Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




మీరు సిలువను చూసేటప్పుడు ఏమి చూస్తారు?

WHAT DO YOU SEE WHEN YOU LOOK AT THE CROSS?
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, ఏప్రిల్ 13, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 13, 2014

"అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి యుండిరి" (మత్తయి 27:36).


నేను యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు సిలువవేయడాన్ని గూర్చి విన్నప్పుడు నేను రక్షింపబడనప్పటికి నా కళ్ళమ్మట నీళ్ళు కారేవి. క్రీస్తు చేతులకు కాళ్ళకు మేకులు కొట్టడాన్ని నేను అనుభూతి పొందేవాడిని. ఇప్పుడే గ్రఫిత్ గారు పాడిన పాట విన్నప్పుడు ఏడ్చేవాడిని. నాకు అసౌకర్యముగా ఉండేది కాబట్టి ముఖము తిప్పుకునే వాడిని. క్రీస్తు శ్రమ నేను పొందేవాడిని. ఆయన శ్రమను బట్టి నేను దుఃఖించే వాడిని. ఇది నటన కాదు. కట్టు కథ కాదు. నా కడుపులో నొప్పి వచ్చేది సిలువపై క్రీస్తుపడిన శ్రమను గూర్చి ఆలోచించేటప్పుడు.

ఆదివారపు ఆరాధనలో ఈరోజుల్లో యవనస్తులకు అలాంటి అనుభూతి లేదు. ఎందుకు అని ఆశ్చర్యపోతాను. శ్రమపడు క్రీస్తును గూర్చిన భాద చూడడం ఎందుకు అంత కష్టం? ఇతరుల భాదను మనం అనుభవించడం సానుభూతి. చాలా మంది ఈరోజుల్లో కనికరము, విచారము దయ శ్రమపడే వారి పట్ల చూపించడం లేదు. చాలా సంవత్సరాల క్రితం చిన్న కుక్కను కడుపులో తన్నితే యవ్వన గుంపు నవ్వడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ నవ్వు నన్ను భయపెట్టింది. చెప్పనవసరం లేదు, వాళ్ళంతా మన గుడి వదిలేసారు. కఠినాత్ములు క్రైస్తవులవడం చాలా కష్టతరం!

ఈ కఠినత్వం యవనస్తులు టివి, సినిమాలు, సంస్కృతీ చూడడం ద్వారా నేర్చుకుంటున్నారు. మిచిగాన్ విశ్వ విద్యాలయం 1999 లో ఒక నివేదిక విడుదల చేసింది 18 సంవత్సరాలకు 16,000 చావులు టివిలో చూస్తారు – 900 చావులు ప్రతి సంవత్సరము టివిలో. అది టివి మాత్రమే! సినిమాలలో, విడియో ఆటలలో, కొత్త కార్యక్రమాలలో చూపించే హత్యలు చావులు కాక! అంతేకాక భయము చావులు, యవ్వనులకు బాగా తెలుసు ఈ దేశములో ప్రతి రోజు 3,000 మంది పసి బిడ్డలు గర్భస్రావానికి బలైపోతున్నారు! అవును, 3,000 ప్రతి దినము – ప్రతి సంవత్సరము పది లక్షలకు పైగా! ఇలాంటిది, యవనస్తుల తలల్లో దూరి వాళ్ళ భావోద్రేకాలను ప్రభావితం చేస్తుంది. నేను నమ్ముతాను ఇది ఈ తరాన్ని కఠిన పరచి శ్రమపడే వాళ్ళ పట్ల భావాలు వ్యక్త పరచకుండా చేస్తుంది.

