Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఈ దినాల్లో లోకంలోని దయ్యాలు

(ఆదికాండము పై 79 వ ప్రసంగము)
DEMONS IN THE WORLD TODAY
(SERMON #79 ON THE BOOK OF GENESIS)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, మే 25, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, May 25, 2014

"నరులు భూమి మీద విస్తరింపనారంబించిన తరువాత, పురుషులు భూమిమీద జీవనం ప్రారంభించిన తరువాత, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి; వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి" (ఆదికాండము 6:1-2).


ఈ బైబిలు పాఠ్యభాగాన్ని తెరచి ఉంచండి. ఈ రెండు వచనాలు నేను వివరించే ముందు, ఈ రోజుల్లో అపోష్టషీకి ఒక మూలము ఇవ్వబోతున్నాను. గత ఆదివారం యేసు ఇచ్చిన ప్రవచనం చూసాం, దాని గూర్చి మళ్లీ ఆలోచిద్దాం.

శిష్యులు యేసునడిగారు, "నీ రాకడ సూచనలేమిటి, యుగ సమాప్తి ఎలా ఉంటుంది?" (మత్తయి 24:3). క్రీస్తు వారికి చాలా సూచనలిచ్చారు. అన్నిటితో పాటు గొప్ప సూచన యిచ్చాడు. క్రీస్తు అన్నాడు,

"నోవాహు దినములు ఎలాగుండెనో, మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును" (మత్తయి 24:37).

యుగ సమాప్తిలో క్రీస్తు రెండవ రాకడ ముందు ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటే, మనం చెయ్యవలసింది జల ప్రళయం ముందు, నోవహు దినాలను గూర్చి చదవాలి. ఈ వివరణ బైబిలులో – ఆదికాండము 4, 5, మరియు 6 అధ్యాయాలలో ఇవ్వబడింది.

గత ఆదివారము రాత్రి ఆదికాండము, 5 వ అధ్యాయము పితరుల కాలము మీకు చూపించాను, గొప్ప విశ్వాసము బదులు, అపోష్టషీ పెరుగుతుంది! ఆ అధ్యాయములోని పితరులు ఆత్మీయ నాయకులు కారు. వారు జీవించి, కుమారులను కుమార్తెలను, కని చనిపోయారు. అంతే! ఈ పితరుల జాబితాలో ఒక వ్యక్తి ఏదో ఒకటి చేసాడు. అతని పేరు హనోకు. ఆయన అపోష్టషీకి వ్యతిరేకంగా బోధించాడు, ప్రభువు వస్తున్నాడని చెప్పాడు "అందరినీ తీర్పు తీర్చడానికి" (యూదా 15). గొప్ప జల ప్రళయ తీర్పును గూర్చి బోధించాడు. బైబిలు చెప్తుంది, "హనోకు దేవునితో నడిచెను" (ఆదికాండము 5:22). నోవహు వరకు మరి ఏ యితర పితరుని గూర్చి చెప్పబడలేదు, "నోవహు దేవునితో నడిచెను" (ఆదికాండము 6:9). విశ్వాసుల జాబితా నుండి మిగిలిన పితరులంతా తొలగింపబడ్డారు హెబ్రీయులకు 11 లో – హనోకు నోవహు తప్ప. అలా మనం చూస్తాం ఆదికాండము 5 లో ఎదిగే అపోష్టషీని మనం చూస్తాం.

వ్యాఖ్యాతలు "షేతు దైవత్వాన్ని గూర్చి" మాట్లాడారు "కయీను ఆ దైవత్వాన్ని గూర్చి" కూడా. కాని మాట లేదు – ఒక్క మాట లేదు – బైబిలు చెప్తుంది! అవును, బైబిలులో ఔను రెండు జాతులున్నాయి, కయీను జాతి, షేతు నుండి వచ్చిన జాతి. రెండు గుంపులు దేవుడు లేనివే! రెండు గుంపులు జల ప్రళయంలో నశించిపోయాయి! ఆదిమ యూదా రబ్బీలు పితరుల దినాలు అపోష్టషీ పెరిగిన దినాలుగా చెప్పారు. మన పాఠ్య భాగంలో అపోష్టషీకి పాపానికి ముగింపు ఏది తీసుకొచ్చింది. మళ్ళీ చూడండి, ఆదికాండము 6:1-2.

