Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సర్పములు మరియు రక్షకుడు

THE SERPENTS AND THE SAVIOUR
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, మార్చి 8, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, March 8, 2015

"మోషే ప్రజల కొరకు ప్రార్ధన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి, స్థంభము మీద పెట్టెను: అప్పుడు కరవబడిన ప్రతివాడును, దానివైపు చూచి, బ్రతుకునని, మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి, స్థంభము మీద దానిని పెట్టెను, అప్పుడు, సర్పపు కాటు తినిన ప్రతివాడు, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున, బ్రతికెను" (సంఖ్యా కాండము 21:8-9).


ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ నిరుత్సాహపడ్డారు. ప్రజలు దేవునికి వ్యతిరేకంగా, వారి నాయకుడు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. వారన్నారు, "మమ్ములను ఈ అరణ్యంలో చనిపోవుటకు ఎందుకు తీసుకొని వచ్చితివి? ఆహారము లేదు, నీళ్ళు లేవు, ఈ ఆహారమును అసహ్యించు కొనుచున్నాము." దేవుడు ఆకాశము నుండి మన్నును పంపించాడు, దానిని వారు అసహ్యించుకున్నారు. వారు దానిని "అల్పాహారము" అన్నారు, విలువలేనిది. కీర్తన కారుడు "దేవా దూతల ఆహారము" అన్నాడు (కీర్తనలు 78:25), కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మోషేకు వ్యతిరేకంగా సణిగాడు గొణిగాడు. వారన్నారు, "మా మనసులకు ఈ మన్ను నచ్చదు" – మేము దానిని అసహ్యించుకోనుచున్నాము.

ఇది మనవ స్వభావము పైన వ్యాఖ్యానము. ఇది మనవ హృదయపు దుర్మర్గాతను పాపాన్ని చూపిస్తుంది,

"ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై యున్నది" (రోమా 8:7).

బైబిలు చెప్తుంది,

"అందరును పాపమునకు లోనైయున్నారు; ఇందును గూర్చి వ్రాయబడిన వేమనగా, నీతిమంతుడు లేడు, లేడు, ఒక్కడును లేదు" (రోమా 3:9-10).

మానవ హృదయం దేవునికి వ్యతిరేకంగా ఉంది. అందుకే దేవునికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసి సణుగుతాం. పాప మానవుడు అరణ్యంలోని ఇశ్రాయేలీయుల కంటే, ఏవిధంగా, వేరు కాదు.

"అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరము లైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా; ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి" (సంఖ్యాకాండము 21:6).

బైబిలు చెప్తుంది, "పాపమూ వలన వచ్చు జీతము మరణము" (రోమా 6:23). బైబిలు చెప్తుంది, "పాపము చేయువాడు, మరణము నొందును" (హెహేజ్కేలు 18:4, 20).

కాని విడువబడిన వారు మోషే నొద్దకు వచ్చి, "మేము పాపము చేసితిమి...యెహోవా మా మధ్య నుండి, సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొను మనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్ధించెను" (సంఖ్యా కాండము 21:7).

దేవుడు వారి పట్ల చూపించిన గొప్ప కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల చేసాడు. ఎర్ర సముద్రము ద్వారా నడిపించాడు – పాయలైన నీటి మధ్య ఆరిన నేలపై. పాత నిబంధన అంతటిలో ఈ గొప్ప విడుదలను గూర్చి వారు పాడారు. ప్రతి రోజు దేవుడు వారికి మన్నా అను గ్రహించాడు. బండ నుండి నీళ్ళు ఉబికాయి, దేశమంతటికి పశువులకు. దేవుడు గొప్ప శక్తితో వారి శత్రువుల నుండి విడిపించాడు. రాత్రి అగ్ని స్థంభము, పగలు దీప స్థంభముతో వారిని నడిపించాడు. దేవుని శక్తి నా మహిమ నిరంతరము వారితో ఉండెను.

