Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నిద్ర పోవద్దు – ఇతరులు చేస్తున్నట్టు!

DON’T SLEEP – AS OTHERS DO!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జూన్ 22, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, June 22, 2014

"కావున ఇతరుల వలే, నిద్ర పోకయుందము"
(I దెస్సలొనీకయులకు 5:6).


అపోస్తలుడైన పౌలు "ప్రభువుదినము" గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ సమయం మహా శ్రమలతో ప్రారంభమవుతుంది, "అకస్మాత్తు నాశనము"గా వస్తుంది, "వేదనగా" – "పురిటి నొప్పులుగా" బిడ్డకు జన్మనిచ్చే తల్లికి వచ్చినట్టుగా వస్తుంది. ప్రభువు దినము వచ్చినప్పుడు, లక్షలాది మంది దానికి సిద్ధంగా ఉండరు. మన సంఘస్తులు చాలా మంది శ్రమ వచ్చినప్పుడు ఆ కాలపు బాధ వచ్చినప్పుడు పడిపోతారు!

అపోస్తలుడు చెప్పాడు "వారు చీకటిలో లేరు" అని. బైబిలు ప్రవచనము వారికి తెలుసు. రాబోవు శ్రమను గూర్చి, ఎత్తబడుటను గూర్చి వారికి తెలియకుండా లేదు. ఆయన అంటాడు, "కావున ఇతరుల వలే మనము నిద్ర పోవద్దు; మెలకువ కలిగి ఉందాము." ఎందుకంటే మనం పడుకోకూడదని ఆయన ప్రాధేయ పడుచున్నాడు, మనం చెప్పవచ్చు నిజంగా మారిన వారికి "పడుకోవడం" సాధ్యమేనని. మారని వారు నిద్రలో ఉంటారనడం వాస్తవం. ఆ రెండు గుంపులను గూర్చి ఈ ఉదయం మాట్లాడతాను.

I. మొదటిది, ఇప్పటికే మారిన వారు అనాలి, "ఇతరుల వలే, నిద్రపోక యుందము."

దీనిని గూర్చి ప్రశ్నే లేదు. నిజ క్రైస్తవులు నిద్ర పోతారు. పది మంది కన్యకల ఉపమానము దీనిని తేటగా చెప్తుంది. యేసు అన్నాడు,

"పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, వారందరూ కునికి నిద్రించు చుండిరి" (మత్తయి 25:5).

చాలా మంది నిజ క్రైస్తవుల పరిస్థితి అదే. వారు కునికి నిద్రిస్తున్నారు. మన సంఘాలలో కూడా, ఈ ఉదయాన కొంత మంది క్రైస్తవులు, అదే స్థితిలో ఉన్నారు.

క్రైస్తవుడు తెలియకుండానే నిద్రలోనికి వెళ్లిపోవచ్చు. మీరు అనవచ్చు, "నేను మత్తు నిద్రలో ఉన్నాను" అని నిద్ర పోవటం లేదు అని అర్ధము. మత్తులో ఉన్న వారికి తెలియదు. మీరు నిద్రలో ఉండి లేవడం లేదు ఎందుకంటే గుడిలో మీ స్నేహితులు కూడా నిద్ర పోతున్నారు. ఎవరైనా మిమ్మల్ని లేపాలని ప్రయత్నిస్తే, వారు చెప్పేది తిరస్కరించి, వానికి తీర్పు తీర్చి, వారు ఎక్కువ కఠినలు అని అంటాము.

