ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఎందుకు ఉజ్జీవము లేదు? నిజమైన జవాబు! (ఉజ్జీవముపై 10 వ ప్రసంగము)WHY NO REVIVAL? THE TRUE ANSWER! డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనెను" (హోషేయా 5:6). "నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా, వారు నన్ను బహు శీఘ్రంగా వెదుకుదురు..." (హోషేయా 5:15). |
హోషేయా ఐదవ అధ్యాయంలో అంశము దేవుని సన్నిధి మరుగు చేయబడుట – ఇది ప్రారంభంలో స్కోఫీల్డ్ బైబిలు వివరణలో ఇవ్వబడినది. దేవుడు ఇశ్రాయేలీయుల నుండి వారి గర్వమును బట్టి పాపమును బట్టి వెనుదిరిగాడు. నాకు తెలుసు దేవునికి అమెరికాతో నిబంధన లేదు. ఆయన ఇశ్రాయేలులో బౌతిక నిబంధన కలిగియున్నాడు, వేరే ఏ దేశముతో కూడా లేదు. కాని గమనించండి, మన పాఠ్యభాగములో, దేవుడు అన్నాడు ఆయన తన నిబంధన ప్రజల నుండి వారి గర్వమును బట్టి పాపమును బట్టి వెనుదిరిగి యున్నాడు. ఆయన నిబంధన ప్రజలనే పరిత్యజిస్తే ఇశ్రాయేలును, ఆయన ఇంకా ఎంత ఎక్కువగా అమెరికాను, ఇతర పాశ్చాత్య ప్రపంచాన్ని పరిత్య జిస్తాడో ఆలోచించండి! డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, నా ఒప్పుకోలు ఏంటంటే దేవుని తీర్పు ప్రభావము అమెరికా చవిచూస్తుంది...ఆయన తీర్పు పర్యవసానాలు మనం అనుభవిస్తున్నాం, ఇశ్రాయేలీయుల వలే (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume III, Thomas Nelson Publishers, 1982, p. 633; note on Hosea 5:2). ఇప్పుడు మనం పాఠ్య భాగానికి వద్దాం, "నేను తిరిగి నాస్తలమునకు పొవుదును, తమకు దురవస్త సంభవిపగా, వారు నన్ను భాహు శిఘ్రముగా వెదుకుదురు..." ( హోషేయా 5:15). దేవుడు మనకు చెప్తున్నాడు పాపపు దేశాన్ని ఆయన మరుగు చేసుకోవడం ద్వారా శిక్షిస్తాడు, "నేను (మీనుండి) నాస్థలమునకు పోవుదును..." గొప్ప పురిటాన్ వ్యఖ్యత జేర్మియా బుర్రోస్ (1600-1646) ఈ వ్యాఖ్యానాలు మన పాఠ్యభాగంఫై చేసాడు, ‘నేను తిరిగి నా స్థలమునకు పోవుదును,’ అంటే, నేను మళ్లీ పరలోకానికి వెళ్లిపోతాను...నేను వారిని శ్రమపెట్టినప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాను, అక్కడ కూర్చుంటాను...వారిని లెక్క చేయనట్లు (Jeremiah Burroughs, An Exposition of the Prophecy of Hosea, Reformation Heritage Books, 2006, p. 305; note on Hosea 5:15). నాకు కచ్చితంగా తెలుసు అదే ప్రధాన కారణము గత 100 సంవత్సరాలుగా పాశ్చాత్య ప్రపంచంలో గొప్ప ఉజ్జీవాలు లేక పోవడానికి. దేవుడు మన నుండి మరుగు చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, "నేను తిరిగి నా స్థలమునకు పొవుదును, వారి తప్పులు గ్రహించేవరకు..." మీరు నాతో ఏకిభవించకపొవచ్చు, నీవు ఒక మిస్సేనరివి మాత్రమే అనవచ్చు, నాపై దృష్టి