Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నిజమైన నోవాహు నిజమైన తీర్పు!

THE REAL NOAH AND THE REAL JUDGMENT!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, ఏప్రిల్ 27, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 27, 2014


నేను మారినప్పటి నుండి నోవాహు జల ప్రళయం కథ నిజమని నాకు తెలుసు. చిన్నప్పటి నుండి డార్వోనియాన్ సిద్దాంతం నమ్మమని నేర్చుకున్నాను. 1949 లో ఆరిజోనాకు వెళ్ళినప్పుడు తరుచు అస్వస్థుడ నయ్యాను. చెవి నొప్పి, దగ్గులతో ఎక్కువ మంచం మీద ఉండేవాడిని. లాస్ ఎంజిలాస్ వాతావరణము వలన అవి వచ్చేవి. దిక్కు తోచక ఎక్కువ మంచము మీద గడిపాను. 1940 లో మాకు టివి కూడా లేదు. నా తల్లి నా కొరకు చదివేది. ఆమె చదివిన వాటిలో ఉత్పన్నత ఒకటి. గాలపోగోస్ దీవులకు డార్విన్ ప్రయాణం గూర్చి గట్టిగా చదివింది, సామాన్య విషయాలు "మానవ ఉత్పన్నత" ను గూర్చి.

నేను బాగైనప్పుడు, నేను ఆమెను బతిమాలాను సహజ చరిత్ర మ్యూజియం చూపించమని, అది డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్ దగ్గర ఉన్న –దక్షిణ కాలిపోర్నియా (యుఎస్ సి) విశ్వవిద్యాలయం.

నేను మ్యూజియంలో నడుస్తున్నప్పుడు, ఉత్పత్తి సిద్ధాంతము గూర్చి ఒప్పింపబడ్డాను. దానిని హృదయ పూర్వకంగా నమ్ముతాను. తరువాత, ఒక బోధకుడు ఉత్పన్నత తప్పు అన్నప్పుడు, అతడు అవివేకి అనుకున్నాను. కాని, తరువాత, 28 సెప్టెంబర్, 1961 లో, బయోలా విశ్వ విద్యాలయంలో, II పేతురు మూడవ అధ్యయము పై ఇంకొకరు బోదించుట విన్నాను. మూడవ వచనము చెప్పాడు, "ఆఖరి దినాలలో అపహాసకులు, తమ స్వికీయ దురాశల చొప్పున నడుచుకుంటారు." ఈ అపహాసకులు "బుద్ధి పూర్వక అవివేకులు" మానవ సృష్టిలో, జల ప్రళయంలో నోవాహు దినములో సగంపై నాశనమయ్యారు.

తెర ఎత్తబడి నిజాన్ని చూసినట్టు అనిపించింది! అప్పుడు, నిస్సందేహంగా నాకు తెలుసు, నేను అబద్దాన్ని నమ్మనని! ఉత్పన్న కారుల సమానత్వపు తలలను దేవుడు అందత్వంతో నింపాడు. నా తల్లి మారినప్పుడు అదే అనుభవము ద్వారా వెళ్ళింది. ఆమె చెప్పింది, "రాబర్ట్, ఆ పిచ్చి విషయాన్ని మనం ఎలా నమ్మాం!" అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇంకొక సందర్బంలో, "అబద్దాన్ని నమ్మునట్టు మోసము చేయుశక్తి, నీ దేవుడు పంపుచున్నాడు" (II దేస్సలోనీకయులకు 2:11). సంభాషణలో నేను గ్రహించాను డా ర్వినియన్ సిద్దాంతము, జల ప్రళయ తిరస్కృతి, సామాన్య మిధ్య. డార్విన్ రాతలు అసత్యము అవి సామాన్య శాస్త్ర కథలు బౌల్స్ వెర్ని, హెచ్. జి. వేల్స్ ఐజాక్ అసిమోన్. డార్విన్ కు శాస్త్ర తర్పిదు లేదు. వేదాంతంలో బి.ఎ. డిగ్రీ పొందాడు, సైన్స్ లో ఒక కలాశాలా కోర్సు చెయ్యలేదు! అయినా గొప్ప శాస్త్రవేత్తగా ఆయన ముందు వంగుతారు! 1961 లో నేను మారినప్పటి నుండి నేను పూర్తిగా నమ్ముతున్నాను మానవ సృష్టి, చారిత్రక సత్యములైన జల ప్రళయం పితరుడైన నోవాహు కాలములో.

