Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




అగ్నిపై సహేతుకత

LOGIC ON FIRE!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, అక్టోబర్ 11, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, October 11, 2015

"వీరు మహా శ్రమ నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని, వాటిని తెలుపు చేసుకొనిరి" (ప్రకటన 7:14).


డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ టెక్సాస్ డల్లాస్, మొదటి బాప్టిస్టు సంఘానికి గొప్ప శక్తివంత సంఘ కాపరి. అరవై సంవత్సరాలు అక్కడ బోధించాడు. ఎనభైవ సంవత్సరంలో ఈ దక్షిణ బాప్టిస్టు సమాఖ్య పితరుడు ముందుగానే అమెరికా పాశ్చాత్య పతనాన్ని గూర్చి చెప్పాడు. డాక్టర్ క్రీస్ వెల్ అన్నాడు,

మనము నైతిక విలువలు కోల్పయాము... ప్రభుత్వము రాజకీయ నాయకులు హత్యను, దొంగతనాన్ని, అబద్ధాలను సమర్ధిస్తున్నారు... అధ్యాపకులు [మన కళాశాలలో] లైంగికతను వ్యక్తిగత స్వేచ్చగా సమర్ధిస్తున్నారు. వేదికపై ప్రసంగీకులు, అత్యధికంగా, దేవుని వాక్యముపై [దాడులను] విజ్ఞాన స్వాతంత్రము అంటున్నారు; మనము మన స్వంత [దక్షిణ బాప్టిస్టు] విశ్వ విద్యాలయాల్లో సెమినరీలో చేస్తున్నాము. చెడుతనము, హింస, అవినీతి, పాటలో, నాటికలో, రేడియో, టెలివిజన్ లో అంగీకరింప బడుతుంది. ఈ తరము రాబోవు తరము వస్తుపర అన్వేషణలో భోగ స్వీకరణలో మునిగిపోతాయి... మొత్తము [పాశ్చత్య] ప్రపంచము రోజుకు 125,000 మందితో క్రైస్తవెతరమయిపోతుంది (W A. Criswell, Ph.D., Great Doctrines of the Bible, volume 8, Zondervan Publishing House, 1989, pp. 148, 147).

డాక్టర్ క్రీస్ వెల్ ఆ విషాద నివేదిక ఇచ్చాడు కాబట్టి దక్షిణ బాప్టిస్టు చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం వారి సంఖ్య పడిపోతుంది. గత సంవత్సరంలోనే 200,000 మంది దక్షిణ బాప్టిస్టు సంఘాలను వదిలిపెట్టి తిరిగి రాలేదు. ఈ దేశములోనే ప్రతీ ఏటా 1,000 బాప్టిస్టు సంఘాల తలుపులు ఎన్నటికీ మూసుకుపోతున్నాయి. గత సంవత్సరము దక్షిణ బాప్టిస్టులు 800 మంది విదేశీ మిస్సెనరీలను ప్రపంచపు మిషన్ స్థలాల నుండి ఇంటికి రప్పించారు. మిస్సను కొరకు వచ్చే కానుకలు బాగా తగ్గిపోయాయి వారికి సహాయము అందించలేనంతగా. మన స్వతంత్ర బాప్టిస్టు సంఘాలు కూడ మంచిగా పనిచేయడము లేదు. అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘ కాపరి నాతో అన్నాడు వారి తెగ ఉనికి కోల్పోతుందని. మిగిలిన తెగలలో కూడ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. నా చేతులలో రెండు పుస్తకాలు ఉన్నాయి మనకు కథ చెప్తాయి. ఒక దానిపేరు, గొప్ప సువార్తిక తగ్గుదల: అమెరికా సంఘ కూల్చివేతకు 6 కారకాలు (John S. Dickerson, Baker Books, 2013). రెండవ పుస్తకము పేరు, రాబోవు సువార్తిక క్లిష్టత (John H. Armstrong, general editor, Moody Press, 1996). నేను చదువు ప్రతి పుస్తకము, నేను చూసే ప్రతీ సూచిక చెప్తున్నాయి, మన సువార్తిక సంఘాలు లోతైన శ్రమలో ఉన్నారన్న వాస్తవాన్ని. సంఘాలలో పెంచబడుతున్న యవనస్తులు సంఘాలను విడిచి పెడుతున్నారు, సంఘాలు యవనస్తులను లోకము నుండి సంపాదింప లేకపోతున్నారు. జాన్ డికేర్ సన్ అన్నాడు, "కొత్త శిష్యులను చేయడంలో మనము విఫలులమవుతున్నాము. ఉనికిలో ఉన్న మన శిష్యులు వారి జీవితంలో పునరుత్పత్తి కలిగి ఉండలేక పోతున్నారు వారి ఆలోచనలో మార్పు లేదు" (ఐబిఐడి., పేజి 107, 108). కాని అతడు సమస్యను చక్కదిద్దడానికి కొన్ని విషయాలు ఇచ్చాడు. అవన్నీ నేను ప్రయత్నించాను, నాకు తెలుసు అది పని చేయవని. ఎందుకు? ఎందుకంటే అవి సమస్య మూలమునకు వెళ్ళవు.

