Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఇవి ఆఖరి దినాలు!

(సంఖ్య 4 బైబిలు ప్రవచనముపై)
THESE ARE THE LAST DAYS!
(NUMBER 4 ON BIBLE PROPHECY)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, ఆగష్టు 31, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, August 31, 2014


బైబిలులో II పేతురు, మూడవ అధ్యయము, వచనము 3 తెరవండి. మనము లేచి నిలబడి II పేతురు 3:3 చదువుదాం.

"అంత్య దినములలో, అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను, గూర్చిన వాగ్దానము ఏమాయేను? అని చెప్పుదురు" (II పేతురు 3:3-4).

ఈ ఉదయము నేను మాట్లాడే విషయము, "ఇవి ఆఖరి దినాలు!" చాల సూచనలు మనకు చూపిస్తున్నాయి ఇప్పుడే ఆ సమయములో ఉన్నామని.

II పేతురు 3:3 లో వ్యక్తపరచబడిన విషయము గమనించండి, "అంత్య దినములలో." "ఆఖరి దినాలు" అనే మాటలపై దృష్టి ఉంచండి. ఈ భావనలు అంశము చాల సార్లు బైబిలులో చూస్తాము. అపోస్తలుడైన పౌలు అన్నాడు, "అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును" (II తిమోతి 3:1). అపోస్తలుడైన యాకోబు అన్నాడు, "అంత్య దినములలో ధనము కూడబెట్టితిరి" (యాకోబు 5:3). అపోస్తలుడైన యూదా అన్నాడు "అంత్యదినములయందు ధనము కాలమునందు, తమ భక్తి హీనమైన దురాశల చొప్పున...నడుచు పరిహాసకులుందురు" (యూదా 18). తిరిగి, అపోస్తలుడైన పౌలు "ఆఖరి దినాలలో" సాతాను దాడులను గూర్చి హెచ్చరించాడు (I తిమోతి 4:1). ప్రభువైన యేసు క్రీస్తు ఆఖరి దినాలలో గొప్ప జల ప్రళయానికి ముందుండే రోజులకు పోల్చి మాట్లాడాడు. క్రీస్తు అన్నాడు, "నోవాహు దినములు ఎలాగుండేనో, మనష్యు కుమారుని రాకడయు అలాగే ఉండును" (మత్తయి 24:37).

బైబిలు బోధిస్తుంది ఆఖరి దినాలు అనేవి చరిత్రలో ఉంటాయని. చాల మంది బైబిలు వేత్తలు మనము అలాంటి కాలములో ఉన్నామని అంటారు. వారి సరియే అని నేను తలస్తాను. తేదీలు నిర్ణయించడానికి బైబిలు వ్యతిరేకము. కాని ఒక కాలము ఉంది "ఆఖరి దినములు" అని. "ఆఖరి దినాలు" అంటే కొద్ది రోజులు లేక వారాలు కాదు. "ఆఖరి దినాలు" అంటే అంతమునకు ముందరి కాలము. ప్రతి సూచన సూచిస్తుంది ఇప్పుడు మనం ఆ కాలములో ఉన్నామని. కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ సువార్తికుడు లినార్డ్ రావెన్ హిల్ అన్నాడు, "ఇవి ఆఖరి దినాలు. ప్రశ్న ఏమిటంటే, అవి ఎంత కాలము ఉంటాయి?" (Leonard Ravenhill, America is Too Young to Die, Bethany House Publishers, 1979, p. 50). డాక్టర్ యమ్. ఆర్. డిహాన్ అన్నాడు, "మనం నమ్ముతాం మనం ప్రవచనము నెరవేర్పు దినాలలో ఉన్నాం" (M. R. DeHaan, M.D., The Jew and Palestine in Prophecy, Zondervan Publishing House, 1978, p. 170).

"అంత్య దినములలో, అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను, గూర్చిన వాగ్దానము ఏమాయేను? అని చెప్పుదురు" (II పేతురు 3:3-4).

