Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సాతానీయ అంధత్వము

SATANIC BLINDING
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, ఫిబ్రవరి 22, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, February 22, 2015

"మా సువార్త మరుగు చేయబడిన యెడల, నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడియున్నది: దేవుని స్వరూపియై యున్న క్రీస్తు మహిమను కనుపరచు, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధియైన దేవత అవిశ్వసులైన వారి, మనో నేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను" (II కొరిందీయులకు 4:3, 4).


నేను ఈ ఉదయము సాతాను గూర్చి మాట్లాడబోతున్నాను. నేను బోధించిన ప్రసంగాలలో ఇది అతి కష్టతరమైనది. ఈ రోజు బోధించడం కచ్చితంగా సాతానుకు ఇష్టము లేము. డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ పుస్తకము నా దగ్గర ఉంది అది మూలముగా వాడబోతున్నాను. సాతాను దెయ్యలపై అతని ప్రసంగము చదివాను, అందులో కొంత ఉపోద్ఘాతముగా నా ప్రసంగములో వాడాలనుకుంటున్నాను. నా బల్లపై ఆ పుస్తకము ఉంది. ప్రసంగానికి సిద్ధపడే సమయానికి అది నాకు దొరకలేదు! అదృశ్యమై యిందనిపించింది! నా ధ్యానములో అది ఉండాలి, కాని దాని గూర్చి మూడు గంటలు వెదికినా, దొరకలేదు. సాతాను తప్పక ఏదో చేసి ఉంటుంది.

అప్పుడు హేనా ఇంటి కొచ్చారు. నేను ఆగి దొరికేలా దేవునికి ప్రార్ధించాను. నా బల్ల చుట్టూ పడి ఉన్న పుస్తకాలన్నీ హేనా వెదికారు. ఆమె అలా చేస్తుండగా ఇంకొక సారి చూడాలనుకున్నాను. అప్పటికే మూడుసార్లు వెదికాను, మళ్ళీ ప్రయత్నించాను. దొరికింది! నా హృదయం ఆనందముతో గంతులేసింది! దేవుడు నా ప్రార్ధనకు జవాబు ఇచ్చి పుస్తకము ఎక్కడుందో చూపించాడు!

కొందరు చిన్న విషయము అనుకోవచ్చు – పుస్తకము వెదకడం. కాని తరచుగా "చిన్న విషయాలలో" జాగ్రత్తగా క్షుణ్ణంగా ఉండే సాతానును చూస్తాము. "సాతాను" హేబ్రీలో అతని పేరు. "సావతాన్" – దాని అర్ధము "వ్యతిరేకి," దాని అర్ధము "విరుద్ధత," "శత్రువు," మరియు "ఎదిరించువాడు." "సాతాను" ఇంకొక హెబ్రీ పదము నుండి వచ్చింది "దాడి." సాతాను దేవునికి శత్రువు. అతడు దేవుని వ్యతిరేకించాడు. దేవుని పనిని దాడి చేసాడు. అతడు చాల శక్తివంతుడు. డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ టెక్సాస్ లో, డల్లాస్ మొదటి బాప్టిస్టు సంఘానికి అరవై సంవత్సరాలుగా కాపరి. అతనికి బైబిలు గ్రీకులో వేదాంతములో పిహెచ్.డి. ఉంది. బైబిలు కచ్చితత్వంలో అతడు నాయకుడు. అతడు గొప్ప దక్షిణ బాప్టిస్టు బోధకుడు, ఇరవై శతాబ్దపు గొప్ప బోధకుడు. డాక్టర్ క్రీస్ వెల్ ఇలా అన్నాడు,

