Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఉజ్జీవములో అదే జరుగుతుంది!

(ఉజ్జీవముపై 8 వ ప్రసంగము)
THIS IS WHAT HAPPENS IN REVIVAL!
(SERMON NUMBER 8 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, సెప్టెంబర్ 21, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, September 21, 2014


బైబిలులో అపోస్తలుల కార్యములు 8:5 తెరవండి.

"అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి, క్రీస్తును వారికి ప్రకటించుచుండెను" (అపోస్తలుల కార్యములు 8:5).

ఇప్పుడు ఎనిమిదవ వచనము చూడండి,

"అందుకు ఆపట్టణములో మిగుల సంతోషము కలిగెను" (అపోస్తలుల కార్యములు 8:8).

కూర్చోండి.

సమరయ పట్టణములో జరిగిన దానిని గూర్చిన వివరాలు నా దగ్గర ఉన్నాయి. పెంతెకోస్తు దినాన యేరూష లేములో జరిగిన దాని వలే అది ఉంటుంది. ఫిలిప్ప ప్రజలకు క్రీస్తును బోధించాడు. ప్రజలు ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. చాల మంది మారారు. "అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగెను" (అపోస్తలుల కార్యములు 8:8).

పెంతెకోస్తు దినాన కూడా అలాగే సంభవించింది! పేతురు "తన స్వరాన్ని ఎత్తి" క్రీస్తును వారికి బోధించాడు. వారు "సంతోషంగా ఆయన వాక్యము స్వీకరించారు" మారారు. అనుదిన సహవాసములో గొప్ప ఆనందము పొందారు. అదే జరిగింది చాల మంది రక్షింపబడ్డారు అపోస్తలులు బోధించినప్పుడు "యేసును బట్టి మృతులలో నుండి పునరుత్తానము" (అపోస్తలుల కార్యములు 4:2, 4). అపోస్తలుల కార్యములు చదువుట ద్వారా పెంతెకోస్తు దినాన ఏమి జరుగిందో మళ్ళీ మళ్ళీ చూడవచ్చు. మనం ముగింపుకు రావచ్చు పెంతెకోస్తు"ఒక సమయము" అనుభవము కాదని. నేను నమ్మను పెంతెకోస్తు "సంఘపు పుట్టిన రోజు" అని, కొంత మంది చెప్పునట్టు. శిష్యులు ఇతరులు పెంతెకోస్తు ముందే రక్షింపబడ్డారు. మేడ గదిలో ప్రార్ధించిన నూట ఇరవై మంది పెంతెకోస్తు ముందే, "శిష్యులుగా" మరియు "సహోదలురు"గా అపోస్తలుల కార్యములు 1:15 లో పిలువబడ్డారు. ఆ గుంపు ప్రజలు సంఘముగా పెంతెకోస్తుకు పదిరోజుల ముందే కూడుకున్నారు. కనుక, పెంతెకోస్తు రాకముందే సంఘము అప్పటికే ఉంది! కనుక, పెంతెకోస్తు "ఒక సమయ అనుభవము" కాదు, నేటి కొందరు తిరిగి రాదనీ చెప్తున్నారు. పెంతెకోస్తు లక్షణాలు అపోస్తలుల కార్యములులో చాల సార్లు చెప్పబడ్డాయి – క్రైస్తవ చరిత్ర అంతటిలో కూడా.

మరి ఎప్పుడు పెం తెకోస్తు? డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు,

అది నిజము [వాస్తవము] ప్రతి మత ఉజ్జీవము సంఘము పొందుకునేది, మళ్ళీ జరిగేదే, పెంతెకోస్తు దినాన జరిగినట్టు...ప్రతి మత ఉజ్జీవము, నేను చెప్పాను, పెంతెకోస్తు రోజున జరిగిందే...మనం [చెప్పడం ఆపెయ్యాలి] పెంతెకోస్తు రోజున జరిగింది ఒకసారికే జరిగిందని. కానే కాదు; అది ప్రారంభము మాత్రమే (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1987, pp. 199, 200).

