ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
పడిపోయిన దేవదూతలు - పడిపోయిన మనుష్యులకు హెచ్చరిక(II పేతురుపై 4 వ ప్రసంగము) FALLEN ANGELS – A WARNING TO FALLEN MEN డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచి పెట్టక, పాతాల లోకమందలి కటిక చీకటి గల, బిలములోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను" (II పేతురు 2:4). |
దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రధాన దూత సాతాను అని బైబిలు బోధిస్తుంది, ఆకాశము నుండి భూమిపైకి త్రోయబడింది. యెహెజ్కేలు 28:11-19 మరియు యెషయా 14:13-14 లో సాతాను పడిపోవుట ఇవ్వబడింది. తిరుగుబాటులో చాల దేవదూతలు సాతానుతో కలిసాయి. కొన్ని బైబిలులో చెప్పబడిన "దెయ్యాలుగా" విడిచి పెట్టబడ్డాయి. కొన్ని నరకంలో పడవేయబడ్డాయి. మన పాఠ్యభాగములో ఈ దెయ్యాలను గూర్చి చెప్పబడింది. డాక్టర్ చార్లెస్ సి. రైరీ అన్నాడు, "ఇది పడ ద్రోయబడిన దేవదూతలు స్త్రీలతో కూడి ఘోరంగా పాపము చేసాయి, అది ఆదికాండము 6:1-4 లో వివరింపబడినది" (The Ryrie Study Bible, Moody Press, 1978; note on II Peter 2:4). ఎఫెస్సీయులకు 6:11-17 చూపిస్తుంది వేలకొలది దెయ్యాలను సాతాను తన ఆధీనంలో ఉంచుకోండి – అవి లోకములో చాల చురుకుగా ఉన్నాయి ఈనాడు. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "వేలకొలది, బహుశా లక్షల కొలది, దురాత్మలున్నాయి" (Christian Unity, The Banner of Truth Trust, 1980, p. 58). 1970 ఆరంభంలో యువ హిప్పీలకు ఒక సంఘము స్థాపించాను. అది ఇంకా ఉంది, ఈ రోజు అది దక్షిణ బాప్టిస్టు సంఘము. దెయ్యం శక్తిని ఎరగడానికి ఆ అనుభవము సహాయపడింది. సహజ మూలముగా తెలియని విషయాలు నేను చూసాను విన్నాను. అతని ఉత్తమ పుస్తకము ఈనాడు లోకములో దెయ్యాలు, డాక్టర్ మెర్రిల్ ఎఫ్. అంగర్, డాలస్ వేదాంత సెమినరీ, దెయ్యపు శక్తులు ఈనాడు ఎలా పనిచేస్తాయో చూపించాడు. అధ్యాయపు శీర్షికలు "దెయ్యాలు అత్మత్వము," "దెయ్యాలు మంత్రము," "దెయ్యాలు దెయ్యాలు ఆవరించుట," "దెయ్యాలు అబద్ధపు మతము," ఇంకా ఎన్నో (Merrill F. Unger, Ph.D., Th.D., Demons in the World Today, Tyndale House Publishers, 1971). కాని మన పాఠ్య భాగములో చెప్పబడిన దెయ్యాల ఈనాడు మనం ఎదుర్కొనే వాటికంటే ఎక్కువగా చేసాయి. డాక్టర్ జాన్ మెక్ ఆర్డర్ సరిగ్గా అన్నాడు, "స్త్రీల సాంగత్యమున్న వారిలో అది ప్రవేశించాయి" (ద మెక్ ఆర్డర్ స్టడీ బైబిలు, గమనిక II పేతురు 2:4). ఇది ఒక జాతిని తయారుచేసింది గొప్ప జల ప్రళయము రప్పించి దేవుడు వాటిని నాశనము చేసాడు. ఆ నేరానికి, ఈ దెయ్యాల గుంపు నరకంలో (టార్ టారస్) లో వేయబడ్డాయి –అంధకారంలో బంధింపబడ్డాయి. డాక్టర్ కెన్నెత్ ఊస్ట్ అన్నాడు, "కనుపించని లోకములోని ఒక స్థలాన్ని గూర్చి పేతురు మాట్లాడుచున్నాడు అక్కడ [ఈ] పడిన దేవదూతలు బంధింపబడ్డాయి గొప్ప ధవళ సింహాసన తీర్పు వరకు" తరువాత అగ్ని గుండములో పడవేయబడతాయి (Kenneth S. Wuest, Wuest’s Word Studies From the Greek New Testament; volume 2, Eerdmans Publishing Company, 1954, note on II Peter 2:4). డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు, "దెయ్యపు దూతలలోని ఒక గుంపు దేవునిపై తిరుగుబాటులో సాతానును వెంబడించడమే కాకుండా... మానవాళినంతటిని, కల్మషం చెయ్య ప్రయత్నించాయి ‘మనుష్యుల కుమార్తెలను’ స్వాధీన పరచుకోవడం ద్వారా (ఆదికాండము 6:1-4; II పేతురు 2:4). వారు...అధీన అంధకార స్థితిలో చివరి తీర్పు కొరకు బంధింప బదియున్నారు" (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishing, 1995; note on Jude 6). "దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచి పెట్టక, పాతాల లోకమందలి కటిక చీకటి గల, బిలములోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను" (II పేతురు 2:4). ఇక్కడ విషయము పడిపోయిన దేవదూతలను దేవుడు శిక్షించాడు కాబట్టి, పడిపోయిన స్త్రీ పురుషులు యేసుచే విమోచింపబడని వారిని కూడా ఆయన తీర్పు తీర్చుతాడు. I. మొదటిది, మన పాఠ్యభాగాన్ని ఒక హెచ్చరికగా ఆలోచించండి. "దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచి పెట్టక, నరకంలో పడవేసాడు." పాపానికి తీర్పు ఇక్కడ చూడండి. భవిష్యత్తు ప్రతీకారము చూడండి, తీర్పుకు ఉంచబడ్డారు! గమనించండి ఈ పాపము చేసిన దేవదూతలు ఒకప్పుడు పరలోకంలో దేవదూతలు! వారు ఒకప్పుడు పరలోకంలో జీవించారు. దుష్టత్వముతో సంబంధము లేదు. వారి స్నేహితులు వారిలాగే పరిపూర్ణ ఆత్మలు. అయిననూ పాపాన్ని ఎన్నుకునే శక్తి కలిగి, పాపాన్ని ఎన్నుకున్నారు. ఈ దేవదూతలు హృదయాలలో దుష్టత్వము ప్రవేశించింది. ఈర్ష్య, గర్వము తిరిగుబాటు వారిలో ప్రవేశించింది, నరకములో పడ వేయబడ్డారు, స్వతంత్రులు కానేరరు. దైవ భక్తి గల తల్లిదండ్రుల బిడ్డవు కావచ్చు. గుడిలో పెరిగి ఉండొచ్చు. అయిననూ నశించు పాపిగా అయిపోవచ్చు "అంధకార... బంధకాలకు, తీర్పుకు ఉంచబడి పోవచ్చు." హిట్లర్ గుడిలో నిర్దారింపబడి, బాప్మిస్మము పొందాడు. హిట్లర్ సంగీత పాఠశాలకు వెళ్లి సంగీత బృందములో పాడడానికి సంగీతం నేర్చుకున్నాడు. మాయో టెస్టంగ్ బైబిలు పాఠశాలకు వెళ్ళాడు. స్టాలిన్ పరిచర్యను గూర్చి, చదవడానికి