     సాతాను మన విద్యా సమాజంలో నిలవబడి తెలివిగా ఉపన్యాసాలు ఇస్తాడు. విద్యా విధానంలో అతడు అధ్యక్షత వహించి, దేవుడు వదిలి పెట్టబడేటట్టు చూస్తాడు. సాతాను ఈలోకానికి దేవుడు.
     సాతాను మతాన్ని ప్రేమిస్తాడు...ప్రాచీన ప్రపంచపు పూర్తి కథ చెప్పబడింది బబులోను, ఐగుప్తీయుల, గ్రీకు రోమా దేవుళ్ళ వివరణతో. భారతదేశములో ఇప్పుడు 335 మిలియన్ వేరు వేరు దేవుళ్ళు ఆరాధింప బడుతున్నారు. సాతానుకి అది ఇష్టము. నీకిష్టమొచ్చినన్ని దేవుళ్ళను ఆరాధించాలి, నిజమైన దేవుని వదిలిపెట్టాలి. [సాతాను] ప్రపంచ మతాలను ప్రేమిస్తాడు. బుద్ధుని షింటోను ఆరాదించే మిలియను మిలియనుల మందిని అతడు ప్రేమిస్తాడు. అతడు హిందూ దేవుళ్ళను ప్రేమిస్తాడు, ముస్లీములు అల్లాను ఆరాధించడం అతనికి ఇష్టం. లక్షలాది మంది ఈ దేవుళ్ళను ఆరాధించడం, దానితో అతడు సంతోష పడతాడు. నిజ దేవుని వదిలి పెట్టేస్తారు...
      [సాతాను] వెలుగు యూద, అతడు మోసపరిచే గమ్యాన్ని వారికి జాగ్రతగా కనుమరుగు చేస్తాడు... విశిష్ట వ్యక్తిని ప్రవేశపెడతాడు. వాని చూడండి. అతడు సమర్ధుడైన కార్యకర్త, మంచి వస్త్రధారణతో, సంస్థలో సమాజంలో అతనికి ఉన్నత స్థలము ఉంది. యితడు విశిష్ట వ్యక్తి [మధ్యము] గ్లాసుతో చేతిలో. కాని [సాతాను] మరుగు చేస్తాడు తాగుడు వాంత రోత విడిపోయిన కుటుంబాలలోని విచారము మరియు అనాధ పిల్లల స్థితి. అతడు తెలివైనవాడు! [అతడు ఈలోకమునకు దేవుడు.].
     అతడు బ్రాడ్ వే అందచందాలను హాలివుడ్ లాస్ వేగాస్ ఆకర్షిత అశ్లీల చిత్రాలను ఘన పరుస్తాడు. కాని అతడు సిఫిలిస్ ఘనేరియా హెర్ప్స్ అను సుఖ వ్యాదులను ఎయిడ్స్ ను విరిగే హృదయాలను కన్నీళ్లను నిస్పృహను కప్పి పుచ్చుతాడు. అది సాతాను [ఈలోకపు దేవుడు]...
     ...అతడు నిజ జీవించు దేవుని సంఘాన్ని రక్షకుడు ప్రభువైన, క్రీస్తును నకిలీగా చూపిస్తాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు..."దైవ భక్తీ కలిగి యుండియు, దాని శక్తిని ఆశ్రయింపక" (II తిమోతి 3:5)...నకిలిగా చెప్పబడ్డ సంఘమునకు సాతాను శత్రువుల లోతైన విషయాలు దేవుని లోతైన విషయాలు తెలుసు. సాతాను దాని ప్రేమిస్తాడు. అతడు విమోచాకుడు లేని మతాన్ని ప్రేమిస్తాడు... నశించు వారికి చెప్పవద్దు. రక్షింపబడనివారిని మార్చప్రయత్నించవద్దు. అందంగా, చక్కగా, వివేకమైనదిగా చెయ్యాలి, కాని రక్షించు విమోచాకుని [క్రీస్తు]ను విడిచిపెట్టాలి. అది సాతాను. [అతడు లోకదేవుడు].
     వివేకుడై, వెలుగు దూతగా, జాగ్రత్తగా [సాతాను] తానూ మోసపరచు వారి పర్యవసానాలు దాచి పెడతాడు (W. A. Criswell, Ph.D., “The Fall of Lucifer,” Great Doctrines of the Bible – Angelology, volume 7, Zondervan Publishing House, 1987, pp. 93-95).

