ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
క్రీస్తు రెండవ రాకడ సూచనలు SIGNS OF CHRIST’S SECOND COMING డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "మాతో చెప్పుము, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను, ఈయుగ సమాప్తికిని సూచనలేమీ?" (మత్తయి 24:3). |
నేను ప్రతిరోజూ మూడు వార్తా పత్రికలు చదువుతాను. రెండు కొత్త కేబల్ స్టేషన్లు చూడడానికి కొన్ని నిమిషాలు వెచ్చిస్తాను. వార్తల్లో మనం విన్నది చూపిస్తుంది మన ప్రపంచము శ్రమలో ఉందని. ఉగ్రవాదము, యుద్ధములు, బందీలు బాంబులు ప్రతిరోజూ ప్రపంచమంతా జరుగుతున్నాయి. చాలా సంఘాలు కాల్చబడుతున్నాయి క్రైస్తవులు వందలలో నరకబడుతున్నారు. ఇరాన్ లో త్వరలో అణుబాంబులు ఉంటాయి. అవి మన ఉనికికే భయము కల్గిస్తున్నాయి. వారంటారు వారు పట్టణాలలోనికి బాంబులు తెచ్చి, పేల్చి, మన జీవిత విధానాన్ని నాశన పరుస్తాయని. అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ కేథలిక్కు. ఒకరోజు అతడు బిల్లి గ్రేహముతో గోల్ఫ్ ఆడుతున్నాడు. అతడు గ్రాహం గారితో అన్నాడు కేథలిక్ సంఘము క్రీస్తు రెండవ రాకడను నమ్ముతుందని. వారు ఒక తెగను ఇలా వల్లిస్తారు, "ఆయన వచ్చి, త్వరితులను మృతులను తీర్పు తీరుస్తాడు." కాని అధ్యక్షుడు కెన్నెడీ రెండవ రాకడను గూర్చి ఎక్కువగా తెలుసు కోవాలనుకున్నాడు. అరవై ఏళ్ళ క్రితం సర్ విన్ స్టన్ చర్చిల్ ఇంకను గ్రేట్ బ్రిటన్ కు ప్రధానమంత్రిగా ఉన్నాడు. యవన సువార్తికుడు బిల్లి గ్రేహం లండన్ డౌనింగ్ వీదిలోనికి, ఆఫీసుకు 10 గంటలకు వెళ్ళాడు. చర్చిల్ అతనితో అన్నాడు, "ప్రపంచము ఎక్కువగా ముందుకు కొనసాగుతుందని అనుకోను. మన సమస్యలు మనకంటే ముందుగా ఉన్నాయి." ఈనాడు ప్రతి నాయకుడు భయాన్ని పసిగడుతున్నాడు. మన కళ్ళ ముందు మన తరము గతించిపోతుంది. అనిపిస్తుంది మనము చరిత్ర గమ్యానికి యుగ సమాప్తి వైపు వెళ్తున్నాము. శిష్యులు ఆ విషయంలో ఆసక్తి కలిగియున్నారు. వారు యేసును అడిగారు, "నీ రాకడకు ఈ యుగ సమాప్తికి, సూచనలేమీ?" గ్రీకు పదము "లోకము" నకు "అయియోన్." దాని అర్ధం "యుగము" – మనము జీవించు ఈతరము, క్రైస్తవ మినహాయింపు. ఆ ప్రశ్న అడిగినందుకు క్రీస్తు వారిని గద్దించలేరు – "నీ రాకడను ఈ [యుగ] సమాప్తికి, సూచన లేమి?" వారిని గద్దించే బదులు, చాల "సూచనలు" పట్టి ఇచ్చాడు. ఒక సూచన వారడిగారు, గాని క్రీస్తు చాల ఇచ్చాడు తరువాత వచనాలలో, బహిర్గత విషయాలు మార్కు 13 లూకా 21 లో వ్రాయబడ్డాయి. క్రీస్తు ఇచ్చిన సూచనలలో మూడు పొరపాట్లు ఉన్నాయి. మొదటిది, జరిగిపోయాయి అని నమ్మేవారు మొదటి శతాబ్దములోనికి నెట్టారు. చాలామంది ఆధునిక కెల్వినిస్టులు జరిగిపోయాయని నమ్మేవారిలానే చేస్తారు. వారు తప్పు అనుకుంటున్నాను. ఉదాహరణకు, అది ఊహను వాస్తవికతకు నడిపిస్తుంది 14 వ వచనాన్ని మొదటి శతాబ్దానికి కలపడానికి, అయినను వాస్తవ లేఖనాల తర్జుమా నిలకడగా ఉంది. ఆ వచనము చెప్తుంది, "మరియు ఈరాజ్య సువార్త సకల జనమునకు సాక్ష్యార్ధమై; లోకమంతటను ప్రకటింపబడు" (మత్తయి 24:14). అది క్రీస్తు సాదా తేటయైన ప్రవచనము. ఇప్పటి వరకు అది తేటగా జరగలేదు. మనకు తెలుసు శిష్యులు రోమా సామ్రాజ్యమంతా సువార్త