నన్ను ఒక ఉదాహరణగా తీసుకుందాం. యుక్త వయస్సులో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న, దోర పండులా ఉన్నాను. నేను గుడిలో ఉండాలనుకున్నాను. విడిపోయిన కుటుంబము నుండి వచ్చాను. నా తల్లిదండ్రులతో జీవించలేదు. నిజంగా సంఘములో ఒక భాగంగా ఉండాలనుకున్నాను. కాని కాలిఫోర్నియా హంటింగ్ టన్ పార్క్ లో ఉన్న, తెల్ల (కాకాసియన్) సంఘము నన్ను తీసుకోలేదు! ఎందుకు? చాలా కారణాలున్నాయి – ఆరాధనలు శారీరక మధ్య వయస్సు స్త్రీలను తృప్తి పరచడానికి రూపొందించబడ్డాయి, నశించు యువకునికి కాదు. గుడిలోని ప్రజలకు నాపై ఆసక్తి లేదు, కాపరికి కూడ ఆసక్తి లేదు. తరువాత, నేను డబ్బులేని యవనస్తుడిని, చెడ్డ ఇంటి వాతావరణం నుండి వచ్చిన వాడిని. తరువాత, కూడ, బోధ ఉంది. నాకు ముగ్గురు కాపరులు ఉండేవారు. వారి ప్రసంగాలు వినడానికి కష్టపడే వాడిని, కాని నా జీవితంలో, వారి ప్రసంగాలలో చెప్పింది ఏమి నాకు గుర్తు లేదు! మొదటి రెండు నుండి ఏమి గుర్తు లేదు. ఆఖరి దినాలలో ప్రాముఖ్యత లేదు. వారి ప్రసంగాలు నాతో మాట్లాడలేదు. నన్ను ఉత్తేజింప లేదు. నన్ను సవాలు చెయ్యలేదు. నాకు పాపపు ఒప్పుకోలు కలిగించలేదు.