అయిననూ వారు దేవుని స్తుతించలేదు. బదులుగా అపనమ్మకస్థులుగా ఉన్నారు. వారు తిరుగుబాటు చేసారు. వారు మోషేకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా సణిగి ఫిర్యాదు చేసారు. డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు,

అకస్మాత్తుగా ప్రజల మధ్య, గడ్డిలో జారిపడి, గుడారాలలోనికి, విష సర్పాలు, విచిత్ర దుష్ట విషయాలు ప్రాకాయి "చాల మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు." ఇక్కడ దేవుని శిక్ష దేవుని కృప ఒక సందర్భంలో చూపబడ్డాయి. ఇవి ఉగ్రత మరియు కృప. ఇక్కడ అరణ్యంలో పాపము రక్షకుడు ప్రత్యక్ష పరచబడ్డాయి (John R. Rice, D.D., “Snakes in the Camp,” Blood and Tears on the Stairway, Sword of the Lord Publishers, 1970, pp. 34, 35).

ఈ సంఘటనను గూర్చి మనము ఆలోచించే వారము కాదు నూతన నిబంధనలో, యేసు యోహాను సువార్త మూడవ అధ్యాయములో మళ్ళీ మళ్ళీ చెప్పకపోతే.

నికోదేము రాత్రివేళ యేసు నొద్దకు వచ్చాడు. అతడు ఇశ్రాయేలు ముఖ్య బోధకుడు. అతడు పరిశయ్యాడు యూదా న్యాయ స్థానములో, సన్ హెడ్రిన్ సభ్యుడు. అతడు నమ్మాక "దేవుని నుండు వచ్చిన బోధకుడని: దేవుడు వానితో ఉంటేనే తప్ప, ఎవడును ఇలాంటి అద్భుతాలు చెయ్యలేడు" (యోహాను 3:2).

కాని తిరిగి జన్మించడం నికోదేముకు తెలియదు. యేసు అతనితో అన్నాడు, "నీవు తిరిగి జన్మించాలి" (యోహాను 3:7). నికోదేము అన్నాడు, "ఇవి ఆలాగు సాధ్యము?" (యోహాను 3:9). ఎలా తిరిగి జన్మించాలో తెలియదు, ఎలా రక్షణ పొందాలో. యేసు అతనికి అరణ్యంలోని సర్పమును జ్ఞాపకం చేసాడు, నూతన జన్మ ఎలా సంభావిస్తుందో చూపించడానికి.

నూతన జన్మ "నూతన నిర్మాణము" అని వేదాంతులు అన్నారు. సంస్కరణ పాఠ్య బైబిలు అంటుంది,

తిరిగి జన్మించడంపై నికోదేము నిర్ఘాంత పోయేలా యేసు ఆశ్చర్యంగా చూపించాడు. నికోదేము పాత నిబంధన నుండి అర్ధం చేసుకొని ఉండాల్సింది, నూతన జీవితమూ అవసరతను... పునర్నిర్మాణము [కొత్త జన్మ] దేవుని కృప యొక్క బహుమానము. మనలో పరిశుద్ధాత్మ జరిగించే, తదుపరి అసాధారణ పని. మనలను త్వరితం చేయడం దాని ఉద్దేశము [మనలను జీవింప చేయడం] ఆత్మీయ మరణం నుండి ఆత్మీయ జీవితంలోనికి...(The Reformation Study Bible, Ligonier Ministries, 2005, p. 1514; note on John 3).

ఇప్పుడు యోహాను 3:14, 15 చూడండి. 1117 వ పేజి ద స్కోఫీల్ద్ పఠన బైబిలు. ఇక్కడ యేసు నూతన జన్మను నికోదేముకు వివరించాడు. బైబిలులోని మొదటి ఐదు గ్రంధాలు, పంచ గ్రంధాలు నికోదేముకు తెలుసు. బైబిలులో సంఖ్యాకాండము నాల్గవ గ్రంధము. నికోదేము దానిని బాగా కంఠతా పెట్టాడు, అంటా కంఠతా పెట్టి, ఉంటాడు. కనుక యేసు తాప సర్పముల వివరణ ఇచ్చాడు ఎలా రక్షింపబడాలో వివరింపడానికి, ఎలా తిరిగి జన్మించాలో. దయచేసి నిలబడి యోహాను 3:14 మరియు 15 చూడండి. అది ద స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1117 వ పేజిలో ఉంది. యేసు నికోదేముతో అన్నాడు,

"అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వశించు ప్రతివాడును నశింపక: ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు, మనష్యు కుమారుడు ఎత్తబడవలెను" (యోహాను 3:14-15).

