ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మతభ్రష్టత్వము – 2014THE APOSTASY – 2014 డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "మొదట భ్రష్టత్వము సంభవించి: నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే కాని, ఆ దినము రాదు" (II దెస్సలొనీకయులకు 2:3). |
గొప్ప జళప్రళయము ముందు ఉన్న సాతాను సంభందిత మతభ్రష్టత్వముని గూర్చి నేను బోధిస్తూ ఉన్నాను. నోవహు దినములలో, ప్రళయము ముందు, మతభ్రష్టత్వముని గూర్చిన తేటయైన చిత్ర పటము ఉంది. యేసు అన్నాడు ఆఖరి దినములు నోవహు దినముల వలే ఉండును (మత్తయి 24:37). ఈ ఉదయ కాలం ఒక బైబిలు వచనము పై మన దృష్టి పెట్టాలి ఈ నాటి మతభ్రష్టత్వము అది తేటగా చూచిస్తుంది. దెస్సలొనీక క్రైస్తవులు తికమకతో భయపడ్డారు. అబద్ద ప్రవక్తలు బోధించారు క్రీస్తు దినము ఇప్పటికే వచ్చేసిందని, శ్రమల దినాలలో వారు జీవుస్తున్నారని. కాని అపోస్తలుడైన పౌలు చెప్పాడు అది సాధ్యము కాదని. రెండు విషయాలు జరగాలి శ్రమల కాలము మొదలయ్యే ముందు. సంఘ కాలము అంతములో శ్రమలు ఏడు సంవత్సరాల కాలము. ఆ సమయంలో అంత్య క్రీస్తు నియంతగా ప్రపంచాన్ని ఏలుతాడు. ఆ ఏడు సంవత్సరాల శ్రమల కాలము అనంతరము ఏడు పాత్రల ఉగ్రతను క్రీస్తును తిరస్కరించే లోకంపై దింపుతాడు. "క్రీస్తు దినము" "ప్రభువు దినము" తేలిగ్గా చూసారు రెండవ రాకడ, క్రీస్తు రాజ్యమును స్థాపించుట శ్రమల దినాల సమయములో. దెస్సలొనీక క్రైస్తవులకు భవిష్యత్తు తీర్పు దినములలో వారు జీవుస్తున్నారని తప్పుగా చెప్పబడింది. ఈ వచనములో, అపోస్తలుడు వారికి చెప్పాడు భయపడవద్దని శ్రమల కాలము ప్రారంభమునకు ముందు రెండు సంఘటనలు జరుగుతాయని. 1. మొదటిది, "నాశన పాత్రుడు బయలు పడితేనే కాని, ఆ దినము రాదు" [ అలా అది శ్రమల కాలము ముందు ప్రారంభమవుతుంది]. 2. రెండవది, "పాప పురుషుడు బయలు పరచబడతాడు, నాశన పాత్రుడు" [ఇది అపోస్తలుని పేరు ఆఖరి దినాల నియంతకు, అంత్య క్రీస్తు. శ్రమల కాలము ప్రారంభములో వారు బయలు పర్చబడతాడు]. చాలా మంది ప్రవచన బోధకులు శ్రమల దినాల సంఘటనలలోనికి దూసుకెలతారు. కాని నేను తొందరపడను. పదే పదే ఆ సంఘటనలు చెప్పాను, కాని శ్రమల కాలము ప్రారంభము ముందు ఏమి జరుగుతుందనే దానిపై నేను ఆసక్తి కలిగియున్నాను – ఎందుకంటే మనం జీవిస్తున్న రోజులు ఈ కాలమే! అలా, మనం "పడిన వేళ" లో జీవుస్తున్నాము. నాకు అర్ధం కాదు ఎలా ప్రజలు బైబిలు ప్రవచనాన్ని బోధిస్తారో దానిని ప్రజలకు అన్వయించకుండా. నేననుకుంటాను అలాంటి బోధ "ప్రజలు దురద చెవులు గలవారై, అనుకూల బోధకుల వైపు తిరుగుతారు" (II తిమోతి 4:3). కొన్ని నిముషాలు ఈ ఉదయం "పడిపోవుట"ను, మతభ్రష్టత్వము గూర్చి