నేను మునపటి రెండు ప్రసంగాలలో చెప్పాను ఉజ్జీవం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధత పాపపు ఒప్పుకోలు కలిగించినప్పుడు (యోహాను 16:8) మరియు, రెండవదిగా, క్రీస్తు దగ్గరకు పరిశుద్ధాత్మ పాపులను రప్పించినప్పుడు (యోహాను 16:14, 15), తద్వారా క్రీస్తు వాస్తవికంగా పాపికి చూపింపబడతాడు. గత సంవత్సరంగా ఇది నెలకు ఒకసారి మన సంఘములో జరుగుతుంది. అంటే, ప్రతి నెల ఒక వ్యక్తి మారుతున్నాడు. కాని, ఉజ్జీవము వచ్చినప్పుడు, తక్కువ కాలములో ఎక్కువ మంది మారతారు. అయాన్ హెచ్. ముర్రే అన్నాడు, "పెంతెకోస్తు నుండి, పరిశుద్ధాత్మ పనిని రెండుగా [విధాలుగా] చూడవచ్చు, సాధారణం అసాధారణము" (Iain H. Murray, Pentecost Today? The Biblical Basis for Understanding Revival, The Banner of Truth Trust, 1998, p. 18). మనం "సాధారణ" పరిశుద్ధాత్మ పనిని అనుభవిస్తున్నాము, నాలుగైదు వారాల్లో ఒక వ్యక్తి. కాని దేవుడు ఉజ్జీవము పంపినప్పుడు "అసాధారణ" సంఖ్యలో మార్పిడిలు ఉంటాయి – బహుశా తక్కువ వ్యవధిలో పది పన్నెండు (లేక ) ఎక్కువ.

నా భయం ఉజ్జీవాన్ని గూర్చి కొందరు అనుకోవచ్చు మనం చాల కష్ట పడాలని, పాపులతో ఎక్కువగా ప్రాధేయ పడాలని, సువార్తలో గట్టిగా శమించాలని. నిజంగా ఈ అభిప్రాయం మనలను ఫిన్నీ నుండి విభేదింప చేస్తుంది. సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది దేవుడు ఉజ్జీవాన్ని పంపినప్పుడు.

పెంతెకోస్తు యొక్క మొదటి ఉజ్జీవాన్ని గూర్చి ఆలోచించండి ఇది తప్పుడు అభిప్రాయమని గమనిస్తాం. మనం ఇంకా చెప్పవచ్చు అది సాతాను తలంపు అని. నశించే వారికి సరిగ్గా అలానే చెప్తుంది కదా సాతాను? ఆ తలంపులపై ఆలోచింప చేస్తంది కదా? తను అంటాడు, "నీవు రక్షింపబడితే ఇప్పటి కంటే అది చాల కష్టము. నీవు ఎక్కువ కష్ట పడాలి, నీకు విశ్రాంతి సంతోషము ఉండదు." కాని సాతాను అబద్ధికుడు. వ్యతిరేకము సత్యము! నీవు మారినప్పుడు ఇప్పటి కంటే సులభంగా ఉంటుంది! సాతాను అబద్ధికుడు. యేసు అబద్ద మాడడు! యేసు మనకు ఎప్పుడు సత్యమే చెప్తాడు! యేసు అన్నాడు, "నేను మీకు విశ్రాంతి కలుగ చేతును" (మత్తయి 11:28), యేసు అన్నాడు, "అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరికెను" (మత్తయి 11:29). అది చూద్దాం. మత్తయి 11:28-30 చూడండి. దయచేసి లేచి బిగ్గరగా చదువుదాం. స్కోఫీల్డ్ స్టడీ బైబిలులో 1011 పేజి.

"ప్రయాస పడి భారము మోసికొనుచున్న, సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగ చేతును, నేను సాత్వికుడను; దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకోనుడి: అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా, నా కాడి సులువుగా నా భారము తేలిక గాను ఉన్నవి" (మత్తయి 11:28-30).