హాలివుడ్ లో నోవాహు జల ప్రళయం పై సినిమా వచ్చినప్పుడు నేను వెళ్లి చూసాను. ఇప్పుడు ఆ సినిమాలు చూడను. అవి పిశాచపు, పనికి రాణి, హింసాత్మకంగా ఉంటాయి. హాలివుడ్ నుండి వచ్చే దానితో బుర్రలు పాడు చేసుకోడానికి ఎవ్వరు ఇష్టపడరు. నేను ఆ సినిమా చూడాలనుకున్నను మీకు చెప్పడానికి ఎలా నోవాహు జల ప్రళయం సాతాను అబద్దంగా ఎలా మార్చబడిందో.

ఏరన్ క్లీన్ ప్రపంచ నెట్ డైరీ నిర్మాత "నోవాహు" సినిమాను తీసివేతను ఒక నాస్తికుడు. ఆ సినిమా డార్వినియాన్ సిద్దాంతం చూపించింది. చేతబడి సోద్ది విషయాలు కూడా చూపించాడు. మోతూషి శాకునిగా. నోవాహు మానవ జాతి ద్వంశకునిగా చూపించారు. డాక్టర్ కెన్ హెమ్ అన్నారు సినిమా సందేశం "వాతావరణత్వము – మానవుల కంటే జంతువుల మార్పు అవసరము." డాక్టర్ రోబర్ట్ ఎల్. సమ్మర్ అన్నాడు, "నీవు నోవాహును గూర్చి నేర్చుకోవాలనుకుంటే, ఎక్కడికి వెళ్తావు? ఎందుకు? బహుశా, దేవుని వాక్యానికి – పరిచర్య – వివరింపబడ్డాయి, బైబిలులో మొదటి తొమ్మిది అధ్యాయాలు. అది అద్భుతం...దేవుని శక్తి కథ, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన క్రుపను తిరస్కరించే పాపులపై తీర్పు పంపించ ఇష్టపడతారు" (Dr. Robert L. Sumner, The Biblical Evangelist, May-July 2014, p. 8).

కొన్ని క్షణాల క్రితం, ప్రుథమె గారు ఆదికాండము ఆరవ అధ్యయము, 14 వచనాలు చదివారు, నోవాహు జల ప్రళయం గూర్చి. హేబ్రీయులకు, 11వ అధ్యాయము, 7వ వచనము. లేచినిలబడి చదువుదాం.

"విశ్వాసమును బట్టి నోవాహు, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, భయబక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను; అందువలన అతడు లోకము మీద, నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను" (హేబ్రీయులకు 11:7).

కూర్చోండి. మూడు ప్రాముఖ్య విషయాలు ఈ పాఠ్యభాగములో చెప్తాను.

I. మొదటిది, నోవాహు విశ్వాసము.

పాఠ్యము చెప్తుంది, "విశ్వాసమును బట్టి నోవాహు, అది వరకు చూడని సంగతులను గూర్చి, దేవుని చేత హెచ్చరింపబడి, ఓడ సిద్దము చేసెను…" (హేబ్రీయులకు 11:7).

దేవుడు రాబోవు జల ప్రళయం గూర్చి ఎలా హెచ్చరించాడు? ఆదికాండము 6:13 లో ఇలా చెప్పబడింది,

"దేవుడు నోవాహు, సమస్త శరీరుల అంతము చూసియున్నారు..."

