Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




పేతురు యొక్క మార్పు

THE CONVERSION OF PETER
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలం, ఏప్రిల్ 3, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Friday Evening, April 3, 2015

"దేవుడు అన్నాడు, సీమోను, సీమోను, ఇదిగో, సాతాను మిమ్మును పట్టి, గోదుమల వలే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను: గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, నేను నీ కొరకు వేడుకొంటిని: నీ మనస్సు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచమని చెప్పెను" (లూకా 22:31-32).


ఇటీవల నేను మూడు ప్రసంగాలు బోధించాను క్రీస్తు చనిపోవుటకు యేరూషలేమునకు వెళ్ళుటపై. సులభ ప్రవేశము కొరకు అవి ఇక్కడ జత పరచబడ్డాయి – "శ్రమ కొరకు నిశ్చయించుకొనుట," "శిష్యుల భయము, " మరియు "చెప్పబడినది వారికి మరుగు చేయబడినది. " మొదటిది ఉపోద్ఘాతము. రెండు మూడవది శిష్యుల భయము అపనమ్మకముపై దృష్టి సారించాయి. ఇది స్పష్టము శిష్యులు సువార్తను నమ్మలేదు క్రీస్తు మృతుల నుండి లేచు వరకు. క్రీస్తు అన్నాడు,

"మనష్యు కుమారుడు మనష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడు దినములకు, ఆయన లేచునని వారితో చెప్పెను. వారు మాట గ్రహింప లేరు, గాని ఆయనను అడుగ భయపడిరి" (మార్కు 9:31-32).

"వారు ఆ మాట గ్రహింపలేదు గాని [సువార్తను గూర్చి] ఆయనను అడుగ భయపడిరి," పై డాక్టర్ ఎ. టి. రోబర్ట్ సన్ వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నాడు,

వారు అర్ధం చేసుకోకుండానే ఉన్నారు. వారు అవిశ్వాసము [అపనమ్మకస్తులు] రూపంతము తరువాత [క్రీస్తు] మరణము పునరుత్థానము విషయంపై...కొండ దిగి వస్తూ యజమానిని పునరుత్థానమును గూర్చి ఆశ్చర్య చకితులయ్యారు (మార్కు 9:10). మత్తయి 17:23 గమనిక "వారు దుఃఖ ముఖలైరి" [ఆయన మరణ పునరుత్థానములు] ను గూర్చి యేసు మాట్లాడుటపై కాని మార్కు కలిపాడు "ఆయనను అడుగ భయపడిరి" (A. T. Robertson, Litt.D., Word Pictures in the New Testament, Broadman Press, 1930, volume I, p. 344; note on Mark 9:32).

ఇది తేటగా చెప్తుంది శిష్యులు క్రీస్తు పునరుత్థానమైనంత వరకు సువార్తను నమ్మలేదు.

డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు శిష్యులు తిరిగి జన్మించలేదు (పునర్ణిమింపబడలేదు) ఈష్టర్ సాయంకాలము పునరుత్థానుడైన క్రీస్తును కలుసుకొనే వరకు. డాక్టర్ మెక్ గీ అన్నాడు, "నేను వ్యక్తిగతంగా నమ్ముతాను ఆ క్షణంలో క్రీస్తు వారిపై ఊదాడు [యోహాను 20:22] అప్పుడు వారు పునర్ణిమింపబడ్డారు. దానికి ముందు, వారు దేవుని ఆత్మతో నింపబడలేదు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, volume IV, p. 498; note on John 20:21).

నా లేఖనాల అధ్యయన ఆధారంగా, నేను కూడా నమ్ముతాను సీయోను పేతురు తిరిగి జన్మించలేదు ఈష్టర్ సాయంత్రము పునరుత్థానుడైన యేసును ఎదుర్కొనే వరకు. పాఠ్యభాగము మళ్ళీ గమనించండి,

"దేవుడు అన్నాడు, సీమోను, సీమోను, ఇదిగో, సాతాను మిమ్మును పట్టి, గోదుమల వలే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను: గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, నేను నీ కొరకు వేడుకొంటిని: నీ మనస్సు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచమని చెప్పెను" (లూకా 22:31-32).