ఈ ఉదయం సిలువపై క్రీస్తు పట్ల ఆ భయంకర పరిస్థితిని అనుభూతి ద్వారా పొందాలని నేను కోరుచున్నాను. క్రీస్తు సిలువను చూస్తె ఏమి చూస్తారు? ఆ దినాన్న క్రీస్తు శ్రమపడ్డాడు, ఆయన సిలువ దగ్గర చాలా మంది ఉన్నారు. ఆయనను సిలువ వేసిన సైనికులు కూర్చొని "ఆయనను చూస్తున్నారు" అని మన పాఠ్య భాగము చెప్తుంది (మత్తయి 27:36). చాలా మంది అలాగే ఆయనను చూడటం జరిగింది. ఈ ప్రజలను మీరు ప్రేమిస్తారా? దాని గూర్చి ఆలోచించండి. సిలువపై ఉన్న క్రీస్తును చూసేటప్పుడు ఏమి చూస్తారు?

I. మొదటిది, యాజకులు పెద్దలు సిలువపై ఒక శత్రువు చనిపోయినట్టుగా చూసారు.

"అలాగే శాస్త్రులను, పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, అన్నాడు, వీడు ఇతరులను రక్షించెను; కాని తన్ను తానె రక్షించు కొనలేదు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీది నుండి దిగిన యెడల, వానిని నమ్ముదుము. వాడు దేవుని యందు విస్వసముంచెను; ఆయన కిస్టమైన, ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి: ఆయన చెప్పెను, నేను దేవుని కుమారుడనని" (మత్తయి 27:41-43).

ఆయన సిలువపై శ్రమపడుచున్నప్పుడు దూషించి అపహసించిరి. శత్రువుగా చూసారు, ఆయనను వదిలించుకునందుకు సంతోషించారు. అలాంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారు. హెచ్ బిఓ బిల్ మెహర్ లాంటి వాడికి డబ్బులిస్తారు దేవుని దూశించడానికి క్రీస్తును అపహసించడానికి. రిచర్డ్ డాకిన్స్ క్రిస్టోపర్ హెచ్చేన్స్ క్రీస్తును బైబిలును దేవుని కూడా ఎదిరించినందుకు మంచి జీవనం జీవించారు! నాస్తికత్వానికి వారు పెద్దలు యాజకులు అయిపోయారు. మదలిల్ ముర్రే ఓ హెయిర్, నాస్తికుడు మన పాఠశాలల్లో బైబిలు పఠనము ప్రార్ధన బహిష్కరించాడు, ఇలా అన్నాడు,

"ప్రతి ఒక్కడు నాస్తికుడైతే ప్రపంచంలో అది శ్రేష్టము."

"నేను నాస్థికున్ని ఎందుకంటే మతము ఒక వ్యవస్థ కుంటి వాళ్ళకే అది అవసరము."

"అంగీకరించే ఏ మగాడి తోనైనా లైంగిక క్రియకు ఎప్పుడైనా ఎక్కడైనా నేను సిద్దమే."

అలా నాస్తికత్వం ప్రధాన యాజకులు అనుకుంటారు! అలా మీ కళాశాల అధ్యాపకులు, పాఠశాలల్లో, అనుకుంటారు. దేవుడు వారిని నశింపచేస్తాడు, సిలువ దగ్గర అదైవికులను చేసినట్టు. ఆయన అన్నాడు, "మూర్ఖుడు తన హృదయంలో అనుకున్నాడు, దేవుడు లేడని" (కీర్తనలు 14:1). మీరు వారిలా ఉన్నారా? మీరు సిలువను చూసినప్పుడు ఏమి చూస్తారు?

II. రెండవది, రోమా సైనికులు సిలువ దగ్గర వస్త్రాన్ని చూసారు.

"మరియు వారు ఆయనను హింసించారు, అతని వస్త్రములను విడిదీసారు, మొత్తం పూర్తిగా: అది ప్రవక్త మాట్లాడిన విధంగా పూర్తి చేసారు, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట, చీట్లు చేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి యుండిరి" (మత్తయి 27:35-36).

వాళ్ళంతా వస్తువులను చూసేవాళ్ళు క్రీస్తు వస్త్రాన్ని చూస్తున్నారు. అమ్మవచ్చు, కాబట్టి వాళ్ళ మనస్స్తులు కఠినమయ్యాయి క్రీస్తు వస్త్రాన్ని వచ్చినందుకు అమ్మేద్దామనుకున్నారు! నీ మనస్సు ఎక్కడ ఉంది? సిలువ వైపు చూస్తె మీరు ఏమి చూస్తారు?

చాలా మంది కాలేజి విద్యార్ధులు భయపడుతున్నారు వాళ్ళు క్రైస్తవులైతే చదువు చదవలేరు, చదువు అయ్యాక మంచి ఉద్యోగమూ రాదనీ. డబ్బు! డబ్బు! డబ్బు! చాలా మంది చైనీ యువకులు అదే ఆలోచిస్తారు. "క్రైస్తవుడైతే డబ్బు పోగొట్టుకుంటాను," అని వాళ్ళంటారు.

చాలాకాలం కిందట, చైనీ గుడిలో సభ్యుడుగా ఉన్నప్పుడు, జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనా క్రీస్తూనే వెంబడిస్తానని నిర్ణయించుకున్నను! యేసు గొప్ప ప్రశ్న ఇలా అడిగాడు,

"ఒకడు సర్వలోకము సంపాదించుకొని, తన ప్రాణమును పోగొట్టుకుంటే, వానికేమి ప్రయోజనము?" (మార్కు 8:36).

ప్రపంచమంతటిలో ఐదవ సంపన్నుడు వారెన్ బఫెట్. లక్షలాది డాలర్లు పిత్రుత్వానికి, తల్లి గర్బంలో ఉండే వాళ్ళకు ఇస్తాడు. అతడు చనిపోతే అతనికి ఆత్మకు ఏమి అవుతుంది? 80 సంవత్సరాలపై వయస్సు. ఎంతో డబ్బుంది ఆత్మనిత్వత్వంలో నరకంలోకి వెళ్ళితే వాని కేమి ప్రయోజనం?

రోమా సైనికులు క్రీస్తు వస్త్రాన్ని అమ్మితే ఎంత డబ్బు వస్తుందని చూసారు. మీరు సిలువపై ఉన్న క్రీస్తును చూస్తె ఏమి చూస్తారు?

III. మూడవది, క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగ సిలువపై విఫలుడుగా ఆయనను చూసాడు.

యేసుకు ఇరువైపులా ఇద్దరు దొంగలు, సిలువవేయబడ్డారు. మొదటి వాడు యేసును చూచి ఆయనను ఇంకొక నేరస్తుడనుకున్నాడు. తననుకున్నాడు దేవుని కుమారునిగా నమ్మిన యేసును పిచ్చివానిగా భావించాడు. మత నాయకునిగా క్రీస్తును కొట్టి పారేసి, క్రీస్తును అపహసించాడు.

చాలా సంవత్సరాల క్రితం ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. నాకు నచ్చేవాడు. ఒక రాత్రి సువార్త వినడానికి నాతొ పాటు గుడికి రమ్మని బతిమాలాను. అతను అన్నాడు, "కాదు." అతను అన్నాడు, "ఎవరికీ వారే, రాబర్ట్. ఎవరికీ వారే." నా బ్రతుకంతా అది నేను మర్చిపోను. తన ఉద్దేశము నాకు గుడి ఉంది తనకు బీరు తాగే స్నేహితులున్నారు. నాకు ఒకటి మంచిది అతనికి వేరొకటి మంచిది. "ఎవరికీ వారే, రాబర్ట్. ఎవరికీ వారే." కొన్ని సంవత్సరాల తరువాత అతని సమాధి పెట్టె చూసాను. తలపై తెల్ల జుట్టు లేదు. ముఖంలో ముడతలు లేవు. నలబై సంవత్సరాలు. అలా అంత మోస్తుందని తనకు తెలుసు. మంచి ఆరోగ్యమున్నా, నాకు చెప్పేవాడు, "యాబై దాటదు, రాబర్ట్. యాబై దాటవు." నలబై ఎనిమిదికి అకస్మాత్తుగా ఇంటిలో చనిపోయాడు. నేను ఆ శవ తీసుకెళ్తాను మరియు అతని పదాలు నా పుడుతున్నారు, "ఎవరికీ వారే, రాబర్ట్. ఎవరికీ వారే." అతని సమాధి పెట్టె చూసేటప్పుడు, అతని కుటుంభానికి స్నేహితులకు ఒక్క నిరీక్షణ మాట కూడా చెప్పలేక పోయాను – ఒక నిరీక్షణ మాట కూడా! వారికీ సువార్త మాత్రము ప్రకటించాను.

