ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
రక్షకుని కన్నీళ్లుTHE TEARS OF THE SAVIOUR డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను; మనష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను: వ్యాధిని అనుభవించిన వాడు గాను మనష్యులు చూడనోల్లని వాడు గాను ఉండెను; అతడు తృణీకరింపబడిన వాడు, కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి" (యెషయా 53:3). |
ఈ మధ్య ఒక వీడియో చూసాను ఒక బోధకుడు తన గుడి బయట గుంపు పాపులతో ఉన్నాడు. అతడు అరుస్తున్నాడు, "మీరు నరకానికి పోతారు!" "మీరు అగ్ని గుండములో నిరంతము కాలిపోతారు!" విడియో ఆపేసి నాలో చాల బాధపడ్డాను. ఆ బోధకుని నుండి ఒక కనికరపు మాటలేదు, నశించు తికమకలో ఉన్న ప్రజలకు ఒక విచారముతో కూడిన మాటలేదు, నశించు లోకానికి యేసు ప్రేమను గూర్చిన ఒక పలుకు లేదు. నశించు జన సమూహానికి యేసు అలా బోధించే ఒక సంఘటన నేను చూడలేదు. అవును, అతడు కఠిన మాటలు పలికాడు. అవును, వారు నరకానికి పోతున్నారని చెప్పాడు. కాని వాటిని శాస్త్రులకు పరిశయ్యలకు ఉపయోగించాడు – ఆయన రోజులలోని అబద్ధపు మత నాయకులు. బోధకులు మోర్మోనుల మీద, కేథలిక్కుల మీద, ముస్లీముల మీద, అస్తిరుల మీద, కళాశాల విద్యార్ధుల మీద అరవడం విన్నాను. నేను పెద్దవాడనయ్యే కొలది, ఆ బోధ క్రీస్తు ఉదాహరణను గైకొనుట లేదు. నేను పెద్దవాడనయ్యే కొలది నేననుకుంటాను యేసు ఆయన బలమైన గద్దింపును మనకాలపు మత నాయకులకు ఉంచుతాడు. వారు, పరిశయ్యల వలే, సువార్త బదులు మతాన్ని ప్రకటిస్తారు, పుల్లర్ వలే సెమినరీలో బైబిలుపై దాడి చేస్తారు, డబ్బు కొరకు బోధిస్తారు, స్వ సహాయ మనస్తత్వముపై బోధిస్తారు, "చెప్పండి సాధించండి" వేదాంతముపై బోధిస్తారు, గొప్పవారై ఐశ్వర్యము పొందండి బోధ బోధిస్తారు, "పాపి ప్రార్ధన" ద్వారా రక్షణ వస్తుందని బోధిస్తారు. అవును! నేననుకుంటాను, ఈరోజు యేసు ఉంటే, ఆయన బోధించి ఉంటాడు, "మీరు నరకానికి వెళ్తారు." కాని అలాంటి బోధ మనకాలపు బోధకులకు అబద్ధపు బోధకులకు ఉంచుతాడు! – ఆదివారపు సాయంకాలపు ఆరాధనలు ఆపేవారికి, ఆదివారము రాత్రి సహవాసములో స్థానము ఇవ్వకుండా యవనస్థులను విడిచిపెట్టే వారికి, ఇసుక లాంటి వచనము వెంబడి వచనము చెప్పే బైబిలు పఠనస్థులకు, అది ఆదివారము ఉదయము మాత్రమె వచ్చే మత పర నశించు ప్రజలకు, రాక్ సంగీతము తీసుకొచ్చే వారికి – సువార్తీకరణ బోధను ఆపేసే వారికి – సంఘములలో, యేసు రక్తము నశించిందని వారి పాపములను నశించు స్త్రీ పురుషులకు అందుబాటులో ఉందని చెప్పని వారికి ఉపయోగిస్తారు! నేననుకుంటాను క్రీస్తు డబ్బు బల్లలను పడద్రోసి, దేవాలయములోని, వారితో