సెమినెరీకి వెళ్ళాడు. డార్విన్ బైబిలు చదివాడు, వేదాంత విద్యలో పట్టభద్రుడు. వాస్తవానికి, అదే పట్టము అతనికుంది! అయిననూ వేలకొలది తెలివైన వారు ఈరోజు అతని అద్భుత సిద్ధాంతాలు నమ్ముతారు అతని చదువు వేదాంతములో పట్టభద్రుడు! మానవ జాతికి వీరు చేసిన చెప్పలేని హానిని గూర్చి ఆలోచించండి! లెక్కలేనంత మంది జీవితాలను నాశనము చేసిన పిచ్చితనము పాపమును గూర్చి ఆలోచించండి! విన్సెంట్ వాన్ గోగ్ ఒక పరిచారకుని కుమారుడు. వాన్ గోగ్ స్పర్జన్ యొక్క ముద్రింపబడిన ప్రసంగాలను లండన్ లో ఆయా గుడులలో బోధించాడు. అయిననూ వాన్ గోగ్ ఎబ్ సింతేకు బానిసై, మాదక ద్వావ్యాన్ని బట్టి పిచ్చివాడై, ఆత్మహత్య చేసుకున్నాడు! కవి ఎమిలీ డికిన్ సన్ ఉజ్జీవాన్ని అనుభవించిన పాఠశాలకు హాజరయ్యాడు. ఆమె స్నేహితులందరూ మారారు. కాని ఎమిలీ డికిన్ సన్ క్రీస్తును నమ్మడానికి తిరస్కరించింది. ఆమె ఒంటరి తనంలో ఉండి, గదిలోనే ఉండిపోయి, పిచ్చిదై నిస్ఫ్రుహకు లోనయింది. మీరనవచ్చు, "అలాంటిది నాకు సంభవించదు." అది కచ్చితమా? బైబిలు చెప్తుంది, "తానూ నిలుచున్నానని తలంచుకొను వాడు పడుకుండు నట్టు జాగ్రత్తగా చూచుకోనవలెను" (I కొరిందీయులకు 10:12). నీవెంత బలవంతుడవైనా, ఎంత తెలివైన వాడివైనా, జాగ్రత్తగా ఉండు! దేవదూతలే పడిపోతే, నీవు కూడపడి పోవచ్చు! గొప్ప ప్రధాన దూత లూసిఫర్, ఉదయ పుత్రుడు, సాతానుగా నిర్మితమైంది! పరలోకపు దేవదూతలు పాపములో పడి చాలామంది శృంగార పర దెయ్యలై జల ప్రళయము ముందు మానవాళిని విష పూరితం చేసాయి! అపోస్తలుడైన యూదా, అద్భుతాలు చేసి, దెయ్యాలను వెల్ల గొట్టినవాడు "విద్వంశ పుత్రుడై," దేవుని క్రీస్తును అప్పగించాడు! "తానూ నిలుచున్నానని తలంచుకొను వాడు పడుకుండు నట్టు జాగ్రత్తగా చూచుకోనవలెను." ఇదే పాఠ్యభాగముపై స్పర్జన్ బోధించిన ప్రసంగము నుండి ఈ కథ తీసికొనబడింది. ఇండియాలో ఒక అధికారి ఒక చిరుతను పెంచాడు. చిన్నప్పటి నుండి దానిని పెంచాడు. ఒక పిల్లిలా ఇల్లంతా తిరిగేది, అందరు దానితో ఆడుకునేవారు. కాని ఆ మనష్యులు ఒకరోజు కుర్చీలోనే నిద్రపోయాడు. ఆ చిరుత అతని చేతిని నాకింది. చర్మము తెగింది చిరుత రక్తాన్ని రుచి చూసింది. ఆ క్షణము నుండి ఇంటిలో ఉండడానికి అది ఇష్టపడలేదు. ఒక అరణ్యములోనికి, పరుగెత్తి వెళ్ళిపోయింది. ఆ చిరుత పెంచబడింది. అయిననూ అది చిరుతయే. కనుక ఒక వ్యక్తి క్రైస్తవునిలా కనబడవచ్చు. కాని అతని హృదయం మారలేదు, కనుక అతడు ఇంకను పడిపోయిన వ్యక్తియే. పాపపు రుచి త్వరలో అతనిలో ఉన్న దుష్ట జంతువును బయలు పరుస్తుంది. పల్చని మంచితనము శోధన వలన అదృశ్యమగును. నీవు మంచిగా కనపడవచ్చు, అయిననూ నీవు మార్పు చెందక పోతే దుష్టత్వానికి లోనవవచ్చు. నాకు తెలుసు పరిచర్యలోనికి వచ్చి అద్భుత ప్రసంగాలు బోధించి భయంకరమైన పాపములో పడిపోయినవారు. ఒకతడు నాకు తెలుసు మంచి బోధకుడు. కాని కొన్ని సంవత్సరాల తరువాత మారక ద్రవ్యాలు తీసుకొనడం మొదలు పెట్టాడు. అతని భార్య బయటకు వెళ్ళ గొట్టింది వీధిలో జీవించాడు. ఒకరాత్రి పార్కులో హత్య చేయబడ్డాడు. అతడు కేకలు పెట్టడం వారు విన్నారు! బైబిలు చెప్తుంది, "కుక్క తన వాంతికి తిరుగునట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును; అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను" (II పేతురు 2:22). "వారి కడపటి స్థితి మొదటి స్థితికంటే మరి చెడ్డదగును" (II పేతురు 2:20). "పాపము చేసిన దేవదూతలను దేవుడు వదిలిపెట్టలేదు." నీలాంటి మారని ఆదాము కుమారుని ఆయన ఎందుకు వదిలి పెట్టాలి? క్రీస్తులో నిజ మార్పిడి నీవు అనుభవింపకపోతే, నీ పాపము నిన్ను కనుగొంటుంది తప్పకుండా. దేవుడు నిన్ను దెయ్యము తన దూతలకు, సిద్ధపరిచిన చిత్ర హింస స్థలములో పడదోస్తాడు. పాపములో జీవించి పాపములో చనిపోయిన వారిని దేవుడు శిక్షిస్తాడు. పాపము చేసిన దేవదూతలనే దేవుడు వదిలి పెట్టలేదు – ఆయన నిన్ను వదిలిపెట్టడు మారని స్థితిలోనే కొనసాగుతూ ఉంటే. ఆహెచ్చరిక మన పాఠ్యభాగములో ఇవ్వబడింది. II. రెండవది, పాఠ్యభాగములో అగుపడే నిరీక్షణను గూర్చి ఆలోచించండి. పాపము చేసిన దేవదూతలు దేవునిచే విడిచిపెట్టబడ్డారు. కాని నీలాంటి నశించు పాపి విడుదల పొందవచ్చు. దేవుని కృపను బట్టి, విమోచింపబడిన స్త్రీ పురుషులు నిలబడతారు దేవదూతలు పడిపోయినప్పటికిని! ఆ పాపపు దేవదూతలకు వారి స్థానంలో చనిపోవడానికి రక్షకుడు లేడు. వారికి పరిశుద్ధాత్మ లేరు ఒప్పుకోలుకు యేసు దరికి చేర్చడానికి. ఆయన రక్తము అందుబాటులో లేదు వారి పాపపు కడగడానికి. సువార్త వారికి ప్రకటింపబడలేదు. నాకు ఆశ్చర్యము కలిగిస్తుంది దేవుడు క్షమాపణ రక్షణ ఇస్తాడు దుష్టులైన స్త్రీ పురుషులకు. పడిపోయిన దేవదూతలకు రక్షణ అందింపబడలేదు. వారు వెంటనే ఒదిలి పెట్టబడి అంధకారంలో బంధింపబడ్డారు చివరి తీర్పు వరకు అగ్ని గుండము కొరకు. దేవుడు దేవదూతలకు రెండవ అవకాశము ఇవ్వలేదు. చాల సంవత్సరాలు కనిపెట్టలేదు వారి పాపముల నిమిత్తము తీర్పు తీర్చే ముందు. వారు పాపము చేసినప్పుడు వెంటనే నిత్యత్వములో విడిచి పెట్టబడ్డారు. ఎంతకాలము నుండి పాపములో జీవిస్తున్నావు? మీలో కొంతమంది చాల సంవత్సరాలుగా మార్పు నొందలేరు. చాలా కాలముగా క్రీస్తును తిరస్కరిస్తున్నారు, ప్రతి ఆదివారము ఈ ప్రసంగ వేదిక నుండి బోధింప