Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నా కిష్టమే – నీవు శుద్దుడవు కమ్ము

I WILL – BE THOU CLEAN!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, మార్చి 1, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, March 1, 2015

"ఒక కుష్టు రోగి, ఆయన యొద్దకు వచ్చి, ఆయన యెదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్దునిగా చేయగలవని, ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనెను. యేసు, కనికరపడి, చెయ్యి చాపి, వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్దుడవు; కమ్మని వానితో చెప్పెను. వెంటనే, వాని కుష్టురోగము విడిచెను, గనుక వాడు శుద్దుడాయెను" (మార్కు 1:40-42)


మార్కు సువార్త చదవడం నాకు ప్రియము. అతని హెబ్రీ పేరు యోహాను. మార్కు అతని లాటిన్ పేరు, "మార్కస్" లాటిన్ లో. యోహాను మార్కు అపోస్తలుడైన పేతురు ఆత్మీయ కుమారుడు. పేతురు అతనిని, "నాకుమారుడైన మార్కస్" (I పేతురు 5:13). ఆదిమ సంఘ తండ్రి పాపియాస్ (70-163). పాపియాస్ చెప్పాడు మార్క్ తన సువార్తను పేతురు నుండి పొందాడని. పాపియాస్ అన్నాడు, "మార్కు, పేతురు [కార్యదర్శి], [పేతురు] గుర్తుచేసుకున్నదంతా జాగ్రత్తగా వ్రాసాడు." జస్టిన్ మార్టిర్ (100-165) కూడా అన్నాడు మార్కు పేతురు మాటలనుండి ఈ సువార్తను తీసుకున్నాడని. ఇంకొక సంఘ తండ్రి, యూ సెబియస్(263-339) అన్నాడు ఆదిమ క్రైస్తవులు "వారు [పేతురు నుండి] పొందిన సిద్ధాంతమును మార్కును వ్రాయమని కోరారు."

మార్కు క్రియాశీల సువార్త ఎందుకంటే పేతురు క్రియాశీలుడు కాబట్టి. ఈ సువార్త ప్రత్యేకంగా, క్రియాశీలులైన రోమీయులకు వ్రాయబడినది. పదము "మరియు" 1,331 సార్లు మార్కు సువార్తలో వ్రాయబడింది. పదాలు "నేరుగా" లేక "వెంటనే" మార్కు సువార్తలో మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి. "మరియు" అనే పదము తదుపరి పనికి నడిపిస్తుంది. గమనించండి మన పాఠ్యభాగములోని ఐదు వచనాలు "మరియు" తోనే ప్రారంభమయ్యాయి. మరియు మిగిలిన మూడు వచనాలు "మరియు" తో ప్రారంభం అవుతాయి.

"మరియు ఒక కుష్టు రోగి ఆయన యొద్దకు వచ్చెను" (40 వ వచనము).

"మరియు యేసు, కనికరపడేను" (41 వచనము).

"మరియు ఆయన మాట్లాడిన, వెంటనే కుష్టు రోగము వానిని విడిచెను, మరియు వాడు శుద్దుడాయెను" (వచనము 42).

రోమీయులు శక్తిని పనిని నమ్ముతారు. మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి, అది మన ప్రభువు యేసు క్రీస్తు శక్తి పనులతో నింపబడ్డాయి. క్రీస్తు ఆయన పనులు దీర్ఘ వ్యాసాలలో వ్యాఖ్యానాలలో పాత నిబంధన నుండి వివరింపబడలేదు. మార్కు చాలా వదిలిపెట్టి యేసు శక్తిని పనులను చూపించాడు, అది రోమా ప్రేక్షకులకు బాగా అనిపించింది.

గమనించండి మార్కు మొదటి అధ్యాయములో ఎంత క్రీయాశీలత ఇమడబడిందో,

బాప్టిస్మమిచ్చు యోహాను పరిచర్య.
యేసు బాప్టిస్మము.
అరణ్యములో యేసు శోధింపబడులు.
యేసు గలిలయలోని ప్రారంభపు పరిచర్య.
పేతురు ఆంద్రెయల పిలుపు.
కపెర్నహోములొ దెయ్యములు వెళ్ళగొట్టబడుట.
సీమోను పేతురు అత్త స్వస్థత.
గలిలయలో యేసు సంచార భోధ.
మన పాఠ్య భాగములో కుష్టు రోగి స్వస్థత.

