Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




అప్పుడు వారు ఉపవాసము చేతురు

(ఉజ్జీవముపై 4వ ప్రసంగము)

THEN SHALL THEY FAST
(SERMON NUMBER 4 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, ఆగష్టు 10, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, August 10, 2014

"పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి, కొనపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను" (లూకా 5:35).


మత్తయిని శిష్యునిగా యేసు పిలిచాడు. మత్తయి తన ఇంటిలో గొప్ప విందు చేసాడు. "చాల మంది పెద్దలు పాపులు వచ్చారు" విందులో యేసు దగ్గర కూర్చొన్నారు (మత్తయి 9:10). పరిశయ్యాలు అది చూచి చెడ్డవారితో ఎందుకు భోజనము చేస్తున్నాడని యేసును అడిగారు. యేసు అన్నాడు, "నేను నీతిమంతులను పిలువ రాలేదు, పశ్చాత్తాపపడు పాపుల కొరకే" (మత్తయి 9:13). నీతి మంతులమని అనుకొనే వారి కొరకు ఆయన రాలేదు. పాపుల్ని ఎరిగిన వారి కొరకు వచ్చాడు.

బాప్మిస్మమిచ్చు యోహాను శిష్యులు విందు రోజున యేసును ప్రశ్నించడానికి వచ్చారు. వారడిగారు ఎందుకు వారు, పరిశయ్యాలు, తరుచు ఉపవసిస్తారో – కాని ఆయన శిష్యులు ఉపవసించుట లేదు. యేసు అన్నాడు,

"పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం, పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు, వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను" (లూకా 5:34-35).

యేసు ఉద్దేశము ఆయన శిష్యులు ఉపవసించడం ఆయన శిష్యులకు సరి పోదు – ఎందుకంటే ఆయన వారితో ఉన్నాడు. ఆయనను "పెండ్లి కుమారునిగా" పిలుచుకొని విందును యూదుల వివాహానికి పోల్చాడు. యేసు అన్నాడు ఆయన త్వరలో "వారి యొద్ద నుండి కొనిపోబడతాడు" (లూకా 5:35). ఆయన ఉద్దేశము పరలోకానికి ఆరోహణమవుతాడని – అప్పుడు వారు ఉపవాసము చేస్తారు.

"పెండ్లి కుమారుడు, వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను" (లూకా 5:35).

ఇప్పుడు, క్రీస్తు పలికిన ఆ మాటలపై దృష్టి పెట్టండి,

"ఆ దినములలో వారు ఉపవాసము చేతురు" (లూకా 5:35).

డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు,

వారి శ్రమల దినములు, ఆత్మీయ శక్తి కొరకు ఎదురు చూచుట [యేసు] వారి యొద్ద నుండి కొనిపోబడిన తరువాత వచ్చును, అప్పుడు వారు ఉపవాసముంటారు. [మాటలు "అప్పుడు వారు ఉపవాసము చేస్తారు"] సూచిస్తుంది శిష్యులు ఉపవాసము చేసి ఉంటారు పెంతే కోస్తూ ముందు యేసు కొనిపోబడిన తరువాత (అపోస్తలుల కార్యములు 1:12-14). పౌలు అలాగే ఉపవసించాడు, పరిశుద్దాత్మ శక్తి కొరకు (అపోస్తలుల కార్యములు 9:9, 11, 17). తరువాత బర్నబాసు, పౌలు ఇతర బోధకులు ఉపదేశకులు ఉపవసించారు ప్రార్ధించారు దేవుని ముందు కనిపెట్టారు, అపోస్తలుల కార్యములు 13:1-3 (John R. Rice, D.D., King of the Jews, Sword of the Lord Publishers, 1980 edition, p. 144).

