ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
అబ్రహాము ఇస్సాకుల నుండి జీవిత పాఠాలు (ఆదికాండముపై 85వ # ప్రసంగము) డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే సంస్కరణ సాయంత్రము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, నవంబర్ 29, 2015 "అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మంద మతులారా: యెషయా సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనము లన్నిటిలో, తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను" (లూకా 24:25, 27). |
యెషయా సమస్త ప్రవక్తలు తన్ను గూర్చి చెప్పారని క్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. పాత నిబంధన గ్రంధము క్రీస్తును గూర్చి చాలా సాదృశ్యాలు ఇచ్చింది. అవి యేసు, దేవుని గూర్చిన పద చిత్రాలు. అపోస్తలుల కార్యముల సమయంలో చరిత్ర అంతటిలో గొప్ప బోధ చోటు చేసుకుంది – నూతన నిబంధన గ్రంధము వ్రాయబడక మునుపు. వారు ఏమి బోధించారు? వారు పాత నిబంధన నుండి దేవుని గూర్చి క్రీస్తును గూర్చి బోధించారు! చాలా గొప్ప ప్రసంగాలు కొన్ని నేను పాత నిబంధన నుండి విన్నాను. నా దీర్ఘ కాలిక కాపరి డాక్టర్ తిమోతి లిన్ గొప్ప పాత నిబంధన వేదాంతి. యాభై ఏళ్ళ తరువాత, ఇంకా నాకు గుర్తున్నాయి ఆయన ప్రసంగము ఇర్మియా 1:10 పై, దానియేలు 10:13, 20, 21 పై, మాలాకీ 4:6 పై, ఆదికాండము 3:21 పై. నేను ఎప్పుడు వినని అతి గొప్ప ప్రసంగము డాక్టర్ ఆర్. జి. లీ గారిది "చెల్లించాలి ఏదో రోజు" – ఆహాబు ఎజేబెలులపై తీర్పు – ఇది పాత నిబంధన నుండి I రాజుల నుండి బోధింపబడినది. వ్యక్తిగతంగా నేనెప్పుడు మర్చిపోను డాక్టర్ యం. ఆర్. డిహాను బోధించిన గొలుసు ప్రసంగాలు యోహేజ్కెలు 37 నుండి 39 పై. నేను ఇంకా విన్నాను రికార్డు చేయబడిన భాగము డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ గారి ఐదు గంటల ప్రసంగము, "బైబిలు అంతటిలో వేశ్య దారపు కొనసాగింపు," అది 1961 లో, టెక్సాస్, గొప్ప మొదటి డాలస్ సంఘములో, నూతన సంవత్సర సందర్భముగా బోధింపబడినది. మీకు ఐదు గంటల సమయమంటే, మీరు రికార్డు చేసినది www.wacriswell.org. ద్వారా వినవచ్చు. ఆసక్తివంతపు ప్రసంగములో సగమునకు పైగా పూర్తి పాత నిబంధన గ్రంధము వివరణ! పది సంవత్సరాలు డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ గారి ప్రసంగాలు విన్నాను, ఆయన రేడియోలో పాత నిబంధన గ్రంధము అంతటిపై బోధిస్తున్నప్పుడు. ఈ గొప్ప దైవ జనుల నుండి నేను నేర్చుకున్నాను పాత నిబంధన గ్రంధమును నమ్మాలి ప్రేమించాలి అనే విషయము. పాత నిబంధన గ్రంథములోని సుమారు ప్రతీ పేజీలోను యేసు క్రీస్తు గూర్చి ముందుగా