క్రీస్తు పని శక్తి గల వ్యక్తిగా చూపబడ్డాడు. ఆయన శక్తి క్రియ ఈ ఉదయాన్నే నిన్ను రక్షింపగలదు.

యేసు! నామము మన భయాలను తొలగిస్తుంది,
   మన విచారములను తీసేస్తుంది;
‘పాపుల చెవులలో సంగీతము,
   ‘అది జీవితము, ఆరోగ్యము సమాధానము.
("ఓ వెయ్యి నాలుకలకు" చార్లెస్ వెస్లీ చే, 1707-1788).

మార్కు మొదటి అధ్యాయములో తొమ్మిది ముఖ్య సంఘటనలు వ్రాయబడ్డాయి! డాక్టర్ మెక్ గీ అన్నాడు, "బహుశా మార్కు మొదటి అధ్యాయములో ఉన్నంత విషయము బైబిలులో ఏ అధ్యాయములో కూడలేదు, ఆది కాండము 1 వ అధ్యయము మినహా" (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume IV, Thomas Nelson, 1983, p. 161).

అది మన పాఠ్యభాగమునకు నడిపిస్తుంది, మరియు కుష్టు రోగి స్వస్థత,

"ఒక కుష్టు రోగి, ఆయన యొద్దకు వచ్చి [ఆయనను ప్రార్ధిస్తూ], ఆయన యెదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్దునిగా చేయగలవని, ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనెను. యేసు, కనికరపడి, చెయ్యి చాపి, వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్దుడవు; కమ్మని వానితో చెప్పెను. వెంటనే, వాని కుష్టురోగము విడిచెను, గనుక వాడు శుద్దుడాయెను" (మార్కు 1:40-42)

ఈ పాఠ్యభాగములో మూడు ప్రాముఖ్య విషయాలు నేర్చుకుందాం.

I. మొదటిది, అతడు కుష్టు రోగి.

లేవియాకాండము పదమూడు పద్నాలుగు అధ్యాయాలు భయంకర రోగమైన కుష్టు రోగమును గూర్చి వివరించాయి. అది చాల చర్మ వ్యాధులను గూర్చి, ఆధునిక కుష్టు రోగము (లేక హేన్ సెన్ రోగము) వర్ణించింది. ఒక వ్యాఖ్యాత అన్నాడు ఈ వ్యక్తికి నిజ కుష్టు రోగము ఉంది, లేక స్వస్థత చలనము కలిగించలేదు, వచనము నలబై ఐదులో ఉన్నట్టు. క్రొత్త ఉంగర్ బైబిలు నిఘంటువు చెప్తుంది, "క్రొత్త నిబంధనలో వివరింపబడ్డ కుష్టు రోగులు హేన్ సెన్స్ రోగము కలిగి ఉండి ఉండవచ్చు" (The New Unger’s Bible Dictionary, Moody Press, 1988, p. 307).

ఈ వ్యక్తికి తీవ్ర కుష్టు రోగము ఉంది తెల్ల మచ్చలు మొద్దు బారడం. ఆయా శరీర అవయవాలలో వాపు ఉన్నాయి. వాటి నుండి చీము కారింది, రోగము ముదిరింది కనుక. అతని చేతులు కాళ్ళు బాగా వాచి ఉంటాయి. రోగము అప్పటికే బాగా ముదిరి, అతని శరీర భాగాలు అంతరిస్తున్నాయి. క్షయ వ్యాధి ముఖముపై వచ్చి, భయంకర ఆకారాన్నిచ్చి – విక్టోరియన్ ఇంగ్లండులో "ఏనుగు మనిషి" వలే, ముఖముపై ముసుగు వేసుకొని. కుష్టు రోగి శరీరము మందమై ఎర్రబడింది. ఇది నిజమైన కుష్టు రోగము, ఇప్పుడు హన్సెన్ రోగమని పిలువబడుతుంది. అది భయంకరము! (See The New Unger’s Bible Dictionary, ibid.).