బైబిలు వేషధారణ ఉపవాసాన్ని ఖండిస్తుంది, కాని యదార్ధ ఉపవాసాన్ని కాదు. బైబిలు తేటగా చెప్తుంది క్రీస్తే స్వయంగా అరణ్యంలో ఉపవాసము చేసాడని ఆయన పరిచర్య ప్రారంభింపక ముందు (మత్తయి 4:1, 2). మూడు సువార్తలలో (మత్తయి, మార్కు, మరియు లుకాలలో) యేసు మాటలు’ వ్రాయబడ్డాయి, "ఆదినాలలో వారు ఉపవాసము చేయుదురు." మనం ఇంకా "ఆదినాలలో" జీవిస్తున్నాం – అది క్రీస్తు ఉపదేశము మనకు – "ఈ దినములలో" మనం ఇంకా ఈ రోజులలో జీవిస్తున్నాం. డాక్టర్ జె. వెర్నాన్ మెక్ గీ అన్నాడు, "నేడు ఉపవాసాన్ని నిజమైన విలువ ఉంది...ఏ అభిప్రాయముతో ఉపవాసము ఉండాలంటే దేవుని ముందు సాష్టాంగ పడుతున్నాం మనకు ఆయన కృప సహాయము కావాలి కనుక" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, p. 53; note on Matthew 9:15).

స్పర్జన్ అన్నాడు, "ప్రార్ధన ఉపవాసములకు గొప్ప శక్తి ఉంది" ("విఫలతకు రహస్యము"). అది నిజమని నాకు తెలుసు. మొదటి ఉజ్జీవములో నేను చూసాను, ప్రార్ధనలో మునిగి, తినడం కూడా మర్చి పోయారు. వందలాది మంది మూడు సంవత్సరాలలో మారారు. మూడవ ఉజ్జీవములో నేను చూసాను, బోధకుడు ఉపవసించి ప్రార్ధించడానికి బలవంతము చేయబడ్డాడు రోజంతా అప్పుడు ఆదివారము సాయంత్రము ఆరాధనలో ఉజ్జీవము వచ్చింది. 500 మంది మారారు, ఆ రాత్రి నుండి మూడు నెలలు కొనసాగింది. స్వానుభవము మీద తెలుసు స్పర్జన్ సరియే అని ఆయన అన్నప్పుడు, "ప్రార్ధన ఉపవసములకు గొప్ప శక్తి ఉంది." కాని డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ అన్నాడు, "ఈ విషయం [ఉపవాసము] మన జీవితాల నుండి తొలగింపబడింది, క్రైస్తవ ఆలోచన నుండి కూడ" (కొండ మీద ప్రసంగముపై పఠనము, ఎర్దమాన్స్, 1987, పేజి 39). డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "ఉపవాసము పోయిన విద్య, తక్కువ సాధన చేయబడినది, తక్కువ నేర్పబడింది, మనం ఆలోచించాలి...ఉపవాసము అర్ధాన్ని" (John R. Rice, D.D., Prayer – Asking and Receiving, Sword of the Lord Publishers, 1970 edition, p. 216). ఉపవాసాన్ని గూర్చి డాక్టర్ రైస్ క్రింది విషయాలు చెప్పాడు.

1.  ఉపవాసమనగా దేవుని ముందు పెట్టుట. ప్రపంచములోని సమస్తానికి మన వెనుక భాగము చూపించి దేవుని ముఖాన్ని వెదకాలి. అలాంటి సమయము ఉపవాసము ప్రార్ధన.

2.  ఉపవాసము అంటే హృదయమంతా ప్రార్ధనకిచ్చి దేవుని కొరకు కనిపెట్టడం. కనుక ఉపవాసము నిజంగా దేవునిని ముందుంచడం, ఆహారము కంటే దేవుని ఎక్కువగా కోరడం.

3.  ఉపవసమనగా ప్రార్ధనలో పట్టుదల. శిక్షించుకోడానికి ఉపవాసముంటే అర్ధం లేదు, ప్రార్ధన చెయ్యకుండా. ఉపవాసములో పట్టుదలతో కూడిన, ప్రార్ధన కలిసి ఉండాలి.