ఇలా చెప్పాడు, "అయ్యో, వేషదారులైన శాస్త్రులారా, పరిశయ్యలారా! మీరు మనష్యుల ఎదుట పరలోక రాజ్యమును ఉందురు: మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింప నియ్యరు" (మత్తయి 23:13). "అయ్యో, వేషదారులైన శాస్త్రులారా, పరిశయ్యలారా! మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, గాని అవిలోపల దోపుతోను అజితేంద్రియత్వము తోనూ నిండియున్నది" (మత్తయి 23:25). "అయ్యో, వేషదారులైన శాస్త్రులారా, పరిశయ్యలారా! మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడును, గాని లోపల చచ్చిన వారి ఎముకలతోను, సమస్త కల్మషము తోనూ నిండియున్నవి" (మత్తయి 23:27). "సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించు కొందురు?" (మత్తయి 23:33). అవును, నేననుకుంటాను క్రీస్తు అలా అబద్ధపు బోధకులకు అబద్ధపు ఉపదేశకులకు మన రోజులలో మన కాలములో వారికి అలా బోధిస్తాడు! కాని ఆయన తన బోధ వినడానికి వచ్చిన నశించు జన సమూహంతో అలా ఎప్పుడు బోధించలేదు. వారికి ఆయన "విచారము, దుఃఖముతో నిండిన వ్యక్తి." బావి యొద్ద ఉన్న స్త్రీతో సౌమ్యంగా మాట్లాడాడు, ఆమె ఐదు సార్లు పెళ్లి చేసుకున్నప్పటికిని, ఆయన కలిసినప్పుడు వ్యభిచారములో జీవిస్తున్నప్పటికిని. రోగస్తులతో చవిపోవుచున్న వారితో ఆయన సౌమ్యంగా మాట్లాడాడు, "[ఆయన వస్త్రములు] ముట్టిన వారందరూ సంపూర్ణంగా శుద్దులయ్యారు" (మత్తయి 14:36). వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో ఆయన సౌమ్యంగా మాట్లాడాడు, "నేనును నీకు శిక్ష విధింపను: నీవు వెళ్లి, ఇకను పాపమూ చేయకుము" (యోహాను 8:11). సిలువపై తన ప్రక్క నున్న దొంగతో, ఆయన అన్నాడు, "నేడు నీవు నాతో కూడ పరదైనులో ఉందువు" (లూకా 23:43). పక్ష వాయువు గలవానితో ఆయన అన్నాడు, "కుమారుడా, ధైర్యముగా ఉండుము; నీ పాపములు క్షమింపబడియున్నవి" (మత్తయి 9:2). ఆయన పాదములు ముద్దు పెట్టుకొనిన పాపపు స్త్రీతో, ఆయన అన్నాడు, "నీ పాపములు క్షమించబడియున్నవి" (లూకా 7:48). యేసు ఎప్పుడైనా నవ్వడా? ఆయన నవ్వి ఉంటాడు, కాని అది బైబిలులో వ్రాయబడలేదు. లేఖనాలలో మనకు చెప్పబడింది "చింతా క్రాంతుడు గాను, దుఃఖముతో నిండిన వాడు గాను" (యెషయా 53:3). లేఖన పుటలలో చెప్పబడింది ఆయన మూడు సార్లు ఎడ్చాడని, మన పాఠ్య భాగములో ఇది ఆయన వ్యక్తిత్వములో ఒక భాగము – ప్రాముఖ్య భాగము. భావన లేని బుద్ధిని ఏడుపును ఊహించుట కష్టము – భావాలు లేని రోమా దేవుళ్ళను ఊహించుట అసంభవము, లేక రక్త సిద్ధమైన ఇస్లాము అల్లా, కన్నీరు విడవడం చూడలేదు. యేసు కన్నీళ్లు మానవ శ్రమ పట్ల ఆయన హృదయపు కనికరాన్ని చూపిస్తుంది. మీలో చాలామందికి తెలుసు విన్ స్టన్ చర్చిల్ అంటే నాకు గొప్ప గౌరవము ఉందని. