ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మీ పూర్తి దుర్మార్గతిYOUR TOTAL DEPRAVITY డాక్టర్ సి. ఎల్. కాగన్ గారిచే బోదింపబడిన ప్రసంగము బాష్టిష్టు టేబర్ నేకల్ ఆఫ్ లాస్ ఏంజిల్ నందు "అందరును పాపమునకు లోనైయున్నారు" (రోమా 3:9). |
"అందరును పాపమునకు లోనైయున్నారు" (రోమా 3:9). మానవాళి "పాపము క్రింద" ఉంది. బైబిలు చాలాసార్లు ఈ విషయము చెప్తుంది. అది చెప్తుంది మనము "పాపములలో చచ్చినవారమని" (ఎఫెస్సీయులకు 2:5). మనము "అపరాధములచేతను పాపములచేతను చచ్చినవారము" (ఎఫెస్సీయులకు 2:1). అపోస్కలుడైన పౌలు వ్రాసాడు, "పాపము...నాలో నివసించుచున్నది" (రోమా 7:20). మనమందరము భయంకర స్థితిలో ఉన్నాము. నీవు భయంకర స్థితిలో ఉన్నారు. ఈ స్థితినే పూర్తి దుర్మర్గత. అని పిలుస్తారు ప్రతి ఒక్కడు పూర్తిగా దుర్మార్గుడు అయ్యాడు. నీవు పూర్తిగా దుర్మర్గుడవు. ఈ రాత్రి మనము ఏది పూర్తి దుర్మర్గత కాదో, ఏది పూర్తి దుర్మర్గాతో చూద్దాం. I. మొదటిది, ఏది పూర్తి దుర్మర్గత కాదు. నీవు చేస్తున్న ప్రతి పాపము పూర్తిగా దుర్మర్గాతలాంచేది కాదు. తప్పు చేయకుండా చాలా – చాలా పాపాలు చేసావు, అది భయంకరము. బైబిలు చెప్తుంది, "(అజ్ఞాతిక్రమమే) పాపము" (I యోహాను ౩:4). దేవుని న్యాయశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, అది పాపము. ఒక పని చేయవద్దని చెప్తే అది నీవు చేస్తే, నీవు పాపము చేసినట్టే. బైబిలు చెప్తుంది, "నీవు పోరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు (అబద్దమాడకూడదు)" ( నిర్గమకాండము 20:16). అబద్దమాడకూడదని నీకు తెలుసు, అయినా చెప్తావు. దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నావు. బైబిలు చెప్తుంది, "దొంగిలకుడదా" (నిర్గమకాండము 20:15). నీవు దొంగిలించి నప్పుడు నీవు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినట్టే. ఒక పని చేయమని దేవుడు చెప్తే నువు చేయకపోతే, అది పాపము. యోహొవా అన్నాడు, "నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను" (మత్తయి 22:౩7). అయిననూ చాలా సంవత్సరాలు దేవుడు ప్రాముఖ్యం కాదన్నట్టుగా జీవించావు. ప్రతి సారి గుడి మానేసావు, ఆ ఆజ్ఞను ఉల్లంగించావు. నీవు పాపము చేసావు. బైబిలు చెప్తుంది, "నీవు వ్యభిచారించాకూడదు" (నిర్గమకాండము 20 :14). యెహోవా చెప్పాడు, "నీవు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినా యెడల అప్పుడే నీ హృదయం లో ఆమెతో పాపము చేసినట్టే" (మత్తయి 5: 28). కంప్యూటర్ లో అశ్లీల చిత్రాలు చూస్తున్నప్పుడల్లా, ఆ భయంకర పాపము చేసినట్టే. బైబిలు చెప్తుంది, "నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము" (నిర్గమకాండము 20:12). అది చెప్పడం తీరా వారు క్రైస్తవులైతేనే గౌరవించమని, ప్రతిదానిలో సరిగా ఉంటేనే – చెప్తుంది గౌరవించాలి అంతే. నీవు ఆజ్ఞను అతిక్రమించినప్పుడల్లా, పాపము చేసినట్టే. మీలో కొందరు ఈ రాత్రికి వాస్తవానికి నీ తండ్రినుంచి తల్లిని గాని