చెప్పబడిందనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. కొన్నిసార్లు కచ్చితమైన పదాల ద్వారా ఆయనను గూర్చి ముందుగా తెలియ పరచబడింది, ఎలా అంటే, "ఆలకించుడి, కన్యక గర్భవతియై, కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును" (యెషయా 7:14). వేరే సమయంలో ఆయన పటాల ద్వారా రకాల ద్వారా మాట్లాడబడ్డాడు. ఈ ఉదయాన మనము చూచినట్లు, రకము ఒక వ్యక్తీ, స్థలము లేక వస్తువు పాత నిబంధనలో ఒక వ్యక్తిని చిత్రీకరిస్తుంది, స్తలాన్ని గాని వస్తువును గాని నూతన నిబంధన గ్రంధములో. ఆదికాండము 22 వ అధ్యాయము దేవుడు తండ్రి, కుమారుడైన క్రీస్తు విషయంలో చాల గొప్పది. మీ బైబిలులో అక్కడకు తిప్పండి. స్కోఫీల్ద్ స్టడీ బైబిలులో ఇది 32 మరియు 33 వ పేజీలలో ఉంది. ఈ ప్రసంగము అంతటిలో అక్కడ మీ బైబిలు తెరచి పెట్టుకోండి. ఆదికాండము 22 పాత నిబంధన గ్రంధములో అతి గొప్ప క్రీస్తు పర పాఠ్యభాగము. కీర్తన 22 యెషయా 53 లలో, మనము మన పాపముల నిమిత్తము క్రీస్తు శ్రమలను గూర్చిన ప్రవచనమును గూర్చి చదువుతాము. కాని ఆదికాండము 22 అధ్యాయములో మనము తేటగా నేర్చుకుంటాము యేసు క్రీస్తు ప్రత్యామ్నాయ బలియాగము అని. ఇంకా ఇంకొక చిత్ర పాట మివ్వబడింది తండ్రియైన దేవుని గూర్చి పాపములో ఉన్న మానవుని గూర్చి. ఈ గొప్ప అధ్యాయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చదివాను, నేననుకుంటాను మనం సురక్షితంగా చెప్పవచ్చు అది అబ్రహమును ఒక విధమైన నిజ క్రైస్తవునిగా చిత్రీకరిస్తుంది, అది తన కుమారుడైన ఇస్సాకును, ఒక విధమైన క్రీస్తుగా చిత్రీకరిస్తుంది, ఇక్కడ ఉన్నాయి ఆ చిత్రాలు లేక రకాలు. I. మొదటిది, పాఠ్యభాగము క్రైస్తవులను పరీక్షించుటను చిత్రీకరిస్తుంది. ఆదికాండము 22:1, 2, చూడండి. "ఆ సంగతులు జరిగిన తరువాత, దేవుడు అబ్రహమును పరిశోధించెను, ఎట్లనగా, ఆయన అబ్రహమును పరిశోధించెను: ఎట్లనగా, ఆయన అన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను. ఆయన అన్నాడు, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని తీసుకో అనగా, నీవు ప్రేమించు, ఇస్సాకును తీసికొని, మోరీయా దేశమునకు వెళ్ళుము; అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించు మని చెప్పెను" (ఆదికాండము 22:1, 2). "పరీక్ష" అనే పదము చాల బలముగా అనువదింపబడినది. ఎన్ఎఎస్ వి (NASV) లో "పరీక్షింపబడ్డాడు" అని అనువదింపబడింది. డాక్టర్ రైరీ అన్నాడు, "దేవుడు కీడు విషయమై శోధింపబడనేరదు (యాకోబు 1:13), కాని...