Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




డాక్టర్ కాగన్ వచనము

DR. CAGAN’S VERSE
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జూన్ 29, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, June 29, 2014

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది: గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును" (I యోహాను 2:17).


మన గుడిలో ఒక వ్యక్తిని యేసు నొద్దకు నడిపించడానికి దేవుడు ఈ వచనాన్ని వాడాడు. అతడు ఇరవై సంవత్సరాల, యువకుడు. యుసిఎల్ఎ క్యాంపస్ లో పట్టభద్రుడవుతున్నాడు. ముప్ఫె సంవత్సరాలు రాకముందే లక్షల డాలర్లు సంపాదించాలని ప్రణాళిక వేస్తున్నాడు. మూడు ఉద్యోగాలు చేసి రాత్రంతా చదివేవాడు. కాదు, అతడు క్రైస్తవుడు కాదు. అతడు అనుకున్నాడు క్రైస్తవ్యము బలహీనులకు కాని, తనకు కాదు అనుకున్నాడు! గొప్పవాడు ప్రముఖుడు అవాలనుకున్నాడు. ఒక రాత్రి అనుకున్నాడు, "పాశ్చాత్య లోకపు గొప్ప శాస్త్రీయ పుస్తకాలన్నీ చదివాను, కాని బైబిలు చదవ లేదు." కూర్చొని చదవడం ప్రారంభించాడు. తక్కువ సమయంలో చదివేశాడు. ఈ లేఖన వచనము పేజి నుండి ముందు కొచ్చింది. తన మనసులో నుండి పోవడం లేదు. ఈ మాటలు తన మెదడులో సంచరించాయి, "లోకమును దాని ఆశయు, గతించి పోవుచున్నవి: కాని దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుచును." ఈ వచనము వెంటాడింది, మెదడులో భూతంలా, రెండు పూర్తి సంవత్సరాలు – ఒక రాత్రి యేసు నొద్దకు వచ్చే వరకు. తానూ అన్నాడు, "కొన్ని క్షణాల్లో, నేను యేసు నొద్దకు వచ్చాను. ఆయనను నమ్మాను. అది చాలా సామాన్యము." మీకు తెలుసు. అతని పేరు డాక్టర్ కాగన్ – ఆయన సంఘ సహాయక కాపరి! అతని కుమారుడు జాన్ సామ్యూల్ నేను బోధించే ముందు పాడడం మీరు విన్నారు. ఈ వచనము డాక్టర్ కాగన్ క్రైస్తవుడవడానికి నచ్చ చెప్పింది,

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది: గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును" (I యోహాను 2:17).

ఈ వచనములో ప్రతి యువకునికి ఈ ఉదయము ఒక ప్రాముఖ్య సత్యము దాగి ఉంది. చాలా మంది దాని గూర్చి ఆలోచించరు, కాని "లోకము గతించును." డాక్టర్ ఎ. టి. రోబర్ట్ సన్ చూపించాడు అసలు గ్రీకు అర్ధము "గతించు పోవుచున్నది" (నూతన నిబంధనలో పద పటాలు, బ్రాడ్ మాన్, 1933, పేజి 214). లోకము "గతించు పోవుచున్నది." "లోకము" గ్రీకు పదము "కాస్మోస్" నుండి వచ్చింది. అది చెప్తుంది ఈ లోక వ్యవస్థ సాతాను అధీనంలో ఉంది, వస్తు పరలోకము దాని ఆలోచనా విధానము. అదంతా గతిస్తుంది! దేవుని చిత్తము జరిగించు వారు మాత్రమే నిరంతము నిలుస్తారు!

పాఠ్యభాగము సహజంగా రెండు విషయాలు కలిగి ఉంది. ప్రతి యువకుడు వాటిని గూర్చి ఆలోచించాలని నా ఆశ. ఈ వచనము మన సహాయక కాపరి డాక్టర్ కాగన్ పై, అతడు నాస్థికుడుగా ఉన్నప్పుడు, గొప్ప ముద్ర వేసింది. అది అతని జీవిత వచనము. మీ మీద కూడ అలాంటి ముద్ర వేయాలని నా ప్రార్ధన.

I. మొదటిది, లోకము గతించి పోవుచున్నది.

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది" (I యోహాను 2:17ఎ).

డాక్టర్ రినేక్కర్ అన్నాడు, "అది గతించి పోయే స్థితిలో ఉంది" (Linguistic Key to the Greek New Testament, Zondervan, 1980, p. 788).

