ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును ప్రకటించుట PREACHING THE UNSEARCHABLE RICHES OF CHRIST డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "పరిశుద్ధులందరిలో, అత్యల్పుడైన నాకు, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును, అన్యజనులలో ప్రకటించుటకు తన కృప అనుగ్రహించెను" (ఎఫేస్సీయులకు 3:8). |
ముసలివాడనై అపోస్తలుడైన పౌలును ఎక్కువగా ప్రేమిస్తాను. ఆయన తగ్గింపు కలవాడు, క్రీస్తు ఐశ్వర్యమును మన కొరకు తెరిచాడు. మన పాఠ్యభాగములో మనకు చెప్తున్నాడు "పరిశుద్ధులందరిలో అత్యల్పుడు." తన అపోస్తలత్వాన్ని గూర్చి పౌలు తగ్గింపు భావము కలిగియున్నాడు. I కొరింధీయులకు 15:9 లో ఆయన అన్నాడు అపోస్తలులలో అల్పుడు ఎందుకంటే అతని మార్పు ముందు "దేవుని సంఘాన్ని హింసించాడు." మళ్ళీ I తిమోతి 1:12, 13 లో చెప్పాడు. కాని పౌలు చెప్తున్నాడు "శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును" గూర్చి బోధించడానికి కృప అనుగ్రహింపబడింది. కెన్నెత్ వెస్ట్ అన్నాడు "శోధింప శక్యము కాని" పదానికి గ్రీకు తర్జుమా అర్ధము, "కనిపెట్ట బడలేనిది." క్రీస్తు ఐశ్వర్యములు అగమ్య గోచరములు, "మనష్యులు పూర్తిగా అర్ధము చేసుకోలేరు" (Kenneth S. Wuest, Ph.D., Wuest’s Word Studies, Eerdmans, 1975, volume I, p. 84). చాలా సంవత్సరాలు మంచి బోధకులు అధ్యాపకులచే చెప్పబడ్డాను కేవలం సువార్త ప్రకటిస్తే చాలదు, నా ప్రజలు సామాన్య క్రైస్తవులుగా ఉంటారు. చాలా కాలము అది నమ్మాను – స్పర్జన్ ప్రసంగ ప్రతులు నాకివ్వబడే వరకు. స్పర్జన్ ను కొంతకాలము చదివాక, క్రీస్తును గూర్చి లోతుగా ఆయన బోధించడాన్ని చూసి ఆశ్చర్యపోయాను. నేననుకున్నాను చాలా విధాలుగా సువార్త ప్రకటించాలని, వివిధ కోణాలలో, స్పర్జన్ చేసినట్లు. నేననుకున్నాను, "చాలా కాలం ఇలా చెయ్యలేను. నా దగ్గర సామాగ్రి ఉండదు, ప్రజలకు బోరు కొడుతుంది." నాది ఎంతో తప్పు! చాలా సంవత్సరాలుగా సువార్తను ఆదివారము ఉదయము ఆదివారము సాయంత్రము బోధిస్తున్నాను. ఉపరితలాన్ని గోకుతున్నట్టనిపించింది! ప్రసంగ సామాగ్రి తరిగిపోదు, ఎందుకంటే నేను శోధింప శక్యము కాని, గోచరము కాని విషయాలు బోధిస్తున్నాను, "క్రీస్తు ఐశ్వర్యము లోతులోనికి వెళ్ళలేము" క్రీస్తు ఐశ్వర్యము! సహాయము చెయ్యండి! క్రీస్తు ఐశ్వర్యమును గూర్చి చెప్పాల్సింది చాలా ఉంది ముగించలేను – వంద సంవత్సరాలలో! క్రీస్తును గూర్చిన సువార్త వింటూ ఉంటే ప్రజలను మందకొడిగా చేస్తుందా – నేను విన్నట్టు? కానే కాదు! మంచి క్రైస్తవులున్నారు ప్రపంచ మంతటా! అతిశయోక్తి కాదు. అది వాస్తవము! ప్రపంచంలో ఈనాడు బలమైన క్రైస్తవులున్నారు. సువార్త బోధన ద్వారా వారు మార్చబడ్డారు. సువార్త ప్రకటింపు ద్వారా వారు తృప్తి పరచబడ్డారు. సువార్త