Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




కలిషితం కాని మరియు విమోచించే
యేసు క్రీస్తు రక్తము

THE INCORRUPTIBLE AND REDEEMING
BLOOD OF JESUS CHRIST
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, సెప్టెంబరు 13, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, September 13, 2015

"పితృ పారంపర్యమైన మీ వ్యర్ధ ప్రవర్తనను విడిచి పెట్టునట్టుగా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింప బడలేదు గాని... అమూల్యమైన రక్తము చేత అనగా, నిర్దోషమును నిష్కలంక మునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి" (I పేతురు 1:18-19).


విలియం కౌపర్ (1731-1800) సుపరిచిత పాటలోని ఈ అందమైన పదాలు రాసాడు:

విశ్వాసము ద్వారా ఆ ప్రవాహాన్ని చూచినప్పుడు
కారుచున్న మీ గాయాలు,
విమోచించే ప్రేమ నా శీర్షిక,
నా మరణ పర్యంతము.

ఇది సి. హెచ్. స్పర్జన్ (1834-1892) కు నచ్చే గీతము. ఆ గొప్ప ప్రసంగీకుడు అన్నాడు,

నా మట్టుకు ఆలోచింప దగ్గ బోధింప దగ్గ విషయము లేదు ఆ గొప్ప శీర్షిక తప్ప. యేసు క్రీస్తు రక్తము సువార్త యొక్క జీవము (C. H. Spurgeon, "The Blood of Sprinkling," February 28, 1886, Metropolitan Tabernacle Pulpit, vol. 32, p. 121, reprinted by Dr. Bob Ross of Pilgrim Publications, P.O. Box 66, Pasadena, Texas 77501).

ఎందుకు బోధకులకే బోధకుడైన, స్పర్జన్ లాంటి, బలమైన ప్రకటన చేస్తాడు? ఎందుకలా అన్నాడు, "నా మటుకు ఆలోచింప దగ్గ బోధింప దగ్గ విషయము లేదు" ఆ గొప్ప శీర్షిక తప్ప యేసు క్రీస్తు రక్తము? ఆయన బోధించిన వందలా ప్రసంగాలు, మెట్రో పొలిటాన్ టేబర్ నేకల్ పుల్పిత్, లో ముద్రించబడినవి చూస్తె అది సత్యమని మీరు చూస్తారు. కాని ఎందుకు? ఎందుకు ఆంగ్ల భాష మాట్లాడే ప్రపంచములోని ఆ గొప్ప ప్రసంగీకుడు యేసు క్రీస్తు రక్తాన్ని ముఖ్య అంశముగా పెట్టుకోవాలి? ఎందుకంటే బైబిలులో దానిని మించిన ప్రాముఖ్య విషయము ఇంకొకటి లేదు!

యేసు క్రీస్తు రక్తము లేకుండా మానవాళికి రక్షణ లేదని బైబిలు బోధిస్తుంది. ఈ సాయంకాలము క్రీస్తు రక్తమును గూర్చి రెండు విషయాలపై మీరు దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాను. రెండు విషయాలు నా పాఠ్య భాగము I పేతురు 1:18-19 నుండి తీసుకోబడ్డాయి.

1. క్రీస్తు రక్తము కలుషితము కానిది.

2. క్రీస్తు రక్తము మీ విమోచనకు అవసరము.

I. మొదటిది, క్రీస్తు రక్తము కలుషితము కానిది.

కీర్తనలలో, దేవుని వాక్యము ఈ ప్రవచనాన్ని ఇస్తుంది, అది క్రీస్తులో నెరవేర్చబడింది:

"ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు; నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నియ్యవు" (కీర్తనలు 16:10).

"కలుషితము" నాకు హెబ్రీ పదము "నాశనము" లేక "పతనము" (Strong's Concordance).

కీర్తనలలోని ఈ వచనము కొత్త నిబంధనలో చెప్పబడింది:

"నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నియ్యవు... ఆయన (క్రీస్తు) పాతాళములో విడువ బడలేదనియు ఆయన శరీరము కుళ్ళి పోలేదనియు, దావీదు ముందుగా తెలుసుకొని, ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను" (అపోస్తలుల కార్యములు 2:27, 31).