పాఠ్యభాగములో తరువాత పదము "అపహాసకులు." వీరు క్రీస్తు రెండవ రాకడ అభిప్రాయాన్ని యుగ సమాప్తిని వెక్కిరిస్తారు. వెక్కిరించి నవ్వుతారు. వారు ద్వేషులు అవిశ్వాసులు. క్రీస్తు రెండవ రాకడ ఆలోచనను వ్యంగంగా చూస్తారు. యుగ సమాప్తిని గూర్చిన మాటను తిరస్కరిస్తారు. వారు దానిని "ప్రతికూల ఆలోచన" అంటారు – వారి తలంపులలో నుండి తుడిచేస్తారు.

ఎందుకు వారు అపహసించి నవ్వుతారు? తరువాత మాటలు మనకు చెప్తాయి, "స్వకీయ దురాశాలతో నడుస్తారు." వారు స్వార్ధములో పాపములో జీవిస్తారు. అందుకే క్రీస్తు రావడం వారికి ఇష్టం ఉండదు. ఆయన వారి పాపపు బ్రతుకులో జోక్యము చేసుకుంటాడని. ఈ అపహాసకులు రుజువు పరిశీలించరు. బైబిలు చదవరు. సత్యం తెలుసుకో ఇష్టపడరు – ఎందుకంటే వారు అపహాసకులు, స్వకీయ దురాశాలతో నడుస్తారు.

కొంతకాలం క్రితం యుసిఎల్ఏ లో పట్టభద్ర కార్యక్రమానికి హాజరయ్యాను. వేల మంది అక్కడ ఉంటారు. పట్టభద్ర ప్రసంగీకుడు భయపెట్టే ఘటనల జాబితా ప్రపంచంలో సంభవించేవి వివరించాడు – వాతావరణ వేడిమి, అధిక జనాబా, కల్మషము, ఆవరణ శాస్త్ర అసమతుల్యత, వర్షపు అడవుల పతనం, అణుయుద్ధపు భయము ఇరాన్ మరియు ఉత్తర కొరియా మరియు పాకిస్తాన్ నుండి, వందల జాతుల విలుప్తు, ప్రపంచ తీవ్రవాద భయము. కాని ఆయన అన్నాడు, "విధి ప్రవక్తలను నమ్మవద్దు. ప్రపంచము అంతము అవదు." అవి ఆయన మాటలు! ఆయన అన్న మాటలు కాగితముపై వ్రాసుకొని నా జేబులో పెట్టుకున్నాను! ఆ భయపెట్టే పరిస్థితులన్నీ చెప్పి, ఆయన అన్నాడు, "ప్రవచనము అంతము అవదు. విధి ప్రవక్తలను నమ్మవద్దు." నా పాఠ్య భాగము ఆలోచించకుండా ఉండలేక పోయారు,

"అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి...తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయేను? అని చెప్పుదురు" (II పేతురు 3:3-4).

ఆ పట్టభద్ర బోధకుడు అన్నాడు, "ప్రపంచము అంతమవదని." 1965 లో బారి మెక్ గ్యూర్ పాట ఇలా అంది, "మీరు నమ్మరు మనం నాశన సమయంలో ఉన్నామని." అప్పుడు నమ్మాను, ఇప్పుడు నమ్ముతాను! మనం "ఆఖరి దినాలలో" ఉన్నాం వియత్నాం యుద్ధానికి ముందే. 1948 లో ఇశ్రాయేలు దేశము జన్మించింది. 1949 లో కమ్యునిష్టులు చైనాను తీసుకున్నారు. 1950 లో మౌన యుద్ధం న్యూ క్లియర్ హలో కాస్ట్ స్థాయికి పెరిగింది. 1963 లో అధ్యక్షుడు కెన్నెడి తుపాకితో తలలో పేల్చబడ్డాడు. తరువాత మెల్కొమ్ X కాల్చబడ్డాడు. తరువాత డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్. తరువాత బాబి కెన్నెడి. రాక్ సంగీతము మారక ద్రవ్యాలు తరాన్నంతటిని ఊపేశాయి. పరిస్థితులు అలాగ లేవు. మనం సంస్కృతి అనాది నుండి మారుతుంది. లినార్డ్ రావెన్ హిల్ అన్నట్టు, "ఇవి ఆఖరి దినాలు. ప్రశ్న ఏమిటంటే, ఎంత కాలము ఈ రోజులు ఉంటాయి?"