మొదటి దొంగ యేసు ప్రక్క, దేవా దూషణ మాటలు పలికాడు. తను అనుకున్నాడు యేసు మాత గురువని అనుకున్నాడు. సూర్యుడు అస్తమించే సరికి అతను నరకంలో ఉన్నాడు. సిలువపై క్రీస్తును చూస్తున్నప్పుడు మీరు ఏమి చూస్తారు?

IV. నాల్గవది, రెండవ దొంగ సిలువపై ఆయనను ప్రభువైన రక్షకునిగా చూసాడు.

గుంపంతటితో ఉదయము నుండి యితడు యేసుకు వ్యతిరేకంగా ఉన్నాడు. కాని మధ్యాహ్నము దేశమంతటా విచిత్ర చీకటి కమ్మింది. ఆయన సిలువ వేసే వారిని గూర్చి యేసు ప్రార్ధించడాన్ని తను విన్నాడు.

"యేసు అన్నాడు, తండ్రి, వేరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక; వీరిని క్షమించుము" (లూకా 23:34).

ఆయనను చంపుతున్న వారిని గూర్చిన యేసు ప్రార్ధన రెండవ దొంగ హృదయాన్ని కదిలించింది. యేసును అపహసించడం ఆపేసాడు. తల తిప్పి, రక్షకుని చూచి, హృదయం కరిగి పోయింది. శత్రులను క్షమించమని ప్రార్ధించే వారెవరని మునుపెన్నడూ తను ఎరుగడు.

తండ్రి, వారిని క్షమించుము!" అలా ఆయన ప్రార్ధించాడు,
ఆయన రక్షము వేగముగా ప్రవహిస్తున్నప్పటికిని;
పాపుల కొరకు ప్రార్ధించాడు అంత స్థితిలో కూడా –
అంతగా యేసు తప్ప ఎవరు ప్రేమించ లేదు.
దీవెన విమోచాకుడా! ప్రశస్త విమోచాకుడా!
కల్వరి వృక్షముపై ఆయనను చూస్తున్నాను;
గాయపరచబడి రక్తము కారుతూ, పాపుల కొరకు విజ్ఞాపనచేస్తూ –
గ్రుడ్డి వాడై శ్రమించి – నా కొరకై మరణించాడు!
   ("దీవెన విమోచాకుడా" ఎవిస్ బర్గసన్ క్రిస్టియాన్ సేన్, 1895-1985).
      (“Blessed Redeemer” by Avis Burgeson Christiansen, 1895-1985).