మన రోజులలో కొందరంటారు క్రీస్తు శరీరము పునరుత్థానమైంది, కాని ఆయన రక్తము సిలువ చుట్టూ మట్టిలో నాని నశించి పోయింది అని. కాని క్రీస్తు రక్తము కలుషితము కాలేదు అని బైబిలులోని మరియొక వచనము చెప్తుంది:

"మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, విమోచింపబడలేదు… కాని క్రీస్తు ప్రశస్త రక్తము చేత విమోచింపబడితిరి" (I పేతురు 1:18-19).

ఈ వచనములో "కలుషితము" అనే పదము "నశించు" లేక "పతనము" అనే పదాల నుండి వచ్చింది. క్రీస్తు రక్తము నశింపదని నాశనము అవదని ఈ వచనము చూపిస్తుంది. వెండి బంగారములు భూమిపై ఉన్న వాటిలో క్షయమయినవి, కాని వెండి బంగారములు కూడ దేవుని తీర్పులో కాల్చబడేటప్పుడు నశించి పోతాయి. మనకు చెప్పబడింది "ఈ మూలకములు అగ్నిలో కరిగిపోతాయి, భూమి దానిలో ఉన్నవాన్ని దహింప బడతాయి…ఇవన్ని కరిగిపోతాయి" (II పేతురు 3:10-11). మూలకములు (గ్రీకులో "ఆటములు") దహింపబడతాయి. లోకములో ఉన్నదంతా "కరిగిపోతుంది" (నిజంగా "నాశనమవుతాయి") దేవుని అగ్నిచే. వాటిలో వెండి బంగారము కలిసున్నాయి; "ఇవన్నీ కరిగి పోతాయి."

కాని I పేతురు 1:18-19 చెప్తుంది కలుషితము అయిన దానితో మనము విమోచింపబడం, "కాని క్రీస్తు ప్రశస్త రక్తము ద్వారా." ఈ వచనము కలుషితము కాని, నశింపని, పాడవని (స్ట్రాంగ్స్) క్రీస్తు రక్తమును తేటగా చూపిస్తుంది!

ఫ్రంట్ లైన్ మేగజైన్ లో ఒక రచన ఇలా చెప్తుంది,

క్రీస్తు రక్తము చిందింపబడినప్పుడు, అది నేలమీద దూళిలో అదృశ్యమై పోలేదు. అలా కాదు, దేవుని వాక్యము చెప్తుంది అది కలుషితము కాని రక్తము. కల్వరి కొండమట్టి దేవుని గొర్రె పిల్ల ప్రశస్త రక్తాన్ని పీల్చి వేయలేదు. "కలుషితము కాని" క్రీస్తు శరీరానికి అన్వయించినప్పుడు పునరుత్థాన శరీరాన్ని చూపిస్తుంది, కలుషితము కాని రక్తము అంటే అర్ధము క్రీస్తు రక్తము అదే అసాధారణ ప్రక్రియ ద్వారా లేపబడింది (Frontline magazine, March/April 2001, p. 5).

మృతులలో నుండి లేచినప్పుడు, యేసు అన్నాడు:

"నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి: నాకున్నట్టుగా, మీరు చూచుచున్న; వెముకలును, మాంసమును భూతమున కుండవు" (లూకా 24:39).

తిరిగి లేచిన క్రీస్తును చూచి శిష్యులు ఆశ్చర్యపోయారు. వారనుకున్నారు "భూతమును చూచినట్టుగా" (లూకా 24:37). ఈనాడు చాలామంది అనుకుంటారు యేసు ఆత్మగా లేచాడని. ఈ వచనాలు "మోస పూరిత " క్రీస్తు ఆత్మను సరిదిద్దుతున్నాయి. కాదు, ఆయన రక్త మాంసములతో లేచాడు. ఆయన చేతులను పాదాలను వాటి గాయాలను చూడమని శిష్యులతో చెప్పాడు.

"తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి, నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి, నా ప్రక్కలో ఉంది; అవిశ్వాశివి కాక, విశ్వాసివై ఉండుమనేను" (యోహాను 20:27).