క్రీస్తు లేని పతన బ్రతుకును అతడు కప్పి పెడతాడు. వెలితి తనము విచారమును అతడు దాచేస్తాడు. అతడు క్రీస్తులేని చావును నిస్పృహ సమాధిని దాచేస్తాడు. అతడు ఆఖరి తీర్పును రక్షింపబడని మృతులను కప్పి పుచ్చుతాడు. అతడు అగ్నిలో ఆత్మల నిత్యత్వ హింసను అగ్ని గుండములో ఉండే నిరంతర ఆవేదనను దాచేస్తాడు! అతడు సాతాను. అతడు ఈ లోకపు దేవుడు!

ఇది సాతాను, అపోస్తాలుడు, ఇలా అంటున్నాడు,

"మా సువార్త మరుగు చేయబడిన యెడల, నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడియున్నది: దేవుని స్వరూపియై యున్న క్రీస్తు మహిమను కనుపరచు, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధియైన దేవత అవిశ్వసులైన వారి, మనో నేత్రములకు గుడ్డితనము కలుగచేసెను" (II కొరిందీయులకు 4:3, 4).

I. మొదటిది, నశించుచున్న వారికి ఏది మరుగు చేయబడింది.

ఎందుకు, సువార్త, "క్రీస్తు మహిమాయుక్త సువార్త." అది మీలో నశించుచున్న వారికి మరుగు చేయబడింది. క్రీస్తు సువార్త సులభంగా నేర్చుకోవచ్చు. ఐదు నిమిషాలలోపే సువార్త ప్రాధమిక వాస్తవాలు నేర్చుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు సువార్తను రెండు చిన్న వచన భాగాలలో ఇచ్చాడు. అతడు అన్నాడు,

"లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను; సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను" (I కొరిందీయులకు 15:3,4).

అది ఒక వాక్యములోని భాగము. ఒక వాక్యము సువార్తను వివరిస్తుంది!

మొదటిది, "క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను." క్రీస్తు మన పాపాల నిమిత్తము చనిపోయాడు, వేరే వ్యక్తి కాదు. క్రీస్తు యేసు, పరలోకము నుండి దేవునిచే పంపబడినవాడు. క్రీస్తు, కన్య మరియ గర్భములో జన్మించాడు. క్రీస్తు, పాప రహితునిగా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు. క్రీస్తును, గూర్చి రోమా గవర్నరు పిలాతు ఇలా అన్నాడు, "ఇతనిలో నేను ఏ దోషమును చూడలేదు" (యోహాను 18:38). దోషమే లేదు! ఎంత సత్యము. ఆయన శత్రువులు కూడా ఆయనలో లోపముగాని పాపముగాని చూడలేదు. వారు ఆయనను గూర్చి అబద్ధము చెప్పారు, ఆయన దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాలలో కడతారని, ఆయన అలా అనేలేదు! అది అబద్ధము! ఆయనను చంపడానికి ఒక కారణానికి వారు అబద్ధము చెప్పారు. యేసు క్రీస్తు, ఎన్నడు అబద్ధము ఆడలేదు, ప్రజలకు సాయం చెయ్యడం తప్ప ఏమి చెయ్యలేదు. ఆయన పరిపూర్ణ, పాప రహిత దైవ కుమారుడు.

రెండవది, "క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను." క్రీస్తు మన స్థానంలో సిలువపై మరణించి, మన పాపాలకు ప్రాయశ్చిత్తము చెల్లించాడు. అపోస్తలుడైన పేతురు అన్నాడు,

"అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను" (I పేతురు 3:18).

క్రీస్తును గూర్చి ప్రవక్త యెషయా అన్నాడు,

"మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచ బడెను" (యెషయా 53:5).

"యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను" (యెషయా 53:6).

ఈ క్రీస్తు, మనకు ప్రతిగా. ఆయన మన స్థానంలో చనిపోయాడు – దేవుని దృష్టిలో మన పాపాల నిమిత్తము చెల్లించడానికి.

మూడవది, "ఆయన సమాధి చెయ్యబడి, మరియు...మూడవ దినమున తిరిగి లేచెను." ఆయన నిజంగా సిలువపై మరణించాడు. ఆయన మృత దేహము సమాధిలో ఉంచబడింది. ఆ సమాధిని మూసి ఆయన దేహాన్ని అక్కడ ఉంచాడు. కాని మూడవ రోజున ఆయన మృతులలో నుండి లేచాడు. ఆయన మృతులలో నుండి శరీరంతో లేచాడు – మనకు జీవము నివ్వడానికి,

"తన్ను ఎందరు అంగీకరించుతారో, వారు నశింపక నిత్య జీవము పొందునట్లు" (యోహాను 3:15).