మీలో కొందరు ఇప్పటికే చూసి ఉంటారు. ఉన్నత పాఠశాల స్నేహితులు పట్టభద్రులవుతారు. మళ్ళీ కలుసుకుంటాం అంటారు, కాని అలా అవదు. స్నేహితులుగా లెక్కింపబడిన వారు త్వరలో వెళ్ళిపోతారు. కళాశాల నుండి పట్ట భధ్రులయ్యేటప్పుడు కూడ అలా జరుగుతుంది. పాఠశాలలో ఉన్నప్పుడు కూడ అలా జరగవచ్చు. ఏదో జరిగి స్నేహితులు నీ నుండి వెళ్ళిపోతారు. ఒక యువతి చెప్పింది, "ప్రతి ఒక్కరు నాకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది." అలా అవుతుందని ఆమె అనుకోలేదు, గాని జరిగింది. పాఠశాల గురించి మాట్లాడుతూ, ఆమె అనింది, "అక్కడ నుండి బయట పడడం ఆనందం."

చాలా మంది యవనస్థులు పట్టభద్రులు కాక ముందే పాఠశాల తోటి విధ్యార్ధులను వదులుకున్నట్టుగా భావిస్తారు. ఇది గ్రాడ్యుయేషన్ తర్వాత దారుణంగా ఉంటుంది. మీరంటారు "పరిచయంలో ఉందాం," కాని అది జరుగదు. తెలుసా, జరగనే జరగదు.

జోష్ మెక్ డోవల్ చెప్పాడు "ప్రతి విద్యార్ధి సంబంధ పర నష్టాన్ని ఎడబాటులో ఉన్న బాధను ఎదుర్కొంటారు" (The Disconnected Generation, Word, 2000, p. 154). ఆయన అన్నాడు ఐదు కారణాల వలన ఇది జరుగుతుందని:

I.  వారు లేక వారి స్నేహితులు కాని వెళ్ళిపోయినప్పుడు.
2.  వారి స్నేహితులు తిరస్కరించినప్పుడు.
3.  కుటుంబాలు విడిపోయినప్పుడు.
4.  ప్రణయము ముగిసినప్పుడు.
5.  స్నేహితులు కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు (ఐబిఐడి.,
     పేజీలు 155-160).

ఆయన యువకులలో ఎడబాటుకు ఆరవ కారణము కూడ ఇవ్వాల్సింది.

6.  మీరు పట్ట భద్రులైనప్పుడు.

అవును, ఆయన సరిగా చెప్పాడు, "ప్రతి విద్యార్ధి సంభందిత నష్టాన్ని ఎడబాటులో ఉన్న బాధను ఎదుర్కొంటారు." ఇది మీకు జరుగుతుంది – ఏదో విధంగా. ఎందుకు? లోకము ఇప్పటికే "గతించే స్థితిలో ఉంది" (రినెక్కర్, ఓపి. సిఐటి.).

నా భార్య ఇలియానా నేను కొన్ని ఏళ్ల క్రితం ఐగుప్తులో ఉన్నాము. గ్రేట్ ఫిరమిడ్ పైకి ఎక్కాము లోపలి సొరంగము ద్వారా దిగువ నుండి ఫారో సమాధి వరకు వెళ్ళాం. నాకు చెప్పారు మేము చెయ్యలేమని, కాని మేము చేసాం. ఫిరమిడ్ నుండి బయటకి చూడవచ్చు. ఇంకా అద్భుతంగా ఉంది, చాలా కాలమైనప్పటికిని. ఫరో నడిపిన నాగరికత పోయింది. అక్కడి ప్రజలు చాలా పేదవారు వెనుకబడిన వారు. ఒకప్పుడు భూమిపై గొప్ప దేశము. అంతా గతించి పోయింది. ఫిరమిడ్ తప్ప ఏమీ లేదు. సమాధి చెంబరు కూడ ఖాళీగా ఉంది. ఫరో శిధిలాలను దుండగులు నాశనము చేసి సమాధి సామాగ్రిని చాలా కాలము క్రితం దొంగిలించారు. సగం శిధిలమైన ఫిరమిడ్ ను మేము చూచినప్పుడు, నాకనిపించింది,

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది" (I యోహాను 2:17).