డాక్టర్ వాల్టర్ ఎల్. విల్సన్ అన్నాడు ఈ రోగము పాపము మొక్క (పటము). ఇది నయం కానిది అపవిత్రము. బైబిలులో కుష్టు రోగి "శుద్ధిపర్చబడాలి." ఎందుకంటే ఆ రోగము అంటువ్యాధి కుష్టు రోగి ఒంటరిగా జీవించాలి. అతడు ఒక బట్ట నోటిపై చుట్టుకొని "అపవిత్రుణ్ణి! అపవిత్రుణ్ణి!" అని అరవాలి. అతడు పురము వెలుపల ఉండాలి.

మారని వ్యక్తి విషయములో ఇది వాస్తవము. అతడు సంఘ సభ్యుడు కానేరడు. పాప పురోగము వలన పరలోకములో ప్రవేశింపలేదు. (See Walter L. Wilson, M.D., A Dictionary of Bible Types, Hendrickson Publishers, 1999 reprint, p. 257). లేవియాకాండము 13:45, 46 చెప్తుంది,

"ఆ పొడగల కుష్టు రోగి, వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియ బోసికోనవలెను, వాడు తనపై పెదవిని కప్పుకొని, అపవిత్రుడను, అపవిత్రుడను, అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొద వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడైయుండును; వాడు అపవిత్రుడు: గనుక ప్రత్యేకముగానే నివసిమ్పవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను" (లేవీయకాండము 13:45, 46).

లేవీయకాండము 13:1 పై స్కోఫీల్డ్ గమనిక చెప్తుంది, "కుష్టురోగము పాపమును గూర్చి మాట్లాడుతుంది (1) రక్తములో; (2) అసహ్య మార్గాలలో బహిరంగామవుట; (3) మానవ ప్రయత్నములతో బాగు పడకపోవుట" (The Scofield Study Bible, Oxford University Press, 1917, p. 141; note on Leviticus 13:1).

కుష్టు రోగము, మానవుని పూర్తి దుర్మార్గతను, చెప్పే చిత్రము. దుర్మార్గత మన రక్తములో ఉంది, ఆదాము నుండి సంక్రమించింది. ప్రారంభములో చిన్నదిగా, తిరుగుబాటుతో ప్రారంభమై, చివరకు అది విసుగు వికర్షణగా తయారవుతుంది.

"ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది" (రోమా 8:7).

బైబిలు చెప్తుంది,

"నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించు వాడెవడును లేడు. దేవుని వేదకువాడెవడును లేడా, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి; మేలు చేయువాడా లేడు, ఒక్కడైనను, లేడా" (రోమా 3:11-12).

జాన్ వెస్లీ (1703-1791) కేల్వీనీయుడు కాదు, కాని ఈ పాఠ్య భాగమును గూర్చి అన్నాడు, మారనివారు "నిస్సహాయులు, నిస్సారులు, వారికి గాని ఇతరులకు గాని లాభదాయకులు కాదు...[అందరును] [పాపము] యొక్క నేరారోపణ శక్తి క్రింద ఉన్నారు," గమనిక రోమా 3:12, 9 (John Wesley, M.A., Explanatory Notes Upon the New Testament, volume II, Baker Book House, 1983 reprint, pp. 33, 34; notes on Romans 3:12, 9).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ (1899-1981) అన్నాడు, "పాపములో మానవుడు...పాపముచే నడిపింపబడి పరిపాలించబడి నియంత్రింప బడతాడు" (Martyn Lloyd-Jones, M.D., Assurance, Romans 5, The Banner of Truth Trust, 1971, p. 306).

డాక్టర్ ఐజాక్ వాట్స్ తన పాటలో యిలా అన్నాడు,

ప్రభూ, నేను అపవిత్రుడను, పాపములో గర్భము ధరించాను, అపవిత్రునిగా అపరిశుద్దునిగా జన్మించాను;
మానవ జాతిని కల్మషము చేసిన వాని నుండి వచ్చాను, అది పాల్పడకుండా చేస్తుంది.

ఇదిగో, నీ ముఖము ముందు వంగుతాను; నీ కృపయే నాకు ఆశ్రయదుర్గము;
బాహ్య విషయములు నన్ను పవిత్ర పర్చలేవు; కుష్టు రోగము నాలో లోతుగా ఉంది.
   (కీర్తన 51, ఐజాక్ వాట్స్ చే, డి.డి., 1674-1748).

