Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




మూడు వనములు కథ చెప్తున్నాయి

THREE GARDENS TELL THE STORY
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, ఏప్రిల్ 6, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, April 6, 2014

"మనష్యుని ద్వారా మరణము వచ్చును, కనుక మనషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదాము నందు అందరు ఎలాగు మృతి పొందుచున్నారో, అలాగుననే క్రీస్తు నందు అందరు బ్రతికింపబడుదురు" (I కోరిందీయులకు 15:21-22).


శారీరక ఆత్మీయ మరణము ఆదాము నుండి వచ్చాయి. ఆదాము పాపమూ చేసాడు కాబట్టి మానవ జాతి అంతా పాపులుగా పుట్టారు. మనమంతా పాపపు స్వభావముతో పుట్టాం. కాని క్రీస్తు నీటిని బట్టి ఆయన ద్వారా రక్షింపబడి నీతిమంతులమై నిత్య జీవము పొందాము. నలబై ఐదవ వచనములో మనము మొదటి ఆఖరి ఆదామును గూర్చి చదువుతా. మొదటి ఆదాము పాపమూ ద్వారా మానవ జాతికి పాపాన్ని మరణాన్ని తెచ్చాడు. ఆఖరి ఆదాము, యేసు క్రీస్తు, రక్షణ జీవాన్ని మార్పు అనుభవము ద్వారా ఆయనను నమ్మిన వారికి తెచ్చాడు. పాపమూ దానికి విరుగుడు మూడు వనములలో చూడవచ్చు, పాపములో రకాలు. రక్షణ పాపమూ రక్షణ గూర్చిన చిత్ర పటాన్ని మూడు వనముల అర్ధము ద్వారా మీకు చూపిస్తాను.

I.  మొదటిది, మనము కొద్ది నిముషాలు ఏదేను వనమును గూర్చి ఆలోచిద్దాం.

బైబిలు నేర్పిస్తుంది దేవుడు ఆదిమ మానవుని చేసాడని. బైబిలు బోధిస్తుంది నిజమైన వ్యక్తిని దేవుడు ఏదేను వనములో ఉంచాడని. "దేవుడైన యోహావా తూర్పున ఎదేనులో; ఒక తోట వేసి తానూ నిర్మించిన నరుని దానిలో ఉంచెను" (ఆదికాండము 2:8). ఈ మానవుడు ఏదేను వనములో ఉంచబడ్డాడు లోకాన్ని ఏలడానికి, వనాన్ని కాపాడడానికి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని ఆజ్ఞాపించబడ్డాడు.

"అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను, తినకూడదు: నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని ఆజ్ఞాపించెను" (ఆదికాండము 2:17).

కాని సాతాను వనములో ప్రవేశించి తినకూడని ఫలమును తినేటట్టు శోదించాడు. దానిని తిని దేవుని శాపాన్ని మనవ జాతిపై తీసుకొచ్చాడు. మానవుడు తన భార్య ఏదేను వనము నుండి బహిష్కరింపబడ్డారు. భూమంతా దేవుని శాపానికి లోనైయింది. ప్రపంచం సృష్టింపబడిన వాటికి హేయస్థలమయింది దేవునికి విదేయుడు అవుట అనే ఆదాము గొప్ప పాపాన్ని బట్టి. మరణము ఆదాము నుండి మానవ జాతి కంతటికీ ప్రాకింది. ఇది ఆత్మీయ మరణములో ప్రత్యక్ష పరచబడి ఉంది, దేవుని నుండి వేర్పాటు, సత్యము పట్ల అంధత్వము, శారీరక మరణము కూడా. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు,

