ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నోవహు ఓడ (ఆదికాండము పై 81 వ ప్రసంగము) డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసికొనుము; అరలు పెట్టి ఆ ఓడను చేసి, లోపటను వెలుపలును దానికి కీలు పోయవలెను" (ఆదికాండము 6:14). |
కొన్ని వారాల క్రితం హాలివుడ్ గొప్ప సినిమా "నోవహు"ను విడుదల చేసింది. వేలకొలది యవనస్థులు దానిని చూసారు. నేను ఒక కథనము వ్రాసాను "సినిమా 'నోవహు' సాతానుమయం!" (చదవడానికి క్లిక్ చెయ్యండి) . అవును, ఆ సినిమాలో చాలా దెయ్యం విషయాలు ఉన్నాయి, నేను ఎవరిని చూడమని సిఫారసు చెయ్యను. కాని ఆ సినిమాలో కొన్ని సత్య లక్షణాలు ఉన్నాయి. జళ ప్రళయాన్ని వాస్తవికంగా చూపించి, ఓడను గూర్చి నమ్మదగిన చిత్రాలు చూపించారు. ఇప్పటి వరకు చాలా మంది యువకులు తలంచారు ఓడ చిన్న పడవని సంతోషంగా ఉండే జంతువులుంటాయని, కిటికీ నుండి నోవహు నవ్వుతూ చూస్తాడని. అది పిల్లలు సబ్భాతు బడిలో చూసే కార్టూను బొమ్మ. నాకైతే చిన్న పిల్లల పుస్తకాలు కూడా సినిమాలా సాతానుమయమే! ఓడను గూర్చి జళ ప్రళయం గూర్చి వారు పూర్తిగా తప్పుడు అభిప్రాయము ఇచ్చారు. బోధకులు యువకులకు చెప్పాలి సివిమా సతానుమయమని. మరియు, బోధకుడా, నీవు వెళ్లి గుడిలో సబ్బాతు బడి గదులలో ఉన్న నోవహు ఓడను గూర్చిన చిన్న పిల్లల పుస్తకాలు పార వేయాలి! బయట పారేయండి! జళ ప్రళయమును గూర్చిన తీవ్ర సందేశాన్ని అవి కార్టూనుగా మార్చాయి! అది కూడా సాతానుమయమే! ఓడ జళ ప్రళయము నవ్వులాట కాదు! ఇప్పుడు, నోవహు ఓడపై చాలా ప్రసంగాలు చేస్తున్నాయి. ఈ సాయంకాలము ప్రసంగము చెప్తాను, " కాని నోవహు కృప పొందెను" (చదవడానికి క్లిక్ చెయ్యండి) . ఈ ఉదయము ఓడను చూపిస్తుందనడంలో సందేహమే లేదు. నోవహు యొక్క ఖాతా ఒక రకం, క్రొత్త నిబంధనలో ఏదో చిత్రాన్ని ఆ పాత నిబంధనలో ఒక చిత్రాన్ని అని కూడా ఉండవచ్చు. మత్తయి 24:37-39 లో క్రీస్తు అన్నాడు నోవహు "దినములు" ఆయన రెండవ రాకడ ముందు దినములు ఒకేలా ఉంటాయని. II పేతురు 2:5 లో నోవహు అపోష్టషి దినాలలో ఒక విధము. నేను పేతురు 3:20-21 లో క్రీస్తు ఓడ ద్వారా మోక్షం ఒక రకంగా ఇవ్వబడుతుంది. హెబ్రీయులకు 11:7 లో ఓడ మోక్షం రకంగా మళ్ళీ ఇవ్వబడుతుంది. నోవహు దినములలో ప్రజలు ఒక విధము. ఆఖరి దినాలలో నమ్మకస్థులైన బోధకులు వైరుధ్యము గలవారు, విధాన నెరవేర్పు. నోవహు అపోష్టషి దినాలలో ఒక విధము. క్రీస్తు నందలి రక్షణ వైవిధ్యము, విధాన నెరవేర్పు. ఓడ విధానము. క్రీస్తు నందలి రక్షణ వైవిధ్యము, విధాన నెరవేర్పు. నాకు తెలుసు క్రైస్తవ్యము ప్రారంభ దినాలలో పదజాలము ఎక్కువగా దుర్వినియోగ పర్చబడింది, బోధకులు పాత నిబంధనలోని ప్రతి దానిని ఒక విధానంగా చూసారు. నాకు తెలుసు పాత నిబంధనలో నిజ విధానాలున్నాయి, స్పష్ట వైరుధ్యాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో విధానాలను నెరవేర్చుతూ. ఉదాహరణకు, హేబ్రీయుల గ్రంధము పూర్తిగా వైవిధ్యాలతో నిండి ఉంది. మృతులలో నుండి లేచాక యేసు ఇద్దరు అనుచరులతో కూర్చున్నాడు "యోషేయా సమస్త ప్రవక్తలను మొదలుకొని, లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపెను" (లూకా 24:27). క్రీస్తు చెప్పిన విషయంలో నాకు సందేహము లేదు నోవహు ఓడ లోక రక్షకునిగా తన చిత్ర పటమేనని ఆయన చెప్పాడు. జళ ప్రళయం నుండి దేవుని ప్రజలను ఓడ రక్షించినట్టుగా, క్రీస్తు దేవుని ప్రజలను తీర్పు నుండి నరకము నుండి రక్షిస్తాడు. ఓడ ఒక విధము, యేసు క్రీస్తు వైవిధ్యము, విధము నెరవేర్పు! బైబిలును తిరస్కరించే స్వతంత్రుడు హేరీ ఎమెర్ సన్ ఫోస్ డిక్ దానిని కాదంటాడు! ఫుల్లర్ వేదాంత సెమినరీలోని ఆధునికుడు లేక చికాగో దైవిక పాఠశాల దానిని కాదంటుంది! బైబిలు అలా చెప్పే వారిని ముందే ఊహించింది, "అంత్య దినములలో అపహాసకులు, తమ దురాశల చొప్పున నడుచు కొనుదురు" (II పేతురు 3:3). అపోస్తలుడైన యూదా అన్నాడు, "అయితే, ప్రియులారా, అంత్య కాలమందు తమ భక్తీ హీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందురని మన ప్రభువైన యేసు క్రీస్తు; అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను, జ్ఞాపకము చేసికొనుడు. ఎవరు భూత మోహిస్తాడు తరువాత నడవాలి. ఈ ఆత్మ కలిగి, ఇంద్రియాలకు, తమను వేరు చేసిన వారు" (యూదా 17-19). అలాంటి అవిశ్వాసుల బోధలు తిరస్కరించడం చాలా కాలం క్రిందట నేర్చుకున్నాను! కనుక, మన పాఠ్యభాగానికి తిరిగి వద్దాం ఆదికాండం, 6 వ అధ్యాయము, 14 వ వచనము, ఓడ వివరణ గూర్చి – అది ఎలా మన ప్రభువైన యేసు క్రీస్తు చిత్ర పటాన్ని చూపిస్తుంది. దేవుడు నోవహుతో అన్నాడు, "చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసికొనుము; అరలు పెట్టి ఆ ఓడను చేసి, లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను" (ఆదికాండము 6:14). దయచేసి బైబిలు తెరిచే ఉంచండి. ఆమెన్. అర్ధర్ డబ్ల్యూ. పింక్ అన్నాడు, "ఓడలో…[నోవహు] అతని కుటుంబము… దేవుని ఉగ్రత తుఫాను నుండి ఆశ్రయము పొందారు, అది తేటయైన సమగ్రమైన క్రీస్తులో విశ్వాసి రక్షణను గూర్చిన విధానము లేఖనములన్నింటిలో అది కనిపిస్తుంది" (Arthur W. Pink, Gleanings in Genesis, Moody Press, 1981 edition, p. 103). నేను గమనించాను డాక్టర్ జాన్ గిల్, మన గొప్ప పద్దెనిమిదవ శతాబ్దపు బాప్టిస్టు వ్యాఖ్యాత, పదే పదే అన్నాడు ఓడ ఒక క్రీస్తు విధానము (John Gill, D.D., An Exposition of the Old Testament, The Baptist Standard Bearer, 1989 reprint, vol. 1, pp. 