Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




యేసు మరణించిన రోజు

THE DAY JESUS DIED
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, ఏప్రిల్ 13, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, April 13, 2014

"అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసికొని, పోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాల స్థలమునకు వెళ్లిరి, హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు: అక్కడ ఈ వైపున ఒకరిని, ఆవైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి, ఆయనతో కూడ ఇద్దరిని సిలువ వేసిరి" ( యోహాను 19:16-18).


సిలువపై యేసు మరణించిన రోజు మానవ జాతిలో నాల్గవ అతి ప్రాముఖ్య దినము. దేవుడు మానవుని సృష్టించినది మొదటి దినము. రెండవ దినము పతన దినము, మానవుడు పాపమూ చేసి మరణం ద్వారా ప్రపంచాన్ని నాశనము చేసిన రోజు. మూడవది నోవాహు దినములలో జల ప్రళయం వచ్చిన రోజు. కాని నాల్గవ ప్రాముఖ్య దినము క్రీస్తు సిలువపై మరణించిన రోజు, యోరూష లేము గోడల అంచున ఉన్న కొండపై.

క్రీస్తు సిలువపై మరణించిన రోజు మానవ చరిత్రనే మార్చేసింది –నిత్యమూ! వేళ్ళలో మానవ జీవితాలు మారాయి. ఆత్మలు మార్చబడ్డాయి, లోకము అలానే ఉండిపోలేదు. ఈ రాత్రి క్రీస్తు చనిపోయిన ఆరోజు జరిగిన నాలుగు గొప్ప సంఘటనలు గమనిద్దాం.

I. మొదటిది, ఆ రోజు చీకటిమయమైంది.

బైబిలు చెప్తుంది:

"ఆరవ గంట [మధ్యాహ్నము] మొదలుకొని [మూడు గంటల వరకు] ఆ దేశమంతట చీకటి కమ్మెను" (మత్తయి 27:45).

డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నారు:

మూడవ గడియలో మన ప్రభువు సిలువపై ఉంచబడ్డాడు, అది ఉదయం తొమ్మిది గంటలు. మధ్యాహ్నము పన్నెండింటికి, మానవుడు దైవ కుమారునికి చేయగలిగిందంతా చేసాడు. అప్పుడు మద్యాహ్నం, చీకటి క్రమ్ముకుంది, సిలువ బలిపీఠమై గొర్రెపిల్లగా లోకపాపాలు తీసి వెయ్యడానికి బలిగా అర్పింపబడింది (Thru the Bible, Thomas Nelson, 1983, volume IV, p. 148).

మత్తయి, మార్కు, లూకా చెప్పారు "భూభాగమంతా" చీకటి మాయమైంది మధ్యాహ్నం మూడు నుండి, యేసు చనిపోయే వరకు. డాక్టర్ జాన్ మెక్ ఆర్డర్, క్రీస్తు రక్తము విషయంలో తప్పు అయినా, చీకటి విషయంలో సరిగానే మాట్లాడాడు:

ఇది సూర్య గ్రహణము కాదు, యూదులు సూర్య కేలెండర్ వాడారు, పక్కా ఎప్పుడు పౌర్ణమి రోజు వస్తుంది, సూర్య గ్రహణం అసాధ్యము. ఇది అసాదారణ చీకటి (మెక్ ఆర్డర్ స్టడీ బైబిలు, గమనిక లూకా 23:44).

అసాదారణ చీకటి, భూభాగమంతా క్రీస్తు చనిపోయినప్పుడు వచ్చింది, మనకు జ్ఞాపకం చేస్తుంది పన్నెండవ అద్భుతం మోషే ద్వారా జరిగింది ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలినప్పుడు:

"అంతట యోహావా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చూపుము, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు; ఐగుప్తు దేశామంతయు మూడు దినములు గాడాంధ కారమాయేను..." (నిర్గమ కాండము 10:21-22).

మోషే దినాలలో ఆ చీకటిని దేవుడు పంపించాడు. యేసు సిలువపై మరణించినప్పుడు ఆ చీకటి పంపాడు. డాక్టర్ వాట్స్ అన్నాడు:

చీకటిలో సూర్యుడు దాగాడు, మహిమను కప్పి పుచ్చాడు, ఎప్పుడు క్రీస్తు, అద్భుత శిల్పి, సృష్టిలో మానవుని పాపాన్ని కొరకు, మరణించినప్పుడు.
      (“Alas! And Did My Saviour Bleed?” by Isaac Watts, D.D., 1674-1748).