దొంగకు తెలిసిందల్ల గుంపు అరాచాకత్వము, వారి కొరకు ప్రభువు మృదువైన ప్రేమ, యేసు తలపై ఉంచబడిన పైవిలాసము, "యూదుల రాజు" (లూకా 23:38). అకస్మాత్తుగా ఇతడు అది నమ్మాడు! తప్పకుండా విని ఉంటాడు యేసు ద్వారా ప్రజలు స్వస్థత పర్చబడడం. పునరుద్దరింప బడడం యేసు బోధించేది విని ఉంటాడు. అదంతా తన మనసులో మెదిలింది. ఈయన యూదుల రాజు! ఈయన మెస్సియా! ఈయన విడిపించువాడు! ఈ సత్యాలన్నీ అతనికి తెలియవు. మనలో ఎంత మందికి యేసును గూర్చిన ఈ సత్యాలు తెలుసు? నాకు తెలుసు అన్ని సత్యాలు నాకు తెలియవు – ఎవరికీ కూడా, నా ఉద్దేశంలో. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "సత్యాలు సరిపోవు." క్రీస్తు గూర్చి నేర్చుకోవలసింది చాలా ఉంది మన చిన్న బుర్రలతో అర్ధం చేసుకోలేము! కాని ఈ దొంగకు తెలుసు తన పాపి అని. తన హృదయంలో భావించాడు! నమ్మని దొంగతో అన్నాడు, "మన క్రియలకు తగిన ఫలము పొందుచున్నాము: ఈయన ఏ [నేరము] చేయలేదు – ఏ దోషము" (లూకా 23:41). నిజంగా, "సత్యాలు సరిపోవు." నేననుకుంటాను ఇక్కడ సంస్కరణ సహొదరులు తప్పిపోతుంటారు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ తప్ప, "సత్యాలు సరిపోవు." క్రీస్తు రుజువుకు నీకు సత్యాలు కావాలంటే, నీ పాపలలో నీవు చనిపొతావు, ఎప్పుడు రక్షింపబడవు. బైబిలు తేటగా చెప్తుంది, "హృదయముతో మానవుడు నీతిని నమ్ముతాడు" (రోమా 10:10).

అక్కడ అధునాతన భోధకులు తప్పిపోతుంటారు. వారు బుర్రకు బోదిస్తారు హృదయానికి కాదు. ఓ, దేవా, దయచేసి నన్నలా చెయ్యనివ్వవద్దు! దయచేసి తండ్రి, వాళ్ళ హృదయాలకు బోధించేటట్టు నాకు సహాయము చెయ్యి! "హృదయంలో మానవుడు నీతిని నమ్ముతాడు." ఈ చనిపోతున్న దొంగ తలనొప్పి యేసును చూచి – ఇలా అన్నాడు,

"ప్రభువా, నీ రాజ్యములో వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము" (లూకా 23:42).

నోటి నుండి మాటలు వెలువడగానే, రెండవ దొంగ రక్షింపబడ్డాడు! కొంచెము సిద్ధాంతము తెలుసు భావన లేదు. అతను ఏ ప్రత్యేక భావన లేదు, లేదా యేసు ప్రభువు మరియు రక్షకునిగా అని రుజువు ఉంది. కాని యేసును నమ్మాడు, "హృదయముతో మానవుడు నీతిని నమ్ముతాడు." కేవలం యేసును అతడు నమ్మాడు! దేవుడు కోరుకున్నది అదే!

పాపి నమ్మిన క్షణానే,
సిలువ వేయబడిన దేవుని నమ్మిన వాడు,
ఆయన క్షమాపణ వెంటనే వస్తుంది,
ఆయన రక్తము ద్వారా సంపూర్ణ విమోచన!
("పాపి నమ్మిన క్షణమే" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768).
   (“The Moment a Sinner Believes” by Joseph Hart, 1712-1768).

దొంగ యేసును నమ్మాడు, క్షణంలో రక్షింపబడ్డాడు! అలాగే మనమందరం రక్షింపబడ్డాం, తెలుసా! యేసును నమ్మాం. ఆయనను నమ్మాము. రక్షింప బడ్డాం! యేసు రక్షింపబడిన దొంగతో అన్నాడు,

"నేడు నీవు నాతో కూడా పరదైనులో ఉందువని, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను" (లూకా 23:43).

చనిపోయిన ఆ రోజే దొంగ యేసుతో పరదైనులో ప్రవేశించాడు!