4.  ఉపవాసము చూపిస్తుంది ఒక వ్యక్తి యదార్ధత నమ్మకము దేవుడు జవాబిస్తాడని. ప్రార్ధన నిలకడలేనిది. అందుకే చాల ప్రార్ధనలకు జవాబు దొరకదు. ఉపవాసము చూపిస్తుంది మనం చాల పట్టుదలగా ఉన్నామని జవాబు పొందడానికి (ఐబిఐడి., పేజీలు 218-220).


డాక్టర్ రైస్ చెప్పాడు ఉపవాస ప్రార్ధన ద్వారా మనం దేవుని నుండి పొందుకొనేవి (ఐబిఐడి., పేజీలు 220-227).

1.  కష్ట కాలంలో సహాయం ఉపవాస ప్రార్ధన ద్వారా వస్తుంది. కష్టకాలము ప్రార్ధించడానికి మంచి సమయము. కష్టం నిజంగా చెడ్డదైతే, ఉపవాసముతో ప్రార్ధించడం మంచిది.

2.  కొన్ని సార్లు మనం ఏది తప్పు, దేవుని ఏది సంతోష పెట్టదు తెలుసుకోడానికి ఉపవాసించి ప్రార్ధించాలి.

3.  ఉపవాసము ప్రార్ధన పాపముపై జయమిస్తుంది. మొదటి ఉజ్జీవములో నేను చూసాను, యవనస్థులు దేవుని సంతోష పరచడానికి, ఒకరితో ఒకరు బాహాటంగా పాపాలు ఒప్పుకొనేవారు. ఉజ్జీవంలో కొన్నిసార్లు అలా జరుగుతుంది. పాపముపై గొప్ప విజయం వచ్చింది, ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు.

4.  ఇతరుల కొరకు విజ్ఞాపన చెయ్యడానికి ఉపవాసము ప్రార్ధన సహాయ పడతాయి. ఇతరులు రక్షింపబడాలని ప్రార్దిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి కోసం ఒకసారి ప్రార్ధించాలి, సామాన్యంగా కాదు, "ఓ, దేవా ఎవరినైనా రక్షించు అని కాదు." పేరు పెట్టి ఉపవాస ప్రార్ధన చెయ్యాలి. ఎవరి కొరకైనా ప్రార్ధించాలనుకుంటున్నారా? అప్పుడు ఆ వ్యక్తి కొరకు దేవుని నుండి జవాబు వచ్చు వరకు ప్రార్ధించు! పాత పాట ఇలా చెప్తుంది,


జవాబు వచ్చేవరకు ప్రార్ధిస్తూ ఉన్నామా?
నీ విశ్వాస ప్రకటనకు ఒక నిజ వాగ్ధానముంది;
ప్రార్ధనా స్థలములో ప్రభువు నీ కొరకు ఎదురు చూస్తాడు,
అక్కడ ఆయనను కలిశావా, ప్రార్ధించుము?
జవాబు వచ్చే వరకు ప్రార్ధించావా?
రక్షకుని నామములో గోజాడావా?
దేవుడు జవాబిచ్చే వరకు ప్రార్ధించావా,
జవాబు వచ్చే వరకు ప్రార్ధించావా?
   ("అంతా ప్రార్ధించావా?" రెవ. విలియం సి. పూలే, 1875-1949;
      కాపరిచే మార్చబడినది).