శిష్యులు తెలుసుకోవాలనుకున్నారు లోకాంతము ఎప్పుడు వస్తుందని, యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది. సూచనిమ్మని క్రీస్తును అడిగారు. చాల సూచనలిచ్చాడు, మత్తయి 24 లో రాయబడ్డాయి, సమాంతర పేరాలో, లూకా 21 లో. మత్తయి 24 క్రీస్తు జవాబును చూపిస్తుంది; అంతానికి చెందిన చాల సూచనలు ఇస్తుంది. లూకా 21 ఇంకా ఎక్కువ సూచనలు ఇచ్చింది. ఈ ఉదయము లూకా 21 లో క్రీస్తు ఇచ్చిన సూచనలపై నేను దృష్టి సారిస్తాను. "నీ రాకడను, ఈ యుగ సమాప్తికి సూచనలేవి?" (మత్తయి 24:3). లూకా ఇరవై ఒకటవ అధ్యాయములో క్రీస్తు చాల వాటికి జవాబు లిచ్చాడు.

I. మొదటిది, పర్యావరణ సూచనలున్నాయి.

యేసు అన్నాడు ఇలా ఉంటుందని

"గొప్ప భూకంపములు...అక్కడక్కడ వస్తాయి, మరియు తెగుల్లను కరువును తటస్థించును; మరియు భయంకరమైన దృశ్యాలు... మరియు అస్తిరత్వంతో దేశాల భూమి బాధ, మహా భయోత్పాతములతో పుట్టును; భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరమగును; జనములకు శ్రమయు కలుగును, లోకము మీద రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనష్యులు ఎదురు చూచురు దైర్యము చెడి కూలుదురు" (లూకా 21:11, 25-26).

అది ఆలోచించండి! యేసు అన్నాడు మనష్యులు హృదయాలు ఆగిపోతాయి జరిగేది చూస్తుంటే "భూమిపై." ఆయన అన్నాడు లోకం జరిగే దానిని బట్టి నిస్పృహ నిరుత్సాహం ఉక్రోశం గొప్ప భయం కలుగుతుంది,

"లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయము" (లూకా 21:26).

ఉత్తర భాగం కరగడం, వాతావరణ మార్పు ప్రభావము చూస్తే, భయము కలుగుతుంది. మీరు ఎయిడ్స్ ఉపద్రవం ఆఫ్రికాను అంతు లేకుండా నశింప జేయడం గ్రహిస్తే, వినాశకరమైన తెలుసుకున్నప్పుడు – ఇది భయపెట్టే ఉంది. అది భయ కంపితం యాంటి బయాటిక్ ను తట్టుకొనే టిబి, కొత్త "పెనుభూత" రోగాలు, ఎబోలా, లాంటివి ఏమందుకు లొంగనిది చూస్తే – అది భయ కంపితం.

ఆశ్చర్యం లేదు చాల మంది యువకులు భవిష్యత్తును గూర్చి చింతిస్తున్నారు. ఇటీవల పోల్ చూపిస్తుంది 80 శాతము యవనస్థులు మంచి భవిష్యత్తు ఉందని అనుకోవడం లేదు. అది చూపిస్తుంది ఈ యవనస్థులు తరుచు చింత పడతారు పర్యావరణ సమస్యలను గూర్చి, ఉత్తర భాగం కరగడం, ప్రపంచ మంతటా దాటి భయంకర పర్యవసానాలు!

పర్యావరణములోని సమస్యలు రోజు వార్తా పత్రికలలో వచ్చేవి మనలను భయపెడతాయి. ఇవి శూచనలు యుగ సమాప్తి, క్రీస్తు రెండవ రాకడకు, సమీపంగా ఉన్నాయని.