పెట్టే అర్హత నీకు లేదు అనవచ్చు. కనుక, తరువాత, గొప్ప బోధకుడు, డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ఏమన్నాడో వింటారా? ఆయన యిలా చెప్పాడు, సంవత్సరానికి పైగా క్రైస్తవ సంఘము అరణ్యములో ఉందని దేవునికి తెలుసు. మీకు 1830 లేక 1840 ముందు సంఘ చరిత్ర చదివితే, మీరు కనుగొంటారు చాలా దేశాలలో క్రమంగా ఉజ్జివాలు పది సవంత్సరాలుగా లేవు. మునుపు అలా లేదు. 1859 నుండి ఒకే గోప్ప ఉజ్జీవము చోటు చేసుకుంది. అయ్యో, నిర్జీవ కాలములో ఉన్నాం...సజీవుడైన దేవునిలో నేరవేర్పులో సమాదానములో ప్రజలు విశ్వాసము కోల్పోయి జ్ఞానము, వేదాంతము నేర్చుకోవడం వైపు మరలారు. సుదీర్ఘ సంఘ చరిత్రలో భయంకర నిర్జీవ కాలము ద్వారా పయనించాం...మనం యింకా అరణ్యములోనే ఉన్నాం. దానిలో నుండి బయటపడ్డాం అంటే నమ్మకండి, బయటపడ లేదు (D. Martyn Lloyd-Jones, M.D., Revival, 1987, Crossway Books, p. 129). అక్కడ ఉంది, నాలాంటి చిన్న మిస్సెనరీ దగ్గర కాదు, కాని ప్రముఖ తత్వవేత్త దగ్గర, ఆయన ఇరవై శతాబ్దంలో మొదటి ముగ్గురు గొప్ప బోధకులలో ఆయన ఒకడు! దేవుడు మరుగు చేసుకున్నాడు, కాబట్టి, "1859 నుండి కేవలం ఒకే పెద్ద ఉజ్జీవం చోటు చేసుకుంది," అయితే, "1830 లేక 1840 ముందు...క్రమంగా పది సంవత్సరాలకు ఒకసారైనా ఉజ్జీవాలు వచ్చేవి" (ఐబిఐడి.). ఉజ్జీవంలో నిజంగా మీకు ఆసక్తి ఉంటే మనం వెనుకకు వెళ్లి 1830 మరియు 1840 మధ్య ఏమి జరిగిందో జాగ్రత్తగా గమనించాలి. దానికి ముందు పది సంవత్సరాల కొకసారి మన సంఘాలలో ఉజ్జీవము వచ్చేది. దాని తరువాత – 1859 నుండి ఒకటే గొప్ప ఉజ్జీవము వచ్చింది! కనుక 1830 మరియు 1840 మధ్య ఏదో జరిగి ఉండాలి అది దేవుని "మరుగు చేసుకునేలా" చేసింది (హోషేయా 5:6) మరియు "[తన స్థలమునకు] మరలుట" (హోషేయా 5:15). మీకు సువార్తిక క్రైస్తవ్యము చరిత్ర తెలిస్తే, ఏమి జరిగిందో తెలుస్తుంది! చార్లెస్ జి. ఫిన్నీ! ఇది సంభవించింది! చరిత్రకారుడు డాక్టర్ విలియం జి. మెక్ లాగ్ లిన్, జూనియర్ వ్రాసాడు, అమెరికా ఉజ్జీవతలో ఆయన నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు... ఆయన సువార్తీకరణ వేదాంతాన్ని పద్ధతిని మార్చేసాడు (William G. McLoughlin, Jr., Ph.D., Modern Revivalism: Charles G. Finney to Billy Graham, The Ronald Press, 1959, p. 11). ఫిన్నీకి ముందు, బోధకులు ఉజ్జీవము దేవుని నుండి వస్తుందని నమ్మారు, ప్రతి వ్యక్తి గత మార్పు దేవుని నుండి వచ్చిన అద్భుతమని. 1735 లో జోనాతాన్ ఎడ్వర్డ్స్ అన్నాడు ఉజ్జీవము "దేవుని ఆశ్చర్యకర పని అని." 