కూర్చోండి. చూచి జీవించడం, యేసును విశ్వసించి రక్షింపబడడం, క్రీస్తు సువార్తలో హృదయము లాంటిది. ఈ పాఠ్యభాగములో మూడు విషయాలు గమనించండి.

I. మొదటిది, పాపము యొక్క ముళ్ళు మరణము.

మానవుడు గుడారములో ప్రవేశిస్తే, అక్కడ పాములున్నాయి. తినడానికి కూర్చున్నప్పుడు, అవి అక్కడ ఉన్నాయి. అతడు పరుపును తీసునప్పుడు, ఈ సర్పాలు అక్కడున్నాయి, కరవడానికి మెలితిరిగి, సిద్ధంగా ఉన్నాయి. ఈ సర్పాలు కాటు వేసినప్పుడు, అది ముళ్ళే అగ్నిలా కాలింది. బలి అయిన అతని శరీరంలో జ్వరముంది, మూర్చ మరణము ఉన్నాయి! కాటు వేయబడిన వారందరూ భయంకరంగా మరణించారు.

ఇప్పుడు వినండి డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ చెప్పింది, అతడు టెక్సాస్ లోని మొదటి డాలస్ సంఘ, పేరుగాంచిన కాపరి. డాక్టర్ క్రీస్ వెల్, పాములను గూర్చి ఇలా అన్నాడు,

ఇది ఒక [దుష్టాంతము] ప్రభువుచే వాడబడింది మనవ హృదయమును గూర్చిన విశ్వ దుష్టత్వము, మనవ జీవితంలోని పాపము ఉనికి. దుష్టత్వము మన హృదయాలలో, మన ఇళ్ళలో, గృహాలలో, మన వృద్ధిలో పతనములో ఉంది...పాప మరణ ఉనికి తప్పించుకోలేది. మానవత్వము దుష్ట పతన జాతి; మనం వేదాంత పరుస్తాం, మనవ జీవితంలోనికి కఠిన సత్యము మానవ చరిత్రలోనిది ఇది: మానవులు పాపములో అతిక్రమములో తప్పిపోయారు. మన పాపములో చచ్చాం...ఈ సర్పాలు పాప పతన శక్తి వంటివి...ఓ, నశింప చేసే, పాపపు శక్తి!
         ఈ విజ్రుమ్బించే, తాప సర్పాలు అన్ని చోట్ల ఉన్నాయి. మానవులు భౌతిక మరణంలో, ఆత్మీయ మరణంలో, నైతిక మరణంలో, రెండవ మరణంలో, నిత్య మరణంలో చనిపోతున్నారు...
         మానవాళి అజ్ఞానము నుండి, మూఢ నమ్మకాల నుండి, ఇతర వేల చీకటుల నుండి ఎత్తబడింది; కాని మన హృదయాలలో, మనం ఇంకా అలాగే ఉన్నాము...మనం ఇంకా ఆదాము హవ్వల, నైతిక ఆత్మీయ స్థితిలోనే ఉన్నాము. మనకు మార్గము లేదు విశ్వ శ్రమల నుండి, నిరుపయోగము నుండి, పతనము నుండి, పాప తీర్పు నుండి బయట బడడానికి (W. A. Criswell, Ph.D., “The Brazen Serpent,” What a Savior!, Broadman Press, 1978, pp. 49-51).

అపోస్తలుడైన పౌలు ఒక హెచ్చరికగా మన పాపాలను, ఇశ్రాయేలీయుల పాపాలతో పోల్చాడు,

"మనము ప్రభువును శోదింపక యుందము, వారిలో కొందరు శోధించి, సర్పము వలన నశించిరి. మీరు సణిగకుడి, వారిలో కొందరు సణిగి, సంహరకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి: యుగాంతమందున్న, మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను" (I కొరిందీయులకు 10:9-11).

పాపము వారిపై తీర్పు తెచ్చింది – ఈనాడు పాపము తీర్పును తెస్తుంది. "ఇవన్నియు వారికి సంభవించాయి [దృష్టాంతముల వలే] మనకు [బుద్ధి కలుగుటకై] వ్రాయబడ్డాయి," I కొరిందీయులకు 10:11 – ఇది రెండవ విషయానికి మనలను నడిపిస్తుంది.