నేననుకుంటాను చాలా విధాలుగా వచ్చే తీర్పును గూర్చి నోవహు అభిప్రాయం ఉండి ఉండవచ్చు. మొదటిది, నోవాహు ముత్తాత రాబోవు తీర్పు గూర్చి బోధించాడు. నోవహు కూడా బోదించాడు దేవుడు "అందరిని తీర్పు తీరుస్తాడని" (యూదా 1:5). వెనుకకు తిరిగి గ్రహిస్తాం హనోకు ప్రవచన నెరవేర్పు క్రీస్తు రెండవ రాకడలో నెరవేరుతుంది. కాని తన కాలానికి నోవాహు అన్వయించి, అర్ధం చేసుకున్నాడు, జల ప్రళయం తీర్పు తప్పని సరిగా వచ్చేది. నోవాహుకు తెలుసు హొనోకు భోదించిన దానిని బట్టి మానవాళికి దేవుడు తీర్పరిగా ఉండాడని. రెండవది, నోవాహు ముత్తాత హనోకు తన కుమారుని మోతుషెల అని పేరు పెట్టాడు. అర్ధర్ డబ్ల్యూ. పింక్ అన్నాడు మొతూషేల అంటే, "చనిపోయిన పంపబడుతుంది" (గ్లీనింగ్స్ ఇన్ బినసిస్). ఇది మోతుశేల పేరును గూర్చి ఇవ్వబడిన తర్జుమా థామస్ న్యూ బెర్రీ చే (1811-1901) ఆయన ఇంటర్ లీనియర్ ఇంగ్లీష్ మాన్స్ బైబిలు లో (1883, హోడర్ అండ్ స్టావ్ ఘున్). న్యూబెర్రీని వేత్త ఎఫ్. ఎఫ్. బ్రూస్ బాగా పొగిడారు. న్యూబెర్రీ శామ్యూల్ బోచార్ట్ అనువాదాలు అనుకరించాడు (1599-1667) హెన్రీ ఎన్స్ వర్త్ (1571-1622) ఎనోటేషన్స్ ఆన్ ద పెంటా ట్యూక్. డాక్టర్ జె. వెర్నాన్ మెక్ గీ (1904-1988) అన్నాడు, "మోతుషేల ఉద్దేశము: ‘చనిపోయాక, పంపబడతాడు.’ ఏమి పంపబడుతుంది? జల ప్రళయం...మోతుషేల చనిపోయిన సంవత్సరము జల ప్రళయము వచ్చింది. ‘చనిపోయాక, పంపబడుతుంది’ – ఇది అతని పేరులో ఉన్న అర్ధము" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Volume I, Thomas Nelson Publishers, 1981, p. 34).

అందువలన, నోవాహు తీర్పుపై హనోకు ప్రసంగాలు విన్నాడు – తనకు తెలుసు మొతుషేల అనగా పితరుని మరణం తరువాత తీర్పు వచ్చును. మొతుషేల చావు తరువాత జల ప్రళయం వచ్చింది, అదే సంవత్సరంలో.

ఈ వృద్ధుల బోధ ద్వారా నోవహుకు విశ్వాసము కలిగింది. ఈ రోజుల్లో బోధ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"వినుట ద్వారా విశ్వాసము కలుగును" (రోమా 10:17), మరియు,

"బోధకుడు లేకుండా ఎలా వింటారు?" (రోమా 10:14).

తరువాత, కూడా, నోవాహు లోక భయంకర పాపాన్ని చూసాడు. బైబిలు చెప్తుంది,

"నరుల చెడుతనం భూమి మీద గోప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది" (ఆదికాండము 6:5).

"దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి భాలాత్కారముతో నిండియున్నది; గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి యున్నది; ఇదిగో, వారిని, భూమితో కూడా నాశనము చేసెదను" (ఆదికాండము 6:13).

ఇంకోలా కూడా దేవుడు నోవాహు విశ్వాసాన్ని నిర్దిస్టించాడు. ఆదికాండము 6:3 లో పరిశుడ్డాత్మను గూర్చి చెప్పబడింది. దేవుని ఆత్మ మానవుని వెంటాడుతుంది. ఈ రోజుల్లో, పరిశుద్దాత్మ పని చేసింది. దేవుడు హనోకు మొతుషేలల బోధలు వాడుకున్నాడు. నోవాహు గ్రహింపు లోకము పాపముతో నిండిందని. నోవాహు హృదయంతో మాట్లాడి ప్రేరేపించదానికి దేవుడు పరిశుద్దత్మను పంపాడు.