I. మొదటిది, అది గొప్ప దయ్యపు కార్యకలాపాల కాలము.

"నరులు భూమి మీద, విస్తరింప నారంబించిన తరువాత, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచిరి; వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై యున్నారు: అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను. ఆ దినములలో నేఫీలులను వారు భూమి మీద నుండిరి; తరువాతను ఉండిరి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు, వారికి పిల్లలను కనిరి, పూర్వకాలమందు, పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడు తనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను" (ఆదికాండము 6:1-5).

స్కోఫీల్డ్ గమనిక చెప్తుంది "కనానీయుల షిత్తీయుల వివాహము." కాని అది తప్పు. "దేవుని కుమారులు" పడ ద్రోయబడిన దూతలు లైంగిక సంబంధాలు "నరుల కుమార్తెలతో" కలిగియున్నారు. డాక్టర్ రైరీ అన్నాడు, "పదము ’దేవుని కుమారులు’ పాత నిబంధనలో [ఓ.టి.] వాడబడింది దూతలను గూర్చి...ఈ విశిష్ట సందర్బంలో [వారు చేసారు] నరుల కుమార్తెలతో కలసి పిల్లలు కన్నారు" (రైరీ స్టడీ బైబిలు, గమనిక ఆది కాండము 6:2). యూదా 6 మరియు 7 ను మూలంగా చెప్తూ, డాక్టర్ యమ్. ఆర్. డిహాన్ అన్నాడు, "వారి ఆస్థానములో నుండి పడిన ఈ దూతలు పరిశుద్ధ దూతలు. వారి పాపము సొదొమొ పాపం లాంటిది – వింత శరీరము, వివాహేతర సంబంధం, జారత్వము అసహజ సంబంధాలు కలిగి ఉండడం – దేవుని తీర్పును తెచ్చుకోవడం" (M. R. DeHaan, M.D., The Days of Noah, Zondervan Publishing House, 1963, p. 144).

ప్రాచీన యూదా రబ్బీల అభిప్రాయము కూడ అదే, ప్రాథమికంగా ఇది సరి అని నేను నమ్ముతాను. కాని, తత్వవేత్తలు ఆశ్చర్యపోయారు ఎలా పడిన దూతలు (దెయ్యాలు) నోవహు కాలములో స్త్రీలతో ఎలా లైంగిక సంబంధము కలిగి ఉన్నాయా అని.

నా దీర్ఘ కాల కాపరి చైనీయ బాప్టిష్టు సంఘములోని డాక్టర్ తిమోతీ లిన్. ఆయన పాత నిబంధన తత్వవేత్త న్యూఅమెరికన్ స్టాండర్డ్ వెర్సన్ (ఎన్ఎఎస్ వి), అనువాదకుడు కూడ సేమినేరీలలో భోధించినవాడు. డాక్టర్ లిన్ జవాబు యిచ్చాడు దూతలు మానవ స్త్రీలను ఎలా భార్యలుగా చేసుకున్నారు అనే దానికి. పడిన దూతలు పురుషులను కలిగి, ఈ దయ్యము పట్టిన పురుషులు స్త్రీలతో శరీర సంబంధం పెట్టుకున్నారు. తను అన్నాడు, "ఈ దుష్ట పడిన దూతలు దెయ్యపు ప్రభావిత పిల్లలను పుట్టించారు [వారు] నీతి విషయంలో భయంకరంగా కల్తీ చెయ్యబడ్డారు" (Timothy Lin, Ph.D., Genesis: A Biblical Theology, Biblical Studies Ministries International, 2002, pp. 96-97). డాక్టర్ లిన్ ఇంకా యిలా అన్నాడు,

         సాతాను మానవుని వ్యవహారాల్లో జోక్యము చేసుకొని, ముందుగానే మరలించిన వ్యక్తిని లైంగిక కామముతో ఇంకా నాశనం చేసాడు. ఈ కాలములో అంతర్గత వివాహము పవిత్ర వివాహ వ్యవస్థను బ్రష్టు పట్టించి స్వార్ధపు కామపు కోరికలతో పాడుచేసింది. అది దైవ కుమారులను నరుల కుమార్తెలను కలిపి, మానవ జాతిని దిగజారిన స్థితికి తెచ్చింది. విజయవంతంగా, మనిషి మానవ విత్తనముగా కాక సాతాను విత్తనము మారాడు, విమోచకుని తిరస్కరించాడు.
         సాతాను పథకము భూ జనాభా నంతటిని బ్రష్టు పట్టించింది. ప్రజలు "తినడం త్రాగడం, పెళ్ళాడడం పెల్లికివ్వబడడంపై దృష్టి సారించారు, నోవహు ఓడలో ప్రవేశించే వరకు" (మత్తయి 24:38). ఇంకా, "భూమి హింసతో నింపబడింది," (ఆదికాండము 6:11, 13). సాతాను ప్రాముఖ్య ఉద్దేశము చెడుతనము, దుష్టత్వము, అవినీతి, హింస తేవడం "దైవకుమారులు" దీనికి కారణము, ఎవరు…ఆ కాలములో ప్రజలను పాడు చేసారు (ఐబిఐడి.).

ఇప్పుడు ఆదికాండము 6:4 చూడండి,

"ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి; తరువాతను ఉండిరి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు, వారికి పిల్లలను కనిరి, పూర్వ కాలమందు, పేరు పొందిన శూరులు వీరే" (ఆదికాండము 6:4).

కెజేవి ఈ దెయ్యపు పిల్లలను "శూరులు"* అని పిలిచింది. అది దురదృష్టకర అనువాదము "నెఫిలిమ్" అను హెబ్రీ పదాన్ని పాత రబ్బీలచే తప్పుగా తర్జుమా చేసింది. హెబ్రీని గ్రీకులోనికి "బలాడ్యులు" (శూరులు) అని తర్జుమా చేసారు. కాని హెబ్రీ పదము "నెఫిలిమ్" కు "శూరులు" అని అర్ధము కాదు. కాని, "పడినవారు" అని అర్ధము. డాక్టర్ హెన్రీ యమ్. మోరిస్ అన్నాడు "సహజ అర్ధము ‘పడినవారు,’ పడిన దూతలను గూర్చి... దెయ్యపు ఆవరిత పురుషులకు ఆకాలపు స్త్రీలకు పుట్టిన పిల్లలు [నెఫిల్లిమ్ లేక ‘పడిన వారు’]" (Henry M. Morris, Ph.D., The Genesis Record, Baker Book House, 1986 edition, p. 172; note on Genesis 6:4). కనుక మనము ఆదికాండము 6:4 ను ఇలా అనువదింపవచ్చు, "ఆ రోజుల్లో భూమిపై పడిన వారున్నారు, దేవుని పిల్లలు, [దెయ్యము పట్టినవారు] నరుల కుమార్తెల దగ్గరకు వచ్చి, పిల్లలను అలా కన్నారు..." గొప్ప ప్రళయము ముందు, మానవ జాతి అంతా దెయ్యముపట్టిన ప్రభావిత ప్రజలతో నిండి ఉంది. సాతాను పథకము ఫలించింది. వాడు మానవ జాతిని నశింపజేసి, క్రీస్తు రాకడను ఆపాడు. ఈ దెయ్యపు ప్రజలు ఆదికాండము 6:5 లో వివరింపబడ్డారు. సాతాను పథకాన్ని ఏమి ఆపింది? ఆదికాండము 6:8 చూడండి,

"అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను" (ఆదికాండము 6:8).

దేవుని కృపను బట్టి నోవహు అతని కుటుంబము దెయ్యపు పట్టు నుండి రక్షింపబడ్డారు. ఆయన వారిని భద్రపరిచాడు "పడిన వారిని" నశింప చెయ్యడానికి ప్రళయము పంపినప్పుడు. నీవు దేవునిచే, ఎన్నుకొనబడిన వాడవైతే, భయపడనక్కర లేదు, దేవుని కృప సాతాను దెయ్యముల కంటే బలమైనది. లూథర్ అన్నాడు, "దెయ్యాలచే నింపబడిన, లోకము భయపెట్టినా, మనంభయపడం, ఎందుకంటే, ఆయన సత్యము నిలుచునట్లు దేవుడు ఇష్టపడ్డాడు." కాని మీరు రక్షించబడకపోతే, భయపడాలి! అది రెండవ విషయానికి నడిపిస్తుంది.

II. రెండవది, మనము గొప్ప దెయ్యపు కార్య కలాపాల కాలములో ఈనాడు ఉన్నాము.

ఇది తిరిగి మనలను ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన ప్రవచనానికి, మనలను తీసుకెళ్తుంది,

"నోవహు దినములు ఎలాగుండెనో, మనష్యు కుమారుని రాకడ యందును అలాగే జరుగును" (మత్తయి 24:37).

