ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
జీవమునిచ్చు రక్షకుడు!THE LIFE-GIVING SAVIOUR! డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). |
"జీవము" అనే పదమునకు గ్రీకు పదము అనువాదము "జో." తండ్రి యైన దేవుని మరియు కుమారుని జీవము అది. క్రీస్తు చెప్పినట్లు, "తండ్రి ఎలాగు తనంతట తానే (జీవము) గలవాడై యున్నాడో; అలాగే కుమారుడును తనంతట తానే (జీవము) గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను" (యోహాను 5:26). మనము బ్రతుకునట్లు, ఈ జీవము ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు అన్నాడు, వారికి (జీవము) కలగడానికి నేను వచ్చియున్నాను" (యోహాను 10:10). మన జీవము కొరకు యేసు సిలువపై మరణించాడు. మన జీవము నిమిత్తము యేసు తన ప్రశస్త రక్తము కార్చాడు. మారినవారు "జీవము" కలిగి యుంటారు. క్రీస్తు అన్నాడు, "కుమారుని యందు విశ్వాసము ఉంచు వానికి నిత్య జీవము ఉంటుంది [జోమెన్ అయినోయియన్]," యోహాను 3:36. డాక్టర్ ఎ. టి. రోబర్ట్ సన్ అన్నాడు యేసును నమ్మువానికి "అది ఇక్కడ ఇప్పుడే ఉంటుంది" (పద చిత్రాలు; గమనిక యోహాను 3:36). హెన్రీ స్కాగల్ (1650-1678) చనిపోయేటప్పుడు 28 సంవత్సరాలవాడు. 26 లేక 27 సంవత్సరాల కంటే ఎక్కువ కాదు ఈ చిన్న పుస్తకము వ్రాసేటప్పుడు, దేవుని జీవము మానవుని ఆత్మలో (మార్టినో పబ్లిషింగ్, 2010 ముద్రణ). దేవుని జీవము మానవుని ఆత్మలో చార్లెస్ వెస్లీచే జార్జి వైట్ ఫీల్డ్ కు ఇవ్వబడింది. దాని ద్వారా వైట్ ఫీల్డ్ మార్చబడి ఒక గొప్ప సువార్త బోధకుడయ్యాడు. అది చదువుతూ వైట్ ఫీల్డ్ అన్నాడు, "ఓ ఎంత గొప్ప దైవిక జీవపు ప్రచురణ నాఅత్మపై పడింది!" వైట్ ఫీల్డ్ అన్నాడు, "యేసు క్రీస్తు...నాకు బయలు పరచుకొని కొత్త జన్మను ఇచ్చాడు." ఆ పుస్తకము మొదటి రెండవ గొప్ప మేల్కొలుపులలో ప్రముఖ పాత్ర వహించింది. జాన్ వెస్లీ పదునాలుగు సార్లు ముద్రించాడు. అది అమెరికాలో విలియం స్టాటన్ చే ముద్రింపబడింది, అతడు ఫిలదెల్ఫియా మొదటి బాప్టిస్టు సంఘానికి కాపరి. బెంజమిన్ ప్రేన్ క్లిన్ దాని ఒక ముద్రణ కూడా ప్రచురించాడు! దేవుని జీవము మానవుని ఆత్మలో, హెన్రీ స్కౌగల్ అన్నాడు మనము మత బాహ్యపు విధానాన్ని నిజ క్రైస్తవ్యముగా పొరబడకూడదు. హెన్రీ స్కౌగల్ అన్నాడు నిజ క్రైస్తవ్యము "దేవునితో ఆత్మ ఐక్యమగుట, నిజ [ఎడబాటు] దైవిక స్వభావానికి" (ఐబిఐడి., పేజి 30). ఇంకొక మాటల్లో, దేవుని జీవము మానవుని ఆత్మలో! దేవుని జీవము మనము యేసు నొద్దకు వచ్చినప్పుడు మాత్రమే మన ఆత్మల్లో ప్రవేశిస్తుంది. కాని క్రీస్తు అన్నాడు, "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). లేక