Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఉజ్జీవమును గూర్చిన గొప్ప సిద్ధాంతాలు

(ఉజ్జీవముపై 20 వ ప్రసంగము)
THE GREAT DOCTRINES OF REVIVAL
(SERMON NUMBER 20 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, సెప్టెంబరు 6, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, September 6, 2015

"ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని, విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడుచున్నారు, వారు భక్తీ హీనులై, మన దేవుని కృపను కామాతుర త్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయ నాథుడును, ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింప బడినవారు" (యూదా 3, 4).


అపోస్తలులైన యూదా ప్రభువైన యేసు క్రీస్తులో సగ సహోదరుడు. రక్షణను గూర్చి సామాన్యంగా వ్రాయ తలపెట్టాడు. కాని, వ్రాస్తుండగా, వేరే విషయముపై వ్రాయాలని పరిశుద్ధాత్ముడు నడిపించాడు. అబద్ధపు బోధను కొందరు సంఘములోనికి తెస్తున్నట్టు విన్నాడు. కనుక విషయాన్ని మార్చి "విశ్వాసము కొరకు ఆసక్తితో ఆతృత పడాలని" చెప్పాడు. బైబిలు నిజ బోధలను సమర్దించాలని చెప్పాడు. వారు బలముగా ఆతృత పడాలి – తృష్ణ కలిగి యుండాలి – క్రైస్తవ్య సిద్ధాంతాలను వేదనతో సమర్ధించాలి! వారికివ్వ బడిన విశ్వాసాన్ని బలంగా సమర్ధించాలి, నిర్లక్ష్యం చేయకూడదు, కలుపకూడదు, తీయకూడదు!

ఆ పదాలు చాలా ప్రాముఖ్యము తరముతో వయసుతో పనిలేదు! అమెరికాలో యూరపులో సంఘాలు చనిపోతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాము. 88% యవనస్థులు 30 సంవత్సరాలలోపే సంఘాలను వదిలిపెడుతున్నారు. లోకము నుండి యవనస్థులను ఎలా మార్చాలో కాపరులకు అర్ధం కావడం లేదు. డాక్టర్ కార్ల్ ఎఫ్. హెచ్. హెన్నీ చెప్పింది నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది మొదటిగా చదివినప్పుడు.

మన తరము దేవుని సత్యాన్ని కోల్పోయింది, దైవిక ప్రత్యక్షత వాస్తవత లేదు, దేవుని చిట్టా ఆసక్తి లేదు, ఆయన విమోచన శక్తి లేదు, ఆయన వాక్య అధికారము లేదు. ఈ నష్టానికి [మనము] మూల్యము చెల్లిస్తున్నాము విగ్రహారాధన ప్రత్యక్షత ద్వారా...క్రూరులు అంతరించు నాగరిగతను జల్లెడ పడుతున్నారు అవిటి సంఘ నీడలలో ఇప్పటికే దాగి ఉన్నాయి (Carl F. H. Henry, Th.D., Ph.D., “The Barbarians Are Coming,” Twilight of a Great Civilization: The Drift Toward Neo-Paganism, Crossway Books, 1988, pp. 15, 17).

గత నలభై సంవత్సరాలుగా ఒక సంఘాన్ని సృష్టించడానికి శత విధిలా ప్రయత్నించాను, యవనస్ఠులు నిరీక్షణ కనుగొనడానికి, పట్టణమని పిలిచే నిరీక్షణ లేని, నలిగిపోవు ఒంటరితనము మధ్యలో. మన సంఘాలు చనిపోతున్నాయి అవి చాలా మంది యవనస్ఠులకు సహాయ పడలేక పోతున్నాయి – మీకు తెలుసు నేను సరియేయని! డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ చెప్పాడు "భయంకర స్వధర్మత గత [150] సంవత్సరాలుగా ఎక్కువగా వేధిస్తుంది" (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1987, p. 55).