మనవ జాతిని గూర్చిన కథ ఆదామును బట్టి జరిగిన దానితో చూపించ వచ్చు...దుస్థితి ఆనందము లేని స్థితి, నైతిక పతనం, దొంగతనం, దోచుకోవడం, హత్యలు, విడాకులు, వేర్పాటు, మొదలైనవి. ఎందుకలా? ఎప్పుడు ఎందుకలా అవుతుంది? చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి. ఇదే మాదిరి కొనసాగుతూ వస్తుంది. ప్రపంచం మునుపు అలానో ఇప్పుడు అలానే ఉంది. ఎందుకిలా? అపోస్తలుడైన పౌలు ఈ ప్రశ్నకు సమాధాన మిచ్చాడు [రోమా 5:12-21]. ఆయన అన్నాడు దాని కంతటికీ ఆదాము కారణము, ఆదాము చేసిన దానికి ముడిపడి ఉంది, ఆయనతో మన సంభందం (Martyn Lloyd-Jones, M.D., Romans – Exposition of Chapter Five, The Banner of Truth Trust, 2003, p. 178).

బైబిలు తేటగా చెప్తుంది,

"ఇట్లుండగా ఒక మనషుని ద్వారా పాపమూ, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించేనో; అలాగుననే మనష్యులందరూ పాపమూ చేసినందున, మరణము అందరికిని సంప్రాస్త మాయెను" (రోమా 5:12).

మనకు సంప్రాప్తమైన మరణము శత్రుత్వము, దేవుని పట్ల ద్వేషము అయిష్టతను కలిగి ఉన్నాయి,

"ఎలాగనగా [శరీరాను సారమైన] మనస్సు దేవునికి విరోధమై ఉన్నది" (రోమా 8:7).

ఆ ఆదాము పర మరణము బైబిలు సత్యాన్ని తెలుసుకోకుండా గుడ్డితనం కలిగిస్తుంది,

"ప్రకృతి సంభందమైన మనష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు: అవి అతనికి వెర్రి తనంగా ఉన్నవి: అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు" (I కోరిందీయులకు 2:14).

స్పిరిట్ ఆప్ రిఫర్మేషన్ బైబిలు చెప్తుంది,

సంస్కరణ వేదాంతము పాప పతనాన్ని గూర్చిన చారిత్రాత్మక నిజాముపై ఎక్కువగా ఆధారపడుతుంది...ఆదాము నీతిలో నిర్మింపబడ్డాడు కాని అవినీతికి తీర్పుకు గురి అయ్యాడు... పతన వివరణ చారిత్రాత్మక వివరణను చూపిస్తుంది సృష్టి పతనాన్ని కూడా (Spirit of the Reformation Study Bible, Zondervan Publishing House, 2003, p. 14).

కనుక మనం పాపాన్ని, అంధత్వాన్ని, తిరుగుబాటు స్వభావాన్ని గమనింపవచ్చు ఆదాము దేవుని ఏదేను వనమును అపవిత్ర పరచడంలో, చరిత్ర ఆరంభంలో. ఏదేను వనము అనే స్థలములో పాపమూ మానవ జాతిని నశింపచేసింది. మనం దానిని "మరణపు వనము" అని పిలవవచ్చు.

మీలో కొందరు మారడానికి తబ్బిబ్బవుతున్నారు. క్రీస్తును నమ్మాలనుకుంటున్నారు, కాని చెయ్యలేకపోతున్నారు. సమస్య ఏంటి? ఆదాము పపముతో గుడ్డి వాడయ్యవు, నీ అనువులోనే ఉంది, నీ ఆత్మను విషపూరితం చేసింది! బైబిలు చెప్తుంది "పాపములో చచ్చిన వాడవు" (ఎఫేస్సీయులకు 2:5). నీవు క్రైస్తవునిగా ఉండడం నేర్చుకోలేవు ఎందుకంటే మరణముతో కలిషితమయ్యావు! నీకు మానవ నిరీక్షణ లేదు ఎందుకంటే పాపమూ నీ అణువులో ఉంది, ఏదేను నుండి వైరస్ నీ రక్తంలోకి వచ్చింది – మరణపు వనము!

ఓ! భయంకర పిశాచీ, పాపమూ,
ఎంత శాపాన్ని తెచ్చావు!
సృష్టి అంతా మూలుగుతుంది,
నీవు దుస్థితికి కారణము!
దుష్ట మనిషిని నాశనం చేసావు
ప్రపంచ ఆరంభము నుండి.
("యేసు గూర్చి ఎక్కువగా మాట్లాడుతాం’ "రక్తము" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768).
   (“Much We Talk of Jesus’ Blood” by Joseph Hart, 1712-1768).

