ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఉజ్జీవములో పరిశుద్దాత్మ యేసును మహిమ పరుచును! (ఉజ్జీవముపై 6వ ప్రసంగము) డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "ఆయన నా వాటిలోనిది తీసికొని: మీకు తెలియ చేయును, గనుక నన్ను మహిమ పరుచును" (యోహాను 16:14). |
కొన్ని సార్లు ప్రజలు నన్ను అడుగుతారు మీరు ఎలా చెప్పగలరు ఒక గుడి లేక మతపర గుంపు తప్పా కదా అని. నేను మీకు ఒక నియమావళి ఇస్తాను దానిని నా జీవితమంతా ఉపయోగించాను. క్రీస్తును మహిమ పరచని ఆత్మ దేవుని ఆత్మ కాదు. అది తాళము! ఆ విధంగా చెప్పవచ్చు తప్పుడు ఆత్మకు సత్య ఆత్మకు మధ్యగల తేడాను! ఒక కారణాన్ని బట్టి నేను చెప్ప గలుగుతున్నాను తప్పుడు ఆత్మకు సత్య ఆత్మకు మధ్య గల తేడాను. దాని పేర్లు షరతులు లేని ఎన్నిక నుండి ఉన్నాయి – ఎందుకంటే నేను భేదించిన తెగల నుండి నేను పెరిగాను! అయినా నాకు తెలుసు, రక్షింపబడక మునుపే, యేసును గూర్చిన చెప్పిన పరీక్షను గూర్చి అని. వారు యేసును మహిమ పరిచారా లేదా? యేసు పరిశుద్ధాత్మను గూర్చి ఇది చెప్పాడు – "ఆయన నన్ను మహిమ పరచును." దురదృష్టవశాత్తు పదము "మహిమ పరచు" వ్యవహారిక ఆంగ్లము నుండి విడువబడింది. గ్రీకు పదము అనువాదము "మహిమ పరచుటకు" అంటే "హెచ్చించు, ఘనపరచు, స్తుతించు." యేసు పరిశుద్ధాత్మను గూర్చి అన్నాడు – "ఆయన నన్ను స్తుతించి, హెచ్చించి నన్ను మహిమ పరుస్తాడు." పోల్చే మత విద్యార్ధివి కానవసరం లేదు ఏ గుంపు అలా చెయ్యదో చెప్పడానికి! వివిధ తెగలు చెప్తాయి యేసు ఆత్మకంటే తక్కువగా చేయబడ్డాడని. ఖురాను ఆయనను ప్రవక్తగా ఎంచింది. మొర్మోమును ఆయనను సృష్టింపబడినదిగా, సాతాను సహోదరునిగా చేస్తారు. వేదాంత స్వతంత్రత, ఆయనను కేవలము బోధకునిగా చేసాయి. ఇవే మీ కూడ యేసును అరాదించవు దేవునిగా సృష్టి కర్తగా, త్రిత్వములో రెండవ వ్యక్తిగా, మానవాళి రక్షకునిగా! ప్రతి తెగ, ప్రతి అబద్ద మతము, ప్రతి క్రైస్తవ వేర్పాటు, యేసును తక్కువగా చూపిస్తాయి. పడత్రోయబడిన అన్ని "ఆత్మలలో" కేవలము పరిశుద్దాత్మ యేసుకు మహిమను యిస్తుంది, ఆయనకు చెందవలసిన స్తుతి హెచ్చింపు, చూపిస్తుంది. కనుక, మళ్ళీ చెప్పాలి, ఏ ఆత్మ అయితే యేసును నిత్యత్వపు తండ్రిగా మహిమ పరచదో, అది దేవుని ఆత్మ కాదు. ఆయనను దేవుడు అని ఎవరు చెప్తారో, యేసు కంటే పరిశుద్దాత్మ ఎక్కువ అని ఎవరు చెప్తారో, వారు భయంకరంగా వేదాంత పొరపాటుకు భిన్న మత అవలంబనకు దగ్గరగా ఉంటాయి! యేసు క్రీస్తు ప్రభువే ఇలా చెప్పాడు, "ఆయన నా వాటిలోనిది తీసికొని: మీకు తెలియ చేయును, గనుక నన్ను మహిమ పరుచును" (యోహాను 16:14). మనలను తండ్రి దగ్గరకు తీసుకు వెళ్ళడానికి యేసు వచ్చాడు. కాని పరిశుద్దాత్మ మనలను యేసు నొద్దకు నడిపించడానికి వచ్చింది. అందుకే మీరు తప్పక పరిశుద్దాత్మను కలిగి యుండాలి. ఆయన