1965 లో నా కారులో బెర్రీ మెక్ గైర్ రాసిన పాట వినడం జరిగింది. వియత్నాం యుద్ద భయంకరత్వము అణుయుద్ద భయము, ఇతర భయంకర సంభవాలను గూర్చిన పాట అది.

మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్పు, నా స్నేహితుడా,
ఆహ, నీవు నమ్మవు మనము నాశానములో ఉన్నామని.

అది రాక్ పాట అని తెలుసు, రాక్ మరియు రోల్ వినకూడదు. కాని నేను దక్షిణ బాప్టిస్టును నాకు తెలియదు. నేను గ్రిఫిట్ ను పాడమన్నాను ఎందుకంటే ఆ మాటలు బాణాల్లా నా హృదయములో దూసుకుపోయాయి. డాక్టర్ యమ్. ఆర్. డెల్లాన్ బైబిలు ప్రవచనము బోధను రేడియోలో వింటూ ఉన్నాను, క్రీస్తు రెండవ రాకడను గూర్చి యుగ సమాప్తిని గూర్చి. అప్పుడు ఈ పాట విన్నాను – నన్ను ఊపేసింది! అది ఒక వ్యంగ, దుష్ట పాట – నన్ను ఊపేసింది! అది విన్నప్పుడు నేనోక్కడున్నానో గుర్తుంది. కారు పక్కకు జరిపి కన్నీళ్లు కార్చాను! ఇది ఆ పాట! పాడండి, గ్రిఫిట్ గారు!

తూర్పు ప్రపంచం విజ్రుంబిస్తుంది’, విద్వంశం ఉంది’, తూటాలు ఉన్నాయి’,
చంపడానికి వయస్సు దాటిన వాడవు ఎన్నికకు కాదు’,
యుద్దాలను నీవు నమ్మవు, కాని ఏ తుపాకి చూపిస్తున్నావు’,
యెర్తాను నది శవాలతో ప్రవహిస్తుంది’,
నీవు మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు, నా స్నేహితుడా,
ఆ, నీవు నమ్మవు మనం నాశనానికి సమీపంలో ఉన్నామని.

నేను చెప్పేది నీవు అర్ధం చేసుకోవా?
ఈ రోజు నాలో ఉన్న భయాన్ని నువ్వు చూడవా?
బటన్ నొక్కితే, పరుగెత్తుట ఉండదు,
ఎవ్వరు రక్షింపలేరు లోకమంతా సమాధిలో ఉంటుంది.
నీ చుట్టూ చూడు, బాలుడా, నిన్ను భయపెడుతుంది,
కాని నీవు మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు, నా స్నేహితుడా,
ఆ, నీవు నమ్మవు మనం నాశనానికి సమీపంలో ఉన్నామని.

ఆ, నా రక్తంకు పిచ్చెక్కింది, తికమకగా ఉంది’,
ఇక్కడ కూర్చొని ఊహిస్తున్నాను’,
సత్యాన్ని మార్చలేను, దానికి క్రమము తెలియదు,
కొందరు సెనేటర్లు విధానాలు చెయ్యలేరు,
నడవడం సమైక్యతా తీసుకురాదు,
మానవ గౌరవం చెదిరినప్పుడు’,
ఈ పిచ్చి లోకం నిస్పృహలో ఉంది’,
నీవు మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు, నా స్నేహితుడా,
ఆ, నీవు నమ్మవు మనం నాశనానికి సమీపంలో ఉన్నామని.

రెడ్ చైనాలో ఉన్న ద్వేషాన్ని గూర్చి ఆలోచించు,
సేల్మ, అలా బామాలనం చూడు,
అంతరిక్షంలో నాలుగు రోజులు ఉండొచ్చు
తిరిగి వచ్చునప్పుడు అదే పాత స్థలం,
భాజా భజంత్రీలు, గర్వము నిర్దయ,
మృతులను పాతిపెట్టవచ్చు ఏ గుర్తు మిగలదు,
పొరుగు వాని ద్వేశిస్తావు, దయ అని చెప్పడం మరవవద్దు,
కాని నీవు మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు, నా స్నేహితుడా,
ఆ, నీవు నమ్మవు మనం నాశనానికి సమీపంలో ఉన్నామని,
లేదు, లేదు, నీవు నమ్మవు మనం నాశనానికి సమీపంలో ఉన్నామని.
("నాశనం సందర్భం" పి. ఎఫ్. స్లోన్ చే, 1965; బెర్రీ మెక్ గైర్ పాడారు).
(“Eve of Destruction” by P. F. Sloan, 1965; sung by Barry McGuire).