నేను మీతో చెప్తాను, "ఎందుకు ఒంటరిగా ఉండడు? ఇంటికి రండి – సంఘానికి! ఎందుకు నశించి పోవాలి? ఇంటికి రండి – దైవ కుమారుడైన, యేసు క్రీస్తు నొద్దకు." మీలో చాలామంది నామాట వినరు దేవుని ఈ సంఘాన్ని అగ్నిలో ఉంచకపోతే! అవును! అగ్నిలో పరిశుద్ధాత్మ ఉజ్జీవము ద్వారా! అదే మనకు కావాలి! అదే మనకు అత్యవసరంగా కావాలి! పరిశుద్ధాత్మ ఉజ్జీవము – దేవుని కొరకు సంఘాన్ని అగ్నిపై ఉంచడం!!! అది జరగాలంటే, మనం పునాది వెయ్యాలి, మనం "ఆసక్తితో విశ్వాసాన్ని కోరుకోవాలి ఒకప్పుడు అది పరిశుద్ధుల కివ్వబడింది" (యూదా 3). ఆ విశ్వాసము పునాదిపై మనం ఉజ్జీవాన్ని అనుభవించగలం.

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ ఉజ్జీవముపై ఈ గొప్ప ఆధునిక పుస్తకాన్ని రాసాడు. దానిలో ఆయన అన్నాడు,

సంఘ చరిత్రలో కొన్ని సత్య విషయాలను నిరాకరించే ఉజ్జీవము లేనేలేదు. దీనిని నేను ఆశ్చర్య పరిచే విషయంగా భావిస్తున్నాను. సంఘములో, క్రైస్తవ విశ్వాసపు, ప్రాధమిక విషయాలను కాదనే, ఉజ్జీవము లేదు. ఉదాహరణకు, యూనిపేరియన్ల మధ్య మీరు ఎప్పుడు ఉజ్జీవమును గూర్చి వినలేదు, మీరు ఎందుకు వినలేదంటే ఒకటి లేదు కాబట్టి. అది చరిత్రలో వాస్తవము (Lloyd-Jones, ibid., p. 35).

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "కనుగొనబడిన శారీరక సిద్ధాంతాలకు మినహాయింపు లేకుండా ఉజ్జీవానికి మార్గము లేదు... కనుక నేను ఒక్కాణిస్తున్నాను ఉజ్జీవానికి కొన్ని వాస్తవాలు అవసరము. ఈ వాస్తవాలను కాదంటే, నిర్లక్ష్యము చేస్తే, లెక్క చేయకుంటే, ఉజ్జీవము ఆశీర్వాదాలు ఆశించే హక్కు మనకు లేదు" (ibid., pp. 35, 36, 37). డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ ఆ గొప్ప సిద్ధాంతాలు పేర్కొన్నాడు.

1. మొదటిది, మనము సజీవ దేవుని సౌబ్రాత్రుత్వాన్ని ఆశించాలి, మనం ఉజ్జీవము కోరుకుంటే.

ఆ దేవుడు క్రైస్తవ చరిత్రలో కార్య సిద్ధి కలిగించాడు. ప్రజలకు ఎలాంటి తప్పుడు అభిప్రాయాలున్నా, అపోస్తలుడైన పౌలు అన్నాడు, "అయిననూ దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది" (II తిమోతి 2:19). దేవుని గట్టి పునాది స్థిరంగా ఉంటుంది, లోకంలో ఏమి జరిగిన – బైబిలును గూర్చి క్రైస్తవ్యాన్ని గూర్చి ప్రజలు ఏమనుకున్నా – "దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది."

అవిశ్వాసుల మధ్య నేను పెరిగాను. వారిలో కొందరు దేవుని ఉనికి ఎరుగరు. కొందరు నాస్తికులు. కొందరు "కొత్త వయసు" తలంపును వెంబడించువారు. కొందరు ఆత్మీయులు, మృతులతో మాట్లాడొచ్చు అనేవారు.