మాట్లాడతాను, మన పాఠ్యభాగములో. ఇక్కడ క్లిక్ చెయ్యండి నా లోతైన చారిత్రాత్మక వేదాంత చర్చలు ఈ నాటి మతభ్రష్టత్వము వేరులను గూర్చి. I. మొదటిది, మతభ్రష్టత్వము వెల్లడించడం. "మొదటి భ్రష్టత్వము సంభవించి: నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని, ఆ దినము రాదు" (II దెస్సలొనీకయులకు 2:3). ఇప్పుడు, మాటలు, "మతభ్రష్టత్వముని" గూర్చి ఆలోచించండి. ఎన్ఎఎస్ బి, "పడిపోవుట" అని అనువదించింది. మొదట, పదము "మతభ్రష్టత్వముని" గ్రీకు పదము "అపోష్టాషియా" నుండి వచ్చింది. గ్రీకు పదము అర్ధము "దూరముగా ఉండుట." అంటే బైబిలు సత్యాల నుండి దూరముగా పోవుట. డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ అన్నాడు, "ప్రభువు ‘దినము ముందు’ గట్టి విశ్వాసులు పడిపోతారు. [ద] అనే పదము సూచిస్తుంది పౌలు మనస్సులో ఒక ప్రత్యేక ఉంది" (The Criswell Study Bible, note on II Thessalonians 2:3). గ్రీకుపదాలు "అపోష్టాషియా" – అది మత భ్రష్టత్వము –ముందు తరువాత ఒకటి కాదు, అది – అది మతభ్రష్టత్వము. డాక్టర్ చార్లెస్ సి. రైరీ మన పాఠ్యమును గూర్చి అన్నాడు, "మతభ్రష్టత్వము. దేవునికి వ్యతిరేకంగా దూకుడుతో కూడిన తిరుగుబాటు పాప పురుషుని ప్రత్యక్షతకు దారి చూపిస్తుంది, [ద] గొప్ప అంత్య క్రీస్తు" (The Ryrie Study Bible, note on II Thessalonians 2:3). అది, ఈ పాఠ్య భాగము మనపై ఎలా ప్రభావము చూపుతుంది? జవాబు సులువైనది – అది ఎక్కువగా నష్ట పెడుతుంది, ఎందుకంటే, మనం ఈ నిమిషం, అంత్య దినాల మతభ్రష్టత్వములో, ఉన్నాం! నాకు తెలుసు మతభ్రష్టత్వము ఇంకా ఇంకా – చెడ్డదవుతుంది. కాని ఇప్పటికే మొదలై పోయింది. డాక్టర్ జాన్ ఎఫ్. వార్ ఉర్డు అన్నాడు మత్తయి 24:4-14 లోని సూచనలు "ఈ తరములో నెరవేర్పు కనుగొంటాం... గమనింపదగింది కాని గొప్ప శ్రమల కాలములో పూర్తిగా నెరవేర్పు కలుగుతుంది" (John F. Walvoord, Th.D., Major Bible Prophecies, Zondervan Publishing House, 1991, p. 254). ఇది నా దృక్పథము. మతభ్రష్టత్వము ప్రస్తుతం మొదలయింది. "మొదలైంది, గొప్ప శ్రమల కాలములో పూర్తిగా నెరవేర్పు కలుగుతుంది." మనం "మతభ్రష్టత్వము" ప్రారంభంలో ఉన్నామా? డాక్టర్ హెరాల్డ్ ఓ. జె. బ్రౌన్ చెప్పేది వినండి. తను అన్నాడు, "మతము సంస్కృతీ లోనికి నెట్టబడింది, గందర గోళ కలయిక అధికార పతనానికి దారి తీసింది" (ద సెన్ నెట్ కల్చర్, వర్డ్, 1996, పేజి 54). మీకు పి. హెచ్.