వ్యాపింప చేస్తారు, కాని వారు "లోకమంతటా" బోధింపలేరు – తప్పకుండా ఉత్తర దక్షిణ అమెరికాకు, జపాన్, ఆస్ట్రేలియా, సముద్రదీవులు మరియు ఇతర ప్రాంతాలు. మత్తయి 24:14 ఇప్పుడు వాస్తవంగా నెరవేరుతుంది "లోకమంతటా." తరువాత, నేననుకుంటాను సూచనలను గూర్చిన రెండవ పొరపాటు అన్నింటిని భవిష్యత్తుకు నెట్టివేయడం, ఏడూ సంవత్సరాల శ్రమల కాలానికి. అదే ఆధునిక సంభవులు చేస్తుంటారు. కనుక, నేననుకుంటాను సూచనలను, మొదటి శతాబ్దానికి నెట్టడం పొరపాటు – నేననుకుంటాను వాటిని భవిష్యత్తుకు, ముఖ్యంగా శ్రమల కాలానికి కూడా పొరపాటు. నేను నమ్ముతాను "సూచనలు" మనకు ఇవ్వబడ్డాయి ఇప్పుడు, ఈ దుష్ట దినాలలో. వింత ఏమిటంటే ఈ దినాలలో చాల సంఘాలలో సూచనలను గూర్చి చాల తక్కువగా బోధింపబడుతుంది. నాకు అనిపిస్తుంది సూచనల ఆధునిక తిరస్కారము ఒక సూచన! నా భయం అది కొంత మంది బోధకులను "అపహాసకులు" జాబితాలో చేరుస్తుంది వారంటారు "ఆయన రాకడను గూర్చిన వాగ్ధానమే మాయెను?" (II పేతురు 3:3-4). నేననుకుంటాను సూచనల తిరస్కారము చూపిస్తుంది "పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, వారందరూ కునికు తీసి నిద్రించిరి" (మత్తయి 25:5). నిద్రించే సంఘములు సూచనలను గూర్చి విన ఇష్టపడవు. అది వారిని లేపుతుంది! డాక్టర్ యం. ఆర్. డిహాన్ అన్నాడు, "అక్కడ, తరువాత, రెండు ప్రమాదాలున్నాయి. మొదటిది, తేది నియమించే ప్రమాదము, మరియు, రెండవది, వ్యతిరేకము దుష్టత్వము, సూచనలు, నిర్లక్ష్యము చేయడం..." (M. R. DeHaan, M.D., Signs of the Times, Kregel Publications, 1997 edition, p. 13). చాలా సంఘాలలో ఈనాడు బోధకులు సూచనలను లెక్క చేయడం లేదు! తరువాత మూడవ పొరపాటు. 2011 లో హెరాల్డ్ కేంపింగ్ మేఘాలలో, క్రీస్తు రాకడను గూర్చిన దినము ఘడియ ఇచ్చాడు. అతడు అన్నాడు అది మే 21, 2011, సాయంత్రము 6 గంటలకు అని. బహుశా, అతడు తప్పే. యేసు చాల తేటగా అన్నాడు, "ఆ దినమైనను ఎవనికి తెలియదు" (మత్తయి 24:36). ఎవరైనా మీతో క్రీస్తు రాకడ సమయము తెలుసని చెప్తే నమ్మవద్దు, అతని మాట వినవద్దు! శిష్యులు ఆయన రాకడను గూర్చి ఒక సూచన అడిగారు "[యుగ] సమప్తిని" గూర్చి, కాని క్రీస్తు చాల సూచనలు ఇచ్చాడు. క్రీస్తు ఇచ్చిన చాల సూచనలను ఆయన అపోస్తలు ఇచ్చినవి, మూడు విభాగాలుగా ఇస్తున్నాను. I. మొదటిది, సంఘాలలో సూచనలు ఉన్నాయి. వాస్తవానికి యేసు ఇచ్చిన మొదటి సూచన అది, మత్తయి 24:4-5, "యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోస పరచకుండా చూచుకొనుడి. అనేకులు, నా పేరట వచ్చి, నేనే క్రీస్తునని చెప్పి; పలువురిని మోస పరచెదరు" (మత్తయి 24:4-5). ఇది ప్రాధమికంగా దెయ్యాలను గూర్చి, క్రీస్తులా చూపించుకుంటారు. అపోస్తలుడైన పౌలు హెచ్చరించాడు "వేరే యేసు, మేము బోధింపని" ( II కొరిందీయులకు 11:4). అపోస్తలుడన్నాడు, "అయితే కడవరి దినములలో, కొందరు అబద్ధికుల వేషధారణ వలన, మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నారు" (I తిమోతి 4:1). ఈనాడు చాల సంఘాలలో మనం చూస్తాం యోగ శాస్త్రికుల "క్రీస్తు ఆత్మ" బోధను. ఈ యోగ శాస్త్ర క్రీస్తు ఒక ఆత్మ, లేఖనాల క్రీస్తు శరీర మాంసాలు కాదు. బైబిలు చెప్తుంది, "యేసు క్రీస్తు