1835 కు ఫిన్నీ చెప్పాడు ఉజ్జీవము "అద్భుతము కాదని. అది వేదాంత పర ఫలితము నిర్దిష్ట కారకానికి." అంటే, "ఉజ్జీవము అద్భుతం కాదు. సరియైన పద్ధతుల ద్వారా సహజముగా వచ్చేది." అది ఆధునిక ఆంగ్లములో ఆయన చెప్పినది. జోనాతాన్ ఎడ్వర్డ్స్ ఫిన్నీలకు మధ్య తేడా ఎడ్వర్డ్ ప్రొటేస్టంట్, ఫిన్నీ సాంప్రదాయ వ్యతిరేకి, స్వప్రయత్నాలతో మనిషి మారతాడు అని నమ్మేవాడు, దేవుని కృప శక్తితో కాకుండా. అది సరికాదు ఫిన్నీ మెదడిస్ట్ వాడిని అనడం. ఫిన్నీ యొక్క నమ్మకాలు మొదటి మెథడిస్టూల నిర్ణయత్వతకు చాలా భిన్నంగా ఉన్నాయి. ఫిన్నీ ప్రసిద్ధి గాంచిన ప్రసంగము, "పాపులే వారి హృదయాలు మార్చుకోవాలి అని పేరు పెట్టబడింది" (1831). దేవుడు నెట్టబడ్డాడు, మానవుడు, తన ప్రయత్నముతో, తన మానవ నిర్ణయము ద్వారా తన స్వంత మార్పు తెచ్చుకోవచ్చు. మెథడిస్టులు, ఫిన్నీ కంటే ముందు, అది నమ్మలేదు. అయాన్ హెచ్. ముర్రే చివరకు చూపించాడు ఫిన్నీ అభిప్రాయాలు న్యూఇంగ్లాండ్ స్వతంత్రుడు నతాని యేలు టైలర్ నుండి వచ్చాయని, పూర్వపు మెథడిస్టుల నుండి కాదని (Iain H. Murray, Revival and Revivalism, Banner of Truth, 2009 edition, pp. 259-261). మెథడిస్టులు చెప్పి ఉండరు, "పాపులే వారి హృదయాలు మార్చుకోవాలి"! తన వెస్లీయన్ మెథడిజమ్ చరిత్రలో, జార్జి స్మిత్ క్రింది నిర్వచనము ఉజ్జీవమును గూర్చి ఇచ్చాడు, కాబట్టి, ఉజ్జీవము, కృప యొక్క పని దేవుని ఆత్మచే మానవుల అత్మలపై; మరియు, సహజంగా, పరిశుద్ధాత్మ సామాన్య పనులకు వేరుగా ఉంటుంది, మనష్యుల మేల్కొలుపు, మార్పిడి విషయాలలో ఎక్కువ విస్తరణలో అధిక తీవ్రతలో (George Smith, Revival, volume 2, 1858, p. 617). ఇది ప్రాచీన మెథడిస్టు నిర్వచనం ఉజ్జీవము మార్పిడిని గూర్చి. ఇది ప్రొటేస్టంట్ లేక బాప్టిస్టు తెగచే ఇవ్వబడి ఉండాల్సింది ఫిన్నీ తప్పుడు నిర్వచనం ప్రసిద్ధి అవక ముందు దేవుని సన్నివేశం నుండి తప్పించక ముందు. ఫిన్నీ తరువాత, వారికి తెలియలేదు వారు "దౌర్భాగ్యులని, దిక్కు మాలిన వారిని, దరిద్రులని, గుడ్డివారిని, దిగంబరులని" (ప్రకటన 3:17). ఫిన్నీ తరువాత, వారికీ తెలియనే లేదు దేవుడు "తనను మరుగు చేసుకున్నాడని" తిరిగి తన "స్థలమునకు పోయేనని." జార్జి స్మిత్ వ్యాఖ్యానము చూపిస్తుంది పూర్వపు మెథడిస్టులు నమ్మేవారు వ్యక్తిగత మార్పిడిలు ఉజ్జీవము పూర్తిగా దేవుని కృపపై, పరిశుద్ధాత్మ పనిపై ఆధారపడి ఉన్నాయని. ఇది ప్రొటేస్టంట్లు బాప్టిస్టులు నమ్మేవారు ఫిన్నీ సువార్తీకరణను నాశనము చేయకముందు. గొప్ప తెగల ఉద్దేశాలు ఫిన్నీ తలతిక్క ఉద్దేశానికి చాలా విరుద్ధంగా ఉన్నాయి, ఇది తన ప్రముఖ బోధలలో చెప్పబడింది, "పాపులు తమ హృదయాలు మార్చుకోవలసిందే." అది ఎలా చేస్తారు? నేను ఏడు సంవత్సరాలు ప్రయత్నించాను! అది జరగదు. అనుభవ పూర్వకంగా తెలుసు! ఫిన్నీ బలిపీఠం పిలుపు పరిచయం చేసాడు, పాపులకు చెప్పవాడు వారు ఒక నిర్ణయము తీసుకొని "అక్కడకక్కడే" రక్షింపబడవచ్చుని స్వంతంగా. డాక్టర్ మెక్ లాగ్ లిన్ చెప్పినట్టు, ఫిన్నీ "సువార్తీకరణ పూర్తి వేదాంతాన్ని పద్ధతిని మార్చేసాడు" (ఐబిఐడి.). ఈరోజు, చాలా సువార్తీకరణ విభాగాలు చెప్తున్నాయి నశించు పాపులు చేతులు ఎత్తడం ద్వారా రక్షింప బడవచ్చని, "పాపి ప్రార్ధన" చేయడం ద్వారా, లేక గుడిలో ముందుకు రావడం, "నిర్ణయ సమయములో." అలా "నిర్ణయత్వత" మత విభేద నియంత చార్లెస్ జి. ఫిన్నీ బోధల నుండి ఉద్బవించింది! నిర్ణయత్వత త్వరగా ప్రసిద్ధి గాంచింది ఎందుకంటే అది "త్వరితంగా సులభంగా ఉంది." మీరు పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండనవసరం లేదు నశించు వారి పాపపు ఒప్పుకోలు విషయంలో, క్రీస్తుకు సమీపమగుట విషయంలో. ఫిన్నీ సువార్తీకరణను సమాజంగా మార్చాడు కొత్త "క్రైస్తవులను" ఉత్పత్తి చెయ్యడానికి. కాని "సామూహికత" క్రైస్తవ్యమే కాదు! అదే గొప్ప ప్రొటేస్టంట్ బాప్టిస్టు తెగలను నాశనము చేసింది! ప్రతి "స్వతంత్రుడు" రక్షింపబడకుండా నిర్ణయం తీసుకున్నారు! అలా ప్రొటేస్టంట్ స్వతంత్రత్వము ఉద్బవించింది! అయాన్ హెచ్. ముర్రే అన్నాడు, "మార్పు మనిషి పని అనే తలంపు [భాగమైనది] సువార్తీకరణలో, ప్రజలు మరిచారు ఉత్పన్నత దేవుని పని అని, ఉజ్జీవము దేవుని ఆత్మ పని అనేది అంతరించింది. [ఇది] ఫిన్నీ వేదాంతం ఉత్పత్తి" (Revival and Revivalism, Banner of Truth, 1994, pp. 412-13). "త్వరిత సులభం" మార్గము దేవునిచే దీవించ బడలేదు. దానికి బదులు, అది మన ప్రొటేస్టంట్ మరియు బాప్టిస్టు సంఘాలను నశించు ప్రజలతో నింపేసింది. ఇప్పుడు మన బాప్టిస్టు సంఘాలలో చాల మంది నశించు వారున్నారు చాల మంది బోధకులు అనుకుంటారు ఆదివారం సాయంత్రము ఆరాధనలను మూసెయ్యాలని. నేను ఒక కాపరి భార్యను అడిగాను ఎందుకు తన భర్త సాయంత్రపు ఆరాధన ఆపేసాడని. ఆమె అన్నారు, "వారు రామని ఆయనకు చెప్పేసారు." ఇది విషాదపు పరిమాణము రక్షింపబడని ప్రజలను సభ్యులుగా మన సంఘాలలో చేర్చుకోవడం ద్వారా వారు మానవ "నిర్ణయము" తీసుకున్నందుకు. దేవుడు మనలను క్షమించు గాక! పురాతన బైబిలు, పర మార్పిడిలు లేకపోతే, మనం మునిగి పోయినట్టే! మనం మనలను చూసుకోలేము. దేవుడు మాత్రమే ఉజ్జీవము పంపగలడు. నిర్ణయత్వత దేవుని నిరాకరించి మానవుని సింహాసనంపై ఎక్కించింది. దేవుడు చెప్పాడు, "నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థత సంభవించగా, వారు నన్ను బహు శీఘ్రంగా వెదుకుదురు..." (హోషేయా 5:15). అది నిజ కారణము అమెరికాలో యునైటెడ్ కింగ్ డమ్ లో గొప్ప ఉజ్జీవము లేకపోవడానికి వంద సంవత్సరాలుగా! పాపులు దేవుని ముందు తగ్గించుకోవాలి. నిర్ణయత్వత ఎవరిని తగ్గింప నివ్వదు. పాపి "ముందుకు" వస్తాడు, అది ఒక దైర్యపూరిత పనిగా. మనం కన్నీళ్లు, విచారం, వేదన, పాపపు ఒప్పుకోలు చూడం. నా భార్య నేను చూసాం జన సమూహాలు నవ్వడం సంతోషంగా మాట్లాడడం "ముందుకు" వస్తున్నప్పుడు బిల్లీ గ్రేహం ఆఖరి కూటాలలో పసదెనా, కాలిఫోర్నియాలో, నవంబరు, 2004 లో. ఇది ఎంతో విరుద్ధం పాత ఉజ్జీవ రోజులకు, ఫిన్నీకి ముందు. 