క్రైస్తవునిలో నిద్ర పోవడం చాలా ప్రమాదకరం ఎందుకంటే నిద్ర పోతున్నప్పుడు చాలా చెయ్యవచ్చు. కొంత మంది నిద్రలో మాట్లాడతారు. కొంత మంది నిద్రపోతున్న క్రైస్తవులు వారు చురుకుగా ఉన్నామని సహృదయులమని చెప్పుకుంటారు. వారు ప్రార్ధించేటప్పుడు ఇది తేటగా కనిపిస్తుంది. వారు ప్రార్ధించేటప్పుడు ఆత్మీయంగా నిద్రిస్తుంటారు. ప్రార్ధించేటప్పుడు వారు చేసే బిగ్గర స్వరము చెప్తుంది వారు నిద్రలో ప్రార్దిస్తున్నారని. అవే పదాలు మళ్ళీ మళ్ళీ చెప్తారు. నిజమైన తృష్ణ ఉండదు. వారు నిద్ర పోవడమే కాకుండా, కూటాలలో గట్టిగా ప్రార్ధిస్తూ మిగిలిన వారిని కూడా నిద్ర పుచ్చుతారు. కొంతమంది ప్రార్ధించడానికి ప్రయత్నించడం చూసాను, కాని వారి స్వరాలే చెప్తాయి వారికి తృష్ణ లేవని. వారు నిజంగా ప్రార్ధించడం లేదు, కాని ప్రార్ధన పలుకులు వల్లిస్తున్నారు, నిద్రలో మాట్లాడే వారిలా. ఒకరు ప్రార్ధనలో నడిపిస్తుంటే మిగిలిన వారి మనసులు ఇటు అటు తిరుగుతుంటాయి. ప్రార్ధన వెంబడించరు, చివరిలో "ఆమెన్" అనరు. తరువాత, మెలకువలో నిజంగా ఎవరైనా ప్రశ్నిస్తే బలంగా జీవంతో, వారు అకస్మాత్తుగా గెంతుతారు – ఉత్తేజింపబడినట్టు.

చాలా మంది నిద్రలో పాడతారు. ఇతరులు హృదయంత రంగాల నుండి పాడుతుంటే, నిద్ర పోతున్న వాడు పదాలు వల్లిస్తాడు. పెదవులు చప్పుడు చేస్తాయి, హృదయాలు వాటిలో ఉండవు. నడిపించు వారు పదే పదే "పాడండి" అని గుర్తు చేస్తుండాలి! వారు నిద్ర పోతున్నారు అని గ్రహించడం చాలా కష్టం ఎందుకంటే వారు ప్రార్ధన వల్లిస్తారు, పాటలు పలుకుతారు, అయిననూ వారిలో జీవము గాని ఉత్సాహము గాని ఉండదు, ఎందుకంటే వారు ఆత్మీయ నిద్రలోనికి వెళ్ళిపోయారు.

కొంతమంది నిద్రలో నడుస్తుంటారు. మీరు "నిద్రలో నడక" ను గూర్చి వినే ఉంటారు. మీరు ఎవరినైనా నిద్రలో నడుస్తూ కూడా సువార్త పనికి వెళ్ళడం చూసారా? కొంతమంది ఆత్మల సంపాదనకు వెళ్లి చాలా మందిని తెస్తారు – కాని ఒక వ్యక్తి వెళ్లి ఒక్కరిని లేక ఎవ్వరిని తేడు, ఈ విషయంలో ఆశ్చర్యపడ్డారా? వారు ఆత్మీయంగా నిద్ర పోతున్నారు! గుడికి మనం కొత్త వారిని తీసుకొచ్చినప్పుడు, వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో చాలా ఆతృత కలిగిఉంటారు – కాని కొందరు, నిద్ర పోతున్న వారు, ఇదంతా మర్చిపోతారు – ఎందుకంటే వారు దేవుని విషయాలలో నిద్ర మత్తులో ఉంటారు.