డాక్టర్ యమ్. ఆర్. డిహాన్ అన్నాడు,

ప్రస్తుతపు పరిస్థితులకు నోవహు దినములకు ఏమైనా పోలిక ఉందా...? లేదని చెప్పితే అతడు ఆత్మీయ అంధత్వము, దేవుని వాక్యము పట్ల నిర్లక్ష్యత కారణాలు, నోవహు దినములలో గుర్తించడంలో విఫలమైనట్లు…(M. R. DeHaan, The Days of Noah, Zondervan Publishing House, 1971 edition, page 149).

నోవహు దినములలో సాతాను శక్తులు లోకాన్ని ఆధీనంలోనికి తీసుకున్నాయి – మానవ జాతి నంతటిని నాశనము చేసింది.

నా జీవిత కాలములో లోకమంతటా సాతాను శక్తి పెరుగుట చూసాను. 1960 లో అనిపించింది నాశనము వైపు లోకము వెళ్తుందని. చాలా మంది యువకులు దెయ్యాలచే ఆవరింపబడడానికి తావు యిచ్చారు ఎల్ఎస్ డి లాంటి మత్తు పదార్ధాలు తీసుకోవడం ద్వారా. ఎల్ఎస్ డి కేండిలా హానికరము కాదు అన్నట్టు మత్తు పదార్ధాలు తీసుకుంటున్నారు. 70 లో శాన్ ప్రాన్సిస్కోలో హిప్పీల మధ్య బోధిస్తున్నాను. అనుభవము ద్వారా చెప్తున్నాను చాలా మంది పిల్లలు దెయ్యపు ప్రభావంలో ఉన్నారు, చాలా మంది పూర్తిగా దెయ్యముచే ఆవరింపబడడం చూసాను. 1973 లో అమెరికా సుప్రీం కోర్టు అమెరికా అంతా గర్భ స్రావాన్ని న్యాయబద్దం చేసింది. అప్పటి నుండి 55 మిలియన్ల పిల్లలు దెయ్యపు పూరిత గర్భ స్రావానికి గురి అయ్యారు "వైద్యుల" ద్వారా. మేం కనుగొన్నాం, శాన్ ప్రాసిస్కో లాస్ ఎంజిలాస్ అంతర్గత పట్టణాలలో యవనుల మద్య పరిచర్య చేస్తూ కనుక్కున్నాం, ప్రతి స్త్రీ "బలవంతంగా" గర్భస్రావం చేయించుకుంటుంది, చాలా మంది సాతాను బంధకాల్లో ఉన్నారు. ఈనాడు ఈ స్త్రీలు, మత్తు పదార్ధాలు సేవించే మగవారు, ఓటర్లుగా మారి రెండుసార్లు బరాక్ ఒబామాను ఎన్నుకున్నారు. ఒబామా తేటగా దెయ్యపు ఆలోచనలు కలిగి ఉన్నాడు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను (21 సంవత్సరాలు) ఒక గుడికి హాజరు అవడం ద్వారా దెయ్యపు మనిషి అయిపోయాడు డాక్టర్ జెర్మియా రైట్ సంఘ కాపరి, టెలివిజన్ లో అరుస్తూ ఉంటాడు, "దేవా పిచ్చి అమెరికా! దేవా పిచ్చి అమెరికా! దేవా పిచ్చి అమెరికా!" అని 21 సంవత్సరాలు ప్రతి ఆదివారం గుడికి హాజరైతే తప్పకుండా దెయ్యపు మనిషి అవుతాడు! అధ్యక్షుడు క్రైస్తవుల కంటే తిరగబడే ముస్లీములతో ఎక్కువ కలివిడిగా ఉంటాడు. అదే దురాత్మలతో వారు దగ్గరయ్యారు!

స్వలింగ సంపర్కం "పురుష" వివాహాలు ఎక్కువయ్యాయి తెలుసు కదా? అశ్లీల చిత్రాల గూర్చి చెప్పాలా – ఇప్పుడు 95% యవనస్థులు చూస్తున్నారు? రేవ్స్ లో రాక్ విభావరులలో వినే సంగీతం గూర్చి చెప్పాలా, గుంపు అంతా కనికట్టు చెయ్యబడి శరీరాలను మలుస్తూ నాట్య మాడతారు? హాలివుడ్ సినిమాలలో చెప్పలేని అసభ్యత చంపుకోవడాలు గూర్చి చెప్పాలా? డాక్టర్ జె. వెర్నాన్ మెక్ గీ అన్నాడు,

చాలా మంది దెయ్యాలు పట్టిన వారు ఉన్నారు...అలాంటి ప్రత్యక్షతలు చాలా చూస్తున్నాం. చాల సాక్ష్యాధారాలున్నాయి (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, volume IV, 1983, p. 51; comment on Matthew 8:32).

