ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఉజ్జీవమును గూర్చి ఆరు ఆధునిక పొరపాట్లు (ఉజ్జీవముపై 15వ ప్రసంగము) డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు |
ఈ రాత్రి నా విషయం "ఉజ్జీవమును గూర్చి ఆరు ఆధినిక పొరపాట్లు." మొదట 1961 లో ఉజ్జీవంపై నాకు ఆసక్తి కలిగింది. నేను చిన్న పుస్తకం బయోలా పుస్తకశాల నుండి కొన్నాను మొదటి గొప్ప మేల్కొలుపును గూర్చి. దానిలో జాన్ వెస్లీ పత్రికలోని ప్రతులున్నాయి, మూడీ ప్రెస్ చే ముద్రింపబడింది. నేను ఉజ్జీవమును గూర్చి, గత యాబై మూడు సంవత్సరాలుగా ఆలోచిస్తూ, ప్రార్ధిస్తూ ఉన్నాను. బాప్టిస్టు సంఘాలలో రెండు అసాధారణ ఉజ్జీవాలు అనుభవించడం నా ఆధిక్యత. ఇవి సువార్తిక కూటాలు, లేక "ఆకర్షిత" కూటాలు కావు. క్రైస్తవ చరిత్ర గూర్చి పుస్తకాలలో మన చదివే ఉజ్జీవాలలాంటివి. "యేసు ఉద్యమము" లో 1960, ఆరంభపు 1970 లో దేవునిచే పంపబడిన ఉజీవాలు కూడా చూసాడు. ఈ విషయముపై యాభై మూడేళ్ళు చదవడం ఆలోచించడం ఉన్నప్పటికిని, ఉజ్జీవముపై అధికారం ఉందని నేననుకోవడం లేదు. ఉజ్జీవాన్ని గూర్చి కొన్ని ప్రాముఖ్య సత్యాలు అర్ధం చేసుకోవడం మొదలు పెట్టాను. గతంలో ఉజ్జీవం విషయంలో పొరపాట్లు చేసాను. చాల సంవత్సరాలు చార్లెస్ జి. ఫెన్నీ వ్రాతల ద్వారా నడిపించబడ్డాను. ఇప్పటికి ఆ విషయం పూర్తిగా అర్ధం చేసుకున్నాను అనుకోవడం లేదు, "ఇప్పుడు అద్దములో చూచినట్టు, సూచనగా చూచుచున్నాము" (I కొరిందీయులకు 13:12). ఈ రాత్రి ఉజ్జీవాన్ని గూర్చి ఆరు పొరపాట్లు ఇస్తాను, వాటిని నేను తిరస్కరిస్తాను. నా నిరీక్షణ ఈ విషయాలు మీకు సహాయ పడతాయని, మన సంఘానికి ఉజ్జీవము పంపమని మీరు దేవునికి ప్రార్ధిస్తూ ఉండగా. I. మొదటిది, ఈనాడు ఉజ్జీవము ఉండదనే పొరపాటు. నేను ఎక్కువ సమయం తీసుకొను, కాని చెప్తున్నాను ఎందుకంటే చాల మంది అది నమ్ముతారు. వారంటారు, "గొప్ప ఉజ్జీవ దినాలు అయిపోయాయి. మనం అంత్య దినాలలో ఉన్నాం. ఇక ఉజ్జీవము ఉండదు." ఇవి ఎక్కువగా ఉండే తలంపులు ఈనాడు బైబిలు-నమ్మీ క్రైస్తవుల మధ్య. కాని మూడు కారణాలను బట్టి అది పొరపాటని నేను నమ్ముతాను: (1) బైబిలు చెప్తుంది, "ఈ వాగ్ధానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచినా వారికందరికిని" (అపోస్తలుల కార్యములు 2:39). అపోస్తలుడైన పేతురు ఆ మాటలన్నాడు పెంతేకొస్తు గొప్ప ఉజ్జీవమును గూర్చి, దేవుని ఆత్మ క్రుమ్మరింపు తరఅంతము వరకు ఉంటుందని! (2) గొప్ప