Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఒంటరి తనము సంకెళ్ళు విరుగగొట్టుట

BREAKING THE CHAINS OF LONELINESS
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జూలై 13, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, July 13, 2014

"ఒంటరి వానికి శ్రమయే కలుగును" (ప్రసంగి 4:10).


డాక్టర్ లినార్ద్ జునిన్ ప్రకారము, లాస్ ఎంజిలాస్ మనస్తత్వవేత్త, మానవాళి గొప్ప సమస్య ఒంటరితనము. మనస్తత్వవేత్త ఎరిక్ ఫ్రొమ్ అన్నాడు, "మానవుని లోతైన అవసరము తన వేర్పాటును అధిగమించుట, ఒంటరి తనపు జైలును విడిచి పెట్టుట." బైబిలు చెప్తుంది, "నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు" (ఆదికాండము 2:18). ఆంగ్ల కవి జాన్ మిల్టన్ మనకు జ్ఞాపకం చేసాడు ఒంటరి తనము మొట్ట మొదటి విషయము మంచింది కానిదిగా దేవుడు చూసాడు.

పెద్ద పట్టణమైన లాస్ ఎంజిలాస్ ను మించిన ఒంటరి స్థలము మరియొకటి లేదు. హెర్ బర్ట్ ప్రోచ్నో అన్నాడు, "పట్టణము పెద్ద సమాజము ప్రజలు ఒంటరిగా కలిసి ఉంటారు." ఇండియా, కలకత్తాలో, వెనుకబడ్డ ప్రాంతంలో జీవించిన మదర్ తెరిస్సా అన్నారు, "ఒంటరి తనము భయంకర పేదరికము." అదే నిజమైతే, భూమిపై అమెరికన్లు ఎక్కువ మెరుగు పడిన వారు! లాస్ ఎంజిలాస్ లో లక్షలాది మంది ఒంటరివారు. మీ సంగతేంటి? నిన్నెవరు పట్టించుకోవడం లేదని అనిపించిందా – నిన్ను అర్ధం చేసుకోరని, సానుభూతి చూపరని?

మనస్తత్వవేత్తలు, డాక్టర్ జునిన్ డాక్టర్ ప్రోమ్, సరియే అని నమ్ముతాను. ప్రజలు ఈనాడు ఎదుర్కొంటున్న గొప్ప సమస్య ఒంటరి తనమని నేను నమ్ముతాను – ప్రత్యేకించి లాస్ ఎంజిలాస్ లో – ప్రపంచ మంతా. మీలో చాలా మంది ఈ ఉదయం ఒంటరి తనములో బంధింప బడ్డారు! ఈ ప్రసంగంలో ఒంటరి తనము విషయము ప్రస్తావిస్తాను.

I. మొదటిది, మన సంస్కృతి మన దేశపు ఒంటరి తనము గూర్చి ఆలోచించండి.

శాస్త్రము సాంకేతిక విజ్ఞానము అభివుద్ధితో, గత తరముల వారికంటే నేడు మనము ఎక్కువ ఒంటరిగా ఉన్నాము. అరవై ఐదవ పుట్టిన రోజున శాస్త్ర వైవిధ్య రచయితా హెచ్. జి. వెల్స్ అన్నాడు, "నేను ఒంటరిని, సమాధానము కనుగొనలేదు." అవిచార ఒంటరి ముసలివాడు నాస్తికుడు క్రైస్తవ్యానికి శత్రువు.

సాంకేతిక పరిజ్ఞానము మన ఒంటరి తనానికి వెనుక ఉంది. ఉదాహరణకు, టెలివిజన్ చూడండి. పట్టీ రచయితా ఏన్ అన్నాడు, "టెలివిజన్ నిరూపించింది ఒకరినొకరు బదులు ఏదైనా చూస్తారు అని." గంటల తరబడి టెలివిజన్ పెడతారు, గంటల కొలది విడియో ఆటలాడుతారు. కూర్చొని కలిసి స్నేహితులుగా కుటుంబంగా భోజనము చెయ్యము. ఎలా మాట్లాడాలో మర్చిపోయాము. టెలివిజన్ బిజీగా చూస్తాము మాట్లాడుకోడానికి ఐపాడ్ వాడతాము – అర్ధవంతంగా!