సాతాను అప్పటికే యూదాను తీసుకుంది, "అప్పుడు సాతాను యూదాలో ప్రవేశించెను" (లూకా 22:3). ఇప్పుడు, యేసు పేతురుతో అంటాడు, "సాతాను మిమ్మును పట్టి [కూడా], గోధుమల వలే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను" (లూకా 22:31). క్రీస్తు శ్రమ పడుతున్నప్పుడు, పేతురు "భయంకర కొనసాగే కదలిక" ద్వారా వెళ్లి ఉంటాడు జల్లెడ వలే (డాక్టర్ ఆర్. సి. హెచ్. లేన్స్కి). పేతురుకు విశ్వాసముంది, అవిశ్వాసము "తప్పిపోకుండా" క్రీస్తు ప్రార్ధించాడు. పేతురు విశ్వాసాన్ని స్పర్జన్ అన్నాడు, "విశ్వాసమునకు ముందు విశ్వాసము," అంటే, మార్పుకు ముందు ప్రకాశము. దేవుడు అప్పటికే పెతురును ప్రకాశితుడ్ని చేసాడు, చాలినంత విశ్వాసాన్ని ఇచ్చాడు చెప్పడానికి, "నీవు సజీవుడైన, దేవుని కుమారుడగు క్రీస్తువు" (మత్తయి 16:16). ఇప్పుడు క్రీస్తు పేతురు కొరకు ప్రార్ధించాడు అతని విశ్వాసాన్ని సాతాను పీల్చేయకుండా ఈష్టర్ సాయంకాలము అతడు పునర్నింపబడి మారక ముందు,

"నీ మనస్సు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుము" (లూకా 22:32).

ఇది ఆ వచన సామాన్య తర్జుమా కాదు. అయినను నేననుకుంటాను అది నిజమైనదని. ఆఖరి వరకు ఓపిక పట్టండి, ముగింపు మీరు తీర్పు తీర్చేముందు. ఇవి మూడు విషయాలు నన్ను నమ్మింపచేసాయి, మన పాఠ్య భాగములో, సీమోను పేతురు నిజమార్పును గూర్చి ఈష్టర్ సాయంకాలమున.

I. మొదటిది, ఈ వచనము పేతురు మార్పును చూపిస్తుంది, ఎందుకంటే కింగ్ జేమ్స్ బైబిలు 1599 జెనేవా బైబిలు సరిగ్గా గ్రీకు పదాన్ని "మారెను" అని తర్జుమా చేసాయి.