చాలా మంది బోధకులు ఈ రోజుల్లో నిద్ర పోతున్నారు. వచనం వెంబడి వచనం బైబిలు పఠనము చేస్తారు. చాలా మంది వినడం లేదని కూడా గమనించరు – చాలా మంది, ప్రతివారం వస్తున్నప్పటికిని, వాస్తవానికి నశించిపోయారు! అలాంటి కాపరులు ప్రజలను మేల్కొల్పే బోధకులంటే భయపడతారు! వారు మేల్కోవడం ఇష్టపడరు! ఆదివారం నిద్రపోతున్న గొర్రెలు వచ్చి సగం చచ్చిన "బైబిలు పఠనంలో" కూర్చుంటే వారు ఆనంద పడతారు. దేవుడు మనకు సహాయము చేయును గాక! చాలా మృత సంఘాలు ఉన్నాయి! చాలా శారీరక జీవితము పాపము ఎక్కువగా ఉంది! కొన్ని సంఘాలు గాఢ నిద్రలో ఉండి ప్రార్ధనా కూటాలు ఆపేశారు, వాటిని "వారము మధ్య బైబిలు పఠనము"గా మార్చేశారు. కొంతమంది "ప్రార్ధించడం" నేను విన్నాను గుడులలో మృతుని మాటల వలే ఉంటాయి! ఇవి నిజ ప్రార్ధనలు కావే కావు! ఈ రోజుల్లో గుడులలో నిజ ప్రార్ధన చాలా తక్కువగా ఉంది. లేచి మగాడిలా ప్రార్ధించండి, ఇంకొక కాపరి మౌనంగా ఉండమన్నాడు. అతడు మన వ్యక్తిని వాళ్ళ వారిలా మృత, నిద్ర పూరిత ప్రార్ధన చెయ్యమన్నాడు! మన దేశము కుంటువడుతుంది! ఆశ్చర్యము లేదు, జార్జి బర్నా అన్నాడు, 88% యువకులు ఈ గుడులలో 25 సంవత్సరాలకు ముందే వదిలి వెళ్ళిపోతున్నారు, "తిరిగి రాకుండా." దేవుడు మనకు సహాయము చెయ్యాలి! వారు నిద్ర పోతున్నారు, వారికి తెలియదు కూడ! ప్రభువైన దేవుడు మన గుడిలో ఎక్కువ మందిని మెలకువగా ఉంచి ఈ విషయాలు జరగకుండా సహాయము చేయును గాక! "ఇతరుల వలే, మనము నిద్ర పోక యుందము" (I దెస్సలొనీకయులకు 5:6).

డాక్టర్ కాగన్ నాతో చెప్పాడు కాపరులు ఇక్కడకు వచ్చి బోధింప ఇష్ట పడతారు "ఎందుకంటే మన వారు సీట్లలో ముందుకు వంగి, ఆసక్తితో వింటూ, కొన్ని సార్లు హర్షము వ్యక్తము చేస్తారు." ఏది ఏమైనా! "ఇతరుల వలే, నిద్ర పోవద్దు! " ఒక బోధకుడు నాతో అన్నాడు హర్ష ధ్వని ఉంటే వృద్ధ స్త్రీలు గుడిలో నుండి లేచి వెళ్లి పోతారు. నేననుకుంటాను, "వారు మెధడిష్టు సంఘానికి వెళ్ళాలి, వారికి సరిపోతుంది! మృత ఆరాధన కోసం ఎపిస్కోపల్ గుడికి వెళ్ళండి!"

II. రెండవది, మనం ప్రార్ధించాలి ఇంకా మార్పు నొందని వారు చెప్పాలి, "ఇతరుల వలే, మనము నిద్రించకూడదు."

మొదటి రెండు వరుసలలో చిన్న పిల్లలను చూడడం నాకు ఇష్టం. నా ప్రార్ధన వారు దేవునికి భయపడాలని క్రీస్తును ప్రేమించాలని, యవనులుగా ఉన్నప్పుడే. ఇప్పుడు వారిని ప్రక్కన పెడుతున్నాను. నేను కొంతకాలంగా మన గుడికి వస్తున్న యవనస్థులతో మాట్లాడుతున్నాను, వారు ఇంకా రక్షింపబడలేదు. బైబిలు మీకు చెప్తుంది,

"నిద్రించుచున్న నీవు మేల్కొని, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును" (ఎఫెస్సీయులకు 5:14).

ఒక ఆజ్ఞ ఉంది, దేవుడు మిమ్ములను మేల్కొల్పే వరకు దానికి విధేయులవలేరు. మానవుడు సహజంగా పాపి. అంటే ఎలా రక్షింపబడాలని నీకు తెలియదు అర్ధం కాదు. వివరంగా వివరించినా, మీకు అర్ధం కాదు. సామాన్య సువార్త వెయ్యిసార్లు వినవచ్చు, అయినా పూర్తిగా అందుడిగా ఉండవచ్చు. అపోస్తలుడు అన్నాడు,

"ప్రకృతి సంబంధియైన [మారని] మనష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు: అది అతనికి వెర్రి తనముగా ఉన్నవి: అవి ఆత్మానుభవము చేతనే వివేచింప దగును, కనుక అతడు వారిని గ్రహింపజాలడు" (I కొరిందీయులకు 2:14).