బడుచున్న సువార్త వినుచున్నప్పటికిని! నీ పట్ల దేవుని ఓర్పు అద్భుతము! పాపము చేసిన దేవదూతలను ఆయన వదిలి పెట్టలేదు, కాని ఆయన నిన్ను వదిలి పెడుతున్నాడు! ఎందుకు ఇలా? ఈ దేవదూతలకు సువార్త ఇవ్వబడలేదు. వారు పడిపోయినప్పుడు భవిష్యత్తులో రక్షణ అవకాశము వారికి లేదు. తిరిగి లేవకుండా పడిపోయారు. దేవదూతలకు అర్పణ లేదు. చనిపోతున్న దేవుని కుమారుడు వారికి లేడు. పాపాలను కడిగే రక్తము వారికి లేదు. సువార్త ప్రకటించడానికి వారికి బోధకుడు లేడు. అయిననూ మీరు పశ్చాత్తాపపడి యేసు వద్దకు రావాలని చాలాసార్లు పిలిచాను. నేను మిమ్ములను పిలిచాను యేసును నమ్మమని నిత్య జీవము పొందమని. దెయ్యాలకు క్షమాపణ లేడు నిరీక్షణ లేడు. అయిననూ నీకు క్షమాపణ నిరీక్షణ ఉన్నాయి. మళ్ళీ క్రీస్తు నీతో చెప్తున్నాడు, "ప్రయాసపడి భారము మోయు సమస్తమైన వారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును" (మత్తయి 11:28). యేసు నీతో చెప్తున్నాడు, "నా యొద్దకు రమ్ము." ఆయన ఆ ఆహ్వానము పడిపోయిన దేవదూతలకు ఇవ్వలేదు. కాని నీకు ఆయన ఇస్తున్నాడు, "నా యొద్దకు రమ్ము…నీను నీకు విశ్రాంతి ఇస్తాను." నా యోద్దకురా, నన్ను నమ్ము, నా రక్తము ద్వారా నీ పాపాలన్నీ కడిగేస్తాను! పడిపోయిన దేవదూతలకు ఆయన అలా ఇవ్వలేదు, కాని నీకు ఇస్తున్నాడు! ఆ అద్భుత ప్రేమను గూర్చి వెస్లీ ఇలా పాడాడు, "అద్భుత ప్రేమ, ఎలా వీలవుతుంది ఇప్పుడే యేసు ఆయనను నమ్మే వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు! నీవు ఎలాంటి పాపము చేసినా, నీవు ఆయనను నమ్మిన క్షణాన, ఆయన రక్తము ద్వారా నిన్ను శుద్ధి చేస్తాడు! ఆయనను నమ్మడం ఎంతకష్టం? ఆయనను నమ్మడం ఎంతో సులభము. పాస్టర్ వర్మ్ బ్రాండ్ పుస్తకము క్రీస్తు కొరకు చిత్ర హింస వారంలో చాలాసార్లు చదువుతాను. పాస్టరు అన్నాడు, రొమేనియాలో చాదస్తపు బిషఫ్ నాకు తెలుసు. అతడు కమ్యూనిస్టు, స్వంత గొర్రెలనే కాదంటాడు. అతని చేతులను నా చేతులలోనికి తీసుకొని తప్పిపోయిన కుమారుని కథ చెప్పాను. అతని తోటలో అది సాయం సమయము. నేనన్నాను, "చూడు తిరిగి వచ్చే పాపిని ఎంత ప్రేమతో దేవుడు స్వీకరిస్తాడో. పశ్చాత్తాపపడితే బిషఫ్ నైనా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు." క్రైస్తవ పాటలు పాడాను. అతడు మార్పు నొందాడు (Richard Wurmbrand, Tortured for Christ, Living Sacrifice Books, 1998, p. 90). నీవు ఏమి పాపాలు చేసినా సరే, చేద్దామనుకున్నవి, యేసు క్షమిస్తాడు. ఆయన నన్ను క్షమిస్తాడు ఆయన రక్తము ద్వారా నిన్ను శుద్ధి చేస్తాడు. ఆ చాదస్తపు బిషఫ్ కు చేసిందే నీకు కూడా చేస్తాడు. కేవలము