II. తరువాత, రెండవదిగా, యూద దేక్షణ సూచనలున్నాయి.

చాల మంది యూదులను, ఇశ్రాయేలు దేశాన్ని ద్వేషిస్తారు. న్యూయార్క్ లోని మెట్రో పొలిటాన్ ఒపేరా ఒక ఒపేరా, "క్లింగ్ హోఫర్ మరణము" ప్రదర్శింపబోతుంది. అది చూపిస్తుంది పాలస్తీనా ఉగ్రవాది చక్రాల కుర్చీలో 69 సంవత్సరాల యూదుని చంపడం. స్వతంత్ర యోధులని ఈ ఉగ్రవాదులు నిస్సహాయ యూదుని చంపడం చేసారు. ప్రధాన ఉగ్రవాది పాడతాడు, "ఎక్కడైతే పేదవారు కూడుకుంటారో, యూదులు పుష్టిగా అవడం చూస్తారు. మీకు తెలుసు సామాన్యులను మోసగించడం [మరియు] మోసపోయిన వారిని అప్రతిష్ట పరచడం... అమెరికా ఒక పెద్ద యూదురాలు." నేను మిమ్ములను వేడుకుంటున్నాను ఈ యాంటి సెమిటిక్ ఒపేరాను ప్రతి ఘటించాలని పీటర్ గెల్బకు పిగెల్బ్@ మెట్ఒపేరా.ఆర్గ్ కు (pgelb@metopera.org) ఈ మెయిల్ పంపడం ద్వారా. గెల్బ్ గారు న్యూయార్క్ పట్టణంలో మెట్రో పొలిటాన్ ఒపెరాకు అధికారి. ఫోన్ చేసి "క్లింగ్ హోఫర్ మరణమును" రద్దు చేయమని అడగండి. (ఈ వార్తా అంశము యూదా ప్రమాణము, ఆగష్టు 19, 2014 నుండి తీసుకొనబడినది). యూదుల యాంటి సెమెటిక్ ద్వేషము ప్రపంచ సమస్య. యేసు అన్నాడు,

"యోరూష లేము దుండ్లు చేత చుట్టబడుట [చుట్టూ చక్కర్లు] మీరు చూచినప్పుడు, దాని నాశనము సమీపమైయున్నదని తెలుసుకోనుడి [సమీపమై]" (లూకా 21:20).

యూదులను ద్వేషించుట ఆఖరి దినాలలో బలంగా తయారవుతుంది యూదులను నశింప చేయడానికి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా గొప్ప అన్య సైన్యాలు లేస్తాయి. హిట్లర్ యూదులను నిర్మూలించాలని ప్రయత్నించారు. ఆయన తప్పిపోయాడు ఎందుకంటే యూదులు భూమిపై దేవునిచే ఎన్నుకొనబడిన వారు. బైబిలు చెప్తుంది,

"ఆ దినమందు నేను యోరూష లేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును" (జెకర్యా 11:28).

బైబిలు నమ్మే అందరు బాప్టిస్ట్ ఇజ్రాయెల్ బలమైన మద్దతుదారులు ఉన్నాయి. మేము యూదు ప్రజలు మరియు ఇజ్రాయెల్ యొక్క స్థితి నిలబడటానికి అవ్వాలి. కానీ బైబిల్ నమ్మలేదు ప్రపంచంలో గత రోజుల్లో యూదులకు వ్యతిరేకంగా పరిణమిస్తుంది బోధిస్తుంది. బైబిలు చెప్తుంది,

"నేను మీరు అన్ని ప్రజలు జెరూసలేం బరువుగా రాతి చేస్తుంది" (జెకర్యా 12: 3).

అది అప్పుడు జరుగుతుంది. ఈ యుగంతములో మనం జీవిస్తున్నాం అనడానికి అది ఒక సూచన. క్రైస్తవ ప్రజలు ఇశ్రాయేలు యూదులు పక్షంగా నిలబడాలి "ఆఖరి రోజుల" పెరుగుచున్న అంధకారములో.

III. తరువాత, మూడవదిగా, మతపర సూచనలున్నాయి – అబద్దపు మతములోని మోసము సూచనలు.

యేసు అన్నాడు,

"మీరు మోసపోకుండా చూచుకోనుడి: అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించెననియు చెప్పుదురు…మీరు వారి వెంబడి పోకుడి" (లూకా 21:8).