నేను ఇలియానా అబ్బాయిలు ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు వెస్ట్ మినిస్టర్ ఎబ్బే ద్వారా వెళ్ళాము. చాలా మంది గొప్ప ఆంగ్లేయులు, గొప్ప కవులు వేత్తలు సైనికులు అక్కడ పాతి పెట్టబడ్డారు. వారు ప్రఖ్యాత యుద్ధాలు పోరాడారు, ప్రసిద్ధి గాంచిన పుస్తకాలు రాసారు, ప్రపంచ ప్రఖ్యాత కవిత్వము. ఇప్పుడు వారి ఎముకలు ఆ భవనము యొక్క రాళ్ల క్రింద, నేల క్రింద, గోడలలో, ఉన్నాయి. ఆ మధ్యాహ్నము వెస్ట్ మినిస్టర్ ఎబ్బే ద్వారా మేము నడుస్తున్నప్పుడు మసగాగా ఉండి గొప్ప నిశ్శబ్దం ఉంది. ఈ పాఠ్య భాగము నా మనసు ద్వారా పరుగెత్తింది,

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది" (I యోహాను 2:17).

డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు,

దాని అంతటికి మహిమ ఉంది కాని, ఇప్పటికే గతించి పోయింది. ఈనాడు ఇంగ్లాండ్ ప్రపంచంలో మూడవ శక్తి వంత దేశము... లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి. [రాజైన] హెన్రీ VIII ఆశ ఎక్కడ ఉంది ఇప్పుడు? అక్కడ ఒక సమాధిలో ఉంది. వెస్ట్ మినిస్టర్ [ఎబ్బే]లో పాతి పెట్టబడిన మహిమను గూర్చి ఆలోచించండి – అదంతా గతించి పోయింది (Dr. J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson, 1983, volume V, p. 776).

చర్చిల్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడ ప్రయత్నించాడు, ఆయన హెచ్చరికలు వినబడక ముందే సామ్రాజ్యాన్ని కాపాడడం చాలా ఆలస్యమయింది. గొప్ప శ్రమతో ఇంగ్లాండ్ ను హిట్లర్ నాజిస్ లనుండి రక్షింపగలిగారు.

అది అమెరికాకు కూడా జరుగుతుంది. మన సమయము గడిచిపోతుంది. మన నాగరికత అంతరిస్తుంది. చాలా మంది తత్వవేత్తలు అంటున్నారు అమెరికా అంతాన్ని ఇప్పుడే మనము చూడబోతున్నామని.

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది" (I యోహాను 2:17).

ఉన్నత పాఠశాల ముగుస్తుంది. ఆ స్నేహితులను మళ్ళీ చూడరు. కళాశాల ముగుస్తుంది. ఆ స్నేహితులు కూడా పోతారు. కుటుంబం ఒకరి తరువాత ఒకరు చనిపోతారు – మీ తల్లి, మీ తండ్రి, ఇతర బంధువులు. అందరు పోతారు. చివరకు, మీకు కూడా పోతారు.

అది నాకు జరిగింది. పాఠశాల కళాశాల స్నేహితులంతా పోయారు. నా కుటుంబ సభ్యులు చనిపోయారు – నా తండ్రి, నా తల్లి, ఇతర బంధువులు. చివరకు, నేను కూడా పోతాను.

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది" (I యోహాను 2:17).

అప్పుడు నీవు ఏ కళాశాలకు హాజరయ్యావో అవసరము లేదు. ఎంత సంపాదించావో అనవసరము. అలాంటి జయం పొందావో అనవసరం. అందరు పోతారు. ఏదీ లెక్కలోకి రాదు, "ఏలయనగా ఈలోకపు నటన గతించుచున్నది" (I కొరిందీయులకు 7:31).

"మీ జీవమే పాటిది? మీరు కొంత సేపు కనపడి, అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే" (యాకోబు 4:14).

నేను వేరే సంఘ కాపరి టివిలో II వ ప్రపంచ యుద్ధము సినిమా చూస్తున్నాము. ఆ యుద్ధ సినిమాలో కొంత భాగాన్ని, 1940 ప్రఖ్యాతి గాంచిన పాత్రికేయుడు మార్తా గేల్ హార్న్ చే వివరింపబడింది. "ఆమె ఎవరో తెలుసా?" కాపరిని అడిగాను. "తెలియదు," అన్నాడు, "ఎవరు ఆమె?" "ఆమె ఎర్నెస్ట్ హెమింగ్ వె మూడవ భార్య." ఆయన ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయిత. చాల నవలలు సినిమాలుగా తీయబడ్డాయి. అధ్యక్షుడు కెన్నెడీ ఆరంభంలో మాట్లాడమన్నాడు. కాని చెయ్యలేక పోయాడు. ఆయన భార్య మార్త గెల్ హార్న్ ప్రసిద్ధ పాత్రికేయురాలు. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు! అతనిని ఎవరు గుర్తు పెట్టుకోరు, కూడా.