అక్కడ మన సమస్యకు మూలము ఉంది – బోధించుటలో! మన బోధ మారకపోతే నిరీక్షణ లేదు – లేనేలేదు – మన సంఘంలో! ఫిబ్రవరి 2014 జాన్ హెచ్. ముర్రే బేనర్ ఆఫ్ ట్రూత్ మేగజైన్ లో వ్రాసిన సంచిక చదివాను. అతడు ఏడూ విషయాలు ఇచ్చాడు "మన స్థితి నుండి విడుదల." అతడిచ్చిన అన్ని విషయాలు అంగీకరిస్తాను, కాని అతనిచ్చిన క్రమంలో ఏకీభవించను. అతడు "శక్తివంత ప్రసంగానికి" మార్పుకు ఏడవ స్థానమిచ్చాడు. నేను అంగీకరించను. అది మొదటిది అనుకుంటాను. అతనన్నాడు "శక్తివంత బోధ లేని స్థితి" నుండి మనం విడుదల చెందాలని. అతనన్నాడు, "బోధించుట ఈనాడు ప్రసిద్ధి కాదు." ఎందుకు కాదు? ఎందుకంటే విసుగు పుట్టిస్తుంది. అది ఎంత సామాన్యము! అతనన్నాడు, "ప్రభువు మాటలు వినని కరువు ఉంది." వినే కరువు ఎందుకుంది? ఎందుకంటే బోధించడం విసుగు పుట్టిస్తుంది కనుక. అది అంత సామాన్యము. కాని ఎందుకు ఈనాటి బోధ విసుగు పుట్టిస్తుంది? చాల కారణాలు ఉన్నాయి.

మొదటిది, చాలామంది బోధకులు "బోధించడానికి పిలువబడలేదు." "బోధించుటకు పిలువబడిన వారు" అని అనలేదు. చాలామంది బోధకులు మార్పు చెందలేదు. మారిన వారు బోధించుటకు పిలువబడలేదు. వారికి భారములేదు, భయము లేదు, అభిషేకము లేదు, నశించు వారికై కనికరము లేదు. చాలామందికి చెప్పడానికి బోధించడానికి తేడా కూడ తెలియదు! డాక్టర్ తిమోతి లిన్ చాల సంవత్సరాలు నాకు కాపరి. అతనన్నాడు ఒక సెమినరీ అధ్యాపకుడిలా అన్నాడని, "చెప్పడం బోధించడం రెండు ఒకటే." డాక్టర్ లిన్ అన్నాడు, "ఒక సెమినరీ అధ్యాపకుడిగా, చెప్పడానికి బోధించడానికి తేడా చెప్పలేకపోతున్నాడు. అతని విద్యార్ధులు బోధించగలరా? జవాబు "లేదు" అని తేటగా (The Secret of Church Growth, p. 20).

జాన్ మెక్ ఆర్డరును వినండి. అతడు బోధీస్తున్నాడా? జాన్ పైపర్ వినండి. అతడు బోధిస్తున్నాడా? డేవిడ్ జర్మియా, పాల్ చాపెల్, బిల్ హైబర్స్, రిక్ వారెన్, చార్లెస్ స్టేన్లీ కానీ. వారు బోధిస్తున్నారా? వారికి తెలుసా బోధించుట అంటే ఏమిటో? వారిలో కొందరు మంచివారు. అవును, వారు మంచివారు, కాని నిజంగా బోధించడం వారికి రాదు. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "బోధించుట అంటే ఏంటి? అగ్నిపై సహేతుకత! బోధించుట వేదాంతము అగ్నితో ఉన్న వ్యక్తినుండి వస్తుంది" (బోధించుట, బోధకులు, పేజి 97). నేను చెప్పిన వారు అగ్నితో ఉన్నారా? అగ్నితో ఉన్న వ్యక్తి బోధ వారు విన్నారా? ఒకే ఒక వ్యక్తి రేడియోలో 30 సంవతరాలుగా చనిపోయాడు! ఈనాటి ఒలివర్ బి. గ్రీన్ లా బోధిస్తాడు? అవును, "బోధించుట వేదాంతము అగ్నితో ఉన్న వ్యక్తి నుండి వచ్చేది" – లూథర్, వైట్ ఫీల్డ్, హోవెల్ హేరిస్, డానియల్ రావ్ లేండ్, డబ్ల్యూ. పి. నికోల్ సన్, డాక్టర్ జాన్ సంగ్, స్పర్జన్, మేక్కిన్, జాన్ చేన్నిక్ లేక జాన నాక్స్ లాంటి వారు.

