ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఎందుకు సాతాను మార్పుల నిమిత్తము
|
అవును, ఈ పాఠ్యభాగము ఇంకొక ప్రసంగము బోధిస్తున్నాను. ఈ రాత్రి దీని గూర్చి ఎక్కువ చెప్తాను. నేను సరియైన పని చెయ్యాలి, ఎందుకంటే చాల రోజులుగా దెయ్యము నన్ను దాడి చేస్తుంది! గత ఒకటి రెండు సంవత్సరాలలో ప్రసంగ సిద్ధపాటులో ఎంతగా ఎప్పుడు కష్టపడలేదు. ఒక సమయంలో సాతాను నాపై నేరుగా దాడి చేస్తున్నట్టనిపించింది. కొంతమంది (ప్రసంగీకులు) కూడ అనుకోవచ్చు నేను ఎక్కువ చేస్తున్నానని. కాని కాదు. నాకు ఒప్పుకోలు ఉంది గత ఆదివారము రాత్రి నుండి నేను నేరుగా సాతాను దాడిలో ఉన్నాను. ఈ పాఠ్యభాగముపై గత ఆదివారము రాత్రి బోధించినప్పటి నుండి నేను అనారోగ్యముగా మానసిక సూన్యతలో ఉన్నాను. అకస్మాత్తుగా నాకు తేట పర్చబడింది మార్కు 9:29 పై రెండవ సారి దేవుడు నన్ను బోధించమంటున్నాడని. కాని సాతాను నన్ను తికమక చెయ్యడానికి అలా చెయ్యకుండా ఉండడానికి గట్టిగా ప్రయత్నించింది. గత ఆదివారము రాత్రి ("ఒబామా కాలంలో ప్రార్ధన ఉపవాసము") నేను ఆరు కారణాలు ఇచ్చాను ఎందుకు పదాలు "మరియు ఉపవాసము" మార్కు 9:29 ఆఖరిలో ఎందుకు తొలగింపబడకూడదు అనడానికి. కొత్త తర్జుమాలన్ని ఈ పదాలు తొలగించాయి. ఈ పదాలు తొలగించిన గ్రీకు పాఠ్యభాగము టిస్ చెండాల్ప్ (1815-1874) సెయింట్ కేథరీన్ మొనాస్టరీలో, అలెగ్జాండ్రియాకు 400 మైళ్ళ దూరంలో ఉన్న సినాయి పెనిన్ సులాలో కనిపెట్టిన సినైటిక్ ప్రతి. ఆ ప్రాంతంలో యోగాశ్రమము వృద్ధి చెందింది, అది భౌతిక లోకంలో తిరస్కరించబడింది దాని దృష్టి అవస్తువకతపై ఉంది. సెయింట్ కేథరీన్ మొనాస్టరీ 548 ఎ.డి.లో కట్టబడింది. 360 ఎ.డి.లో సేనైటికస్ ప్రతి చూచి వ్రాయబడింది. అది సూచిస్తుంది అది వేరే చోటు నుండి రవాణా చేయబడింది, బహుశా అలేగ్జెండ్రియా నుండి కావచ్చు. నేను ధ్యానించే కొద్ది నాకు నిర్ధారణ అయింది, యోగాశాస్త్ర సన్యాసులు పదాలు "మరియు ఉపవాసమును" విడిచిపెట్టారు ఎందుకంటే అది వారి అభిప్రాయంతో అమరలేదు కాబట్టి. ఇలాంటి సమస్యను మనము క్రైస్తవ మానసిక స్థితిలో చూడాలి, దెయ్యాలను సాతానును చాల తీవ్రంగా తీసుకునే స్థితి. మినహాయింపు "ఆఖరి రోజులలో" సినైటికస్ ప్రతి కనుగొనబడడం అప్పుడే సంభవించిందో? ఈ ప్రతి కనుగొనబడిన సమయంలోనే మన సంఘాలలో "నిర్నయత్వత" మార్పిడి స్థానాన్ని భర్తీ చేసిందా? ప్రపంచమంతటా ఈ ప్రతి విస్తరిస్తున్నప్పుడు సంఘాలు దెయ్యపు సిద్ధాంతాలతో నింపబడ్డాయా? ఫిన్నీ "నిర్నయత్వత", కెంప్ బెల్లెడ్స్ బాప్టిస్టు రక్షణ, మెర్మోనుల ముగ్గురు దేవుళ్ళు, బైబిలుపై స్వతంత్రుల దాడులు, యెహోవా సాక్షుల నీతిక్రియలు, సెవెంత్ డే ఎడ్వంటి స్టూల సబ్బాతు ఆచరణము ఇవన్ని కూడ ఒకేసారి 19 వ శతాబ్దములో 50 సంవత్సరాల వ్యవధిలో వచ్చాయా? పరిణామముపై డార్విన్ పుస్తకాలు ఆ సమయంలోనే ముద్రింపబడ్డాయా? పాశ్చాత్య ప్రపంచంలో అదే సమయంలోనే 1857- 59 కాలములో గొప్ప ఉజ్జీవము సంభవించిందా, అదే సమయంలో టిస్ చెండరఫ్ సినాయిటికస్ ప్రతి కనుగొన్నాడా? "మరియు ఉపవాసము" అనే పదాలు సినాయిటికస్ ప్రతి కనుగొనబడి ఆ పదాలు తొలగింపబడడం పాశ్చాత్య ప్రపంచంలో గొప్ప ఉజ్జీవము సంభవింపకపోవడం ఒకేసారి జరిగినట్టు లేదా? అవన్నీ ఒకేసారి ఎలా సంభవించాయి? కాదు, ఈ కాలము చరిత్రలో చాందస క్రైస్తవ్యమునకు వ్యతిరేకంగా జరిగిన గొప్ప దాడులను చూసింది – "మరియు ఉపవాసము" తొలగింపబడడం వారిలో ఒకటి! ఆఖరి దినాలలో దెయ్యపు కార్యకలాపాలను గూర్చి ప్రత్యేక హెచ్చరిక ఇవ్వబడింది. అపోస్తలుడైన పౌలు అన్నాడు, "అయితే కడవరి దినములలో, కొందరు అబద్ధికుల వేష ధారణ [తరువాత] వలన మోస పరచు ఆత్మల యందును, దయ్యముల బోధ యందును లక్ష్య ముంచి, విశ్వాస భ్రష్టు లగుదురు" ( I తిమోతి 4:1). డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు, ఈ మోసపరచు ఆత్మలు, వాటి రాజు దయ్యమును సేవిస్తూ, ఆఖరి దినాలలో, విశ్వాసము నుండి వైదొలుగు వారి వెనుక కనబడని శక్తిగా పనిచేస్తాయి. వాటి ముఖ్య గురి స్త్రీ పురుషులు లూసిఫర్, లేక సాతాను, నొద్దకు స్త్రీ పురుషులును రప్పించడం, నేరుగా కాక, వక్ర మార్గములో" (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishers, 1995, p. 1345; note on I Timothy 4:1). క్రీస్తు రక్తము విషయంలో అతనితో నేను ఏకీభవించినప్పటికిని, డాక్టర్ మెక్ ఆర్డర్ అన్నాడు ఈ దెయ్యపు కార్యకలాపాలు "క్రీస్తు రాకడ మునుపు ఒక ముగింపుకు వస్తాయి" (The MacArthur Study Bible; note on I Timothy 4:1). నేను ఒప్పింపబడ్డాను దయ్యము "వెనుక ఉండే అదృశ్య శక్తులు" "ఆఖరి దినాల" గొప్ప తప్పులకు కారణము – పొరపాట్లు "నిర్నయత్వత," కెంప్ బెల్ అభిమతము, మొర్మోనిజము, సెవెంత్ డే ఎడ్వేంటిజం, స్వతంత్రత, యెహోవా సాక్షులు, క్రైస్తవ శాస్త్రము, పునరుద్దరింపబడిన ఇస్లాము. దయ్యనికి తెలుసు ప్రార్ధన మరియు ఉపవాసము క్రైస్తవుల చేతిలో శక్తివంతమైన పరికరమని. సాతానుకు ఇంకా తెలుసు మార్కు 9:29 మరియు మత్తయి 17:21 లలో మాత్రమే కొత్త నిబంధనలో ఉపవాసము మరియు