ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఉజ్జీవము యొక్క దేవుడు (ఉజ్జీవముపై 14వ ప్రసంగము) డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్ళను పొంగచేయు రీతిగాను, నీవు దిగి వచ్చెదవు గాక! జరుగునని మేమనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా, అన్యజనులు నీ సన్నిధిని కనబడుదురు గాక నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1-3). |
ఇశ్రాయేలు ప్రజలు చెడు స్థితిలో ఉన్నారు. వారు భయపడి విచారంగా ఉన్నారు. కాని ప్రజలు పునరుద్ధరించమని దేవునికి ప్రార్ధించారు. గతంలో వారికి ఏమి చేసారో దేవునికి గుర్తు చేసారు. తిరిగి చేయమని దేవుని అడిగారు. దేవుడు మారడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అలా ప్రవక్త దేవునికి గుర్తు చేసాడు. అలా, ప్రవక్త దేవునికి గుర్తు చేసాడు, "జరుగునని మేమనుకోనని, భయంకరమైన క్రియలు నీవు చేయగా, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:3). ఈ పాఠ్య భాగము నుండి మూడు విషయాలు చూస్తాం. I. మొదటిది, దేవుని సన్నిధి మన ఒకే ఒక నిరీక్షణ. యెషయా ప్రార్ధించగా ఇది చూసాడు, ఒకటవ వచనంలో, "గగనం చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక" (యెషయా 64:1). దానికి ముందు ఆయన దేవునికి ప్రార్ధించాడు "పరము నుండి చూడుము" (యెషయా 63:15). తన ప్రార్ధనలు ఎదిగాయి. దేవుని క్రిందికి చూడమని అడగడం ప్రారంభించాడు. ఇప్పుడైతే మోరపెడుతున్నాడు, "దిగి రమ్మని. " ఇప్పుడు ప్రార్ధిస్తున్నారు గగనము చీల్చుకొని – దిగి వచ్చి తన ప్రజలకు సహాయము చెయ్యమని. దేవుని దగ్గరకు రావడానికి క్రీస్తు మార్గము తెరిచాడు. దేవాలయపు తెరలు ఎత్తలేదు. లేదు! రెండుగా చీల్చాడు, పై నుండి క్రిందికి. దేవునికి మార్గము ఎన్నటికి తెరవబడింది! క్రీస్తు పరదైనుకు తెరువబడిన ఆకాశము ద్వారా వెళ్ళాడు! తెరువబడిన ఆకాశము నుండి పెంతేకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. తిరిగి దేవుని ఆత్మ మనపై దిగి రావాలని ప్రార్ధించాలి! ఈ రోజు దేవునికి మన హృదయాలతో ప్రార్ద్ధిద్దాం ఆయన మన మధ్యకు దిగి వచ్చినట్టు! నా దీర్ధకాలపు కాపరి చైనీయ సంఘములో డాక్టర్ తిమోతి లిన్. డాక్టర్ లిన్ అన్నాడు, పాతనిభందన కాలములలో దేవుని ప్రజలు [అవసరత] ఆశీర్వదింప బడడానికి దేవుని సన్నిధి కలిగి యుండుట... "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక..." (యెషయా 64:1). దేవుని సన్నిధి యోషేతో ఉన్నది – దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించాడు. అరణ్యములో వారు సంచరించేటప్పుడు దేవుని సన్నిధి వారితో ఉన్నది. ఆయన మేఘస్థంభముగా అగ్ని స్థంభముగా ఉండి నడిపించాడు. "దేవుడు ఉన్నప్పుడు" ఇశ్రాయేలు బేనర్ పై వ్రాయబడినప్పుడు, సముద్రము