నా బంధువులలో క్రైస్తవులు ఎవరు లేరు. కాని నాకు దేవుని అనుభవము ఉంది. నాకు తెలుసు బైబిలు దేవుడు మాత్రమే నిజ దేవుడని. నాకు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. ఆయన సౌబ్రాత్రుత్వ ప్రభువు, నిజమైన, సజీవుడైన దేవుడు. మనం ఆయనకు ప్రార్ధించవచ్చు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు! నిజ దేవుని నమ్మకపోతే ఉజ్జీవము ఉండదు. ఆయన సజీవుడు కాకపొతే ఆయనకు ఎలా ప్రార్దిస్తాం? ఆయన దిగి వచ్చి విషయాలు మార్చకపోతే మనం ఎందుకు ఆయనకు ప్రార్ధించాలి?

2. రెండవది, మనకు ఉజ్జీవము కావాలంటే మనం బైబిలు కొరకు ఆసక్తి కలిగి యుండాలి.

బైబిలు నిజ దేవుని ప్రత్యక్షత. బైబిలు ద్వారా దేవుడు మానవునికి బయలు పరచుకొన్నాడు. చాలామతాలు తెగలు వేదాంతాలు ఉన్నాయి. ఏది సత్యమో ఏది తప్పో ఎలా తెలుస్తుంది? ప్రతివారికి వారి అభిప్రాయాలు ఉంటాయి. వారు దేవుని గూర్చి వారి స్వంత అభిప్రాయాలు ఏర్పరచు కొన్నారు. వారికి ఆ అధికారము లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు వారి మాటలు విన్నాను వారి ఒకరితో ఒకరు విభేదించుకుంటున్నారని నేను గ్రహించాను. నిపుణులులా మాట్లాడారు, అవివేకులులా ప్రవర్తించారు. భాగా చిన్నగా ఉన్నప్పుడు నేను ఎలా తలంచాను, "వారికి దేవుని గూర్చి ఏమి తెలియదు. వారి అవివేకాన్ని పంచుకుంటున్నారు." రక్షింపబడక మునుపే, నిర్ణయించుకున్నాను, బైబిలులోని మాటలు నేను నమ్మాలని – ప్రజాభిప్రాయాలు కాదు. యవనునిగా కీర్తనలు 119:130 కంఠస్త పెట్టాను,

"నీ వాక్యములు వెళ్ళకి అగుట తోడనే వెలుగు కలుగును; అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును" (కీర్తనలు 119:130).

"నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు! అవి, నా నోటికి తేనే కంటే తీపిగా ఉన్నవి! నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను: తప్ప మార్గము లన్నియు నా కసహ్యము లాయెను" (కీర్తనలు 119:103, 104).

"దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు, పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు, ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును దైవా వేషమును కలిగిఉన్నది: నీతి యందు శిక్ష చేయుటకును, ప్రయోజనకరమైయున్నది" (II తిమోతి 3:16, 17).

ఈ ఉజ్జీవముల చరిత్ర చదువుచున్నప్పుడు ఆవిధంగా ప్రజలు నమ్మారని మీరు కనుగొంటారు. బైబిలులోని ప్రతి మాటను నమ్మని వారి మధ్య ఉజ్జీవము వచ్చినట్లుగా చరిత్రలో ఎప్పుడు చూడము. బైబిలు స్థానంలో స్వంత అభిప్రాయాలు పెట్టె వారి మధ్యలో ఎన్నడు ఉజ్జీవము రాలేదు. ఎందుకు? ఎందుకంటే బైబిలు సజీవుడైన దేవుని వాక్కు. వారు నమ్మే కొన్ని భాగాలతోనే ఏకీభవించు వారు నాకు తెలుసు. వారు మంచి క్రైస్తవులు కాదు. వారి ప్రార్ధనకు జవాబుగా అద్భుతాలు జరుగుట వారు చూడరు. ఉజ్జీవము చూడక పోవడానికి అవిశ్వాసము పెద్ద కారణంగా బైబిలులో మనము చూస్తాము.