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్ ఆయనను ఎరిగినట్లుగా మీరు ఆయనను ఎరుగరు. సెయింట్ పౌలు కెథెడ్రల్, లండన్, బాంబుల సమయంలో. మీకు యూసఫ్ కర్ష్ చిత్రములోని ఆయన కఠినత్వపు ముఖము మాత్రమే తెలుసు. కాని చాల నెలలు హిట్లర్ బాంబులచే లండను తగలబెట్టుచుండగా, ఆంగ్ల ప్రజలు అతనిని వేరే విధంగా చూసారు. బాంబులు పడిన రాత్రి తరువాత, వారు అతడు శిధిలమైన వారి గృహాల ద్వారా బుగ్గలపై కన్నీరు కారుస్తూ ఆయన నడుస్తూ వెళ్ళడం చూసారు. లండన్ పై బాంబు దాడి సమయంలో చర్చిల్. అతడు నలభై మంది పెద్దలు పిల్లలు చనిపోయిన శిధిలమైన ఇంటి బైట అతడు ఆగాడు. చర్చిల్ కంటి నుండి కారు కన్నీళ్లు తుడుచుకునేటప్పుడు ఒక గుంపు గుమికూడింది. గుంపు వారు అరిచారు, "మీరు వస్తారు అనుకున్నాము!" ఒక వృద్ధ స్త్రీ అరిచింది, "చూడండి, ఆయన పట్టించుకుంటున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు." గుంపులో నుండి మరియొక కేక వినిపించింది, "అది మేము తీసుకుంటున్నాము! హిట్లర్ కు చెప్పండి, మేము అది తీసుకుంటున్నాము!" హిట్లర్ బాంబులతో వారి ఇళ్ళను పట్టణాలను నాశనము చెయ్యవచ్చు, కాని వారి ఆత్మ ఆయనను ఓడిస్తుంది. చెప్పబడింది చర్చిల్ కన్నీళ్లు ఆయన ప్రజల కొరకు కార్చినవి నాజి యుద్ధ యంత్రము యొక్క శక్తిని జయించడానికి సహాయపడింది. ప్రజలు నశించిన వీధిలో వరుసలో నిలబడి, విత్తనాలు కొనుక్కోవడం చూసి ఆయన ఏడ్చాడు. శిదిలావస్తలో ఉన్న పెద్దల పిల్లల మృత దేహాలు చూచి ఆయన ఏడ్చాడు. అతడు భయము వలన ఏడవలేదు, కాని తన ప్రజల శ్రమల బట్టి ఏడ్చాడు. కాదు, చర్చిల్ సిద్ధాంత ప్రకారము క్రైస్తవుడు కాదు. కాని అతడు క్రైస్తవుని వలే భావోద్రేకాలు కలిగి యున్నాడు ఇది వృద్ధ మెథడిస్ట్ మామ్మ, శ్రీమతి ఎవరెస్టు నుండి నేర్చుకున్నాడు. ఆయన చనిపోయే వరకు ఆమె చిత్ర పటము అతని మంచము దగ్గర పెట్టబడింది. అలా, క్రైస్తవులకున్న భావోద్రేకాలు అతనికి ఉన్నాయి, మన కాలములు ఏ నాయకుని విషయంలో నేను అలా చూడలేదు. ఆయోతల్ల ఆలీ కామోనీ, లేక లాడిమిర్ పుతిన్, లేక బరాక్ ఒబామా శ్రమ పడుచున్న ప్రజల పట్ల కనికరము చూపడం ఊహించడం అసంభవం. క్రైస్తవునిలో ఉన్న కనికరము – మొదటి శతాబ్దములోని రోమా ప్రపంచానికి యేసుచే నేర్పబడింది, "చింతాక్రాంతుడు, దుఃఖముతో నిండిన వాడు" (యెషయా 53:3). "చింతా క్రాంతుడు," ఎలాంటి నామము, యేసు కన్నీళ్లు విడిచినట్లు లేఖనాలలో మూడుసార్లు చెప్పబడింది. I. మొదటిది, పట్టణమును గూర్చి యేసు ఏడ్చెను. ఒక ఉదయము గాడిదపై వచ్చి ఆయన యేరూషలేములో ప్రవేశించాడు. గొప్ప జన సమూహము ఆయనను