నాకు తెలుసు ఎన్ఐవి "మారలేను" అని తర్జుమా చేసింది ఎన్ఎఎస్ వి "మరల తిరిగెను" అని అనువదించింది. అది నన్ను ఇబ్బంది పెట్టింది. అది అనిశ్చలంగా ఉంది, గ్రీకులోని మూలపదము అపోస్తలుల కార్యములు 15:3 లో ఇవ్వబడింది, ఇలా చెప్తుంది "అన్యజనుల మార్పిడి" (చూడండి ఎన్ఐవి మరియు ఎన్ఎఎస్ వి, రెండు "మార్పిడి" అని చెప్తున్నాయి). ఎందుకు గ్రీకు పదాలు "ఎపిస్ట్రెపో," "ఎపిస్ట్రెఫే," వరుసగా, "మారలేను" అని అనువదించాయి లూకా 22:32 లో మరియు "మార్పిడి" అని అపోస్తలుల కార్యములు 15:3 లో? నేననుకుంటాను కారణము సామాన్యము – అది అనివార్యము అన్యజనులు నిజంగా "మార్చబడ్డారు." "మరలుట" కాదు. కాని ఆధునిక అనువాదకులు లూకా 22:32 లో పేతురు దగ్గరకు వచ్చి వారి కొత్త సువార్తిక "నిర్ణయత" ఊహాగానాలు వారిని అనుమతించలేదు పాత కెజెవి మరియు 1599 జెనేవా బైబిలు పదము, "మార్పిడి" వాడటానికి. నా మట్టుకు ఆధునిక తర్జుమాలు బలహీన సర్దుబాటు అసలు తర్జుమా బదులు. డాక్టర్ బెర్నార్డ్ రామ్ అన్నాడు, "మూయబడుట బైబిలు అనువాదము సామాన్యము మరియు కళ" (Bernard Ramm, Ph.D., Protestant Biblical Interpretation, Baker Book House, 1970 edition, page 1). డాక్టర్ రామన్ అన్నాడు, "సంస్కర్తలు ఉపోద్ఘటించారు లేఖనాలు లేఖనాలను అనువదిస్తాయి." మూయబడుటలో ఒక సూత్రము లేఖనాలు లేఖనాలను తర్జుమా చేయనివ్వడం. వేత్తలు "అన్యజనుల మార్పిడిని" అనువదిస్తే అపోస్తలుల కార్యములు 15:3 లో, వారు లూకా 22:32 ను కూడా వారు అనువదించాలి "నీవు మార్పిడి నొందినప్పుడు," వాస్తవంగా అనువదింప బడింది 1599 జెనేవా బైబిలు కింగ్ జేమ్స్ బైబిలు చేసినట్టు! న్యూ కింగ్ జేమ్స్ కూడా తప్పే చేసింది. వారు "మార్పిడి"ని అన్యజనులకు వాడారు, కాని "తిరిగినప్పుడు" పేతురుకు వాడారు లూకా 22:32 లో. అందుకే, నేను కింగ్ జేమ్స్ బైబిలు నుండే బోధిస్తాను! మూడీ తెలియ పరచాడు, కేజేవి ఆధునిక అనువదముపై దృష్టి పెట్టింది! ఇది వాస్తవమని నేను భావిస్తాను.

"నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, నేను నీ కొరకు వేడుకొంటిని: నీ మనసు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుము" (లూకా 22:32).

నా స్నేహితుడా, అన్యజనులు మారితే సరిపోదు! పేతురు కూడా! వీధులలోని వారు మారితే సరిపోదు. ఓ, కాదు, సంఘములోని ప్రజలు, ఇప్పుడే ఈ సాయంకాలం, వారు మారాలి, "మరలుట కాదు"! మార్పిడి నొందాలి! యేసు అన్నాడు, "నీవు తిరిగి జన్మించాలి" (యోహాను 3:7). నీవు తప్పక పునరుద్దరింపబడి మారాలి లేకపోతే "దేవుని రాజ్యములో ప్రవేశింప నేరవు" (యోహాను 3:5).

"నీ మనస్సు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుము" (లూకా 22:32).

a. రెండవది, ఈ వచనము చూపిస్తుంది యేసును వెంబడించుట ద్వారా, బాప్తిస్మము ద్వారా, దైవిక ప్రకాశితము ద్వారా కాని ఎవ్వరు మార్పిడి చెందలేదు.

అది రెండవ పాఠము పేతురు మార్పిడి నుండి మనం నేర్చుకుంటాం. రోమన్ కేథలిక్కులు చాల మంది "నిర్ణయత్వ" బాప్టిస్టులు ప్రొటేస్టెంటులు అనుకుంటారు యేసును వెంబడించేటప్పుడు పేతురు మారాడని. బైబిలు చెప్తుంది,

"ఆయన గలిలియ సముద్ర తీరమున వెళ్ళుచుండగా, సీమోనును సీమోను సహోదరుడగు అంద్రేయము సముద్రములో వలవేయుట చూచెను: వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనష్యులను పట్ల, జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి, ఆయనను వెంబడించిరి" (మార్కు 1:16-18).