డి. అవసరం లేదు మతములో సంఘాలు గొప్ప శ్రమలో ఉన్నాయి అని గమనించడానికి. చారిత్రాత్మక తెగలన్నీ ఇప్పటి వరకు సంఖ్యలో ఉన్నాయి ఉండబోయే దాని ఛాయా మాత్రమే. దక్షిణ బాప్టిస్టు సమాఖ్య కూడా ప్రతి సంవత్సరం 1,000 సంఘాలు కోల్పోతున్నాయి! అవును – ప్రతి సంవత్సరము 1,000 దక్షిణ బాప్టిస్టు సంఘాలు ద్వారాలు మూసేస్తున్నాయి. ఇప్పటికి, 2006 నుండి, ప్రతి సంవత్సరము బాప్త్మిష్మాలు సంఖ్య తగ్గింది. దక్షిణ బాప్టిస్టులు "గత సంవత్సరము 1,00,000 సభ్యులకు పైగా కోల్పోయారు" (బాప్టిస్టు ప్రెస్ న్యూస్). మనం ఎక్కడ చూసినా సంఘ సభ్యులు నిరుత్సాహంతో భయంతో ఉన్నారు. ఒక్క గుడి కూడా, జోయిల్ ఓ స్టీన్ ది కూడా, మార్పు నుండి ఎదగడం లేదు. వారు చేసేది వేరే సంఘం నుండి తెలివిగా "దొంగిలించడం" అభిసంధానం చేయడం. మన సంఘాలు త్వరితంగా లోతైన మతభ్రష్టత్వములోకి దిగి పోతున్నాయి. లెవిస్ స్పెర్రీ చాఫర్ తో నేను అన్ని వేళల అంగీకరించను, కాని ఆయన చెప్పిన ఈ ప్రకటన పూర్తిగా సరియైనది, ఈ లేఖనాలు [మతభ్రష్టత్వముని గూర్చినవి] విశ్వాసము నుండి తొలగువారిని చూపిస్తున్నాయి (I తిమోతి 4:1-2). లక్షణాల ప్రత్యక్షత ఉంటుంది, మానవులు పునరుద్దరింపబడరు "దైవ భక్తీ అనే వృత్తిలో ఉండిపోయి" (II తిమోతి 3:1-5). సూచన ఏమిటంటే, క్రీస్తు రక్తము శక్తిని నిరాకరించి... ఈలాంటి నీతి నాయకులు పునరుద్దరింపబడరు ఆత్మీయ విషయాలు బయలు వెళ్ళవు సంఘ ఆఖరి దినాల [లో] (Lewis Sperry Chafer, D.D., Systematic Theology, vol. IV, Dallas Seminary Press, p. 375). అవును! మన శ్రేష్ట మైన సంఘాలు "క్రీస్తు రక్తము శక్తిని నిరాకరించే వారితో కాపరత్వము చేయబడుతున్నాయి." చాలా మంది కచ్చిత కాపరులు హేబ్రీయులకు 12:24 ను తిరస్కరిస్తారు, "రక్త ప్రోక్షణ" "పరలోక యోరూష లేము" లో ఉంది, బైబిలు తేటగా బోధిస్తున్నప్పటికిని. చాలా మంది ఈ బోధకులను వెంబడిస్తారు, జాన్ మెక్ ఆర్డర్, ఆయన అంటాడు క్రీస్తు రక్తము "సూచన," మరణానికి వేరే పదము. కాని డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ అన్నాడు, ఒక వ్యక్తీ నిజంగా బోదిస్తున్నడా అనే దానికి పరీక్ష, "రక్తము" పై ఆయన యిచ్చే వక్కనింపు. సిలువ మరణం గూర్చి చెప్తే చాలదు; పరీక్ష "రక్తము" (D. Martyn Lloyd-Jones, M.D., God’s Way of Reconciliation (Ephesians 2), The Banner of Truth Trust, 1981, p 331). ఈ దినాల్ల్లో చాలా మతభ్రష్టత్వము ఉంది రక్త నెరవేర్పును గూర్చి బైబిలు బోధిస్తున్న విషయాలను గూర్చి. బోధకులు అనవచ్చు దానిని నమ్ముతారని, కాని క్రీస్తు రక్తమును గూర్చి బోధించే ఏ గొప్ప బోధకుడు నాకు తెలియదు స్పర్జన్ డాక్టర్ ల్లాయిడ్ జోన్స్ తప్ప. దేవుడు మనకు సహాయము చెయ్యాలి! ఇప్పుడు మనం మతభ్రష్టత్వములో ఉన్నాం! "మొదట భ్రష్టత్వము సంభవించి: నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే కాని, ఆ దినము