అసహ్యించుకుంటున్నారు. అది భయంకర పాపము. నీకు సుధీర్ఘ, భయంకర పాపాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఆఖరి తీర్పులో నిన్ను ఖండిస్తుంది. బైబిలు చెప్తుంది నీవు చేస్తున్న ప్రతీదీ, మాట్లాడేది అలోచిన్చేదీ దేవుని పుటలలో వ్రాయబడుతాయి – దేవుని "పుస్తకాలలో." ఆఖరి తీర్పులో పృతులు గ్రందములలో వ్రాయబడిన, "వాటి [వాటి] ప్రకారము తీర్పు తీర్చ బడుదురు" (ప్రకటన 20:12). దేవుని ముందు నిలబడుతావు. అందరి ముందు నీ జీవితచరిత్ర చదవబడుతుంది. బైబులు చెప్తుంది, "పిరికివరును [జనాలు ఏమనుకుంటారో అని భయపడేవారు], ఆ విశ్వాసులును అసత్యమును, నరహన్థకులును , వ్యభిచారులును, [గ్రీకులో పోర్సోస్, అశ్లీల చిత్రాలు చూసేవారు, వివాహేతర సంభందము], మంత్రికులును, విగ్రహాదీకులును, అబద్ధీకులందరును [అబద్ధాలు చెప్పే ప్రతి ఒక్కరు – నీవు ఎప్పుడైనా అబద్ధమాడావా?] అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు" (ప్రకటన 21:8). నిన్ను బట్టి నీవే సిగ్గు పడతావు. అగ్ని గుండములో పడవేయబడతావు. నీవు ఇతరుల వలే మంచి వాడవు అనడానికి అది నీకు సహాయపడదు. నీవు "చక్కని వ్యక్తివి" అని చెప్పడానికి అది సహయము చేయదు. నీకు తెలుసా నీవు పాపివని. అది దేవునికి కూడ తెలుసు. వేరేవారు నీ కంటే అధ్వానముగా ఉన్నారని చెప్పడానికి సహాయపడదు. మీరిద్దరూ అగ్ని గుండములో పడవేయబడతారు. కొన్ని పాపాలు విడిచి పెట్టడానికి గాని మంచి వ్యక్తిగా ఉండడానికి గాని అది నీకు సహాయపడదు. గతము నుండి నీ పాపాలు దేవుని పుస్తకాలలో వ్రాయబడ్డాయి. నీవు మళ్ళీ పాపమూ చెయ్యక పోయినా, నీవు ఇప్పటికే చేసిన దానిని బట్టి నీవు అగ్ని గుండములో పడవేయబడతావు. నీవు ఇంకా చెడ్డ వాడివై ఉండేవాడిని అని చెప్పడానికి అది సహాయపడదు. నీవు ఇప్పటికే చెడ్డవాడవు. నీవు భయంకర శ్రమలో ఉన్నావు, నీవు తప్పించు కోడానికి ఏమి చెయ్యలేవు. నీ పాపాల చరిత్ర భయంకరము. కాని అది "పూర్తీ దుర్మార్గత" కాదు. నీ పాపాల చరిత్ర నీ పాప స్వభావ భయంకరత్వానికి పోల్చబడలేదు. నీ పాపపు స్వభావము నుండి నీవు చేస్తున్న చెడ్డ పనులు వస్తున్నాయి. యేసు అన్నాడు, "లోపల నుండి అనగా, మనష్యుల హృదయాలలో నుండి, దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కాపరి కారమును, మత్సరమును, వేశాదారణము, అహంభావామును, అవివేకమును వచ్చును: ఈ చెడ్డ వన్నియు లోపలి నుండియే బయలు వెళ్లి మనష్యుని అపవిత్ర పరచుమని ఆయన చెప్పెను" (మార్కు 7:21-23). పదము "లోపలి నుండి" అంటే "లోపల." ఈ వచనము నీ లోపలి స్థితి నుండి మాట్లాడుతుంది. నీవు కేవలము చెడ్డ పనులు చెయ్యవు, నీవు చెడ్డవాడు. నీవు చెడ్డవాడవు కాబట్టి చెడ్డ పనులు చేస్తావు. నీవు కేవలము పాపము చెయ్యవు, నీవు పాపివి. నీవు కేవలము పాపపు పనులు చేస్తావు ఎందుకంటే నీవు పాపివి. నీవేమిటో దాని నుండి నీవు చేసిన పనులు బయటికి వస్తాయి. ఇది రెండవ విషయానికి మనలను తీసుకెళ్తుంది. II. రెండవది, పూర్తి దుర్మార్గత అంటే ఏమిటి. పూర్తి దుర్మార్గత నీవు