ఆధునిక అనువాదము ఇలా అంటుంది, "జీవము పొందునట్లు నా దగ్గరకు రావడానికి మీరు నిరాకరిస్తున్నారు" (ఎన్ఐవి). దేవుని నమ్మిన మనష్యులను గూర్చి క్రీస్తు ఇది చెప్పాడు. లేఖనలలోని ప్రతి మాటను నమ్మిన వారిని గూర్చి ఆయన ఈ మాటలు చెప్పాడు. వారంలో కనీసం రెండు సార్లయినా ఉపవాసము చేసిన వారికి ఈ మాటలు చెప్పాడు. దేవునిలా ఉండాలని కష్టించే వారికి ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇంకా మారని మీతో కూడా ఈ ఉదయాన ఈ మాటలు చెప్తున్నాడు, "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). నిజ క్రైస్తవుడవడానికి ఒకే మార్గము దేవుని జీవము నీ ఆత్మలో ఉండుట. ఆ జీవము నీ ఆత్మలోనికి పొందుకోడానికి ఒకే మార్గము యేసు నొద్దకు రావడం. అయిననూ రక్షకుడంటున్నాడు, "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు." చాల విధాలుగా ఈ వచనాన్ని అన్వయిస్తాను. I. మొదటిది, ఎందుకు మీరు యేసు నొద్దకు రాలేదు. "నిర్ణయతత్వులు" అనుకుంటారు ఎప్పుడైనా ఎవరైనా క్రీస్తు నొద్దకు రావచ్చని. వారు చేయాల్సిందంతా చేతులెత్తడం లేక "ముందుకు రావడం" ప్రసంగము తరువాత. "పాపి ప్రార్ధన" చెప్పడం. ఇవన్ని మానవ క్రియలు ఎవరైనా ఎప్పుడైనా చెయ్యవచ్చు. కాని ఈ "నిర్ణయాలలో" ఏది కూడా నీ ఆత్మను రక్షింపదు. డాక్టర్ ఐజాక్ వాట్స్ అన్నాడు, బాహ్య ప్రయత్నాలు నన్ను శుద్ధి చెయ్యవు, కుష్టు రోగము లోలోపల ఉంది. "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు." దీని అర్ధము మారనివారిలో ఇప్పుడు జీవము లేదు. బైబిలు చెప్తుంది "స్వాభావికంగా ఉగ్రత కుమారులు" (ఎఫెస్సీయులకు 2:3). బైబిలు చెప్తుంది మీరు "పాపములలో చచ్చినవారు" (ఎఫెస్సీయులకు 2:5). బైబిలు చెప్తుంది "పాపమూ క్రింద ఉన్నారు" (రోమా 3:9). "పాపమూ క్రింద" – ఎంత భయంకర మాట, కాని వాస్తవము. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు దాని అర్ధము "మానవులంతా స్వాభావికంగా పాప ఆరోపణలో ఉన్నారు, పాపపు శక్తి కింద ఉన్నారు, పాప కల్మషము క్రింద ఉన్నారు...మనము జన్మ పాపులం, ‘అందరు పాపమూ క్రింద ఉన్నాం.’ పదము ‘క్రింద,’ నేననుకుంటాను, మనకు ఒక భావన ఇస్తుంది మనము అధికారము క్రింద ఉన్నామని, ఆ పరిపాలనకు మనము చెందినవారము... ఎందుకంటే మనమందరమూ ఆదాము వారసులము, పాపములో జన్మించాము...[ఆదాము పాపమూ] అది అతి భయంకర ద్వంశము చేసే విషయము లోకములో ఎప్పుడు జరగనిది" (Romans, Chapters 2:1-3:20, The Banner of Truth Trust, 1989, pp. 190-191). ఆయన ఇంకా చెప్పాడు, "నీ వివరణ నీకు అంగీకరించకపోతే... వాదించే అవసరము లేదు, నీవు క్రైస్తవుడవు కాదు...