II.  రెండవది, గెత్సమనే వనమును గూర్చి మనం ఆలోచిద్దాం.

యేసు తన శిష్యులతో పస్కా బోజనము చేసాడు. బోజనమయే సరికి చాలా ఆలస్యమైంది. కీర్తన పాడి వెళ్లి పోయారు. ఒలీవ కొండ ప్రక్కనున్న ఒలీల ప్రాంతము వరకు వారు యేసును వెంబడించాడు. ఈ స్థలాన్నే గెత్సమనే వనం అంటారు. వనము అంచులో యేసు ఎనిమిది మంది శిష్యులను వదిలి పెట్టాడు. పేతురు యాకోబు యోహానులను, వనము చీకటి ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. గొప్ప వేదనలో ఉన్నాడు "ఆశ్చర్యకర భాద" – "చాలా భారంగా" – "మరణముగునంతగా చింతా క్రాంతుడాయెను" (మార్కు 14:33, 34) – "చాలా లోతుగా దుఃఖపడ్డాడు" (ఎన్ఎఎస్ వి). అప్పుడు ప్రార్ధించాడు, "తండ్రి, నీ చిత్తమైతే, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపుము" (లూకా 22:42). "ఆగిన్నే" ఏమిటి? చాలా మంది వ్యాఖ్యాతలు అంటారు మరునాడు సిలువపై ఆయన మరణమును గూర్చినది అని. గాని ఆ అభిప్రాయం హెబ్రీ 12:2 కు విరుద్ధంగా ఉంది, అదేంటంటే యేసు "ఆయన ముందున్న ఆనందము సిలువను సహింప చేసే, అవమానాన్ని తొలగిస్తుంది."

స్పర్జన్ అడిగాడు, "గెత్సమనే వేదనకు కారణమేంటి?" తానూ అన్నాడు శారీరక భాద నుండి వచ్చింది కాదు. గేలి చేయబడడం మరునాడు సిలువ వలన భయము కారణంగా వచ్చింది కాదు. ఆయన అన్నాడు చాలా మంది హత సాక్షులు మరణాన్ని ఆనందంగా అందుకున్నారు. ఆయన అన్నాడు, "మన యజమానుడు [హత సాక్షులుకు] తక్కువ కాదు, వారు ధైర్యంగా ఉంటె ఈయన వణకడం కాదు." సాతాను దాడి కారణంగా క్రీస్తు వేదనకు గురికాలేదు. తానూ అన్నాడు వనములోని ఆయన వేదనకు నిజ కారణము: "ఆయనను నలుగగొట్టుట ఆయన కిష్టమాయెను; వేదనకు గురి చేసాడు: పాప పరిహారార్ధ బలిగా ఆయెను" (యెషయా 53:10). "ప్రభువు మన అతి క్రమములను ఆయనపై మోపెను" (యెషయా 53:6).

డాక్టర్ ఆర్. సి. హెచ్. లెన్స్ కి అన్నాడు, "గెత్సమనే వేదన పూర్తీ మర్మముతో నిన్డుకోన్నది...లోక పాపమూ, నిజంగా, తన జీవితమంతా యేసు ఆపాదింపచేసుకున్నాడు, గేత్సమనేలో ఆ సంపూర్ణ నెరవేర్పు వచ్చింది" (R. C. H. Lenski, Ph.D., The Interpretation of St. Luke’s Gospel, Augsburg Publishing House, 1946, p. 1074).

నేను నమ్ముతాను గెత్సమనే వనములో యేసు మన పాపాలను ఆయనపై వేసుకున్నాడు. అది ఆయనను చంపింది – ఎందుకంటే "ప్రభువు మన అందరి అతి క్రమములను ఆయనపై మోపెను." మన పాపాలను లోపల బయట ఆయన నలుగ గోట్టబడ్డాడు,

"ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

ఆయన మన పాపాలను గెత్సమనే నుండి సిలువకు కొనిపోయి, మరుసటి రోజు ప్రాయాశ్చిత్తము చేసాడా.