యేసును వెంబడించడం ద్వారా శిష్యులు రక్షింపబడ్డారు అనుకోవడం పెలా జయనిజం తప్పు అవుతుంది, నేటి సంఘాలలో అది కనిపించే తప్ప. అవును, పేతురు అంద్రేయ "వారి వలలు విడిచి పెట్టి, ఆయనను వెంబడించిరి" (మార్కు 1:18). కాని మానవ ప్రయత్నమూ ద్వారా మనము మారలేదు. యూదా, "నాశన పుత్రుడు," కూడా ఆయనను వెంబడించాడు, కాని మారలేదు. లూకా సువార్త చెప్తుంది "యూదా ఇస్కరిమొతు, అప్పగించువాడు" (లూకా 6:16). యేసు అతనిని "దెయ్యము" అన్నాడు (యోహాను 6:70).

అవును, యూదా పేతురులు యేసు మూడు సంవత్సరాలు వెంబడించారు, కాని వారిద్దరూ సువార్తను నమ్మలేదు. లూకా 18:31-34 వినండి,

"ఆయన తన పన్నెండు మంది, శిష్యులను పిలిచి, ఇదిగో, యేరూషలేమునకు వెళ్ళుచున్నాను, మనష్యు కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనుల కప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసిరి: ఆయనను కొరడాలతో కొట్టి, చంపుదురు: మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకడైనను గ్రహింప లేదు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు" (లూకా 18:31-34).

"ఇది వారికి మరుగు చేయబడెను." ఇది "ఏమిటి"? సువార్త మాటలు, క్రీస్తు మరణించి మృతులలో నుండి మూడవ దినమున లేచుట. పేతురు యూదా క్రీస్తును వెంబడించాలని ఒక "నిర్ణయము" తీసుకున్నారు, అయినను సువార్త "వారికి మరుగు చేయబడింది." డాక్టర్ చార్లెస్ సి. రైరీ అన్నాడు, "యూదా క్రీస్తు రక్షింపబడని శిష్యునికి ఒక ఉదాహరణ" (రైరీ స్టడీ బైబిలు; గమనిక మత్తయి 10:1). మరి ఎందుకు యూదాతో ఆపాలి, పేతురు కూడా యేసును విడిచిపెట్టినప్పటికిని? ఇద్దరు సువార్తను అర్ధము చేసుకోలేదు. అది "వారికి మరుగు చేయబడినది" (లూకా 18:34).

నా స్నేహితుడా, నీవు "ముందుకు వెళ్ళవచ్చు" ఒక కూటములో కాని తిరిగి జన్మించకపోవచ్చు. నీవు క్రీస్తును వెంబడించాలని నిర్ణయించు కోవచ్చు అయినను మారకపోవచ్చు. నీవు "పాపి ప్రార్ధన" చెప్పవచ్చు అయినను రక్షింపబడకపోవచ్చు. ఎందుకు? ఎందుకంటే ఇవన్ని మానవ క్రియలు, మనము మానవ పనులచే మరలేము! బైబిలు చెప్తుంది,

"వారు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది: కాదు దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయ పడ వీలులేదు" (ఎఫెస్సీయులకు 2:8-9).

బైబిలు చెప్తుంది,

"మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే, పునర్జన్మ సంభంధమైన స్నానము ద్వారాను, మరియు దెయ్యమును అనుసరించుట; పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను" (తీతుకు 3:5-6).

యేసును వెంబడించుట ద్వారా నీవు రక్షింపబడలేవు, మానవ పని ద్వారా కూడా. నేను కూడా రక్షింపబడడానికి అలాగే చేసాను, కాని అది పని చెయ్యలేదు. మూడు సంవత్సరాలకు పైగా నేను బాప్టిస్టు బోధకున్ని ఆయన కృప ద్వారా క్రీస్తు నన్ను రక్షింపక మునుపు! దేవుని ద్వారా క్రీస్తు నొద్దకు రాబట్టబడ్డాను, క్రీస్తు రక్తము ద్వారా నా పాపాల నుండి కడుగబడ్డాను.