50-51). "చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసికొనుము; అరలు పెట్టి ఆ ఓడను చేసి, లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను" (ఆదికాండము 6:14). I. మొదటిది, ఓడ దేవునిచే ప్రణాళిక చేయబడింది. తీర్పు వస్తుందని నోవహుకు తెలుసు. కాని దేవుడు బయలు పరచే వరకు ఓడను తయారు చేయాలనే తలంపు నోవహుకు లేదు. కాని తాను ఏమి చేయబోతున్నదో దేవునికి తెలుసు. చూసారా, నోవహు అతనితో ఉన్నవారు లోకము సృష్టింపబడక మునుపే దేవునిచే ఎన్నికోబడ్డారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, "జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరచుకొనెను" (ఎఫేస్సీయులకు 1:4). ఓడలో రక్షింపబడే వారిని దేవుడు ఎన్నిక చేసుకోవడమే కాదు, జగత్తు పునాదు వేయబడక మునుపే మనలను విమోచించడానికి క్రీస్తును పంపడానికి దేవుడు ప్రణాళిక చేసాడు, బైబిలు క్రీస్తును, "జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న దేవుని గొర్రె పిల్ల" (ప్రకటన 13:8). దేవుడు యేసు క్రీస్తును, మనలను రక్షించడానికి, పంపడానికి ప్రణాళిక చేసినట్లే, ఓడ విధానము, కూడా చేసాడు. ముందుగానే నోవహును రక్షించడానికి దేవుడు ప్రణాళిక చేసాడు. క్రైస్తవులైన మీలో ప్రతి ఒక్కరు ఆనందించాలి ఎందుకంటే జగత్తు పునాదు వేయబడక మునుపే మిమ్ములను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నాడు ఆయన లోకాన్ని సృష్టించాడు – ఆయన నోవహును రక్షించడానికి ప్రణాళిక వేసాడు ఓడ ద్వారా లోకములోని భక్తీ హీనులను జళ ప్రళయము ద్వారా నాశనము చేసేటప్పుడు! మీరు క్రీస్తు యేసు నందుంటే, మీరు తీర్పు తుఫాను నుండి సురక్షితులు! నన్ను దాచుము, ఓ నా రక్షకా, దాచుము, జీవిత తుఫాను గతించే వరకు: II. రెండవది, లోపలి వారిని రక్షించడానికే ఓడ తయారు చెయ్యబడింది. అది ఓడ కాదు. కానే కాదు! "ఓడకు" అనువదింపబడిన హెబ్రీ పదము "టేబా." అనగా "పెట్టె" (బలమైన). అదే హెబ్రీ పదము వాడబడింది నైలు నదిలో బాలుడైన మోషేను ఉంచిన పెట్టెను గూర్చి చెప్పినప్పుడు. ఆదికాండము 50:26 లో వాడబడిన "పెట్టె" పదము కూడా అదే హెబ్రీ పదము నుండి తర్జుమా చేయబడింది. ఎక్కువ చెప్పబడలేదు. ప్రయాణాలు లేవు. నేననుకుంటాను దాని క్రింద విశాల స్థలము ఉంది. అది కేవలము పెట్టె. దేవుడన్నాడు, "నాకు ఒక ‘పెట్టె,’ తయారు చెయ్యి లోపల బయటదానికి కీలు పూయుము." పదము "కీలు" "కాపెర్" నుండి అనువదింపబడింది – "కాపెర్" కు అది క్రియ. అదే పదము "నెరవేర్పు"గా పాత నిభందనలో 70 స్థలాలలో చెప్పబడింది. ఆ విధంగా లేవియా కాండము 17:11 లో అనువదింపబడింది, "రక్తము ఆత్మకు నెరవేర్పు తెస్తుంది. " ఆ రెండు అదే హెబ్రీ పదము నుండి వచ్చాయి, కాబట్టి మనము ఆదికాండము 