ఉజ్జీవము గొప్ప షమల కాలము మధ్యలో వస్తుంది, అంత్య క్రీస్తు క్రింద, యుగ అంతమున (సందర్భము. ప్రకటన 7:1-14). (3) అతి గొప్ప ఉజ్జీవము చరిత్ర అంతటిలో ఇప్పుడు, ఈ రాత్రి, చైనా పీపుల్ రిపబ్లిక్ లో, మరియు మూడవ ప్రపంచపు ఇతర దేశాలలో సంభవిస్తుంది. ఆధునిక కాలపు అతి గొప్ప ఉజ్జీవాలు ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉన్నాయి! ఈనాడు ఉజ్జీవము ఉండదు అనడం అతి భయంకరమైన పొరపాటు! II. రెండవది, మన సువార్తిక ప్రయత్నాలపై ఉజ్జీవము ఆధారపడు తుందనడం పొరపాటు. ఇది దక్షిణ బాప్టిస్టులు ఇతరుల మధ్య ఎక్కువగా ఉండే పొరపాటు. చార్లెస్ జి. ఫిన్నీ నుండి ఈ తలంపు సంక్రమించింది. ఫిన్నీ అన్నాడు, "ఉజ్జీవము సహజమైనది కారకాల మధ్య పంట వచ్చినట్టు తగిన కారకాల ద్వారా ఉజ్జీవము వస్తుంది" (C. G. Finney, Lectures on Revival, Revell, n.d., p. 5). చాల సంఘాలు ఇంకా ప్రకటిస్తాయి "ఉజ్జీవము" పలానా రోజున ప్రారంభమవ్వాలని – ఒక రోజున ముగియాలని! ఇది పూర్తిగా ఫిన్నీ యిజము! ఉజ్జీవము మన సువార్తిక ప్రయత్నాలపై ఆత్మల సంపాదన ప్రయత్నాలపై ఆధారపడదు! అపోస్తలుల కార్యములు 13:48-49 వినండి, "అన్య జనులు అది విన్నప్పుడు, వారు సంతోషించి, ప్రభువు మాటను మహిమ పరిచారు: నమ్మినవారు నిత్య జీవపు అభిషేకము పొందారు. ప్రభువు వాక్యము ప్రాంతమంతటా ముద్రింపబడింది." నేననుకుంటాను ఈ రెండు వచనాలు తేటపరుస్తున్నాయి మన సువార్తిక ప్రయత్నాలపై ఉజ్జీవము ఆధారపడుతుందని. సువార్త "ప్రాంతమంతటా ప్రచురింపబడినప్పటికిని" "నిత్య జీవ అభిషిక్తులే అది నమ్మారు." అవును, మన చెప్పబడ్డాం "సర్వసృష్టికి సువార్త ప్రకటించాలని" (మార్కు 16:15) – కాని ప్రతి సృష్టి నమ్మదు! ఉజ్జీవ సమయంలో మిగిలిన సమయాలలో కంటే ఎక్కువ మంది నమ్ముతారు – కాని ఇది తేటతెల్లము ఉజ్జీవము మన సువార్తిక ప్రయత్నాలపైననే ఆధారపడదని. III. మూడవది, క్రైస్తవుల సమర్పణపై ఉజ్జీవము ఆధారపడుతుందనడం పొరపాటు. నాకు తెలుసు చాలామంది II దిన వృత్తాంతములు 7:14 చెప్తుంటారు. కాని విచిత్రం వారు కొత్త నిబంధన వచనం చెప్పరు వాళ్ళ సిద్ధాంతమును బలపరచడానికి "దేవునితో సమాధానపడుటను" నమ్మే క్రైస్తవులపై ఉజ్జీవము ఆధారపడుతుందని. ఈ వచనము, రాజైన సోలోమెనుకు ఎందుకివ్వబడింది, నూతన నిబంధన సంఘములో ఉజ్జీవానికి ఒక సూత్రముగా వాడడానికి? నాకు వేరే కారణాలు కనబడలేదు ఒక బోధకుడు తన సంఘము నుండి ఓడలను పంపి, "బంగారము, వెండి, దంతము, కోతులు, నెమళ్ళు తెచ్చుకోడానికి," సోలోమెను చేసినట్లు II దిన వృత్తాంతములు 9:21, రెండు అధ్యాయాలు తరువాత చేసినట్టు! అయాన్ హెచ్. ముర్రే అన్నాడు, II దిన వృత్తాంతములు 7:14 కు సంబంధించి, "మొదటిది వాగ్ధానము చేయబడినది [నూతన నిభందన] ఉజ్జీవము కాదు, వాగ్ధానము అర్ధం చేసుకోవాలి, మొదటి సందర్భములో ఇవ్వబడిన కాలమును బట్టి. పాత నిభందన ఇశ్రాయేలు తన భూమి స్వస్థత ఇక్కడ మాట్లాడబడింది" (ముర్రే, ఐబిఐడి., పేజి 13). ఉద్దేశము ఏమిటంటే క్రైస్తవుల సమర్పణపై ఉజ్జీవము ఆధారపడి ఉంటుంది అనేది ఫిన్నీ నుండి వచ్చినది. విన్ స్టన్ చర్చిల్ ఒకసారి తన మనవడికి రాసాడు, చరిత్ర చదవమన్నాడు, ఎందుకంటే చరిత్ర శ్రేష్ట మార్గం చూపిస్తుంది భవిష్యత్తును గూర్చి తెలివిగా ఊహించడానికి. చర్చిల్ ద్వారా, "చరిత్ర పఠనము," మనం కనుగొంటాం క్రైస్తవుల "పూర్తి సమర్పణపై" ఉజ్జీవము ఆధారపడుతుందని. ప్రవక్త యోనా దేవునికి పూర్తిగా సమర్పించుకోలేదు. యోనా ఆఖరి అధ్యాయము చదవండి, తన లోపాలు అవిశ్వాసము చూస్తారు. కాదు, అన్యజనుల మద్య గొప్ప ఉజ్జీవము పాత నిబంధనలో వారి "పూర్తి సమర్పణపై" గాని "ప్రవక్త" పరిపూర్ణతపై గాని ఆధారపడ లేదు. జాని కెల్విన్ పరిపూర్ణుడు. నాస్తికత్వంతో పోరాడిన వ్యక్తి – నూతన నిభందన వైఖరి కనుపరచలేదు! అయినను దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని అతని పరిచర్యలో, ఆయన వ్రాతల ద్వారా పంపాడు. లూథర్ మహా కోపిష్టి, ఒకసారి అన్నాడు యూదుల సమాజ మందిరము కాల్చబడాలని. అయిననూ లూథర్, కోప పాప భూయిష్టుడైన కొన్నిసార్లు, ఆయన పరిచర్యలో దేవుడు ఉజ్జీవము పంపాడు. మనం కెల్విన్ లూథర్ లను క్షమిస్తాం ఎందుకంటే మనం గ్రహించాం వారు మధ్య యుగస్తులని, కేథలిసిజంచే ప్రభావితులని. అయిననూ, లోపాలున్నప్పటికిని, దేవుడు గొప్ప సంస్కరణ ఉజ్జీవము వారి పరిచర్యలో పంపించాడు. వైట్ ఫీల్డ్ కొన్నిసార్లు "అంతర్గత భావనల" వలన తప్పులు చేసాడు, దేవుని నుండి వచ్చాయని తప్పుగా అనుకున్నాడు. వెస్లీ (నాణెములు) వేసాడు దేవుని చిత్తము నిర్ధారించడానికి. అయిననూ వైట్ ఫీల్డ్, వెస్లీ, లూథర్ మరియు కాల్విన్ వారి పరిచర్యలో గొప్ప ఉజ్జీవము చూసారు. ఈ ఉదాహరణల ద్వారా మనం చూసాం, చరిత్రలో, అపరిపూర్ణులు, పరిశుద్ధత సమర్పణ ఉండవలసినంతగా లేనివారు, దేవునిచే ఉజ్జీవ సమయాల్లో ఘనంగా వాడబడ్డారు. మనం చెప్పాలి ఫిన్నీ తన అనుచరులు వారు తప్పని క్రైస్తవులు పూర్తిగా సమర్పించుకుంటే ఉజ్జీవం వస్తుందనడంలో. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, "అయిననూ ఆ బలాదిక్యము మామూలమైనది, కాక దేవునిదై యుండునట్లు వంటి ఘటములలో, ఈ ఐశ్వర్యము మాకు కలదు" (II కొరిందీయులకు 4:7). నేను ఈ అంశాన్ని శాన్ హెడ్రిన్ పై స్తైఫను ప్రసంగమును గూర్చి చెప్పి ముగిస్తాను. మనకు నిర్దిష్టంగా చెప్పబడింది సైఫను "కృపతోనూ, బలముతోను, నిండినవాడై [మరియు] ప్రజల మద్య మహత్కార్యములను సూచక క్రియలను చేయుచుండెను" (అపోస్తలుల కార్యములు 6:8). అయిననూ తన బోధ ద్వారా ఉజ్జీవము రావడం చూడలేదు. బదులుగా, రాళ్ళతో కొట్టబడ్డాడు. అతడు పరిశుద్ధుడు నీతిమంతుడు, అయిననూ అది ఉజ్జీవాన్ని తన సేవలో ఉత్పన్నం చెయ్యలేదు. మనం ఉపవసించి ప్రార్ధించవచ్చు, నిజంగా అద్భుత క్రైస్తవులం కావచ్చు, కాని ఇది ఉజ్జీవం పంపమని దేవుడు బలవంత పెట్టలేదు. ఎందుకు? అపోస్తలుడైన పౌలు దానికి జవాబిస్తున్నాడు, "కాబట్టి వృద్ధి కలుగచేయు దేవునిలోనే గాని, నాటు వానిలోనైనను; నీళ్ళు పోయువానిలో నైనను ఏమియు లేదు" (I కొరిందీయులకు 3:7). అవును, మనం ప్రార్ధించాలి, ఉపవాసముండాలి, ఉజ్జీవము కొరకు, అదే సమయంలో, ఎప్పుడు గుర్తుంచుకోవాలి, "కాని దేవుడు...వృద్ధి కలుగచేస్తాడు" (I కొరిందీయులకు 3:7). దేవుని సౌబ్రాత్రుత్వ శక్తి మాత్రమే నిజ ఉజ్జీవాన్ని ఉత్పన్నం చేస్తుంది! IV. నాల్గవది, ఉజ్జీవము అనేది సంఘములో మనం ఊహించే సామాన్య పరిస్థితి అనుకోవడం పొరపాటు. పెంతేకోస్తు దినాన, అపొస్తలులపై పరిశుద్ధాత్మ క్రుమ్మరింపబడింది. వారి భాషలలో భోదించాడు, ఈ గొప్ప ఉజ్జీవంలో మూడు వేలమంది మారారు, అపోస్తలుల కార్యములు, రెండవ అధ్యాయంలో ఇది వ్రాయబడింది. కాని వారు మళ్ళీ పరిశుద్దాత్మతో వారు నింపబడాలని, అపోస్తలుల కార్యములు 4:31 లో వ్రాయబడింది, "వారు ప్రార్ధన చేయగానే, వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరూ పరిశుద్ధత్మతో నిండిన వారై, దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి" (అపోస్తలుల కార్యములు 4:31). అది సంఘములలో ఉజ్జీవ సమయాలు, అసాధారణ ఉజ్జీవ సమయాలు ఉన్నట్ట్టు చూస్తున్నాం. కాని కొన్నిసార్లు సంఘ కార్యము, సామాన్య రోజు వారి పద్ధతిలో జరిగింది. అపోస్తలుడైన పౌలు అర్ధము ఇది ఇలా చెప్పడంలో, "సమయమందును, ఆ సమయమందును ప్రయాసపడుము" (II తిమోతి 4:2). దీని అర్ధం మనం బోధించుట ప్రార్ధించుట సాక్ష్య మిచ్చుట కొనసాగించాలి