3. మూడవది, మనము పాపాత్ముడైన మనిషిని చూడాలి, పాపముచే పతనము అయ్యే మనిషిని చూడాలి, మనకు ఉజ్జీవము కావాలనుకుంటే.

మూడవ గొప్ప సిద్ధాంతము నిర్లక్ష్యము చేసేది మానవుడు పాపములో జన్మించాడని, మానవుడు స్వాభావికంగా పాపియని, మానవుడు దేవుని ఉగ్రత క్రింద జీవిస్తున్నాడని. క్రైస్తవ్య చరిత్ర చదవండి వారు పాపములో పుట్టారని నమ్మని మృత సమయాలు చూస్తాం. పాపములో మానవుని పతనము ఒక సిద్ధాంతము ఉజ్జీవ సమయాల్లో వచ్చేది. దేవుడు ఉజ్జీవాన్ని పంపించేటప్పుడు, స్త్రీ పురుషులు పాపపు ఒప్పుకోలులో మూలగడం, ఏడవడం మీరు చూస్తారు. అపోస్తలుడైన పౌలు చెప్పింది వారు అనుభవిస్తారు,

"నా శరీరంలో మంచిది (ఏదియు, నివసింపదని,) నేను ఎరుగుదును... అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను!" (రోమా 7:18, 24).

ఒక వ్యక్తి తన పూర్తీ పాపాన్ని తిరుగుబాటు తనాన్ని చూచినప్పుడు మాత్రమే అతడు తనతో విసిగిపోతాను. మన సంఘాలలో స్వపరీక్ష పూర్తిగా అంతరించి పోయింది. పాపపు ఒప్పుకోలు ఒక వ్యక్తిలో కలగడం ఈ రోజుల్లో అదురుగా కనిపిస్తుంది. మన పూర్వికులు విశ్వాసము ద్వారా బలముగా పాపపు ఒప్పుకోలు కలిగియున్నారు వారు నిద్రపోలేక పోయేవారు – కృప కొరకు మోర పెట్టేవారు. మన బాప్టిస్టు పూర్వికుడు జాన్ బనియన్ ఆ స్థితిలో పద్దెనిమిది నెలలున్నాడు యేసు ఆయనను రక్షింపక మునుపు. కనీసము కూడ అనుభవించకుండా మీకు ఉజ్జీవము రాదు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "మీ హృదయ భయంకరత్వము ఎరుగకపోతే, ఆదాము నుండి స్వతంత్రించుకున్న స్వభావమును గూర్చి తెలుసుకోకపోతే; మీ నిస్సహాయత, నిస్పృహ చూసుకోకపోతే, నీతిమంతుడైన పరిశుద్ధ దేవుని ముందు, ఆయన సంపూర్ణతలో, పాపాన్ని ద్వేషిస్తాడు, ఉజ్జీవాన్ని గూర్చి మాట్లాడే హక్కు నీకు లేదు, ప్రార్ధించే హక్కు కూడ. ఉజ్జీవము బయలు పరిచేది దేవుని సౌబ్రాత్రుత్వము, మానవుని అతిక్రమము, నిస్సహాయత, పాపములో జీవించే మానవుని అనిశ్చయత" (ఐబిఐడి., పేజి 42).

4. నాల్గవది, సిలువపై క్రీస్తు యొక్క నెరవేర్పు త్యాగాన్ని మనం ఆశించాలి –ఆయన నెరవేర్పు రక్తాన్ని, మనం ఉజ్జీవం కావాలనుకుంటే.