1814 లో మెథడిస్టు మీటింగ్ వివరణ వినండి. తరువాత రాత్రి, ఇంకొక కూటములో, చాల మంది పాపపు ఒప్పుకోలు పొందారు, హృదయ వేదన తరువాత [దీర్ఘ] ప్రార్ధన తరువాత క్రీస్తులో ఆశ్రమము పొందుకున్నారు...స్త్రీ పురుషులు యవనస్థులు దేవుడు లేని బ్రతుకులు బ్రతికిన వారు ఆత్మ ఒప్పుకోలుకు తేవబడి [తరువాత] గొప్ప నిశ్చయతతో దేవుడు వారిని దర్శించాడని పాప క్షమాపణ ఇచ్చాడని యేసు క్రీస్తు సుగుణాలను బట్టి సాక్ష్యం చెప్పారు (Paul G. Cook, Fire From Heaven, EP Books, 2009, p. 79). మీరు "పాపపు ఒప్పుకోలు బంధింపు పొందారా?" మీరు "అంతరాత్మ వేదన పొందారా" తరువాత "క్రీస్తులో ఆశ్రయము పొందారా"? రెవరెండ్ బ్రయాన్ హెచ్. ఎడ్వర్డ్స్ అన్నాడు, అది భయంకర పాపపు ఒప్పుకోలుతో ప్రారంభ మవుతుంది...ప్రజలు అదుపు లేకుండా ఏడుస్తారు...కాని అలాంటి దేమీ ఉజ్జీవంలో ఉండదు కన్నీరు ఒప్పుకోలు విచారము...లోతైన, అసౌకర్య తగ్గింపు పాపపు ఒప్పుకోలు లేకుండా ఉజ్జీవము లేదు...ఒక ప్రత్యక్ష సాక్షి [చైనా లో 1906 ఉజ్జీవంలో] ఇలా అన్నాడు: "భూభాగమంతా యుద్ధ భూమిలా ఉంది ఆత్మలు కృప కొరకు కేకలు వేస్తున్నాయి" (Brian H. Edwards, Revival: A People Saturated With God, Evangelical Press, 1991 edition, pp. 115, 116). మీలో కొందరు రక్షింపబడడం అలాగో "నేర్చుకుంటున్నారు." రక్షణ నేర్చుకొన బడనేరదు! అది అనుభవించాలి, అది భావన పొందాలి, నీకర అది జరగాలి అప్పుడు నీవు తెలుసుకుంటావు. ఇప్పుడు దానిని గూర్చిన నీకు తెలుసు, కాని నీవు తప్పక నీ కొరకు రక్షణ అనుభవించాలి. మొదటి భావము ఏమిటంటే నీవు పాపివని లోతైన ఒప్పుకోలు కావాలి. నీవు ఇలా మోర పెట్ట గలగాలి, "అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెప్పుడు విడిపించును?" (రోమా 7:24). డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు ఇది ఒక ఒప్పుకోలు పొందిన పాపి కేక – నేను అతనితో ఏకీభవిస్తున్నాను! ఇది జరగడం నా కళ్ళతో నేను చూసాను దేవుడు తన పరిశుద్ధాత్మను ఉజ్జీవములో పంపినప్పుడు. 1960 లో మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో ఉజ్జీవము వచ్చినప్పుడు, డాక్టర్ తిమోతి లిన్ మాతో మళ్ళీ మళ్ళీ పాడించారు, "నన్ను పరిశోదించు, ఓ దేవా, నా హృదయం తెలుసుకో: లేచి పాడండి. పాటల పేపరులో 8 వ పాట. నీ మనస్సు హృదయపు లోతైన పాపపు ఒప్పుకోలు కలిగి యున్నప్పుడు క్రీస్తు కడిగే రక్తపు ప్రాముఖ్యత నీవు గ్రహిస్తావు! డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: హోషేయా 5:6-15. |
ద అవుట్ లైన్ ఆఫ్ OUTLINE |