నీవు ఇంకా మారలేదు పాపపు ఒప్పుకోలు లేదు, క్రీస్తులో నీవు విశ్వాసివి కావు, నీవు అనుకుంటున్నా సరే. ఇది నీవు కాదంటే, నీవు క్రైస్తవ విశ్వాసానికి బదులు ఉంటావు...క్రైస్తవ విశ్వాసం. మనిషి పాపపు ఈ వివిరణ సామాన్య సత్యము, భయంకర సత్యము" (ఐబిఐడి., పేజి 214). ఆర్డర్ డబ్ల్యూ. పింక్ అన్నాడు, "లోప ‘భూఇష్టతకు’ దూరంగా ఉంది, లోపల నివసించే పాపమూ భయంకర రోగము" (Man’s Total Depravity, Moody Press, 1981). పాప రోగమునకు నీ మీద గట్టి పట్టు ఉండి క్రీస్తు నొద్దకు రాకుండా చేస్తుంది. నీకు ఆయన వద్దు కాబట్టి ఆయన దగ్గరకు రావు. నీవు పాపానికి ఎంత బానిసవంటే క్రీస్తుతో నీకు పని ఏమి లేదు! నీవు అనవచ్చు, "కాని నేను గుడికి వస్తున్నాను. అది చెప్పడం లేదు నేను బాగున్నానని?" లేదు, అది చెప్పడం లేదు! అది చెప్తుంది స్వార్ధ ఉద్దేశముతో వస్తున్నావని. దానిని ఎదుర్కోవాలి. నీకు క్రీస్తు కావాలని ఇక్కడ లేవు. సంతోషించే యవనుల మధ్య ఉండాలనుకున్నావు కనుక ఇక్కడున్నావు. ఇక్కడ ప్రజలు ఇష్టం, కాని నీకు క్రీస్తు వద్దు! ఇప్పుడు, మీరు యదార్ధంగా ఉండాలని అడుగుతున్నాను. అది నిజము, కదా? కొందరనవచ్చు, "అవును, అది నిజమని. కనుక ఇక రాను. యదార్ధంగా ఉండి ఇకరాను." నేను ఎక్కువ చెప్పానని అది రుజువు చేస్తుంది! అది ఎక్కువగా నిరూపిస్తుంది నీకు క్రీస్తు వద్దని! అది నిరూపిస్తుంది నీవు పాప బంధకాలలో ఉన్నవని – పాపానికి పూర్తి ఆధిపత్యము నీపై ఉందని. పాపముచే ఏలాబడుచున్నావు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, నీవు "పాపమూ క్రింద ఉన్నావు." నీవు క్రీస్తు నొద్దకు రావడంలో ఆశ్చర్యం లేదు! క్రీస్తు చెప్పడంలో ఆశ్చర్యము లేదు, "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు." నీకు క్రీస్తు వద్దు. నీకు జీవము వద్దు. నీకు పాపమూ కావాలి. యేసు అన్నాడు, "తమ క్రియలు చెడ్డవి అయినందున, మనష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి" (యోహాను 3:19). నీవు అది అంగీకరిస్తే తప్ప నీకు ఎలాంటి నిరీక్షణ ఉండదు. అది నీవు తెలుసుకోవాలి, నీకు చెప్పుకోవాలి, "అవును, అది నిజము. వెలుగు కంటే ఎక్కువగా చీకటినే ప్రేమిస్తున్నాను. నేను కావాలన్నట్టే ఉంటున్నాను, యేసుచే రక్షింపబడడం ఇష్టం లేదు. మారగలిగినా, నాకిష్టము లేదు! నేనున్నట్టే ఉండడం నాకు ఇష్టము." నీవు యేసు నొద్దకు రావు అందులో ఆశ్చర్యము లేదు! ఆశ్చర్యము లేదు క్రీస్తు అనడంలో, "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). II. రెండవది, యేసు నొద్దకు రాని వారికి ఏమి జరుగుతుంది. నాకు ఏమి జరిగిందో నాకు గుర్తు ఉంది. నా జీవిత చరిత్ర రాసుకుంటున్నాను, కనుక