ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
పరలోకము నరకముHEAVEN AND HELL డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "అనేకులు, తూర్పు నుండియు పడమటి నుండియు వచ్చి, అభ్రాహముతో కూడను, ఇశ్మాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోక రాజ్యమందు కూర్చుందురు. కాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయ బడుదురు: అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుటయును ఉండునని మీతో చెప్పుచున్నాననెను" (మత్తయి 8:11-12). |
పాఠ్యభాగములో రెండు భాగాలున్నాయి. మొదటిసగము అద్భుతము, రెండవ భాగము భయంకరము. అయినను, రెండు భాగాలు సత్యము కనుక, ఆ రెండింటి మీద ఈ రాత్రి భోదిస్తాను. I. మొదటిది, పరలోకము వాగ్ధానము. "అనేకులు తూర్పు నుండియు పడమటి నుండియు వచ్చి, అభ్రాహముతో కూడను, ఇశ్మాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోక రాజ్యమందు కూర్చుందురు..." (మత్తయి 8:11-12). ఓలివేక్ గారు తయారు చేసిన అద్భుత వీడియోను తండ్రుల దినాన చూసాము. ఆయన ఎక్కువ కలిపాడు మన వెబ్ సైట్ లో మొదటి పేజిలో దానిని చూడవచ్చు. ప్రపంచ నలుమూలల నుండి మాకు ఈ మెయిల్స్ వచ్చాయి ఆ విడియో వారిని ఎలా ఆశీర్వదించిందో చెబుతూ, మన భవనముపై మంటలతో. ఆ ఫోటోలు చూసినప్పుడు మన గుడిలో వారి అనుభూతిపై వ్యాఖ్యానించారు. చాలా తెగలవారు నవ్వుతూ ఆనందంగా కలిసి పాడుతుండడం చూసి వారు పరవశులయ్యారు. వారికి ఎలా చెయ్యాలో తెలియదు. నిజానికి, నాకు తెలియదు! మన సంఘము దేవుని కృపాద్భుతము! మరియు, అయినా, క్రీస్తు కొరకు అలుపెరుగని మీ పని ద్వారా అది వచ్చింది. దేవుడు మిమ్మును దీవించు గాక! చాలా తెగల వారు మన గుడిలో ఉన్నారు! హా, అవును, పరలోకంలో అలా ఉంటుందని యేసు చెప్పాడు! "అనేకులు తూర్పు నుండియు పడమటి నుండియు వచ్చి, పరలోక రాజ్యములో కూర్చుంటారు..." అది మనకు కొత్తగా లేనే లేదు – ఎందుకంటే క్రీస్తు ద్వారా సమకూర్చబడ్డాం – పరలోక రాజ్యములో ప్రపంచ నలు మూలల నుండి వచ్చు వారి వలే! గమనించండి యేసు అన్నాడు, "చాలా మంది వస్తారు." కొన్నిసార్లు కొద్ది మంది వస్తారు అనిపిస్తుంది. మనం అలాంటి అంధకార దెయ్యపు పట్టణంలో ఉన్నాము. మనం అలాంటి స్వార్ధపూరిత క్రూర దేశములో ఉన్నాము. ప్రతి ఏటా పదిన్నర లక్షల పసి పిల్లలు బలవంతపు మరణ మొందుతున్నారు. అయినను సంఘాలు మౌనంగా ఉన్నాయి! కనీసం ఒక మంచి మాటైనా అమెరికాను గూర్చి జూలై నాలుగున చెప్పలేను. మన స్థితి నా హృదయాన్ని నిర్వీర్యం చేస్తుంది. కాని త్వరలో అమెరికా గతించి పోయి మర్చిపోబడుతుంది – కాని మనం లక్షలాది దేవుని ప్రజలతో పరలోక రాజ్యమునందు ఆనందిస్తాం! అది మన నిజ స్వస్థలము! అది మన నిజ దేశము! అది దేవుని ఆధీనములో మన దేశము! ఆ పట్టణములో హృదయ బాధలు ఉండవు, అక్కడ చిన్న సంఖ్యలో ఉండరు! దేవుడు అన్నాడు "గొప్ప సమూహము, మనష్యుడు లెక్కింపలేని, అన్ని దేశముల నుండి, తెగల నుండి, అన్ని రకాల ప్రజల నుండి, భాషల నుండి" పరలోక రాజ్యములో! (ప్రకటన 7:9). ఆ ప్రకాశ పట్టణంలో, ధవళ పట్టణములో, "అనేకులు తూర్పు నుండియు పడమటి నుండియు వచ్చి, అభ్రాహముతో