శరీర ధారియై వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు" (I యోహాను 4:3). ఆధునిక తర్జుమాలన్నింటిలో, కేజేవి (KJV) మాత్రము ఆ వచనాన్ని సరిగ్గా అనువదించింది! గ్రీకు పదము "ఎలెలు తోట." అది పరిపూర్ణ వ్యక్తత, ప్రస్తుతపు క్రీటు స్థితిని సూచిస్తుంది (cf. Jamieson, Fausset and Brown). కేజేవిలో (KJV) సరిగ్గా అనువదింపబడినట్టు, క్రీస్తు "శరీరధారియై వచ్చెను." ఆయన శరీర దారిగా వచ్చాడు, శరీరములో ఉన్నాడు, పునరుత్థాన శరీరంలో ఉన్నాడు. మృతులలో నుండి లేచిన తరువాత, యేసు అన్నాడు, "నాకున్నట్టుగా మీరు చూచుచున్న మీ ముఖములను, మాంసమును భూతమున కుండవు" (లూకా 24:39). కనుక, నేటి క్రీస్తు ఆత్మ నిజానికి దెయ్యము! మళ్ళీ, మత్తయి 24:24 లో, క్రీస్తు అన్నాడు, "అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను, వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని; సహితము మోస పరుచుటకై, గొప్ప సూచనక్రియలను, మహత్కార్యములను కనపరచెను" (మత్తయి 24:24). ఈ చెడ్డ దినాలలో "సూచనలు అధ్బుతాలతో" మనం మోసపోకూడదు. "ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించు కొను వారై యుండి, దొంగ అపోస్తలులను, మోసగాండ్రును పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు; వారిక్రియల చొప్పున వారి కంతము కలుగును" (II కొరిందీయులకు 11:13-15). అపోస్తలుడైన పౌలు హెచ్చరించాడు, "ఎందుకనగా జనులు హిత బోధను సహింపక; దురద చెవులు గలవారై, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసికొని; సత్యమునకు చేయి నియ్యక, కల్పనా కధల వైపునకు తిరుగు కాలము వచ్చును" (II తిమోతి 4:3-4). మనము స్వధర్మ దినాలలో ఉన్నామని నేను రూడిగా ఉన్నాను, "పడిపోవుట" అది అపోస్తలుడైన పౌలు II దెస్సలొనీకయులకు 2:3 లో ఊహించాడు. తరువాత, కూడా, క్రీస్తు అన్నాడు, "అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ [చల్లారును]" (మత్తయి 24:12) క్రీస్తు ఊహించాడు సంఘాలలో అవినీతి ఉంటుందని సంఘ సభ్యులలో నిజ ప్రేమ చల్లారుతుందని. సంఘాలు ఆదివారము సాయంత్రము మూయబడుతాయి ఎందుకంటే నిజ సహవాసము గతానికి సంబధించినది. సంఘ సభ్యులు ప్రేమ కలిగి యుండగా ఆది సంఘాలలో వలే (సిఎఫ్. అపోస్తలుల కార్యములు 2:46-47). యేసు ఊహించాడు, అంత్య దినాలలో పట్టుదలతో కూడిన ప్రార్ధన తక్కువగా ఉంటుంది (సిఎఫ్. లూకా 18:1-8). ఈనాడు కొన్ని ప్రార్ధనా కూటాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. బుధవారము రాత్రి ఆరాధన (ఉండి ఉంటే!) అది ప్రార్ధనా కూటము నుండి బైబిలు పఠనముగా మార్చబడింది, బహుశా ఒకటి రెండు మామూలు ప్రార్ధనలతో. తప్పకుండా ఇది అంతమునకు సూచన! "మనష్యు కుమారుడు వచ్చినప్పుడు, భూమి మీద విశ్వాసము [ప్రార్ధించు విశ్వాసము] కనుగొనునా?" (లూకా 18:8). కాని, గుర్తుంచుకొండి, యేసు అన్నాడు, "ఇవి జరగ నారంభించినప్పుడు, మీరు ధైర్యము తెచ్చుకొని, మీ తలలు ఎత్తుకొనుడి; మీ విడుదల సమీపించు చున్నదనెను" (లూకా 21:28). 