వెంబడిస్తూ అరుస్తున్నారు, "దావీదు కుమారునికి హోసన్నా: ప్రభువు నామములో వచ్చువాడు స్తుతింపబడును గాక; సర్వోన్నతమైన స్థలములో జయము" (మత్తయి 21:9). దీనిని మట్టి ఆదివారము నాడు యేసు యొక్క "జయోత్సాహ ప్రవేశము" అని పిలుస్తారు. యేసు’ విజయోత్సాహ ప్రవేశము "మట్టలాదివారము నాడు." కాని అది ఎలా ముగిసింది అరుదుగా వింటాము, "ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, దానిని చూచి, దాని విషయమై ఏడ్చి" (లూకా 19:41). డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ నేనెప్పుడు వినని అతి పెద్ద ప్రసంగీకులలో ఒకడు. అతడు అరవై సంవత్సరాలు టెక్సాస్, డాలస్ మొదటి బాప్టిస్టు సంఘానికి కాపరిగా ఉన్నాడు. అతని ప్రసంగములో, డాక్టర్ క్రీస్ వెల్ గొప్ప పట్టణానికి కాపరిగా వెళ్ళిన ఒక బోధకుని గూర్చి ఇలా చెప్పాడు. "బోధించే సమయము వచ్చినప్పుడు అతడు అక్కడ లేదు. బోధకుని కొరకు ఒక పరిచారకుని వెదకమన్నారు. అతడు కనుగొన్నప్పుడు ప్రసంగీకుడు ఆఫీసులో ఉండి, కిటికీ దగ్గర నిలబడి, ఆ పట్టణము విశాల వెనుకబడిన ప్రాంతాన్ని చూస్తున్నాడు. ఆ శిధిలమైన భవనాలను చూస్తూ, కాపరి ఏడుస్తున్నాడు. పరిచారకుడు అతనితో అన్నాడు, "అయ్యా, ప్రజలు కనిపెడుతున్నారు మీరు బోధించే సమయము అయింది.’ కాపరి జవాబిచ్చాడు, ‘నేను ప్రజల విచారము నిస్పృహ నిస్సహాయత విరుగగొట్టబడిన స్తితులచే పట్టబడ్డాను. అటు చూడు. అటు చూడు’ – ఆ పట్టణాన్ని చూపిస్తూ చెప్పాడు. పరిచారకుడు జవాబిచ్చాడు, ‘అవును, అయ్యా, నాకు తెలుసు. కాని నేను త్వరలో దానికి అలవాటు పడతావు. మీరు ప్రసంగించే సమయము ఆసన్నమయింది.’" అప్పుడు డాక్టర్ క్రీస్ వెల్ అన్నాడు, "నేను కూడ నా విషయంలో అలాగే భయపడతాను, సంఘములో, అన్ని సంఘాలలో కూడ. మేము దానికి అలవాటు పడిపోయాము. ప్రజలు నశించి పోయారు – దాని సంగతేంటి? వారికి నిరీక్షణ లేదు – దాని సంగతేంటి? చివరకు దానికి అలవాటు పడిపోయాం – అల జరిగిపోయింది. ఆ విషయంలో మనము క్రీస్తు నుండి వేరుగా ఉన్నాము. ‘ఆయన సమీపిస్తున్నప్పుడు, ఆయన పట్టణమును చూచి, దాని విషయమై ఏడ్చాడు.’" (W. A. Criswell, Ph.D., The Compassionate Christ, Crescendo Book Publications, 1976, p. 58). ఒలీవ కొండపై యేసు నిలబడినప్పుడు ఆరోజు యేరూష లేము పట్టణము చూసాడు, నలభై సంవత్సరాల తరువాత అది అలా అవుతుందను కున్నాడు? ఎవరనుకుంటారు ఒక తరము తరువాత రోమా అధికారి తీతుకు ద్వారములను గోడలను పడగొట్టి, దేవుని ఆలయానికి నిప్పు పెడతాడని? ఏమీ మిగిలి యుండదు పరిశుద్ధ ఆలయము చుట్టూ ఉన్న రాతి గోడ తప్ప. "మీ ఇల్లు మీకు విడువబడియున్నది." ఆయన అరిచాడు. పట్టణములో నశించు వారి