కూర్చోండి. ఇప్పుడు పెన్ను తీసికొని 28 వచనములో ఆఖరి ఐదు పదాల క్రింద గీత గీయండి, "నేను మీకు విశ్రాంతి కలుగ చేతును." 29 వచనంలో ఆఖరి ఏడు మాటల క్రింద గీత పెట్టండి, "మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును." ముప్పై వచనం గీత కొట్టండి, "ఏలయనగా, నా కాడి సులువుగాను భారము తేలికగాను ఉన్నవి."

నేను తరుచు వింటాను మారిన వారు అనడం, "ఎందుకు, అంత సులభం ఇప్పుడు! నేను క్రైస్తవుడనైతే చాల కష్టము అనుకున్నాను. నేను యేసును నమ్మినందుకు విశ్రాంతి పొందుకున్నాను. యేసు నన్ను రక్షించి నందుకు అంతా సులభంగా ఉంది." మన పాటల ద్వారా ఆ తలంపులు! మీలో కొందరు పాడతారు, కాని అనుభవించలేదు!

నా చేతి కష్టం కాదు
   నీ న్యాయ విధులు నెరవేర్చేవి;
ఉత్సాహమున్నప్పటికిని,
   నిత్యం కన్నీరు కారినా,
నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు;
   మీరే రక్షించాలి, మీరు మాత్రమే.
("తరాల బండ, నా కై కదల్చబడు" అగస్టీన్ యమ్. టోప్లాడే, 1740-1778).
(“Rock of Ages, Cleft For Me” by Augustus M. Toplady, 1740-1778).

ఈలోకంలో నీవు కనుగొనలేక పోయావు
   చెదిరిన మనసుకు శాంతి;
క్రీస్తు నొద్దకురా, ఆయనను నమ్ము,
   సమాధానము ఆనందము పొందుకుంటావు.
ఎందుకు ఇప్పుడు కాదు? ఎందుకు ఇప్పుడు కాదు?
   యేసు నొద్దకు ఇప్పుడే ఎందుకు రాకూడదు?
ఎందుకు ఇప్పుడు కాదు? ఎందుకు ఇప్పుడు కాదు?
   యేసు నొద్దకు ఇప్పుడే ఎందుకు రాకూడదు?
("ఎందుకు ఇప్పుడు కాదు?" డానియెల్ డబ్ల్యూ. విటల్, 1840-1901).
(“Why Not Now?” by Daniel W. Whittle, 1840-1901).

యేసు అలిసిన వారిని విశ్రాంతికి పిలుస్తున్నాడు –
   ఈ రోజే పిలుస్తున్నాడు, ఈరోజే పిలుస్తున్నాడు;
మీ భారము ఆయన దగ్గరకు తెండి మీరు దీవింపబడతారు;
   ఆయన మిమ్మును త్రోసి వేయడం.
("యేసు పిలుస్తున్నాడు" ఫేనీ జె.క్రాస్స్ బి చే, 1820-1915).
(“Jesus is Calling” by Fanny J. Crosby, 1820-1915).

నా బంధకాలు, విషాదము, నిట్టూర్పు నుండి,
   యేసు, నేను వస్తాను, యేసు, నేను వస్తాను;
మీ స్వాతంత్ర్యము, సంతోషము వెలుగులోనికి,
   యేసు, నీ దగ్గరకు వస్తాను...
("యేసు, నేను వస్తాను" విలియం టి. స్లీపర్ చే, 1819-1904).
(“Jesus, I Come” by William T. Sleeper, 1819-1904).

ఓ ప్రాణమా, నీవు అలసి కలవర పడుతున్నావా?
   అంధకారంలో వెలుగు చూడలేకున్నవా?
రక్షకుని చూడడానికి వెలుగు ఉంది,
   జీవితం సమృద్ధిమైనది విడుదలైంది!
యేసు వైపు మీ దృష్టి తిప్పండి,
   ఆయన అద్భుత ముఖాన్ని పూర్తిగా చూడండి,
ఈలోక విషయాలు అంతరించి పోతాయి,
   ఆయన మహిమ కృపల వెలుగులో.
("యేసు వైపు మీ దృష్టి తిప్పండి" హెలెన్ హెచ్. లెమ్మర్ చే, 1863-1961).
(“Turn Your Eyes Upon Jesus” by Helen H. Lemmel, 1863-1961).