ఆయనను నమ్ము! ఆయన నిన్ను రక్షిస్తాడు. యేసు అన్నాడు, "నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను" (యోహాను 6:37). ప్రభువైన యేసు ఆయన యొద్దకు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయనను నమ్మమని యేసు బ్రతిమాలడం చూస్తే, నేను ఆశ్చర్యచకితుడనవుతాను. అసలు పాపులు యేసును రక్షించమని బ్రతిమాలాలి! అయిననూ యేసే ఆయన యొద్దకు రమ్మని పాపులను బ్రతిమాలుచున్నాడు! పరిశుద్ధాత్మ ఆయన యొద్దకు రమ్మని పాపులను బ్రతిమాలుతుంది! సంఘము ఆయన యొద్దకు రమ్మని వారిని బ్రతిమాలుతుంది! క్రైస్తవులు ఆయన దగ్గరకు వారు వచ్చేలా ప్రార్ధిస్తారు! "ఆత్మయు పెండ్లి కుమర్తెయు రమ్ముఅని, చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పి గొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించువానిని జీవ జలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము" (ప్రకటన 22:17). మేము దేని కొరకు ప్రార్ధిస్తాను? మీరు యేసు నొద్దకు రావాలని ప్రార్దిస్తాము! పరిశుద్ధాత్మ ఏమి చేస్తుంది? యేసు నొద్దకు రావాలని పిలుస్తాడు! యేసు ఏమి చెప్తారు? ఆయన అంటాడు, "నా యొద్దకు రండి"! మనమందరమూ ఏమి చెయ్యాలని యేసు చెప్తున్నాడు? ఆయన అంటున్నాడు, "లోనికి రమ్మని బలవంత పెట్టండి" (లూకా 14:33). మనమందరమూ కోరేది మీరు యేసు నొద్దకు వచ్చి రక్షింపబడాలని. పడిపోయిన దేవదూతలకు మేము ఇది చెప్పడం లేదు, కాని మీకు చెప్తున్నాము! రండి! రండి! రండి! యేసు నొద్దకు వచ్చి రక్షింపబడండి! మీ సందేహలన్నింటితో యేసు నొద్దకు రండి! మీ భయాలన్నింటితో ఆయన యొద్దకు రండి! మీ పాపలన్నింటితో ఆయన యొద్దకు రండి! నా కొరకు రక్షకుడు నిలబడ్డాడు, తండ్రి, నీ కుమారుడైన యేసు నొద్దకు పాపి వచ్చి రక్షింపబడాలని నేను ప్రార్ధిస్తున్నాను! ఆయన నామములో, ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి – rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: II పేతురు 2:4-9. |
ద అవుట్ లైన్ ఆఫ్ పడిపోయిన దేవదూతలు – పడిపోయిన మనుష్యులకు హెచ్చరిక (II పేతురుపై 4 వ ప్రసంగము) డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచి పెట్టక, పాతాల లోకమందలి కటిక చీకటి గల, బిలములోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను" (II పేతురు 2:4). (యెహెజ్కెలు 28:11-19; యెషయా 14:13-14; ఆదికాండము 6:1-4; ఎఫెస్సీయులకు 6:11-17)
I. మొదటిది, మన పాఠ్యభాగాన్ని ఒక హెచ్చరికగా ఆలోచించండి, II పేతురు 2:4a;
II. రెండవది, పాఠ్యభాగములో అగుపడే నిరీక్షణను గూర్చి ఆలోచించండి, మత్తయి 11:28;
|