నేను రక్షింపబడినప్పుడు, 1960 లో, జాన్ వెస్లీ జర్నల్ ప్రతి రోజు చదివేవాడిని. అపోస్తలుల కార్యములా ఉండేది. గొప్ప ఉజ్జీవము "మొదటి గొప్ప మేల్కొలుపును" గూర్చి చెప్పబడింది. 22 సంవత్సరాల, వాడిని. అప్పుడు వంద సంవత్సరాలు ఉజ్జీవము లేదని నాకు తెలియదు. నేననుకున్నాను, "వెస్లీ రోజుల్లో అలా జరిగితే, దేవుడు ఇప్పుడు కూడ చేయగలడు!" నా అమాయకత్వము నన్ను సందేహ పడనివ్వలేదు నేను సభ్యునిగా ఉన్న చైనా గుడికి దేవుడు ఉజ్జీవము పంపగలడని. ఉజ్జీవము పంపాలని దేవునికి ఉపవాస ప్రార్ధన చేసాను. ప్రతి బుధవారం రాత్రి ప్రార్ధన కూటములలో జనం రాకముందు, నేను ఉజ్జీవము కొరకు ప్రార్ధించాను. ఒకసారి మార్ఫీ లమ్ భోజనము ముందు ఆశీర్వాదం కొరకు ప్రార్ధించాలని చెప్పాడు. లేచి నిలబడి పది నిమిషాలు ఉజ్జీవము కోసం ప్రార్ధించాను! ఆహారం కొరకు ప్రార్ధించకుండా కూర్చున్నాను! అన్నిసార్లు ఉజ్జీవము కొరకే ప్రార్ధించి, పొరపాటు చేసి ఉంటాను! కొంతమంది అన్నారు, "సరే, చిన్నబ్బాయి, నేర్చుకుంటాడు!" ఒకరోజు, ఉదయము, ఇంకా నిద్రిస్తుండగా, దేవుడు జవాబిచ్చాడు! ఆ అద్భుత ఉజ్జీవము మర్చిపోలేను అది గుడిని కుదిపేసింది, వందల కొలది చైనా యువకులు వచ్చి రక్షింపబడ్డారు.

సంవత్సరాలు గడిచే కొలది ఎలా ప్రార్ధించానో మర్చిపోయాను. ఒకరోజు డాక్టర్ లమ్ నాతో అన్నాడు, "బాబు, నీకు గుర్తుందా 1960 ప్రారంభంలో ఉజ్జీవము కొరకు ఎలా ప్రార్ధించే వాడివో?" అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. డాక్టర్ లమ్ చెప్పాడు, "బాబు, నీవు పొందుకున్నావు!" గ్రహింపక కన్నీళ్లు వచ్చాయి, మొదటిసారి, దేవుని ఆత్మకోరకు "సరిగా ప్రార్ధించాను" అని అనిపించింది!

ఇంకొక సారి, చాల మంది యువకులు సెమినరీలో నా గదిలో దేవునికి ప్రార్ధిస్తున్నారు నమ్మని అధ్యాపకులను మార్చమని లేక తొలగించమని. అది జరగాలని చాల మందిమి ఉపవాసముండి ప్రార్ధించాము. ప్రార్ధన కూటము ఆఖరిలో, 100 మంది విద్యార్ధులు నా గదికి వచ్చారు, చాల మంది హాలులో, మిగిలిన వారు కిటికిలో. 35 సంవత్సరాలు గడిచాయి, మేము ఎలా ఉపవసించి ప్రార్ధించామొ మర్చిపోయాను. ఆ రోజు కనుగొన్నాను ఆఖరి స్వతంత్ర అధ్యాపకుడు పోయాడు – ప్రతి కొత్త అధ్యాపకుడు బైబిలు నమ్మారు, చాల మంది సంస్కరింపబడ్డారు! ప్రతివారం నా గదిలోనికి వచ్చే యువకులు సరిగ్గా ప్రార్ధించారు! దేవుడు మా ప్రార్ధనలకు జవాబిచ్చాడు మేము ఊహించిన దానికి మించి!

జవాబు వచ్చే వరకు ప్రార్ధించావా?
రక్షకుని నామములో మొరపెట్టావా?
దేవుడు జవాబిచ్చే వరకు ప్రార్ధించావా,
జవాబు వచ్చే వరకు ప్రార్ధించావా?