"కాని నీవు మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు, నా స్నేహితుడా, ఆ, నీవు నమ్మవు మనం నాశనానికి సమీపంలో ఉన్నామని, లేదు, లేదు, లేదు నీవు నమ్మవు మనం నాశనానికి సమీపంలో ఉన్నామని."

నోవాహు సరిగ్గా అలాగే అనుకున్నాడు. తీర్పు నాశనము వస్తాయని తనకు తెలుసు – 1965 వేసవిలో నాకు తెలుసు. "కాని," నీవంటావు, "అది నలబై తొమ్మిది సంవత్సరాల క్రితం అని!" అవును, మనం 49 సంవత్సరాలుగా నాశనానికి సమీపంగా ఉన్నాం! నోవాహు దినాలలో లోకం నాశనమునకు సమీపంగా ఉంది 120 సంవత్సరాలు (ఆదికాండం 6:3). ఈ ఉదయం అది నమ్ముతాను – అంతే –1965 లో ఉన్నాను! నాకు అప్పుడు 24 సంవత్సరాలు. నేను కారు పక్కకు పెట్టి కన్నీరు పెట్టుకున్నాను! మనం నాశనానికి దగ్గరగా ఉన్నాం. నోవాహుకు తెలుసు – నాకు తెలుసు. ఇప్పుడు ఇంకా భాగా తెలుసు! వియత్నాం భయంకరత్వంలో వేల మంది మన యవస్తులు మునిగిపోయారు. అధ్యక్షుడు నిక్సన్ అందులో కూరుకున్నాడు, వేలకొలది యవనస్థులు, మత్తు పదార్ధాలు, అశ్లీల చిత్రాలు గర్భ స్రావములలో కూరుకుపోయారు. మన ప్రపంచం నాశనపు అంచులో ఉంది. 1965 లో నాకు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు!

"విశ్వాసమును బట్టి నోవాహు, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, భయబక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను; అందువలన అతడా లోకము మీద, నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను" (హేబ్రీయులకు 11:7).

II. రెండవది, నోవాహు బోధ.

"విశ్వాసమును బట్టి నోవాహు, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, భయబక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను; అందువలన అతడా లోకము మీద నేర స్థాపన చేసి..." (హేబ్రీయులకు 11:7).

"అతడు లోకమును ఖండించెను." ప్రజలనడం నేను విన్నాను, "అంత కఠినంగా ఉండొద్దు! తీర్పు తీర్చవద్దు! ఖండించవద్దు!" నోవాహు కూడా అలా విన్నాడు! వారి మాట వినలేదు! "అతడు లోకాన్ని ఖండించాడు"! "అతడు లోకాన్ని ఖండించాడు"! "అతడు లోకాన్ని ఖండించాడు!" అలాంటి బోధ కావాలి – పాపాన్ని ఖండించే బోధ! 1950 60 లలో బిల్లీ గ్రేహం గొప్ప బోధకుడు. ఒక సువార్తిక నాయకుడన్నాడు అతని బోధ ఆ రోజుల్లో "విజ్రుంబించేది"గా ఉండేదని. అలాంటి బోధ ఈ రోజుల్లో అవసరము. మనకు చాలా ఎక్కువగా బైబిలు "బోధకులు" "విశ్లేషకులు" ఉన్నారు. నోవాహు విజ్రుంభ బోధకుడు! బైబిలు చెప్తుంది నోవాహు "నీతి బోధకుడు" అని (II పేతురు 2:5). 1960 లో న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో బిల్లీ గ్రేహం బోధ వినండి. అతడు నోవాహు దినాలను గూర్చి, జల ప్రళయం ముందు ప్రజలు ఎలా జీవించారో భోదించాడు,