ఆయన పరీక్షిస్తాడు, ప్రయత్నిస్తాడు, రుజువు చేస్తాడు, అబ్రహాము విషయములో వలే" (రియా పఠన బైబిలు; గమనిక ఆదికాండము 22:1). చాల సంవత్సరాల క్రితం ఎన్ఎఎస్ వి (NASV) కి నిక్కచ్చి అనువాదము చేసినందుకు నేను తీవ్రంగా గద్దింపబడడం నాకు గుర్తుంది, డాక్టర్ రైరీ సరైన వివరణ చెప్పినందుకు కూడ. కాని అప్పుడు నేను సరియే, ఈరాత్రి కూడ సరియే, యాభై సంవత్సరాల తరువాత. యాకోబు 1:13 మనకు చెప్తుంది దేవుడు మనలను పాపము చేయడానికి శోదించదు. కాని ఆదికాండము 22:1 మనకు చూపిస్తుంది దేవుడు మన క్రైస్తవ జీవితంలో మనలను పరీక్షిస్తాడు. ఇక్కడ, అబ్రహాము, మన అందరమూ పరీక్షింపబడినట్లు, పరీక్షింపబడిన ఒక విధమైన క్రైస్తవుడు. స్కోఫీల్ద్ గమనిక సరిగ్గా చెప్తుంది, "అబ్రహాము ఆత్మీయ అనుభవములో నాలుగు గొప్ప క్లిష్ట పరిస్థితులు కనిపిస్తాయి, అందులో ప్రతి దానిలో కూడ సహజంగా అతి ప్రియముగా అనిపించేది త్యాగము చేయడం ఇమిడి ఉంది." అవి ఏమంటే, 1. అబ్రహాము తన దేశమును తన బంధువులను విడిచి పెట్టాల్సి వచ్చింది (ఆదికాండము 12:1). నేను ఒప్పింప బడ్డాను అబ్రహాము రక్షింపబడి ఉండేవాడు కాదు ఒకవేళ అతడు ఈ విషయంలో దేవునికి లోబడకపోతే. చాలామంది గొప్ప వారు (ప్రత్యేకంగా యవనస్తులు) రక్షణ అనుభవము పొందుకోలేరు ఎందుకంటే వారు తమ లోకపర స్నేహితులను విడిచి పెట్టలేరు కాబట్టి. వారితోనే ఉంటారు –అలా వారు ఎన్నటికి రక్షింప బడలేరు. 2. అబ్రహాము తన మేనల్లుడు లోతును, ఎంతో సన్నిహితుడు, వారసుడు అయిన వానిని విడిచి పెట్టాల్సి వచ్చింది, ఆదికాండము 13:1-8. 3. అబ్రహాము తన ఇంకొక కుమారుడైన, ఇస్మాయేలును గూర్చిన ప్రణాళికను విడిచి పెట్టాల్సి వచ్చింది, ఆదికాండము 17:17, 18. 4. అబ్రహాము తన హృదయపు లోతులలో నుండి ప్రేమించిన తన కుమారుని విడిచి పెట్టాల్సి వచ్చింది, ఆదికాండము 22:1, 2. "అప్పుడాయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు, ఇస్సానుకు తీసుకొని, మోరీయా దేశానికి వెళ్ళుము; అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని సమర్పించు అని చెప్పెను" (ఆదికాండము 22:2). ఇస్సాకును విడిచిపెట్టు! ఇస్సాకును విడిచిపెట్టు! ఇస్సాకును విడిచిపెట్టు! ఎందుకు, అబ్రహాము ఈ అబ్బాయి కొరకు తన జీవిత కాలమంతా కనిపెట్టాడు! ఇప్పుడు దేవుడు చెప్తున్నారు తనను దహన బలిగా అర్పింప మని! అది పరీక్ష అంటే! దేవుడు నిన్ను అడుగుచున్నాడు, "నా కొరకు నీవు ఏమి విడిచి పెడతావు?" నేను ఒక విదేశీ మిస్సెనరీగా ఉండాలనుకున్నాను. అది దేవుడు తొలగించాడు. 1,000 మంది హాజరయ్యే గుడిని నిర్మించాను, దేవుడు దానిని తీసివేసాడు. మార్గము సరాళముగా ఇరుకుగా ఉన్నట్టు అనిపించినప్పటికినీ, నీదంతా బలిపీఠముపై అర్పింప బడిందా? నిజ గొప్ప క్రైస్తవులంతా చరిత్రలో వారి ప్రణాలికలను నిరీక్షణలను విడిచి పెట్టాల్సి వచ్చింది. వాళ్ళంతా దేవుని సంతోష పరచడానికి త్యాగాలు చెయ్యాల్సి వచ్చింది. జాన్ క్రిసోస్టం సామ్రాజ్యకురాలు యుడో క్సియాచే బహిష్కరింప