నుండి సముద్రమునకు జయించారు. దేవుని దుఃఖ పరిచినప్పుడు బలహీన దేశమయ్యారు. బబులోనుకు బానిసలుగా కొనిపోబడ్డారు. దేవుని సన్నిధి ఇశ్రాయెలీయులకు మహిమ. దేవుని సన్నిధి లేకుండా వారు లేమి చెయ్యలేదు. చీకటి భయంకర దినాలు ఉన్నాయి. మన సంఘాలు బలహీనంగా ఉన్నాయి. మన బోధకులు శక్తి హీనులుగా ఉన్నారు. మనం ఈ గొప్ప దుష్ట పట్టణ నడిబొడ్డున ఉన్నాం – పాశ్చాత్య ప్రపంచ చీకటి పోదామా! నరక శక్తులు మనలను ఆపడానికి దుష్ట ప్రయత్నాలు చేసాయి. కాని దేవుడు మనతో ఉన్నాడు! మన సంఘ భవనము ముగిసింది – ఇది అద్భుతము! దేవుడు మనతో ఉన్నాడు ఈ ప్రసంగాలు అంతర్జాలములో ప్రతి నెలా 80,000 మందికి చేరుతున్నాయి! దేవుడు మనతో ఉన్నాడు. కాని మనము ఇంకా ఎక్కువ మంది యవనస్థులను రప్పించి సంఘము కట్టాలి. మీరనవచ్చు, "ఇది అసంభవముగా ఉంది" అని. అవును, నాకు ఆ భావన తెలుసు. ఆ భావన మన శారీరక సహజత్వము నుండి సాతాను నుండి వస్తుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనకు ఏంచేసాడో మన సంఘ భవనాన్ని కాపాడినప్పుడు. మరియు, యవనస్థులారా, మునుపెన్నడూ ప్రార్ధించినట్టుగా ప్రార్ధించాలి, మన సువార్తీకరణలో, మన ఆరాధనలో శక్తి మంతుడైన దేవుని సన్నిధి ఉండునట్లు! "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక..." (యెషయా 64:1). దేవుని సన్నిధి మన ఒకే ఒక నిరీక్షణ! ఎవ్వరు ఉండరు. ఎవరు మర్చబడరు. ఎవరు మన సంఘములో బలమైన సభ్యునిగా ఉండరు – దివి నుండి దేవుడు మన మధ్యకు దిగి రాకుండా! II. రెండవది, దేవుని సన్నిధి ఆశ్చర్యాలు సృష్టిస్తుంది. పాఠ్యభాగము చెప్తుంది, "నీవు భయంకర కార్యాలు చేసేటప్పుడు మనము చూడనివి, నీవు దిగి వస్తావు." ఆధునిక తర్జుమా "భయంకర" పదాన్ని "అద్భుత" అని అనువదిస్తున్నాయి. ఆ పదాన్ని లెక్క చెయ్యను అతివాడుక వలన పాతగిలింది. దాని గూర్చి ఇలా ఆలోచించాలి "ఆశ్చర్య కార్యాలు మనం ఎదురు చూడనిది." ఇశ్రాయేలీయులు తరచుగా అన్నారు, "నీవు అద్భుతాలు చేయుచున్నావు దేవుని కళ" (కీర్తనలు 77:14). మీరనుకుంటున్నారా ఎర్ర సముద్రము ద్వారా ఇశ్రాయేలీయులు నడుస్తారని, రెండు వైపులా నీరు పాయలుగా చేయబడి? అయినా నడిచారు – వారిని వెంబడిస్తున్న ఐగుప్తీయులు నీళ్ళు తిరిగి కలిసినప్పుడు మునిగి పోయారు. మీరనుకుంటున్నారా వారు అరణ్యంలో ఉండాల్సి వస్తుందని ప్రతి రాత్రి వెలుగులో మన లైట్ల కంటే శ్రేష్టమైనవి? అయినా ప్రతి రాత్రి జ్వాలతో వెలిగింప బడింది. ఆకలిగొన్నప్పుడు మన్ను తింటారని వారు ఊహించారా? దాహం గొనినప్పుడు బండనుండి నీళ్ళు వస్తాయని వారు ఊహించారా? యెరికో చుట్టూ నడిచేటప్పుడు వారు బిగ్గరగా అరచినప్పుడు యెరికో గోడలు కూలుతాయని ఊహించారా? లేదు, ఇశ్రాయెలీయుల చరిత్ర భయంకర ఉత్ప్రేరక విషయాలో నిండి ఉంది, "ఊహించనివి జరగడం" దేవుడు దిగి