తిరిగి క్రీస్తు అన్నాడు:

"అబద్ధపు క్రీస్తులనుఅబద్ధపు ప్రవక్తలను వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని; సహితము మోస పరచుటకై, గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెను" (మత్తయి 24:24). …

టిబిఎన్ లో మీరు చూసే చాల విషయాలు మోసము. చాల సువార్తిక కార్యక్రమాలు మోసపూరితము తికమక పెట్టేవి. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"ఎందుకనగా జనులు హిత భోదను సహింపక; దురద చెవులు గల వారి తమ స్వకీయ దురాశాలకు అనుకూలమైన బోధకులను, తమ కొరకు పోగు చేసుకొందురు" (II తిమోతి 4:3).

IV. నాల్గవదిగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా హింస సూచనలుంటాయి.

ప్రపంచమంతటా క్రైస్తవులు హింసింపబడడం జరుగుతూ ఉంది అత్యధికంగా. ఉదాహరణకు, నిజ క్రైస్తవులు చైనాలో సహస్య దిగువ అంతస్తులో "ఇంటి సంఘాలలో" కలుసుకోవాలి. వందలాది చైనీయ క్రైస్తవులు వారి విశ్వాసమును బట్టి జైలులో పెట్టబడ్డారు, ప్రత్యేకించి సంస్కృతి విప్లవంలో. ప్రతి దినము వార్తా పత్రికలలో ముస్లీం జీహాదీలు భయపెట్టే క్రైస్తవులను చంపడం చూస్తున్నాం. యేసు ఊహించాడు ఈనాటి ప్రపంచ మంతటా ఉండే క్రైస్తవులు చిత్ర హింసలు. యేసు అన్నాడు,

"వారు మీపై చేతులు వేసి, మిమ్మును బలాత్కారంగా పట్టి, సమాజ మందిరమునకు …చెరసాలకును అప్పగించి హింసింతురు" (లూకా 21:12).

ఆయన అన్నాడు మారని తల్లిదండ్రులు బంధువులు నిజ క్రైస్తవులైన వారి స్వంత పిల్లలను హింసిస్తారు. ఒక యవ్వన ముస్లీం క్రైస్తవుడైతే అలా తరుచు జరుగుతుంది. ఇక్కడ అమెరికాలో ఎక్కువగా జరగడం చూసాం. క్రీస్తు అన్నాడు:

"తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపింతురు...నా నామం నిమిత్తం మీరు మనష్యులందరి చేత ద్వేషింప బడుదురు" (లూకా 21:16-17).

వెలకట్టండి! నీవు నిజ క్రైస్తవుడవైతే ఇతరులు ఇష్టపడరు! ఇతరులు వ్యతిరేకులవుతారు! ఈ అంధకార దినాలలో నిజ క్రైస్తవుడగుట వెలతో కూడినది! మనం ఆఖరి దినాలలో ఉన్నాం అనడానికి అది ఒక సూచన.

V. ఐదవదిగా, క్రీస్తు మనకు ఇచ్చాడు వాటిని మానసిక సూచనలు అని పిలువవచ్చు.

క్రీస్తు అన్నాడు:

"మీ హృదయములు [శ్రద్ద] కదిలిపోయిన ఉంటుంది, ఒకవేళ తిండి వలనను [భారంగా, లేదా డౌన్ ప్రాధాన్యత]తో...[ద] మత్తు వలలను [ఆందోళనను] ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందు నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును" (లూకా 21:34-35).

ఒక యవనస్థుడు గుడికి వచ్చేవాడు అన్నాడు, "వచ్చే ఆదివారము నేను గుడికి రాలేను. నేను నా పిన్నికి సహాయపడాలి." ఇంకా ఆరు రోజులుంది, కాని "అది" ఆదివారం ఉదయం జరగాలి. జీవిత సమస్యలతో బరువెక్కాడు. చాల మంది చిన్న అవివేకపు కారణాలతో గుడి మానేస్తారు. జీవిత సమస్యలతో బరువెక్కారు. తీర్పు దినము తెలియకుండా వారి మీదికి వస్తుంది. దేవుని తీర్పు పడినప్పుడు వారు సిద్ధంగా ఉండరు!