బడ్డాడు. యోహాను తప్ప మిగిలిన అపోస్తలులందరూ ఉరి తీయబడ్డారు. క్రీస్తును నిరాకరించకుండా భయంకరమైన చావులు చవి చూసారు. ఆదిమ క్రైస్తవులు భయంకర బోనులలో పడ ద్రోయబడి సింహముల చేత ఎలుగు బంట్లు చేత పరిహసించే ప్రజల సమక్షంలో ముక్కలు ముక్కలుగా చీల్చబడ్డారు. దనాజిస్ డయాట్రిక్ బోన్ హాయిఫర్ ను పియానో వైరులతో మెడకు ఉరివేసాడు జర్మనీ పరిపాలకులచే విడుదల చేయబడే కొన్ని రోజుల ముందు. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ విమర్శింపబడి బహిష్కరింప బడ్డారు బిల్లీ గ్రేహం కూటముల "నిర్నయత్వము" సమర్దించనందుకు. డాక్టర్ హారొల్ద్ లిండ్ సెల్ దాడి చేయబడి బహిష్కరింపబడ్డాడు "బైబిలు కొరకు పోరాటం" వ్రాసినందుకు, సెమినరీలలో స్వతంత్ర త్వమును బహిర్గతము చేసినందుకు. డాక్టర్ బిల్ పోవెల్ ఒంటరిగా ఏకాంతంగా చనిపోయాడు, దక్షిణ బాప్టిస్టు సెమినరీలలో బైబిలుపై దాడిని ప్రచురించినందుకు. వేలాది మంది క్రైస్తవులు ఇప్పుడు ఆధునిక ముస్లీములచే శిరచ్చేధనము చేయబడు చున్నారు. అబ్రహాము తన కుమారుడైన, ఇస్సాకును తనకు ఇవ్వడానికి 100 సంవత్సరాలు కనిపెట్టాడు. అప్పుడు దేవుడు అతని పరీక్షించాడు తన ఎంతగానో ప్రేమిస్తున్న తన కుమారుని తీసుకొని వెళ్లి, తనను చంపి తనను మోరియా పర్వతముపై దహన బలిగా అర్పింపమన్నాడు. ప్రతి మంచి క్రైస్తవుడు తనకు ప్రియమైనది అనుకున్న దాని వదులుకుంటాడు, లేకపోతే దేవుడు పంపించే పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడు. ప్రతీ మంచి క్రైస్తవునికి తెలుసు శ్రీమతి హేరిస్ ఈ క్రింది పదాలను అర్ధ పూరితంగా వ్రాసిందని, మార్గము సరాళముగా ఇరుకుగా ఉన్నట్టు అనిపించినప్పటికినీ, వారందరికీ తెలుసు హాఫ్ మాన్ గారి భావమేంటో చొచ్చుకుపోయే ప్రశ్న ఆయన అడిగేటప్పుడు, నీదంతా బలి పీఠముపై అర్పింపబడిందా? II. రెండవది, అబ్రహాము తండ్రి దేవుని చిత్రీకరిస్తున్నాడు. ఒక రకము కానప్పటికినీ, అబ్రహాము తండ్రి దేవుని తప్పక చిత్రీకరిస్తున్నాడు, ఆయన తన అద్వితీయ కుమారుని శ్రమ పడడానికి సిలువపై మరణించడానికి పంపించాడు. తప్పకుండా ఆదికాండము 22:2 తండ్రి దేవుని హృదయ చిత్రాన్ని మనకు ఇస్తుంది. ఆయన తన కుమారుని, ప్రేమించిన తనని, కల్వరి కొండకు తీసుకెళ్తాడు, అది కూడ మోరియా పర్వతము లాంటిదే, ఆయన అక్కడ తనను మానవాళి పాప ప్రాయాశ్చిత్తము నిమిత్తము అర్పించాడు. ఆదికాండము 22:9 చూడండి, రెండవ భాగము. అబ్రహాము “ఇస్సాకును బంధించి, చెక్కపై ఉన్న బలి పీఠముపై ఉంచాడు." పేజీ దిగువన స్కోఫీల్డ్ గమనిక చెప్తుంది, "అబ్రహాము, తండ్రి తరగతి వాడు, తన ‘స్వంత కుమారునితో పాటు, సమస్తమును అనుగ్రహించెను’ [రోమా 8:32]." యోహాను 3:16 విన్నామా మనము దానిని గూర్చి ఎక్కువగా తలంచుట లేదని? "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను..." (యోహాను 3:16). యోహాను 3:16 ను గూర్చి ఆలోచించండి ఆదికాండము 22:2 ను చూస్తూ, "నీకు ఒక్కడైయున్న, నీ కుమారుని... నీవు ప్రేమించు వానిని... తీసుకొని అక్కడ దహన బలిగా అర్పించుము" (ఆదికాండము 22:2). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "ఆఖరి మూడు గంటలలో, సిలువ బలి పీఠమైంది దానిపై లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అర్పింపబడింది. ఆ వ్యవహారము తండ్రి కుమారుల మధ్య సిలువపై జరిగింది...చిత్రపటము అదే ఇక్కడ ఉంది: అది అబ్రహాము ఇస్సాకును మాత్రమే" (బైబిలు ద్వారా, ప్రతి 1, పేజీ 91). డాక్టర్ యం. ఆర్. డిహాన్ అన్నాడు, "తండ్రియైన [దేవుని] మధ్య ఆయన కుమారుడు యేసు క్రీస్తు మధ్య ఆఖరి కొన్ని గంటల వేదనలో జరిగినది మనము ఎన్నటికి గ్రహింపజాలము. తండ్రి కుమారుల మధ్య వ్యవహారము అది. మనవ నేత్రాలు ఆ దృశ్యాన్ని చూడలేదు [ఎందుకంటే ఆ ప్రాంతమంతా చీకటి కమ్మియుంది]...ఆఖరి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఆఖరి అర్పణ జరిగినప్పుడు, దేవుడు [చీకటిని పంపించాడు]...అంతిమ ఆవేదనా కేక వెలువడే వరకు [సిలువపై నుండి యేసు యొక్క], ‘నా దేవా, నా దేవా, నా చేయి ఎలా విడిచితివి?’" (M. R. DeHaan, M.D., Portraits of Christ in Genesis, Zondervan Publishing House, 1966, p. 137). తప్పక అబ్రహాము హృదయము ఇస్సాకు మరణము సమీపిస్తున్నప్పుడు బ్రద్దలయింది. అలాగే, తప్పకుండా, దేవుని హృదయము కూడ బ్రద్దలయింది ఆయన తన కుమారుడు యేసును విడిచి పెట్టినప్పుడు చీకటిలో ఆయన కేక వేయుచున్నప్పుడు, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను" – నిన్ను నన్న పాపము నుండి నరకము నుండి రక్షించడానికి. తప్పకుండా దేవుడు ఆయన కుమారుడు సిలువపై మోర పెట్టుట విన్నాడు, "నా దేవా, నా దేవా , నీవెలా నా చెయ్యి విడిచితివి?" తప్పనిసరిగా తండ్రి దేవుని కన్నీళ్లు కారాయి ఆయన తన ముఖమును ఒంటరిగా సిలువపై మన పాపములను భరిస్తున్న యేసు నుండి త్రిప్పుకొన్నప్పుడు! III. మూడవది, ఇస్సాకు యేసును చిత్రీకరిస్తున్నాడు. స్కోఫీల్ద్ గమనిక చెప్పుతుంది, "ఇస్సాకు, క్రీస్తు వంటివాడు, ‘మరణ పర్యంతము విధేయుడుగా ఉన్నాడు’ (ఫిలిప్పీయులకు 2:5-8)." "మరియు ఆయన ఆకారమందు మనష్యునిగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా, విధేయత చూపిన వాడై తన్ను తానూ తగ్గించుకొనెను" (ఫిలిప్పీయులకు 2:8). ఇప్పుడు 6వ వచనము చూడండి, "దహన బలికి కట్టెలు తీసుకొని తనకుమారుడగు, ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను" (ఆదికాండము 22:6). ఇది క్రీస్తు తన సిలువను మోయుటను