క్రీస్తు తోమాతో తన చెయ్యి చాచి ప్రక్కలో ఉంచి గాయాన్ని చూడమని చెప్పాడు, ఆ గాయము ఆయన సిలువపై ఉన్నప్పుడు సైనికుడు పొడిచినది.

నేను చెప్పేది ఇదే: ఆయన చేతులలో, కాళ్ళలో, ప్రక్కలో ఉన్న గాయాలను చూడమని క్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. ఈ గాయాలను రక్తము ప్రవహించి ఉండేది, పునరుత్థానమైన "రక్త మంసములలో" శరీరములో రక్తము మిగిలి ఉంటే. కాని ఆయన శరీరముగా రక్తము మిగల లేదు. దేవుని శక్తిచే రక్తము అప్పటికే పునరుత్థానమయింది.

మృతులలో నుండి లేచిన తరువాత మగ్ధ తేనే మరియు యేసును కలిసినప్పుడు, ఆయన ఆమెతో ఇలా అన్నాడు,

"కనుక నన్ను ముట్టుకొనవద్దు; యేసు ఆమెతో నేను, ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును, అయిన వాని యొద్దకు ఎక్కి పోవుచున్నానని, వారితో చెప్పమనేను" (యోహాను 20:17).

అయిననూ, ముందుగానే, శిష్యులు "వచ్చి ఆయన పాదాలు మొక్కారు" (మత్తయి 28:9). ఆయన మరియను ముట్టుకోనివ్వలేదు, ఎందుకంటే ఆయన దేవుని దగ్గరకు ఆరోహణమవలేదు, అయిననూ కొంత సేపయ్యాక, ఆయన పాదాలు ముట్టుకోవడానికి ఆయన శిష్యులను అనుమతించాడు. స్కోఫీల్ద్ గమనిక ఈ వివరణ ఇస్తుంది, అది పూర్తిగా బైబిలు పరమని నాకు తోస్తుంది:

యేసు మరియతో కార్యశిద్ధి నెరవేర్పు ప్రధాన యాజకునిగా మాట్లాడాడు (లేవీదుకాండము 16). త్యాగాన్ని నేరవేర్చాక, ఆయన పరిశుద్ధ రక్తాన్ని పరమునకు తీసుకెళ్తున్నాడు, అది, వనములో మరియను కలుసుకొనుట మత్తయి 28:9 లోని కలయిక మధ్యలో, ఆరోహనుడై దిగి వచ్చాడు, సమంజస వాదము (Scofield note on John 20:17).

ఇదే అభిప్రాయాన్ని డాక్టర్ జాన్ ఆర్. రైస్ కూడ నమ్మాడు.

పాత నిబంధనలో ప్రధాన యాజకుడు రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములో కృపా సింహాసనము దగ్గర ఉంచాడు. కనుక, క్రీస్తు ఆయన రక్తమును పరలోకానికి తీసుకెళతాడు మరియను కలవడం శిష్యులను కలవడం మధ్య కాలములో:

"అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్త కృత్యము కానిది, అనగా, ఈ సృష్టి సంబంధము కానిదియు; మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, మేకల మొక్కయు కోడెల మొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను" (హెబ్రీయులకు 9:11-12).

గమనించండి ఈ పాఠ్యభాగము చెప్తుంది ఆయన "పరిశుద్ధ స్థలములో ఒకసారి" ప్రవేశించాడని. అది వేరే సమయంలో ఆయన ఆరోహణ సమయం ఇప్పుడు కాదు, ఎందుకంటే బైబిలు చ్పెతుంది,

"ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత, పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడయ్యేను" (మార్కు 16:19).

నూతన నిభందనలో మళ్ళీ మళ్ళీ చెప్పబడింది ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడయ్యాడని, మరియు ఈ వచనము చెప్తుంది ఆయన శిష్యులతో మాట్లాడిన వెంటనే పరలోకానికి ఆరోహనుడైన తరువాత ఆయన ఆశీనుడయ్యాడని. ఇది రుజువు చేస్తుంది ఆయన మునుపు ఆరోహనుడై ఆయన రక్తమును "పరిశుద్ధ స్థలములో ఉంచాడని" (హెబ్రీయులకు 9:12). పరలోకములో.

"మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, విమోచింపబడలేదు గాని...అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి" (I పేతురు 1:18-19).

క్రీస్తు రక్తము ఇప్పుడు పరలోకములో కృపా సింహాసనము వద్ద ఉంది. అది కలుషితము కానిది. అది నశింపదు నాశనము అవదు. ఇది అసాధారణము. బహుశా! అసాధారణము తొలగిస్తే క్రైస్తవ్యము లేదు – కేవలము నీతి. ఇది మంత్రము కాదు. క్రీస్తు రక్తమును మీరు తారుమారు చెయ్యలేరు. మంత్రము కాదు! రక్తము అసాధారణము, కాని అది మంత్రానికి స్పందించరు. "నిర్నయత్వత" ఒక మంత్రము! అందుకే దానిని మనం తిరస్కరిస్తాం. రక్తములో మిమ్ములను కడగడం దేవుడు నిర్ణయించాడు.

డాక్టర్ జాన్ మెక్ ఆర్డరు ఈ విషయాన్ని నమ్మడని నాకు తెలుసు. ఈ తప్పుడు అభిప్రాయాన్ని రక్తముపై వింత మనిషి కొలోనేర్ ఆర్. బి. తీమ్, జూనియర్ నుండి తీసుకున్నాడని కూడ తెలుసు 1961 కాలములో యవ్వన జాన్ మెక్ ఆర్డర్ తీమ్ బైబిలు పఠనాలకు హాజరయినప్పుడు నేను అక్కడ ఉన్నాను (తీమ్) బోధించిందే మెక్ ఆర్డర్ చాలా సంవత్సరాలు బోధించాడు. డాక్టర్ మెక్ ఆర్డర్ ఆర్. బి. తీమ్ నుండే ఈ అభిప్రాయాలు పొందాడని నేను ఒప్పింపబడ్డాను, ఎందుకంటే ఆ విషయాలపై రాసుకోవడం నేను చూసాను. తీమ్ నేర్పాడు పరము "రక్తము" అంటే "మరణము" అని – "ఒక స్థలములో గాలిలో రక్త ప్రవహింపు కాదు." డాక్టర్ మెక్ ఆర్డర్ ప్రసంగాలలో తరుచు తలంపులు వచ్చేవి, నాకు వ్యక్తి గతముగా తెలుసు ఈ అభిప్రాయాలు అతడు కొలోనెల్ ఆర్. బి. తీమ్ నుండి తెచ్చుకున్నాడని. ఇది విచారము, ఎందుకంటే డాక్టర్ మెక్ ఆర్డర్ మిగిలిన విషయాలపై మంచి సిద్ధాంతాలు బోధిస్తారు. మన సంఘము డాక్టర్ మెక్ ఆర్డరు కొరకు ప్రతివారము ప్రార్ధిస్తుంది ఆయన ఆర్. బి. తీమ్ క్రీస్తు రక్తముపై వింత సిద్ధాంతాల నుండి మరలు కోవాలని.

II. రెండవది, క్రీస్తు రక్తము మీ విమోచనకు అవసరము.

పాఠ్యభాగము చెప్తుంది కలుషిత విషయాల ద్వారా మీరు విమోచింప బడలేదు, కాని మీరు క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డారు. పదము "విమోచింపబడుట" I పేతురు 1:18 లో గ్రీకు పదానికి అనువాదము దాని అర్ధము "విడిపించుట" లేక "విడుదల పొందుట" (స్ట్రాంగ్ వైన్స్), "విడుదలను గుర్తింప చేస్తుంది" (వైన్స్).