కూడను, ఇశ్మాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోక రాజ్యమందు కూర్చుందురు..." వారు వస్తారు! వారు వస్తారు! పరలోకములో భూలోకములో, నరకములో రాకుండా, ఎవరు వారిని ఆపలేరు! మీరు అనుకోవచ్చు కష్టమని – కాని నేను చెప్తున్నాను రాకుండా ఏదియు వారిని ఆపలేదు! సునామి అలల వలే దేవుని కృపా అలా కాదనలేని కృప ద్వారా ఆయనచే ఎన్నుకొనినబడిన వారు పరలోక రాజ్యములో నెట్టబడతారు! అనుమానాలు తుడిచిపెట్టబడతాయి! భయాలు తుడుచుకుపోతాయి! నేరారోపణ తుడుచుకు పోతుంది! "వారు వస్తారు!" హల్లెలూయా! వారు వస్తారు! ఇప్పుడే యేసు నోద్దకు రండి. ఆయన మిమ్ములను త్రోసి వేయడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన రక్షిస్తాడు! నేను వెళ్తే నశించి పోతాను; హా, ఆ ధవళ పట్టణానికి వెళ్ళడం పోగొట్టుకోవద్దు! మాతో కలిసి పాడడం వదులుకోవద్దు, ఆ ప్రకాశ పట్టణంలో, ధవళ పట్టణములో, II. రెండవది, నరకాన్ని గూర్చిన హెచ్చరిక. విచారంగా, పాఠ్యభాగములో రెండవ భాగము మీకు ఇవ్వాలి. దాని వదిలేద్దమనుకున్నాను! కాని అది బోధించడం నా విధి. "కాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు: అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను" (మత్తయి 8:12). ఒక పెద్ద మనిషి టోపిలో ఈక కలిగి ప్రతి రోజు మా ఇంటి దగ్గరగా నడుస్తుంటాడు. అతడు తన భార్యతో దక్షిణ అమెరికాకు ప్రతి ఏటా దీర్ఘ సెలవు ప్రయాణాలు చేస్తుంటాడు. ఈత కొలను ఉన్న అందమైన ఇల్లు ఆయనకుంది. కుర్టిస్ గోల్డ్ మెన్ అనే బోధకుడు ఈ వ్యక్తి నడుస్తున్నప్పుడు మాఇంటిలో ఉండేవాడు. గోల్డ్ మెన్ బోధకుడు ఆయనను చూడ్డానికి వీదిలోనికి వెళ్తే, దెయ్యం వెంబడించే వాడిలా, పారిపోయే వాడు. గోల్డ్ మెన్ ఆయన వెంట పరుగెత్తి, "ఆగు" అని, అరిచాడు! నువ్వు నరకానికి పోతున్నావు, ముసలివడా! ఆగు! నువ్వు నరకానికి పోతున్నావు!" కాని టోపిలో ఈక ఉన్న ఆ ముసలి వ్యక్తి పారిపోయాడు. ముందు రోజు రాత్రి నిద్ర పోలేక పోయాడు. ఈత దుస్తులేసుకుని ఈత కోలనుకు వెళ్ళాడు. కాని జారి తలకు దెబ్బ తగిలి, కొలనులో పడిపోయాడు – మర్నాడు తెల్లవారు జామున రెండు గంటలకు. శవం నీటిపై తేలడం, ఎవరో చూసారు. ఆయన విన్న చివరి మాటలు బోధకునిచే – "ఆగు! ముసలివాడా, నరకానికి పోతున్నావు! ఆగు! నరకానికి పోతున్నావు!" ఆయన మంచి వ్యక్తి. నాకు ఆయన ఇష్టం. ఎలా చనిపోయాడో ఇలియానా నుండి విని చాలా విచారపడ్డాను. ఈ పేరా రాసే ముందు ఇది విన్నాను. అతడు ముసలివాడు – నేను పడుచు వాడిని అని కొట్టి పారేయకండి! అలా చెయ్యడానికి ఎంత దైర్యం. ప్రతి ఉదయం రెండు వార్తా పత్రికలలో నిర్యాణములు చదువుతాను. కార్టూను చదవడం ఆపేసాను. వాటిని "పరిహాస కాగితాలు" అని పిలుస్తాం. కాని అవి పరిహాసం కాదు. అవి విషాదపు నిరీక్షణ లేనివి – ఆ ముసలి వాని వలే చక్కని ఇంటిలో ఒంటరిగా ఉండిన వాని వలే. యవనస్థులరా, నీ తల్లిని తండ్రిని ఒంటరిగా వదిలి పెట్టండి. ఆ జీవితం భయంకరము. నాకు వాగ్ధానము చెయ్యండి దేవుని ముందు ఒంటరిగా ఉన్న మీ తల్లిని తండ్రిని మీ ఇంటిలోనికి తీసుకు వెళ్తారని. వాగ్ధానం చెయ్యండి నాకు! "పరలోకము నరకమా" అనే ఈ ప్రసంగాములోని మాట వారికి, చదివి వినిపించండి. మీ తల్లి తండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా, ఉండనివ్వకండి, ఏదో పోను చేస్తూనో రెండు రోజుల కొకసారి సమాచారము పంపుతూనో! భాగస్వామి చనిపోయాక తల్లిని గాని తండ్రిని గాని చేర్చుకో. అదే నిజమైన క్రైస్తవుని పని చేయడానికి! కనీసం అలా చేయ ప్రయత్నించండి. దేవుని నిమిత్తం నీ తల్లి ఒంటరిగా చనిపోనివ్వవద్దు – నీవు ఒంటరిగా నీ జీవితం అనుభవిస్తూ. అలా చేస్తే, ఏమి విత్తుతామో అదే కోస్తాము. నువ్వు, కూడా ఒంటరిగానే చనిపోతావు, ఒంటరిగా నరకానికి పోతావు, టోపిలో ఈక ఉన్న ముసలి వాని వలే, కొలనులో మునిగాడు. "రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు: అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును" (మత్తయి 8:12). క్రైస్తవ తల్లులున్న వారు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. నీ తల్లి హృదయాన్ని గాయపరుస్తున్నారు. నేను నా తల్లిని మా ఇంటికి తెచ్చాం నా భార్య తనను ప్రేమించింది, ఆమెను పట్టించుకున్నాం, ఆఖరి నాలుగు సంవత్సరాలు. కాని ఇక్కడ కొందరు పిల్లలున్నారు తల్లుల హృదయాలను పగులగొట్టి తెల్ల జుట్టు వచ్చేలా చేస్తారు. రాత్రి నీ తల్లి హృదయాన్ని పగుల గొట్టి ఆ పని పదే పదే చేస్తుంటావు! ఆమె నీకు చెప్పాడు, నీవే ఆమె నిరీక్షణ. ఆమె నీ కొరకు జీవితాన్ని ధార పోసింది. నీకు మంచి జీవితం ఇవ్వడానికి పొద్దున్నుండి సాయంత్రము వరకు చాకిరి చేసింది. అడిగే ఆ ఒక్కటి ఇవ్వకుండా నిరాకరిస్తున్నావు! ఆమె నీకు చెప్పాడు కూడా, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. కాని, నిజానికి, ఆమె కోరుకునేది ఒక్కటే నీవు యేసును నమ్మి బాప్మిస్మము పొందినప్పుడు చూసి సంబర పడాలని! అది నీ పేద తల్లికి ఇవ్వలేవా? ఆమె తన జీవితం వ్యర్ధమయిందని, నిరుపయోగమని అనుకుంటుంది, నీవు యేసు నోద్దకు రాకపోతే, బాప్తిస్మము పొందకపోతే, ఆమె గర్వ పడేలా చెయ్యకపోతే. మీ తల్లి క్రైస్తవురాలు అయినా కాకపోయినా, దయచేసి, దేవుని కొరకు, యవనస్థులరా – యేసు నోద్దకు రండి, మీ హృదయము లేతగా ఉన్నప్పుడే. క్రీస్తు లేకుండా కొనసాగకండి – క్రీస్తు నుండి పారిపోకముందే – టోపిలో ఈక ఉన్న ముసలివాని వలే – నీవు క్రీస్తును నమ్మడంలో విఫలుడవైతే, యువకునిగా ఉన్నప్పుడే – చనిపోయి నరకంలో మునిగిపోక ముందే, బహుశా ఈత కొలనులో, నీటిలో చనిపోయి బయట చీకటిలో వేయబడకుండా, నిత్యాగ్నిలో నాలుక తడపడానికి ఒక్క నీటి బొట్టు కూడా ఉండదు. స్పర్జన్ ఒక స్త్రీని గూర్చి చెప్పాడు ఆమె కల ఒకటి తన పిల్లలకు చెప్పిందట. తీర్పు దినము వచ్చినట్టు కల కనింది. గొప్ప పుస్తకాలు తెరువబడి దేవుడు అన్నాడు, "రక్షింపబడని వారిని ఎడమ వైపు, మారిన వారిని కుడి వైపు." దూత వచ్చి తల్లిని తీసుకొని, ఇలా అంది, "ఈమె క్రైస్తవురాలు కుడివైపు వెళ్ళాలి. కాని పిల్లలు తప్పిపోయారు. వారు మేకలు. వారు ఎడమ వైపు వెళ్ళాలి." కలలో పిల్లలు అరుస్తూ అంటున్నారు, "అమ్మా, నిన్ను వదిలి పెట్టేయ్యాలా?" ఆమె వారి చుట్టూ చేతులుంచి ఇలా అంది, "పిల్లలారా, వీలైతే నాతో తీసికెళ్ళే దానిని. కాని వీలు పడదు ఎందుకంటే మీరు యేసును నమ్మలేదు. ఆయన నమ్మి రక్షింపబడాలని బ్రతిమాలాను, కాని మీరు