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది" (I యోహాను 2:17).

హేమింగ్ వలే సాహిత్యానికి, పులిట్ జెర్ వెల గెలువవచ్చు. ఏమి తేడా చేస్తుంది? మీరు టైమ్ మేగజైన్ కు రాయవచ్చు, మార్త గెల్ హార్న్ వలే. ఎవరు గుర్తుంచుకుంటారు? డోనాల్డ్ స్టెర్లింగ్ వలే, క్లిప్పర్స్ కలిగి ఉండవచ్చు. కొన్ని ఏళ్ల తరువాత ఎవరు తెలుసుకుంటారు? ఎవరు గుర్తుంచుకుంటారు? బయోన్స్ లేక మిలీ సైరస్ వలే ప్రసిద్ధ గాయకుడవు కావచ్చు. కొన్ని ఏళ్ల తరువాత ఎవరు తెలుసుకుంటారు? ఎవరు పట్టించు కుంటారు? దాని వలన ఏంటి?

నరకంలో కనులెత్తి చూచి అంటావు, "అది సత్యము! ఎంత అవివేకుడ్ని వినలేదు!"

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది" (I యోహాను 2:17ఎ).

II. కాని, రెండవదిగా, దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును.

పాఠ్యభాగము చెప్తుంది,

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది: గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును" (I యోహాను 2:17).

వచనము రెండవ భాగము చెప్తుంది దేవుడు కోరేది చేసే వ్యక్తి, దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తి, "నిరంతరము నిలుచును." గ్రీకు పదము అనువాదము "నిలుచును" అంటే "ఉండుట, కొనసాగుట, నిలిచి యుండుట" (స్ట్రాంగ్స్ యొక్క). మనం అనువదింపవచ్చు, "దేవుని చిత్తము జరుగించి వాడు నిరంతరము ఉంటాడు."

ఈ లోకములో మన భౌతిక ఇంద్రియాలకు తెలిసినవి గతించి పోతాయి. అంతా పోతుంది. కాని దేవుడు కోరేది చేసే వ్యక్తి నిరంతరము ఉంటాడు. దేవుని వాక్యంలో ఎంత అద్భుత వాగ్ధానము!

"దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును[ఉండును]" (I యోహాను 2:17బి).

ఆ అద్భుత పాత సువార్త పాట కూటము ఆరంభంలో మనం పాడినది పూర్తిగా సత్యము! అది మనకు పరలోకమును గూర్చి చెప్తుంది!

నేను గతంలో ప్రేమించిన స్నేహితులుంటారు, ఆనందము నది వలే నా చుట్టూ ప్రవహిస్తుంది;
కాని నా రక్షకుని నుండి చిరునవ్వు, నాకు తెలుసు, తరతరాలకు నాకు మహిమనిస్తుంది.
ఓ అది నాకు మహిమ, మహిమ నాకు , మహిమ నాకు.
ఆయన కృప ద్వారా ఆయన ముఖాన్ని చూస్తాను, అది మహిమ, అది నాకు మహిమ.
("ఓ అది మహిమ" చార్లెస్ హెచ్. గేబ్రియల్, 1856-1932).
   (“O That Will Be Glory” by Charles H. Gabriel, 1856-1932).

కాని అ పాటలోని గొప్ప వాగ్ధానము దేవుని చిత్తము జరిగించు వారికి మాత్రమే.

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది: గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును" (I యోహాను 2:17).

"దేవుని చిత్తము" ఏంటి నిత్య జీవము పొందుకోడానికి నీవు చెయ్యల్సింది? యేసు అన్నాడు,

"కుమారుని చూచి, ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును, నిత్య జీవము పొందుటయే, నా తండ్రి చిత్తము: అంత్య దినమున నేను వానిని లేపుదును" (యోహాను 6:40).

"దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుచును [ఉండును]." "నన్ను పంపించవాని చిత్తము అదే, కుమారుని [విశ్వాసము ద్వారా], చూచు ప్రతి వాడు, ఆయనను నమ్ము ప్రతివాడు, నిత్య జీవము కలిగి ఉండును: అంత్య దినమున నేను వానిని లేపుదును." ప్రతి వ్యక్తి విశ్వాసము ద్వారా యేసు క్రీసును చూస్తే, సంపూర్ణంగా నమ్మితే, నిత్య జీవము పొందుకుంటాడు. అది యేసు క్రీస్తు వాగ్దానము – ఆయన ఎన్నడూ అబద్ధమాడడు!

నీవు యేసును నమ్ముట దేవుని చిత్తము. హృదయ పూర్వకంగా నీవు ఆయన వైపు తిరిగితే, నీవు ఉన్నపాటున రక్షింపబడతావు. నీవు చనిపోయాక నిత్య జీవము పొందవు. ఓ, కాదు! ఇప్పుడే నిత్య జీవము పొందుకుంటావు – నీవు సంపూర్ణంగా పూర్తిగా యేసు క్రీస్తును నమ్మితే, దైవ కుమారుడు. యేసు అన్నాడు:

"నేను వాటికి నిత్య జీవము [నిచ్చుచున్నాను]; కనుక అవి ఎన్నటికిని నశింపవు" (యోహాను 10:28).

దేవుని చిత్తము నీ పట్ల పాపము నుండి మరలి హృదయ పూర్వకంగా యేసును నమ్మి. నీ పాప ప్రాయశ్చిత్తము క్రీస్తు సిలువపై మరణించాడని నమ్మాలి. క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచాడు. ఆయన సజీవంగా దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మీరు యేసు వచ్చినప్పుడు, ఆయన రక్షించు రక్తముతో నీ పాపాలను కడుగుతాడు. నిత్యత్వ మహిమను అనుగ్రహిస్తాడు.

ముగింపు:

"లోకమును దాని ఆశయు, గతించి పోవుచున్నది." లోకము నశించి పోవుతున్నది. లోకంలో ఉన్న స్నేహితులను ఇప్పటికే కోల్పోయావు. ఉన్నత పాఠశాల నుండి పట్ట భద్రులైన వారిని కోల్పోయావు. కళాశాల ముగిసాక వారిని పోగొట్టుకున్నావు. జీవిత విచ్చిన్నతలో వారిని కోల్పోయావు. వారు చనిపోయినప్పుడు వారిని కోల్పోతావు. త్వరలో స్నేహితులంతా పోతారు, ఏదో విధంగా, నిజ క్రైస్తవులైతే తప్ప. నిజంగా రక్షింపబడిన వారు నీ స్నేహితులైతే, దేవుని రాజ్యములో నిరంతరము వారితో సంతోషిస్తావు! అందుకే మనం అంటాం, "ఎందుకు ఒంటరి తనం? ఇంటి గుడికి రండి! క్రీస్తు ఇంటికి రండి!" నీవు రక్షింపబడిన నీ స్నేహితులు నిత్య జీవము కలిగి ఉంటారు. మీరు మీ స్నేహితులు అందరు పరలోకములో కలుసుకుంటారు. వారి నిజ స్నేహాన్ని నిరంతరము అనుభవిస్తావు. ఎంత అద్భుత వాగ్ధానము!

కాని నీవు దేవుని చిత్తము జరిగించాలి. పాపము నుండి మరలి యేసు క్రీస్తు నొద్దకు రావాలి, "లోక పాపములను మోసుకొని పోవు, దేవుని గొర్రె పిల్ల" (యోహాను 1:29).

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది: గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును" (I యోహాను 2:17).

నీవు లోకాన్ని పాపాన్ని విడిచి, యేసు నొద్దకు వస్తావా? ఆయన యొద్దకు రావాలని యేసు పిలుచుచున్నాడు. ఆయన అన్నాడు,

"ప్రయాసపడి భారము మోయుచున్న, సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ జేతును" (మత్తయి 11:28).