"కాని," ఎవరో అన్నారు, "పేతురు బాప్మిస్మము పొందాడని." అవును, నాకు తెలుసు. యూదా కూడ. నేను కూడ బాప్మిస్మము పొందాను – మారడానికి ఏడు సంవత్సరాల క్రితము! "కాని," ఇంకొకరన్నారు, "పేతురుకు అనడానికి విశ్వాసము ఉంది, ‘సజీవుడైన, దేవుని కుమారుడైన క్రీస్తువు నీవు’ (మత్తయి 16:16) – యేసు అన్నాడు దేవుడు అతనికి ‘బయలు’ పరిచాడు" (మత్తయి 16:17). అవును, నాకు తెలుసు. దేవుడు నాకు బయలు పరిచాడు యేసు క్రీస్తుని, నేను మారక మునుపు. గమనించండి దెయ్యాలకు కూడ యేసును గూర్చి దేవుడు బయలు పరిచాడు, "దెయ్యములు చాలామంది నుండి బయటికి వచ్చాయి, అరచుకుంటూ, అన్నాయి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు...ఆయన క్రీస్తుని వాటికి తెలుసు" (లూకా 4:41). పేతురు యేసుని గూర్చి చెప్పినదే దెయ్యాలు చెప్పాయి. కనుక పేతురుకు యేసును గూర్చి దెయ్యాల కంటే ఎక్కువగా తెలియదు తాను మారక ముందు.

యేసును వెంబడించుట ద్వారా మనము మారలేదు. బాప్మిస్మము ద్వారా మనము మారలేదు. యేసు క్రీస్తుని నమ్మడం ద్వారా మనం మారలేదు. పేతురు ఇవన్ని అనుభవించాడు. అయినను యేసు అతనితో అన్నాడు,

"నీ మనస్సు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరుచుము" (లూకా 22:32).

II. మూడవది, ఈ వచనమును నాలుగు సువార్తలలోని పూర్తి వివరణను సందర్భంలోనికి తీసికొని చూడాలి.

నాలుగు సువార్తలలో మీరు చూస్తారు యేసు సాఫీగా పేతురుకు ఇతరులకు చెప్తాడు అయన చనిపోవడానికి మృతులలో నుండి మూడవ దినాన లేవడానికి యేరూష లేము వెళ్తున్నట్టు. అది మళ్ళీ మళ్ళీ యేసుచే చెప్పబడింది పేతురుకు మరియు మత్తయి 16:21; 17:12; 17:22-23; 20:18-19; మరియు 20:28 లలో ఇతరులను గూర్చి అన్నాడు. డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ పేతురు మరియు ఇతరులతో అన్నాడు, "తీవ్ర ఉపదేశమివ్వడినను, శిష్యులు పునరుత్థానము వరకు [సువార్త] ప్రాధాన్యతను గ్రహించడంలో విఫలమయ్యారు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, volume IV, p. 93; note on Matthew 16:21).

"నీ మనస్సు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరుచుము" (లూకా 22:32).

"సరే," ఎవరో ఒకరు అన్నాడు, "ఎక్కడ బైబిలులో చెప్పబడింది యేసు పునరుత్థానము తరువాత పేతురు మర్చబడ్డాడని?" ఎందుకు, నీ ముఖముపై ముక్కు ఉన్నంత తేటగా ఉంది, నాలుగు సువార్తల చివరిలో చెప్పబడింది! లూకా దీనిని ప్రత్యేకంగా తేటపర్చాడు,