ప్రార్ధన యొక్క శక్తి ఆవశ్యకతను గూర్చి చెప్పబడిందని. ఈ రెండు వచనాలు లేకుండా యేసు నోటనుండి ఉపవసముపై నేరుగా బోధ లేదు. దాని గూర్చి ఆలోచించండి! సూటి వివరణ లేదు ఎందుకు ఎలా మనం ఉపవసించాలో "మరియు ఉపవాసము" తొలగింపబడుట వలన! "మరియు ఉపవాసము" అనే పదాలు తొలగింప బడడం వలన మన సంఘాలు బలహీనములు శక్తి హీనమవడం ఇప్పుడే ఈ సమయంలో జరిగిందా? నేననుకోను! కానే కాదు! పాతకాలంలో కాపరులు అర్ధం చేసుకున్నారు అబద్ధపు మతము వెనుక దెయ్యపు శక్తి ఉందని. ఇంకా, మునపటి కాలములో, బోధకులు అర్ధం చేసుకున్నారు సాతాను దెయ్యాలు కొన్ని సార్లు విజ్రుంబిస్తాయి ప్రార్ధన ద్వారా అది జయింపబడనేరవు. అప్పుడు వారు క్రీస్తు మందలింపు వైపు తిరిగారు, "ఈ విధమైనది, ప్రార్ధన మరియు ఉపవాసము ద్వారా మాత్రమే వదిలిపోవును" (మార్కు 9:29). సువార్తికులు ముఖ్య బోధకులు 19 వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో వారికి తెలుసు జాన్ వెస్లీ (1703-1791) సరియే అని ఇలా అన్నప్పుడు, "కొన్ని రకాల దెయ్యాలు [పిశాచాలు] అపోస్తలులు వెళ్ళగొట్టారు ఉపవాసము లేకుండా" – కాని "ఈవిధమైన దెయ్యాలు [పిశాచాలు] ప్రార్ధన మరియు ఉపవాసముతోనే వెళ్ళగొట్ట బడ్డాయి – ఎంత గొప్ప సాక్ష్యము ఉంది, ఇక్కడ ఉపవాసపు జిజ్ఞాస ఎడతెగని ప్రార్ధనతో మిలితమవడం" (Wesley’s Notes on the New Testament, vol. 1, Baker Book House, 1983 reprint; note on Matthew 17:21). గొప్ప సంస్కర్తలందరూ ఉపవసించి ప్రార్ధించారు – లూథర్, మెలాన్ చతన్, కెల్విన్, నాక్స్ – వారంతా ఉపవసించి ప్రార్దించారు! గొప్ప ప్రసంగీకులు బన్యన్, వైట్ ఫీల్డ్, ఎడ్వర్డ్స్, హోవేల్ హేరిస్, జాన్ సేన్నిక్, డానియల్ రోలాండ్, మెక్ యీన్, నేటల్ టోన్ ఇంకా ఎందఱో ఉపవాసము మరియు ప్రార్ధనను ఉపయోగించుకున్నాను. కాని ఇప్పుడు, డాక్టర్ ల్లాయిడ్–జోన్స్ మాటలు వాడాలంటే, "సంఘము మత్తులో ఉండి వంచింపబడింది; సంఘము నిద్రిస్తుంది, [సాతానుతో ఉన్న] వైరమును గూర్చి తనకు ఏమి తెలియదు" (Martyn Lloyd-Jones, M.D., The Christian Warfare, The Banner of Truth Trust, 1976, p. 106). క్రీస్తు ఉపదేశము "ప్రార్ధించి మరియు ఉపవసించుట" దెయ్యములను వెళ్ళగొట్టడానికే కాదు, కాని మార్పిడి విషయంలో, ముఖ్యంగా కష్ట పూరిత వ్యక్తులు – మరియు, ఆఖరి దినాలలో, అన్ని చాల కష్టంగా అనిపిస్తున్నాయి! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "చిన్న నేరు ఆవరింపులో కూడా మనము గుర్తించాలి సత్యము మన ప్రతి కూలతలో, దెయ్యము చాలామందిపై నియంత్రిత్వము శక్తిని [ఉపయోగిస్తాడు]. మనం అర్ధం చేసుకోవాలి గొప్ప శక్తి నుండి మన జీవితాలు కాపాడుకోవడానికి మనం పోరాడుచున్నామని. మనం శక్తివంత వ్యతిరేకతకు వ్యతిరేకంగా ఉన్నాము" (Studies in the Sermon on the Mount, part 2, Eerdmans, 1987, p. 148). మనం ఆత్మీయ పోరాటాన్ని పోరాడుతున్నాము. సాతాను శక్తులు భాగా శక్తివంతమవుతున్నాయి. నశించు వారి కొరకు ప్రార్దిస్తున్నాం కాని ఏమి జరగడం లేదు. పాపపు ఒప్పుకోలు వారికి రావడం లేదు. క్రీస్తు అవసరత వారికి అనిపించడం లేదు. ఆయన దగ్గరకు రావడానికి నిరాకరిస్తున్నారు. వారి మనసులు చీకటిమయం, ఆత్మీయ విషయాల అవగాహన వారికి చీకటి మయమయింది. మనం ప్రార్ధన కొనసాగిస్తున్నాం, కాని ఏమి సంభవించడం లేదు. బహుకొద్ది మంది కొత్తవారు గుడికి వచ్చి ఉంటున్నారు. వదిలేయ్యలనిపిస్తుంది. కాని, ఆగండి! ఇంకా ఉంది! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "నాకు ఆశ్చర్యము ఉపవాసపు విషయాన్ని మనం ఆలోచన చెయ్యాలి అనిపించడం? వాస్తవమేమిటంటే, ఆవిషయము, మన జీవితాలలో నుండి వెళ్ళిపోవడమే కాకుండా, మన క్రైస్తవ ఆలోచన విధానాన్ని తుడిచి పెడుతుంది" (Studies in the Sermon on the Mount, part 2, p. 34). వెస్లీ సహోదరులు ప్రార్ధించి ఉపవసించినప్పుడు, విషయాలు సంభవించాయి. చార్లెస్ తరుచు తన సహోదరుడు జాన్ చే అధికమింప బడ్డాడు. కాని చార్లెస్ వెస్లీ ప్రసంగించినప్పుడు చెప్పబడింది చాలాసార్లు చాల మార్పిడిలు జరిగాయని. చార్లెస్ వెస్లీ పాడేటప్పుడు దేవుని శక్తిని మీరు అనుభవించారా! ఆయన కొట్టివేయబడిన పాపపు శక్తిని కొట్టివేసాడు, యేసు, ప్రాణేశ్వరా, నీ బాహువులలోనికి రానిమ్ము, అవి చార్లెస్ వెస్లీ వ్రాసిన అందమైన గీతాలు! యెషయా 58 వ అధ్యాయము, నాతో పాటు చూడండి. స్కోఫీల్డ్ స్టడీ బైబిలు లో 763 వ పేజీలో ఉంది. యెషయా 58, వచనము 6. నేను చదువుచుండగా నిలబడండి. "దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు? కాడిమాను మోకాలు విడిపించుట, ప్రతికాడిని విరుగ గొట్టుటయు, నేర్పరచుకొనిన, ఉపవాసము కాదా?" (యెషయా 58:6). కూర్చోండి. మీ బైబిలులో ఆ వచనము క్రింద గీత గియ్యండి. ఉపవసానికి సరియైన మార్గము ఆ వచనము వివరిస్తుంది. క్రైస్తవులు ఎలాంటి ఉపవాసము చేయాలని దేవుడు కోరుకుంటారో ఆ వచనము చూపిస్తుంది. మీరు కంఠత పెట్టండి. ఇది మన కొత్త కంఠత వాక్యము, యెషయా 58:6. దైవిక ఉపవాసము 1) పాపపు [బంధకాలను] విడుదల చేస్తుంది. 