రాదు" – అపోష్టాషియా – మతభ్రష్టత్వము (II దెస్సలొనికయులకు 2:3). అది మతభ్రష్టత్వము ప్రత్యక్షత! ఆయన రాకడ సూచనలు వెల్లువడుతాయి, II. రెండవది, మతభ్రష్టత్వముకి కారణాలు. ప్రకటన 12:12 చూడండి బైబిలులో. నిలబడి గట్టిగా చదవండి. "అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సాహించుడి. భూమి సముద్రమా! మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి యున్నదని చెప్పెను" (ప్రకటన 12:12). ఆఖరి వాక్యము చూడండి – "అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, బహు క్రోధము గలవాడై, మీ యొద్దకు దిగి వచ్చి యున్నాడా"(ప్రకటన 12:12). కూర్చోండి. అవును, నాకు తెలుసు ఇది శ్రమల కాలములో సాతాను ఉగ్రత వివరణ అని. కాని నా దీర్ఘకాల సంఘ కాపరి చైనీయ సంఘములో, డాక్టర్ తిమోతి లిన్, వేరేది చూసాడు. ఆయన అన్నాడు, "చాల క్రైస్తవుల కంటే సాతానుకు ప్రవచనాల గురించి ఎక్కువగా తెలుసు." తానూ అన్నాడు సాతానుకు తెలుసు సమయం తక్కువగా ఉందని వెయ్యి సంవత్సరాలు "అగాధములో పడవేయబడతాడని" (ప్రకటన 20:1-2). జాన్ ఫిలిఫ్ వ్రాసాడు, సాతాను బోనులో ఉన్న సింహము వలె, ఉగ్రుడై... ప్రతాపము చూపిస్తూ మానవాలిపై తన ద్వేషాన్ని ఉక్రోశాన్ని చూపిస్తున్నాడు (ప్రకటన వివరణ, లూజాక్స్, 1991, పేజి 160). పరలోకంలో ఉన్న దేవుని సాతాను ముట్టలేడు, అందుకే ఉగ్రుడై మనిషిపై దాడి చేస్తాడు, మనిషి దేవుని ఉన్నత సృష్టి. అపోస్తలుడైన పేతురు అన్నాడు, "నిబ్బరమైన బుద్ధిగలవారై, మెలుకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది, గర్జించు సింహము వలె, ఎవరిగిని మ్రింగుదునా అని, వెదుకుచు తిరుగుచున్నాడు" (I పేతురు 5:8). రెండు వారాల క్రితం ఇరవై సంవత్సరాల కాలేజి విద్యార్ధి శాంతా బార్బారా సిటి కాలేజిలో తుపాకితో ఆరుగురిని చూపి పదముగ్గురుని భయంకరంగా గాయపరచి తనను తాను చంపుకున్నాడు. యూట్యూబ్ లో వింత సందేశం చదివాక నేననుకున్నాను "దెయ్యము పట్టిన తనము." అవును! ఆ భయంకర సినిమా "ద ఎక్స్ జార్షిష్ట్" లో వలే. లెఫ్ట్ వింగ్ రాజకీయ నాయకులంటారు తుపాకులను రద్దు చేయడం ద్వారా చంపడాలు ఆపవచ్చని. కాని వారిది తప్పు. ఇంకొక యువకుడు కొన్ని వారాల క్రితం పదహారు కాలేజి విధ్యార్ధులను వేట కత్తితో అంతమొందించాడు. తుపాకులు రద్దు చేస్తే వేట కత్తులు వాడతారు! ఎలా ఈ యువకులు దెయ్యాలు పట్టిన వారయ్యారు? మనస్థత్వ వేత్త డాక్టర్ జూడీ కురియన్ స్కై అన్నాడు, "ఎవరైతే తొందర పెట్టబడి, హాలీవుడ్ చూపించే హింసకు గురి అవుతాడో – అలాంటి వారు చంపేవాడు నరహంతకుడు అవుతాడు." డాక్టర్ కీత్ కన్నెర్, యుక్త అభివృద్ధి నిపుణుడు అన్నాడు, "పరిశోధించి కనుగొన్నాం చిన్న పిల్లలు