మీరు మత్తు పదార్ధాలు శృంగారం మానేయవచ్చు, కాని పనితో భవిష్యత్తుతో మునిగి ఉండవచ్చు, "ఈ జీవితపు చింతలు" నిన్ను పీల్చేస్తాయి. చాల సంవత్సరాలుగా యవనస్థులకు సంభవించడం నేను చూస్తున్నాను.

ఇంకా యేసు ఇలా అన్నాడు:

"కాబట్టి మీరు జరుగబోవు, వీటి నెల్లను తప్పించుకొని, మనష్యు కుమారుని యెదుట నిలువ బడుటకు శక్తి గల వారుగునట్లు, ఎల్లప్పుడును ప్రార్ధన చేయుచు మెలకువగా ఉండుడి" (లూకా 21:36).

అది మీరు చెయ్యాలి యుగంతానికి సిద్ధంగా ఉండడానికి, రాబోవు తీర్పుకు. రెండు పనులు మీరు చెయ్యాలి:

(1) తిరిగి గుడికి రండి. మీరు తిరిగి రాకపోతే మీకు మేము సహాయపడలేదు.

(2) క్రీస్తు దగ్గరకు రండి. నీ పాపానికి ప్రాయశ్చిత్తము చెల్లించడానికి ఆయన చనిపోయాడు. ఆయన వాస్తవంగా శారీరకంగా మృతులలో నుండి లేచాడు. దేవుని కుడి పార్శ్వ మందు సజీవుడై ఉన్నాడు. ఆయన నీకున్నాడు. ఆయన దగ్గరకు రా ఆయన స్వ రక్తముతో నీ పాపాలు కడిగివేస్తాడు.

VI. ఆరవదిగా, క్రైస్తవ ప్రేమ లేకుండా సంఘలుండడం అనే సూచన ఉంది.

శిష్యులు ఆయనను అడిగారు,

"ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమీ?" (మత్తయి 24:3).

మత్తయి 24 లో క్రీస్తు ఇచ్చిన సూచన ఇది – లోకంలో చాల ప్రాంతాలలో సంఘాలు నశించు వారి కొరకు నిజ ప్రేమ లేదు. క్రైస్తవ్యము కనికరము, స్నేహభావము, ప్రేమ లేకుండా ఉంది. ఆయన రాకడను గూర్చి యుగ సమాప్తి గూర్చి అడిగినప్పుడు, యేసు అన్నాడు,

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ [పెరుగుతాయి] చల్లారును" (మత్తయి 24:12).

చాల సంఘాలు వారిని దర్శించడానికి వచ్చిన వారి పట్ల చల్లగా ఉన్నారు. చాల కష్టం వాస్తవంగా గుడులలో స్నేహితుని కనుక్కోవడం. దేవుడు మనకు సహాయం చెయ్యాలి! దేవుని ఆత్మ శక్తి లేకుండా మన స్వంత సంఘము ఇతర సంఘముల వలే స్నేహించకుండా ప్రేమించకుండా ఉంటుంది!

"అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:12).

దేవుని సన్నిధి లేని గుడి నశించు వారి పట్ల ప్రేమ కలిగి ఉండదు. నశించు వారి కొరకు ప్రేమ లేనిది చనిపోవు సంఘము, ఎన్ని తలుపులు తట్టినా, ఎన్ని బస్సులు నడిపినా, ఎంత సువర్తీకరణ చేసినా! అది చనిపోవు సంఘాలు ఎందుకంటే వారిలో చాల తక్కువ క్రైస్తవ ప్రేమ ఉంది.

దేవుడు మన సంఘాన్ని కాపాడాలి "ఆఖరి దినాలలో" ప్రేమ రహిత క్రైస్తవ్యముచే కొట్టుకొని పోకుండా. ప్రతి సందర్శకుడు రాకుమారుని వలే పరిగణింపబడాలి, కొన్ని నెలలు వచ్చే వారిని రాజుగా చోడాలి, ప్రార్ధనలో మన ప్రతి ఒక్కరం శ్రమించాలి దేవుని ప్రేమతో మన సంఘము నింప బడునట్లు పాపుల కొరకు. లేకపోతే ఒక రోజు మన గుడిని గూర్చి కూడా ఇలా చెప్పబడవచ్చు,

"జీవించు చున్నావన్న పేరు మాత్రమున్నది, కాని నీవు మృతుడవే" (ప్రకటన 3:1).