చిత్రీకరిస్తుంది, "ఆయన [యేసు] తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వచ్చెను... హెబ్రీ భాషలో దానిని గొల్గొతా అని పేరు: అక్కడ ఆయనను సిలువ వేసిరి" (యోహాను 19:17, 18). ఇప్పుడు 7వ మరియు 8వ వచనాలు చూడండి, "ఇస్సాకు తన తండ్రియైన అబ్రహముతో, నా తండ్రి, అని పిలిచెను: అందుకతడు, ఏమి, నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పులు కట్టెలు ఉన్నవి: కాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా? అబ్రహాము, నా కుమారుడుగా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను: కావున వారు ఇద్దరు కలిసి వెళ్ళారు" (ఆదికాండము 22:7, 8). ఇస్సాకు చెప్తున్నాడు, "నిప్పులను కట్టెలు ఉన్నవి: గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగెను?" అబ్రహాము చెప్తాడు, "నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును." ఇప్పుడు 9 వ వచనము చూడండి, "ఆలాగు వారిద్దరూ కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు; అబ్రహాము అక్కడ, బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, తన కుమారుడగు ఇస్సాకును బంధించి, ఆ పీఠముపై నున్న కట్టెల మీద ఉంచెను" (ఆదికాండము 22:9). ఇది యేసును చూపిస్తుంది, యెషయా మనకు చెప్పినట్టు, "వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట, గోర్రేయు మౌనముగా నుండునట్లు, అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7). డాక్టర్ మెక్ గీ చెప్పాడు ఇస్సాకు సుమారు 33 సంవత్సరాల ప్రాయము వాడు. ఆదికాండములోని విషయాలన్నీ జాగ్రత్తగా అధ్యయనము చేసాక అతడు ఈ సంఖ్య కనుగొన్నాడు. ఇస్సాకు వినయంగా తన తండ్రిని అనుమతించాడు తనను బంధించడానికి కట్టెలపై ఉంచడానికి. ఇప్పుడు 10 వ వచనము చూడండి, "అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుట, తన చెయ్యి చాచి కట్టి పట్టుకొనెను" (ఆదికాండము 22:10). అతడు చేస్తున్నది అబ్రహమునకు అర్ధము కానప్పటికినీ, చాల కాలము క్రిందట అతడు నేర్చుకున్నాడు దేవుడు తనతో చెప్పిన మాటకు విధేయుడు అవడానికి. మరియు, అతడు ఇలా చేయడం ద్వారా, పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. వచనము 12 చూడండి, "అప్పుడు, ఆయన ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము: నీకు ఒక్కడై యున్న నీ కుమారుని నా కియ్య వెనుదీయ లేదు గనుక, నీవు దేవునికి భయపడువాడవని, ఇందువలన నాకు కనబడుచున్నది అనెను" (ఆదికాండము 22:12). డాక్టర్ మెక్ గీ అన్నాడు, "దేవుడు అబ్రహమును పరీక్షించాడు. నేను నమ్ముతాను దేవుడు పిలిచే ప్రతి వ్యక్తి...దేవుడు వాడుకోబోయే ఏ వ్యక్తి అయినా పరీక్షింపబడతాడు...