హింసాత్మక ఆటలు, టివి సినిమాలు చూసేవారు ఎక్కువగా ఉద్రేకులు హింసాత్మకులు అవుతారు." డాక్టర్ కన్నెర్ అన్నాడు, "నేను హాలీవుడ్ ను నిందిస్తాను." (జాన్ బ్లోస్సర్, జాతీయ విచారకుడు, జూన్ 9, 2014, పేజీలు 10-11). అది సరియే, డాక్టర్ కన్నెర్ – హాలీవుడ్ ను నిందించాడు, జాతీయ రైఫిల్ సంస్థను కాదు! ఎన్ఆర్ఏలో చేరి దెయ్యము పట్టిన వారు కాలేదు. ఎవ్వరు కూడా! కాని చాలా మంది పిల్లలు మార్చబడి – దెయ్యాలు పట్టిన వారై – హింసాత్మక సినిమాలు విడియో ఆటలు చూడడం వలన! యవనస్థులారా, అలాంటి సినిమాలు చూడకండి, విడియో ఆటలు పారేయండి! దెయ్యాల బారిన పడకండి! దేయ్యలచే ప్రభావితం కావద్దు! మీ జీవితాల నుండి అందంతా తీసి పారేయండి! సమయ పరిమితి! ఓ, అవునట్టు, సాంతా బార్మరాలో అందరిని చంపిన బాలుడు – ఊహించండి? తన తండ్రి ఇటీవల తీసిన రెండు సినిమాలకు సహాయక దర్శకుడు, హింస చంపడాలతో నింపబడ్డాయి! దేవుడే సాయం చెయ్యాలి! ఆ అబ్బాయికి అవకాశము లేదు! ఇంకొక విషయం. దెయ్యం గుడికి వెళ్తుంది అనే సంగతి మర్చి పోవద్దు! అవును, సాతాను ప్రతి ఆదివారం గుడికి వెళ్తుంది! వాడు వాని అనుచరులు గత రెండు వందల సంవత్సరాలుగా గుడులను ద్వంసం చేస్తున్నాయి! నా ఒళ్ళు జలదరించి వెంట్రుకలు నిలబడతాయి – చార్లెస్ జీ ఫిన్నీ వివరణ చదివినప్పుడు (1792-1875) మార్పులు, ఆత్మ నింపుదల! తప్పకుండా ఫిన్నీకి దయ్యం పట్టి ఉంటుంది, పూర్తిగా దెయ్యం పట్టినప్పుడు, ఆ సంఘటనలు జరిగినప్పుడు. నా స్నేహితుడు, వేదాంత విద్యలో డాక్టరేట్ ఉన్న అతడు, నాతో అన్నాడు, "ఫిన్నీలో చీకటి ఉంది. వేదింపబడినవాడు." ఇంకా అన్నాడు, "మీరెప్పుడైనా తన కళ్ళ ఫోటో చూసారా? భయంకరంగా కనిపించాడు." నేను వ్యక్తిగతంగా అనుకుంటాను తనకు దెయ్యం పట్టిందని! ఫేన్నీ ప్రోటేస్టెంట్ మార్పుకు వ్యతిరేకంగా తన ఆగ్రహం చూపించి, అమెరికాలో చాలా మంది సంఘ కాపరులను (ప్రపంచంలో వేల మందిని) పాత మార్పు విధానానికి స్వస్తి చెప్పమని, "నిర్ణయత్వత" కు మారమని. (దాని నిర్వచనం చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి) – తప్పిన లక్షలాది మందిని సువార్తిక సంఘాల్లోకి తీసుకొచ్చారు. డాక్టర్ ఫ్రెన్సిస్ స్కాఫర్ పుస్తకము, గొప్ప సువార్తిక వినాశనము. ఎందుకు సువార్తీకరణ నాశన మయ్యింది? ఎందుకంటే మన బోధకులు "నిర్ణయత్వత" దెయ్యపు సిద్ధాంతాలు తీసుకుంటున్నారు, పాత మత విధానము నుండి తొలిగి పోతున్నారు జోనతాన్ ఎడ్వర్డ్స్, జార్జి వైట్ ఫీల్డ్ మరియు సి. హెచ్. స్పర్జన్ ల యొక్క. దేవుడే సాయపడాలి! లక్షలాది మంది మారకుండా మన సంఘాల్లోకి వస్తున్నారు – నాశనము చేస్తున్నారు! ఫేన్నీ దయ్యపు సిద్ధాంతము "నిర్ణయత్వత" సమాజికులను, మెథడిస్టులను, ప్రేస్బిటేరియన్లను, ఉత్తర బాప్టిస్టులను నాశనము చేసింది. ఇప్పుడు ఫిన్నీ "నిర్ణయత్వత" దక్షిణ బాప్టిస్టు స్వతంత్ర ప్రాధమిక బాప్టిస్టులను నాశనము చేస్తుంది, సంఘాలను మారిన ప్రజలతో నింపడం ద్వారా – అస్థిరులై సంఘాలను విడదీసి, విడిచి పెట్టి, అలా నాశనము చేస్తారు! "డార్వినిజం" "నిర్ణయత్వత" దెయ్యం చేతిలో రెండు అస్త్రాలు. వాటిలో దెయ్యము క్రైస్తవ్యాన్ని పాశ్చాత్య ప్రపంచంలో నాశనము చేస్తుంది! "మొదట భ్రష్టత్వము సంభవించి: నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే కాని, ఆ దినము రాదు" – అపోష్టాషియా – మతభ్రష్టత్వము! (II దెస్సలొనికయులకు 2:3). ఆయన రాకడ సూచనలు వెల్లువడతాయి, మనం మతభ్రష్టత్వము ప్రత్యక్షత చూసాం. మతభ్రష్టత్వముకు కారణాలు చూసాం. ఆఖరి రెండు విషయాలు చెప్తాను – మతభ్రష్టత్వముకి ప్రతి ఫలము విరుగుడు. నిర్ణయత్వతకు ఎక్కువ వివరాలకు లెయిన్ హెచ్. ముర్రే ద ఓల్డ్ ఎవంజేలిసం (బేనర్ ఆఫ్ ట్రూత్, 2005). III. మూడవది, మతభ్రష్టత్వము యొక్క ప్రతి ఫలము. ప్రతి ఫలము తేటగా ఉంది. చాలా తక్కువ మంది సంఘ సభ్యులు రక్షింప బడ్డారు. వారు 3 లేక 4 ఏళ్ళ నోళ్ళు కలిగియున్నారు "పాపి ప్రార్ధన" చెప్పి బాప్మిస్మము పొందటానికి! భయంకరం! మేడీవియాల్ కెథొలిసిసమ్ కంటే తక్కువేమీ కాదు! ఇంకా అధ్వానము! కనీసం ఈ పాదురులు "నిత్య సంరక్షణ" పై అబద్దపు హామీలు ఇవ్వరు. అది పూర్తిగా విష పూరితం సతానుమయం "పాపి ప్రార్ధన" చెప్పినందుకు పిల్లలకు లేక పెద్దలకు బాప్మిస్మము ఇవ్వడం! దేవుడే సాయం చెయ్యాలి! చాలా స్థలాలలో "నిర్ణయత్వత" తిరిగి జన్మించిన బాప్టిస్టు ఆఫ్రికాలో అరుదైన ఫిగ్నీలా అయిపోయాడు! సగటు బాప్టిస్టు లేక సువార్తికుని వివరణ ఇది, "నీవు దౌర్భాగ్యుడవును, దిక్కు మాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డి వాడవును దిగంబరుడవై యున్నవని ఎరుగక; నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసియున్నాను, గుడ్డి వాడవును, నాకేమియు కొదవ లేదని, చెప్పుకొనుచున్నావు" (ప్రకటన 3:17). "నీవు వెచ్చగా నైనను చల్లగా నైనను ఉండక, నులి వెచ్చనగా ఉన్నావు, గనుక నేను నిన్ను నా నోట ఉంది ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను" (ప్రకటన 3:16). అది మతభ్రష్టత్వము యొక్క ప్రతి ఫలము, "నిర్ణయత్వత" చే తీసుకు రాబడింది! "మొదట భ్రష్టత్వము సంభవించి: నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే కాని, ఆ దినము రాదు" – అపోష్టాషియా – మతభ్రష్టత్వము! (II దెస్సలొనికయులకు 2:3). ఆయన రాకడ సూచనలు వెల్లువడుతాయి, IV. నాల్గవది, మతభ్రష్టత్వముకి విరుగుడు. మతభ్రష్టత్వముని