అలాంటి అద్భుతమైన పాటలు పాడుతూ కొనసాగగలను!

సుదినము, సుదినము, యేసు నా పాపాలు కడిగినప్పుడు!
ఎలా కనిపెట్టి ప్రార్దించాలో ఆయన నాకు నేర్పాడు, ప్రతి రోజు ఆనందంగా జీవించడానికి;
సుదినము, సుదినము, యేసు నా పాపాలు కడిగినప్పుడు!
   ("సుదినము" ఫిలిప్ డాడ్రిజ్ చే, 1702-1751).
   (“O Happy Day” by Philip Doddridge, 1702-1751).

సాతాను మీకు చెప్తుంది క్రైస్తవుడవడం కష్టమని భరించలేనిదని. కాని పాట చెప్తుంది అది ఆనంద దినము అవుతుందని! యేసు అన్నాడు, "నేను మీకు విశ్రాంతి కలుగ చేతును...నా కాడి సుళువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి" (మత్తయి 11:28, 30).

ఉజ్జీవ సమయంలో అలా ఉంటుంది! "అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను" (అపోస్తలుల కార్యములు 8:8). పెంతెకోస్తు దినాన అదే సంభవిస్తుంది. సమరయలో అదే జరిగింది. నిజ ఉజ్జీవములో అదే జరుగుతుంది. "అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను." డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ప్రతి ఉజ్జీవము...నేను చెప్తున్నాను నిజంగా అది పెంతెకోస్తు దినమున జరిగినది తిరిగి జరగడమే" (ఉజ్జీవము, ఐబిఐడి., పేజీలు 199, 200). కనుక, మనం గుర్తించుకోవాలి పెంతెకోస్తున జరిగింది, ఆ ఉజ్జీవములో జరిగిన ముఖ్య విషయాలు. మనం పెంతెకోస్తును గూర్చి ఆలోచిస్తే, మనం దేనిని గూర్చి ప్రార్దిస్తున్నమో తెలుస్తుంది, ఉజ్జీవంలో దేనిని వెదుకుతామొ.

పెంతెకోస్తు దినాన పేతురు లేచి యేవేలు గ్రంధము నుండి చెప్పాడు,

"అంత్య దినముల యందు నేను మనష్యులందరి మీద నా ఆత్మను క్రుమ్మరించెదను... నా దాసుల మీదను నా దాసు రాండ్ర మీరను నా ఆత్మను క్రుమ్మరించెదను; గనుక వారు ప్రసవించెదరు" (అపోస్తలుల కార్యములు 2:17, 18).