విషాద వాస్తవము కేథలిక్ సమాజములో క్రీస్తును గూర్చి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు బాప్టిస్టు సువార్తిక సంఘాలలో కంటే. అవును, నాకు తెలుసు సమాజమును గూర్చి వారి అభిప్రాయము తప్పు అని. వారు తప్పు అని కూడా తెలుసు. సిలువపై క్రీస్తు నెరవేర్పు కార్యాన్ని గూర్చి మనము మాట్లాడక పోవడం ఇంకా తప్పు. చాలామంది సువార్తికులనుకుంటారు క్రీస్తు లేకుండా, దేవుని ద్వారా క్షమాపణ పొందుకోవచ్చని, సిలువపై ఆయన నెరవేర్పు లేకుండా పాపానికి.

బోధకులు కూర స్వతంత్ర హేరీ ఎమర్ సన్ ఫోస్ డిక్, దయ్యాలు పట్టిన భిషఫ్ జేమ్స్ సైక్ కన్య జననము, రక్త నెరవేర్పు, క్రీస్తు శారీరక పునరుద్ధనాన్నిపై ఎదురుదాడి చేసారు. వారు ఈనాడు సూక్ష్మంగా ఉన్నారు. వారి ప్రసంగాలలో నుండి క్రీస్తును ఆయన క్రియలను తొలగిస్తున్నారు! క్రీస్తును గూర్చి బోధించడమే మానేసారు. అందుక ఒక కళాశాల అమ్మాయి రిక్ వారెన్ సంఘములో చెప్పింది, జీవితమంతా అక్కడికి వెళ్లిందట, ఒక్కమాట కూడ నేర్చుకోలేదు! అది ఆలోచించుడి – ఒక్కమాట కూడ – యేసు క్రీస్తును గూర్చి – ఆమె సాక్ష్యము చెప్పమన్నప్పుడు. ఆమె ఒక్కతే కాదు. బాప్టిస్టులు సువార్తికులు సాక్ష్యము చెప్పమన్నప్పుడు 20 లో ఒకరు కూడ క్రీస్తును మహిమ పరచరు. వారి గురించే మాట్లాడుతారు, వారు ఆలోచించేది, వారికి అనిపించేది. కాని కొద్దిమంది – బహు కొద్దిమంది – ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి ఒకటి రెండు మాటలకంటే ఎక్కువ చెప్తారు. ప్రసంగాలలో ఆయన గూర్చి ఎక్కువ వినలేదు, కనుక ఈ పేద నశించే సువర్తికుల నుండి, సాక్ష్యాలు ఎలా ఊహించగలం! డాక్టర్ మైకల్ హార్తన్ వెస్ట్ మినిస్టర్ సెమినరీ కాలిఫోర్నియాలో పద్దతిలో వేదాంత విద్యను బోధించాడు. డాక్టర్ హార్తాన్ ప్రసిద్ధ పుస్తకము నిర్లక్ష్య క్రైస్తవ్యము: అమెరికా సంఘానికి ప్రత్యామ్నాయ సువార్త (బేకర్ బుక్స్, 2012 ముద్రణ).