మిమ్ములను యేసు నొద్దకు ఆహ్వానిస్తాడు, యేసు మిమ్ములను తండ్రితో ఐక్య పరుస్తాడు. త్రిత్వములోని ముగ్గురు పాప రక్షణకు అవసరము. రక్షణ వైపు తండ్రి నిన్ను నడిపిస్తాడు. కుమారుడు సిలువపై పాప ప్రాయశ్చిత్తం చేస్తాడు, పరిశుద్దాత్మ కుమారుని నీకు బయలు పరుస్తాడు! ఆయన రక్తములో కడగడానికి నడిపించు కుంటాడు; తండ్రికి, కుమారునికి, పరిశుద్ధత్మకు మహిమ, "ఆయన నా వాటిలోనిది తీసికొని: మీకు తెలియ చేయును, గనుక నన్ను మహిమ పరుచును" (యోహాను 16:14). చూడండి ఎంత అద్భుతంగా త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు కలిసి పని చేస్తున్నారో! తండ్రి కుమారుని మహిమ పరచును. పరిశుద్ధాత్మ ప్రభువైన యేసును మహిమ పరచును. పరిశుద్ధాత్మ ప్రభువైన యేసు తండ్రిని ఘన పరుస్తారు! ఈ ముగ్గురు ఒకటే, కలిసి ఉన్నారు, నశించు పాపుల రక్షణ నిమిత్తము కలిసియున్నారు! పరిశుద్ధాత్మ పనిని గూర్చి ఈ రాత్రి చూద్దాం. ఆయన శక్తి కాదు ప్రభావము కాదు. ఆయన దేవుడు. మనము ఆయనను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడని మాట్లాడాలి. ఆయన లేకుండా ఏవిధమైన వాస్తవ మార్గంలో కూడ యేసును మనం ఎరగలేదు. పరిశుద్ధాత్మ ఏమి చేస్తుందో మీరు ఆలోచించాలని నా ఆశ. యేసు అన్నాడు, "ఆయన నన్ను మహిమ పర్చును: నా నుండి పొందుకొనును, మీకు తెలియ చేస్తాడు." డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, ఈ వచనాన్ని గూర్చి, పరిశుద్ధాత్మ "యేసుని గూర్చి మాట్లాడడానికి ప్రభువైన యేసును బయలు పేర్చడానికి పరిశుద్ధాత్మ వచ్చాడు" (The Son of God, A Commentary on John, Sword of the Lord Publishers, 1976, p. 321; note on John 16:14). పరిశుద్ధాత్మ యేసును మనకు బయలు పరచడానికి వస్తాడు. బోధకులుగా మనకు అది ప్రాముఖ్య విషయంగా ఉండాలి. మనం పరిశుద్ధాత్మతో పాటు పని చెయ్యాలి ప్రభువైన యేసును తెలుసుకోడానికి! చాల విషయాలు తెలియకుండానే పరలోకానికి వెళ్తాం. బైబిలు ప్రవచనము ఎక్కువగా తెలియకుండా, సాతానుమయము, శాస్త్రము, రాజకీయాలు తెలియకుండా మనం రక్షింపబడవచ్చు. కాని యేసును ఎరుగకుండా పరలోకానికి వెళ్ళలేం! జాన్ వెస్లీ చెప్పింది నాకు ఇష్టం ఆయన మెథదిస్టు బోధకులకు చెప్పింది, "విషయాలన్నీ వదిలేయండి. ఆత్మల సంపాదనకు మీరు పిలువబడ్డారు." ఆమెన్! పరిశుద్ధాత్మ మన బోధను దీవిస్తాడు మన ముఖ్య ప్రసంగము యేసు క్రీస్తుపై కేంద్రీకృతమయితే! అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, "సిలువ వేయబడిన క్రీస్తును మేము బోధిస్తాం...