భార్య కొరకు చాల సంవత్సరాలు కనిపెట్టాను. నేను నలబై సంవత్సరాలుపై బడ్డాను. కాపరి భార్య ఎలా ఉండాలో నాకు తెలియదు. భార్య కొరకు చాల ప్రార్ధించాను. అవును, ఉపవాసముండి ప్రార్ధించాను! ఒక రాత్రి గదిలో చూసాను ఇలియానాను. దేవుడు చెప్పాడు, "నీవు ఆమె కొరకు ప్రార్ధించావు!" కొందరన్నారు, "ఆ యవనస్థురాలిని నువ్వు పెల్లాడవు, కదా?" కాని నేను చేసుకున్నాను. ఆమె పరిపూర్ణ కాపరి భార్య – సంపూర్ణంగా పరిపూర్ణము! నేను భాగా ప్రార్ధించాను – దేవుడు జవాబిచ్చాడు.

ఇంకా మూడు చెప్తాను. ఎవరు అనుకోలేదు నా అమ్మ రక్షింప బడుతుందని. నేను అస్సలు అనుకోలేదు. నేను ప్రార్ధించే వాడిని, కాని నిరాశతో. అయినా ప్రార్ధించాను. అమ్మ మారాలని ఉపవసించి ప్రార్ధించాను. ఆమెకు ఇప్పుడు 80 సంవత్సరాలు, రక్షణకు సమీపంగా లేదు. ఇలియానా నేను న్యూయార్క్ లో ఉన్నాం, ప్రత్యేక కూటాల్లో మాట్లాడుతున్నాను. నేనేక్కడున్నానో గుర్తుంది. ఆ కూటం కోసం ఉపవసించి ప్రార్ధిస్తున్నాను. ఒక సమయంలో, నా తల్లి రక్షణ కొరకు ప్రార్ధించాను. అకస్మాత్తుగా దేవుడు నాతో మాట్లాడాడు. స్పష్టంగా లేకున్నా, ఆయన స్వరమే. దేవుడు నాతో చెప్పాడు, "నీ తల్లి ఇప్పుడు రక్షింపబడుతుంది." కన్నీళ్ళతో, లాస్ ఎంజిలాస్ లో ఉన్న డాక్టర్ కాగన్ కు ఫోన్ చేసాను. నేనన్నాను, "డాక్టర్, మీరు వెళ్లి నా తల్లిని క్రీస్తు నోద్దకు నడిపిస్తారా?" ఆయన అన్నాడు, "ఓ, నేను అలా చెయ్యలేను!" – అలాంటి మాటలు – ఎందుకంటే అమ్మ అతనికి పిచ్చి ఎక్కించింది గతంలో. నేనన్నాను, "డాక్టర్ వెళ్ళు, దేవుడు ఇప్పుడే నాతో చెప్పాడు అమ్మ ఇప్పుడు రక్షింపబడుతుందని." సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆయన కారులో వెళ్లి చాల సులభంగా అమ్మను క్రీస్తు నొద్దకు నడిపించాడు! అబ్బాయిలు చెప్తారు ఆమె జీవితం పూర్తిగా మారిపోయిందని! ప్రతి రాత్రి నాతో పాటు, గుడిలో ఉండేది జీవితాంతము! నా తల్లి కొరకు ప్రార్ధించ గలిగాను! దేవుని కృపను బట్టి, జవాబు వచ్చే వరకు ప్రార్ధించాను!