అందుకే మీలో కొందరు రక్షణ విషయములో చాలా సార్లు మమ్ములను చూడవచ్చారు, కాని మీకు ఏ మంచి జరగలేదు. మేము మీకు చెప్తాం, "యేసు నోద్దకు రండి" అని. మీరంటారు, "కాని ఎలా నేను ఆయన దగ్గరకు రావాలి?" మేముంటాము, "ఎలా అని మీరు తెలుసుకోనవసరము లేదు – ఆయనను మాత్రము నమ్మండి." మీరంటారు, "కాని నేను ఎలా ఆయన యందు నమ్మిక ఉంచాలి?"

క్షమించండి, నేను చాలా చాలా సార్లు చెప్పాను, మీకు ఉపయోగపడే విధంగా ఆ విషయాలు మీకు వివరించ లేదు. దేవుని ఆత్మచే మేల్కొల్ప బడాలి, లేకపోతే మా మాటలు మీకెప్పుడు సహాయపడవు! పరిశుద్దాత్మ ద్వారా మీరు క్రీస్తు నోద్దకు చేర్చబడాలి. ఆయన దగ్గరకు రావడం మీరు నేర్చుకోలేరు! పాట రచయిత ఆండ్రూ రీడ్ ఇలా అన్నాడు,

పరిశుద్దాత్మ, దైవిక ప్రకాశముతో,
         నా హృదయముపై ప్రకాశిస్తుంది;
రాత్రి నీడలను వెంటాడి,
         నా చీకటిని పగలుగా మారుస్తుంది.
("పరిశుద్ధాత్మ, దైవిక ప్రకాశముతో" ఆండ్రూ రీడ్ చే, 1787-1862).

రెండవ గొప్ప మేల్కొలుపులో, థామస్ చార్లెస్ (1755-1814) అన్నాడు, "నిశ్చల ప్రజలు మేల్కొల్పబడ్డారు...ఒప్పుకోలుతో ప్రజలు పిచ్చివారై...గొప్ప దుస్థితిలో ఏడుస్తూ, పాప ప్రమాదము గ్రహించి, కనికరము కొరకు ఏడుస్తూ...వారి ఆత్మల కొరకు శ్రద్ధ కలిగి యున్నారు" (Paul E. G. Cook, Fire From Heaven, EP Books, 2009, p. 34). దేవుడు పంపిన ఉజ్జీవంలో చాలా మందికి అదే జరుగుతుంది. మార్పిడిలో ఒక వ్యక్తికి కూడా అదే జరుగుతుంది. ఒక నశించు పాపి దుఃఖించినప్పుడు "పాపపు ప్రమాదము గ్రహించి, కృప కొరకు మోర పెట్టినప్పుడు" తక్కువ వ్యవధిలో ప్రజలు క్రీస్తు నొద్దకు వచ్చి రక్షింపబడతారు.

ఇది ఎలా జరుగుతుంది? క్రైస్తవేతరుని ఇంటి నుండి గుడికి వచ్చే వ్యక్తి విషయంలో ఇలా సాధారణంగా మార్పిడి సంభవిస్తుంది. ఒక కాపరి ఎలా మారాడో అనే విషయ సమీక్ష మీకు ఇస్తాను, ఆయన వ్రాసిన పుస్తకము నేను చదువుతూ ఉన్నాను.