లారా అనే అమ్మాయి సాక్ష్యము వినండి. ఆమె ఆరాధనలో ఉన్నారు. లారా, దయ చేసి నిలబడు. కూర్చోవచ్చు. లారా అన్నారు,

      నేను ఏప్రిల్ 28, 2011 న గుడికి వచ్చాను. గుడిలో ఆహ్వానము పొందాను, కాని అది నా పాప భారము తొలగింప లేదు. డాక్టర్ హైమర్స్ బోధ విన్నప్పుడు నేను విన్న మొదటి ప్రసంగములోనే నా పాపపు ఒప్పుకోలు పొందాను. ఆ ప్రసంగము నేరుగా నా కొరకే అనిపించింది డాక్టర్ హైమర్స్ నాకే బోధిస్తున్నారనిపించింది. రెండు వారాలు, భార హృదయంతో ఇంటికి వెళ్ళాను, అప్పుడు విచారణ గదికి వెళ్ళడం ప్రారంభించాను. ప్రసంగము ద్వారా విచారణ గది ద్వారా, నా పాప దుస్థితిని చూసాను. నా పాపాలను అసహ్యించుకున్నాను. నేను దుష్టురాలను, నిరుపయోగిని, చెడ్డదానిని, అని భావించి నాలో ఏమంచి లేదని గ్రహించాను. నేను తెలుసుకున్నాను నా పాపాలు బట్టి నరకము నాకు తప్పదని. చాలా రోజులు, నిద్రపోలేక పోయాను పాపలలో చనిపోతానేమోనని భయాన్ని అనుభవించాను. ప్రతి రాత్రి, నాపై దయ చూపమని దేవునికి పట్టుదలగా ప్రార్ధించాను.
      నాపై దయ చూపమని ప్రభువుకు ప్రార్ధిస్తున్నాను, దుష్ట పాపినని గ్రహించాను. అంతేకాక, నన్ను క్షమించమని యేసుకు ప్రార్ధించాను ఆయన రక్తములో నన్ను కడగమని అడిగాను.
      జూన్ 18, 2011న, శనివారము సాయంత్రము, డాక్టర్ హైమర్స్ అన్నారు బోధిస్తూ, "యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు." మొట్ట మొదటిసారి యేసు ప్రేమ నాకు నిజము అయింది. యేసును గూర్చిన సమస్తము రక్షించడానికి సిలువపై ఆయన శ్రమ, అర్హత లేని పాపి కొరకు, మొట్టమొదటి సారి నాకు నిజము అయింది. నన్ను విచారణ గదికి పిలిచినప్పుడు, మొట్ట మొదటి సారిగా తెలుసుకున్నాను యేసు నిజంగా నన్ను ప్రేమించాడని. తరువాత, డాక్టర్ కాగన్ యేసు నొద్దకు నన్ను రమ్మన్నప్పుడు, విశ్వాసము ద్వారా వచ్చాను, యేసు నన్ను రక్షించాడు! ఆయన రక్తము నా పాపలన్నింటిని కడిగింది! ఆయన శ్రమ బాధ సిలువపై ఆయన ప్రేమ ద్వారా నాకు కొరకు వచ్చింది. మరియు మొదటి సారి, నా దృష్టిలో భావోద్వేగ ఏ కన్నీళ్లు లేవు. సామాన్య విశ్వాసము ద్వారా నేను క్రీస్తు నొద్దకు వచ్చాను, ఆయన నన్ను రక్షించాడు.

మీరు మాతో పాపాలను గూర్చి కడగబడడం విషయంలో మాట్లాడాలనుకుంటే, ఇప్పుడే ఆవరణము వెనుకకు నడవండి. డాక్టర్ మిమ్ములను వేరే గదికి తీసుకెళ్ళి రక్షింపబడడానిని గూర్చి మీతో మాట్లాడుతారు. ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ చాన్, ఈ ఉదయం కాలాన కొంత మంది యేసును నమ్మునట్లు ప్రార్ధించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: I యోహాను 2:15-17.
ప్రసంగము ముందు పాట జాన్ సామ్యూల్ కాగన్: "యేసు నందు"
(జేమ్స్ ప్రోక్టర్ చే, 1913).


ద అవుట్ లైన్ ఆఫ్

డాక్టర్ కాగన్ వచనము

DR. CAGAN’S VERSE

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"లోకమును దాని ఆశయం, గతించి పోవుచున్నది: గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును" (I యోహాను 2:17).

I.   మొదటిది, లోకము గతించి పోవుచున్నది, I యోహాను 2:17ఎ;
I కొరిందీయులకు 7:31; యాకోబు 4:14.

II.  రెండవదిగా, దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము
నిలుచును, I యోహాను 2:17బి; యోహాను 6:40; 10:28;
1:29; మత్తయి 11:28.