3 వపాట, రెండవ వచనము పాడండి! చీకటి రాత్రి, మనకు వ్యతిరేకంగా పాపమూ విజ్రుంబిస్తుంది; II. రెండవది, హింస సూచనలు ఉన్నాయి. యేసు అన్నాడు, "ఆప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి, చంపెదరు: మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి, ఒకని నొకడు అప్పగించి, యొకని నొకడు ద్వేశించిరి" (మత్తయి 24:9-10). "సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని, మరణమున కప్పగింతురు; కుమారులు తండ్రుల మీద లేచి, వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారు: అంతము వరకు సహించిన వాడే, రక్షణ పొందును" (మార్కు 13:12-13). లోకములో చాల చోట్ల ఇప్పుడు భయంకర హింస జరుగుతూ ఉంది. చదవడానికి డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.పర్ సేక్యూషన్.కామ్ (www.persecution.com) ను క్లిక్ చెయ్యండి. ఐయస్ఐయస్ (ISIS) వేలలో క్రైస్తవులను చంపుతుంది. వారి ప్రారంభపు గురి ప్రపంచమంతటా క్రైస్తవ్యాన్ని నాశనము చెయ్యడం! పాశ్చాత్య ప్రపంచంలో కూడా నిజ క్రైస్తవులపై ఒత్తిడిని మనము చూస్తున్నాం. సంఘాలను విభజించే వారు నమ్మకస్తులైన కాపరులపై దాడి చేస్తున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలనే క్రైస్తవులు అయినందుకు హింసిస్తున్నారు. దిగ్భ్రాంతి చూడడం కొందరు నిజ క్రైస్తవులైన తల్లిదండ్రులకు ఏమి చేస్తున్నారో! చాల మంది బోధింపబడి, ఒంటరిగా ఉంచబడి, క్రైస్తవేతర పిల్లలచే చూడబడడం లేదు. చాలామంది కాపరులు నాతో చెప్తారు అమెరికాలో క్రైస్తవులు ఇంకా ఎక్కువ హింస అనుభవింప బోవుచున్నారు. కాని గుర్తుంచుకోండి, యేసు అన్నాడు, "మనష్యు కుమారుని నిమిత్తము, మనష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టి వేయునప్పుడు, మీరు ధన్యులు, ఆ దినమందు మీరు సంతోషించి, గంతులు వేయబడి. ఇదిగో మీ ఫలము, పరలోక మందు గొప్పది యుండును: కొంచెం, వేచి ఉండుడి, మీకు పరలోకము నుండి గొప్ప బహుమతి వచ్చును: వారి పితురులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి" (లూకా 6:22-23). మళ్ళీ పాడండి – పాట సంఖ్య 3 – రెండవ వచనము! చీకటి రాత్రి, మనకు వ్యతిరేకంగా పాపమూ విజ్రుంబిస్తుంది; III. మూడవది, ప్రపంచమంతటా సువార్తీకరణ సూచన ఉంది. గమనించండి ఎంత ఆశ్చర్యంగా ఈ ప్రోత్సహించే సూచన అకస్మాత్తుగా ఉద్భవించిందో, ఈ భయంకర సూచనల మధ్య. మత్తయి 24:9-14 నేను చదువుచున్నప్పుడు దయచేసి నిలబడండి. "ఆప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి, చంపెదరు: మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి, ఒకని నొకడు అప్పగించి, యొకని నొకడు ద్వేశించిరి. అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి, పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడే, రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్ధమై లోకమంతటా ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును" (మత్తయి 24:9-14). కూర్చోండి. "రాజ్య సువార్త" అది "సువార్త" మార్కు 13:10, చెప్తుంది, "మొదట సువార్త సకల జనములకు ప్రకటింపబడవలెను [బోధింప బడవలెను]." ధర్మత్వ మధ్యలో హింసలో అకస్మాత్తుగా, క్రీస్తు అన్నాడు ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటింపబడును, "అటు తరువాత అంతము వచ్చును" (మత్తయి 24:14). ఎలాంటి