డాక్టర్ మెక్ గీ గౌరవ ప్రద ప్రఖ్యాత బైబిలు బోధకుడు. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ఇరవై శతాబ్దంలో గొప్ప బోధకునిగా పిలవబడ్డాడు. లండన్ నడి బొడ్డున వెస్ట్ మినిస్టర్ చాపెల్ కు కాపరిగా ఉన్నాడు, ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు,

దెయ్యపు కలాపాలు పెరుగుతున్నాయి ఆత్మీయత లేనందున, దైవత్వము దేశంలో లేనందున (Martyn Lloyd-Jones, M.D., Healing and the Scriptures, Oliver-Belson Books, 1988, p. 159).

చివరి దినాలలో సాతాను కార్య కలాపాలు ఎక్కువగా ఉంటాయని బైబిలు ఊహిస్తుంది. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"అంత్య దినాలలో, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనష్యులు స్వార్ధ ప్రియులు, ధనాపేక్షులు, బింకము లాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిదేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించు వారు; పైకి భక్తీ గల వారి వలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు: ఇట్టి వారికి విముఖడవై యుండుము" (II తిమోతి 3:1-5).

"అయితే దుర్జనులను వంచకులును ఇతరులను మోసపరుచుచూ, తామును మోసపోవుచూ, అంతకంతకు చెడి పోవుదురు" (II తిమోతి 3:13).

అపోస్తలుడైన పౌలు సూచించాడు చివరి దినాలలో సాతాను కార్య కలాపాలు ఎక్కువగా సంఘాలలో ప్రబలుతాయని,

"సత్యమునకు చెవి యియ్యక, కల్పనా కథల వైపునకు తిరిగు కాలము వచ్చును" (II తిమోతి 4:4).

"నోవహు దినములు ఎలాగుండేనో, మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును" (మత్తయి 24:37).

మనం సాతాను కార్య కలాపాల విజ్రుంబణ రోజులలో జీవిస్తున్నాం. యేసు మాత్రమే మనలను రక్షింపగలడు!

ఈ దెయ్యపు కాలములో, ప్రతి ఒక్కరు అపోస్తలుడైన పేతురు ఇచ్చిన హెచ్చరికను గమనించాలి,

"నిబ్బరమైన, బుద్ధి గలవారై మెలుకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది, గర్జించు సింహము వలె, ఎవరిని మ్రింగుదునా అని, వెదుకుచు తిరిగుచున్నాడు" (I పేతురు 5:8).

మీలో కొంత మందికి యేసును నమ్మడం రక్షింపబడడం చాల కష్టమని మీకు తెలుసా? బహుశా మీ మనసుపై సాతాను దెబ్బ అయి ఉంటుంది – తన బానిసగా ఉంచుకోడానికి సాతాను ఆఖరి ప్రయత్నము? బైబిలు చెప్తుంది బంధకాలలో (బానిసత్వములో) ఉన్న వారు సాతానుకు "జీవితమంతా అలానే ఉండి పోతారు" (హేబ్రీయులకు 2:14, 15).

అందుకే యేసు వచ్చాడు – సాతాను బంధకాల నుండి విడిపించడానికి, సాతాను బానిసత్వం నుండి విడుదల చెయ్యడానికి! యేసు నీ పాపానికి ప్రాయాశ్చిత్తము చెల్లించడానికి యేసు సిలువపై మరణించాడు. సాతాను బానిసత్వం నుండి విడిపించడానికి యేసు మృతులలో నుండి లేచాడు! వచ్చి బ్రతి మాలండి యేసుతో సాతాను బంధకాల నుండి విడిపించమని! వచ్చి మోర పెట్టండి యేసుకు మీ పాపాలు క్షమించి మీకు నూతన జీవితం ఇవ్వాలని! యేసు అన్నాడు దేవుడు తనను పంపించాడు "చెరలోనున్న వారికి విడుదలను, నలిగిన వారిని…విడిపించుటకును" (లూకా 4:18). ఓ, రండి, రండి, రండి – యేసు నొద్దకు! "యేసు మాత్రమే, యేసు మాత్రమే, నిస్సహాయ పాపులకు మంచి చేస్తాడు!"