ప్రజలు చెవులో వైరు పెట్టుకొని మెదడులోనికి సంగీతము పంపుతారు. అంతా కారులో కట్టేసుకుంటారు. కారుకి ఒకరు. కంప్యూటర్ "తెరుస్తారు" – ఒంటరిగా.

టెలివిజన్, కంప్యూటర్, కార్లు, క్యాసేట్టులు – ఈ సాంకేతిక పరిజ్ఞానము – మనలను సంతోష పెట్టదు. ఎక్కువగా ఒంటరిగా చేస్తుంది. ఆల్ బెర్ట్ ఐన్ స్టీన్ అన్నాడు, "చాలా తేట తెల్లము మన సంకేతిక పరిజ్ఞాము మానవత్వాన్ని అధిగమిస్తుంది." విడియో ఆటలు భయంకర ఒంటరి తనాన్ని ఈనాటి యవనస్థులలో కలిగిస్తున్నాయి!

బైబిలు చెప్తుంది, "ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును: వాని లేవనెత్తువాడు లేకపోవును" (ప్రసంగి 4:10). నేను నమ్ముతాను ఇది ఒక ప్రాముఖ్య కారణము యవనస్థులు మత్తు పదార్ధాల వైపు మళ్ళడానికి. వారు ఒంటరి వారు. ఇతరులు ముఠాల వైపు తిరిగుతారు – కుటుంబంలో లేని సహా చర్యము పొందడానికి. ఇతరులు శుక్ర శని వారాలు రాత్రి పార్టీలకి వెళతారు – వారిఒంటరి తనాన్ని అధిగమించడానికి. కాని ఎందుకో అది పనిచెయ్యదు. ముఠాలు కలిసి ఉండవు. పార్టీ ముగుస్తుంది – ఇంటికి వెళ్తావు – మళ్ళీ ఒంటరి తనము.

స్వార్ధము నిలిచే సంబంధాలు ఏర్పడకుండా అడ్డుపడుతుంది. బైబిలు చెప్తుంది:

"అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనష్యులు స్వార్ధ ప్రియులు ధనాపేక్షులు బింకము లాడువారు, అహంకారులు దూషకులు...తల్లి దండ్రులకు అవిదేయులు, కృతజ్ఞత లేనివారు… ద్రోహులు… మూర్ఖులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించు వారు" (II తిమోతి 3:1-4).

ఆ పాఠ్యభాగము మన ఒంటరి సమయానికి ప్రవచనంగా ఇవ్వబడింది – అది వివరిస్తుంది ఎందుకు చాలా మంది ఒంటరిగా ఉంటారో.

"తమ్మును తాము ప్రేమించుకుంటారు." నీ పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటే ఇతరులతో సన్నిహితంగా ఉండలేవు. "దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు." ఎదుర్కోండి! చాలా మందికి స్వార్ధ పూరిత ప్రేమ ఉంటుంది దేవుని ప్రేమ కాకుండా! మీరు అలా ఉన్నారా? మీరు పూర్తిగా స్వార్ధపరులా? పాపము సారంశము స్వార్ధము – నిన్ను నీవు ప్రేమించుకొనుట, దేవుని కాకుండా. నీ స్వార్ధపు ప్రేమలో, దేవునిపై తిరగబడతావు. నీ తలంపులలోనుండి దేవుని నేట్టేస్తావు. దాని కారణంగా ఒంటరి తనముతో శపింపబడతావు. దేవుని ప్రేమ మీకు తెలియదు. లోకములో ఎప్పుడు ఉండే స్నేహితుడు లేకుండా ఉంటావు. బైబిలు చెప్తుంది, "బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును" (సామెతలు 18:24). నీవు శక్యంగా లేకపోతే, నిజ స్నేహితులు ఉండరు. అది నశించు ఒంటరి, భక్తీ హీన ప్రజల దుస్థితి.