II. రెండవది, పాపానికి మరణానికి నివారణ.

మోషే ప్రజల మోర విన్నాడు. వారు పాములచే కరవబడ్డారు. వారు అరుస్తున్నారు చనిపోతున్నారు. సర్పాలు అన్ని చోట్లా ఉన్నాయి.

"మోషే ప్రజల కొరకు ప్రార్ధన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి, స్థంభము మీద పెట్టెను: అప్పుడు కరవబడిన ప్రతివాడును, దానివైపు చూచి, బ్రతుకునని, మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి, స్థంభము మీద దానిని పెట్టెను, అప్పుడు, సర్పపు కాటు తినిన ప్రతివాడు, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున, బ్రతికెను" (సంఖ్యా కాండము 21:8-9).

మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, ఒక గుర్తు ఉంటుంది. ఒక స్థంభముపై రెండు సర్పములు చుట్టబడి ఉంటాయి. ఈ గుర్తు వైద్యుని కార్యాలయంలో గాని అతని కాగితాలలో గాని ఉంటుంది. స్వస్తపరచు ఉద్యోగములోని గుర్తు అది. ఎంత విచిత్రము ఆరోగ్య సూచన, స్వస్థత రక్షణ స్థంభముపై పాము వేలాడు సన్నివేశము! అది నిజమైన పాము కాదు. ఇత్తడితో చేయబడి ఎత్తైన స్థంభముపై ఉంచబడిన సర్పము.

స్కోఫీల్డ్ గమనిక సరియే, "ఇత్తడి సర్పము క్రీస్తు సాదృశ్యము, ‘మన కొరకై’ మారిన పాపము మన తీర్పు భరించడం" (గమనిక సంఖ్యాకాండము 21:9). మన పాపాలన్నీ క్రీస్తుపై సిలువపై ఉంచబడ్డాయి,

"ఆయన తానే తన శరీర మందు మన పాపములను మ్రాను మీద మోసికొనేను... ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి" (I పేతురు 2:24).

యేసు నికోదేముతో అన్నాడు,

"అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఉండునట్లు మనష్యు కుమారుడు ఎత్త బడవలెను..." (యోహాను 3:14).

"మనష్యు కుమారుడు" యేసు’ యొక్క ఇష్టమైన నామము. ఆయన అన్నాడు, "నేను (సిలువపై) ఎత్తబడతాను మోషేచే ఇత్తడి సర్పము ఎత్త బడునట్లుగా." ఎంత చక్కని రక్షకుని సాదృశ్యము!

అవమానము వెక్కిరింత భరిస్తూ,
   నా స్థానములో ఖండింపబడి ఆయన నిలచాడు;
ఆయన స్థానంలో నా క్షమాపణ ముద్రించాడు;
   హల్లెలూయ! ఎంతటి రక్షకుడు!

మరణించడానికి ఎత్తబడ్డాడు,
   "సమాప్తమైనది," ఆయన కేక;
ఇప్పుడు పరలోకంలో హెచ్చింపబడి;
   హల్లెలూయ! ఎంతటి రక్షకుడు!
("హల్లెలూయ, ఎంతటి రక్షకుడు!" ఫిలిప్ పి. బ్లిస్ చే, 1838-1876).
(“Hallelujah, What a Saviour!” by Philip P. Bliss, 1838-1876).

"అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఉండునట్లు మనష్యు కుమారుడు ఎత్త బడవలెను..."(యోహాను 3:14).

అది మూడవ విషయానికి మనలను తీసుకెళ్తుంది.

III. మూడవది, పాపానికి మరణానికి నివారణ పొందుకొనే మార్గము.

"అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వశించు ప్రతివాడును నశింపక: ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు, మనష్యు కుమారుడు ఎత్తబడవలెను" (యోహాను 3:14, 15).

యేసును నమ్మడమంటే ఆయన వైపు చూడడం. చూడడం అంటే జీవించడం, నమ్మడం రక్షింపబడడం, కడుగబడి శుద్ధి అవడం! ఇది కష్ట తరము కాదు! విశ్వాసముతో యేసు వైపు చూడు. మన సంఘ ప్రతి సభ్యుడు ఆ పని చేసాడు. అది కష్ట తరము కాదు లేకుంటే నా భార్య చేసి ఉండి ఉండక పోయేది నేను తొలిసారిగా సువార్త బోధించినప్పుడు!

"కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి, స్థంభము మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పము, కాటు తినిన ప్రతివాడును, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున, బ్రతికెను" (సంఖ్యాకాండము 21:9).

ఒక వ్యక్తి ఇత్తడి సర్పమును చూచినప్పుడు, అతడు జీవించాడు! అప్పటికే కరవబడిన వాడు చూడగలిగాడు! చనిపోయే స్థితిలో ఉన్నవాడు చూడగలిగాడు! ఇత్తడి సర్పమును చూడడం ద్వారా వారు రక్షింపబడ్డారు! యేసు వైపు చూడడం ద్వారా మనం రక్షింపబడ్డాం!

"విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు; ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, అవమానములను నిర్లక్ష్య పెట్టి, సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు" (హెబ్రీయులకు 12:2).

అది కష్ట తరము కాదు! లక్షలాది మంది యేసు వైపు చూసారు! యేసు వైపు చూచుట! యేసు వైపు చూచుట! యేసు వైపు చూచుట! అది తిరిగి జన్మించే మార్గము! యేసు వైపు చూచుట! అది పునర్నిర్మాణానికి మార్గము! యేసు వైపు చూచుట! అది మార్గము క్షమింపబడడానికి అన్ని పాపాల నుండి కడుగబడడానికి! యేసు వైపు చూచుట! రక్షింపబడడానికి అదే మార్గము – అన్ని కాలాలలో నిత్యత్వంలో!

మహిమ ప్రకాశించే వరకు యేసు వైపు చూచుట;
క్షణ క్షణము, ఓ ప్రభువా, నేను నీ వాడను!
   ("క్షణ క్షణము" డానియెల్ డబ్ల్యూ. విట్టల్ చే, 1840-1901).
      (“Moment by Moment” by Daniel W. Whittle, 1840-1901)

పాప విడుదల పొందాలనుకుంటే,
   దేవుని గొర్రె పిల్ల వైపు చూడు;
ఆయన, నిన్ను విమోచించడానికి, కల్వరిపై మరణించాడు,
   దేవుని గొర్రె పిల్ల వైపు చూడు.
దేవుని గొర్రె పిల్ల వైపు చూడు, దేవుని గొర్రె పిల్ల వైపు చూడు,
   ఆయన మాత్రమే నిన్ను రక్షింపగల సమర్ధుడు,
దేవుని గొర్రె పిల్ల వైపు చూడు.
   ("దేవుని గొర్రె పిల్ల వైపు చూడు" హెన్రీ జి. జాక్సన్ చే, 1838-1914).
      (“Look to the Lamb of God” by Henry G. Jackson, 1838-1914).

చూచి జీవించు, నా సహోదరుడా, జీవించు!
   ఇప్పుడు యేసు వైపు చూచి జీవించు,
‘అది ఆయన వాక్యములో లిఖితమైనది, హల్లెలూయ!
   నీవు చూచి జీవించడం మాత్రమే!
("చూచి జీవించు" విలియం ఎ. ఓగ్డెన్ చే, 1841-1897).
(“Look and Live” by William A. Ogden, 1841-1897).

"అప్పుడు సర్పకాటు తినిన, ప్రతి ఒక్కడు, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున, బ్రతికెను" (సంఖ్యాకాండము 21:9).

చూచి జీవించు, నా సహోదరుడా, జీవించు!
   ఇప్పుడు యేసు వైపు చూచి జీవించు,
‘అది ఆయన వాక్యములో లిఖితమైనది, హల్లెలూయ!
   నీవు చూచి జీవించడం మాత్రమే!

స్పర్జన్ పదిహేను సంవత్సరాలప్పుడు మంచు తుఫాను నుండి బయటపడి చిన్న పురాతన మెథడిస్ట్ ఆలయానికి వచ్చాడు. సేవకుడు అక్కడలేదు. ఆయన "దొర్లి వచ్చాడు." అక్కడ సుమారు పదిహేను మంది మాత్రమే ఉన్నారు. ఒక చిన్న బక్కని సామాన్యుడు లేచి బోధించాడు. మెరుగు కాని భాషలో లేఖన భాగాన్ని ఇచ్చాడు,

"భూది గంతముల నివాసులారా, నా వైపు చూచి, రక్షణ పొందుడి" (యెషయా 45:22).