ప్రవచనము! మన సమయంలో ప్రపంచంలో సువార్త వినబడని ప్రాంతాలు చాలా తక్కువ. అంతర్జాలము, రేడియో, కురచ తరంగము, ఉపగ్రహము, వేలకొలది మిసెనరీల ద్వారా – ఈరోజు సువార్త లోకమంతటా వ్యాపిస్తుంది! మత్తయి 24:11-14 మన తరములో నెరవేరింది! ఎంత ఆశ్చర్యము, పాశ్చాత్య దిక్కున సంఘాలు ద్వారాలు మూస్తున్నప్పుడు సాయమకాలపు ఆరాధనలు ఆపెస్తున్నప్పుడు, సువార్త విస్పోటము మూడవ ప్రపంచంలో ఉంది – చైనా, దక్షిణ ఆసియా, హిమంగుల మధ్య, ఇండియాలో అంటరాని వారి మధ్య! ధర్మత్వ ఉజ్జీవము – ఒకేసారి వెళ్తున్నాయి – యేసు ఊహించినట్టు గానే! ఎంత విచిత్ర విపరీతము! అయినను అదే సంభవిస్తుంది, యేసు ఊహించినట్టే! "మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్ధమై లోకమంతటా ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును" (మత్తయి 24:14). హల్లెలూయా! యేసు వచ్చుచున్నాడు! మళ్ళీ పాడండి! చీకటి రాత్రి, మనకు వ్యతిరేకంగా పాపమూ విజ్రుంబిస్తుంది; క్రీస్తు నీకు తెలుసా? ఆయన వచ్చేసరికి నీవు సిద్ధంగా ఉంటావా? నీవు మార్పు నొందావా? "తిరిగి సమర్పించు కొనుట" నీకు సహాయపడదు నీవు నశించిపోతే. కొందరు అంటారు తప్పిపోయిన కుమారుని వలే, క్రీస్తు నొద్దకు తిరిగి వస్తాయని. కాని బైబిలు ఎప్పుడు చెప్పలేదు తప్పిపోయిన కుమారుడు ఒకసారి రక్షింపబడి, వెనుదిరిగి, తరువాత తన జీవితాన్ని తిరిగి సమర్పించు కున్నాడని. కాదు! బైబిలు తేటగా చెప్తుంది అతడు నశించి పోయాడని! అతని స్వంత తండ్రి అన్నాడు, "ఈ నా కుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పిపోయి, దొరికెను" (లూకా 15:24). నీవు తప్పిపోయావని తెలుసుకొని నీవు క్రీస్తు నొద్దకు తప్పక రావాలి! చదవడానికి "ద మెతడ్ ఆఫ్ గ్రేస్" గొప్ప సువార్తికుడు జార్జి వైట్ ఫీల్డ్ చే (1714-1770) రాసిన దానిని క్లిక్ చెయ్యండి. నీవు నశించి పోయావని ఒప్పుకోకపోతే, యేసు నొద్దకు రాలేవు. ఒంటరిగా ఆయనను నమ్మలేవు. నిజ మార్పును అనుభవించ లేవు, నీవు పాపముల నుండి క్రీస్తు రక్తముచే కడుగబడలేవు, లేక క్రీస్తు పునరుత్థానము ద్వారా పునర్నిర్మా నింపబడలేవు. ఓ దేవా, మేము ప్రార్ధిస్తున్నాము కొన్ని నశించు ఆత్మలు, వింటున్నవారు లేక ఈ ప్రతిని చదువుచున్న వారు, లేక యూట్యూబ్ లో గాని వెబ్ సైట్ లో గాని నా బోధ చూస్తున్నా వారు, పాపపు ఒప్పుకోలు కలిగి మీ కుమారుడైన యేసు క్రీస్తును నమ్మాలని ప్రార్ధన . ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి – rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: మార్కు 13:1-13. |
ద అవుట్ లైన్ ఆఫ్ క్రీస్తు రెండవ రాకడ సూచనలు SIGNS OF CHRIST’S SECOND COMING డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "మాతో చెప్పుము, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను, ఈయుగ సమాప్తికిని సూచనలేమీ?" (మత్తయి 24:3). (మత్తయి 24:1-2; లూకా 21:20-24; మత్తయి 24:14, 36)
I. మొదటిది, సంఘాలలో సూచనలు ఉన్నాయి, మత్తయి 24:4-5; I తిమోతి 4:1; II. రెండవది, హింస సూచనలు ఉన్నాయి, మత్తయి 24:9-10; మార్కు 13:12-13; లూకా 6:22-23.
III. మూడవది, ప్రపంచమంతటా సువార్తీకరణ సూచన ఉంది, మత్తయి 24:9-14; |