అదే బేనర్ ఆప్ ట్రూత్ సంచికలో జాన్ నాక్స్ పై ఒక కథానిక ఉంది (పేజీలు 29, 30). కథానిక చెప్పింది నాక్స్ "శక్తితో" బోధించాడని. "ప్రసంగము విడుదల అయింది పరలోక మెరుపు శక్తి ద్వారా కథానిక ముగింపు." ఈ రోజులలో సంఘము, "ఇంకొక సంస్కరణ చూడాలనుకుంటే, కొత్త తరము రావాలి అగ్నితో బోధించేవారు... నాక్స్ లాంటి వారు, వారు దైవ ఉపదేశము పూర్తిగా పొందినవారు, [అది ఒకవేళ] ప్రసిద్ధమైనా కాకున్నా, తడబాటు నట్టిలేకుండా." స్పర్జన్ అన్నాడు, "జాన్ నాక్స్ సువార్త నా సువార్త; స్కాట్లాండ్ నుండి ఉరిమింది ఇంగ్లాండ్ లో మళ్ళీ ఉరమాలి" (ఆత్మకథ, ప్రతి. 1, పేజి 162).

మనలను వారి సున్నిత పదాలతో స్త్రీ స్పర్శ పదాలతో నిద్రపుచ్చే వారి నుండి తొలగాలి! వారు విసిగిస్తారు! చావు వరకు విసిగిస్తారు! మన యువకులు వారిని వినడం అసహ్యించుకుంటారు! "బోధించుట వేదాంతము అగ్నితో ఉన్నవ్యక్తి నుండి వస్తుంది!" భయపడే వారెవరు? ఇప్పుడు ఆలోచించండి! వారు ఒకరికి భయపడాలి! ఎవరు? నేను చెప్తాను ఈ ఆధునిక బోధకులు ఎవరికీ భయపడతారో. వారు భయపడతారు శారీరక మధ్య వయస్సు స్త్రీలకూ వారి సంఘాలు నడిపిస్తారు. ఎలా నడిపిస్తారు? "అలా బోధిస్తే మనము తిరిగి రాము!" ఎలా పని చేస్తుందో నాకు తెలుసు! ఇక్కడ ప్రయత్నించారు! నేను ఎప్పటిలానే బోధించాను – వారిని వెళ్లగొట్టే వరకు! జాన్ నాక్స్ మేరీ గూర్చి భయపడడు – మనము ఆ శారీరక స్త్రీకి భయపడకూడదు ఆ శారీరక స్త్రీ సబ్బాతు నుండి సూపరిండెంట్! వారిని వెళ్ళగొట్టాలి – అప్పుడు యవనస్తులు లోనికి వస్తారు! అది విసుగు పుట్టించదు! అది యవనుల దృష్టి ఆకర్షిస్తుంది! చివరిలో గుంపు యువకులున్నారు దేవుని కొరకు అగ్నితో ఉన్నారు – మనం ఆదివారము ఉదయము ఉన్నట్లు! భయపడకండి జాన్ నాక్స్ లా బోధించండి!

బోధించడం సమాచారం ఇవ్వడం కాదు! ఈనాటి "వివరణాత్మక ప్రసంగాలకు" దూరంగా ఉండండి. వాటినుండి తొలగండి! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ పురిటానులులా, ఒకటి రెండు వచనాలపై బోధించాడు. అతడు అన్నాడు, "బోధకుడు కేవలము ప్రజలకు విజ్ఞానము సమాచారము ఇవ్వడానికి వేదికపై ఉండదు. వారిని ప్రేరేపించాలి, ఉత్సాహపరచాలి, జీవింప చేయాలి ఆత్మలో మహిమ పర్చేవారిలా పంపాలి" (The Puritans, p. 316).