ప్రకటింపు ద్వారా బలవంతులయ్యారు! పౌలు చెప్పింది నేను అర్ధం చేసుకుంటున్నాను, "నేను యేసు క్రీస్తును అనగా, సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని" (I కొరింధీయులకు 2:2). సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా విశ్వాసముచే మనము రక్షింపబడియున్నాము. సిలువ వేయబడిన క్రీస్తు యందలి విశ్వాసము ద్వారా కృప ద్వారా ఎదుగుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మనము పరిశుద్ధ పర్చబడుచున్నాము. క్రీస్తు "ఆల్పా ఓమేగా, ఆదియు అంతము" (ప్రకటన 1:8). క్రీస్తు "విశ్వాసమునకు [కర్త] దానిని కొనసాగించు వాడు (హెబ్రీయులకు 12:2). గత రాత్రి నేను బోధించినట్లు, క్రీస్తు "...మన కొరకు జ్ఞానము, నీతి, పరిశుద్దత, విమోచనము నాయెను" (I కొరింధీయులకు 1:30). మన విమోచనము, పరిశుద్ధత, మహిమ క్రీస్తునందున్నందున – మనం ఇంకా ఎక్కువ బోధింప అవసరత ఉంది! గ్రిఫిత్ గారు పాత జర్మన్ పాట ఆంగ్లములోనికి అనువదింపబడిన దానిని ఇప్పుడే పాడారు, ఉదయము ఆకాశమందు ఉద్భవించినప్పుడు నా హృదయం ఆర్తనాదం చేస్తుంది: లేక, గత రాత్రి గ్రిఫిత్ గారు పాడినట్లు, యేసు నా కొరకు చేయబడ్డాడు, నాకు కావలసింది, నాకు కావలసింది. చాల కోణాల నుండి సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పుడు, అంతర్జాలములో నా ప్రసంగాలకు గమనిక ఉండొచ్చు అని నా అభిమతం. నా ప్రసంగాలు చదువుతున్న వారిని బట్టి నేను ప్రోత్సాహింప బడుచున్నాను. ఉదాహరణకు, గత నెల 100,989 "చదవరులు" వెబ్ సైట్ లో ఉన్నారు, ప్రోత్సాహకర ఈ మెయిల్స్ ఉన్నాయి. ఇండోనేషియా మిస్సనెరీ గత నెల క్రింది వర్తమానము పంపించాడు, నా 73 వ జన్మదిన సందర్భంగా. నేను చదవడానికి సందేహిస్తున్నాను ఎందుకంటే పొగుడు కుంటునట్టుంటుంది. అది సుందరంగా ఉంది పంచుకోవాలనిపించింది. ఆంగ్లము తన మాతృ భాష కాదు. ఇండోనేషియను మాట్లాడుతాడు. ఇది రాయడానికి చాలా సమయము తనకు పట్టి ఉంటుంది. మీ ప్రసంగాలు సింఫోనీ లాంటి శీర్షికలు కలిగి ఉంటాయి, బీతోవస్సు ఐదవ సింఫోనీ వలె. శీర్షిక పదే పదే వస్తుంది. రక్తము క్రీస్తు నెరవేర్పు, మార్పులను గూర్చి, భోధింపవలసిన ప్రాముఖ్యత మళ్ళీ మళ్ళీ మీ బాధలో కనిపిస్తాయి. "నిర్ణయతత" కు వ్యతిరేకంగా ఈనాటి సంఘాలలోని అపోష్టసీని గూర్చి మళ్ళీ మళ్ళీ బోధిస్తారు. ఈ శీర్షికలు బీతోవస్సు ఐదవ సింఫొనీ వలె మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అవి మళ్ళీ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఆ భావగర్భిత సందేశం ఇండోనేషియాలోని నమ్మకమైన మిస్సనరీచే పంపబడింది. అది నా హృదయాన్ని తాకింది, దానిని మీతో పంచుకోవాలనుకున్నాను. అవును, సువార్త ప్రసంగాలు బోధించుట కొనసాగించాలి. ఉత్సాహంగా శ్రమించాలి ప్రకటించడానికి "శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యములను." ప్రతి క్రైస్తవుడు సువార్తను తరుచు వినాలని నేను నమ్ముతాను. "శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యములు" అవిశ్వాసులకు ఇవ్వబడలేదు. నిజానికి, ఎఫెస్సీయులకు వ్రాయబడిన పత్రిక "ఎఫెస్సులో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు యేసు నందున్న నమ్మకస్తులకు" వ్రాయబడింది (ఎఫెస్సీయులకు 1:1). అపోస్తలుడైన పౌలు ఈ గొప్ప పత్రికలో చాల విషయాలు ఇచ్చాడు. బైబిలులో నాకు భాగా నచ్చిన పుస్తకము ఎందుకంటే అది యేసును ఎంతగానో ఘనపరుస్తుంది, సువార్తను తేటగా ప్రకటిస్తుంది. ఈ పత్రిక క్రైస్తవులను ప్రోత్సహించింది వారిని రక్షించడానికి యేసు ఏమి చేసాడో వారికి గుర్తు చెయ్యడం ద్వారా. నాకు బాగా నచ్చిన రెండు వచనాలు. "ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక, పరదేశులును, వాగ్ధాన నిభందనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై యుండి: క్రీస్తుకు దూరస్తులై యుండిరని జ్ఞాపకము చేసుకొనుడి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైయున్నారు" (ఎఫెస్సీయులకు 2:12-13). ప్రతి క్రైస్తవుడు సువార్తను మళ్ళీ మళ్ళీ వినాలి. మనకు గుర్తు చేయబడాలి మనకు నిరీక్షణ లేదని, దేవుడు లేకుండా ఈ లోకములో ఉన్నామని. మనకు జ్ఞాపకం చెయ్యబడాలి "క్రీస్తు రక్తము ద్వారా మనము సమాధానస్థుల మయ్యాము." రెవరెండ్ వార్రెన్ ఫీల్ ఇచ్చిన అద్భుత ప్రసంగము చదువుతూ ఉన్నాను, ఆయన ఉత్తర ఐర్లాండ్ లో న్యూటౌన్ నబ్బీలో, ట్రినిటి ప్రెస్ బిటేరియన్ సంఘానికి కాపరి. ట్రూత్ మేగజైనులో ముద్రించబడిన ప్రసంగములో రెవరెండ్ ఫీల్ చెప్పారు క్రైస్తవులందరూ, సంఘ కాపరులు కూడా, సువార్త తరుచు వినాలని. ఆయన అన్నాడు, "మనము ప్రతి దినము మన జీవితాలలో సువార్త విని నమ్మాలి" (బేనర్ ఆఫ్ ట్రూత్ మేగజైన్, ఆగష్టు/సెప్టెంబర్ 2013, పేజి 4). ఓహో! బైబిలు సదస్సులో బోధకులకు ఆయన చెప్పాడు! "మనము ప్రతి దినము మన జీవితాలలో సువార్త విని నమ్మాలి." బోధకుడా, అది మంచి విషయము! అది చెప్తున్నందుకు వందనాలు! ఆ ప్రసంగము చదివినప్పుడు, ఎనిమిది కారణాలు సిద్ధ పరచాను ఎందుకు తిరిగి జన్మించిన క్రైస్తవులు తరచూ ఎందుకు సువార్త వినాలో, ప్రతి రోజు ఎందుకు ఆలోచించాలో! అవి ఇవి. నా క్రమములో ఇవ్వలేదు. ఆలోచిస్తూ వ్రాసాను. మీరు ఇంకా ఎక్కువ ఆలోచింపవచ్చు. ఇవి కారణాలు ఎందుకు క్రైస్తవులు సువార్త బోధ వినాలి అనేందుకు. 1. నేరారోపణ నుండి సువార్త మనలను విడుదల చేస్తుంది. (పాస్టర్ ఫీల్ తన ప్రసంగములో ఇది చెప్పాడు). 2. సువార్త మనకు భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ ఇస్తుంది – ఎందుకంటే క్రీస్తు మృతులలో నుండి లేచాడు తిరిగి వస్తున్నాడు! 