పాపము మనసును చీకటి మయము చేస్తుంది. అది నిన్ను ఆలోచింప చేస్తుంది, "చాలా వదిలిపెట్టాలి. నేను నిజ క్రైస్తవుడనైతే, చాల విషయాలు వదిలేసికోవాలి." అలా, నీవు పాపపు బానిసత్వములో ఉంటావు, నిత్యత్వములో నిరీక్షణ లేకుండా ఉంటావు. లేక పాపమూ నిన్ను ఆలోచింప చేస్తుంది, "నేను ప్రతి ఆదివారము గుడికి వస్తున్నాను. నేను బాగానే ఉన్నాను." అలా నీవు పాపపు కుష్టు రోగములో ఉంటావు, ఎలాంటి నిరీక్షణ లేకుండా. లేక పాపము నిన్ను ఆలోచింపచేస్తుంది, "నేను రక్షింపబడ్డానని నిరూపించడానికి ఒక భావన నాకు కావాలి." కాని బైబిలు ఒక భావనతో రక్షింపబడతారని ఎప్పుడూ చెప్పలేదు. యేసు క్రీస్తును నమ్ముట ద్వారా మనం రక్షింపబడతాం. కొందరు నెలలు, సంవత్సరాలు భావన కొరకు చూస్తారు, యేసును నమ్మకుండా. అది పాపపు కుష్టు రోగముతో పాడు చేయబడిన హృదయము! అగస్టస్ టాప్ లేడీ తన పాటలో, ఇలా అన్నాడు,

ఆశ్చర్య పోయాను నలిగిపోయాను,
నాలో చూసుకున్నాను;
నా హృదయము పాప భారముతో అణగగొట్టబడింది,
ప్రతి పాపపు స్థితి.

దుష్టతలంపుల సమూహాలు,
అపవిత్రపు అనుబంధాలు!
అపనమ్మకం, అనుమానము, టక్కరి మోసము,
గర్వము, అసూయ, దిక్కుమాలిన భయము.
   ("హృదయము" అగస్టస్ టాప్ లేడీచే, 1740-1778).
      (“The Heart” by Augustus Toplady, 1740-1778).

మరల, డాక్టర్ వాప్స్ అన్నాడు,

"బాహ్య పరవిషయాములు నన్ను శుద్ధిచెయ్యలేవు;
కుష్ట రోగము నా అంతరంగములో ఉంది.”

"పాపి ప్రార్దన" చెప్పడం నీకు మంచి చెయ్యదు. ఒక యవనస్థుడు మాతో అన్నాడు, "నేను ప్రార్ధన చెప్పాను నేను బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు!" అలాంటిది నిన్ను రక్షింపనేరదు! ఇతరులు "ముందుకు వస్తారు" ఆరాధన అయ్యాక వారిని "సమర్పించుకోడానికి." అది కూడా మంచి చెయ్యదు. అవి అబద్ధపు తప్పుడు "బాహ్య విధానాలు."

"బాహ్య పరవిషయాములు నన్ను శుద్ధిచెయ్యలేవు;
కుష్ట రోగము నా అంతరంగములో ఉంది.”

అది మన పాఠ్య భాగములోని కుష్టు రోగి పేద స్థితి. అతడు కుష్టు రోగి. అతనికి తెలుసు అతడు చేసేదీ చెప్పేదీ అతనిని శుద్ధి చేయలేదని.

II. రెండవది, అతడు యేసునోద్ధకు వచ్చాడు.

"ఒక కుష్టు రోగి, ఆయన యొద్దకు వచ్చి, ఆయన యెదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్దునిగా చేయగలవని, ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనెను. (మార్కు 1:40).