అది సువార్త! అది ఎంతో సులభము!

"మనమింకను పాపులమై యుండగానే, క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి, ఆయన రక్తమున మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మరింత నిశ్చయంగా...ఆయన ద్వారా, ఉగ్రత నుండి, రక్షింపబడుదుము" (రోమా 5:8-10).

అది సువార్త. ఒక పసివాడు ఐదు నిమిషాలలో ఈ సత్యములు నేర్చుకోగలడు! రెండు మూడు సార్లు ఇప్పటికే ఈ గుడికి వస్తే సత్యాలు ఇప్పటికే మీకు తెలుసు. మీరు ఇప్పటికే సువార్త సత్యాలు నేర్చుకున్నారు. అయిననూ...అయిననూ...అయిననూ, మీరు రక్షింపబడలేదు. మీకు సువార్త తెలుసు, అయిననూ రక్షింపబడలేదు. "మన సువార్త మరుగు చేయబడిందంటే, నశించు వారి నిమిత్తము అది మరుగు చేయబడింది" (II కొరిందీయులకు 4:3).

II. రెండవది, నశించుచున్న వారికి ఎందుకు సువార్త మరుగు చేయబడుచున్నది.

జవాబు మన పాఠ్యభాగములో ఉంది, "ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గుడ్డి తనము కలుగచేసేను" (II కొరిందీయులకు 4:4). సాతాను "ఈలోక దేవత"గా పిలువబడుతుంది. యోహాను 12:31 లో సాతాను "ఈలోకాధికారి" అని పిలువబడుతుంది. I యోహాను 5:19 లో చెప్పబడింది,

"లోకమంతయు దుష్టుని యందున్నది" (I యోహాను 5:19).

స్కోఫీల్డ్ సెంటర్ నోట్ దానిని ఇలా అనువదిస్తుంది,

"లోకమంతయు దుష్టుని చేతిలో ఉన్నది"

ఎన్ఏఎస్ వి (NASV) ఇలా అంటుంది,

"లోకమంతయు దుష్టుని శక్తిలో ఇమిడి ఉన్నది."

ఈ వచనము తేటగా చెప్తుంది ప్రపంచ విధానము (దకాస్మోస్) దాని దేవుడు లేని నాయకులతో, అబద్దపు మతముతో, దుష్టులతో, తికమక అభిప్రాయాలతో, సాతానుచే నియంత్రింపబడుతుంది. అభిప్రాయాలు, తలంపులు, గురి అనేకుల ఉద్దేశాలు ఈ యుగపు లోకాత్మచే అదుపు చేయబడుతున్నాయి. ఎల్లికాట్ దానిని అన్నాడు, "అసహ్యించుకొనే ఆత్మ అబద్దపు స్వార్ధము [అవి] వాస్తవంగా దెయ్యాన్ని తిడతాయి" (Ellicott’s Commentary on the Whole Bible, volume VII, Zondervan, n.d., p. 375; note on II Corinthians 4:4).

ఎలికాట్ అన్నాడు "ఈలోకపు దేవుడు దేవుని [పనికి] వ్యతిరేకి" (ఐబిఐడి.). అది "సాతాను" పదానికి అర్ధము – విరుద్ధము, శత్రుత్వము, శత్రువు, వ్యతిరేకించువాడు.