నిమిత్తము యేసు కన్నీళ్లు విడిచాడు. ఒకతడు అన్నాడు, "కాని కాపరి గారు, మనము ఏమి చేస్తాము?" మనము అందరి ప్రజలను రక్షింపలేము. చాలామంది ప్రజలను కూడ రక్షింప లేము. కొంతమందిని మాత్రమూ రక్షింపగలము. మీరు బుధవారము లక్ష్మీ వారము రాత్రులు సువార్త నిమిత్తము రావచ్చు. శనివారము రాత్రి కూడ సువార్త నిమిత్తము రావచ్చును! మీరు వెళ్లి వారిని ఆదివారము మధ్యాహ్నము తీసుకొని రావచ్చు! మీరు అలా చెయ్యవచ్చు! ఒకరోజు మన పట్టణ వీధులు చెత్తతోను పోగతోను రక్తముతోనూ మరణంతోనూ నిండుకుంటాయి. ఒకనాటికి ఒకరిని రక్షించడం చాలా ఆలస్యము అయిపోతుంది. ఇప్పుడే, ఈ గడియే, సిలువ సైనికులుగా గొర్రె పిల్లను వెంబడించు వారిగా వెళ్ళండి. ఇప్పుడే పేదలకు సహాయ పడే ఘడియ, నశించు పాపులు క్రీస్తును కనుగొనడానికి, క్షమాపణ, నిరీక్షణ కనుగొనడానికి! "ఆయన సమీపించినప్పుడు, ఆయన పట్టణమును చూచి, ఏడ్చెను." II. రెండవది, యేసు సానుభూతితో ఏడ్చాడు. ఆయన శిష్యులతో అన్నాడు, "మన స్నేహితుడు లాజరు... చనిపోయాడు" (యోహాను 11:11, 14). ఆయన అన్నాడు, "ఆయనను లేపుటకు వెళ్ళుచున్నాను" – అంటే, మృతులలో నుండి లేపడానికి. కనుక వారు బెతనియ వెళ్ళారు, లాజరు ఇంటికి. ఈ వివరణ "సమాధి తోటను" సూచిస్తుంది. కాని క్రైస్తవులు "సేమేటరీ" ని గూర్చి మాట్లాడుతారు – అది గ్రీకు పదము అర్ధము నిద్రించు స్థలము, అచ్చట చనిపోయిన వారిని ఉంచుతాము యేసు వచ్చి లేపే వరకు. అదే యేసు లాజరుకు చేయబోవు చున్నాడు. కాని ఆయన నాలుగు రోజులు కనిపెట్టాడు ఆ అద్భుతము ద్వారా, ఆయన తన మహాత్వమును శక్తిని చూపించుటకు తద్వారా వారు ఆయనను నమ్మడానికి. ఇప్పుడు యేసు లాజరు సమాధిని సమీపిస్తున్నాడు. మరియు, లాజరు సహోదరి, వస్తుండగా యేసును కలుస్తుంది. "ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు, యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, అతని నెక్కడ ఉంచిరని, అడిగెను" (యోహాను 11:33). ఆదిమ గ్రీకులో దాని అర్ధము యేసు పూర్తిగా ఎడ్చాడని, ఆయన గుండె బరువైంది, నిట్టూర్చింది, యెగవూపిరి, బహుభారమైయింది (ఎంబ్రిమయోమాయి) – లోతుగా కలవరపడి, తుఫానులో సముద్రము వలే ఉప్పొంగి, లోతుగా అలజడి చెంది, చాల తోట్రిల్లి (టరాస్సో). నీ సమీపస్తులు ఎవరైనా మరణిస్తే నీకు అలా అనిపించిందా? నాకు అనిపించింది. నేను నిట్టూర్చి, దుఃఖించి భరితుడనయ్యాను. నేను లోతుగా కలవరపడి, మరుగు నీటిలా ఉడికి, పూర్తిగా తొందర చెందాను. అంత తీవ్రమైన నొప్పి భారము కొన్ని సార్లే నా జీవితంలో చూసాను – కాని అవి చాలు యేసు ఎలా భావించాడో తెలుసుకోడానికి. నా ప్రియ మామ్మమామ్, చనిపోయినప్పుడు, నాకలా