"వారు ఇలాగు మాట్లాడుచుండగా, ఆయన వారి మద్యను నిలిచి, మీకు సమాధానముగా, వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రంతులై, భూతము తమకు కనబడేనని తలంచిరి. అప్పుడాయన మీరెందుకు, కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేల? నేనే ఆయనను అనుటకు, నా చేతులను నా పదాలను చూడుడి: నిన్ను పట్టి, చూడుడి; నాకున్నట్టుగా, మీరు చూచుచున్నారు. మేము మాంసమును భూతమునకుండవని చెప్పి, తన చేతులను మరియు పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత, ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఆయన ఇక్కడ, మీ వద్ద ఏమైనా ఆహారము కలవా అని వారి నడిగెను? వారు కార్చిన చేప ముక్కను, మరియు తేనే తెట్టెను ఆయన కిచ్చిరి. అంతటా ఆయన దానిని తీసికొని, వారి ఎదుట భుజించెను. ఆయన, మోషే ధర్మ శాస్త్రములోను, ప్రవక్తల గ్రంధములలోను, కీర్తనలలోను, నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని, నేను మీ వద్ద ఉండినప్పుడు, మీతో చెప్పిన మాటలు నేరవేరునని, వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా, ఆయన వారి మనస్సును తెరిచెను" (లూకా 24:36-45).

యోహాను చెప్పాడు,

"అదే రోజు ఆదివారము సాయంకాలమున, శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న ఇంటి తలుపులు మూసి కొనియుండగా, యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక, అని వారితో చెప్పెను. ఆయన అలా చెప్పి, వారికి తన చేతులను ప్రక్కను చూపారు. శిష్యులు ప్రభువును చూచి, సంతోష పడిరి. అప్పుడు యేసు మరల, మీకు సమాధానము కలుగును గాక: తండ్రి నన్ను పంపిన ప్రకారము, నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఆ మాట చెప్పి, వారి మీద ఊది, వారికి చెప్పెను, పరిశుద్ధాత్మను పొందుడి" (యోహాను 20:19-22).

ఈస్టరు సాయంకాలమున పునరుత్తానుడైన క్రీస్తు పేతురుకు ఇతరులకు ప్రత్యక్ష మయ్యాడు, తన చేతి గాయాలను వారికి చూపించాడు, ప్రక్క గాయము కూడా. అప్పుడు ఆయన సిలువ మరణమును గూర్చిన పాత నిబంధన ప్రవచనాల అవగాహనను వారికిచ్చాడు. ఆయన ఊదినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆ క్షణంలో పేతురు చివరకు పునర్ణిమింపబడ్డాడు (తిరిగి జన్మించాడు) మరియు మార్చబడ్డాడు. దేవుని ఆత్మ అంత శక్తి గలది, యేసు పునరుత్థాన శరీరము చూచినా స్థితి, చేతులలో మేకుల గురుతులు, పేతురుకు సందేహము లేకుండా అయింది. సంవత్సరాల తరువాత, నమ్మకముతో పేతురు వ్రాసాడు క్రీస్తు "ఆయన తానే తన శరీరము నందు మన పాపములను మ్రాను మీద మోసికోనేను...ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి" (I పేతురు 2:24). పేతురు నిజంగా మారినట్టు ఇది తెలియ చేస్తుంది! తన మార్పిడి తరువాత ఈస్టరు సాయంకాలము పేతురు ఎన్నడు క్రీస్తును కాదనలేదు. జీవితాంతము క్రీస్తు సువార్తను అతడు బోధించాడు. ఎంతో శ్రమ ద్వారా వెళ్లి అతడు తలక్రిందులుగా సిలువ వేయబడి, క్రీస్తును ప్రకటిస్తూ జీవితాంతము నమ్మకంగా ఉన్నాడు.