ఇంకొక విషయము. ఇవన్నీ, ఉపవాస ప్రార్ధన వలననే. అవును, ఉపవాసానికి చాల ప్రాముఖ్యత ఉంది! నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, మాకు మంచి, వైద్యుడు లేడు. ఆయన అనుమతి కూడ పోయింది. శిశువును చూడడానికి అల్ట్రా సౌండ్ కొరకు తన దగ్గరకు వెళ్ళాం. తరువాత డాక్టర్ కూర్చోబెట్టి చెప్పాడు, శిశువు అంగ వైకల్యుడని. ఇంకొక చిత్రము తీసుకొని సోమవారము ఆఖరి జవాబు చెప్తానన్నాడు. ఆ శుక్రవారము మధ్యాహ్నము ఇంటికి వెళ్ళాం అంగ వైకల్య శిశువు ఆలోచన నన్ను పిచ్చి వాడిని చేసింది. కాని, అలవాటుగా, అది నిజం కాకూడదని ఉపవాసముండి ప్రార్ధించాను. ఆరాత్రి దేవుడు కలలో కనిపించాడు. అది పూర్తిగా నిజం, నా భార్య నడగండి! దేవుడు కళ్ళలో కనబడి చెప్పాడు, "రోబర్ట్, నీ భార్యకు కవల పిల్లలు – వైద్యుడు అందుకు తికమక పడ్డాడు." మరుసటి ఉదయం లేచినప్పుడు, నేను ఇలియానాతో అన్నాను, "చింత పడవద్దు. నీకు కవల పిల్లలు." సోమవారం తిరిగి వెళ్ళాం, వైద్యుడు మళ్ళీ కూర్చోమన్నాడు. నేనన్నాను, "నేను కూర్చోనవసరము లేదు. ఆమెకు కవలలు." ఆయన అన్నాడు, "మీకు ఎలా తెలుసు?" నేనన్నాను, "దేవుడు నాకు శుక్రవారము రాత్రి కలలో చెప్పాడు." కాబట్టి, ఈ ఇద్దరు పెద్ద కొడుకులు ఇవ్వబడ్డారు, పూర్తిగా ఆరోగ్యంగా, ప్రార్ధనకు జవాబుగా.

ఇది ఆఖరిది. నేను చాల ఇవ్వగలను, కాని దీనికే సమయముంది. అది గత రాత్రి పెద్ద బైబిలు సదస్సు. గుడి నిండిపోయింది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకులు ఉన్నారు. కాపరి ఆదివారము రాత్రి చివరి ప్రసంగము ఇవ్వమన్నాడు. నా దగ్గర సామాన్య సువార్త ప్రసంగము ఉంది. ఆ ఉదయము ఒక యవకుని అడిగాను రాత్రి ఏమి బోధించాలి అని. అతడు అన్నాడు, "ఏదైనా సరే, సువార్త ప్రసంగము బోధంచవద్దు. కాపరి ప్రతి ఆదివారం సువార్త ప్రసంగము బోధిస్తాడు, రాత్రికి వచ్చేవారంతా ఇప్పటికే రక్షింపబడి ఉంటారు. ఏదైనా సరే, కాని రక్షణ సువార్త రాత్రి బోధింపవద్దు!"

వసతి గృహానికి తిరిగి వెళ్లి ఇలియానాతో చెప్పను పిల్లలను బయటకు తీసుకెళ్ళమని చెప్పాను మధ్యాహ్నం ఒంటరిగా గడపడానికి. నా దగ్గర కేవలం సామాన్య సువార్తిక ప్రసంగము ఉంది. నిలబడ్డాను. చెమట పట్టింది. దెయ్యం నాతో చెప్పింది నన్ను నేను అవివేకినవుతానని అందరి ప్రసిద్ధ ప్రసంగీకుల ముందు. వెనుక ముందు అయ్యాను. నేను ఉపవాసములో ఉన్నాను! ఇంకొక ప్రసంగము సిద్ధ పడ ప్రయత్నించాను, కాని చెయ్యలేక పోయాను. నాకు తేటగా తెలుస్తుంది నేను తప్పక ఆ సామాన్య చిన్న సువార్తిక ప్రసంగమే చేయాలని. ఇద్దరు లేక ముగ్గురు "ముందుకు" వచ్చేలా దేవునికి ప్రార్ధించాను. నేనన్నాను, "దయచేసి, దేవా, ఆ పెద్ద బోధకుల ముందు అవమానం పాలు కాకుండా చెయ్యండి!" అప్పుడు దేవుడు చెప్పినట్టు అనిపించింది, "నీవు వారి కోసం బోధిస్తున్నావా, నా కోసమా?" నేనన్నాను, "దేవా, మీ కోసం నేను బోధిస్తాను, వారి కోసం కాదు. నేను ఒక బుద్ధి హీనుడనైనా పరువాలేదు, మీ కోసమే నేను బోధిస్తాను."