అనిపించింది. స్వతంత్ర దక్షిణ బాప్టిస్టు సెమినరీలో నా జీవితమూ మలచబడినప్పుడు నాకు అలా అనిపించింది. నా తల్లి, సెలియా, చనిపోయినప్పుడు నాకలా అనిపించింది. అది తప్పు కాదు. యేసు మనకు చూపిస్తున్నాడు, ఆయన విచారము ద్వారా, కొన్నిసార్లు విచారపడడం పాపమూ కాదు. గొప్ప కనికరముతో కదిలింపబడ్డాడు మరియా, మార్త, లాజిరు స్నేహితుల విచారము వలన, అతడు చనిపోయినందుకు వారు ఏడ్చారు. యేసుకు తెలుసు కొన్ని నిమిషాల తరువాత లాజరును మృతులలో నుండి లేపుతాడని. కాని అతడు అతని మరణము వలన, మనకు అది తెచ్చే విచారము వలన ఆయన విలవిల లాడిపోయాడు. తరువాత, రెండు వచనాల తరువాత, యోహాను పదకొండవ అధ్యాయములో, మనకు బైబిలులోనే అతి చిన్న వచనము ఇవ్వబడింది. ఆయన వేదనతో భాధతో, యేసు అన్నాడు, "అతనిని ఎక్కడ ఉంచారు? వారు ఆయనతో అన్నారు, ప్రభువా, వచ్చి చూడుము." అప్పుడు అతి చిన్న వచనము, "యేసు కన్నీళ్లు విడిచెను" (యోహాను 11:35). ఆయన మరియా మార్తల దుఃఖాన్ని పంచుకున్నాడు, ఎందుకంటే అయన కూడ వారి సహోదరుడు లాజరును ప్రేమించాడు. మరియు యేసు మన దుఖాలను విచారములను కూడ పంచుకుంటాడు. మీ తరము యవనస్తులపై నేను జాలి పడుతున్నాను. చాల సంఘాలలో పాత పాటలు పాడడం మానేశారు – అవి హృదయాన్ని తాకుతాయి ఆత్మలను ఆదరిస్తాయి. పిల్లలు ఈనాడు అవి వారికి తెలియదు, అందుకు కష్ట సమయాలలో వాటి వైపు తిప్పుకుంటాయి. కాని పాత పాటలు నా ఆత్మను అంధకారములో నన్ను నడిపించాయి. యేసులో ఎంత మంచి స్నేహితుడన్నాడు, "యేసు కన్నీళ్లు విడిచెను" (యోహాను 11:35). యేసు ప్రశస్త కన్నీళ్లు. యేసు కనికరము. దేవునికి వందనాలు యేసు సానుభూతిని బట్టి. డాక్టర్ హెన్రీ యం. మెక్ గోవాన్ అతని కుటుంభ సభ్యులతో తొలిసారి నన్ను నా చిన్నప్పుడు బాప్టిస్టు సంఘానికి తీసుకెళ్ళాడు. నేను తన కొడుకులా ఉన్నాడని చెప్పాడు. నేను నా కుటుంబము టెక్సాస్ వెర్నొన్ కు వెళ్ళాము, చాలాసార్లు ఆయనను చూడడానికి. ఒకసారి అతడు ఒక చిన్న వచన గీతము నాకు ఇచ్చాడు అది చాల విషయాలు వివరిస్తుంది. 14 సంవత్సరాల వయస్సు మేరీ స్టీవెన్ సన్ అనే పాప ఆపాట వ్రాసింది: ఒక రాత్రి ఒక కల కన్నాను. యేసు పట్టణాల గూర్చి ఏడ్చాడు – నశించు వారిని గూర్చి, నిరీక్షణ లేని వారిని గూర్చి. సానుభూతిలో మనలో పాటు యేసు ఏడుస్తాడు – మనము విచార సమయంలో వెళ్తున్నప్పుడు. III. మూడవది, యేసు ఏడ్చాడు మన కొరకు ఆయన మన పాపముల నిమిత్తము అర్పింపబడినప్పుడు. హెబ్రీయులకు 5:7 చెప్తుంది, "శరీర ధారియైయున్న దినములలో, మహా రోదనము తోనూ కన్నీళ్ళ తోనూ తన్ను మరణము నుండి రక్షింప గలవానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను" (హెబ్రీయులకు 