ఆగండి! ఇది మొర్మోను సిద్ధాంతము కాదు! మీకు తెలుసు మొర్మోనులు బోధిస్తారని గెత్సమనేలో కార్చబడిన రక్తము మనలను క్షమిస్తుందని. బ్రూస్ మొకొని, మొర్మోను వేదాంతి, అన్నాడు, "క్షమాపణ దొరుకుతుంది ఎందుకంటే ప్రభువైన క్రీస్తు గెత్సమనేలో గొప్ప రక్తపు బిందువులను కార్చాడు కాబట్టి" (Bruce R. McConkie, The Promised Messiah, Deseret Book Company, 1978, p. 337). నేను చెప్పేది అది కాదు! నేనన్నాను గెత్సమనే నుండి సిలువ వరకు మన పాపాలు ఆయనపై మోసి, అక్కడ ప్రాయశ్చిత్తం చెల్లించాడు. సువార్తలో అది మొదటి విషయం, "లేఖనాలు ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం చనిపోయాడు" (I కోరిందీయులకు 15:3). బైబిలు చెప్తుంది క్రీస్తు "సిలువ రక్తం ద్వారా సమాధానపడ్డాడు" (కొలస్సయులకు 1:20) – వనములో రక్తము చెమట వలన కాదు! మన రక్షణ వస్తుంది సిలువపై క్రీస్తు కార్చిన రక్తము ద్వారా, వెలి ద్వారా వచ్చిన రక్తము ద్వారా కాదు – వనములో శారీరక రక్త బిందువుల వలన కాదు. సిలువపై ఆయన కార్చిన రక్తము ద్వారానే మన పాపమూ కడుగ బడుతుంది! అలా, స్పర్జన్ ఉద్దేశమే నాడు, సంస్కరణ వేదాంతి డాక్టర్ జె. ఒలివర్ బస్ వెల్, డాక్టర్ జాన్ ఆర్. రైస్. ఇక్కడ క్లిక్ చెయ్యండి గెత్సమనే గురించి డాక్టర్ బస్ వెల్ డాక్టర్ రైస్ ఏమి రాసారో చదవడానికి. వారి వ్యాఖ్యలు నా ప్రసంగములో ఉన్నాయి, "గెత్సమనే భయంకరత్వము."

ఇది ఒకే విధంగా జరిగిందా మానవుని పాపమూ వనములో ప్రారంభమైంది, వేరే వనములో క్రీస్తు మన పాపాలను ఆయనపై వేసుకున్నాడు? బహుశా – గొప్ప స్పర్జన్ ఆశ్చర్యపడ్డాడు. ఆయన అన్నాడు,

వనములో వలే మనము పొందలేదా, ఆదాము స్వ-ప్రమేయం మనలను నాశనం చేసింది, వేరే వనములో రెండవ ఆదాము వేదన మనలను పునరుద్దరించింది? గెత్సమనే అనారోగ్యానికి మందు ఇస్తుంది ఏదేను బహిర్గత ఫల కారణంగా (C. H. Spurgeon, “The Agony in Gethsemane,” The Metropolitan Tabernacle Pulpit, volume XX, Pilgrim Publications, 1971, p. 589).

ఇది మనలను మూడవ వనానికి తెస్తుంది, ఆ మూడు కలిపి మానవ జాతి పతనాన్ని క్రీస్తు యేసులో పునరుద్దత చూపిస్తున్నాయి.

III.  మూడవది, రక్షకుని సమాధిని కలిగిన వనమును గూర్చి ఆలోచిస్తూ ముగిద్దాం.

"అంతటా వారు యేసు దేహమును ఎత్తి కొనివచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున, ఆ సుగంధ ద్రవ్యములు దానికి పోసి నార బట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను, ఆ సమాది సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు’ సిద్ధ పరచు దినమైనందున వారు; అందులో యేసును పెట్టిరి" (యోహాను 19:40-42).