నడుచు మార్గమును సూచిస్తుంది. దాని అర్ధము నీవు పాపివి నీ లోపల కల్మషము నిండిన వాడవు. అందుకే నీవు చేసినవి చేసావు. నీ స్వభావము నుండి అది వచ్చింది. బైబిలు చెప్తుంది మీరు "సహజంగా ఉగ్రత పిల్లలము" (ఎఫెస్సీయులకు 2:3). నీవు అలా ఉన్నావు. నీ మొదటి తండ్రి ఆదాము నుండి ఈ స్వభావము సంక్రమించింది. అతడు పాపమూ చేసాడు, పూర్తి మానవ జాతికి అందించాడా, నీ తల్లిదండ్రులకు తరువాత నీకు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, "నేను పాపములో పుట్టినవాడను; పాపములోనే నాతల్లి నన్ను గర్భము ధరించెను" (కీర్తనలు 51:5). ఇప్పుడు నీవు పాపివి. నీవు అంతే. నీవు అలాగే ఉండావు. నీవు అలాగే ఉండగలవు. పూర్తి దుర్మార్గత అంటే నీవు ఎన్నటికి పాప స్థితిలో ఉన్నావు నీవు బయట పడలేదు. బైబిలు చెప్తుంది మీరు "పాపములో చచ్చినవారు" (ఎఫెస్సీయులకు 2:5). మీరు "అపరాధములొను పాపములోను చచ్చిన వారు." మన పాఠ్యభాగము చెప్తుంది నీవు "పాపమూ క్రింద ఉన్నావు" (రోమా 3:9). నీవు పాప బంధకాలలో ఉన్నావు. యేసు అన్నాడు, "పాపమూ చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు" [గ్రీకులో డాలస్, బానిస] పాపమునకు" (యోహాను 8:34). అపోస్తలుడైన పౌలు అన్నాడు నీవు "పాపమునకు సేవకుడు [బానిసలు]" (రోమా 6:20). నీవు దేవుని కుమారుడవు కాదు. నీవు దయ్యమునకు చెందిన వాడవు. నీవు "సాతాను ఉరిలో ఉన్నావు... తన ఇష్టము చొప్పున చెరపట్టబడ్డావు" (II తిమోతి 2:26). నీ హృదయములో, నీ కేంద్రములో, నీవు దేవుని శత్రువువి. బైబిలు అదే చెప్తుంది. అది చెప్తుంది, "శరీరాను సారమైన మనసు [మారనిది] దేవునికి విరోధమై యున్నది" (రోమా 8:7). అందుకే నీవు స్వార్ధ పరుడవు. అందుకే దేవుడు చెప్పేది తిరస్కరిస్తావు, నీలో ఉన్నది వేరేది చేయిస్తుంది. నీవు బయటకి గట్టిగా చెప్పునప్పటికి, లోపల నుండి తిరస్కరిస్తున్నావు, ఎందుకంటే నీవు దేవునికి విరోదివి. నీవు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. ఆత్మీయ విషయాలు నీకు అర్ధము కావు, నీవు ప్రయత్నించినా. బైబిలు చెప్తుంది, "ప్రకృతి సంబందియైన మనుష్యుడు దేవుని ఆత్మా విషయాలను అంగీకరింపడు: అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి: అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింప జాలడు" (I కోరిందీయులకు 2:14). అందుకే అడగడంలో అర్ధం లేదు, "నేను యేసును ఎలా నమ్ముతావు అని?" అది నీవు నేర్చుకోవలసిన విషయము కాదు! నీ ఆలోచనలు ఊహలు తప్పు. బైబిలు చెప్తుంది, "నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది" (ఆదికాండము 8:21). నీ తలంపులు చెడ్డవి, కూడ. నీ లోపల అలా ఉన్నావు, దానిని మార్చడానికి నీవేమి చెయ్యలేవు. నిన్ను నీవు మార్చుకోలేవు నిన్ను నీవు మంచివానిగా చేసుకోలేవు. బైబిలు చెప్తుంది అలా చెయ్యలేవని! అది చెప్తుంది నశించు వ్యక్తి "దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు" (రోమా 8:7). నీవు మంచిగా ఉండలేవు. నీవు ప్రయత్నించి