2) ప్రతి బరువును తీసివేస్తుంది. 3) బాధింపబడిన వారిని విడిపిస్తుంది. 4) ప్రతికాడిని విరుగగొడుతుంది. ఆర్ధర్ వాలిస్ అన్నాడు, "ఉపవాసము [ప్రార్ధనా యోధుని] బలపరచి విరోధి [సాతాను]పై ఒత్తిడి తెస్తుంది. వాడు బంధించిన వానిని విడుదల చేసేలా ఇలా [దేవుడు ఇస్తాడు] సాతాను శక్తి నుండి విడుదలను" (Arthur Wallis, God’s Chosen Fast, 2011 edition, p. 67). ఇప్పటికే మలాకీలోని వచనములను కంఠత చేసిన వారిని ఇప్పుడు యెషయా 58:6 కంఠత చెయ్యాలని కోరుచున్నాను. వచ్చే శనివారము ఉపవాస దినముగా ప్రకటించుకుందాం. అది ఎలా చెయ్యాలో కొన్ని అంశాలు మీకు ఇస్తాను. 1. మీ ఉపవాసము రహస్యముగా ఉండాలి (సాధ్యమైనంత వరకు). మీరు ఉపవాసము చేస్తున్నట్టు అందరికి చెప్పుకోవద్దు (బందువులకు కూడ). 2. బైబిలు చదవడంలో సమయము గడపండి. అపోస్తలుల కార్యములలో కొన్ని భాగాలు చదవండి (ముఖ్యంగా ఆరంభంలోనిది). 3. యెషయా 58:6 శనివారపు ఉపవాసంలో కంఠత చెయ్యండి. 4. మన ప్రార్ధనలకు జవాబిచ్చి మన ఉపవాసాలను ఆదరించేలా దేవునికి ప్రార్ధించండి. 5. మారని మన యవనస్తులు (పేరు వరసన) మార్పిడి చెందేటట్లు ప్రార్ధించండి. యెషయా 58:6 లో ఆయన చెప్పినదానికి వారికి చేసేటట్టు దేవునికి ప్రార్ధించండి. 6. ఈ రోజు (ఆదివారము) మొట్టమొదటిగా వచ్చిన సందర్శకులు వచ్చే ఆదివారము వచ్చేటట్టు ప్రార్ధించండి. వీలయితే పేరు పేరు వరుసన. 7. నేను వచ్చే ఆదివారము ఏమి బోధించాలో దేవుడు నాకు చూపించేలా దేవునికి ప్రార్ధించండి – ఉదయము మరియు సాయంకాలము. 8. ఆహ్వానితులకు మాత్రమే ప్రార్ధన గుంపుల కొరకు ప్రార్ధించండి అవి మన యవనస్తులవి (అలాంటివి మూడు ఉన్నాయి). మీకు శక్తి ఉంటే జాన్ సామ్యూల్ కాగన్ లను కలువవచ్చు. 9. ఎక్కువ నీరు త్రాగండి. గంటకు ఒక గ్లాసు. పెద్ద కప్పు కాఫీ ఆరంభంలో త్రాగవచ్చు ప్రతిరోజూ తాగే అలవాటు ఉంటే. శీతల పానీయాలు, శక్తి పానీయాలు, మొదలగునవి త్రాగవద్దు. 10. ఏవైనా వైద్యపర ప్రశ్నలుంటే ఉపవాసముండే ముందు వైద్యుని కలవండి. (మీరు డాక్టర్ క్రైగ్ టన్ చాన్ లేక డాక్టర్ జుడిత్ కాగన్ మన గుడిలో కలువవచ్చు). ఒకవేళ తీవ్ర సమస్య ఉంటే ఉపవాసము చేయవద్దు, మధుమేహము కాని అధిక రక్తపోటు గాని ఉంటే. శనివారము ఈ మానవుల నిమిత్తము ప్రార్ధించండి. 11. శుక్రవారము సాయంత్ర భోజన అనంతరము మీ ఉపవాసము ఆరంభించండి. శుక్రవారము భోజనము చేసిన తరువాత ఏమి తినవద్దు శనివారము సాయంకాలము 5:30 వరకు అప్పుడు సంఘములో భోజనము ఉంటుంది. 