ఈ భయంకర ఒరవడి ఆయన సంఘాలలో నుండి ప్రభువైన యేసు క్రీస్తును మౌన పరచింది! మన స్వతంత్ర బాప్టిస్టు సంఘాలలో ఇది తరచూ వాస్తవము. దానికి ఒక కారణము చాల బాప్టిస్టు సంఘాలు ఆదివారము రాత్రి మూయబడుతున్నాయి. కనుక సంఘ కాపరి వారములో తన ప్రజలకు 30 నిమిషాలు మాత్రమూ బోధిస్తాడు. కనుక "క్రైస్తవ జీవితమూ" ఎలా జీవించాలో అనేది మారని సంఘ సభ్యులకు బోధించడంలో తన సమయాన్ని వెచ్చిస్తాడు, సాధారణంగా పొడి, వచనము వెంబడి వచనము "వివరణ" ప్రసంగాల ద్వారా. చివరిలో రక్షింపబడాలనుకునే వారిని చేతులెత్తమంటాడు. క్రీస్తు సువార్త, ఆయన రక్త ప్రోక్షణ, ఆయన పునరుత్థానములను గూర్చి బోధించే అవసరమే లేదు. ప్రజలకు ఇది అవసరము లేదు. వారు చేయవలసిందంతా కార్డు నింపడం, చేతులేత్తడం, అర్ధం కాని మాటలు ఉచ్చరించడం (పాపి ప్రార్ధన) తరువాత బాప్మిస్మము పొందడం. అలా వేలమంది మన పిల్లలు బాప్మిస్మము పొంది నశించారు, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి నిజమైన సువార్త ప్రసంగము వినకుండా – 150 సంవత్సరాలుగా ఎందుకు ఉజ్జీవము లేదు అని ఆశ్చర్యపడుతుంటాం! "క్రీస్తు లేని క్రైస్తవ్యము" ఉండే మన సంఘాలలో ఉజ్జీవానికి ఎలా అవకాశం ఉంటుంది? ఆ కారణాన్ని బట్టి యూట్యూబ్ వెబ్ సైట్ లో ప్రతివారం నేను చెప్తుంటాను ఆదివారము సాయంత్రపు ఆరాధనలు లేని గుడులకు హాజరు కావద్దని! లోతు తన భార్యకు చెప్పినట్టు, "వదిలి పెట్టి వెనుకకు చూడవద్దు!"

యవనస్తులారా, మీరు క్రీస్తు వైపు తిరగాలి, సిలువపై కార్చిన ఆయన ప్రశస్త రక్తములొ కడుగబడాలి, పాపమూ నుండి దేవుని ఉగ్రత నుండి, తప్పించుకోడానికి! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఉజ్జీవము, అన్నిటికి పైగా, దైవ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తును, మహిమ పరచుట" (ఐబిఐడి., పేజి 47).

ఇంకా, డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ప్రతి ఉజ్జీవ సమయాలలో, మినహాయింపు లేకుండా మీరు కనుగొంటారు, క్రీస్తు రక్తమును గూర్చి అద్భుత ఒక్కనింపు ఇవ్వబడింది" (ఐబిఐడి., పేజి 48). నా సహాయకుడు డాక్టర్ కాగన్ డాక్టర్ మెక్ ఆర్డర్ గుడికి సంవత్సరానికి పైగా హాజరయ్యాడు – ప్రతి ఆదివారము. నా దగ్గర డాక్టర్ మెక్ ఆర్డర్ టేపులున్నాయి. మా ఇద్దరికీ తెలుసు డాక్టర్ మెక్ ఆర్డరు క్రీస్తు రక్తాన్ని చులకన చేస్తాడని, "రక్తాన్ని" "మరణానికి" మారుస్తాడని చాల సార్లు ఆయన బోధలలో. ఎందుకల చేస్తాడు? సులువే! అతడు ఆధునిక బోధకుడు పాత పధ్ధతి ఉజ్జీవములో అతనికి ఆసక్తి లేదు. కాని డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ సరియే ఇలా అన్నప్పుడు, "క్రైస్తవ సువార్తకు నరము, కేంద్రము, గుండె ఇది: ‘ఆయన రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణా ధారముగా బయలు పరచెను’ (రోమా 3:25). ‘ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి యున్నది’ (ఎఫెస్సీయులకు 1:7)" (ఐబిఐడి., పేజి 48). మళ్ళీ, డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఉజ్జీవపు నిరీక్షణ లేదు ఎప్పుడు ప్రజలు సిలువ రక్తాన్ని తిరస్కరిస్తారో, దానిపై అపహాస్యము చల్లి మనము అతిశయ పడతామో" (ఐబిఐడి., పేజి 49). ఉజ్జీవములో, క్రీస్తు రక్తము బోధలోను, పాటల్లోనూ వక్కాణింపబడింది. గొప్ప ఉజ్జీవ సమయాల్లో వ్రాయబడిన కొన్ని వినండి,

అయ్యో! నా రక్షకుడు రక్తం కార్చడా?
   నా రక్షకుడు మరణించాడా?
ఆ పరిశుద్ధ శిరస్సును అంకితం చేస్తాడా
   పురుగులాంటి నా కొరకు?
("అయ్యో! నా రక్షకుడు రక్తం కార్చడా?" డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748).