మీరు క్రీస్తు రక్తముచే "విడిపించబడక" లేక "విడుదల పొందక" పోతే, నిత్యమూ మీరు ఇలాగే ఉండిపోతారు

1. "ధర్మ శాస్త్రపు శాపము" క్రింద ఉంటారు (గలతీయులకు 3:13). మీరు గైకొనలేరు కనుక ధర్మశాస్త్రముచే శపింపబడుచున్నారు. మీరు పరిపూర్ణముగా దేవుని ధర్మ శాస్త్ర ఆజ్ఞలను గైకొన లేకపోతున్నారు. అందుకే ధర్మ శాస్త్రము మిమ్మును శపిస్తుంది. మీరు నేరారోపణతో ఉన్నారని అది చూపిస్తుంది తీర్పు తప్పించు కోలేరని. యేసు రక్తము మాత్రమే మీ పాపాలను కడిగేస్తుంది, కనుక మీరు "విడిపించుబడతారు" మరియు "విడుదల పొందుతారు" ధర్మశాస్త్ర శాపము నుండి .

2. క్రీస్తు రక్తము ద్వారా మీరు "విడిపింపబడక" పోతే మరియు "విడుదల పొందక" పోతే మీరు నిరంతరము సాతాను ఆదిపత్యము క్రింద ఉంటారు, "సాతాను ఇష్టము చొప్పున చెరపట్ట బడతారు" (II తిమోతి 2:26). ఏదియు, వాని భంధకాలలో నుండి మిమ్ములను, "విడిపించదు" మరియు "విడుదలనివ్వదు" యేసు క్రీస్తు రక్తము తప్ప!

3. క్రీస్తు రక్తము ద్వారా మీరు "విడిపింపబడక" పోతే మరియు "విడుదలపొందక" పోతే, మీరు నిరంతరము పరిశుద్ధ దేవుని ఉగ్రత తీర్పు క్రింద ఉంటారు. యేసు క్రీస్తు రక్తము మాత్రమే మిమ్ములను దేవుని తీర్పు నుండి "విడిపిస్తుంది" "విడుదల" చేస్తుంది.


ఓ, నా స్నేహితుడా, నీవు క్రీస్తు రక్తము కలిగియుండాలి! క్రీస్తు రక్తము నీవు కలిగి ఉండాలి నిన్ను ధర్మశాస్త్రము శాపము నుండి విడిపించడానికి, సాతాను బానిసత్వము నుండి విడిపించడానికి, ఆగ్రహు దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించడానికి! ఓ, నీవు తప్పక –నీవు తప్పక –యేసు క్రీస్తు ప్రశస్త రక్తము కలిగియుండాలి శాపము నుండి, బంధకాల నుండి, ఉగ్రత నుండి నిన్ను విమోచించడానికి. మళ్ళీ చెప్తాను, క్రీస్తు రక్తము నీవు తప్పక కలిగియుండాలి! నీవు త్వరలో యేసును నమ్మునట్లు నేను ప్రార్ధిస్తాను!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం:
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
యేసు, మీ రక్తము నీతి" (నికోలస్ వోన్ జిన్జన్ డోర్ప్ చే, 1700-1760;
అనువాదము జాన్ వెస్లీచే, 1703-1791).
“Jesus, Thy Blood and Righteousness”(by Count Nicholas von Zinzendorf, 1700-1760;
translated by John Wesley, 1703-1791).


ద అవుట్ లైన్ ఆఫ్

కలిషితం కాని మరియు విమోచించే
యేసు క్రీస్తు రక్తము

THE INCORRUPTIBLE AND REDEEMING
BLOOD OF JESUS CHRIST

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"పితృ పారంపర్యమైన మీ వ్యర్ధ ప్రవర్తనను విడిచి పెట్టునట్టుగా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింప బడలేదు గాని... అమూల్యమైన రక్తము చేత అనగా, నిర్దోషమును నిష్కలంక మునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి" (I పేతురు 1:18-19).

I. మొదటిది, క్రీస్తు రక్తము కలుషితము కానిది, కీర్తనలు 16:10; అపోస్తలుల కార్యములు 2:27, 31; I పేతురు 1:18-19; II పేతురు 3:10-11; లూకా 24:39, 37; యోహాను 20:27, 17; మత్తయి 28:9; హెబ్రీయులకు 9:11-12; మార్కు 16:19.

II. రెండవది, క్రీస్తు రక్తము మీ విమోచనకు అవసరము, గలతీయులకు 3:13;
II తిమోతి 2:26; కీర్తనలు 7:11.