ఇంకొక విషయం. యేసు పేతురుతో అన్నాడు, "నీ మనస్సు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచమని చెప్పెను" (లూకా 22:32). ఈ తలంపు – నీవు నిజంగా మార్చబడితే నువ్వు చెప్పే దానిని బట్టి అది రుజువు కాదు, నువ్వు అనుకునే దాని బట్టి కాదు. మార్పిడికి నిజమైన రుజువు – ఇతరులను బలపరచ గలవా? ఇతరులకు సహాయ పడగలవా? యోహాను సువార్త చివరిలో పునరుత్థానుడైన క్రీస్తు పేతురుతో అన్నాడు, "నీవు నన్ను ప్రేమించుచున్నావా?" పేతురు అన్నాడు, "ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని...నీకే తెలియును. యేసు అతనితో అన్నాడు, నా గొర్రెలను మేపుము" (యోహాను 21:17). అప్పటి నుండి పేతురు ఊగిసలాడలేదు. తన జీవితమంతా అతడు సువార్త ప్రకటించి ఇతరులను క్రీస్తు నొద్దకు నడిపించాడు. నీవు నిజంగా మార్పిడి నొందితే, ఇతరులను బలపరచడానికి సమర్దుడవుతావు – సహాయకుడివిగా ఉండి నశించువారికి ఆశీర్వాదమవుతావు. ఆ ఫలము పూర్తిగా నీ జీవితంలో లేనిచో, అప్పుడు నీవు నిజంగా మార్పిడి నొందలేదు. మాటలు నీకు అవసరము. నీవింకా "యేసు క్రీస్తును" ఎదుర్కోలేదు. (ఎఫెస్సీయులకు 2:20). మా ప్రార్ధన దేవుడు యేసు నొద్దకు మిమ్మును చేర్చి ఆయన రక్తము ద్వారా పాపాల నుండి కడుగబడడం! అప్పుడు నీవు నిజంగా మారిన వాడవు, ఈస్టరు ఆదివారము సాయంకాలము పేతురు మారినట్లు. ఆమెన్. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించుడి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"సిలువ ఆకర్షణ" (సామ్యుల్ స్టెన్నేట్ చే, 1727-1795).
“The Attraction of the Cross” (by Samuel Stennett, 1727-1795).


ద అవుట్ లైన్ ఆఫ్

పేతురు యొక్క మార్పు

THE CONVERSION OF PETER

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"దేవుడు అన్నాడు, సీమోను, సీమోను, ఇదిగో, సాతాను మిమ్మును పట్టి, గోదుమల వలే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను: గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, నేను నీ కొరకు వేడుకొంటిని: నీ మనస్సు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచమని చెప్పెను" (లూకా 22:31-32).

(మార్కు 9:31-32, 10; మత్తయి 17:23; లూకా 22:3; మత్తయి 16:16)

I.   మొదటిది, ఈ వచనము పేతురు మార్పును చూపిస్తుంది, ఎందుకంటే కింగ్ జేమ్స్ బైబిలు 1599 జెనేవా బైబిలు సరిగ్గా గ్రీకు పదాన్ని "మారెను" అని తర్జుమా చేసాయి, అపోస్తలుల కార్యములు 15:3.

II.   రెండవది, ఈ వచనము చూపిస్తుంది యేసును వెంబడించుట ద్వారా, బాప్తిస్మము ద్వారా, దైవిక ప్రకాశితము ద్వారా కాని ఎవ్వరు మార్పిడి చెందలేదు, మార్కు 1:16-18; లూకా 6:16; యోహాను 6:70; లూకా 18:31-34; ఎఫెస్సీయులకు 2:8-9; తీతుకు 3:5-6; మత్తయి 16:16, 17; లూకా 4:41.

III. మూడవది, ఈ వచనమును నాలుగు సువార్తలలోని పూర్తి వివరణను సందర్భంలోనికి తీసికొని చూడాలి, మత్తయి 16:21; 17:12, 22-23, 20:18-19, 28; లూకా 24:36-45; యోహాను 20:19-22; I పేతురు 2:24; యోహాను 21:17; ఎఫెస్సీయులకు 2:20.