దురాశ కాలమది. యేసు అన్నాడు వారు తిని త్రాగుచున్నారని. లోక విషయాలలో ఆసక్తి ఉంది. దేవుని కొరకు ఆత్మీయ విషయాలకు చాలా తక్కువ తృష్ణ కలిగియున్నారు. వాళ్ళ తృష్ణ కడుపులు నింపుకోవడం, వారి సెక్స్ కోరికలను సంతృప్తి...అమెరికా మరియు యూరప్ లో మేము... అతిపెద్ద గలాటాలుగా మారాయి. మిగిలిన ప్రాంతాలలో పోలిస్తే మన కుక్కలు భాగా మేపబడుతున్నాయి... అదే నోవాహు దినాలలో జరిగింది...
         లైంగిక విషయంపై అసాధారణ వక్కాణింపు జరిగింది. యేసు అన్నారు పెళ్లి చేసుకుంటూ పెళ్లి కిచ్చుకుంటున్నారు. వారు కిరాతక క్షీణదశలో ఉన్నారు, లైంగిక చెడుతనము వచ్చింది, లైంగికంగా వాళ్ళు అనాసక్తులు అయ్యారు... యేసు అన్నారు చరిత్రలో ఒకసారే జరిగింది తరువాత ప్రళయం వచ్చింది. [అది] మళ్ళీ జరుగుతుంది చరిత్రలో తీర్పురాబోతుంది.
         నోవాహు దేవుని నమ్మాడు దుష్ట తరము మధ్యలో, ఒంటరిగా దైర్యంగా నిలిచాడు...నోవాహు ఒంటరిగా నిలిచాడు దేవుడు వచ్చి అన్నాడు, ‘నోవాహు, జల ప్రలయంతో నేను మానవ జాతిని నాశనము చేయబోతున్నాను’...బైబిలు చెప్తుంది నోవాహు దేవుని నమ్మాడు...బైబిలు చెప్తుంది విశ్వాసము ద్వారా నోవాహు, చూడని విషయాలను గూర్చి హెచ్చరింపబడ్డాడు, భయముతో మెలిగాడు (గమనించండి, భయముతో), ఓడను చేసాడు. మన తరమునకు హక్కు ఉంది, భయముతో మెలిగి దేవునితో సరి చేసుకోవాలి. [వార్తా పత్రికలూ] శీర్షికలు మోర పెడుతున్నాయి. ప్రతిరోజూ బోధిస్తున్నాయి... నోవాహు భోదిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ‘పశ్చాత్తాప పడండి, తీర్పు వస్తుంది, నమ్మండి.’ వాళ్ళు నవ్వి ఎగతాళి చేసి నమ్మలేదు (Billy Graham, The Challenge: Sermons from Madison Square Garden, Doubleday and Company, Inc., 1969, pp. 162-168).

నోవాహు "ప్రపంచాన్ని ఖండించాడు" పాపానికి వ్యతిరేకంగా బోదిస్తూ. అలాంటి బోధకులు ఇప్పుడు కావాలి! మొన్న డాక్టర్ కాగన్ నాతో అన్నాడు, అతను ఎవరో మనకు తెలియకపోతే, ఈ రోజు అమెరికాలో సువార్త సంఘాల్లో భోదించడానికి బిల్లీ గ్రేహంను అనుమతించే వారు కాదు. లోకంలోకి జారి పోయాము. మన సంఘాలలో నశించు సభ్యులున్నారు. డాక్టర్ కాగన్ అన్నాడు యవన బిల్లీ గ్రేహంతో వారు కుదుర్చుకోరు. ఇప్పుడు ప్రాధమిక సంఘాలలో ఆయన అలా బోధిస్తాడని అనుకోను! అలా ఉంది నోవాహు దినములలో. ఆయన "నీతి భోధకుడు" (II పేతురు 2:5) – కాని ఎవ్వరు పశ్చాత్తాప పడలేదు. ఏ ఒక్కరు పాపాన్ని వదిలి రక్షణ ఓడలో ప్రవేశింపలేదు. ఆయన కుమారులు భార్యలు, ఆయన భార్య ఆయన బోధ విని రక్షింపబడ్డారు. ఆయన ఓడను చేసాడు "గృహాన్ని రక్షించడ్డానికి [అతని కుటుంబాన్ని]; అలా లోకాన్ని ఖండించాడు" (హేబ్రీయులకు 11:7). మీరు నా బోధ వింటారా? మీరు దుష్టత్వము నుండి పాపము నుండి మరలుటారా? పశ్చాత్తాపపడి క్రీస్తు నోద్దక వస్తారా – ప్రతి ఆదివారం గుడిలో ఉంటారా? లేక దేవుని రాబోవు తీర్పులో నశించి పోతారా? ఈ కొత్త సినిమాలో ఒక మంచి ఉంది. వెళ్లి చూడకండి అంతా వ్యర్ధం ఉంది. ఒక మంచి ఉంది. నోవాహు వివరణ పిల్లల కథ కాదు! కానే కాదు. అది పాప ప్రపంచాన్ని దేవుడు తీర్పు తీర్చుటను గూర్చినది!