గుడి అంటే ఆయనకు ఆసక్తి లేదు, బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. గుడి టీంలో చేరమని ఒక కాపరి ఆయనను ఆహ్వానించాడు. టీమ్ తో కలిసి బాస్కెట్ బాల్ ఆడవచ్చని గుడికి రావడానికి ఇష్టపడ్డాడు. గుడిలో విన్న బోధలు ఎక్కలేదు, కాని గుడికి వచ్చేవాడు. క్రమేణా బాస్కెట్ బాల్ కంటే గుడి ఎక్కువ ప్రాముఖ్యమయింది. కొంత కాలానికి "రక్షించబడడం" మాట ఆయన మనసులో పడింది. అది అతనికి, లేను అని గ్రహించాడు. ఆయన ఆలోచించేది ఎవరికీ తెలియ కూడదనుకున్నాడు, అందువలన ఆహ్వాన మిచ్చినప్పుడు మాట్లాడడానికి కాపరి దగ్గరకు వెళ్ళలేదు. "మంచి" వ్యక్తిగా అవాలనుకున్నాడు, చెడ్డ భాష ఆపేసాడు. కాని మంచి వ్యక్తిగా అవడానికి తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మారడానికి తనలో ఏ శక్తి లేదని గ్రహించి దిగ్బ్రాంతి చెందాడు. ఆయన అన్నాడు, "మంచి వ్యక్తిగా అవాలనే నా ప్రయత్నము విఫలతతో ముగిసింది." అలాగే దేవుని గూర్చి యేసును గూర్చి ఆలోచించడం ప్రారంభించాడు. ఉదాహరణకు, యేసు ఎందుకు సిలువపై మరణించాడు? దాని గూర్చి మునుపెన్నడూ ఆలోచించలేదు, ఇప్పుడది ప్రాముఖ్యంగా తోస్తుంది. ఆయన అన్నాడు, "నేను తికమకలో ఉన్న యవనస్థునిగా ఉన్నాను ఈ నూతన ప్రపంచము తెరుచుకొనే వరకు."

చివరకు, పాపపు ఒప్పుకోలుతో, ప్రసంగము చివరిలో స్పందించి కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళాడు. తాను అన్నాడు, "ఇది భావోద్రేక అనుభవం." ఆ రాత్రి యేసును విశ్వసించాడు. కాపరి చెప్పాడు అది యాబై సంవత్సరాల క్రితం జరిగింది, కాని ఆ రాత్రి గుర్తుండి పోయింది "అది తన జీవిత మార్గాన్ని భూమిపై మార్చేసింది నిత్యత్వ గమ్యాన్ని కూడ." చాలా సంవత్సరాలుగా ఆయన సంస్కరింపబడిన కాపరి. ఆయన వ్రాసింది నేను సమగ్ర పరిచాను. ఆయనలా మీరు కూడా మేల్కొని రక్షింపబడవచ్చు! (Stephen Smallman, What is True Conversion?, P & R Publishing, 2005, pp. 8-10).

"ఇతరుల వలే, మనము నిద్రపోక యుందము" (I దెస్సలొనీకయులకు 5:6).

ఆ సాక్ష్యము చదివేటప్పుడు నా మార్పునకు అది దగ్గరగా ఉన్నట్టు గ్రహించాను. నా పొరుగువాడు తన పిల్లలతో నన్ను బాప్టిస్టు సంఘానికి తీసుకెళ్ళాడు. వారు మంచిగా ఉన్నారు కాబట్టి వారితో గుడికి వెళ్ళేవాడిని. ప్రసంగాలు అర్ధమయ్యేవి కావు, "రక్షింపబడుట" పదాన్ని నేర్చుకున్నాను. నా జీవితాన్ని శుద్ధి చేసుకొని, సేవకు వెళ్ళాలని బాహాట నిర్ణయము తీసికొన్నాను, అది నన్ను రక్షిస్తుందని. అది పని చెయ్యనప్పుడు మిస్సెనరీ కావాలనుకున్నాను, చైనీయ బాప్టిస్టు సంఘములో చేరాను. అది పని చెయ్యనప్పుడు, దుర్భరంగా పాప భరితంగా అనిపించింది, బయోలా కాలేజీలో చేరాను. అక్కడ డాక్టర్ చార్లెస్ జె. ఉడ్ బ్రిడ్జి ఇచ్చిన ప్రసంగము విన్నాను, ఆ ఆరాధనలో క్రీస్తు దిగి వచ్చాడు నేను ఆయనను విశ్వసించాను, ఆయన రక్తము నీతి ద్వారా రక్షింపబడ్డాను.

నేను"ముందుకు" చాలా సార్లు వెళ్ళాను, కాని రక్షింపబడలేదు. చాలా సార్లు నా జీవితాన్ని తిరిగి క్రీస్తుకు సమర్పించుకున్నాను, కాని రక్షింపబడలేదు. యేసు తానే నా దగ్గరకు వచ్చి, ఆయన కృపా కనికరాల ద్వారా నన్ను రక్షించి, తన స్వరక్తముతో నా పాపాన్ని కడిగాడు!