ఆపేద కుష్టు రోగి నిస్సందేహంగా యేసును గూర్చి విన్నాడు. జాన్ వెస్లీ అన్నాడు బహుశా అతడు యేసు భోధ కూడా విని ఉంటాడు. వెస్లీ అన్నాడు, "బహుశా ఈ కుష్టు రోగి, ప్రజలతో [కలవలేనప్పటికినీ], మన ప్రభువు చెప్పేది దూరమునుండి విన్నాడు" (ఐబిఐడి.). వెస్లీ గారికి అది తెలిసే ఉంటుంది, వేలకొలది మంది దూరము నుండి ఆయన భోధ వినడానికి వచ్చేవారు – రక్షింపబడ్డారు! 1745 లో వెస్లీ గారికి వ్రాయబడిన ఉత్తరములో ఒక భాగము,

నీ సహొదరుడు [చార్లెస్] మరియు మీరు, చెప్పేది వినేవరకు నా గురించి నాకు తెలియదు. ఒక అవిశ్వాసిగా నన్ను నేను కనుగొన్నాను, క్రీస్తు తప్ప ఎవ్వరూ సహాయము చెయ్యలేరని గ్రహించాను. నేను ఆయనకు మొర పెట్టాను, ఆయన నా మొర విని శక్తితో నా హృదయములో ఈ మాటలు మాట్లాడాడు, "సమాధానముగా వెళ్ళుము, నీ పాపములు క్షమింపబడినవి." (John Wesley, M.A., The Works of John Wesley, volume I, Baker Book House, 1979 reprint, page 527).

అదే యేసు ఆ పేద కుష్టు రోగికి చేసాడు. అదే నీకు కూడా చేస్తాడు నీవు తగ్గించుకొని ఆయనను నమ్మితే, కుష్టు రోగికి చేసినట్టు.

III. మూడవది, అతడు శుద్దుడాయెను.

నేను కొన్ని మాటలు చెప్పాలి పెంతెకోస్తు పేరు గాంచిన "స్వస్థ పరచు" వారిని గూర్చి. శారీరక స్వస్థతకు ప్రాధాన్యతనిస్తే, సువార్త శక్తిని గూడత పూర్తిగా పోతుంది, మరియు పూర్తిగా వదిలి వేస్తుంది. మానవ శరీర స్వస్థతపై మనము దృష్టి సారించకూడదు. యేసు సిలువపై మరణించాడు పాప కుష్టు రోగము నుండి మనలను రక్షించడానికి, అంతే కాని చెవి నొప్పి గొంతి నొప్పిని స్వస్థ పరచడానికి కాదు! "స్వస్థపరచువారిని" గూర్చి డాక్టర్ ఎ. డబ్లు. టోజర్ (1897-1963) ఇలా అన్నాడు,

సిగ్గులేని ప్రదర్శనకు అది దారి తీసింది, క్రీస్తుపై కాకుండా అనుభవము పై ఆధారపడడం తరచూ సమర్ధత లేక పోవడం శరీర కార్యాలు ఆత్మ కార్యాలు మధ్య వ్యత్యాసము తెలుసుకోడానికి (A. W. Tozer, D.D., Keys to the Deeper Life, Zondervan Publishing House, n.d., pp. 41, 42).

అవును, నేను నమ్ముతాను దేవుడు మన శరీరాలను స్వస్థపరుస్తాడని. ఆయన చేయగలడని గట్టిగా నమ్ముతాను! కాని శరీర స్వస్థత పాప భూయిష్ట ఆత్మల స్వస్థతల మధ్య మనము ఎన్నుకోవలసి వచ్చినప్పుడు? నాకైతే, ఎన్నిక సులభము. మన శరీరాలు త్వరగా నశిస్తాయి. కాని మన ఆత్మలు నిరంతర నిత్యత్వములో జీవిస్తాయి. ఏది అతి ప్రాముఖ్యమో చూడడం సులభము!

ఈ చిన్న స్వస్థ పరచబడిన కుష్టు రోగి కథలో మనం శారీరకమే కాదు, ఆత్మీయ స్వస్థత కూడా చూస్తాము. మనం తప్పకుండా క్రీస్తు ప్రభోదాన్ని చూడగలం,

"ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, తన ప్రాణమును పోగొట్టుకొనుట [శరీర స్వస్థత], వానికేమి ప్రయోజనము?" (మార్కు 8:36).