అప్పటికి ఇలియానా పిల్లలు వచ్చేసారు. నేనైతే వణుకుతున్నాను గుడికి వెళ్తున్నప్పుడు. పాటలు పాడుతున్నప్పుడు వణుకుతున్నాను చెమటలు పట్టాయి. కాపరి నన్ను పరిచయము చేసాక, అకస్మాత్తుగా మన గుడిలో ఉన్నట్టు నిమ్మలమయ్యాను! నా శక్తి అంతటితో ఆ ప్రసంగము బోధించాను.

సంక్షిప్తంగా చెప్పాలంటే, సుమారు 75 మంది ఆ రాత్రి రక్షింపబడడానికి ముందుకు వచ్చారు, సంఘ కాపరి కుమారుడు కూడ – బోధకుడు అనాలనుకుంటూ తప్పిపోయిన వాడు – ఒక వృద్ధుడు, చేతుల మీద కాళ్ళ మీద పాక్కుంటూ ముందుకు వచ్చి అరిచాడు, "నేను నశించి పోయాను! నేను నశించి పోయాను! నేను నశించి పోయాను!" ముగ్గురు యుక్త అమ్మాయిలు లేచి కలిసి పాడారు. కన్నీరు కార్చుతూ వారు, కూడ, తప్పిపోయారని ఒప్పుకున్నారు. ఆ సాయంకాలము ఆరాధన 11 గంటల వరకు జరిగింది. ఎవరు కదలలేదు. ఇది అసాదారణమని పసిగట్టారు. డాక్టర్ లాన్ పైస్ లీస్ కొడుకు నా భార్యతో అబ్బాయిలతో చెప్పాడు, "ఇలాంటిది ఎప్పుడు చూడలేదు." అతడు ప్రపంచ ప్రఖ్యాత బోధకుని కొడుకు. ఆ సంఘానికి ఉజ్జీవము వచ్చింది. 500 మందికి పైగా రక్షింపబడి కొన్ని వారాలలో ఆ గుడిలో చేరారు.

దెయ్యము ఆ యవనస్థుని ద్వారా మాట్లాడించింది, "ఏదైనా సరే, సువార్తిక ప్రసంగము మట్టుకు చెప్పవద్దు." కాని దేవుడు వాటిని అధిగమించి ఉజ్జీవాన్ని పంపించి మధ్యాహ్నము నా ప్రార్ధనలకు జవాబు చెప్పాడు, దేవుని సందేశము కొరకు ఉపవాసము ఉన్నప్పుడు.

ప్రియ స్నేహితులారా, మనము ఉజ్జీవము పొందవచ్చు. అది సాధ్యము. దేవుడు కొద్ది నిమిషాలలో చెయ్యగలడు సంవత్సరాలుగా చెయ్యలేనిది! ఈ ప్రసంగ ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి! వచ్చే వారం చాల సార్లు చదవండి. మీ విశ్వాసాన్ని పెంచుతుంది! వచ్చే శనివారము మరియొక ఉపవాస దినములలో పాలు పొందండి. ప్రార్ధించి ఉపవాసము చెయ్యండి దేవుడు దిగి రావడానికి మన మధ్య ఉండడానికి ఆయన పరిశుద్ధ నామాన్ని హెచ్చించడానికి!

యేసు సిలువపై మరణించాడు మీ పాప ప్రాయశ్చిత్తం కొరకు! ఆయన రక్తాన్ని కార్చి మన పాపాలు కడగడానికి సిలువపై శ్రమ పడ్డాడు! శారీరకంగా లేచాడు మీకు జీవితాన్ని ఇవ్వడానికి! విశ్వాసము ద్వారా యేసును నమ్మండి ఆయన మిమ్ములను రక్షిస్తాడు – ఎన్నటికి నిత్యత్వానికి! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: మత్తయి 9:10-15.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"అంతా ప్రార్ధించావా?" (రెవ. విలియం సి. పూలే, 1875-1949; కాపరిచే మార్చబడినది).
      “Have You Prayed It Through?” (by Rev. William C. Poole, 1875-1949;
altered by the Pastor).