12. గుర్తుంచుకొండి మీరు ప్రార్దించ వలసిన ప్రాముఖ్య విషయము మన సంఘములో నశించుచున్న యవనస్తులు మార్పు నొందేటట్లు – ఈ సమయంలో కొత్తగా వచ్చే యవనస్తుల కొరకు, మనతో ఎన్నటికి ఉండేలాగున. వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభువే దుష్టబంధకాల నుండి విడుదల చేస్తాడు, పాప భారమును తొలగిస్తాడు, సాతానుచే అణగద్రోక్కబడినవారిని విడుదల చేస్తాడు, ప్రతి దెయ్యపు కాడిని విరుగగొడతాడు. యేసు క్రీస్తు ఈ పనులన్నీ చేస్తాడు, కాని మనం దేవునికి ప్రార్ధించి ఉపవాసము చెయ్యాలి, యేసు దేవుని ఆత్మ శక్తిని మన సంఘములో విడుదల చేసేటట్టు మనకు రక్షణ విడుదల కొత్త వారికి చిన్న పిల్లలకు ఇచ్చేటట్టు! ఈ ప్రసంగపు ముద్రణ ప్రతి మీకు ఇస్తాము ఇంటికి తీసుకెళ్ళడానికి. చదవండి, ఆ 12 అంశాలు చదవండి శనివారము మీరు ప్రార్ధించేటప్పుడు. ఇప్పుడు, నేను ఇంకా మారని వారి కొరకు కొన్ని మాటలు ఇస్తాను. యేసు నీ పాప ప్రాయశ్చిత్తము సిలువపై మరణించాడు, నీ పాపమూ కొరకు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి. యేసు భౌతికంగా లేచాడు, ఆయన పునరుత్థాన శరీరంతో మాంసముతో. నీకు నిత్య జీవము ఇవ్వడానికి ఆయన అలా చేసాడు. యేసు ఆరోహనుడై మూడవ ఆకాశంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. విశ్వాసము ద్వారా నీవు ఆయన దగ్గరకు రావచ్చు, నీ పాపాల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు తీర్పు నుండి కూడ! దేవుడు మిమ్మును దీవించు గాక. ఆమెన్. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి. సినాయిటికస్ ప్రతిపై ఒక కధానిక క్రింద ఇవ్వబడింది ఇది "ఒక చిన్న ముల్లు" నుండి తీసుకొనబడింది అది "పురిటాన్ బోల్ట్" బ్లాగ్ నుండి, డిసెంబర్ 24, 2013. టిస్ చెండార్ఫ్ కోడెక్స్ సినాయిటికస్ ను ఎలా కనుగొన్నాడో క్రింది కథ వివరిస్తుంది: "1844 వ సంవత్సరంలో, ఫ్రెడరిక్ ఆగష్టస్ కింగ్ ఆఫ్ సేక్సనీ పెట్రనేజ్ ద్వారా, టిస్ చెండార్ఫ్ ప్రయాణిస్తుండగా, అతడు సీనాయి పర్వతముపై ఉన్న, సెయింట్ కేథరిన్ కాన్వెంట్ ను చేరుకున్నాడు. ఇక్కడ, పొయ్యి వెలిగించుకోవడానికి సిద్ధంగా ఉన్న పాత పత్రాలను గమనించి, వాటిని తీసికొని, సెప్ట్ అజింట్ అనువాదపు నలభై మూడు వెల్లుం చుట్టలుగా కనుగొన్నాడు. కింగ్ జేమ్స్ బైబిలు వ్యతిరేకులు అన్నారు ఆ ప్రతులు "పనికిరాని బుట్టలో" కనుగోనబడలేదని, కాని అలానే కనుగొనబడ్డాయి. టిస్ చెండార్ఫ్ దానిని అలానే అభివర్ణించాడు. "నేను ఒక బుట్టలో పెద్దది వెడల్పయిన దానిలో పాత పత్రాలు కనుగొన్నాను; గ్రంధాలయ అధికారి అన్నాడు ఇలాంటి రెండు చుట్టాలు అప్పటికే మంటలలో కాల్చబడ్డాయని. ఈ కాగితాల మధ్యలో నేను కనుక్కోవడం నాకు ఆశ్చర్యము..." (Narrative of the Discovery of the Sinaitic Manuscript, p. 23). జాన్ బర్గోన్, టిస్ చెండార్ఫ్ కోడెక్స్ సినాయిటికస్ ను కనుగొన్న సమయంలో బ్రతికి ఉన్నాడు ఆయన స్వయంగా సెయింట్ కేథరిన్ ను దర్శించి ప్రాచీన ప్రతులను అధ్యయనము చేసి, ఆ ప్రతులు "కాన్వెంటులో పనికిరాని పాత కాగితాల బుట్టలో జమ చేయబడి ఉన్నాయని సాక్ష్య మిచ్చాడు." (తిరిగి వ్రాయబడింది, 1883, పేజీలు 319, 342) కనుక, నాకు కచ్చితంగా అనిపిస్తుంది చాదస్తపు సన్యాసులు నిర్ణయించు కున్నారు ప్రతులలోని చాల వదిలివేయడం మార్పులు నిరుపయోగమని తలంచి వాటిని మూసి ఉన్న గదిలో శతాబ్దాల తరబడి భద్ర పరచి ఉంచారు. అయిననూ టిస్ చెండార్ఫ్ విస్తృతంగా భీభత్సంగా ప్రచారం చేసాడు ఇది ఎక్కువ కచ్చితమైన పాఠ్యభాగమని టెక్స్ టస్ రిసేప్టస్ ను సమర్ధించే వేల ప్రతుల కంటే. ఇంకా, అతడు ఊహించాడు అది 4 వ శతాబ్దము నుండి వచ్చిందని, కాని అతడు సరియైన ఋజువు కనుగొనలేక పోయాడు 12 వ శతాబ్దము మునపటి తేది అది కలిగి ఉందని. కోడెక్స్ సినాయిటికస్ సంబంధించి ఈ వాస్తవాలను ప్రతి కూలలను ఆలోచించండి: 1. సినాయిటికస్ ముగ్గురు వేర్వేరు శాస్త్రులచే వ్రాయబడింది తరువాత చాలామంది చే సరిదిద్దబడింది. (ఇది నిర్ధారిత విషయము హెచ్.జె.యం. మిల్నే మరియు టి.సి. స్కీట్ ల విస్తృత దర్యాప్తు ద్వారా వారు బ్రిటిష్ మ్యూజియంకు చెందిన వారిచే ముద్రింపబడింది, శాస్త్రుల కోడెక్స్ సినాయిటికస్ సరిదిద్దిన వారు, లండన్, 1938). టిస్ చెండార్ఫ్ 14,800 సవరణలు లెక్కపెట్టాడు ప్రతులలో (David Brown, The Great Uncials, 2000). డాక్టర్ ఎఫ్.హెచ్.ఎ. స్ర్కీవెనర్, సంపూర్ణ కోడెక్స్ సినాయిటికస్ ను 1864 లో ముద్రించి ఇలా సాక్ష్యమిచ్చాడు: "కోడెక్స్ సవరణలు మార్పులు చేయబడినది కోడెక్స్ – అది కనీసం పది వేర్వేరు పునర్ణి వాహుకులచే తేబడింది, కొందరు ప్రతి పేజి పధ్ధతి బద్ధంగా చేసారు, ఇతరులు అక్కడక్కడ, లేక వేరే ప్రతులకు పరిమితం చేసారు, వాటిలో చాల మొదటి రచయితతో ఏకీభవించాయి, కాని చాలా భాగము ఆరు లేక ఏడవ శతాబ్దానికి సంబందించినది." అలా, ఇది ఋజువైంది పాత శతాబ్దాల శాస్త్రుల సినాయిటిక్స్ ను స్వచ్చ పాఠ్యభాగముగా పరిగణించలేదు. ఎందుకు అది అంతగా ఆధునిక పాఠ్య విమర్శకులచే గౌరవింపబడాలో అది తెలియని మర్మము. 