6:14 ను ఇలా విశదీకరింపవచ్చును, "చితి సారకపు మ్రానుతో ఓడను చేసి లోపల వెలుపల నేరవేర్పును పూయుము," అదే రక్తము! ఇక్కడ, పెద్ద పెట్టె ఉంది, కీలుతో పూయబడింది. డాక్టర్ హెన్రీ యమ్. మోరిస్ అన్నాడు, "కాపెర్…తరుచుగా ‘నేరవేర్పుగా’ తర్జుమా చెయ్యబడింది. నీళ్ళ తీర్పు నుండి రక్షణ కల్పించడానికి, అందమైన విధానమైన క్రీస్తుగా మారింది" (The New Defender’s Study Bible by Henry M. Morris, Ph.D., World Publishing, 2006, p. 34; note on Genesis 6:14). కనుక, మనకు ఓడ ఉంది. అది పెద్ద పెట్టె చెక్కతో చెయ్యబడింది, లోపల బయట కీలు పూయబడింది, గొప్ప జళ ప్రళయము నుండి పరిపూర్ణముగా దాచబడింది. డాక్టర్ యమ్. ఆర్. డిహాన్ అన్నాడు, ఓడ…ఒక నల్లని పెట్టేలా ఉంది. నిజానికి, "ఓడ" "పెట్టె"గా తర్జుమా చెయ్యబడింది ఆదికాండము 50:26 లో. ఆ ఓడ ప్రభువైన యేసు క్రీస్తు మరణానికి సూచన. మనం చాలా సులభంగా ఊహించవచ్చు నోవహు దినాలలో అతని శ్రమను ప్రజలు ఎలా అపహసించారో. నల్లని పెట్టెను చెయ్యడం, వ్యంగ్యంగా, తలంచారు, భూమి మీద మును పెన్నడు రాని జళ ప్రళయాన్ని గూర్చి (M. R. DeHaan, M.D., The Days of Noah, Zondervan Publishing House, 1971 edition, p. 173). ఈ రోజుల్లో చాలా మంది బైబిలు గురించి పరిహసించి హేళన చేస్తారు. ప్రళయాన్ని గూర్చిన వివరణ, "విడ్డూరము" అంటారు. దేవుని తీర్పు వాళ్ళపై పడితే వాళ్ళేం చేస్తారు? మీరు క్రీస్తు యేసులో సురక్షితంగా లేకపోతే మీరు ఏమి చేస్తారు? నన్ను దాచుము, ఓ నా రక్షకా, దాచుము, జీవిత తుఫాను గతించే వరకు: III. మూడవది, ఓడ దేవుని తీర్పు నుండి ఆశ్రయ దుర్గము. ఓడ సురక్షిత స్థలము. నిజానికి, అది మాత్రమే సురక్షిత స్థలము. దేవుని నుండి అది మాత్రమే సురక్షిత స్థలము. ఈ లోక ప్రజలు అంటారు "చాలా మార్గాలు" ఉన్నాయి దేవునితో సమాధాన పడడానికి. కాని వారు తప్పు. దేవుడు ఒక మార్గాన్నే ఇచ్చాడు నోవహు దినాలలో ఆయన ఉగ్రత నుండి తప్పించుకోడానికి – తీర్పును తప్పించుకోడానికి ఒకటే మార్గము ఓడలోనికి రావడం. ఈనాడు దేవుడు ఒక మార్గాన్ని యిచ్చాడు ఆయన ఉగ్రతను తప్పించుకోడానికి. అదే ప్రభువైన యేసు క్రీస్తు. బైబిలు చెప్తుంది, "ఎవరి ద్వారా రక్షణలేదు: ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామమున, మనము రక్షింపబడలేదు" (అపోస్తలుల కార్యములు 4:12). ప్రజలు అంటారు, "అది సమంజసము కాదు!" వారు ఎలా అంటారో నాకు అర్ధము కాదు! నాకు అది పరిపూర్ణముగా సమంజసమే! వనములో మానవుడు పాపము చేసాడు. మానవుడు మళ్ళీ పాపం చేసాడు, చాలా లోతుగా, జళ ప్రళయం ముందు. దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు వారి పాపము వలన వచ్చే తీర్పును తప్పించుకోడానికి. రక్షింపబడే