రక్తముతో నిండిన ఊట ఉంది
   ఇమ్మాను యేలు నరముల నుండి వచ్చినది;
ఆ రక్త ప్రవాహము క్రిందకు వెళ్ళిన పాపులు,
   నేరారోపణ మరకలు పోగొట్టు కుంటారు.
("ప్రవాహము ఉంది" విలియం కౌపర్ చే, 1731-1800).
(“There Is a Fountain” by William Cowper, 1731-1800).

ఆయన పైన ఎప్పటికి జీవిస్తాడు, నా కొరకు విజ్ఞాపన చెయ్యడానికి;
   విమోచించే ఆయన ప్రేమ, ఆయన ప్రశస్త రక్తము,
ఆయన రక్తము మన జాతికి చిందించబడింది, కృపా సింహాసనము నుండి చల్లింపబడుతుంది,
   కృపా సింహాసనము నుండి చల్లింపబడుతుంది.
("లెమ్ము! నా ఆత్మా, లెమ్ము!" చార్లెస్ వేస్లీచే, 1707-1788).
(“Arise! My Soul, Arise!” by Charles Wesley, 1707-1788).

ఉజ్జీవ సమయంలో సిలువ క్రీస్తు రక్తము ప్రముఖ పాత్ర వహిస్తాయి – డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ చెప్పినట్లు.

5. ఐదవది, మనము ఒప్పుకోలు కలిగించే, మార్చే పరిశుద్ధాత్మ కార్యమును ఆశించాలి.

పరిశుద్ధాత్మ కార్యము శక్తినిచ్చి అన్ని సిద్ధాంతాలను అన్వయింప బడుతుంది. ఆత్మా ఏమి చేస్తుంది? బ్రాంతి ద్వారా ఆయన దేవుని మనకు నిజము చేస్తాడు. మన ఆత్మీయ నేత్రాలు తెరచి బైబిలులో ఉన్న సత్యాన్ని గ్రహించి పొందుకోనేటట్టు చేస్తాడు. పాపపు ఒప్పుకోలు కలిగించి, కడగడానికి యేసు’ రక్తము అవసరత చూపిస్తాడు! "ఆయన వచ్చినప్పుడు, పాపమును గూర్చి లోకమును ఒప్పుకోన చేయును" (యోహాను 16:8). తరువాత నిన్ను యేసు నొద్దకు చేర్చుతాడు, ఆయనను నమ్మేటట్టు చేస్తాడు యేసు’ రక్తము ద్వారా పాపాలన్నిటి నుండి కడగబడినప్పుడు. యేసు అన్నాడు, "ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియ చేయును: గనుక నిన్ను [మహిమ పరచును]" (యోహాను 16:14).

నా ప్రియ స్నేహితులారా, మన సంఘములో పరిశుద్ధాత్మ క్రుమ్మరింపు కొరకు మేము ప్రార్ధిస్తున్నాము –ఎందుకంటే మన మధ్య నశించు వారు పాపపు ఒప్పుకోలు కలిగి ఆయన రక్తము ద్వారా కడుగబడుట ద్వారా ఆయన దగ్గరకు చేర్చబడుట చూడాలని మా కోరిక. కాని వారు పాపపు బానిసలు, ఆ బందీ గృహములో నుండి యేసు నొద్దకు రాలేరు. పరిశుద్ధాత్మ మాత్రమే పాప బంధకాల్లో ఉన్న వారిని విడుదల చేయగలడు. వారి పాపపు హృదయాల విషయంలో పరిశుద్ధాత్మ మాత్రమే విసుగు పుట్టించగలడు. ఆయన రక్తము ద్వారా సిలువ ద్వారా, పరిశుద్ధాత్మ మాత్రమే రక్షణ నిమిత్తము యేసు నొద్దకు చేర్చగలడు!