దేవుడు ఉజ్జీవములో "ఆయన" ఆత్మను క్రుమ్మరిస్తాడు. ఆయన అన్నాడు, "ఆ దినములలో నా ఆత్మను క్రుమ్మరించెదను." ఆధునిక తర్జుమాలు "నుండి" పదాన్ని వదిలేయడం ఆశ్చర్యం. గ్రీకు పాఠ్యములో తప్పక అది ఉంది. గ్రీకులో అపో అంటారు. పాత జెనేవా బైబిలులో, "నా ఆత్మ నుండి" అని ఉంది. కింగ్స్ జేమ్స్ లో, "నా ఆత్మ నుండి" అని ఉంది. కాని ఆధునిక తర్జుమాలో ఎన్ఎఎస్ విలో మాత్రమే అలా ఉంది. అందుకే నేను వాటిని నమ్మను. అందుకే నేను కింగ్స్ జేమ్స్ బైబిలు, స్కోఫీల్డ్ ప్రతి తెచ్చుకోమంటాను. అది మీరు నమ్మవచ్చు! ఆపాత అనువాదాలు ఆ పదాలు వదిలివేయలేదు వాటికి "శక్తి పూరిత సమానతలు" కలుపలేదు. "ఆ రోజుల్లో నా ఆత్మ నుండి క్రుమ్మరిస్తాను." స్వతంత్రుడు అంటాడు, "అది సేప్టూ డియంట్" అని. నేను అంటాను, "నటనఅని!" అర్ధ రహితము! గ్రీకు కొత్త నిభందనలో దేవుని ఆత్మ ఆ విషయాన్నే రాయించింది – ఆయన అబద్ధమాడడు! దేవుని ఆత్మ సెప్టిజింట్ ను గూర్చి చెప్పేటప్పుడు, గ్రీకు పదాలు "పీల్చబడ్డాయి" స్పూర్తితో కొత్త నిబంధనలో. "నా ఆత్మ నుండి." అది ఎందుకు అంత ప్రాముఖ్యం? ఎందుకో నేను చెప్తాను. దేవుడు ఆయన ఆత్మను అంతటిని క్రుమ్మరించలేను. మనకు కావలసినంతే ఇచ్చాడు! జార్జి స్మీటన్, 1882 లో, అన్నాడు, "అర్ధము నీడ తప్పిపోకూడదు ‘నా ఆత్మ నుండి’ (అపో) తేడా చూపిస్తుంది [ఇవ్వబడిన] దానికి [పరిమితి లేని] ఊట సంపూర్ణత" (George Smeaton, The Doctrine of the Holy Spirit, 1882; reprinted by the Banner of Truth, 1974; p. 28). అపోస్తలిక సంఘాలు పరిశుద్ధాత్మ క్రుమ్మరింపు పొందుకున్నారు ఎందుకంటే ఇవ్వడానికి ఎక్కువగా ఉంది! మూడు ఉజ్జీవాలు కళ్ళారా చూసి నేను అసాధారణంగా ఆశీర్వదింపబడ్డాను. నేను అయీన్ హెచ్. ముర్రేతో పూర్తిగా ఏకీభవిస్తాను, ఆయన అన్నాడు, "ఉజ్జీవాన్ని తిలకిస్తే మునుపు లేని దానిని గూర్చి మాట్లాడుతుంది" (ఐబిఐడి., పేజి 22). ఉత్తర ఐర్లాండ్, 1859 లో ఉల్స్ స్టర్ లో వచ్చిన ఉజ్జీవానికి ప్రత్యక్ష సాక్షి అన్నాడు, "ప్రభువు వారి మీద ఊదినట్టుగా మనష్యులు భావించారు. మొదటి దిగ్బాంతి భయం కలిగింది – తర్వాత కన్నీళ్ళలో తేలియాడారు – ఉచ్చరింప శక్యము కాని ప్రేమలో నిండి పోయారు" (William Gibson, The Year of Grace, a History of the Ulster Revival of 1859, Elliott, 1860, p. 432). ఫిబ్రవరి 29, 1860న రెవ. డి. సి. జోన్స్ అన్నాడు, "సామాన్యము కన్నా ఎక్కువ పరిమాణంలో ఆత్మ ప్రభావాన్ని చూసాం. అది ‘గొప్ప సుడిగాలిలా వచ్చింది,’ మరియు...సంఘాలు తక్కువగా ఊహించారు" (ముర్రే, ఐబిఐడి., పేజి 25). ఆ విధంగా ఉజ్జీవము వచ్చింది మొదటి సారి మూడవ సారి నేను చూసినప్పుడు. పరిశుద్ధాత్మ హఠాత్తుగా అనుకోకుండా వచ్చింది నేను బ్రతికి ఉన్నంత కాలం అది మర్చిపోలేను! ఉజ్జీవంలో జరిగిన చాల విషయాలు మీకు చెప్పగలను, డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ చెప్పిన మాటల నుండి,

వారికి దేవునిలో విశ్వాసము ఉండదు. దేవుడు వారికి వాస్తవ మయ్యాడు. దేవుడు దిగి వచ్చాడు, ఇవి, వారి మధ్యకు... ప్రతి ఒక్కరు ఆ సన్నిధి మహిమ గమనించారు (ఉజ్జీవము, పేజి 204).