మీరు గ్రహించకపోవచ్చు, కాని మారనివాడు దేవుని వ్యతిరేకిస్తాడు. ప్రతి ఒక్కడు! మినహాయింపు లేదు! టెలిఫోను సువార్త పని చేసే వారికి ఈ అనుభవము ఉంటుంది. వారు కనుగొనరు గుడికొచ్చిన వారు సంఘర్షణ లేకుండా రక్షింపబడరు – తరుచు టైటానిక్, గొప్ప సంఘర్షణ! వచ్చే వారికి అది సంభవిస్తుంది! పోరాటంలో వస్తారు. చాలామంది అసలు రారు! అది తెల్ల అమెరికన్ల విషయంలో ప్రత్యేకంగా వాస్తవం – కాని, ఏదో విధంగా, అన్ని గుంపుల విషయంలో అది వాస్తవము. "మంచి" చైనీయ తల్లి అంటుంది, "అలాగే, ఆమె వస్తుంది. కాని బాప్తిస్మమివ్వవద్దు!" తరుచు అలా అంటారు వారి హృదయాలలో వారు దేవునికి వ్యతిరేకులని మీరు గ్రహిస్తారు. వారి తలంపులు ఈ లోకపు దేవతచే నియంత్రింప బడతాయి, ఎల్లికాట్ చెప్పినట్లు, "అబద్ధపు స్వార్ధపు ఆత్మ" (ఐబిఐడి.).

ఏప్రిల్ 1975 లో, ఈ సంఘాన్ని ప్రారంభించాను – నలభై ఏళ్ళ గొప్ప పోరాటము, నిరంతర, వేదనతో కూడిన సంఘర్షణ లోకత్మతో ఉండినవి, వారి హృదయాలు సాతాను అదుపులో ఉండేవి, దేవునికి ఆయన ప్రజలకు వ్యతిరేకంగా. ఎఫెస్సీయులకు 2:2 లో సాతాను, "వాయు మండల సంబంధమైన అధిపతి, అవిదేయులైన పిల్లల మధ్య పనిచేస్తుంది." అది సాతాను! అది ఈలోకపు దేవత! అది నిజ దేవునికి శత్రువు! ప్రతి మానవ హృదయంలో పనిచేస్తుంది నిజ క్రైస్తవులు కాకుండా. ఇది నా అభిప్రాయము మాత్రమే కాదు. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్, బ్రిటిష్ బోధకుడు, ఇరవై శతాబ్దపు గొప్ప బోధకుడు ఏమన్నాడో వినండి. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు,

దెయ్యము మనలను తికమక పెట్టడానికి అనుపెడుతుంది. దేవుని పనిని నాశనము చెయ్యాలని కోరుతుంది... చాల విధాలుగా, తన ఆలోచనా విధానాన్ని ప్రవేశపెడుతుంది (Martyn Lloyd-Jones, M.D., Spiritual Blessing, Kingsway Publications, 1999, p. 158).

ఇంకొక దగ్గర డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ దెయ్యాన్ని గూర్చి ఇలా అన్నాడు, "అతని తాపత్రయం స్త్రీ పురుషులను దేవుని నుండి వేరు చెయ్యాలని." "[సాతాను] దేవునికి గొప్ప వ్యతిరేకి: అతడు పూర్తిగా దేవుని అసహ్యించు కుంటాడు" (Authentic Christianity, volume 4, The Banner of Truth Trust, 1966, p. 42). సాతాను – నీ మనసుకు గుడ్డి తనము కలుగ చేసి నీ నుండి సువార్తను మరుగు చేస్తాడు.

III. మూడవది, నశించు వారికీ ఎలా సువార్త మరుగు చేయబడుతుంది.

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "తికమక పెట్టడానికి దెయ్యము కనిపెడుతూ ఉంటుంది." సువార్త మహిమాయుక్తము, ఆశ్చర్యము, మనకు స్వేచ్చ నిరీక్షణ ఇస్తుంది. దెయ్యమునకు నీవు అవి పొందుకోవడం ఇష్టం లేదు! మన పాఠ్యభాగము చెప్తుంది "అవిశ్వసులైన వారికి క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా, అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు...గుడ్డి తనము కలుగచేసెను." సాతాను "మనలను తికమక పెట్టడానికి కనిపెడుతూ ఉంటాడు." సాతాను ప్రజలను ఎలా తికమక పెడతాడో కొన్ని విధానాలు మీకు చెప్తాను, వాడు యేసును నమ్మకుండా చేస్తాడు. చాల మార్గాలు చెప్పనక్కరలేదు, దెయ్యము చాల మార్గాలు ఉపయోగించదు. అవసరము లేదు ఎందుకంటే వాడికి తెలుసు ఎలా నిన్ను కొన్ని పన్నాగాలతో పట్టుకోవాలో. వాడి పన్నాగాలలో మూడు ముఖ్యము, నీవు రక్షింపబడకుండా వాడతాడు.