దేవుని శక్తి అయిన క్రీస్తు, దేవుని జ్ఞానము" (I కొరిందీయులకు 1:23, 24). "అతిశయించు వాడు, ప్రభువు నందే అతిశయింపవలెను" (I కొరిందీయులకు 1:31). గ్రిఫిత్ గారు ఇప్పుడే పాడారు అందమైన పాత జర్మను పాట, "ప్రాతః కాలము ఆకాశములను ఎదుర్కొన్నప్పుడు," ప్రాతః కాలము ఆకాశములను ఎదుర్కొన్నప్పుడు, నా హృదయము ఆర్త నాదము చేస్తుంది: అప్పుడు, కూడ, పరిశుద్ధాత్మ యేసును సామాన్యులకు బయలు పరచాడు. "ఆయన నా దగ్గర పొందుకొని, మీకు ఇస్తాడు." అవును, "మీకు"! తర్ఫీదు లేని వారి వద్దకు, బైబిలు పాఠశాలకు కాని సెమినరీకి వెళ్ళని వారి యొద్దకు ఆయన వస్తాడు! ఎక్కువగా తర్ఫీదు పొంది, యేసును ఎరగని వారు నాకు తెలుసు! నిజ మార్పిడిలో, పేదవారు, విద్య విహీనులు, పరిశుద్ధాత్మచే యేసు నొద్దకు నడిపించబడుచున్నారు. మార్పులలో, ఒకరి తరువాత ఒకరు యేసు నొద్దకు నడిపింపబడతారు. ఉజ్జీవములో చాల మంది యేసు నొద్దకు గుంపుగా, తక్కువ కాలములో నడిపింపబడ్డారు! పరిశుద్ధాత్మ పన్నెండు మంది పేద జాలరులను తీసుకొని, ఒకరి తరువాత ఒకరిని యేసును బయలు పరిచాడు. వారు అపోస్తలులు. కాని పెంతేకొస్తు దినమున, పరిశుద్ధాత్మ 3,000 మందిని యేసు నొద్దకు నడిపించాడు! ఓ, మనం ప్రార్ధించాలి పది పదిహేను మంది మన గుడికి వచ్చేవారు, యేసు నొద్దకు నడిపించబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా యేసు వారికి బయలు పర్చబడాలి! ఆయన క్రీస్తును మహిమ పరచాలి క్రీస్తు విషయాలు మీకు చూపింపబడాలి. అప్పుడు మీరు ఇలా పాడగలరు, పని స్థలములో వలే ప్రార్ధించి బాగు చేసుకుంటాను: అంతే కాదు, పరిశుద్ధాత్మ యేసును రక్షకునిగా బయలు పరుస్తాడు. అది అర్ధం చేసుకోవడం నాకు కష్టమయింది. నేను నమ్మలేక పోయాను రక్షణ బోధ నేను ఎన్నడు వినలేదు. కాని నా బుర్ర మసగలో ఉంది. నేను యేసును హత సాక్షిగా భావించాను. ఆయనను సిలువ వేసిన వారిపై నేను కోపబడ్డాను. వారు ఎందుకు ఈ గొప్ప మంచి వ్యక్తిని చంపాలి? యేసును అబ్రహాము లింకన్ లాంటి ముందరి వ్యక్తిగా తలంచాను. యేసు గొప్ప మంచి వ్యక్తి ఆయన మంచితన్నాన్ని బట్టి చంపబడ్డాడు. లింకన్ ను చంపిన వ్యక్తి ఆయనను శుభ శుక్రవారం రోజున, యేసును సిలువ వేసిన రోజున కాల్చి చంపాడు. కనుక, యేసును గూర్చి అలా అనుకొనేవాడిని. ఆయన గొప్ప బోధకుడు, పాప రహితుడు. నేను అనే వాడిని ఆయన "రక్షకుడు" అని, కాని దాని అర్ధము నాకు తెలియదు. నమ్మని యూదుల వలే పౌలు చెప్పినట్టు, "ముసుగు" నా హృదయంపై వేసుకున్నాను, నామనసు నుండి రక్షకుని దాచిపెడుతూ (II కొరిందీయులకు 3:15). మంచిగా ఉంటూ క్రైస్తవునిగా ఉండడానికి ప్రయత్నించాను, నన్ను ఎక్కువగా అర్పించుకుంటూ. నాకు గుర్తుంది డాక్టర్ టామ్ డూలే జాక్ పార్ చే "ఈ రాత్రి" కార్యక్రమములో ఇంటర్వు చెయ్యబడడం. ఆయన కేథలిక్ వైద్య మిస్సనరీ లాఓస్ వియత్నంలకు. ఆయన ఒక పుస్తకాన్ని వ్రాసాడు "వారు పర్వతాన్ని తగుల బెట్టిన రాత్రి" కమ్యునిస్టులను గూర్చి వియత్నాం పర్వతాలలో ఉన్న క్రైస్తవులను గూర్చి. నాకు తేటగా గుర్తింది, "అదే చెయ్యాలనుకున్నాను. నేను ఒక మిస్సనేరీగా కావాలనుకున్నాను. ఒక మిస్సెనరీగా ఆయనను వెంబడించి