వచ్చినప్పుడు. దేవుడు క్రీస్తు అనే వ్యక్తిగా దిగి వస్తాడని ఎవరు ఊహించారు? ఆయన సిలువపై "అనీతిపరులను నీతిమంతులుగా," చెయ్యడానికి పరలోకానికి తీసుకెళ్ళడానికి సిలువపై ఆయన మరణిస్తాడని ఎవరు ఊహించారు? (I పేతురు 3:18). ఎవరు అనుకున్నారు భయపడిన శిష్యులు, మూయబడిన గదిలో ఉన్నవారు, రోమా ప్రపంచానికి క్రీస్తు సువార్తను తీసుకెళతారని? ఎవరనుకున్నారు చిన్న, పేద దీవి, కర్ర ఉపయోగించే ముసలివానిచే నడిపింపబడినది, హిట్లర్ అతని గొప్ప సైన్యముతో యుద్ధం చేస్తాడని – గెలుస్తాడని? ఎవరనుకున్నాడు ప్రపంచమంతటా చెదరని యూదులు, రెండు వేల సంవత్సరాల తరువాత ఇశ్రయెలుకు తిరిగి వస్తారని? ఎవరనుకున్నారు చిన్న ఇజ్రాయేలు దేశము అరవై సంవత్సరాలకు పైగా ముస్లీములకు వ్యతిరేకంగా నిలుస్తుందని? ఎవరకునున్నారు కొంతమంది చైనీయ క్రైస్తవులు అర్ధ శతాబ్దానికి పైగా మావ్ టేస్ టంగ్ అతని ఎర్రని భటులచే శ్రమలు పొందుతారని? ఎవరనుకున్నారు చిన్న "గృహ సంఘాలు" నుండి ప్రపంచ చరిత్రలో గొప్ప ఉజ్జీవము వస్తుందని? ఎవరనుకున్నారు ఆత్మల రక్షణ అర్ధ నగ్నస్తులకు, పొగతాగే హేప్పీలకు 1960 మరియు 70 లో వస్తుందని? ఎవరనుకున్నారు నేనెప్పుడు వినని సంఘ విభజన నుండి జీవిస్తుందని? ఎవరనుకున్నారు ముప్పై-తొమ్మిది మంది ప్రతి నెల పదహారు వేల డాలర్లు ఇరవై సంవత్సరాలుగా సమకూరుస్తారని సంఘ భవనానికి? ఎవరనుకున్నారు ప్రపంచమంతటిలో అందమైన భార్యను దేవును నాకిస్తాడని? ఎవరనుకున్నారు ఇద్దరు బలవంతులైన కుమారులు ప్రతి ఆదివారం నాతో ఉంటారని? ఎవరనుకున్నారు రెండు పిహెచ్.డి.లు, మరియు వైద్యుడైన వానిని, మన గుడిని నడిపించడానికి పంపుతాడని? ఎవరనుకున్నారు, వారి భయంకర కలలతో, నా పేద ముసలి, ఒడిని కృంగిన నా తల్లి ఎనభైవ ఏట పేరుగాంచిన క్రైస్తవురాలవుతుందని? "జరుగునని మేమనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేసి, నీవు దిగి వచ్చెదవు గాక..." (యెషయా 64:3). దేవుడు దిగి వచ్చునప్పుడు ఎవరు ఊహించని ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు! నా దేవా, నీ చేతిపని ఎంత ఆశ్చర్యము, ఈ సాయంకాలము కొన్ని స్పర్జన్ ప్రసంగాలు యెషయాపై నేను ఇస్తాను. నేను ఆయన సమీక్ష ఆయన తలంపులు వాడుతున్నాను. గొప్ప "బోధకులకు రాజు" అన్నాడు, ఎప్పుడైతే దేవుడు ప్రజల మధ్యకు వస్తాడో మన ఊహించని పనులు ఆయన చేస్తాడు...ఆయన భయంకరులను రక్షిస్తాడు, వ్యతిరేకులను యేసు పాదాల చెంతకు తీసుకొని వస్తాడు. [ప్రార్ధించుడి] ఆయన అలా చెయ్యడానికి (C. H. Spurgeon, “Divine Surprises,” MTP, volume XXVI, Pilgrim Publications, 1972 reprint, p. 298). III. మూడవది, దేవుని సన్నిధి గొప్ప సమస్యలను ఆటంకాలను అధిగమిస్తుంది. "జరుగునని మేమనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేసి, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:3). అది అద్భుత వాక్యము, "నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక." ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు దగ్గరకు దిగి వచ్చాడో, శక్తి గల శత్రువులు, గొప్ప పర్వతములుగా ఉండేవి, వారు ఓడింపబడ్డారు, దేవుని శక్తిని బట్టి ఈ పర్వతాలు దిగి వచ్చాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉజ్జీవంలో దిగి వస్తుందో, కఠిన హృదయాలు దేవుని సన్నిధిలో కరుగుతాయి! మన మధ్యలో కొందరున్నారు బండ హృదయాలతో. మనం వారి కొరకు ప్రార్దిస్తాం, బోధిస్తాం, కాని ఏమి జరగదు. వారు మారరనిపిస్తుంది. కాని దేవుడు దిగి వచ్చినప్పుడు, కఠిన హృదయాలు పగిలిపోతాయి. అకస్మాత్తుగా చూస్తారు. వారు అకస్మాత్తుగా మాత్రమే యేసు రక్షించు వానిగా చూస్తారు. దేవుడు దిగి వచ్చినప్పుడు వారి పాపాన్నుండి యేసు రక్తము కడుగుట అనే అవసరత వారు గమనిస్తారు. కన్నీటి ఒప్పుకోలు కఠిన హృదయాలను మెత్తపరుస్తుంది. అప్పుడు ఈ చిన్న గీతము అర్ధం గ్రహిస్తారు, మీ కృపలో కరిగి, నేలపై ఒరిగాను, అదే ఎప్పుడు ఉజ్జీవంలో జరుగుతుంది. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ ఉజ్జీవ నిర్వచనము ఇలా ఇచ్చాడు, ఉజ్జీవము దేవుని ఆత్మ క్రుమ్మరింపు...అది ఆత్మ ప్రజలపై దిగివచ్చుట. ఆయన గొప్ప వెల్స్ బోధకుడైన హోవెల్ హేరిస్ ను గూర్చి, మాట్లాడిన తరువాత. హోవెల్ హేరిస్ ప్రభువు బల్ల ఆరాధనలో మారాడు. ఆయన అంతర్గత పోరాటంలో చాల కాలం వెళ్ళాడు. ప్రతి దానిలో సాతాను తన విశ్వాసాన్ని కుదప ప్రయత్నించింది. కాని ప్రభువు బల్ల తీసుకోడానికి వచ్చినప్పుడు "పర్వతములు [దేవుని యొక్క] సన్నిధి ద్వారా తత్తరిల్లాయి." హోవెల్ హేరిస్ అన్నాడు, సిలువపై రక్తము చిందిస్తున్న క్రీస్తు నా కళ్ళముందు ఉన్నాడు; నమ్మడానికి నాకు శక్తి ఇవ్వబడింది [నా పాపాల నిమిత్తము] ఆ రక్తము ద్వారా క్షమాపణ పొందడానికి. నా భారం తొలగిపోయింది; ఆనందంతో ఇంటికి వెళ్ళాను… కృతజ్ఞతతో ఎన్నటికి గుర్తుండి పోతుంది (Martyn Lloyd-Jones, M.D., “Howell Harris and Revival,” The Puritans: Their Origins and Successors, Banner of Truth, 1996 edition, pp. 289, 285). హోవెల్ హేరిస్ మొదటి గొప్ప మేల్కొలుపులో శక్తివంత బోధకులలో ఒకడయారు. ఆయన డైరీ మీరు చదివితే, మీరు చూస్తారు, మళ్ళీ మళ్ళీ, ఎలం ఉజ్జీవం వచ్చిందో. శక్తితో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు నశించిన ప్రజలు మారారు. హేరిస్ అన్నాడు, "గొప్ప గాలి [గొప్ప ఆత్మ గాలి] వచ్చినప్పుడు నేను మన రక్షకుని అనంత మరణాన్ని వారికి చూపించాను." "ప్రభువు శక్తితో దిగి వచ్చాడు." "గొప్ప గాలి దిగి వచ్చింది." "నేను రక్షణ గొప్పతనాన్ని చూపించినప్పుడు." ఈ సామాన్యుడు బోధించినప్పుడు వేలమంది ఇంగ్లాండ్ లో వేల్స్ లోను మార్చబడ్డారు. మన సంఘములో ఉజ్జీవము పొందగలమా? అవును, కాని మనం నిజంగా దానిని కోరుకోవాలి. నేను అద్భుత చిన్న పుస్తకాన్ని చదువుతున్నాను ఆ పుస్తకము 1900 నుండి 1927 వరకు చైనాకు మిస్సేనరీగా ఉన్న నార్వే స్త్రీచే వ్రాయబడింది. ప్రతి సంవత్సరం ఉజ్జీవము కొరకు ఆమె ప్రార్ధించింది. ఆమె ఉపవసించి ప్రార్ధించింది. 1907 లో కొరియాలో వచ్చిన గొప్ప ఉజ్జీవమును గూర్చి ఆమె చదివింది. చైనాకు ఉజ్జీవము రావాలనుకుంది. నిజంగా ఉజ్జీవము కావాలనుకుంది. అకస్మాత్తుగా వచ్చింది, చైనీయ స్త్రీల మధ్యలో. అది వ్యాపించింది, వందలాది మంది మారారు, ఆమె చైనా విడిచి నార్వే వెళ్లేముందు. మన గుడిలో కొద్దిగా, అది పొందుకుందామా? అవును, మునుపెన్నడూ ప్రార్ధించనంతగా ప్రార్ధించాలి. మొదటి వచనంలో యెషయా ప్రార్ధించినట్టుగా మనం ప్రార్ధించాలి. "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1). మీరింకా మారకపోతే, మీ కొరకు ప్రార్దిస్తాం. మేం ప్రార్దిస్తాం దేవుడు మీకు పాపపు ఒప్పుకోలు ఇచ్చి, ఆయన మిమ్మును క్రీస్తు దరికి చేర్చునట్లు. మీ పాప ప్రాయశ్చిత్తానికి క్రీస్తు సిలువపై మరణించాడు. మృతులలో నుండి లేచి సజీవుడుగా మూడు రోజులు ఆకాశంలో ఉండి, మీ కొరకు ప్రార్దిస్తున్నాడు. కాని మీరు పశ్చాత్తాపపడి మీ పాపాల నుండి రక్షింపబడడానికి ఆయనను విశ్వసించాలి. మీరనవచ్చు, "నేను పాపిని కాను. నేను మంచి వ్యక్తిని." కాని బైబిలు చెప్తుంది, "మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల, ఆయనను అబద్ధికునిగా చెయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు" (I యోహాను 1:10). మేము ప్రార్ధిస్తున్నాము దేవుని ఆత్మ మీ పాపము మీకు చూపించాలని, యేసు నొద్దకు నడిపించాలని, ఆయన రక్తము ద్వారా కడుగబడాలని. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించుడి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: యెషయా 64:1-3. |
ద అవుట్ లైన్ ఆఫ్ ఉజ్జీవము యొక్క దేవుడు (ఉజ్జీవముపై 14వ ప్రసంగము) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే. "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్ళను పొంగచేయు రీతిగాను, నీవు దిగి వచ్చెదవు గాక! జరుగునని మేమనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా, అన్యజనులు నీ సన్నిధిని కనబడుదురు గాక నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1-3).
I. మొదటిది, దేవుని సన్నిధి మన ఒకే ఒక నిరీక్షణ, యెషయా 64:1; 63:15;
II. రెండవది, దేవుని సన్నిధి ఆశ్చర్యాలు సృష్టిస్తుంది, కీర్తనలు 77:14; I పేతురు 3:18;
III. మూడవది, దేవుని సన్నిధి గొప్ప సమస్యలను ఆటంకాలను అధిగమిస్తుంది, |