5:7). ఇక్కడ యేసు, గెత్సమనే వనంలో ఏడుస్తూ ఉన్నాడు, ఆయన సిలువ వేయబడే ముందు రోజు రాత్రి. డాక్టర్ క్రీస వెల్ అన్నాడు, గెత్సమనేలోని వేదనకు అర్ధము ఏమిటి? ఆయన వేదనలో శ్రమపడు చున్నప్పుడు ప్రార్ధనలో "ఆయన చెమట రక్త బిందువుల వలే నేలను పడుచుండెను" (లూకా 22:44)... ప్రవక్తయైన యెషయా ఆనందు, "దేవుడు ఆయన ఆత్మలను పాపమూ నిమిత్తము బాలి అర్పనముగా ఇచ్చెను." యెషయా అన్నాడు, "దేవుడు ఆయన ఆత్మ స్థితిని చూచి తృప్తి చెందుతాడు." మనము, ప్రవేశింపలేని మర్మము, దేవుడు మన పాపము నిమిత్తము ఆయనను పాపముగా చేసెను. మరియు లోక పాపముల బరువును భారమును మోస్తూ, ఆయన కన్నీళ్ళతో బిగ్గరగా అరుస్తూ అన్నాడు, "తండ్రి, నీచిత్తమైతే, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపుము." (ఐబిఐడి., పేజి 60). యేసు భారమైన కన్నీళ్ళతో అరిచాడు, గెత్సమనేలో తన జీవితాన్ని వదిలి పెట్టమని, తద్వారా మరుసటి ఉదయము తన శరీరములో మన పాపాలను సిలువపైకి తీసుకెళ్ళడానికి. సిలువపై ఆయన కేకపెట్టాడు, "సమాప్త మాయెను" (యోహాను 19:30) – ఆయన తలవంచి మరణించాడు. బలమైన దుఃఖముతో కన్నీళ్ళతో, ఆయన సిలువకు మేకులచే కొట్టబడ్డాడు మన పాపముల పూర్తీ ప్రాయశ్చిత్తము కొరకు. కల్వరి కొండ వరకు, ఒక భయంకర వేళా, నేను నిన్ను అడుగుచున్నాను యేసును విశ్వసించమని, ఆయన చాలా కన్నీళ్లు కార్చాడు, సిలువపై రక్తము కార్చాడు నిన్ను పాపమూ నుండి తీర్పు నుండి రక్షింపడానికి. ఆయన ఇప్పుడు పరలోకములో ఉన్నాడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. సామాన్య విశ్వాసముతో వచ్చి ఆయనను నమ్ము. ఆయన ప్రశస్త రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడుగును – నీకు నిత్య జీవము అనుగ్రహింపబడును. ఆమెన్. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: లూకా 22:39-44. |
ద అవుట్ లైన్ ఆఫ్ రక్షకుని కన్నీళ్లు THE TEARS OF THE SAVIOUR డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను; మనష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను: వ్యాధిని అనుభవించిన వాడు గాను మనష్యులు చూడనోల్లని వాడు గాను ఉండెను; అతడు తృణీకరింపబడిన వాడు, కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి" (యెషయా 53:3). (మత్తయి 23:13, 25, 27, 33; 14:36; యోహాను 8:11; I. మొదటిది, పట్టణమును గూర్చి యేసు ఏడ్చెను, మత్తయి 21:9; లూకా 19:41. II. రెండవది, యేసు సానుభూతితో ఏడ్చాడు, యోహాను 11:11, 14, 33, 35. III. మూడవది, యేసు ఏడ్చాడు మన కొరకు ఆయన మన పాపముల నిమిత్తము అర్పింపబడినప్పుడు, హెబ్రీయులకు 5:7; లూకా 22:44; యోహాను 19:30. |