ఉజ్జీవము ఉన్నప్పటికీ లేనప్పటికీ. క్రీస్తు మనలను గొప్ప ఆజ్ఞకు (మత్తయి 28:19-20) లోబడమన్నాడు, "సర్వసృష్టికి సువార్త ప్రకటించండి" (మార్కు 16:15) ఉజ్జీవము ఉన్నప్పటికీ లేనప్పటికీ! దేవుని అసాధారణ కదలిక లేనప్పటికీ కొంతమంది మారవచ్చు. ఉజ్జీవము దేవుని సామాన్య క్రియల వలన అనుకుంటే, మనము నిరుత్సాహపడతాం. అయాన్ హెచ్. ముర్రే అన్నాడు, ఈ విషయంపై జార్జి వైట్ ఫీల్డ్ తన స్నేహితుడు విలియం మేకుల్లోక్, [స్కాట్లాండ్] కాంబస్ లాంగ్ సేవకుని హెచ్చరించాడు. 1749 లో మేకుల్లోక్ నిరుత్సాహపడ్డాడు ఎందుకంటే 1742 మేల్కొలుపులో చూసినవి మళ్ళీ చూడలేవని. వైట్ ఫీల్డ్ జవాబు గుర్తు చేసింది సంఘానికి 1742 ప్రమాణము కాదు అని: "[ఇంకొక] ఉజ్జీవము కాంబస్ లాంగ్ లో వచ్చి ఉంటే సంతోషము; కాని, అయ్యా, అలాంటివి ముందే చూసారు అవి శతాబ్దంలో [ఒకసారి కంటే ఎక్కువగా] జరగవు." మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అలాంటి ఉదాహరణే చెప్పాడు వేల్స్ మినిష్టర్ "మొత్తం పరిచర్య పతనమైంది," వెనుకకు తిరిగి 1904 ఉజ్జీవంలో ఏమి జరిగిందో అని వెనుకకు తిరిగి చూడడం వలన: "ఉజ్జీవము ముగిసాక...అసాధారణతను ఆశిస్తూ ఉన్నాడు; అది జరగలేదు. నిరుత్సాహపడి తన నలభై సంవత్సరాల జీవితాన్ని ఎడారిగా, సంతోషం లేకుండా నిస్సారంగా గడిపాడు" (అయాన్ హెచ్. ముర్రే, ఐబి ఐడి., పేజి 29). దేవుడు ఉజ్జీవము పంపకపోతే, నిరుత్సాహపడ కూడదు. సమయమందును, "ఆ సమయమందును [కూడా] ప్రయాసపడుము," సువార్త ప్రకటించాలి, పాపులను క్రీస్తు నొద్దకు నడిపించాలి. అలానే, ప్రత్యేక మేల్కొలుపు సమయము, ఉజ్జీవము వచ్చేలా దేవునికి ప్రార్ధించుట కొనసాగించాలి. దేవుడు ఉజ్జీవాన్ని పంపితే, మనం సంతోషిస్తాం. ఆయన ఉజ్జీవము పంపకపోతే, క్రీస్తు నొద్దకు ఆత్మలను నడిపించుట కొనసాగించాలి! మనం నిరుత్సాహపడకూడదు! వదిలిపెట్టకూడదు! సమయమందును ఆ సమయమందును ప్రయాసపడాలి! V. ఐదవది, ఉజ్జీవములో షరతులు లేవు అనుకోవడం ఒక పొరపాటు. లేఖనాలు చరిత్ర చూపిస్తున్నాయి ఉజ్జీవము మానవ సువార్త ప్రయత్నాలపై గాని క్రైస్తవుల సంపూర్ణ సమర్పణ పై గాని ఆధారపడదు. కాని కొన్ని షరతులు ఉన్నాయి. ఇవి ప్రాముఖ్యంగా సరియైన సిద్ధాంతము, ప్రార్ధన. ఉజ్జీవము గూర్చి ప్రార్ధించాలి, పాపము రక్షణలను గూర్చి సరియైన సిద్ధాంతము మనము కలిగియుండాలి. ఉజ్జీవము (క్రాస్ వే బుక్స్, 1992), అనే పుస్తకములో, డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ దానిలో రెండు అధ్యాయాలు ఉన్నాయి, "సిద్ధాంతపు అపవిత్రత" మరియు "మృత చాదస్థము." ఈ రెండు అధ్యాయములలో, ఈయన ఆయన బోధల ఆరంభపు సంవత్సరాలలో ఉజ్జీవము చూసాడు, కొన్ని సిద్ధాంతాలు బోధించాలి నమ్మాలి దేవుడు ఉజ్జీవము పంపాలని ఆశిస్తే. ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు ఇవి. 1. మానవాళి పాడడం పతనం – పూర్తి కోల్పోవుట. 2. పునర్నిర్మాణము – లేక నూతన జన్మ – దేవుని పని, మనిషిది కాదు. 3. విశ్వాసము ద్వారా క్రీస్తులో న్యాయము – "నిర్ణయాలపై" నమ్మకం కాదు. 4. క్రీస్తు రక్తము యొక్క పని తీరు – వ్యక్తిగత ఆది పాపము. ఈ నాలుగు సిద్ధాంతాలను చార్లెస్ జి. ఫిన్నీ ఎదిరించాడు, తక్కువగా చూచి మొదటి నుండి పట్టించుకోలేదు. ఆశ్చర్యము లేదు 1859 నుండి కొంచెము ఉజ్జీవమే చూసాము! వివరాలలోనికి వెళ్ళను, కాని ప్రాముఖ్య సిద్ధాంతములున్నాయి, వాటిని బోధించాలి మన సంఘాలలో ఉజ్జీవము రావడం చూడాలంటే. మన సంఘాలలో చాలామంది నశించువారున్నారు, వారు నిజంగా ఎన్నటికి మారరు మనం ఈ అంశాలపై విస్తృతంగా బలంగా బోధించక పొతే – మళ్ళీ మళ్ళీ! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, ఉజ్జీవపు చరిత్రలు చూడండి, స్త్రీ పురుషులు పరితపించారు. వారికి తెలుసు వారి మంచి క్రియలు మురికి గుడ్డల్ని, వారి నీతికి విలువ లేదని. వారేమి చెయ్యలేరని, దేవుని కృప కొరకు, కనికరము కొరకు మోర పెట్టారు. విశ్వాసము ద్వారా నీతిమత్వము. దేవుని కార్యము. "దేవుడు మనకు చెయ్యకపోతే," వారంటారు, "మనం నశించిపోతాం." వారి [వారి పూర్తి] నిస్సహాయతను ఆయన ముందు ఒప్పుకున్నారు. వారు లెక్కించలేదు, ప్రాముఖ్యత చేకూర్చలేదు, వారి గత మతతత్వానికి, గుడి హాజరుపై నమ్మకత్వం, ఇంకా చాల, చాల విషయాలు. అంతా మంచిది కాదని, మతానికి విలువలేదని, విలువైనది ఏదీ లేదని. దైవేతరులను దేవుడే తీర్చిదిద్దాలి. ఆ గొప్ప సందేశము వస్తుంది, కనుక, ప్రతి ఉజ్జీవ సమయంలో (Martyn Lloyd-Jones, ibid., pp. 55-56). "పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు దాని యందు, విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది" (రోమా 4:5). "యేసు క్రీస్తు: దేవుని నన్ను ఎన్నుకొని తన రక్తంలో విశ్వాసం ద్వారా ప్రాయశ్చిత్తంను కలిగించాడు" (రోమా 3:24-25). VI. ఆరవది, ఆనందముతో నవ్వుతో ఉజ్జ్జీవము ప్రారంభం అవుతుందను కోవడం పొరపాటు. "నవ్వే ఉజ్జీవము" నిజ ఉజ్జీవము కాదు. వారి కూటాలు నా స్నేహితుడు డాక్టర్ ఆర్ధర్ బి. హౌక్ తో పాటు చూసాను. అది నిజ ఉజ్జీవానికి విషాద అంకము. రక్షణను గూర్చి నేటి ప్రజలు అనుకునే దానితో అది సరిపోతుంది. డాక్టర్ జాన్ ఆర్మ్ స్ట్రాంగ్ అన్నాడు, "[వారికి] కావలసింది సంతోషము, నెరవేర్పు, తృప్తి" (నిజ ఉజ్జీవము, హార్వెస్ట్ హౌస్, 2001, పేజి 231). పాపము నుండి రక్షణ అవసరతను గూర్చి వారు ఆలోచించడం లేదు! కాని నిజ మార్పు, నిజ ఉజ్జీవములో అది మార్పు తెస్తుంది. ఉజ్జీవంలో, వ్యక్తిగత మార్పులో, "విరిగి నలిగిన స్థితి, క్రీస్తు కేంద్రీయ ఒప్పుకోలు పశ్చాత్తాపము నిజ ఆత్మ ఉద్యమాన్ని తెస్తాయి. ప్రజలు...ప్రలాపిస్తారు పాపపు తీవ్ర ఒప్పుకోలులో" (ఆర్మ్ స్ట్రాంగ్, ఐబిఐడి., పేజి 63). నా అనుభవం ప్రతి ఒక్కరు నిజ మార్పు అనుభవించే వారు వారి పాపాలను గూర్చిన విచారముతో ఏడుస్తారు. ఉజ్జీవాలలో అది వాస్తవము నా కళ్ళారా చూసాను. గత కళాత్మక ఉజ్జీవాలలో అది వాస్తవము. పరిశుద్ధాత్మ మనపైకి రావాలని ఎలా మనం ప్రార్ధన చేస్తాం! ఎలా ప్రార్దిస్తాం దేవునికి వ్యతిరేకంగా నీవు చేసిన పాపాలను గూర్చి దుఃఖించి ఎలా ప్రలాపించాలో. యేసు ప్రశస్త రక్తంలో నీ పాపాలు కడగబడాలని ఎలా ప్రార్దిస్తాం! "యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7). ఆమెన్. డాక్టర్ చాన్, దయచేసి వచ్చి మన సంఘములో అలాంటి ఉజ్జీవము వచ్చేలా ప్రార్ధించండి. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: జెకర్యా 12:10; 13:1. |
ద అవుట్ లైన్ ఆఫ్ ఉజ్జీవమును గూర్చి ఆరు ఆధునిక పొరపాట్లు (ఉజ్జీవముపై 15వ ప్రసంగము) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే. (I కొరిందీయులకు 13:12)
I. మొదటిది, ఈనాడు ఉజ్జీవము ఉండదనే పొరపాటు, అపోస్తలుల కార్యములు 2:39;
II. రెండవది, మన సువార్తిక ప్రయత్నాలపై ఉజ్జీవము ఆధారపడుతుందనడం పొరపాటు,
III. మూడవది, క్రైస్తవుల సమర్పణపై ఉజ్జీవము ఆధారపడుతుందనడం పొరపాటు, II దిన వృత్తాంతములకు 9:21; II కొరిందీయులకు 4:7; అపోస్తలుల కార్యములు 6:8;
IV. నాల్గవది, ఉజ్జీవము అనేది సంఘములో మనం ఊహించే సామాన్య పరిస్థితి అనుకోవడం పొరపాటు, అపోస్తలుల కార్యములు 4:31; II తిమోతి 4:2; మార్కు 16:15. V. ఐదవది, ఉజ్జీవములో షరతులు లేవు అనుకోవడం ఒక పొరపాటు, రోమా 4:5; 3:24-25.
VI. ఆరవది, ఆనందముతో నవ్వుతో ఉజ్జ్జీవము ప్రారంభం అవుతుందను కోవడం పొరపాటు,
|