యేసు దేహము ఈ సమాధిలో ఉంచబడింది సల్వరి సమీప తోటలో, ఎక్కడైతే ఆయన సిలువ వేయబడ్డాడో. ఆ సమాధిని రాతితో మూశారు, రోమా ముద్ర వేసారు. రాత్రి కాపలా దారులను ఉంచారు.

ఆదివారం తెల్లవారు జామున ముగ్దలేనే మరియు మరియొక మరియా సుగంధ ద్రవ్యాలతో, సమాధి వద్దకు వచ్చారు. వారు సమీపిస్తుండగా భయంకర భూకంపం వచ్చింది. సమాధిపై ఉన్న రాతిని దేవదూత తొలగించింది. ఆయన ఇద్దరు స్త్రీలతో అన్నాడు,

"మీరు భయపడకుడి: సిలువ వేయబడిన యేసును, మీరు వెదుకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేదు: తానూ చెప్పినట్టే, ఆయన లేచి యున్నాడు" (మత్తయి 28:5-6).

శిష్యులకు చెప్పాలని వెళ్తుండగా, యేసు వారిని కలిసాడు. "వారు ఆయన యొద్దకు వచ్చి పాదాలు ముట్టి, ఆరాధించారు" (మత్తయి 28:9). ఆయన వారితో వెళ్లి శిష్యులకు చెప్పాలని చెప్పాడు.

మృతులలో నుండి యేసు పునరుత్థానము క్రైస్తవ సిద్ధాంతాలలో రెంటిలో ఒకటి. ఆయన మరణము మన పాపాలకు ప్రాయశ్చిత్తం, ఆయన శరీర పునరుత్థానము మనకు జీవాన్ని ఇవ్వడానికి సువార్తలోని రెండు భాగాలు. "సువార్త" అంటే "మంచి వార్తా." అది సుభవార్త తెలుసుకోడానికి యేసు మృతులలో నుండి శారీరకంగా లేచాడని "మన రాక్షనార్ఘం" (రోమా 4:25). ఆయన పునరుత్థానము విశ్వాసము ద్వారా ఆయనతో ఐక్య పరుస్తుంది. ఆయన యొద్దకు వచ్చే వారిని లేచిన ప్రభువు రక్షిస్తాడు పాపమూ నుండి, నిత్య శిక్ష నుండి.

"ఇందు విషయమై ఆదామును; మొదటి మనష్యుడు [క్రీస్తు] జీవించు [ప్రాణి ఆయెనని] వ్రాయ బడియున్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను" (I కోరిందీయులకు 15:45).

మొదటి ఆదాము మానవ జాతిని పాపంలోకి మరణంలోకి నేట్టేసాడు దేవునికి అవిదేయుడై. ఆఖరి ఆదాము, క్రీస్తు, పాపమూనకు మందు నిచ్చి జీవాన్ని యిచ్చాడు. స్పర్జన్ చెప్పినట్టు, "ఆదాము వనములో [పాపమూ] చే పట్టబడినట్టు, కుమారుడు వేరే వనములో [ఆఖరి] ఆదాము మనలను పునరుద్ధరించాడు" (ఐబిఐడి). క్రీస్తు, ఆఖరి ఆదాము, మరణము నుండి మూడవ వనములో తిరిగి లేచాడు – సమాధి వనము నుండి.

"మనష్యుని ద్వారా మరణము వచ్చెను, గనుక మనష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదాము నందు అందరు ఎలాగు మృతి పొందుచున్నారో, అలాగుననే క్రీస్తు నందు అందరు బ్రతికింప బడుదురు" (I కోరిందీయులకు 15:21-22).

అక్కడ పాపమూ రక్షణ గూర్చిన సిద్దంతము చూస్తారు, మూడు వనముల రూపములో – పాపపు వనము, శ్రమల వనము, నూతన జీవిత వనము!

ఇది అందమైన నిజ వేదాంతము. నీతో దానికేమి పని? నీవు రక్షింప బడకపోతే ఏమీ లేదు. నీవు బ్రతికి చనిపొతావు, నరకానికి పోతావు. బైబిలు నుండి ఇచ్చిన ఈ మాటలు నిన్ను వెంటాడుతాయి, శ్రమ పెడతాయి, నిత్యత్వానికి. అది మీకు జరగకూడదని నా ప్రార్ధన. నీవు యేసు వైపు మరలితే అది నీకు జరగదు, నీ హృదయాలలో ఆయనను విశ్వసించు.