1. దెయ్యము నీ మనసులో చొచ్చుకొని ఆలోచింప చేస్తుంది, "చాల వదిలిపెట్టాలి. గుడికి రావచ్చు, నిజ క్రైస్తవుడవయితే, చాల విషయాలు నేను ఒదిలి పెట్టాలి." ఒక ప్రశ్నతో ఆ సాతాను తలంపుకు యేసు జవాబిచ్చాడు. యేసు తరుచు ప్రశ్నలడుగుతూ సమాధానమిచ్చేవాడు. దెయ్యము నీతో చెప్పితే "చాల వదిలిపెట్టాలి," యేసు అన్నాడు, "తన ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలడు?" "ఒకడు సర్వ లోకమును సంపాదించుకొని, తన ప్రాణాలను పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము?" (మార్కు 8:36, 37). లోకమిచ్చేదంతా పొందుకొని నీ ప్రాణమును పోగొట్టుకుంటే, నిత్య నరకాగ్నికి ఆహుతి అవుతావు, సంతోషము లేకుండా, ఆనందము లేకుండా, నిరీక్షణ లేకుండా – నిత్యత్వమంతటిలో నిరీక్షణ లేకుండా.

2. దెయ్యము నీ మనసులో చొచ్చి ఇలా ఆలోచింప చేస్తుంది, "నేను ప్రతి ఆదివారము గుడికి వస్తున్నాను. ప్రతి ఆరాధనలో ఉంటున్నాను. నేను బాగానే ఉన్నాను." స్పర్జన్ అన్నాడు, "వారు క్రీస్తు మాట వినరు, ‘నన్ను నమ్మువారు నశింపరు,’ ఎలాంటి గుణశీలత కలిగియున్న. లేదు; వారు కొనసాగుతారు...తేలిక పాటి ఆనంద హృదయంతో నాశనానికి. తప్పకుండా వీరు సాతానుచే గుడ్డి వారు అయ్యారు."

3. దెయ్యము నీ మనసులో చొచ్చి నిన్ను ఆలోచింప చేస్తుంది, "నాకు ఒక భావన తప్పక ఉండాలి. కాపరి భావన ఉండకూడదని చెప్తున్నారని తెలుసు. నాకు భావన లేకపోతే విచారణ గదిలో డాక్టర్ కాగన్ గారికి చెప్పడానికేమీ ఉండదు. డాక్టర్ కాగన్ చెప్తారు, ‘దాని గూర్చి నాతో చెప్పు.’ భావన లేకపోతే ఆయనతో చెప్పడానికి ఏమి ఉండదు." డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ పాత బ్రిటిష్ బోధకుడు చెప్పింది వినండి. ఆయన అన్నాడు, "రక్షణ తరువాత విచారించేటప్పుడు, కొత్త నిబంధన ఎప్పుడు చెప్పలేదు, ‘అనుభూతి పొందిన వారు రక్షింపబడదు,’ కాని ‘నమ్మిన వారు మాత్రమే,’ ...కనుక [చాలు] నీవెలా చెప్తే, ‘నేను దీనితో జీవిస్తాను; నాకు అనుభూతి ఉన్న లేకున్నా; అనుభూతి ద్వారా కాదు నమ్ముట ద్వారా రక్షింపబడతాం’" యేసు నందు (Life in God, Crossway Books, 1995, p. 105).


నాకు తెలుసు నేను చెప్పినదంతా మీకు సహాయపడదు దేవుడు మీకు సహాయ పడకపోతే మీరు గ్రహించలేరు మీరు స్వంతంగా సాతాను నుండి విడుదల పొందలేరని. నీకు క్రీస్తును ఎన్నిక చేసుకోలేవని గమనించాలి. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఈ ‘లోకపు దేవత’ [నీకు] అసాధ్యము చేస్తుంది." (Assurance, Banner of Truth, 1971, p. 310). నీవు నీతోను, దేవునితో, నిజంగా యదార్ధంగా ఉంటే, నీ హృదయము కేక పెడుతుంది "నేను నశించాను! ఓ, యేసు నన్ను రక్షించు." అలాంటి క్షణములో, యేసు నీ దగ్గరకు వచ్చి, నిన్ను ఆయన రక్షిస్తాడు.