3. సువార్త మనకు విశ్రాంతి నిస్తుంది. (యేసు అన్నాడు, "నేను మీకు విశ్రాంతి ఇస్తాను," మత్తయి 11:28). 4. సువార్త మనకు సాతానుపై శక్తి నిస్తుంది. ("వారు అతనిని గొర్రె పిల్ల రక్తము ద్వారా జయించారు," (ప్రకటన 12:11). 5. సువార్త మనకు ప్రార్ధనలో నిశ్చయత నిస్తుంది. ("సహొదరులారా, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు, మనకు దైర్యము కలిగియున్నది," హెబ్రీయులకు 10:19). 6. శ్రమలలో సువార్త మనకు శక్తి నిస్తుంది. ("తన నిత్య మహిమకు, క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వ కృపా నిధి యగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును, పూర్ణులనుగా చేసి, స్థిర పరిచి, బలపరచును," I పేతురు 5:10). 7. మనము సాధ్యము కాదనుకున్నవి నెరవేర్చుటకు సువార్త మనకు శక్తి నిస్తుంది. ("నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను," ఫిలిప్పీయులకు 4:13). 8. కృపలో ఎదగడానికి సువార్త మనకు నమ్మకాన్ని యిస్తుంది. ("మీలో ఈసత్ క్రియ నారంభించిన వాడు, యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను," ఫిలిప్పీయులకు 1:6). కొన్ని వారాల క్రితం "నా ప్రారంభ జీవితం" పై ప్రసంగము చేసాను. యవనస్థునిగా కొన్ని కష్టాల ద్వారా వెళ్ళిన విషయాలు చెప్పాను. సాతాను ఒక యవనుని మనసులో ఆ ప్రసంగాన్ని మార్చేసింది. తరువాత ఆ యవనస్థుడు నాతో అన్నాడు యేసును నమ్మడానికి భయపడుతున్నాడని ఎందుకంటే ఆ కష్టాల ద్వారా వెళ్ళాలని. చూడండి సాతాను విషయాలను ఎలా మారుస్తుందో! నా ప్రసంగ సారాంశము ఆ కష్టాల ద్వారా వెళ్ళడానికి ప్రభువైన యేసు క్రీస్తు శక్తి నిచ్చాడు. జీవిత సవాళ్ళను ఎదుర్కోడానికి క్రీస్తు మీకు శక్తి నిస్తాడు! మీ పాపాలను ఒప్పుకొండి, యేసును నమ్మండి! ఆయన మీ పాపాలను ఆయన రక్తములో కడిగి మీకు మునుపు లేని నూతన మంచి జీవితాన్ని ఇస్తాడు! బాలుడుగా ఈ పాట నేర్చుకున్నాను, రక్షకుని దగ్గరకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను, పాపాల నుండి మరలి ఈ రోజే యేసును నమ్మండి! నీవు బాధ పడవు! ప్రతి రోజు జీవితాంతము సువార్తను గూర్చి ఆలోచించాలి. యేసు సిలువపై మరణించి పాపానికి వెల చెల్లించాడు. సమస్త పాపాల నుండి మనలను కడగడానికి యేసు రక్తము చిందించాడు. యేసు మృతులలో నుండి లేచాడు మనకు జీవాన్నివ్వడానికి! పాపము నుండి మరలి ఆయనను నమ్మండి! మీరు దానికి ఎన్నడు బాధపడరు! యేసును నమ్మడం విషయంలో మాతో మాట్లాడాలనుకుంటే, నిజ క్రైస్తవుడవాలనుకుంటే, మీ స్థలము వదిలి ఆవరణము వెనుకకు వెళ్ళండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి మీతో ప్రార్ధించి మాట్లాడతారు. డాక్టర్ చాన్, ఈ ఉదయాన్న కొందరు యేసును నమ్మునట్లు ప్రార్ధించండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: ఎఫెస్సీయులకు 3:1-8. |
|