సాతాను గురుంచి ఇక ఆలోచించకండి! యేసును గూర్చే ఆలోచించండి! యేసుపై బడితే ఆయన పాపము నుండి మరణము నుండి స్వతంత్రులను చేస్తాడు! యేసు నిన్ను రక్షిస్తాడు! "ఆయనను నమ్మండి, ఆయననే నమ్మండి, ఆయననే నమ్మండి ఇప్పుడు. ఆయన మిమ్ములను రక్షిస్తాడు, ఆయన మిమ్ములను రక్షిస్తాడు, ఆయన మిమ్ములను రక్షిస్తాడు ఇప్పుడే"! ఓ, పాపమును విడిచి ఇప్పుడే రక్షకుని నమ్మండి!

వచ్చి రక్షించు యేసును గూర్చి మాతో మాట్లాడండి. స్థలము వదిలి ఇప్పుడే ఆవరణ వెనుకను వెళ్ళండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి మీతో మాట్లాడతాడు. డాక్టర్ చాన్, కొందరు యేసును నమ్మునట్టు ప్రార్ధించండి. ఆమెన్.

*ఆదిమ రబ్బీలు హెబ్రీ పదము "నెఫిలిమ్" ను "శూరులుగా" సెప్టూ జియంట్ లో అనువదించారు. అలా, వారు నెఫిలిమ్ అంటే శూరులు అనే తప్పుడు అభిప్రాయాన్ని పరిచయం చేసారు. పదము "నెఫిలిమ్" సంఖ్యా కాండము 13:33 లో వచ్చింది కెజెవిలో "శూరులు" అని తప్పుగా అనువదించారు. రెండు చోట్ల దురదృష్టకర అనువాదము వచ్చింది సెప్టు జియంట్ (శూరులు) తప్పుడు తర్జుమా వలన. సంఖ్యా కాండము 13:33 లో వారిని ఆజానుబహులుగా తెలుసుకున్నాం అది హేబ్రీయులను తక్కువగా అనిపింపచేసింది. దాని అర్ధము వారు పెద్ద వారు, బలవంతులు, కాని శూరులు కాదు. పదము "నెఫిలిమ్" అర్ధము వారు దెయ్యములచే ఆవరింపబడిన వారు, హేబ్రీయులకు మునుపు చాలా మంది కనానీయులు అలాగే దెయ్యపు పూరితులయ్యే వారు. ఈ దెయ్యములు పట్టిన వారిచే హేబ్రీయులు వేదింప బడేవారు ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించినట్లు వారిని ఆ భూభాగము నుండి వెళ్లగొట్టలేదు. ఈ పాఠ్యభాగాలలో "శూరుడు" అనే మాట లేదు, కొన్ని వ్యాఖ్యానాలు, బలమైనవి కూడ, ఆదిమ రబ్బీల తప్పుడు తర్జుమా వలన తికమకలో పడ్డాయి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: ఆదికాండము 6:1-8.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"అప్పుడు యేసు వచ్చాడు" (డాక్టర్ ఓస్ వాల్డ్ జె. స్మిత్ చే, 1889-1986).
“Then Jesus Came” (by Dr. Oswald J. Smith, 1889-1986).


ద అవుట్ లైన్ ఆఫ్

ఈ దినాల్లో లోకంలోని దయ్యాలు

(ఆదికాండము పై 79 వ ప్రసంగము)
DEMONS IN THE WORLD TODAY
(SERMON #79 ON THE BOOK OF GENESIS)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"నరులు భూమి మీద విస్తరింపనారంబించిన తరువాత, పురుషులు భూమిమీద జీవనం ప్రారంభించిన తరువాత, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి; వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి" (ఆదికాండము 6:1-2).

(మత్తయి 24:3, 37; యూదా 15; ఆదికాండము 5:22; 6:9)

I. మొదటిది, అది గొప్ప దయ్యపు కార్యకలాపాల కాలము, ఆదికాండము 6:1-5; మత్తయి 24:38;
ఆదికాండము 6:11, 13, 4, 8.

II. రెండవది, మనము గొప్ప దెయ్యపు కార్య కలాపాల కాలములో ఈనాడు ఉన్నాము, మత్తయి 24:37;
II తిమోతి 3:1-5, 13; 4:4; I పేతురు 5:8;
హెబ్రీయులకు 2:14, 15; లూకా 4:18.