అప్పుడు క్రైస్తవుడనవుతాను." అది నా బుర్రలోనుండి పోలేదు. యేసును గొప్ప మానవ సేవ చేసి క్రైస్తవుడనవుతాను! యేసును గూర్చి నేను పూర్తిగా అంధుడను. క్రీస్తు ఉదాహరణ వెంబడించడం ద్వారా నన్ను నేను కచ్చితంగా రక్షించు కోగాలను. అపోస్తలుడైన పౌలు నన్ను వివరించాడు ఇలా చెప్పి, "మా సువార్త మరుగు చేయబడిన యెడల, నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడియున్నది" (II కొరిందీయులకు 4:3). ఇప్పుడు నేను ఎంత అంధుడనని ఆశ్చర్యపోతుంటాను! కాని పరిశుద్ధాత్మ ముసుగు తొలగించింది, ఆయన క్రాంతి ప్రకాశించింది, రక్షకునిగా యేసును చూసాను! అప్పుడు మాత్రమే సువార్తకు అర్ధం ఉంటుంది! "ఆయన నా వాటిలోనిది తీసికొని: మీకు తెలియ చేయును, గనుక నన్ను మహిమ పరుచును" (యోహాను 16:14). చివరగా, పరిశుద్ధాత్మ యేసు ప్రేమ కృపలను మనకు చూపిస్తాడు. క్రీస్తు ప్రేమ కృపలను పాపినైన నా పట్ల చూపించడం, పరిశుద్ధాత్మడే నాకు బయలు పరిచాడు. అప్పుడు నేను మొదటగా రక్తము ప్రాముఖ్యత చూసాను. అంతకు ముందు, అది హత సాక్షి రక్తము, లింకన్ రక్తము వలే, డాక్టర్ కింగ్ రక్తము, లేక హత సాక్షి మిస్సేనరీ రక్తము. కాని నేను పరిశుద్ధాత్మచే మేల్కొల్పబడినప్పుడు, నా హృదయములో గ్రహించాను, "రక్తము దానిలో నున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును" (లేవియా కాండము 17:11). "ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింప బడుచున్న నిబంధన రక్తము" (మత్తయి 26:28). నేను రక్షింపబడినప్పుడు, నేను వెంటనే క్రీస్తు మహిమ యుక్త రక్తము చూసాను. నేను ఆయన రక్తములొ స్నానము చేసాను! ప్రతి రోజు "శుభ శుక్రవారము" వలే ఉండేది ఎందుకంటే నేను నడుస్తూ జీవిస్తూ పడుతూ ఉండేవాడిని యేసు రక్తమును గూర్చి! ఈ పాత సువార్త పాటను నా గొంతు పోయే వరకు పాడాను! సిలువపై నా రక్షకుడు చనిపోయిన చోట, "ఆయన నా వాటిలోనిది తీసికొని: మీకు తెలియ చేయును, గనుక నన్ను మహిమ పరుచును" (యోహాను 16:14). ఓ, నేను ఎలా ప్రార్ధించాలి మీకు పరిశుద్ధాత్మ రక్షకుని రక్తము చూపించాలని! మీరు అది చేస్తే ఆలోచించడం ఆపరు! క్రీస్తు రక్తమును గూర్చి పాడడం ఆపరు దేవుని ఆత్మ అది మీకు చూపించినప్పుడు! హల్లెలూయ! మీరు రక్షకుని నమ్మిన క్షణమే మీరు ఇలా పాడగలరు, శక్తి, శక్తి, అద్భుత పనిచేసే శక్తి ఉంది నాకు తెలుసు యేసు రక్తమును గూర్చిన, ఈ విషయం విపరీతంగా వింతగా విడ్డూరంగా ఉండొచ్చు, రక్షింపబడని వారికి. కాని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యేసు నొద్దకు ఆకర్షిస్తాడో, ఆయన రక్తముతో మీ పాపాలు కడగబడినప్పుడు – ఆయన రక్తమును గూర్చి పాడతారు ఆయన రక్తమును గూర్చి మాట్లాడుతారు జీవిత కాలమంతా! హల్లెలూయా! ఈ ప్రసంగములో ఇంకా ఎంతో చెప్పాలనుకున్నాను, కాని ఇక్కడ ఆపేయాలనిపిస్తుంది. మనం