దీనికి కారణంగా, సత్యాన్ని గూర్చిన, గొప్ప నిశ్చయత సంఘానికి ఇవ్వబడింది (ఐబిఐడి.).

సంఘము గొప్ప ఆనందముతో స్తుతితో నింప బడింది...సంఘము ఉజ్జీవ స్థితిలో ఉన్నప్పుడు ప్రజలను స్తుతించమని చెప్పనక్కర లేదు, వారిని ఆపలేరు, దేవునితో నింపబడ్డారు. వారి ముఖాలు అది చూపిస్తాయి. వారు రూపాంతరం చెందారు...చెప్పన శక్యము కాని "మహిమతో నింపబడ్డారు" (ఐబిఐడి., పేజి 206).

ఆరాదించాలను ప్రజలను బలవంత పెట్టనక్కర లేదు, స్తుతించమని, ప్రశంసలు, వాక్యము [వినమని]. వారు రాత్రి వెంబడి, రాత్రి వచ్చి గంటల తరబడి ఉండి, ఉదయాన్న వెళ్తారు. ఇలా ప్రత్రి రాత్రి జరుగుతుంది (ఐబిఐడి., పేజి 207).

[ఉజ్జీవంలో] అవే ప్రసంగాలు [ఇవ్వబడతాయి] కాని అవి అవే కావు. ఈ ఆత్మ శక్తి యొక్క ప్రత్యక్షత [ఉంటుంది] (ఐబిఐడి., పేజి 208).

మీ సంఘాలలో గుంపులు కావాలంటే, ఉజ్జీవం గురించి ప్రార్ధించండి! ఎందుకంటే ఉజ్జీవం వెలువడితే, గుంపులు వస్తారు (ఐబిఐడి.).

ఆయన ప్రసంగము ఆపే ముందు, వారు ఎడ్చుతూ అన్నారు, "మేమేమి చెయ్యాలి?"... వారి ఆత్మ వేదనలో ఉండి, ప్రగాఢ పాప పశ్చాత్తాపము పొందారు (పేజి 209).

నిర్ణయము ప్రశ్న కాదు ఉజ్జీవము వచ్చినప్పుడు, అదిలోతైన ఒప్పుకోలు, అది సంస్కరణము. ప్రజలు కొత్త జీవితం పొందుకుంటారు పాత జీవితాన్ని వదిలేస్తారు... కథలు చదువుతారు; ఇవి సత్యాలు. ఇది నా తలంపు కాదు, ఏదో కథ కాదు, కాని వాస్తవ విషయము (ఐబిఐడి., పేజి 209).

మారిన వారు సంఘంలో చేరారు...అలా దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు, అలా దేవుడు సంఘాన్ని సజీవంగా ఉంచుతున్నాడు...ఇది ఈ ఘడియ అత్యవసరత కాదా? అది మీరు నమ్మితే, మంచిది, విసుగక దేవునికి ప్రార్ధించండి...నేను అనడం లేదు మీ ప్రయత్నాలు అన్ని ఆపి కనిపెట్టమని. వద్దు, మీరు వెళ్ళండి... మీరు చేస్తున్నదంతా చెయ్యండి, కాని నేను చెప్తాను – ఉజ్జీవానికి ప్రార్ధించడానికి సమయం ఇవ్వాలి, దానికి ఎక్కువ సమయం ఇచ్చేటట్టు. ఎందుకంటే శక్తితో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఒక గంటలో ఎంతో జరుగుతుంది యాబై వంద సంవత్సరాలలో జరిగే దాని కంటే మీ నా తాపత్రయము ద్వారా. పరిశుద్ధాత్మ శక్తి – అది పెంతెకోస్తు దినము అర్ధము...దేవుని [కొరకు] ప్రార్ధించండి కనికరము, కృప చూపడానికి, ఆయన దీవెన కర పరిశుద్ధాత్మను క్రుమ్మరించేటట్టు (ఐబిఐడి., పేజీలు 210, 211).