"బోధించుట," "ద డాక్టర్," అన్నాడు "ప్రజలకు ఏదో చెయ్యడానికి రూపొందింపబడింది" (ల్లాయిడ్-జోన్స్, బోధించుట భోధకులు, పేజి 85). బోధ ప్రజలకు ఏమి చెయ్యాలి? మొదటిగా, వారికి, కోపం పుట్టించాలి లేక భయపెట్టాలి! కోపం ఎందుకంటే వారు చెడు తిరుగుబాటు హృదయాలు కలిగియున్నారని చెప్తున్నారు, కాబట్టి! కోపం ఎందుకంటే మీరు వారికి చెప్తున్నారు వారు తెలివిగా పదునుగా లేరని. వారు తెలివి గలవారు కాబట్టి వారు అవిశ్వాసులా? డాక్టర్ చాన్ లా ఒకరు తెలివిగా లేరు. డాక్టర్ కాగన్ లా ఒకరు తెలివిగా లేరు. నా పద్ధతిలో, నాకు తెలుసు, ఒకరు నా అంత తెలివగా లేరు. అందుకే నేను వారికి భయపడను! రోన్ రీగన్ గతవారము టివిలో, "నేను రాన్ రీగన్ ను. నేను నాస్తికుడను. నరకంలో కాలిపోవడానికి నేను భయపడను." అతని తండ్రి, అధ్యక్షుడు రీగన్ కంటే ఈ సన్నని, నీరస, నాట్యగాడు తెలివిగలవాడనుకుంటూన్నాడా? తన తండ్రికి కొవ్వువత్తి ఎప్పుడు పెట్టలేదు. చనిపోయిన తండ్రి కంటిలో వేలు పెట్టవచ్చు, కాని అతడు తన తండ్రిలా రచయితా, మాతగాడు, ప్రపంచ నాయకుడు, 20 వ శతాబ్దపు, గొప్ప అధ్యక్షుడు కానేరడు! అతడు విపరీత నటన నుండి, (అలాగే ఉండేవారు) ఎన్నడు పైకి రాలేడు – నాట్యగాడు చనిపోయిన తన తండ్రి పేరుతో డబ్బు సంపాదిస్తాడు! కాదు, వారు అవిశ్వాసులు కాదు తెలివైన వారు కాబట్టి. వారు అవిశ్వాసులు ఎందుకంటే చెడు అవిశ్వాసపు హృదయ ముందనే సత్యాన్ని వారు ఎదుర్కోలేరు, వారిని సృష్టించిన దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారని! "అలా చెప్పవద్దు! వారిని భయపెడతారు!" సరే, నేను ఒకరిని భయపెత్తవచ్చు, అది ఇద్దరినీ భయపెడుతుంది – ఒకరు ముందుగా వస్తారు! ఇలా భోదింపక పోతే ఎవరు రక్షింపబడరు. నా బాధలో నేను మీతో చెప్పాలి మీ హృదయము చెడ్డదని, అపవిత్రమని, విపరీతమని, తిరుగుబాటుతో కూడినదని! అవును, నేను మీతో చెప్పాలి యేసు క్రీస్తు చెప్పాడు మీ పాపాలను బట్టి మీరు నరకానికి వెళ్తారు. రాన్ రీగన్ నరకాన్ని గూర్చి భయపడడం లేదు ఎందుకంటే అతడు పూర్తిగా బుద్దిహీనుడు అతడు ప్రభువైన యేసు క్రీస్తు కంటే, అమెరికా అధ్యక్షుని కంటే తెలివైన వాడని అనుకుంటున్నాడు. అలాంటి అవివేకికి సహాయము చెయ్యలేము. ఆ "అవివేకి తన హృదయములో అనుకున్నాడు దేవుడు లేదు అని" (కీర్తనలు 14:1). అతనికి నాట్యగాడుగా ఉండే వయసు అయిపోతుంది. తన తండ్రి విశ్వాసాన్ని కించపరుస్తూ డబ్బు సంపాదిస్తాడు. ఎంత చెత్తబుట్ట! ఒక వృద్ధ స్త్రీలా చూస్తున్నాడు! శారీరక చెత్తబుట్ట!

దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే హృదయాలున్న వారికి నరకము వేచి ఉంది! ప్రభువైన యేసు క్రీస్తు చెప్పాడు,

"అంతట రాజు, దీనికాళ్ళు చేతులు కట్టి, వెలుపటి చీకటిలోనికి త్రోసి వేయండి; అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుటయును ఉండును అని పరిచాలకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచ బడిన వారు కొందరే అని చెప్పెను" (మత్తయి 22:13, 14).

అవును, ప్రభువైన యేసు క్రీస్తును నమ్మకుండా తిరిగుబాటు చేసేవారి కొరకు అగ్ని గుండము కాచుకొని ఉంది!

కాని "[దేవుడు] ఎవరును నశించుట ఇష్టము లేదు" (II పేతురు 3:9). అందుకే తన అద్వితీయ కుమారుని, పాపుల స్థానంలో బదులుగా, సిలువపై మరణించారు మన పాపాలకు వెల చెల్లించడానికి.

అది, చివరకు, మన పాఠ్యభాగానికి తీసుకెళ్తుంది. అపోస్తలుడైన యోహానుకు పరదైసు దర్శనము ఇవ్వబడింది. అతడు అక్కడ "గొప్ప సమూహాలు, లెక్కింపలేనంత, అన్ని దేశములు, తెగలు, ప్రజలు, బాషలు [వారు] గొర్రె పిల్ల, సింహాసనము ముందు నిలబడుతారు...వారు గొప్ప శ్రమల నుండి వచ్చిన వారు, వారి వస్త్రములను, గొర్రె పిల్ల రక్తములొ కడుగుకొనినవారు" (ప్రకటన 7:9, 14). పరలోకములోని వీరు క్రీస్తు రక్తముచే కడుగబడినవారు, "ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము సమస్త పాపములను పవిత్రులను చేయును" (I యోహాను 1:7). డాక్టర్ ఎండ్రూ ముర్రే (1828-1917) అన్నాడు,

నేను పూర్తీ నమ్మకంతో చావును ఎదుర్కొంటాను – పరలోకానికి నాకు హక్కు ఉంది...దేవుని సింహాసనము ముందు ఎవరు స్థలము కనుగొంటారు? "గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రమును తెల్లగా శుద్ధి చేసుకున్న వారే"... పరలోకము నిరీక్షణలో నిన్ను నీవు మోసపుచ్చుకోవచ్చు ఆ ప్రశస్త రక్తములో కడుగ బడకపోతే. మరణాన్ని ఎదుర్కోవడానికి సాహసించవచ్చు యేసు తన రక్తములో నిన్ను కడిగాడని తెలుసుకోకుండా (Andrew Murray, D.D., The Power of the Blood of Jesus, CLC Publications, 2003 edition, p. 221).

యేసును నమ్మాలని ఈ ఉదయము సవాలు చేస్తున్నాను. ఆయనలో నీ నమ్మిక ఉంచిన క్షణమే ఆయన పరిశుద్ధ రక్తములో కడుగబడతావు! అప్పుడే నిజమైన మనిషివవుతావు! అప్పుడే క్రీస్తు వీరుడవుతావు!

ఈ మధ్యే మారిన వారి మాటలు వినండి. ఈ ఉదయాన్న వారు నిజమైన యవనస్తులు. ఒక యువతి ఈ సాక్ష్యము ఇచ్చింది,

"యేసును నమ్ముతావా?" డాక్టర్ హైమర్స్ నన్నడిగారు. "మోకాళ్ళని ఆయనను నమ్ము." నేనలా చేసాను. ఆయనను నమ్మాను. యేసుపై అనుకున్నాను. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు! యేసు నన్ను ప్రేమిస్తున్నాడు! ప్రశ్నలడిగేది లేదు నిశ్చయత అనుభూతి అవసరము లేదు... యేసు నన్ను ప్రేమిస్తున్నాడు! ఆయన రక్తము కార్చి సిలువపై మరణించాడు, నా పాప ప్రాయశ్చిత్తము చెల్లించాడు...అద్భుత ప్రేమ! ఆయన కుమారుని వైపు నన్ను ఆకర్షించినందుకు దేవునికి వందనాలు. నేను యేసును ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఆయన నన్ను మొదట ప్రేమించాడు కాబట్టి.