II. రెండవది, ఆ రోజు దేవాలయపు తెరచిగెను.

బైబిలు చెప్తుంది,

"మరియు, అప్పుడు, దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను" (మత్తయి 27:51).

దేవాలయములో పెద్ద, తలసరి తెర ఉంది. డాక్టర్ జాన్ ఆర్. రైస్ ఆ దేవాలయం గూర్చి ఇలా అన్నారు:

చెప్పినట్లే ఆ అభయారణ్యం, లేదా సరైన ఆలయం, దేవాలయం తొంబై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు తొంబై అడుగుల ఎత్తు...దేవాలయం రెండు భాగాలుగా విభజింప బడింది. అరవై అడుగులు పరిశుద్ద స్థలం... మిగిలిన మూడవ భాగము అతి పరిశుద్ద స్థలం, తెర వెనుక ఉంటుంది, అది మిక్కిలి పరిశుద్ద స్థలం (Dr. John R. Rice, The King of the Jews: A Commentary on Matthew, Sword of the Lord, 1955, p. 479).

డాక్టర్ రైస్ అన్నాడు ప్రధాన యాజకుడు తప్ప ఎవడును అతి పరిశుద్ద స్థలములో ప్రవేశింపలేరు. ప్రధాన యాజకుడు ప్రత్యక్ష దినమున సంవత్సరానికి, ఒకసారే వెళ్తాడు. రైస్ అన్నాడు:

సిలువలో మరణించినప్పుడు, అందువలన, "ఆలయంపై నుండి క్రింద వరకు [రెండు] ఉంది" (మత్తయి 27:51) తెర చినిగింది, మొదట పైనుండి, క్రింది వరకు తెర పైనుండి చిరగడం సూచిస్తుంది దేవుడే [చింపాడు]...తెరిచినప్పుడు కూల్చి చేసినప్పుడు, దేవునికి మానవునికి మద్య అడ్డంకులు తొలగాయి ఇష్టపడేవారికి [క్రీస్తు] (ఐబిఐడి., పేజి 480).

III. మూడవది, భూకంపం వచ్చింది.

బైబిలు చెప్తుంది,

"భూమి వణికెను, బండలు [బద్దలాయెను]" (మత్తయి 27:51).

భూకంపానికి తెర చినగడానికి సంభంధం ఉంది. నేను అనుకుంటాను. కాని ఎడర్షం అన్నాడు, "భూకంపం భౌతికమైనప్పటికి, తెర చినగడం...దేవుని హస్తము ద్వారా జరిగింది" (Alfred Edersheim, The Life and Times of Jesus the Messiah, Eerdmans, 1945, volume II, p. 611). ఎడెర్షిం అన్నాడు తెర చెయ్యి అంత దళసరి (2½ ఇంచుల మందము). "తెర టార్ ముడ్ లో వివరింపబడినట్టు ఉంటె, కేవలం భూకంపం ద్వారా రెండుగా చిరగదు" (ఐబిఐడి.).

తెర చినగడం "ఎప్పుడంటే, సాయంకాల నైవేద్యం సమయంలో, ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు, ధూపము వెయ్యడానికి గాని ఇతర సేవల నిమిత్తము" (ఐబిఐడి.). తెర చినగడం యూదా యాజకులపై చెరగని ముద్ర వేసింది. డాక్టర్ చార్లెస్ సి. రైరీ అన్నాడు "అసాధారణ తెర చినగడం ప్రభావం అపోస్తలుల కార్యములు 6:7 లో, చెప్పబడింది, ‘యాజకులు విశ్వాసానికి విధేయులై ఉన్నారు’” (రైరీ స్టడీ బైబిలు, గమనిక మత్తయి 27:51).

క్రీస్తు చనిపోయినప్పుడు, తెర రెండుగా చినిగింది. మీరు దేవుని దగ్గరకు రావచ్చు, క్రీస్తు మద్యవర్తి కాబట్టి. ఏ తెర నీకు దేవునికి మద్య నిలువదు. యేసు నీకు దేవునికి మద్య ఉంటాడు. యేసు నోద్దకు రండి దేవుని సన్నిదికి నేరుగా తీసుకెళతాడు.

"దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు" (I తిమోతి 2:5).