మార్గాన్ని వారు తిరస్కరించారు. కనుక, ప్రళయంలో మునిగి పోయారు. ఏది అసమంజసం? నేను అది చూడను. ఎప్పటికి కూడా! నోవహు దినాలలో ప్రజలకు హానోకు భోధ ఉంది (యూదా 14, 15). నోవహు బోధ వారికి ఉంది (II పేతురు 2:5). పరిశుద్దాత్మ వారితో ఉండింది (ఆదికాండము 6:3). వారికి సాకు లేదు. ఈ ఉదయాన్న నేను మిమ్ముల్ని అడుగుతాను, "యేసు ద్వారా రక్షింపబడకుండా చనిపోతే మీ సాకు ఏంటి?" అది మంచి ప్రశ్న. మీ సాకు ఏంటి దేవుడు లోకానికి తీర్పు తీర్చేటప్పుడు మీరు క్రీస్తులో సురక్షితంగా లేకపోతే? నన్ను దాచుము, ఓ నా రక్షకా, దాచుము, జీవిత తుఫాను గతించే వరకు: IV. నాల్గవది, ఓడలో అందరికీ స్థలముంది. హెబ్రీయులు 17:5 ఇంచుల తక్కువ కూబిట్లు, 20.4 ఇంచుల పొడవు కూబిట్లు కలిగియున్నారు. బైబిలులో ఆదికాండము 6:15 లో ఓడ కొలతలు ఇవ్వబడ్డాయి. తక్కువ కూబిట్లు వాడితే, ఓడ, మూడు అంతస్థులతో, 95,790 చదరపు అడుగుల విస్తీర్ణము, లేక 2.2 ఎకరాలు కలిగి ఉంది. పొడవు కూబిట్లు వాడితే, ఓడ 43,350 చదరపు అడుగులు ప్రతి అంతస్థుకి ఉంది. మూడు అంతస్థులు కలిపి 1,30,050 చదరపు అడుగులు, సుమారు మూడు ఎకరాల పరిమాణము. ఎత్తు 51 అడుగులు, ఐదు అంతస్థుల భవనానికి కొంచెము తక్కువ. అది 2,210,850 క్యూబిక్ అడుగులు, రెండు మిలియన్ల కూబిక్ అడుగులు! అది చాలా స్థలాన్నిచ్చింది 1,25,000 జంతువులు పట్టడానికి గొర్రె పరమాణమువి. జంతు శాస్త్రజ్ఞులు లెక్కగట్టారు నాలుగు కాళ్ళ జంతువులు 100 రకాలు, పక్షులు 170 రకాలు ఉన్నాయని. 130,000 చదరపు అడుగుల ఓడలో చాలా రెట్లు జంతువులు పడతాయి. డాక్టర్ హెన్రీ యమ్. మోరిస్ అన్నాడు, ఆ సమయము నుండి, మనం ముందు చూసినట్లు, ఓడలో లక్ష ఇరవై ఐదు వేల గొర్రెలు అన్ని జంతువులు పట్టాయి, సగటు జంతువూ పరిమాణము గొర్రె కంటే తక్కువే, 60 శాతము స్థలము జంతువులకే వాడాలి...అలా, ఓడ పరిమాణము జంతువులకు సరిపడినంత ఉంది...జంతువులకు ఆహారము, నోవహు కుటుంభానికి, మిగిలిన వారికి (Henry M. Morris, Ph.D., The Genesis Record, Baker Book House, 1986 edition, p. 185). నన్ను దాచుము, ఓ నా రక్షకా, దాచుము, జీవిత తుఫాను గతించే వరకు: "నోవహు" సినిమాలో కథ అంతా దెయ్యముమయిన, ఓడ వాస్తవికంగా ఉంది బైబిలును నిజానికి తగినట్టు. జంతువులు పక్షులు ఓడలోనికి డాక్టర్ మోరిస్ వర్ణించినట్లు వచ్చాయి. అవి స్వంతంగా వచ్చి సర్దుకున్నాయి. సినిమా ఆ భాగము చాలా అందంగా ఉంది బైబిలు చెప్పినట్టు ఉంది. కాని, దయచేసి, చూడవద్దు. సాతాను సందేశము హాని తికమక తెస్తుంది. ఇంకా, నిజంగా, ఈ గొప్ప ఓడ ఊహ పురిగొల్పేవిగా ఉన్నాయి. నా ఊపిరి ఆగినట్టుంది ఈ నల్ల గొప్ప ఓడను గూర్చి ఆలోచించినప్పుడు, మూడు అంతస్థుల ఎత్తు, అలల ద్వారా