అందుకే మీ పని గంటలు ఏర్పాటు చేసుకోవాలి తద్వారా గుడి జరిగేటప్పుడు పని చెయ్యనక్కరలేదు. మీకు దేవుడు కావాలి! గుడిలో స్నేహితులు నీకు కావాలి ఆదివారం పనిచేసి డబ్బు సంపాదించుట కంటే.

నీ ఒంటరి తనమునకు విరుగుడు లేదు క్రీస్తు స్థానిక సంఘము తప్ప! క్రీస్తుకు సమర్పించుకొని, ఆయన రక్తము ద్వారా నీ పాపాలు కడగబడాలి! తరువాత ఈ గుడికి వచ్చి ఇక్కడ ఎప్పుడు ఉండే స్నేహితులను చేసుకోవాలి! ఎందుకు ఒంటరిగా ఉండడం? ఇంటికి రండి – గుడికి!

బైబిలు ఇది పూర్వపు క్రైస్తవులను గూర్చి ఇలా చెప్తుంది:

"మరియు వారేక, మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకోనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు [వారి ఆహారము] ప్రజలందరి వలన దయ పొందినవారై, ఆనందముతోను నిష్కపటమైన హృదయము తోను, ఆహారము పుచ్చు కొనుచుండిరి. మరియు దేవుడు రోజు రక్షించవలసిన వారిని చర్చికి జోడించారు" (అపోస్తలుల కార్యములు 2:46-47).

అందుకే గుడిలో ఉంటే "హృదయానందము" ఉంటుంది – ఒంటరితనము దూరమవుతుంది. వారు తలుపులు తెరిచినప్పుడల్లా గుడిలో ఉంటారు. వారి మాదిరి గైకొనండి! తిరిగి వచ్చే ఆదివారము రండి! మన పూర్తి సహవాసములోనికి రండి! మీ ఒంటరి తనాన్ని అది బాగు చేస్తుంది! క్రీస్తు ఒంటరి తనపు సంకెళ్ళు పగలగొడతాడు! ఈ గుడిలోనికి వచ్చి క్రీస్తుకు మీ హృదయాన్ని అర్పించండి!

II. రెండవది, మరణపు ఒంటరి తనాన్ని గూర్చి ఆలోచించండి.

బైబిలు చెప్తుంది యాకోబు ఇలా అన్నాడని:

"నా కుమారుని మీతో వెల్లనియ్యను [ఐగుప్తుకు]; ఇతని అన్న చనిపోయెను, ఇతను మాత్రమే మిగిలియున్నాడు..." (ఆదికాండము 42:38).

ఒక దినాన్న నీ బంధువు కూడ చనిపోతాడు – నీవు ఒంటరిగా విడిచి పెట్ట బడతావు.

మరణము భయంకరము – ప్రతి ఒక్కరికి వస్తుంది – నీకు కూడ. మరణము నిన్ను ఒంటరిగా నిరుత్సాహంగా ఉంచుతుంది. ఈ స్థలానికి వచ్చి ఇలా అంటావు,

"రాత్రి మెలకువగా ఉండి, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలే ఉన్నాను" (కీర్తనలు 102:7).

పక్షిలా ఒంటారిగా ఉంటావు – ఇంటిపై ఒంటరిగా – ఒంటరిగా, నీవైపు ఎవరు చూడరు!

దేవుడు జైలులో ఉన్న పేతురును విడిపించడానికి దూతను పంపాడు. దూత చెప్పింది, "త్వరగా లెమ్మనగానే. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను" (అపోస్తలుల కార్యములు 12:7). అదే నీకు జరుగుతుంది నీవు మారి క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు. మరణపు సంకెళ్ళు పడిపోతాయి – స్వతంత్రుడవుతావు. క్రీస్తు వచ్చాడు

"...మరణము యొక్క బలము గలవానిని, అనగా, అపవాదిని; మరణము ద్వారా [విడిపించుటకును] నశింపచేయుటకు మరణ భయము నుండి ఆయన రక్త మంసములో పాలివాడాయెను" (హెబ్రీయులకు 2:14-15).