మన విశ్వాసము బలపడడానికి, మనలను స్థిర పరచడానికి, ఆయన సేవించే వారిగా మనలను చెయ్యడానికి" (ఐబిఐడి., గమనిక ఆదికాండము 22:12). మళ్ళీ శ్రీమతి హేరిస్ పాటను వినండి, మార్గము సరళముగా ఇరుకుగా ఉన్నట్టు అనిపించినప్పటికినీ, ఆమె ఇంకా చెప్తుంది, అప్పుడు దేవుని అగ్ని బలి పీఠముపై నేననుకుంటాను అది ఆమె సాక్ష్యము. తానూ సాధించిందంతా తుడిచి పెట్టబడింది. ఆమె ఆశయాలు, ప్రణాళికలు మరియు ఆశలు తన పాదాల వద్ద బూడిదయ్యాయి. "అప్పుడు" – ఓ, అది బాగుంది! "అప్పుడు దేవుని అగ్ని బలి పీఠముపై నా హృదయము అగ్నితో దహింపబడింది; ఆయనను స్తుతించ కుండా ఉండలేను! మహిమ, మహిమ ఆయన నామమునకే!" హాఫ్ మాన్ గారు చెప్పినట్టు, "నీవు ఆశీర్వదింప బడతావు నీకు సమాధానము మధుర విశ్రాంతి ఉంటుంది, నీవు ఆయనకు నీ శరీరమును ఆత్మను అర్పించినప్పుడు." నమ్మకస్తులైన వారిని గూర్చి ఆలోచించండి వారు ఆర్ధిక పతనాన్ని నుండి మన సంఘాన్ని కాపాడారు. ప్రతి ఒక్క మా దేవుడు పంపిన పరీక్షల ద్వారా వెళ్ళారు. ఇతరులు సంఘ విభజనప్పుడు పారిపోయారు. నమ్మకస్తులు నిలిచారు, నిలిచి పరీక్షలో ఉత్తీర్ణులగుట కష్టమైనప్పటికినీ. శ్రీమతి సాలాజార్ కు ఎంత కష్టమైనదో నాకు గుర్తుంది. ప్రుధొమ్ గారికి ఎంత కష్టమైనదో నాకు గుర్తుంది. నా భార్యకు, డాక్టర్ చాన్ కు, డాక్టర్ కాగన్ కు, శ్రీమతి కాగన్ కు, శ్రీమతి బిబౌట్ కు, ఇతరులకు ఎంత కష్టం అయిందో. వారు చెప్పవచ్చు, "నేను సాధించినదంతా తుడిచి పెట్టబడింది; నా ఆశయాలు, ప్రణాళికలు ఆశలు నా పాదాల వద్ద బూడిదయ్యాయి." అదే జరిగింది తండ్రి అబ్రహముకు, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన తన కుమారుని వధించుటకు చేయి ఎత్తినప్పుడు! ఆయన ఆశయాలు, ప్రణాళికలు ఆశలు తన పాదాల వద్ద బూడిదయ్యాయి! ఇలా అతడు ఇతరులు పరీక్షలో ఉత్తీర్ణు లయ్యారు. శ్రీమతి సలాజార్ ఎంతో పరిశుద్దురాలూ మీకు ఆశ్చర్యము కలుగుతుందా? ఆమె ఆశయాలు, ప్రణాళికలు ఆశలు తన పాదాల వద్ద బూడిదయ్యాయి! బైబిలు పఠించుట ద్వారా నీవు గొప్ప క్రైస్తవుడవు కాలేవు. నీవు గొప్ప క్రైస్తవుడవవు తావు నీ ఆశయాలను, ప్రణాలికలను ఆశలను దేవునికి అర్పించుట ద్వారా! అబ్రహాములా నీవు గొప్ప క్రైస్తవుడవుతావు! వేరే మార్గము లేదు! దయచేసి లేచి నిలబడి 4 వ పాట పాడండి, "యేసు, నా సిలువ తీసివేయబడింది," యేసు, నా సిలువ తొలగింపబడింది, సమస్తము విడిచి నిన్ను వెంబడిస్తాను; మీరు కూర్చోండి. ఆ, ఈ విధంగా నేను ప్రసంగాన్ని సిద్ధ పర్చుకోలేదు! ఈ ప్రసంగము రాసేముందు ఒక అంతమైన శీర్షిక రాస్తున్నాను. అది శుక్ర వారమంతా తీసుకుంది. చివరిలో, నా అందమైన శీర్షిక "తుడిచి పెట్టబడింది, నా పాదాల వద్ద బూడిదయింది!" అది నిలుస్తుంది! అయినను నేను నమ్ముతాను ఇది అబ్రహాము