అతడు యవ్వన స్పర్జన్ ను నేరుగా చూస్తూ అన్నాడు, "యవనస్తుడా, నీవు భయంకరంగా ఉన్నావు. నీవు ఎప్పుడు భయంకరంగానే ఉంటావు నా వాక్య భాగానికి విదేయుడవు కాకపొతే. చూడు! చూడు! యేసు వైపు చూడు." స్పర్జన్ అన్నాడు, "నేను చూసాను, యేసు నన్ను రక్షించాడు నేను ఆయనను విశ్వాసంతో చూచినప్పుడు."

చూచి జీవించు, నా సహోదరుడా, జీవించు!
   ఇప్పుడు యేసు వైపు చూచి జీవించు,
‘అది ఆయన వాక్యములో లిఖితమైనది, హల్లెలూయ!
   నీవు చూచి జీవించడం మాత్రమే!

పాల్ వాషర్ చెప్పేది నేను లెక్క చెయ్యను! "నీవు చూచి జీవించాలి అంతే!" డాక్టర్ మెక్ ఆర్డర్ చెప్పేది నేను లెక్క చెయ్యను! "నీవు చూచి జీవించాలి అంతే!" వీరు మంచి వారు, కాని "నీవు చూచి జీవించాలి అంతే!"

సిలువపై దొంగకు యేసు ప్రక్కన తన జీవితపు ప్రతి విషయంలో ఆయనను ప్రభువునిగా చేసుకోనేంత సమయము అతనికి లేదు! అతడు చనిపోతున్నాడు! అతనికి సమయము లేదు అతని జీవితములోని ప్రతి విషయంలో క్రీస్తును ప్రభువుగా చేసుకోవడానికి! అతడు చనిపోతున్నాడు. సమయము లేదు! సమయము లేదు! సమయము లేదు! ఒక పని చెయ్యడానికి మాత్రమూ సమయము ఉంది. విశ్వాసముతో యేసు వైపు చూసాడు! "నీవు చూచి జీవించడం మాత్రమే!" అది స్పర్జన్ చేసాడు! అదే నీవు కూడా చెయ్యవలసింది!

హల్లెలూయ! సిలువపై ఆ దొంగ రక్షింపబడ్డాడు! యేసు అన్నాడు, "నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు" (లూకా 23:43).

చూచి జీవించు, నా సహోదరుడా, జీవించు!
   ఇప్పుడు యేసు వైపు చూచి జీవించు!
‘అది ఆయన వాక్యములో లిఖితమైనది, హల్లెలూయ!
   నీవు చూచి జీవించడం మాత్రమే!

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: సంఖ్యాకాండము 21:5-9.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"చూచి జీవించు" (విలియం ఎ. ఓగ్డెన్ చే, 1841-1897).
“Look and Live” (by William A. Ogden, 1841-1897).


ద అవుట్ లైన్ ఆఫ్

సర్పములు మరియు రక్షకుడు

THE SERPENTS AND THE SAVIOUR

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మోషే ప్రజల కొరకు ప్రార్ధన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి, స్థంభము మీద పెట్టెను: అప్పుడు కరవబడిన ప్రతివాడును, దానివైపు చూచి, బ్రతుకునని, మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి, స్థంభము మీద దానిని పెట్టెను, అప్పుడు, సర్పపు కాటు తినిన ప్రతివాడు, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున, బ్రతికెను" (సంఖ్యా కాండము 21:8-9).

(కీర్తనలు 78:25; రోమా 8:7; 3:9-10; సంఖ్యాకాండము 21:6;
రోమా 6:23; యెహెజ్కేలు 18:4, 20; సంఖ్యాకాండము 21:7;
యోహాను 3:2, 7, 9; 14-15)

I.   మొదటిది, పాపము యొక్క ముళ్ళు మరణము, I కొరిందీయులకు 10:9-11.

II.  రెండవది, పాపానికి మరణానికి నివారణ, I పేతురు 2:24; యోహాను 3:14.

III. మూడవది, పాపానికి మరణానికి నివారణ పొందుకొనే మార్గము, యోహాను 3:14, 15; హెబ్రీయులకు 12:2; యెషయా 45:22; లూకా 23:43.