చార్లెస్ వెస్లీ అన్నాడు:

నా సంకెళ్ళు పడిపోయాయి, నా హృదయము తెలికయ్యింది;
నేను లేచాను, ముందుకు సాగి, నిన్ను వెంబ డించాను.
అద్భుత ప్రేమ! ఎలా వీలవుతుంది
నీవు, నాదేవా, నా కొరకు చనిపోకుండా?
      ("వీలవుతుందా?" చార్లెస్ వెస్లీచే, 1707-1788).

మరణము ఒంటరి తనపు సంకెళ్ళు పడిపోతాయి నీవు నిజంగా క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు!

III. మూడవది, నరకము ఒంటరి తనాన్ని గూర్చి ఆలోచించండి.

బైబిలు క్రైస్తవుడు కాని ధనవంతుని గూర్చి చెప్తుంది. ఆయన చనిపోయి నరకానికి వెళ్ళాడు. బైబిలు చెప్తుంది:

"అప్పుడతడు పాతాళములో బాధ పడుచు కన్నులెత్తి, దూరము నుండి అభ్రాహమును, అతని రొమ్మున ఆనుకొనియున్న...లాజరును చూచి, తండ్రివైన అబ్రాహము, నా యందు కనికర పడి, తన వ్రేలి కొనను సీల్లలో ముంచి, నా నాలుకను చల్లర్చుటకు, లాజరును పంపును; నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను" (లూకా 16:23-24).

నరకములో కొద్ది నీటిలో తన నోటిని చల్లార్చుకోవాలనే తలంపు వచ్చింది. కాని ఆయన ఒంటరిగా నరకములో ఉన్నాడు. సహాయానికి ఎవరు లేరు. కొద్ది నీళ్ళ కొరకు వేరే వారి సహాయము కొరకు కేకలు వేస్తున్నాడు.

ఈ వ్యక్తి వేదన చూపిస్తుంది నరకపు ఒంటరి తనాన్ని. మీ స్నేహితులు, వారు కూడ నరకములో ఉంటే, ఆశ్రమ నుండి ఉపశమనానికి సహాయపడలేరు. వారు అంధకారము అగ్నిలో నీతో వేరుపర్చబడతావు. నీవు ఒంటరిగా ఉంటావు, అతని వలే, ఒంటరిగా నిత్యత్వంలో హింసింపబడతావు.

కేవలము యేసు క్రీస్తు మాత్రమే నరక సంకెళ్ళు నీ నుండి తెగ గొట్టగలడు! ఆయన మాత్రమే ఇప్పుడే చేయగలడు – నీవు బ్రతికి ఉండగానే. చనిపోయే వరకు కనిపెడితే, నిత్యత్వములో చాలా ఆలస్యమై పోతావు. ఇప్పుడే క్రీస్తు నొద్దకు రా – ఈ పాట పాడు,

ప్రభూ, గాయపరచిన నీ దెబ్బల ద్వారా,
మరణపు ముళ్ళు నుండి నీ సేవకుడు విడుదల పొందాడు,
మేము జీవించి మీ కొరకు పాడునట్టు. హల్లెలూయ!
("కష్టము ముగిసింది," ఫ్రాన్సిస్ పాట్ చే అనువదింప బడుతుంది, 1832-1909).

మరణము నిలవదు – యేసు నా రక్షణా!
ఆయన అడ్డంకులు తొలగించాడు – యేసు నా ప్రభూ!
("క్రీస్తు లేచాడు" రాబర్ట్ లౌరిచే, 1826-1899).

నరకపు ఒంటరి సంకెళ్ళు విరిగిపోతాయి నీవు యేసు క్రీస్తు వైపు పూర్తిగా తిరిగిలే! ఆయన దగ్గరకురా! పాపం నుండి బయటకురా! గుడిలోనికి రా! నరకపు ఒంటరి తనపు సంకెళ్ళు, నీ కొరకు దైవ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా విరుగ గొట్టబడతాయి!

IV. తరువాత, నాల్గవది, క్రీస్తు ఒంటరి తనమును గూర్చి ఆలోచించండి.

భూమిపై ఆయన పరిచర్యలో క్రీస్తు తరుచు ఒంటరిగా ఉన్నాడు. బైబిలు చెప్తుంది:

"ఆయన ఆ జన సమూహములను పంపివేసి, ప్రార్ధన చేయుటకు ఏకాంతముగా కొండ యెక్కి పోయి: సాయంకాలమైనప్పుడు, ఒంటరిగా ఉండెను" (మత్తయి 14:23).