ఎలా బాగు చేస్తారా? విరుగుడు ఏంటి? జవాబు ఏంటి? స్వస్థత, విరుగుడు, జవాబు – యేసు క్రీస్తు ప్రభువే! యేసు మతభ్రష్టత్వముకి స్వస్థత! యేసు మతభ్రష్టత్వముకి విరుగుడు! మరియు, అవును, యేసు మతభ్రష్టత్వముకి జవాబు! అపోస్తలుడైన పౌలుకు అది తెలుసు. అందుకే ఇలా అన్నాడు, "నేను యేసు క్రీస్తును అనగా, సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరిదేనిని మీ మద్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని" (I కొరిందీయులకు 2:2). క్రీస్తు పాపాన్ని నుండి మనలను రక్షించాడు. నరకాని నుండి క్రీస్తు మనలను రక్షిస్తాడు. మతభ్రష్టత్వము నుండి క్రీస్తు మనలను రక్షిస్తాడు! నశించు అమెరికా సంస్కృతి నుండి బయటకి రండి, చనిపోవు సంఘాల నుండి! వాటి నుండి బయటకి రండి – లోపలి రండి – మార్గమంతా – యేసు నోద్దకు. ఆయన నిన్ను నిరుత్సాహపర్చడు! నా నిరీక్షణ కట్ట బడింది ఈ ఉదయం, నేను మీకు చెప్తున్నాను, యేసు ప్రక్కన ఈ లోకంలో సురక్షిత స్థలము ఏమీ లేదు! ఆయన దగ్గరకు రండి, ఆయన మిమ్మును రక్షిస్తాడు! పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో చాలా తక్కువ మతభ్రష్టత్వము ఉంది. వారు, అమెరికా పాశ్చాత్య దేశాల నుండి వేరు చేయబడ్డారు. సహాయానికి, సంరక్షణకు – యేసు ఉన్నాడు. పరిమితి లేకుండా యేసు వారికి సహాయం చేసాడు. అమెరికా బైబిలు సొసైటి అంచనా వేసారు చైనాలో ప్రతి గంట 600 మంది క్రీస్తులోనికి మారుతున్నారు – ప్రతి రోజు 14,000 మార్పులు! వారు యేసు క్రీస్తుపై ఆధారపడతారు, ఆయన వారికి శక్తి నిస్తాడు వేలకొలది యవనస్థులను క్రీస్తు నోద్దకు సంఘాలలోనికి నడిపించడానికి! క్రీస్తు నీ పాపాన్ని క్షమించగలడు. మీ పాప పరిహరార్ధము ఆయన సిలువపై మరణించాడు. నీకు జీవితాన్ని నిరీక్షణ ఇవ్వడానికి మృతులలో నుండి లేచాడు! వచ్చే ఆదివారం రమ్మని అడుగుతున్నాను. యేసు నోద్దకు నేరుగా రమ్మని అడుగుతున్నాను, "లోక పాపములను మోసుకొని పోవు, దేవుని గొర్రె పిల్ల"! నిజ క్రైస్తవుడవడానికి దయచేసి వచ్చి నాతో మాట్లాడండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: II దెస్సలొనికయులకు 2:1-9. |
ద అవుట్ లైన్ ఆఫ్ మతభ్రష్టత్వము – 2014 THE APOSTASY – 2014 డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "మొదట భ్రష్టత్వము సంభవించి: నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే కాని, ఆ దినము రాదు" (II దెస్సలొనీకయులకు 2:3). (II తిమోతి 4:3)
I. మొదటిది, మతభ్రష్టత్వము వెల్లడించడం,
II. రెండవది, మతభ్రష్టత్వముకి కారణాలు,
III. మూడవది, మతభ్రష్టత్వము యొక్క ప్రతి ఫలము,
IV. నాల్గవది, మతభ్రష్టత్వముకి విరుగుడు, |