కాదు, ఇతనికి తెలుసు లోతైన విషయానికి కుష్టు రోగము ఒక సూచన అని. అతడు యేసును స్వస్థపరచమని అడగలేదు. అతడు అన్నాడు, "ప్రభువా, నీకిష్టమైతే, నను శుద్దునిగా చేయగలవు అనెను." అతడు "నశించే మాంసమును గూర్చి" మాత్రమే అడగలేదు. "కుష్టు రోగాము లోతులో పాతుకు పోయింది." అందుకే యేసు త్వరగా ఆశ్చ్యర్య రీతిగా అతన్ని రక్షించాడు.

"నీకిష్టమైతే, నన్ను శుద్దినిగా చేయగలవు" (మార్కు 1:40).

"యేసు, కనికరపడి, చెయ్యి చాపి, వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్దుడవు కమ్మని; వానితో చెప్పెను" (మార్కు 1:41).

వెంటనే "వాడు శుద్దుడా యెను" (మార్కు 1:42).

అది సువార్త శక్తిని చూపిస్తుంది. యేసు సిలువపై తన రక్తాన్ని కార్చాడు నీ పాపాలన్నింటినీ కడిగి వేయడానికి. నీకు నూతన జీవితము ఇవ్వడానికి యేసు మృతులలో నుండి లేచాడు. నీవు సామాన్య విశ్వాసముతో యేసు నోద్ధకు వచ్చినప్పుడు, ఈ వ్యక్తి వలే, యేసు నిన్ను "వెంటనే," రక్షిస్తాడు తక్షణమే! నామట్టుకైతే ,అది బైబిలులో గొప్ప వర్తమానము! "నీకిష్టమైతే, నన్ను శుద్దునిగా చేయగలవు." "నాకిష్టమే; నీవు శుద్దుడవు కమ్ము" – అతడు కడుగబడ్డాడు! అది సువార్త! అది రక్షణను గూర్చిన మంచి వార్త! అది నీ ఒకే ఒక నిరీక్షణ! "యేసు, నీకిష్టమైతే, నన్ను శుద్దునిగా చేయగలవు." "నా కిష్టమే; నీవు శుద్దుడవు కమ్ము." యేసు నోద్ధకు రమ్ము. ఆయనను నమ్ము. యేసును నమ్ముట సులభం. ఒక క్షణంలో నిన్ను శుద్ధుని చేస్తాడు! – అతనికి చేసినట్లే! ఇంకా కనిపెట్టవలసిన అవసరము లేదు! యేసును నమ్మి శుద్ధి పొందు! తండ్రీ, ఈ ఉదయ కాలాన్ని కొందరు యేసును నమ్మాలని ప్రార్ధిస్తున్నాను, ఆయన రక్తముచే వారు శుద్ధులు కావాలి! ఆమెన్.

నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
   యేసు’ రక్తము భయంకర పాపిని శుద్ధి చేస్తుంది,
నాకు తెలుసు, అవును నాకు తెలుసు,
   యేసు’ రక్తము భయంకర పాపిని శుద్ధి చేస్తుంది.
("అవును, నాకు తెలుసు!" అన్నా డబ్ల్యు. వాటర్ మాన్ చే, 1920).
(“Yes, I Know!” by Anna W. Waterman, 1920).

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: మార్కు 1:40-42.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"అవును, నాకు తెలుసు!" (అన్నా డబ్ల్యూ. వాటర్ మాన్ చే, 1920).
“Yes, I Know!” (by Anna W. Waterman, 1920).


ద అవుట్ లైన్ ఆఫ్

నా కిష్టమే – నీవు శుద్దుడవు కమ్ము

I WILL – BE THOU CLEAN!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"ఒక కుష్టు రోగి, ఆయన యొద్దకు వచ్చి, ఆయన యెదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్దునిగా చేయగలవని, ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనెను. యేసు, కనికరపడి, చెయ్యి చాపి, వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్దుడవు; కమ్మని వానితో చెప్పెను. వెంటనే, వాని కుష్టురోగము విడిచెను, గనుక వాడు శుద్దుడాయెను" (మార్కు 1:40-42).

(I పేతురు 5:13)

I.   మొదటిది, అతడు కుష్టు రోగి, లేవియాకాండము 13:45, 46; రోమా 8:7; 3:11-12.

II.  రెండవది, అతడు యేసునోద్ధకు వచ్చాడు, మార్కు 1:40.

III. మూడవది, అతడు శుద్దుడాయెను, మార్కు 8:36; 1:40, 41, 42.