గొప్ప జన సమూహములు యేసును వెంబడించాయి, కాని తరుచు దేవునితో ఒంటరిగా ఉండడానికి వెళ్ళేవాడు – జన సమూహము నుండి దూరముగా. కాని తరుచు ఆయన అన్నాడు, "నా తండ్రి నన్ను ఒంటరిగా విడువలేదు" (యోహాను 8:29). భూమి మీద ఆయన పరిచర్యలో, దేవుడు ఎప్పుడు యేసుకు సమీపంగా ఉన్నాడు. కాని వారు ఆయనను తీసుకెళ్ళి కొట్టి, తలపై ముండ్ల కిరీటముంచి, ఆయనను అపహసించారు. కొండపైకి ఈడ్చుకెళ్ళి సిలువ వేసారు. ఆయన సిలువపై మరణించుచుండగా, దేవుడు తన అద్వితీయ కుమారుని విడిచిపెట్టాడు. యేసు ఇలా కేక వేసాడు:

"నా దేవా, నాదేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? [నన్ను ఎందుకు వదిలేసావు?]" (మత్తయి 27:46).

ఈ భయంకర సమయములో, దైవ కుమారుడైన యేసు క్రీస్తు, సిలువపై ఒంటరిగా విడిచి పెట్టబడ్డాడు. ఆయన పూర్తిగా ఒంటరి అయ్యాడు. దేవుడు తన ప్రియకుమారుని నుండి మరలి పోయాడు – క్రీస్తు ఒంటరిగా –సిలువపై మన పాపాలు భరించాడు. లూథర్ గొప్ప వేదాంతి, కాని ఆయన అన్నాడు ఇది పూర్తిగా అర్ధం కాలేదని వివరించలేదని.

దేవుడు పాపాన్ని చూడలేక పోయాడు – కనుక దేవుడు తిరిగి పోయాడు యేసు "[సిలువపై] మ్రానుపై మన పాపాలు భరించేటప్పుడు" (I పేతురు 2:24). అందుకే యేసు మాత్రమే పాపపు సంకెళ్ళు విరుగ గొడతాడు, పాపపు, ఒంటరి స్థితి నుండి విడిపిస్తాడు. పాపపు శిక్ష నుండి క్రీస్తు నిన్ను రక్షింపగలడు ఎందుకంటే ఆయన ఒంటరిగా సిలువపై నీ పాపాలు భరించాడు!

ఒంటరిగా రక్షకుడు చీకటి గెత్సమనెలో ప్రార్ధించాడు,
ఒంటరిగా చేదు చిరకా త్రాగి నా కొరకు శ్రమ పడ్డాడు.
ఒంటరిగా! ఒంటరిగా! ఆయన ఒంటరిగా భరించాడు.
తన వారిని రక్షించడానికి తన్ను తానే అర్పించుకున్నాడు,
ఆయన శ్రమించి, రక్తము కార్చి, ఒంటరిగా మరణించాడు, ఒంటరిగా.
    ("ఒంటరిగా" బెన్ హెచ్. ప్రైస్ చే, 1914).

మానవ ఆత్మకు పాపము తెచ్చు ఒంటరి తనాన్ని నుండి నిన్ను రక్షించడానికి సిలువపై క్రీస్తు ఒంటరిగా చనిపోయాడు. నీ స్థానములో, నీ పాపానికి చెల్లించడానికి. ఆయన చనిపోయాడు క్రీస్తు పాపపు సంకెళ్ళు పగులగొట్టగలడు ఎందుకంటే నీ కొరకు సిలువ మరణానికి ఆయన వెళ్ళాడు! పూర్తిగా యేసు వైపు తిరిగితే పాపపు నేరారోపణ నుండి విడుదల పొందుతావు!