ఇంకొక సాక్ష్యము, కళాశాల బాలుడు,

ఉదయ కాలమున నేను రక్షింపబడ్డాను, డాక్టర్ హైమర్స్ క్రీస్తు లేని వారిని ఎలా అంధులనుగా సాతాను చేస్తుందో బోధించారు. ఆయన చెప్పారు సాతాను ఒక మార్గము ద్వారా నశించు వ్యక్తి మనసులో పనిచేయడం ద్వారా నిశ్చయత అనుభూతి ఉందని ఆలోచింప చేయడం ద్వారా తద్వారా ఏదో ఒకటి కౌన్సిలర్ కు చెప్పగలడుతారు. నాలో నేననుకున్నాను, "అది నేనే! నేను సరిగ్గా అలానే ఆలోచిస్తున్నాను"... చుట్టూ తిరుగుతున్నాను క్రీస్తు వైపు ఒకసారీ చూడలేదు. జీవితమూ, నా కొరకుంది, అయినను ఆయనపై ఆదారపడ లేకపోతున్నాను ...నేనెలా తిరిగి ఆయనను త్రోసి వేయగలను? నేనెలా పాపమును పట్టుకొని యేసు వైపు చూడకుండా ఉంటాను? ఆయన నా ఆత్మను ప్రేమించాడు? ఓ, నాకు ఆయన ఎంతగానో కావాలి నా పాప భారము తీసివేయడానికి. ఎలా హృదయ అంధకారము యేసు పవిత్రతకు నీతికి భిన్నంగా ఉంది... సాతాను అబద్ధాలు వింటూ ఉండిపోను. నాకు తెలుసు అక్కడ కక్కడే యేసు నాకు కావాలి. నేను వేచి ఉండకూడదు! కనిపెట్టడం కంటే, బంధకంలో ఉండడం సాతానుకు బానిసగా ఉండడం. పాపమూ నుండి కడుగబడడానికి యేసు నొద్దకు వెళ్ళాలి. కనుక ఆయన యొద్దకు వెళ్ళాను!...దేవునికి స్తోత్రము ఆయన కుమారుడు, యేసును ఇచ్చాడు, నన్ను తప్పించడానికి ఆయన రక్తములో నా పాపమూ కడగడానికి!

ఇంకొక సాక్ష్యము ఇది. వీరంతా నిజమైన యవనస్తులు. ఒకతను ఈ సంఘములో ఎదిగాడు. మిగిలిన ఇద్దరు కళాశాల వయసు వారు సువార్త వినడానికి మన సంఘానికి తెబడ్డారు. ఇంకొక యవనస్తుడు మునుపు గుడికి ఎప్పుడు రాలేరు తీసుకు రాబడ్డాడు. అతడాన్నాడు,

         ఉన్నత పాఠశాల నుండి లోకాన్ని గూర్చి చాలా తక్కువగా ఆలోచించాను. కాల క్షేపము చేస్తూ జీవించాను. పాఠశాల పట్టభద్రుడనై, మంచి భవిష్యత్తు కలిగి కుటుంబాన్ని ప్రారంభించాను. అది ఆదర్శ భవిష్యత్తు అనుకున్నాను కాని అంతా అర్ధరహితంగా ఉంటుంది. ఆ సమయంలో, నాకు మత నమ్మకాలూ లేవు – మంచినీతి ఉండే చాలు అనుకునేవాడిని. వేరేమతాలు ఆసక్తి విషయాలుగా నాకుండేవి. ఆ సమయంలో, యేసు ఒకమత పురుషుడుగా ఉండేవాడు. ఆయన సిలువ మరణము కథలోని మాటలు మాత్రమే.