III. మూడవది, నోవాహు తరము, అతని "ప్రపంచము."

"విశ్వాసమును బట్టి నోవాహు, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, భయబక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను; అందువలన అతడు లోకము మీద, నేర స్థాపన చేసి..." (హేబ్రీయులకు 11:7).

"ప్రపంచం" అంటే జల ప్రళయం ముందు భూమిపై జీవించిన ప్రజలు. "ప్రపంచం" నోవాహు దినములలో క్రీస్తుచే ఒక ఉదాహరణగా, ఒక చిత్ర పటముగా చూపించబడినది, యుగ సమాప్తిలో ప్రజలు ఎలా ఉంటారో చెప్పబడింది. ఆఖరి తీర్పు ముందు, క్రీస్తు అన్నాడు,

"నోవాహు దినములు ఎలాగుండేనో, మనష్యు కుమారుని రాకడయును అలానే ఉండును. జల ప్రలయంనకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు, జల ప్రళయం వచ్చి, అందరిని కొట్టుకొని పోవు వరకు, ఎరుగక పోయిరి; అలాగుననే మనష్యు కుమారుని రాకడ ఉండును" (మత్తయి 24:37-39)

అవును, నాకు తెలుసు నోవాహు దినములలో చాలా మంది ఉద్రేకులుగా ఉన్నారు. అవును, నాకు తెలుసు పరిశుద్దాత్మ కార్యాన్ని తిరస్కరించారు దుష్ట ఆలోచనలు వారి హృదయములో కలిగి యున్నారు. అతి చెడ్డ పాపం ఇహలోక ఇష్టతలు. క్రీస్తు అదే చూపాడు – వారి ఇహలోక ఇష్టతలు. వారు తలంచింది అంతా తినడం త్రాగడం, పెళ్లి చేసుకోవడం వెళ్లి కివ్వ బడడం. వాళ్ళ తలంపులన్నీ ఈ లోక విషయాలపై, దృష్టి సారించాయి. నిత్యత్వము గూర్చి తలంపే లేదు. దేవుని గూర్చి తలంపు లేదు. చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎక్కడకు వెళ్తాయి అనే విషయంలో ఆసక్తే లేదు. ఈ యవనుల్లా ఉన్నారు విడియో ఆటలు పార్టీల గూర్చి ఆలోచిస్తారు, పాఠశాల గూర్చి వినోదం గూర్చి తలంపు ఉంటుంది. పాపాల గూర్చి ఆలోచించే విషయమే లేదు. చనిపోయాక వాళ్ళ ఆత్మలకు ఏమవుతుంది అనేదే ఆలోచింపరు.

బైబిలు బోధిస్తుంది నిజ పరలోకము నిజ నరకము ఉంది. చనిపోయాక ఎక్కడికి వెళ్తావు? ప్రతి ఒక్కరు పరలోకానికి గాని నరకానికి గాని వెళ్తారు. ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి ఒకే మార్గము ఉంది – యేసు క్రీస్తు నందలి విశ్వాసం. అది ఎందుకు సత్యము? ఎందుకంటే యేసు తప్ప ఎవ్వరు సిలువపై మరణించి పాపాలకు ప్రయాశ్చిత్తము చెల్లించ లేదు. యేసు రక్తము మాత్రమే నీ పాపాలను కడుగుతుంది దేవుని దృష్టిలో. యేసు మాత్రమే రక్షిస్తాడు.

