకా 1:35).

తరువాత, యేసే స్వయంగా. యేసు స్వయంగా అన్నాడు,

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన, వానియందు విశ్వాసము ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు, ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).

యేసు అన్నాడు దేవుని "అద్వితీయ కుమారుడని" అని చెప్పుకున్నాడు. తరువాత, దేవుడే స్వయంగా. బాప్తిస్మమిచ్చు యోహాను యోర్దాను నదిలో యేసుకు బాప్తిస్మమిచ్చాడు. అప్పుడు ఆకాశము నుండి దేవుని స్వరము ఇలా పలికింది, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" (మత్తయి 3:17). అప్పుడు బాప్తిస్మ మిచ్చు యోహాను అన్నాడు, "ఈయన, దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్య మిచ్చితిని" (యోహాను 1:34). మోసేపు, మరియ, యేసే స్వయంగా, బాప్తిస్మ మిచ్చు యోహాను, తండ్రియైన దేవుడు – వీరంతా అన్నారు ఆయన దేవుని కుమారుడని – ఆయన కన్యకకు జన్మించాడని కనపరుస్తుంది.

"పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అగును" (లూకా 1:35).

నూతన నిబంధన గ్రంధము గుండా వెళ్లాను. నేను చూసాను దయ్యాలు "ఇక్కడ, మాతో నీకేమి పని, దేవుడి కుమారుడవైన, యేసు, అని అరిచాయి? సమయము కాక మునుపే మమ్ములను బాధింప వచ్చితివా?" అవును, దెయ్యాలకు కూడ తెలుసు ఆయన దేవుని కుమారుడు కన్యకు జన్మించాడని! యేసు ఆయన శిష్యులను అడిగాడు, "మీరైతే నేనేవడనని చెప్పుకొనుచున్నారు?" పేతురు అన్నాడు, "నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన, క్రీస్తువు" (మత్తయి 16:16). అలాగే అపోస్తలుడైన యోహాను కూడ చెప్పాడు, అందరికంటే ఆయనను బాగుగా ఎరుగును. అపోస్తలుడైన యోహాను అన్నాడు, "యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును, ఇవి వ్రాయబడెను" (యోహాను 20:31). మళ్ళీ యోహాను అన్నాడు, "మన సహవసమైతే తండ్రితో కూడను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడను ఉన్నది" (I యోహాను 1:3). అవును, అపోస్తలుడైన యోహాను, ఆయనను బాగుగా ఎరిగిన వాడు, యేసు కన్యకు జన్మించిన దేవుని కుమారుడని చెప్పాడు. ఆయన యేసును దేవుని "అద్వితీయ కుమారుడు" అని చెప్పాడు (యోహాను 1:18). అపోస్తలుడైన పౌలు మారినప్పుడు, "నేరుగా అతడు సమాజ మందిరములో క్రీస్తును గూర్చి ప్రకటించాడు, ఆయన దేవుని కుమారుడని" (అపోస్తలుడైన కార్యములు 9:20). శిష్యులందరు అదే చేసారు, వారందరకు తెలుసు "పరిశుద్ధమైనది" కన్య మరియ ద్వారా జన్మించింది ఆయన "దేవుని కుమారునిగా" పిలువబడ్డాడు (లూకా 1:35). సిలువపై యేసు పలికిన ఆఖరి మాటలు దానిని నిర్ధారిస్తున్నాయి, ఆయన "గట్టిగా కేకవేసి, [మరియ] అన్నాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను" (లూకా 23:46). అప్పుడు ఆయనను సిలువ వేసిన శతాధిపతి మోకాళ్ళపై పడి అన్నాడు, "నిజంగా ఈయన దేవుని కుమారుడు" (మార్కు 15:39).

ఆయన కుమారత్వాన్ని హేళన చేసినవారు ఆయనను సిలువ వేసినవారు. ఆ దుష్టులు కోరుకున్నారు "ఆయనను చంపాలకున్నారు, ఎందుకంటే ఆయన సబ్బాతును ఆచరించకపోవడమే కాకుండా, దేవుడు ఆయన తండ్రి అని చెప్పెను" (యోహాను 5:18). ఆయన శ్రమ పడుతూ ఉండగా వారు అరిచారు, "నీవు దేవుని కుమారుడవైతే, సిలువ నుండి క్రిందకి దిగు" (మత్తయి 27:40). కాని ఆయన సిలువ దిగివస్తే విరుద్ధమైనది జరిగేది. ఆయన దేవుని కుమారుడు కాదు అని చూపించేది!

పరిశుద్ధ, కన్యకు పుట్టిన దైవ కుమారుడు పరము నుండి దిగి, మరియ గర్భములో ప్రవేశించి, జన్మించి మన పాప ప్రాయశ్చిత్తము సిలువపై మరణించడానికి పుట్టాడు. ఆయన మన పాపుల మధ్య జీవించాడు, మన పాపలన్నింటి నుండి కడగడానికి పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు.