విఫలుడయావు. మళ్ళీ మళ్ళీ విఫలుడయావు. నీవు ఎప్పటికి విఫలుడయావుతూనే ఉంటావు. నీ స్వభావాన్ని మార్చుకోలేవు – నీ లోపలి స్థితి. బైబిలు చెప్తుంది, "కూశ దేశస్థుడు తన ధర్మమును మార్చు కొనగాలడా, చిరుత పులి తన మచ్చలను మార్చుకొగలదా? మార్చుకోనగలిగితే కీడు చేయుటకు అలవాటు పడిన మీరును, మేలు చేయుట వల్ల పడును" (ఇర్మియా 13:23). నీ చర్మాన్ని మార్చుకోలేవు. చిరుత పులి తన మచ్చలను మార్చుకోలేవు. నీ చెడు స్వభావాన్ని బయట పడలేవు. యోబు అన్నాడు, "పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగినా ఎంత మేలు? అలాగున ఎవడును పుట్టనేరడు" (యోబు 14:4). అపవిత్రత నుండి పవిత్రతకు నిన్ను నీవుగా మార్చుకోలేవు. ప్రయత్నించు! నీవు త్వరలో గ్రహిస్తావు నీవు కల్మషము తోనే ఉన్నావని. ఒక ప్రశ్న అడగండి. మానవునిగా ఉండడం మానగలరా? మారగలరా, ఇక మానవ మాత్రునిగా ఉండనవసరము లేకుండా? మీ వల్ల కాదు! కాని మానవులు అంతా పాపులు! బైబిలు చెప్తుంది, "అందరు పాపమూ చేసారు" (రోమా 3:23). బైబిలు చెప్తుంది, "నీతిమంతుడు లేదు, ఒక్కడు, లేడు" (రోమా 3:10). మానవునిగా ఉండకుండా ఉండలేవు కాబట్టి, పాపిగా కూడ ఉండకుండా ఉండలేవు. నీ పాపపు దుర్మాగపు, స్వభావాన్ని నీవు మార్చుకోలేవు. నీలో నీకు నిరీక్షణ లేడు. దేవుని సంతోష పెట్టడానికి నీవు ఏమి చెయ్యలేవు. బైబిలు చాలా తేటగా చెప్తుంది. అది చెప్తుంది, "శరీర స్వభావము గలవారు దేవుని సంతోష పరచనేరదు" (రోమా 8:8). "శరీరంలో" నశించు వారిని సూచిస్తుంది. నీవు నశిస్తే, దేవుని సంతోష పెట్టడానికి ఏమి చెయ్యలేవు – ఆయన నీతో సంతోషించడానికి. నీ మంచి క్రియలు మతపర పనులు దేవుని సంతోష పెట్టనేరావు. బైబిలు చెప్తుంది, "మా నీతిక్రియలు అన్ని మురికి గుడ్డవలె ఆయెను" (యెషయా 64:6). దేవుని సంతోష పరచగలనని నీ వనుకోవచ్చు, లేక నీవనవచ్చు – కాని నీవు చెయ్యలేవని దేవుడు చెప్తున్నారు! దేవును ఒప్పు లేక తప్పు? దేవునితో మంచి ఉండడానికి నేర్చుకుంటే, ప్రయత్నిస్తే, దేవుడు తప్పు అని నీవు చెప్తున్నట్టు. నీవు మళ్ళీ మళ్ళీ విఫలుడవుతావు. దేవుని సంతోష పెట్టడానికి ఏమి చెయ్యలేవు. నిన్ను నీవు రక్షించు కోవడానికి ఏమి నేర్చుకోలేవు. మళ్ళీ, అందుకే అడగడంలో అర్ధం లేదు, "ఎలా నేను యేసును నమ్మగలను?" ఏదో నేర్చుకోవడం నీకు సహాయ పడదు. నేర్చుకోవడం నీ స్వభావాన్ని మార్చనేరదు. నీలాంటి నశించు వారితో యేసు అన్నాడు, "మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననెర కుండుట వలననే కదా" (యోహాను 8:43). మళ్ళీ, క్రీస్తు అన్నాడు, "దేవుని సంభందియైన వాడు దేవుని మాటలు వినును: మీరు దేవుని సంబంధులు కారు, కనుకనే మీరు వినరు" (యోహాను 8:47). నీవు నీ ప్రయత్నాల ద్వారా క్రీస్తు నోద్దకు రాలేవు ఆయనను నమ్మలేవు. యేసే అన్నాడు, "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించి తేనే గాని, ఎవడును నా యొద్దకు రాలేదు" (యోహాను 6:44). నేను చెప్పలేదు – యేసు క్రీస్తు చెప్పాడని! రక్షింపబడడానికి ప్రయత్నించవచ్చు – నీవు విఫలుడవుతావు. మంచి మాటలు నేర్చుకొన ప్రయత్నించవచ్చు. ఈ భావనను ఆ భావనను చూడవచ్చు – లేక ఎ భావన లేకుండా ఉండవచ్చు. ఎలాను అది పొందుకోలేవు. నీవు మార్చబడలేవు – ఎందుకంటే నిన్ను నీవు మార్చుకోలేవు కాబట్టి! నీవు మృతుడవు. నీవు లోపల దుస్టుడవు. నిన్ను నీవు ఎలా మార్చుకోగలవు? నీవు మార్చుకోలేవు. నశించు పాపిగా, "దేవుని విషయాలలో మృతుడవు" – పూర్తిగా పాప భూఇస్టమై నిరీక్షణ లేకుండా ఉన్నావు. రక్షణ పొంద సమర్ధత లేదు. నీ స్వంత మార్పు జరిగేలా ఏమి చెయ్యలేవు. నీవు దేవుని విషయంలో మృతుడవు. నీవు "పాపులలో చచ్చిన వాడవు." నీ పాప భూ ఇష్టతను గూర్చి ఆలోచింపాలనుకోవడం లేదు, కాని అది అక్కడే ఉంది. దేవుడు అది చూస్తున్నాడు, నీవు కావాలనుకున్నా లేకున్నా. దేవుడు నీ పాపమూ విషయాలలో కోపంగా ఉన్నాడు. నీ పాపముతో దేవుడు విసిగి పోయాడు. ఒక అమ్మాయి వ్రాసింది, "నాతొ నేను పూర్తిగా విసిగి పోయాను." నీవు కూడ అంతే. నీవు అలా కాకపొతే, అంతే సత్యానికి నీవు మేల్కోవడం లేదు. నీ జవాబు ఏమిటి? నీలో, జవాబు లేదు జవాబు ఉండదు అంతే! "యెహోవా యోద్దనే రక్షణ దొరుకును" (యోనా 2:9). నీవు క్రీస్తును కలిగియుండాలి! క్రీస్తు రక్తము మాత్రమే మీ పాపములన్నిటిని "[కడిగి శుద్ధి చేయును]" (I యోహాను 1:7). నీవు సమయాన్ని వ్యర్ధం చేసుకుంటే – నరకానికే వెళ్తావు. నీ ప్రశ్నలడగడం – నరకానికే తీసుకెళ్తుంది. నీ తిరగడం ఆశ్చర్య పాడడం ప్రయత్నించడం – నరకానికే తీసుకెళ్తుంది. నీకు నిరీక్షణ లేదు. నీకు క్రీస్తు కావాలి! నీకు ఆయన రక్తము కావాలి! దేవుని దయనీకు కావాలి క్రీస్తు నోద్దకు నిన్ను చేర్చడానికి. నిన్ను నీవు రక్షించుకోలేవు. నీకు క్రీస్తు కావాలి! యేసు అన్నాడు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6). అది నిజమా కాదా? నీవు అది నమ్ముతావా లేదా? యేసు అన్నాడు ఆయన ద్వారా క్రీస్తు ద్వారానే తప్ప – నీవు దేవుని దగ్గరకు రాలేదు! వేరే మార్గము లేదు, సత్యము లేదు, జీవము లేదు! మిగిలిన ప్రయత్నించి నీవు విఫలుడయ్యావు. అక్కడ ఏమి లేదు. నీకు క్రీస్తు అవసరము! క్రీస్తు! యేసు క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు రక్తము ద్వారా నీ పాపాలు కడుగబడాలి! రక్తము! రక్తము! రక్తము! నీకు క్రీస్తు కావాలి! క్రీస్తు! క్రీస్తు! ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ |
ద అవుట్ లైన్ ఆఫ్ మీ పూర్తి దుర్మార్గతి YOUR TOTAL DEPRAVITY డాక్టర్ సి. ఎల్. కాగన్ గారిచే "అందరును పాపమునకు లోనైయున్నారు" (రోమా 3:9). (ఎఫెస్సీయులకు 2:5, 1; రోమా 7:20) I. మొదటిది, ఏది పూర్తి దుర్మర్గత కాదు, I యోహాను 3:4; నిర్గమ కాండము 20:16, 15; మత్తయి 22:37; నిర్గమ కాండము 20:14; మత్తయి 5:28; నిర్గమ కాండము 20:12; ప్రకటన 20:12; 21:8; మార్కు 7:21-23.
II. రెండవది, పూర్తి దుర్మార్గత అంటే ఏమిటి, ఎఫెస్సీయులకు 2:3; కీర్తనలు 51:5; ఎఫెస్సీయులకు 2:5; రోమా 3:9; యోహాను 8:34; రోమా 6:20; II తిమోతి 2:26;
|