దయచేసి లేచి పాటల కాగితంలో 7 వ పాట చూడండి, "యేసు, నా ప్రాణేశ్వరా" అది మొదటి గొప్ప మేల్కొలుపు కవి, చార్లెస్ వెస్లీచే వ్రాయబడింది.

యేసు, నా ప్రాణేశ్వరా, నీ బాహువులు చేరనివ్వు,
   సమీప ప్రవాహం దొర్లుతుండా, నిశ్చలత ఎత్తుగా ఉండగా:
నన్ను దాచు, ఓ నా రక్షకా, దాచు, జీవిత తుఫాను పోయే వరకు;
   సురక్షితంగా ఆకాశంలోకి; చివరకు నా ఆత్మను స్వీకరించు!

నాకు ఏ దుర్గము లేదు, నా నిస్సహాయ ఆత్మను నీకిస్తున్నాను;
   ఒంటరిగా, ఓ! నన్ను వదలొద్దు, నన్ను ఆదుకొని ఆదరించు.
నా నమ్మికంతా నీ మీదే, నా సహాయమంతా నీ నుండే;
   నీ రెక్కల నీడతో సంరక్షణ లేని నా తలను కప్పుము.

ఓ, క్రీస్తు, నువ్వే కావాలి; నీలోనే సమస్తం కనుగొంటాను;
   పడినవారిని లేపు, సొమ్మసిల్లిన వారిని చేరదియ్యి, రోగులను స్వస్థపరచు, గ్రుడ్డి వారిని నడిపించు.
న్యాయము పరిశుద్ధం నీ నామము, నేను అనీతిమంతుడను;
   తప్పులతో పాపముతో నిండియున్నాను; నీవు సత్యకృపా సంపూర్ణుడవు.

పుస్కల కృప నీలో ఉండి, నా పాపమంతటిని కప్పే కృప;
   స్వస్థపరిచే ప్రవాహము రానిమ్ము; నన్ను లోపల శుద్ధినిగా చెయ్యి.
మీ ఉబికే ఊటను, నన్ను ఉచితంగా తీసుకోనిమ్ము;
   నా హృదయాన్ని ఉత్తేజ పరచు; నిత్యత్వములోనికి నడిపించు.
("యేసు, నా ప్రాణేశ్వరా" చార్లెస్ వెస్లీచే, 1707-1788).
(“Jesus, Lover of My Soul” by Charles Wesley, 1707-1788).

మీరు యేసు నొద్దకు రావాలని నా ప్రార్ధన. చార్లెస్ వెస్లీ అన్నట్టు, యేసు నీ ఆత్మను ప్రేమిస్తున్నాడు! నీ పాపానికి వెల చెల్లించడానికి ఆయన సిలువపై మరణించాడు! ఆయన ప్రశస్త రక్తము కార్చాడు నీ పాపాలన్నీ కడిగి వేయడానికి! నీకు నిత్య జీవనం ఇవ్వడానికి ఆయన భౌతికంగా మృతులలో నుండి లేచాడు! యేసు నొద్దకు రమ్ము. యేసును నమ్ము.

ఆయననే నమ్ము, ఆయననే నమ్ము,
   ఇప్పుడు ఆయననే నమ్ము.
ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు,
   ఇప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు.
("ఆయననే నమ్ము" జాన్ హెచ్. స్టాక్ టన్ చే, 1813-1877).
(“Only Trust Him” by John H. Stockton, 1813-1877).

డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: అపోస్తలుల కార్యములు 2:40-47.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
" నీ పరిశుద్ధాత్మ, ప్రభు, ఒంటరిగా" (ఫేన్నీ జె. క్రాస్స్ బైచే, 1820-1915).
“Thy Holy Spirit, Lord, Alone” (by Fanny J. Crosby, 1820-1915).