నశించు వారి పట్ల ఈ వారంలో ఉత్సాహముతో వెళ్ళు. వ్యక్తిగత సువార్త నుండి బుధవారం మరియు లక్షివారం రాత్రికి ఎక్కువ పేర్లు తెస్తే వారికి ఫోన్ చేసి గుడికి ఆహ్వానించవచ్చు. మీరు స్వంతంగా సువార్త కొరకు వెళ్ళినప్పుడు ఎక్కువ పేర్లు తీసుకొని రండి. ఎక్కువ పేర్లు ఫోన్ నంబర్లు తెండి – సమీక్షించడానికి, గుడికి వచ్చి క్రీస్తు సువార్త వినేటట్టు చెయ్యడానికి.

కాని అది నిజ సువార్తకు ఆరంభము మాత్రమే. చివరకు వారు గుడికి వస్తే వారిని ప్రేమించి, మన సంఘలోకి సహవసములోనికి వచ్చేట్టు సహాయ పడాలి. ఆరాధన అయిపోయాక ఏ ఒక్కరం ఒంటరిగా నిలబడ కూడదు. కళ్ళు భాగా తెరిచి మన సంఘములో వారికి సహవాసము పొందునట్లు సహాయ పడాలి. వారమంతా గట్టిగా ప్రార్ధించండి వారి పట్ల మీరు ఎక్కువ ప్రేమ చూపేటట్టు.

నిరీక్షణ లేని వారికి ఇవి కష్ట తర భయపెట్టే దినాలు. మా ప్రార్ధన మీరు యేసు నొద్దకు రావాలని సిలువపై నీకు బదులుగా ఆయన మరణము ద్వారా మీరు పాప క్షమాపణ పొందాలి. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీరు సమాధానము పొందాలని మా ప్రార్ధన! మా ప్రార్ధన వచ్చే వారం కూడా మీరు తిరిగి గుడికి రావాలని దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా, రక్షణను గూర్చి ఎక్కువ నేర్చుకోవాలిని! డాక్టర్ చాన్, ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: II పేతురు 3:3-9.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
      "నాశన సందర్భము" (బేరి మెక్ గ్యూర్ చే, 1965)/"ఈలాంటి సమయాలలో" (రూట్ కెయి జోన్స్ చే, 1902-1972).
     “The Eve of Destruction” (by Barry McGuire, 1965)/ “In Times Like These” (by Ruth Caye Jones, 1902-1972).


ద అవుట్ లైన్ ఆఫ్

ఇవి ఆఖరి దినాలు!

(సంఖ్య 4 బైబిలు ప్రవచనముపై)
THESE ARE THE LAST DAYS!
(NUMBER 4 ON BIBLE PROPHECY)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"అంత్య దినములలో, అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను, గూర్చిన వాగ్దానము ఏమాయేను? అని చెప్పుదురు" (II పేతురు 3:3-4).

(II తిమోతి 3:1; యాకోబు 5:3; యుదా 18; I తిమోతి 4:1; మత్తయి 24:37, 3)

వారు తప్పు ఎందుకంటే చాల సూచనలు తెలుపుతున్నాయి అంతము సమీపముగా ఉందని!

I.     మొదటిది, పర్యావరణ సూచనలున్నాయి, లూకా 21:11, 25-26.

II.    రెండవదిగా, యూద దేక్షణ సూచనలున్నాయి, లూకా 21:20; రోమా 11:28; జెకర్యా 12:3.

I. మూడవదిగా, అబద్దపు మతపర సూచనలున్నాయి, లూకా 21:8; మత్తయి 24:24; II తిమోతి 4:3.

నాల్గవదిగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా హింస సూచనలుంటాయి, లూకా 21:12, 16-17.

ఐదవదిగా, క్రీస్తు మనకు ఇచ్చాడు వాటిని మానసిక సూచనలు, లూకా 21:34-35, 36.

ఆరవదిగా, క్రైస్తవ ప్రేమ లేకుండా సంఘలుండడం అనే సూచన ఉంది; మత్తయి 24:3, 12; ప్రకటన 3:1.