V. కాని ఐదవది, మార్పిడిలోని ఒంటరి తనాన్ని గూర్చి ఆలోచించండి.

నా ద్వారా నీవు క్రీస్తులోనికి మార్చబడవు. నేను ఒక పరికరాన్ని మాత్రమే – ఒక బోధకుడని – సరియైన దిశ చూపడానికి – క్రీస్తు వైపు – సువార్తికుని వలే బాటసారి ప్రయాణము లోని. కాని నీవే క్రీస్తును కనుగొనాలి. నీవు ఒంటరిగా యేసు నొద్దకు వెళ్ళాలి. యాకోబు అనుభవంలో మార్పిడిలోని ఒంటరి తనము యొక్క పరిపూర్ణ చిత్ర పటాన్ని ఎంత బాగా చూడవచ్చు:

"యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను" (ఆదికాండము 32:24).

ఆ "మనష్యుడు" యాకోబుతో పెనుగు లాడిన వాడు ఆ రాత్రి క్రీస్తు అవతారి, యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు చీకటిలో తన దగ్గరకు వచ్చాడు.

మీలో కొందరి వలే, యాకోబు క్రీస్తును వ్యక్తి గతముగా ఎరుగ లేదు. ఆ ఒంటరి ఘడియలో రాత్రంతా క్రీస్తుతో పెనుగులాడాడు. నీవు, కూడ, యేసు నొద్దకు నీకు నీవుగా రావాలి. చూడండి, నేను నిన్ను మార్చలేను. నిజ క్రైస్తవునిగా నిన్ను చెయ్యలేను. అది నీకు క్రీస్తుకు మధ్య ఉన్న విషయము.

"యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను" (ఆదికాండము 32:24).

క్రీస్తు నీ పాప పరిహారము చెల్లించడానికి సిలువపై మరణించాడు. కాని నీవు క్రీస్తుకు "ఇచ్చుకోవాలి." క్రీస్తుకు లోబడాలి. నీ గర్వ తిరుగుబాటు హృదయపు మాట వినకూడదు. నిస్సహాయ పాపిగా క్రీస్తు పాదాలపై పడాలి. ఆయనకు లోబడాలి, నీ నమ్మిక పూర్తిగా ఆయనపై ఉంచాలి. ఆయన నీ హృదయాన్ని మార్చేస్తాడు! పాపపు సంకెళ్ళు పగులగొడతాడు! ఆయన రక్తములో నీ పాపాలు కడిగేస్తాడు!

క్రీస్తుకు సమర్పించుకొని నిజ క్రైస్తవుడవాలని మాతో మాట్లాడాలనుకుంటే, మీ స్థలము వదిలి గది వెనుకకు ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి మీతో మాట్లాడతాడు. డాక్టర్ చాన్, ఈ ఉదయం కొందరు క్రీస్తును నమ్మునట్లు ప్రార్ధించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: ప్రసంగి 4:8-12.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"పదివేల దూతలు" (రే ఓవర్ హాల్ట్ చే, 1959).


ద అవుట్ లైన్ ఆఫ్

ఒంటరి తనము సంకెళ్ళు విరుగగొట్టుట

BREAKING THE CHAINS OF LONELINESS

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"ఒంటరి వానికి శ్రమయే కలుగును" (ప్రసంగి 4:10).

(ఆదికాండము 2:18)

I. మొదటిది, మన సంస్కృతి మన దేశపు ఒంటరి తనము గూర్చి ఆలోచించండి, ప్రసంగి 4:10; II తిమోతి 3:1-4; సామెతలు 18:24; అపోస్తలుల కార్యములు 2:46-47.

II. రెండవది, మరణపు ఒంటరితనాన్ని గూర్చి ఆలోచించండి, ఆదికాండము 42:38; కీర్తనలు 102:7; అపోస్తలుల కార్యములు 12:7; హెబ్రీయులకు 2:14-15.

III. మూడవది, నరకము ఒంటరి తనాన్ని గూర్చి ఆలోచించండి, లూకా 16:23-24.

IV. నాల్గవది, క్రీస్తు ఒంటరి తనమును గూర్చి ఆలోచించండి, మత్తయి 14:23; యోహాను 8:29; మత్తయి 27:46; I పేతురు 2:24.

V. ఐదవది, మార్పిడిలోని ఒంటరి తనాన్ని గూర్చి ఆలోచించండి, ఆదికాండము 32:24.