పయనించడం, దేవుడుచే రూపించబడింది 90 డిగ్రీల ఎత్తు అలలు కూడా తట్టుకోడానికి తగ్గట్టుగా ఉంది. ప్రతి వేసవిలో, వీలైనప్పుడు కొన్ని రోజులలో, అర్మేనియాలో అరారాతు ఎతైనా పర్వతముపై వెదకుట జరుగుతుంది. బహుశా ఒక వేసవిలో వారు ఓడ శకలాలు కనుగొంటారు. ఈ యుగాంతాన గొప్ప తీర్పుకు ముందు వారు వేస్తారు. కాని ఖగోలకులు కనుగొనిన లేకపోయినా, అమెరికా వృద్ధులు ఏ వ్యాయామశాలలో అయినా చెప్తారు అవి ఉన్నాయని. ఒక వృద్ధుడు అన్నాడు అతని తాత ఐసులో దానికి సంభందించిన ముక్క చూసాడని. ఆయన అన్నాడు, "అది నల్లగా ఉంది. అది నల్లగా ఉంటుందను కోలేదు." చాలా సంవత్సరాల క్రితం నేను నా కుటుంబంతో ఇంగ్లాండు వెళ్ళాను. అక్కడ నా తాత జన్మించాడు, నేను చాలా ఆనందించాను. డోవర్ కేస్సల్ కు వెళ్ళాము. బహుశా మీరు విని ఉంటారు "వైట్ క్లిప్స్ ఆఫ్ డోవర్." చాలా ఓడలు శతాబ్దాలుగా బండల క్రింద తునాతునకలయ్యాయి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు డోవర్ కేస్సల్ పై దృష్టి సారించలేదు. ఒక భవంతిని చూస్తే, అన్ని చూసినట్లే! నా దృష్టిని మరల్చిన ఒకటి దూరము నుండి చూసాను. చాలా పెద్దది. పురాతనమైనది. పరుగెత్తి వెళ్లి సమీపంగా చూసాను. దృష్టి మరల్చలేక పోయాను. అది, ఎనబై అడుగుల ఎతైన కట్టడం, వారు చెప్పారు, అది 1 వ శతాబ్దానికి చెందినది! అది పొడవైన, నల్లని సొరంగము ఆకాశము వైపు ఉంది. లోపల చూసాను లోపలి భాగాన నల్లని రంగు పూసి ఉంది. రోమీయులు దానిని నిర్మించారు అపోస్తలుడైన యోహాను పత్మాసు దీవిలో జీవించి ఉన్నప్పుడు! వారు లోపల చెట్లను కాల్చారు డోవరు సముద్రపు ఒడ్డు దగ్గర ఓడలను హెచ్చరించడానికి. ఆ పురాతన ద్వీప స్థంభం చూస్తే, ఆశ్చర్యంతో నా తనువు పులకించింది, నేననుకుంటాను, ఓడ కూడా అలానే పడి ఉండేది బాలురు రాత్రి వచ్చి, దానిపై రాళ్ళు రువ్వి, స్వరము విని, నవ్వుకుంటూ పరిగెత్తే వారు – ప్రళయం వచ్చి వారందరిని తుడుచుకు పోయే ముందు రాత్రి! మనష్యులు ఏడ్చి అరచి, చెట్టు కొమ్మలకు వ్రేలాది, ఎతైన బండలకు కొండలకు కొట్టుకుంటూ, ఎప్పుడైతే ఎతైన దెయ్యపు రూపము సముద్రము నుండి లేచి, తన ట్రైటోన్ బూర ఊదినప్పుడు – దేవుడు లోతైన జలాలు వదిలి, ఆకాశపు వాకిండ్లను తెరిచాడు, "నరులతో కూడా, పశువులను, పురుగులను, ఆకాశ పక్షులును, నేల మీద నున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను; అవి భూమి మీద నుండకుండా తుడిచి వేయబడెను: నోవహును అతనితో కూడా, ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలి యుండెను" (ఆదికాండము 7:23). నన్ను దాచుము, ఓ నా రక్షకా, దాచుము, జీవిత తుఫాను గతించే వరకు: "నోవహును అతనితో కూడా, ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలి యుండెను" (ఆదికాండము 