         సువార్త విన్న తరువాత, యేసు ఎవరు అని ఆశ్చర్యపడ్డాను. నా పాప స్వభావంలో, బైబిలు చదవడం ద్వారా ఎలా రక్షింపబడాలి ప్రతీ వ్యక్తిని చూడడం ద్వారా ఎలా మారాలి. ప్రతిసారి యేసును నమ్మడంలో విఫలుడ నయ్యాను, రక్షింపబడ్డాను అనుకునే సమయాలు నన్ను నేను రక్షించు కోవడం అవుతుంది. ప్రతిరోజూ దూరంగా ఉన్నట్టు అనిపించింది. నేను ప్రయత్నించే కొలది, ఆయనకు నాకు మధ్య దూరము పెరిగి పోయేది.

         జూన్ 7, 2015 న, నేనింకా నశించి ఉన్నానని డాక్టర్ కాగన్ డాక్టర్ హైమర్స్ నాకు చెప్పారు. నేను నశించి పోయాను అని చాలా సార్లు నాకు చెప్పబడింది కాని మునుపు కాని ఈసారి వేరుగా ఉంది. దేవుడు ఉన్నాడు. నా పాపాలు హృదయంలో భారాన్ని నింపాయి మునుపెన్నడూ లేనంతగా, యేసును పదే పదే తిరస్కరిస్తున్నందుకు నన్ను నేను అసహ్యించుకున్నాను. పూరిగా నిరీక్షణ పోయింది, కాని ఆ క్షణంలో, ఒక అద్భుతము జరిగింది. యేసు వాస్తవుడు! ఆయన ప్రేమించే త్యాగమును గూర్చి ఆలోచిస్తూ కన్నీళ్లు కార్చాను, ప్రార్ధించి ఆయన ప్రేమను గూర్చి వందనాలు చెల్లించాను. నా పాపాలు కడగడానికి ఆయన హింసింపబడి సిలువపై రక్తము కార్చాడు. మన పాపులపై ఎంత ప్రేమను క్రుమ్మరించాడో చూడడం ఆశ్చర్యము. యేసు తప్ప ఎవరు చెయ్యలేరు. బదులుగా ఆయన అడిగేది ఆయన యందు విశ్వాసము ఉంచమని. ఓ, యేసును ఎరుగుట అంత అద్భుతము. నేను ఒంటరివాడను కాను, మాట్లాడడానికి ఆయన నాకు ఉన్నారు. నేను ఒక ఇటు అటు తిరుగును, ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నా స్నేహితుడు, నా దేవుడు నా రక్షకుడు.

ఇప్పుడు, నా స్నేహితుడా, నీవు యేసును విశ్వసించి ఆయన రక్తము ద్వారా నీ పాపాలన్నీ కడుగుకుంటావా? రక్షకుని విశ్వసించినప్పుడు నీవు ఇలా పాడగలుగుతావు,

ఇది నాకు రక్షకుని ప్రేమను గూర్చి చెప్తుంది, నన్ను విడిపించడానికి ఆయన మరణించాడు;
     ఇది ఆయన ప్రశస్త రక్తమును గూర్చి చెప్తుంది, పాపి పరిపూర్ణ ప్రాదేయత.
ఓ, నేను ఎలా యేసును ప్రేమించాలి, ఓ, నేను ఎలా యేసును ప్రేమించాలి,
     ఓ, నేను ఎలా యేసును ప్రేమించాలి, ఎందుకంటే ఆయన మొదట నన్ను ప్రేమించాడు!
("ఓ, నేను ఎలా యేసును ప్రేమించాలి" ప్రేడరిక్ వైట్ ఫీల్డ్ చే, 1829-1904).
            (“Oh, How I Love Jesus” by Frederick Whitfield, 1829-1904).

డాక్టర్ చాన్, ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: లూకా 7:9-17.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"ఓ, నేను ఎలా యేసును ప్రేమించాలి" (ప్రేడరిక్ వైట్ ఫీల్డ్ చే, 1829-1904).
“Oh, How I Love Jesus” (by Frederick Whitfield, 1829-1904).