నా మాట విని లోబడలేదు. ఇప్పుడు నిత్యమూ నేను మీ నుండి వేరు చేయబడతాను." ఒక్క క్షణం దూత ఆమె కొరకు వచ్చింది. ఆమె కన్నీళ్లు పోయాయి, సహజ మమకారం అధిగమించి, అసహజంగా నిమ్మలమయి దేవుని చిత్తానికి కట్టుబడింది. ఆమె తిరిగి పిల్లలతో ఇలా అంది, "నేను మిమ్ములను గుడికి తీసుకెళ్ళాను. ఇంటిలో బైబిలు బోధించాను. రాత్రులు మీ కొరకు ప్రార్ధించాను. అయిననూ యేసును తిరస్కరించారు. ఇప్పుడు నేను చెప్పగలిగింది మీ నిత్య శిక్షకు ఆమెన్ చెప్పాలి." అప్పుడు వారు ఎత్తుకెళ్ళబడి బయట అంధకారంలో పడ ద్రోయబడడం ఆమె చూసింది, నిత్యాగ్నిలో. యవనస్థుడా, నీవేమనుకుంటున్నావు, ఆఖరి రోజు వచ్చినప్పుడు, క్రీస్తు అనడం విన్నప్పుడు, "నిందించబడిన వారులారా, శపింపబడిన వారులారా, నిత్యాగ్నికి వెళ్ళుడి." ఇంకొక స్వరం కూడా వింటావు, "ఆమెన్." ఆ ఆమెన్ ఎక్కడ నుండి అని నువ్వు అడిగితే, ఆ స్వరం నీ తల్లిదిగా కనుకొంటావు. ఓ, యవ్వన స్త్రీ, ఆ నరకము వెలుపలి చీకటిలో నీవు పడద్రోయబడినప్పుడు ఒక స్వరం వింటావు "ఆమెన్" అని, అని నీ తండ్రి నోట నుండి అని కనుగొంటావు. చాలా మంది రక్షింపబడిన నిందించబడిన వారు, త్రాగుపోతులు, వ్యభిచారులు, మారిన స్వలింగ సంపర్కులు, మత్తు పదార్ధాల బానిసలు పరలోకంలో ప్రవేశిస్తారు. "రాజ్య సంబంధులు," నీ లాంటి వారు, జీవిత మంతా గుడికి వచ్చి, అయినా యేసును తిరస్కరించినందుకు, అగ్ని గల నరకంలో వెలుపల చీకటిలో పడద్రోయ బడతావు. అక్కడ నీకు నిరీక్షణ నిత్యత్వానికి ఉండదు – ఎన్నటికి – ఎన్నటికి! నిత్యత్వములో నశించావు! ఈ భయంకర స్థితిని తప్పించుకోవడం సులభం! చేయవలసిందల్లా నీవు యేసును నమ్మాలి – సామాన్యం – సులభం – "ఆయనను నమ్మడమే, ఆయనను నమ్మడమే, ఇప్పుడు ఆయనను నమ్మడమే! ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఇప్పుడే ఆయన నిన్ను రక్షిస్తాడు." ఆయనను నమ్ము సిలువపై కార్చబడిన రక్తముతో క్రీస్తు నీ పాపాలు కడిగేస్తాడు! సిలువ యొక్క క్రీస్తు నొద్దకు వచ్చి ఆయన రక్తములో కడగబడు! ఈ ప్రసంగము తీసుకొనబడి కుదింపబడింది "బోధకుల రాజు" అయిన, సి. హెచ్. స్పర్జన్ గారి ప్రసంగము నుండి, ఆయన ఇరవై ఏళ్ళప్పుడు పొలములో గొప్ప గుంపుకు బోధించాడు. ఆయన మొదటి వ్యక్తి ఈ పాట నిజమని మీకు చెప్పడానికి, సిలువ చెంత నీకు స్థలము ఉంది, విశ్వాసము ద్వారా యేసు రక్తములో కడగబడుటను గూర్చి మాతో మాట్లాడాలనుకుంటున్నారా? అలా అయితే, విచారణ గదికి ఇప్పుడే వెళ్ళండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ |
ద అవుట్ లైన్ ఆఫ్ పరలోకము నరకముHEAVEN AND HELL డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "అనేకులు, తూర్పు నుండియు పడమటి నుండియు వచ్చి, అభ్రాహముతో కూడను, ఇశ్మాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోక రాజ్యమందు కూర్చుందురు. కాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయ బడుదురు: అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుటయును ఉండునని మీతో చెప్పుచున్నాననెను" (మత్తయి 8:11-12). I. మొదటిది, పరలోకము వాగ్ధానము, మత్తయి 8:11;
II. రెండవది, నరకాన్ని గూర్చిన హెచ్చరిక, మత్తయి 8:12. |