యేసు ఏ గొప్ప పని చేసాడో ఆలోచించు పరలోకము నుండి దిగి శ్రమించినప్పుడు, రక్తము కార్చి పాపమూ నుండి నిన్ను రక్షించడానికి మరణించినప్పుడు. నీ గురించి ఆలోచించడం మాని ఆయనను గూర్చే ఆలోచిస్తావా? నిన్ను నీవు చూసుకోవడం మానేసి యేసు వైపు చూస్తావా? ఆయనను నమ్ముతావా నీ స్వంత మనసును కాక నీ స్వంత భావాలు కాక? పాత పాట వాస్తవమే, "రక్షకుని వైపు చూడ్డానికి వెలుగు ఉంది."

ఓ ప్రాణమా, అలిసి కలవర పడుచున్నవా?
అంధకారంలో వెలుగు చూడ్డం లేదా?
రక్షకుని వైపు చూడ్డానికి వెలుగు ఉంది,
సమృద్ద స్వతంత్ర జీవితం!
యేసు వైపు నీ దృష్టి ఉంచు,
ఆయన అద్భుత ముఖము చూడు;
[మీ భయాలు అనుమానాలు] అంతరించి పోతాయి,
ఆయన మహిమ కృపలవెలుగులో.
("యేసు వైపు దృష్టి సారించు" హెలెన్ హెచ్. లెమ్మెల్ చే, 1863-1961; డాక్టర్ హైమర్స్ చే మార్చ బడినది).

మీరు మాతో మాట్లాడాలనుకుంటే యేసుచే రక్షింపబడడం విషయంలో, మీ కుర్చీ వదిలి ఆవరణము వెనుకకు ఇప్పుడే రండి. డాక్టర్ కాగన్ వేరే గదిలోనికి తీసుకెళ్ళి ప్రార్ధించి మాట్లాడుతారు. డాక్టర్ చాన్, దయచేసి యేసు వైపు చూసి రక్షింపబడునట్లు దయచేసి ప్రార్ధించండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: లూకా 22:39-44.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
      "యేసు వైపు దృష్టి సారించు" (హెలెన్ హెచ్. లెమ్మెల్ చే, 1863-1961; డాక్టర్ హైమర్స్ చే మార్చబడినది).
“Turn Your Eyes Upon Jesus” (by Helen H. Lemmel, 1863-1961;
altered by the Pastor).



ద అవుట్ లైన్ ఆఫ్

మూడు వనములు కథ చెప్తున్నాయి

THREE GARDENS TELL THE STORY

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మనష్యుని ద్వారా మరణము వచ్చును, కనుక మనషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదాము నందు అందరు ఎలాగు మృతి పొందుచున్నారో, అలాగుననే క్రీస్తు నందు అందరు బ్రతికింపబడుదురు"
 (I కోరిందీయులకు 15:21-22).

I.    మొదటిది, మనము కొద్ది నిముషాలు ఏదేను వనమును గూర్చి ఆలోచిద్దాం, ఆదికాండము 2:8, 17; రోమా 5:12; 8:7; I కోరిందీయులకు 2:14;
ఎఫేస్సీయులకు 2:5.

II.   రెండవది, గెత్సమనే వనమును గూర్చి మనం ఆలోచిద్దాం, మార్కు 14:33, 34;
 లూకా 22:42; హేబ్రీయులకు 12:2; యెషయా 53:10, 6; లూకా 22:44;
I కోరిందీయులకు 15:3; కొలస్సయులకు 1:20.

III.  మూడవది, రక్షకుని సమాధిని కలిగిన వనమును గూర్చి ఆలోచిస్తూ ముగిద్దాం, యోహాను 19:40-42; మత్తయి 28:5-6, 9; రోమా 4:25; I కోరిందీయులకు 15:45.