ఈ మధ్య అది నా తలంపులో ఉంది. మొదట్లో నేననుకున్నాను గుడికి రావడం ఒకటే అవసరమని. నా పొరుగు వారు వారి పిల్లలతో పాటు కాలిఫోర్నియా, హంటింగ్ టన్ పార్కు తొలి బాప్టిస్టు సంఘానికి తీసుకెళ్ళారు. స్నేహంగా ఉండే వారితో ఉండడం ఇష్టం కాబట్టి గుడికి వస్తు ఉన్నాను. వేరే కారణము లేదు. నాకు ఇష్టమైంది. అంతే. నీవు గుడికి రావడంలో ఆ కారణము ఉండకూడదు. అనుభవాన్ని అనుభవిస్తావు – ఇంకా ఏమి కాదు. అది చాల కాలముంటుంది. కాని త్వరగానో ఆలస్యము గానో అది సరిపడదు. నీవు యేసు నొద్దకు రాకపోతే, కొంతకాలము తరువాత గుడికి రావడం ద్వారా ఉండే బాహ్య ఆనందములో తృప్తిపడవు. ఏదో జరుగుతుంది గుడికి రావడం ద్వారా అనేది నన్ను అసంతృప్తిపరున్ని చేస్తుంది. గుడిలో చెడు జరుగుతుంది. ఏ సంఘము పరిపూర్ణమైనది కాదు, కనుక ఏదో చూస్తావు వింటావు అది నిన్ను తొందర చేస్తుంది. నేను అనేవాడిని, "నీవు చూడవచ్చు లేక వినవచ్చు అది నిన్ను తొందర చేస్తుంది." కాని నేను దానిని మార్చేసాను, "నీవు చూస్తావు లేక వింటావు అది నిన్ను తొందర పెడుతుంది." అది జరిగి తీరుతుంది. ఎప్పడు అంతే. అక్కడ ఏ వ్యక్తీ లేదు నాతోపాటు గుడిలో జరిగేది చూసి తొందర పడనివాడు. కాని వారు ఇంకా ఉన్నారు. అయిననూ, ఇతరులు వాటినే చూసి, పడిపోయి రావడం మానేశారు. వారు విత్తువాని ఉపమానములో వివరింపబడ్డారు, "వారిలో వేరు లేనందున, కొంచెము కాలము నమ్మి, శోదన కాలమున తొలగి పోవుదురు" (లూకా 8:13). డాక్టర్ ఆర్. సి. హెచ్. లెన్స్ కీ అన్నాడు "శోధన ఏదో విధంగా ప్రతి విశ్వాసికి వస్తుంది" (గమనిక లూకా 8:13). కాని క్రీస్తులో వేరు పారిన వారు పడిపోరు. క్రీస్తులో వేరు పారని వారు పడిపోతారు కష్టము వచ్చినప్పుడు. గుడి నుండి ఎందుకు తప్పిపోతారు? ఎందుకంటే క్రీస్తు "జీవము" వారి ఆత్మల్లో లేడు! "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). కొంతకాలము తరువాత గుడి వదిలేస్తారని అది నిరూపిస్తుంది. నాకు కొందరు తెలుసు గుడులు మారుతూ ఉంటారు. తృప్తి పొందరు. ఏదో ఒకలోపము కనుగొంటారు. వారిలోనే లోపముందని గ్రహింపరు. వారితో క్రీస్తు అంటున్నాడు, "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). III. మూడవది, యేసు నొద్దకు వచ్చువారు. యేసు నొద్దకు వచ్చువారు దేవుని కృప చేత ఆయనకు చేరువైన వారు. ఒక యుక్త వయస్కునిగా ఒక భయంకర సంఘ "విభజన" చూసాను హంటింగ్ టన్ పార్కు మొదటి బాప్టిస్టు సంఘములో. ఈ చిన్న ప్రసంగములో అది వివరించలేదు. అది భయంకరము అని చెప్తే సరిపోతుంది. ప్రజలు ఒకరినొకరు తోసుకొని జంతువుల్లా పోట్లాడారు ఆదివారము ఉదయము ఆరాధనలో. పాటల పుస్తకాలు విసురుకున్నారు. సంఘ ఆరాధన చెప్పలేని భయంకరమైన పనులు చేసారు. రక్షింపబడని యువకునిగా ఇదంతా చూసాను. అయిననూ, ఇక్కడ బోధిస్తున్నాను, యాభై సంవత్సరాల తరువాత. మిగిలిన యువకులంతా పడిపోయారు. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? నేను క్రైస్తవ కుటుంభం నుండి వచ్చిన వాడను కాను. నేను ఇక్కడ ఎందుకున్నాను? ఎఫెస్సీయులకు 1:4 చెప్పడం ద్వారా అది వివరించగలను, "జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ఏర్పరచు కొనెను." నాలో మంచి నన్ను రక్షింపలేదు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు! మొత్తం దేవుని కృప చేత వలననే! అధ్బుత కృప! ఆ స్వరము మాధుర్యము, యేసును నమ్మక ముందు ఆయనను ప్రేమించడం ప్రారంభించాను. ఇతరులు గుడిలో అవివేకులవుచున్నారు, నేను ఇల్లు లేని, తండ్రి లేని బాలుడను. మొదట అనుకున్నాను మంచిగా ఉండడం ద్వారా నన్ను నేను రక్షించుకోవచ్చని. కాని అంతమంచిగా ఉండలేకపోయాను. చివరకు, క్షణ కాలంలో, యేసు నొద్దకే వచ్చాను – లేక, ఆయన నా దగ్గరకు వచ్చాడు. ఆయన నన్ను రక్షించి ఆయన ప్రశస్త రక్తము ద్వారా నన్ను కడిగాడు! ఒక స్నేహితుని, ఓ మంచి స్నేహితుని కనుగొన్నాను! నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నీవు నన్ను మొదట ప్రేమించావు, ఓ, ప్రియ యవనస్థులారా, నా రక్షకుడైన యేసును, ప్రేమించాలని బ్రతిమాలుచున్నాను! సిలువపై ఆయన రక్తము కార్చాడు నిన్ను శుద్ధి చేయడానికి పరలోకానికి సిద్ధపర్చడానికి. యేసు నొద్దకు వచ్చి ఆయనను ప్రేమించి, ఆయనను నమ్ము. యేసు నొద్దకు రమ్ము ఆయన నీకు నిత్య జీవము నిత్య ఆనందము ఇస్తాడు! ఆయన జీవిస్తున్నాడు! ఆయన జీవిస్తున్నాడు! ఆయన మూడవ ఆకాశములో ఉన్నాడు, తండ్రి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన జీవిస్తున్నాడు! ఆయన యొద్దకు రమ్ము. ఆయనను నమ్ము! ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు! ఆయన దీర్ఘంగా ప్రేమిస్తున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు, తండ్రి, నా ప్రార్ధన ఈ ఉదయము కొందరు నీ కుమారుడైన, యేసు, నొద్దకు వచ్చి నిత్యత్వములో రక్షింపబడాలని ప్రార్దిస్తున్నాను. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: యోహాను 5:33-40. |
ద అవుట్ లైన్ ఆఫ్ జీవమునిచ్చు రక్షకుడు! THE LIFE-GIVING SAVIOUR! డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). (యోహాను 5:26; 10:10; 3:36)
I. మొదటిది, ఎందుకు మీరు యేసు నొద్దకు రాలేదు, ఎఫెస్సీయులకు 2:3, 5; II. రెండవది, యేసు నొద్దకు రాని వారికి ఏమి జరుగుతుంది, లూకా 8:13. III. మూడవది, యేసు నొద్దకు వచ్చువారు, ఎఫెస్సీయులకు 1:4. |