IV. నాల్గవది, ఆ దినాన్న యేసు సిలువ నుండి మాట్లాడాడు.

తప్పుడు అభియోగంతో దేవాలయ కాపలాదారులు యేసును బందించారు. ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకెళ్ళారు, ముఖముపై ఉమ్మివేసి పిడిగుద్దులు గుద్దారు. యూదులకు అధికారిక అదికారము లేదు కనుక, యేసును రోమా గవర్నరు దగ్గరకు తీసుకెళ్ళారు, పొంతి పిలాతు నోద్దకు. పిలాతు యేసును ప్రశ్నించి, అమాయకుడని తీర్పు నిచ్చి ఆయన జీవితాన్ని కాపాడదలిచాడు. యేసును శిక్షించాడు, ప్రధాన యాజకుని తృప్తి పరచడానికి. సైనికులు ఆయన వీపును దున్నారు, ముళ్ళ కిరీటం ఆయన తలపై పెట్టి, ఉదా రంగు వస్త్రం చుట్టారు. పిలాతు జనుల దగ్గరకు తీసుకొచ్చి ఏ విధంగా కొట్టాడో చూపించాడు, జాలి చూపిస్తారనుకున్నాడు. పిలాతు అన్నాడు, "ఈయనలో ఏ దోషమూ లేదు" (యోహాను 19:4). ప్రధాన యాజకుడు ఆయనను చూచినప్పుడు, "సిలువ వేయుము! సిలువ వేయుము!" పిలాతు ఆయనతో అన్నాడు, "మీరు తీసుకెళ్ళి సిలువ వెయ్యండి; నేను ఆయనలో ఏ దోషము కనుగొనలేదు." యూదుల నాయకులు అరిచారు, "నీవు ఆయనను విడిచి పెడితే, నీవు కైసరు స్నేహితుడవు కావు. ప్రతి రాజుకి సరుకు వ్యతిరేకంగా మాట్లాడతారు." పిలాతు అన్నాడు, "మీ రాజును నేను సిలువ వేయనా?" ప్రధాన యాజకుడు అరిచారు, "కైసరు తప్ప వేరే రాజు లేదు." అప్పుడు పిలాతు యేసును సైనికులకు అప్పగించి, సిలువ వేయ మార్గము చూపాడు.

యేసు గొప్ప భాద అనుభవించాడు సిలువకు మేకులతో కొట్టబడ్డాడు. ఆయన శ్రమ పడుతూ ఈ మాటలు పలికాడు,

మొదటి మాట - క్షమాపణ

"వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, కల్వరి అనబడే, అక్కడ ఆయనను సిలువ వేసిరి, సిలువ సంపద, అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. తరువాత క్రీస్తు అన్నాడు, తండ్రి, క్షమించమని చెప్పెను; వీరేమి చేయుచున్నారో నీ వెరుగరు గనుక వీనిని. వారు ఆయన వస్త్రములు పంచుకోనుటకై, చిట్లు వేసిరి" (లూకా 23:33-34).

అందుకే యేసు సిలువకు వెళ్ళాడు – మన పాపాలు క్షమించడానికి. యేసు ఉద్దేశ పూర్వకంగా సిలువకు వెళ్ళాడు మన పాప ప్రాయశ్చిత్తం కోసం.

రెండవ మాట - రక్షణ

"మరియు వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూశించుచు, మాకు చెప్పుతూ, ఒకవేళ నీవు క్రీస్తువైతే, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును రక్షించుము. కానీ ఇతర సమాధానాలు ఖండించారు, ఇంకా అన్నాడు, నీవు దేవునికి భయపడవలెను, వానిని గద్దించిరి? మనకైతే ఇది న్యాయమే; మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము: గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. ఆయనను చూచి యేసు, ప్రభువు, నీవు రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనవలెను. అనుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరిదైనులో ఉందువని, నిశ్చయముగా నీతో చెప్పు చున్నాను" (లూకా 23:39-43).

పాపులను రక్షించడానికి యేసు సిలువపై మరణించాడు. సిలువపై ఆయన ప్రక్కనే ఉన్న నమ్మే దొంగను ఆయన రక్షించాడు. చాలా మంది అనుకుంటారు రక్షింపబడడం నేర్చుకోవాలని. ఈ దొంగ ఏమి నేర్చుకోలేదు. ఆయన యేసును నమ్మాడు. కొంత మంది అనుకుంటారు ఒక భావన అంతరంగ మార్పు ఉండాలని. దొంగకు అవేమీ లేవు. యేసును నమ్మాడు అంతే.