మీరు తిరిగి గుడికి రావాలి నిజ క్రైస్తవుడవడానికి ఎక్కువగా నేర్చుకోవాలి. అలా చెయ్యి! అలా చెయ్యి! దయచేసి 3 వ పాట పాడండి, "రక్తములో శక్తి ఉంది."

పాప భారము నుండి విడిపింపబడతావా?
   రక్తములో శక్తి ఉంది, రక్తములో శక్తి.
దుష్టత్వముపై జయము పొందుకుంటావా?
   రక్తములో అద్భుత శక్తి ఉంది.
శక్తి, శక్తి, అద్భుత క్రియాశక్తి
   గొర్రె పిల్ల రక్తములో;
శక్తి, శక్తి, అద్భుత క్రియాశక్తి
   ప్రశస్త గొర్రె పిల్ల రక్తములో.

నీ పాపమూ నుండి గర్వము నుండి కడుగబడతావా?
   రక్తములో శక్తి ఉంది, రక్తములో శక్తి.
కల్వరి కెరటము యెద్దకు కడుగు కొనుటకు రమ్ము;
   రక్తములో అద్భుత శక్తి ఉంది.
శక్తి, శక్తి, అద్భుత క్రియాశక్తి
   గొర్రె పిల్ల రక్తములో;
శక్తి, శక్తి, అద్భుత క్రియాశక్తి
   ప్రశస్త గొర్రె పిల్ల రక్తములో.
("రక్తములో శక్తి ఉంది" లూయిస్ ఇ. జోన్స్ చే, 1865-1936).
(“There is Power in the Blood” by Lewis E. Jones, 1865-1936).

డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం:
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"మీ పనిని ఉజ్జీవింపచేయండి, ఓ ప్రభూ" (ఆల్ బర్ట్ మిడిలేన్ చే, 1825-1909).
“Revive Thy Work, O Lord” (by Albert Midlane, 1825-1909).


ద అవుట్ లైన్ ఆఫ్

ఉజ్జీవమును గూర్చిన గొప్ప సిద్ధాంతాలు

(ఉజ్జీవముపై 20 వ ప్రసంగము)
THE GREAT DOCTRINES OF REVIVAL
(SERMON NUMBER 20 ON REVIVAL)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని, విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడుచున్నారు, వారు భక్తీ హీనులై, మన దేవుని కృపను కామాతుర త్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయ నాథుడును, ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింప బడినవారు" (యూదా 3, 4).

1. మొదటిది, మనము సజీవ దేవుని సౌబ్రాత్రుత్వాన్ని ఆశించాలి, మనం ఉజ్జీవము కోరుకుంటే, II తిమోతి 2:19.

2. రెండవది, మనకు ఉజ్జీవము కావాలంటే మనం బైబిలు కొరకు ఆసక్తి కలిగి యుండాలి, కీర్తనలు 119:130, 103, 104; II తిమోతి 3:16, 17.

3. మూడవది, మనము పాపాత్ముడైన మనిషిని చూడాలి, పాపముచే పతనము అయ్యే మనిషిని చూడాలి, మనకు ఉజ్జీవము కావాలనుకుంటే, రోమా 7:18, 24.

4. నాల్గవది, సిలువపై క్రీస్తు యొక్క నెరవేర్పు త్యాగాన్ని మనం ఆశించాలి –ఆయన నెరవేర్పు రక్తాన్ని, మనం ఉజ్జీవం కావాలనుకుంటే, రోమా 3:25; ఎఫెస్సీయులకు 1:7.

5. ఐదవది, మనము ఒప్పుకోలు కలిగించే, మార్చే పరిశుద్ధాత్మ కార్యమును ఆశించాలి, యోహాను 16:8, 14.