కాని మన పాఠ్యభాగంలోని చివరి భాగముపై ఇంకా వ్యాఖ్యానించ లేదు. యెషయా 7:14 సేప్టూజింట్ లో చెప్పినట్లు మత్తయి 1:23 లో ఇవ్వబడింది,

"ఇదిగో, కన్యక గర్భవతియై, కుమారునిని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు, ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున, దేవుడు మనకు తోడని అర్ధము" (మత్తయి 1:23).

ఇమ్మానుయేలు అంటే అదీ అర్ధము. దాని అర్ధము "దేవుడు మనకు తోడు." కన్యకు పుట్టిన బాలుడు అతడే. ఆయన "దేవుడు మనకు తోడు."

నా చిన్నప్పుడు ఒక దేవుడు ఉండేవాడు, మా అమ్మమ్మ తోటలో పుష్పాల క్రింద దాక్కునే వాడిని. తనతో మాట్లాడేవాడిని, ఎవరో తెలియదు. నాకు తెలిసినదంతా దేవుడు ఉండాలి ఆశ్చర్యకర అందమైన పుష్పాలను చేసి ఉండాలి! దేవుడు ఉన్నాడని తెలుసు, ఆరిజోనా ఎడారిలో ఒంటరిగా నిలబడినప్పుడు – నేలపై వాన పడుచుండగా – వానలో తడిసిన నేలనుండి, గొప్ప వాసన వస్తుండగా. అలాంటి ఆశ్చర్యాలు చేయడానికి దేవుడు ఉండాలి. కాని ఆయన నాకు తెలియదు. దేవుడున్నాడని తెలుసు నేను పడినప్పుడు, చెమట పట్టి ఎద్చినప్పుడు, గడ్డిపై, నా అమ్మమ్మ సమాధి చేయబడినప్పుడు. దేవుడు దిగి వచ్చినట్టు అనిపించింది. దేవుడు ఉండి ఉండాలి. కాని ఆయన నాకు తెలియదు.

కాని ఒక ఉదయము యేసు దిగి వచ్చి నా ఆత్మను రక్షించాడు. అది తేడా! ఆయన పేరు ఇమ్మానుయేలు – దేవుడు మనకు తోడు! ఆయన రక్తము మనలను కడుగుతుంది. ఆయన మాట ఆదరణ ఇస్తుంది. ఆయన సన్నిధి మన భయాలను నిమ్మల పరుస్తుంది. యేసు – మన ఇమ్మానుయేలు – దేవుడు మనకు తోడు! చార్లెస్ వెస్లీ (1707-1788) చక్కని క్రిస్మస్ కేరళ పాట నాకిష్టము!

క్రీస్తు, ఉన్నత ఆకాశంలో ఘన పరచబడుతున్నాడు;
   క్రీస్తు, నిత్యత్వపు ప్రభువు!
ఆలస్యముగా ఆయన ఇదిగో వచ్చును,
   కన్యక గర్భము నుండి ఉదయించిన వాడు:
శరీర ధారియై దైవత్వముతో;
   నరావతారి హెచ్చింప బడును గాక,
మానవుని వలే నరుల మధ్య జీవించాడు,
   యేసు, మన ఇమ్మానుయేలు.
దూతల! సమూహము పాడుచుండగా,
   "కొత్తగా జన్మించిన రాజుకు మహిమ."
("దూతల, సమూహము పాడుచుండగా" చార్లెస్ వెస్లీచే, 1707-1788).
(“Hark, the Herald Angels Sing” by Charles Wesley, 1707-1788).

నా ప్రార్ధన నీవు యేసును నమ్మాలని పాపపు శిక్ష నుండి రక్షింప బడాలని, ఆయన రక్తము ద్వారా అతిక్రమములన్నియు కడగబడాలని. పరలోకపు తండ్రీ, నా ప్రార్ధన మీ కుమారుని యొద్దకు కొందరు రావాలని ఆయన ద్వారా రక్షింపబడాలని. ఆమెన్!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదొమ్: మత్తయి 1:18-25.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
     "దూతల, సమూహము పాడుచుండగా" (చార్లెస్ వెస్లీచే, 1707-1788).
     “Hark, the Herald Angels Sing” (by Charles Wesley, 1707-1788).


ద అవుట్ లైన్ ఆఫ్

కన్యకు జననము గూర్చిన ఋజువులు

PROOFS OF THE VIRGIN BIRTH

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"ఆలకించుడి, కన్యక గర్భవతియై, కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును" (యెషయా 7:14).

(మార్కు 10:27)

I. మొదటిది, కన్యకకు క్రీస్తు జననము పాత నిబంధన గ్రంధముచే రుజువు చేయబడింది, ఆదికాండము 3:15.

II. రెండవది, కన్యకకు క్రీస్తు జననము కొత్త నిబంధన గ్రంధముచే ఋజువు చేయబడినది, మత్తయి 1:23, 18; 24-25; లూకా 1:34, 35, 37; యోహాను 3:16; మత్తయి 3:17; యోహాను 1:34; మత్తయి 16:16; యోహాను 20:31; I యోహాను 1:3; యోహాను 1:18; అపోస్తలుల కార్యములు 9:20; లూకా 23:46; మార్కు 15:39; యోహాను 5:18; మత్తయి 27:40.