నా సాక్ష్యములో సంస్కరణ కాపరి సాక్ష్యములో ఏది ఒకేలా ఉంది? ఆహ్వానింపబడ్డాం కాబట్టి గుడికి వచ్చాం. మాకు క్రైస్తవ గతము లేదు. ప్రజలతో మాతో మంచిగా ఉన్నారని గుడికి వచ్చాం. ప్రసంగాలు ఎలా అన్వయింపబడతాయో మాకు తెలియదు. మా ఇద్దరికీ తెలుసు మేము "రక్షింప" బడలేదని. మంచి వారమై క్రైస్తవులమవుదామని ప్రయత్నించాం. ఇద్దరం విఫలమయాం. పాపపు ఒప్పుకోలుతో, యేసు నందలి సామాన్య విశ్వాసము ద్వారా మేమిద్దరం సమాధానము రక్షణ కనుగొన్నాం.

విశ్వాసము లేకుండా గుడికి వచ్చాం. చివరకు, నశించిన పాపులమని మేల్కొల్పబడ్డాం. పరిశుద్దాత్మ యేసు నోద్దకు నడిపించండి. యేసు నోద్దకు ఎలా రావాలో "మాకు తెలియదు". మేల్కొల్పబడి పాపపు ఒప్పుకోలు వచ్చాక, పరిశుద్దాత్మ ఆయన యొద్దకు నడిపించింది. అది సామాన్యము అది కృప చేతనే, పరిశుద్దాత్మ నడిపింపుతోనే, క్రీస్తు రక్తము మన పాపాలను కడగడం ద్వారా!

"ఇతరుల వలే, మనము నిద్రపోక యుందము" (I దెస్సలొనీకయులకు 5:6).

కాని పుట్టి గుడిలో పెరిగిన వారి సంగతేంటి? వారు ఎలా మారతారు? వారి సాక్ష్యము ఒకటి ఉంది. జీవితమంతా గుడిలో ఉన్న ఒక యువకునిది. నిజానికి, పుట్టిన బిడ్డగా గుడికి తేబడ్డాడు. ఆయన సాక్ష్యములో కొన్ని భాగాలు ఇవి.