మూడవ మాట – ఆదరణ

"ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియు, మగ్దలేనే మరియు యేసు నొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు, తానూ ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని, తన తల్లితో, చెప్పెను! తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను! ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చు కొనెను" (యోహాను 19:25-27).

యేసు యోహానుకు చెప్పాడు తన తల్లిని చూసుకోమని. స్థానిక సంఘంలో మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి యుండాలని యేసు కోరుచున్నాడు.

నాల్గవ మాట – అర్పణ

"మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, బిగ్గరగా, ఏలీ, ఏలీ, లామా సిబక్షానీ అని బిగ్గరగా కేక వేసెను? ఆ మంటకు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్ధము?" (మత్తయి 27:45-46).

యేసు వేదనతో కూడిన కేక చూపిస్తుంది ఆయన దేవుని నుండి వేరు చేయబడడం మన పాపాల కొరకు ప్రయాశ్చిత్తమవడం.

ఐదవ మాట – శ్రమ

"అంత తరువాత, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు, నేను, దప్పి గోనుచున్నాను. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్ట్టియుండెను: గనుక వారు ఒక స్పంజి చిరకతో ముంచి, హిస్సోవు పుడకకు తగిలించి, ఆయన నోటికి అందిచ్చిరి" (యోహాను 19:28-29).

ఇది యేసు గొప్ప శ్రమలను చూపిస్తుంది మన పాపాల నిమిత్తము ఆయన పడిన పాట్లు.

ఆరవ మాట – నెరవేర్పు

"యేసు ఆ చిరకపుచ్చుకొని సమాప్తమైనదని, చెప్పాడు, అది పూర్తీ అయింది: అతడు తలవంచి, ఆత్మను అప్పగించెను" (యోహాను 19:30).

మన రక్షణార్ధం కావలసినదంతా ముగింపబడింది. తప్పినా వానికి ఏమీ మిగలలేదు యేసును నమ్మడం తప్ప.

ఏడవ మాట – తండ్రికి అప్పగించుకొనుట

"అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, చెప్పాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోనుచున్నాను: ఆయన ఇలాగు చెప్పి, ప్రాణము విడిచెను" (లూకా 23:46).

శాతాదిపతి చాలా సిలువ మరణాలు చూసాడు. హృదయం కఠినమైంది. యేసు చనిపోయినట్టు ఎవరినీ చూసలేదు. సిలువపై వ్రేలాడు క్రీస్తు మృత దేహాన్ని చూసాడు. కన్నీరు కారుస్తూ, శాతాదిపతి అన్నాడు,

"ఈయన నిజముగా దేవుని కుమారుడు" (మార్కు 15:39).

దైవ కుమారుని నమ్మి ఆయన త్యాగము ద్వారా ఆయన రక్తము ద్వారా రక్షింప బడాలి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: మార్కు 15:25-39.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
     "ముళ్ళ కిరీటం" (ఇరా ఎఫ్. స్టీన్ ఫిల్, 1914-1993; కాపరిచే మార్చబడింది).


ద అవుట్ లైన్ ఆఫ్

యేసు మరణించిన రోజు

THE DAY JESUS DIED

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసికొని, పోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాల స్థలమునకు వెళ్లిరి, హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు: అక్కడ ఈ వైపున ఒకరిని, ఆవైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి, ఆయనతో కూడ ఇద్దరిని సిలువ వేసిరి" ( యోహాను 19:16-18).

I. మొదటిది, ఆ రోజు చీకటిమయమైంది, మత్తయి 27:45; నిర్గమ కాండము 10:21-22.

II. రెండవది, ఆ రోజు దేవాలయపు తెరచిగెను, మత్తయి 27:51ఎ.

III. మూడవది, భూకంపం వచ్చింది, మత్తయి 27:51బి; I తిమోతి 2:5.

IV. నాల్గవది, ఆ దినాన్న యేసు సిలువ నుండి మాట్లాడాడు, యోహాను 19:4; లూకా 23:33-34, 39-43; యోహాను 19:25-27; మత్తయి 27:45-46; యోహాను 19:28-29, 30; లూకా 23:46; మార్కు 15:39.