ఇస్సాకుల సందేశము ఇస్తుంది, బహుశా ఇంకా బాగా ఒకవేళ నా అందమైన ప్రసంగ శీర్షికను నేను వెంబడించి ఉంటే! డాక్టర్ డిహాన్ అన్నాడు, "ఇక్కడ వ్రాత మార్పు ఉంది మనకు రెండుసార్లు వ్రాయబడిన దానికి ఉదాహరణ ఉంది. ఇస్సాకుల ఒక విధమైన క్రీస్తు వంటివాడు ఇప్పటి వరకు ఇంకా ముందుకు కాదు, ఎందుకంటే ఇస్సాకు [ఒకపాపి] అతనికి ప్రత్యామ్నాయ వ్యక్తి కావాలి అతనికి బదులుగా వధింపబడడానికి. కనుక పఠము ఇస్సాకును క్రీస్తుగా చూపించే చిత్రము నుండి, ఇస్సాకుకు బదులుగా పోట్టేలుకు మార్చబడింది" (ఐబిఐడి., పేజి 141). ఇప్పుడు వచనము 13 చూడుడి, "అప్పుడు అబ్రహాము కన్నులెత్తి, చూడగా, పొదలో కొమ్ములు తగులుకొని యున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను: అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని, తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను" (ఆదికాండము 22:13). మాట గమనించండి, "తన కుమారుని [స్థానంలో]." ఇది క్రీస్తు ప్రత్యామ్నాయ మరణము పాపుల స్థానంలో, అనే చిత్రమును చూపిస్తుంది. ఇస్సాకు స్థానంలో పొట్టేలు వధింపబడడం ఇది ఒక పరిపూర్ణ చిత్రము యేసు నీ స్థానంలో బలియగుట, సిలువపై నీ పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి, యేసు, "ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనేను [సిలువపై]," I పేతురు 2:24. నేను మిమ్మును యేసును విశ్వసించాలని అడుగుచున్నాను. ఆయనను నమ్మిన క్షణమే, సిలువపై ఆయన మరణము నీ పాప ప్రాయశ్చిత్తము పూర్తిగా చెల్లిస్తుంది. సిలువపై ఆయన కార్చిన రక్తము సమస్త పాపముల నుండి నిన్ను శుద్ధి చేస్తుంది – నీ హృదయమంతటితో నీవు ఆయనను నమ్మిన క్షణాన. కేవలము ఆయనను నమ్మండి. కేవలము నమ్మండి. ఇప్పుడే ఆయనను నమ్మండి. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: ఆదికాండము 22:1-14. |
ద అవుట్ లైన్ ఆఫ్ అబ్రహాము ఇస్సాకుల నుండి జీవిత పాఠాలు (ఆదికాండముపై 85 వ #ప్రసంగము) డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే "అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా: యెషయా సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో, తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను" (లూకా 24:25, 27). (యెషయా 7:14)
I. మొదటిది, పాఠ్యభాగము క్రైస్తవులను పరీక్షించుటను చిత్రీకరిస్తుంది, ఆదికాండము 22:1, 2; యాకోబు 1:13; ఆదికాండము 12:1; 13:1-8; 17:17,
II. రెండవది, అబ్రహాము తండ్రి దేవుని చిత్రీకరిస్తున్నాడు, ఆదికాండము 22:9;
III. మూడవది, ఇస్సాకు యేసును చిత్రీకరిస్తున్నాడు, ఫిలిప్పీయులకు 2:8; ఆదికాండము 22:6; యోహాను 19:17, 18; ఆదికాండము 22:7, 8, 9;
|