7:23) – ఓడ క్రీస్తు చిత్ర పటాన్ని చూపిస్తుంది! మీరు క్రీస్తులో ఉంటే, రాబోవు తీర్పు నుండి మీరు సురక్షితులు. మీరు క్రీస్తులో ఉండకపోతే, అగ్ని గుండములో మునిగి పోతారు, మరణమవరు! ఓ, వద్దు – ఈడ్వబడి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మండుచుండు అగ్ని గుండములో పాడడం అది ముగియదు, చల్లబడదు, ఎప్పటికి ఎప్పటికి ఎప్పటికి ఎప్పటికి కాలుతూనే ఉంటుంది! మీరెలా తప్పించుకుంటారు? ఓడలోనికి రండి! ఓడ క్రీస్తును చూచిస్తుంది. నల్లని కీలు క్రీస్తు రక్తాన్ని సూచిస్తుంది! లోపలి రండి! ఓడలోనికి రండి! క్రీస్తు లోనికి రండి నిత్యత్వములో చాలా ఆలస్యము కాకముందే. ఆ అబ్బాయిలు పొదలలో నుండి ఓడను చూచి నవ్వారు జల ప్రళయం ముందు రాత్రి! ఆ అబ్బాయిలే ఓడ ప్రక్క నుండి ఆకాశము నుండి నీళ్ళు పడుతున్నప్పుడు! అబ్బాయిలు అరిచారు, "ఓ దేవా, లోనికి రానివ్వండి! మునిగి పోనివ్వకండి!" ఆ అబ్బాయిలు నిత్యత్వములో అగ్ని గుండములో అరుస్తున్నారు! ఆ అబ్బాయిలు చెప్పగలిగితే, మీతో ఇలా అంటారు, "దేవుని ఉగ్రత నుండి తప్పించుకొండి! ప్రభువు ఆగ్రహము నుండి తప్పించుకొండి! మీ వెనుక చూడవద్దు! ఇప్పుడే ఎలా ప్రవేశించాలో ఆలోచించండి! రండి! "ఆయనపై ఆధార పడండి, పూర్తిగా ఆధార పడండి" – ఆయనపై పూర్తిగా అనుకోండి, "వేరే నమ్మకాన్ని చొరబడ నివ్వకండి." ఓడ ద్వారము ద్వారా ప్రవేశించండి – "ఆయనపై ఆధార పడండి, పూర్తిగా ఆధారపడండి" – క్రీస్తు మాత్రమే నిన్ను రక్షించగలడు రాబోవు ఉగ్రత నుండి, ఆయన పరిశుద్ధ నిత్య రక్తముతో నీ పాపాన్ని కడుగుతాడు!" ఆమెన్. లేచి పాటల కాగితం నుండి 7 వ నంబరు పాడండి, "రండి, ఓ పాపులారా." రండి, ఓ పాపులారా, పేద దారిద్ర, బలహీన గాయపడిన, రోగముతో నొప్పితో, మీరు నాతోను మిగిలిన కౌన్సిలర్ల తోను మాట్లాడాలనుకుంటే, ఆవరణము వెనుకకు ఇప్పుడే రండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి మీ రక్షణ గూర్చి మాట్లాడతారు. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: ఆదికాండము 6:12-17. |
ద అవుట్ లైన్ ఆఫ్ నోవహు ఓడ (ఆదికాండము పై 81 వ ప్రసంగము) "చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసికొనుము; అరలు పెట్టి ఆ ఓడను చేసి, లోపటను వెలుపలును దానికి కీలు పోయవలెను" (ఆదికాండము 6:14). (మత్తయి 24:37-39; II పేతురు 2:5; I పేతురు 3:20-21; హెబ్రీయులకు 11:7;
I. మొదటిది, ఓడ దేవునిచే ప్రణాళిక చేయబడింది,
II. రెండవది, లోపలి వారిని రక్షించడానికే ఓడ తయారు చెయ్యబడింది, ఆదికాండము 50:26;
III. మూడవది, ఓడ దేవుని తీర్పు నుండి ఆశ్రయ దుర్గము, అపోస్తలుల కార్యములు 4:12; యూదా 14, 15;
IV. నాల్గవది, ఓడలో అందరికీ స్థలముంది, ఆదికాండము 7:23. |