ప్రార్ధించి ఉపవసిస్తున్నాం ఉజ్జీవములో గొప్ప పరిశుద్ధాత్మ తరంగాన్ని దేవుడు పంపాలని. కాని ఉజ్జీవము అంటే ఏమిటి? నేననుకుంటాను డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ మంచి జవాబు ఇచ్చాడు. ఆయన అన్నాడు, "ఉజ్జీవము, అంతటినే మించి, దేవుని కుమారుడైన, ప్రభువైన యేసు క్రీస్తును మహిమ పరచడం. అది సంఘ జీవితానికి అది పునరుద్ధరణ" (Revival, Crossway Books, 1987, p. 47). ఆయన సరిగ్గా చెప్పాడనుకుంటున్నాను. "ఉజ్జీవము...దేవుని కుమారుడైన ప్రభువైన, యేసు క్రీస్తు మహిమ పరచడం." అదే విషయాన్ని మన పాఠ్య భాగము తెలియచేస్తుంది, "ఆయన నా వాటిలోనిది తీసికొని: మీకు తెలియ చేయును, గనుక నన్ను మహిమ పరుచును" (యోహాను 16:14). ఒక మార్పిడిలో, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి యేసును కనుగొని ఆయనను మహిమ పరిచేటట్టు చేస్తుంది, ఆయన ఘన పరిచేటట్టు, "గొప్పగా" చెప్పడం, ఆయనను గూర్చి పాడడం! ఉజ్జీవములో, పరిశుద్ధాత్మ ఎక్కువ మంది యేసును చూసేటట్టు చేస్తుంది, ఆయనను మహిమ పరిచి, ఘన పరిచి, "గొప్పగా" చెప్పి, ఆయనను గూర్చి పాడి, ఆయన యందు నివసించి – సిలువపై ఆయన త్యాగము, ఆయన రక్తముపై, మన పాపాలు క్షమింపబడి కడగబడడానికి. గత వంద సంవత్సరాలలో క్రీస్తు రక్తమును గూర్చిన సువార్త పాటలు వ్రాయబడ లేదు! ఎందుకు? ఎందుకంటే మనం దీర్ఘ, చీకటి కాలము ద్వారా వెళ్ళాలి ఉజ్జీవం లేకుండా. బోధకులు ఇప్పుడు అనుకుంటారు ఉజ్జీవము పరిశుద్ధాత్మ ఉంది అని. కాని వారు తప్పు. వారు తప్పు అని మన పాఠ్య భాగము చెప్తుంది. "ఆయన నా వాటిలోనిది తీసికొని: మీకు తెలియ చేయును, గనుక నన్ను మహిమ పరుచును" (యోహాను 16:14). నిజంగా యేసు క్రీస్తుని గూర్చి బోధించే అవసరం చాల ఉంది! నిజంగా మీరు యేసు క్రీస్తును గూర్చి ఎక్కువ ఆలోచించండి! నిజంగా ప్రతి రక్షింపబడని వ్యక్తి యేసును ముఖాముఖిగా చూసేటట్టు తీసుకు రావాలి, ఎందుకంటే ఆయన ఒక్కడే మీ పాపాలు క్షమించి, జీవిత దుర్భరత నుండి రాబోవు నరక అగ్ని నుండి రక్షిస్తాడు! నిజంగా, మన సంఘాలకు అవసరం ఎక్కువ పాటలు ఎలా డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, మన దగ్గర ప్రేమను గూర్చి కొలతలేని దాని గూర్చిన కథ ఉంది. నాతో చరణం పాడండి, ఓ, కృపా నది ప్రవహిస్తుంది, మీరు యేసు ప్రేమను పోగొట్టుకొంటే, ఏదీ మీకు సహాయము చెయ్యలేదు! యేసు సిలువ కోల్పోతే, ఏదీ మిమ్ములను ఆదరించలేదు! యేసు రక్తము కోల్పోతే, ఏదీ మిమ్ములను రక్షించ లేదు! యేసు నొద్దకు రండి. ఆయనను నమ్మండి. ఏదీ మీకు సహాయము చెయ్యదు! "ప్రభువైన యేసు నందు విశ్వాస ముంచుము, నీవు రక్షింపబడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31). డాక్టర్ చాన్, దయచేసి వచ్చి మనలను ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: యోహాను 16:7-15.
|
|