         విశ్రాంతికి ఎంత ప్రయత్నించినా, నిద్ర వచ్చేది కాదు ఎందుకంటే దేవుడు నా చిత్తానికి కట్టడవేసాడు. ఆదివారం ఉదయం…వచ్చేసరికి, మానసికంగా ఆత్మీయంగా అలసినా, బలంగా ఉండాలని దేవునితో పోరాడేవాడిని. బోధ జరిగేటప్పుడు, నేరారోపణ భావాలను నోరు బిగ పట్టి కళ్ళు మూసికొని అణచి వేసేవాడిని...నేను భయంకర పాపినని నాకు తెలుసు, కాని క్రీస్తు పిలుపుకు లొంగే వాడిని కాదు.... ప్రసంగము అంతులేనిదిగా ఉండేది...దేవుని దృష్టిలో అపరిశుద్దునిగా భావించే వాడిని. నా పాపాలు నేను చేసిన విషయాలు తక్కువ మరియు తక్కువ మారింది, నా పాపాలు నానాటికి పెరిగి పోతుండేవి. కాపరి ఆహ్వానము ఇచ్చాడు...డాక్టర్ హైమర్స్ [అప్పుడు] క్రీస్తును నమ్మి, ఆయన దగ్గరకు రావాలని ప్రాధేయపడ్డాడు. సరే అనిపించినా, వెళ్ళేవాడిని కాదు. ఆ సమయంలో, ఎలా యేసును నమ్మాలి అని మోకరించినప్పుడు, నేను చేసిన ఘోర పాపము చూసాను అది యేసునే తిరస్కరించుట. ప్రయత్నించే కొలది...నా స్వశక్తితో, అయినా ఆయనను తిరస్కరించే వాడను. యేసును నమ్మడానికి ప్రయత్నించే కొలది, అలా చేయలేక పోయేవాడిని. నిరాశ ఓటమి అనిపించింది...యేసు ఆయన యొద్దకు పిలుచుచున్నాడు…కాని మొండిగా నా పందాలో చేస్తున్నాను. అకస్మాత్తుగా ఒక ప్రసంగములోని మాటలు మెల్లగా నా చెవిలో మోగాయి, "క్రీస్తుకు లోబడు! క్రీస్తుకు లోబడు!" ఒక్క క్షణంలో, నాకై సిలువపై వ్రేలాడిన క్రీస్తును ఎలా తిరస్కరించానో అనే తలంపు నా హృదయాన్ని ఆవరించింది. దైవ కుమారుడు దివి నుండి దిగి నా కొరకు చనిపోయాడు, నేను ఆయన శత్రువు అయినప్పటికిని. నాపునాదిని కదిల్చింది. ఒక్క క్షణంలో క్రీస్తుకు లోబడి ఆయనను నమ్మాను. నా గతం మరచి, యేసుపై అనుకున్నాను...యేసు నన్ను స్వంతం చేసుకున్నాడు. యేసు నన్ను చేర్చుకున్నాడు. నేను తిరస్కరించినట్లు నన్ను తిరస్కరించలేదు. క్రీస్తు నన్ను రక్షించడానికి నా పాపాలు క్షమించడానికి, ఆయన పడిన కష్టాన్ని నేను అడ్డుకుంటూ వచ్చాను. నన్ను రక్షించడానికి, యేసును "అనుమతించిన" వెంటనే, ఆయన తక్షణమే నా దగ్గరకు వచ్చి, ఆయన రక్తములో నన్ను కడిగాడు! యేసును నమ్మడం నా స్వచిత్తము కాదు, కాని నేను ఆయనకు లోబడ్డాను! నా మార్పు సమయము సామాన్యము నా క్రియల ప్రమేయము లేదు, అవి అవసరమే లేదు. అంతా కృప మాత్రమే...నా అంతటితో యేసును ప్రేమించాను, మిగిలినది ఆయనలోనే.

మీరు మీ పాపాన్ని గ్రహించి యేసు రక్తముతో కడుగబడాలి! ఓ, ఈ ఉదయము, ఇలా చెప్పాలి,

మీ ఆహ్వాన స్వరం విన్నాను, నన్ను పిలిచేది, ప్రభువా, నీవు
     మీ ప్రశస్త రక్తములో కడగడానికి, కల్వరి నుండి కారిన రక్తము.
నేను వస్తున్నాను, ప్రభూ! మీ చెంతకు వస్తున్నాను!
     నన్ను కడగండి, కల్వరి నుండి కారిన రక్తములో నన్ను శుద్ధి చెయ్యండి.
("నేను వస్తున్నాను, ప్రభూ" లూయిస్ హార్ట్ షా చే, 1828-1919).
(“I Am Coming, Lord” by Lewis Hartsough, 1828-1919).

"మనము ఇతరుల వలే, నిద్రపోక యుందము" (I దెస్సలొనీకయులకు 5:6).

విచారణ గదికి ఇప్పుడే వెళ్ళండి. ఆవరణము వెనుకకు వెళ్ళండి డాక్టర్ కాగన్ తో, ప్రార్ధించి మాట్లాడవచ్చు. డాక్టర్ చాన్, ఈ ఉదయం కొందరు యేసును నమ్మునట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: I దెస్సలొనీకయులకు 5:1-6.


ద అవుట్ లైన్ ఆఫ్

నిద్ర పోవద్దు – ఇతరులు చేస్తున్నట్టు!

DON’T SLEEP – AS OTHERS DO!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మనము ఇతరుల వలే, నిద్రపోక యుందము"
(I దెస్సలొనీకయులకు 5:6).

I. మొదటిది, ఇప్పటికే మారిన వారు అనాలి, "ఇతరుల వలే, నిద్రపోక యుందము," మత్తయి 25:5.

II. రెండవది, మనం ప్రార్ధించాలి ఇంకా మార్పు నొందని వారు చెప్పాలి, "ఇతరుల వలే, మనము నిద్రించకూడదు," ఎఫెస్సీయులకు 5:14; I కొరిందీయులకు 2:14.