దేవుడు తీర్పు తీర్చు దేవుడు. పాపాన్ని ద్వేషిస్తాడు. పాపాన్ని చూడలేడు. సిలువపై క్రీస్తు మరణము ద్వారా పాపాలకు వెల చెల్లింపబడక పోతే, క్రీస్తు రక్తము ద్వారా కడగబడకపోతే, పరలోకంలో చేరవు. క్రీస్తు అన్నాడు, "నా ద్వారా తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6).

నోద్దకురా

పశ్చాత్తాపపడమని అడుగుతున్నాను, పాప భూఇష్ట బ్రతుకు నుండి మరలి, విశ్వాసము ద్వారా క్రీస్తు నొద్దకురా. యేసును నమ్మి ఆయన రక్తము ద్వారా కడుగబడు. గుడికి రా, ఆదివారం గుడిలో ఉండు! పాత పాట గ్రిఫిత్ పాడండి మళ్ళీ పాడదాం.

రండి, పాపులారా, తప్పి నిరీక్షణ లేకుండా,
   యేసు రక్తము మిమ్ములను స్వతంత్రులను చేస్తుంది;
అతి చెడ్డ వారిని ఆయన రక్షించాడు,
   నాలాంటి దౌర్భాగ్యుణ్ణి ఆయన రక్షించినప్పుడు.
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
   యేసు’ రక్తము భయంకర పాపిని శుబ్రపరుస్తుంది.
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు,
   యేసు’ రక్తము భయంకర పాపిని శుబ్ర పరుస్తుంది.
("అవును, నాకు తెలుసు!" అన్నా డబ్ల్యూ. వాటర్ మెన్ చే, 1920).

నిజ క్రైస్తవుడవు కావాలని ఆసక్తి ఉందా? ఆయన ప్రశస్త రక్తముతో యేసు నీ పాపాలను కడగాలని ఉందా? నిజ క్రైస్తవుడవడం విషయం మాతో మాట్లాడాలనుకుంటున్నారా? మాతో మాట్లాడాలనుకుంటే, మీ సీటు వదిలి ఆవరణము వెనుకకు ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ కాగన్ మిమ్ములను వేరే గదికి తీసుకెళ్ళి ప్రార్ధించి మాట్లాడుతాడు. వెనుకకు ఇప్పుడే వెళ్ళండి. మొదటిసారి వస్తే, నేనే మీతో మాట్లాడుతాను, ప్రశ్నలకు జవాబిస్తాను. వెనుకకు ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ చాన్, ఈ ఉదయం కొందరు యేసును నమ్మునట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుథోమ్ చే: ఆదికాండము 6:1-14.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"అవును, నాకు తెలుసు!" (అన్నా డబ్ల్యూ. వాటర్ మెన్ చే, 1920).
“Yes, I Know!” (by Anna W. Waterman, 1920).


ద అవుట్ లైన్ ఆఫ్

నిజమైన నోవాహు నిజమైన తీర్పు!

THE REAL NOAH AND THE REAL JUDGMENT!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"విశ్వాసమును బట్టి నోవాహు, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, భయబక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను; అందువలన అతడా లోకము మీద, నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను" (హేబ్రీయులకు 11:7).

(II పేతురు 3:3; II దేస్సలోనీయులకు 2:11)

I. మొదటిది, నోవాహు విశ్వాసము, హేబ్రీయులకు 11:7ఎ; ఆదికాండము 6:13; యూదా 1:5; రోమా 10:17, 14; ఆదికాండము 6:5, 13, 3.

II. రెండవది, నోవాహు బోధ, హేబ్రీయులకు 11:7బి; II పేతురు 2:5.

III. మూడవది, నోవాహు తరము, అతని "ప్రపంచము," హేబ్రీయులకు 11:7సి; మత్తయి 24:37-39; యోహాను 14:6.