2. చాల ఎక్కువ నిర్లక్ష్యత చూసి వ్రాయడంలోను సరిదిద్దడంలోను ప్రదర్శింపబడింది. "కోడెక్స్ సినాయిటికస్ ‘కళ్ళకు కనబడే కలముతో చేయబడే పొరపాట్లు కలిగి ఉంది అది సమాంతరము కానిది, కాని ఆ పత్రాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వబడింది.’ చాల సందర్భాలలో 10, 20, 30, 40 పదాలు కేవలం నిర్లక్ష్యము వలన వదిలి పెట్టబడ్డాయి. పదాలు మాటలు, పూర్తీ వాక్యాలు కూడ, తరుచు రెండుసార్లు వ్రాయబడ్డాయి, లేక మొదలు పెట్టబడి వెంటనే రద్దు చేయబడ్డాయి; ఆ పొరబాటు, ఒక భాగము విడిచి పెట్టబడదు అదే పదాలతో ముగింపబడడం, కొత్త నిబంధనలో 115 సార్లకు తక్కువ కాకుండా వచ్చాయి." (జాన్ బర్గన్, పునరుద్దరింపబడిన ప్రతి). ఒకటి స్పష్టము శాస్త్రులు కోడెక్స్ సినాయిటికస్ ను చూచి వ్రాసిన వారు దేవునికి నమ్మకస్తులు కాదు వారు భయ భక్తులతో లేఖనాలను భావించలేదు. గ్రీసు పాఠ్యభాగముతో పోలిస్తే సినాయిటికస్ లో సువార్తలలోనే మొత్తం వదిలిపెట్టబడిన పదాలు 3,455 ఉన్నాయి (బర్గన్, పేజి 75). 3. మార్కు 16:9-20 కోడెక్స్ సినాయిటికస్ లో విడిచిపెట్టబడింది, కాని అది ప్రారంభంలో ఉంది అది తుడిచి పెట్టబడింది. 4. కోడెక్స్ సినాయిటికస్ లో అపోక్రిఫాల్ గ్రంధాలు (Esdras, Tobit, Judith, I and IV Maccabees, Wisdom, Ecclesiasticus) కలపబడి ఉన్నాయి మరియు రెండు ఇతర పుస్తకాలు, బర్నబాస్ గ్రంధము షెపర్డ్ ఆఫ్ హెర్మాస్ గ్రంధము. అపోక్రిఫాల్ గ్రంధము బర్నబాస్ నాస్తికతతోనూ, కోటోచ్చె ఆరోపణలతోను కోరడం, ఉదాహరణకు, అబ్రహం నాకు గ్రీకు తెలుసు రక్షణకు బాప్తిస్మము అవసరము లాంటివి బాగా నింపబడ్డాయి. షెఫర్డ్ ఆఫ్ హెర్మాస్ యోగా పరమైనది నాస్తకతను చూపిస్తుంది అందులో చెప్పబడింది "క్రీస్తు ఆత్మ" బాప్తిస్మము సమయంలో యేసు పైకి వచ్చిందని. 5. చివరిగా, కోడెక్స్ సినాయిటికస్ (కోడెక్స్ వేటికనాస్ తో పాటు), తేటగా యోగాశాస్త్ర ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. యోహాను 1:18 లో "అద్వితీయ కుమారుడు" మార్చబడింది "అద్వితీయ దేవునిగా," ఇలా ప్రాచీన ఆర్య నాస్తికత్వాన్ని కొనసాగింప చేస్తుంది దేవునితో కుమారుడైన యేసు క్రీస్తును వేరు చెయ్యడం తేట అయిన సంబంధాన్ని విడగోడుతుంది దేని మధ్య అంటే యోహాను 1:1 లోని "దేవునికి" యోహాను 1:18 లో "కుమారునికి" మధ్య. మనకు తెలుసు దేవుడు అద్వితీయుడు కాదు; శరీర అవతారములో కుమారుడు అద్వితీయుడు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి. దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: మార్కు 9:17-29. |