సిలువ వేయబడిన వాని రక్తము ద్వారా రక్షింపబడి!
పాప విమోచన నొంది నూతన [జీవితమూ] ప్రారంభించి,
తండ్రికి కుమారునికి స్తుతి పాడాలి,
నేను సిలువ వేయబడిన వారి రక్తము ద్వారా రక్షింపబడ్డాను!
రక్షింపబడ్డాను!రక్షింపబడ్డాను! నా పాపాలన్నీ క్షమింపబడ్డాయి,
నా దోషారోపణ పోయింది!
రక్షింపబడ్డాను!రక్షింపబడ్డాను! నా పాపాలన్నీ క్షమింపబడ్డాయి!
   ("రక్తము ద్వారా రక్షణ" ఎస్. జె. హెందర్ సన్, 1902).

యేసును నమ్మిన క్షణాన, నీ హృదయంలో నమ్మితే, చనిపోయే దొంగ వలే రక్షింపబడతావు – రక్షకుని ప్రక్క సిలువలో ఉన్న. యేసు దొంగను రక్షించాడు. మానవుని పాపాన్ని యేసు సిలువలో కార్చిన రక్తముతో కడిగి వేసాడు! ఆయన రక్తము అందుబాటులో ఉంది ఈ ఉదయాన్న నీ పాపాలు కడగడానికి! రక్తము లేదని చెప్పే బోధకుని నమ్మవద్దు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "సిలువను గూర్చి మరణాన్ని గూర్చి మాట్లాడితే సరిపోదు. పరీక్ష "రక్తము!"

నీవు యేసును నమ్మితే ఆయన రక్తముతో నీ పాపాలు కడిగేస్తాడు! నీవు రక్షింపబడతావు! నిజ క్రైస్తవుడవుతావు! పరలోకానికి సిద్ధంగా ఉంటావు! క్రీస్తులో నూతన జీవితం పొందుకుంటావు! పశ్చాత్తాపబడి రక్షకుని నమ్ము!

రక్షణను గూర్చి మాతో మాట్లాడాలనుకుంటే, మీ సీటు వదిలి ఆవరణము వెనుకకు వెళ్ళండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి ప్రార్ధించి మాట్లాడుతారు. మొదటిసారి ఉంటే, నీకు ప్రశ్న ఉంటే, ఆవరణము వెనుకకు వెళ్ళు. నేను నీతో కూర్చొని మాట్లాడుతాను. త్వరగా వెళ్ళు. డాక్టర్ చాన్, కొందరు యేసును నమ్మునట్టు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.


ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: మత్తయి 27:35-44.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఆశీర్వాద విమోచాకుడు" (అవిస్ బి. క్రిస్టియాన్ సేన్, 1895-1985).
“Blessed Redeemer” (by Avis B. Christiansen, 1895-1985).


ద అవుట్ లైన్ ఆఫ్

మీరు సిలువను చూసేటప్పుడు ఏమి చూస్తారు?

WHAT DO YOU SEE WHEN YOU LOOK AT THE CROSS?

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి యుండిరి" (మత్తయి 27:36).

I.   మొదటిది, యాజకులు పెద్దలు సిలువపై ఒక శత్రువు చనిపోయినట్టుగా చూసారు, మత్తయి 27:41-43;
కీర్తనలు 14:1.

II.  రెండవది, రోమా సైనికులు సిలువ దగ్గర వస్త్రాన్ని చూసారు, మత్తయి 27:35-36; మార్కు 8:36.

III. మూడవది, క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగ సిలువపై విఫలుడుగా ఆయనను చూసాడు.

IV. నాల్గవది, రెండవ దొంగ సిలువపై ఆయనను ప్రభువైన రక్షకునిగా చూసాడు, లూకా 23:34, 38, 41; రోమా 10:10;
లూకా 23:42, 43.