కొన్ని రోజుల క్రితం మార్కు సువార్తలో మనం చదివి కుష్టు రోగికి ఎంత సామాన్య మైనదో వినండి. అతడు యేసు నొద్దకు వచ్చి, మోకాళ్ళు నాడు. అతడు యేసుతో అన్నాడు, "నీ చిత్తమైతే, నీవు నన్ను శుద్ధి చేయగలవు."

"యేసు, ఆయన కనికరపడి, చెయ్యి చూపి... వానిని [అన్నాడు] ముట్టి, నాకిష్టమే; నీవు శుద్దుడవు కమ్మని... వానితో చెప్పెను" (మార్కు 1:41, 42).

ఓ, ఎవరో ఈ ఉదయాన అలా యేసు నొద్దకు వస్తారు. "నీ చిత్తమైతే, నీవు నన్ను శుద్దునిగా చేయగలవు." "నాకిష్టమే; శుద్దుడవు కమ్ము" – అతడు శుద్దుడాయెను. అది సువార్త! అది రక్షణను గూర్చిన మంచి సువార్త! అది నీ ఏకైక నిరీక్షణ! దెయ్యానికి వాని అబద్ధాలకు దూరముగా ఉండు! "యేసు, నీ కిష్టమైతే, నన్ను శుద్దునిగా చేయగలవు." "నాకిష్టమే; శుద్దుడవు కమ్ము." స్పర్జన్ ఈ చిన్న గీతికలోని మాటలను నమ్మిగలిగితే, వెంటనే యేసుచే రక్షింపబడతావు.

దోషారోపణ, బలహీన, నిస్సహాయ పురుగును,
క్రీస్తు వయా హస్తాలపై పడుతున్నాను;
ఆయన నా శక్తి మరియు నీటి,
నా యేసు, నా సమస్తము.

వెళ్తూ క్రీస్తులో ఆనందించండి! పరలోకపు తండ్రి, ఈ ఉదయాన ఎవరైనా యేసు హస్తాలలోనికి వచ్చి రక్షింపబడాలని నా ప్రార్ధన. ఆమెన్.

అవును నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
యేసు రక్తము ఘోర పాపిని శుద్దునిగా చేస్తుంది,
అవును నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
యేసు రక్తము ఘోర పాపిని శుద్దునిగా చేస్తుంది.
("అవును, నాకు తెలుసు!" అన్నా డబ్ల్యూ. వాటర్ మాన్ చే, 1920).

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: II కొరిందీయులకు 4:3-6.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"అవును, నాకు తెలుసు!" (అన్నా డబ్ల్యూ. వాటర్ మాన్ చే, 1920).
“Yes, I Know!” (by Anna W. Waterman, 1920).


ద అవుట్ లైన్ ఆఫ్

సాతానీయ అంధత్వము

SATANIC BLINDING

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మా సువార్త మరుగు చేయబడిన యెడల, నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడియున్నది: దేవుని స్వరూపియై యున్న క్రీస్తు మహిమను కనుపరచు, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధియైన దేవత అవిశ్వసులైన వారి, మనో నేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను" (II కొరిందీయులకు 4:3, 4).

(II తిమోతి 3:5)

I.    మొదటిది, నశించుచున్న వారికి ఏది మరుగు చేయబడింది, I కొరిందీయులకు 15:3, 4;
యోహాను 18:38; I పేతరు 3:18; యెషయా 53:5, 6; యోహాను 3:15; రోమా 5:8-10.

II.   రెండవది, నశించుచున్న వారికి ఎందుకు సువార్త మరుగు చేయబడుచున్నది, యోహాను 12:31;
I యోహాను 5:19; ఎఫెస్సీయులకు 2:2.

III.  మూడవది, నశించు వారికీ ఎలా సువార్త మరుగు చేయబడుతుంది, మార్కు 8:36, 37;
మార్కు 1:41, 42.