ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నీ స్వంత రక్షణYOUR OWN SALVATION డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "మీ సొంత రక్షణ" (ఫిలిప్పీయులకు 2:12). |
గత రాత్రి ఫిలిప్పీ 2:12-13 పై శనివారము సాయంత్రము ప్రార్ధన కూటములో ప్రసంగము బోధించాను. చాలా మట్టుకు మీరందరూ హాజరయ్యారు, మీరు లేకపోతె డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రియల్ కన్వర్షన్.కామ్ www.realconversion.com. వెబ్ సైట్ లో మాన్యు స్క్రిప్టు చదవచ్చు. గత రాత్రి ప్రసంగములో సి. హెచ్. స్పర్జన్ గారి ప్రసంగములోని కొన్ని వాక్యాలు చెప్పాను. ఆయన ప్రసంగము రెండు వచనాలు ప్రస్తావించ లేదు, కాని "మీ సొంత రక్షణను" గూర్చి చెప్పబడింది. ఆ రెండు వచనాల వివరణ ఇవ్వాలనిపించింది. ఆ ప్రసంగము రాసాక నా మనసు స్పర్జన్ ప్రసంగములొని మూడు మాటలు – "మీ సొంత రక్షణ" వైపు మళ్ళింది. గత రాత్రి నేనిచ్చిన ప్రసంగము చాలా అంశాలు చెప్పింది, కాని ఈ ప్రసంగము, "మీ సొంత రక్షణ"ను గూర్చి మాత్రమే సూచిస్తుంది. ఈ ఉదయము పరిశుద్దాత్మ "మీ సొంత రక్షణ" లోని ప్రాముఖ్యతను చూచునట్లు సహాయము చేయును గాక. ఇది సామాన్య శీర్షిక, కాని చాలా ప్రాముఖ్య మైనది – అన్నింటిలో అతి ప్రధాన అంశము! దేవుని ఆత్మ మిమ్మును గూర్చిన సత్యము తెలుపును గాక. మిమ్మును గూర్చి తప్ప ఎవ్వరిని గూర్చి తలంచవచ్చు. ఈ ఉదయము "మీ సొంత రక్షణను" గూర్చి మాత్రమే ఆలోచించాలని నా ప్రార్ధన. I. మొదటిది, "రక్షణ" అను పదాన్ని గూర్చి మీరు ఆలోచించాలని నా ఆశ. గ్రీకు పదము "రక్షణ" కు "సోటేరియా" అని అనువదింపబడింది. దాని అర్ధము "విడుదల" మరియు "భద్రత" (జార్జిరికర్ బెర్రీ). మనం ప్రత్రి ఒక్కరికి అది చాల అవసరం. మనమంతా పాపులం. మన ఆదిమ తల్లిదండ్రుల నుండి మన పాపపు స్వభావము సంక్రమించింది. వ్యక్తీ గతంగా అందరం పాపం చేసాం. ఒక చైనా అబ్బాయి పాపం చేయడం అంటే ఏంటి అని అడిగాడు. నేను అన్నాను, "దాని అర్ధం నీ తల్లికి తెలియకుండా నువ్వు చేయ్యలనుకున్నది." స్వాభావికంగా మనం పాపులం, వ్యక్తిగతంగా పాపం చేసాము. "రక్షణ" అంటే గత పాపపు నేరారోపణ నుండి విడుదల. దేవుని న్యాయ శాస్త్రాన్ని ఉల్లంఘించావు. నీవు నేరారోపణ సిగ్గు కలిగి ఉన్నావు. ఆ పాప ఆరోపణ నుండి రక్షణ నిన్ను విడుదల చేస్తుంది. రక్షణలో, నీ పాపాలు కప్పబడి, క్రీస్తు రక్తముచే కడుగబడతాయి. నీవు చేసిన పాపాలకు క్షమింప బడతావు. నీ దుష్టత్వ మంతటి నుండి కడగబడతావు. గొప్ప భయంకర తీర్పరి, దేవునికి అంగీకారుడవవుతావు. రక్షణ అంటే దాని కంటే ఎక్కువ. సహజంగా చెడును ప్రేమిస్తావు. పాపానికి బానిసపు. రక్షణ వచ్చినప్పుడు పాపపు అదికారము నుండి విడుదల అవుతావు. రక్షణలో రెండవ విషయము దుష్టత్వ బానిసత్వము నుండి విడుదలవుతావు. కామము ద్వారా లోకంలో ఉండే అవినీతిని తప్పించు కున్నవా? క్రీస్తు నిన్ను విడుదల చేస్తాడు! రక్షణ అంటే దేవుని ఉగ్రత నుండి విడుదల, నీ పాపము పై ఆయన కోపము నుండి. రక్షణ అంటే దేవుని కోపము నుండి రక్షింపబడ్డావని. చాలా మంది పాపాన్ని బట్టి దేవుడు వారిపై కోపంగా ఉన్నాడని గ్రహించరు. అది దేనిని మార్చలేదు. ఆధునిక ఆలోచన ఏమంటుందంటే, "అది నీకు సత్యము, నాకు కాదు." అలా ఈనాడు చాలా మంది యవనస్తులు అనుకుంటున్నారు. అలా అనుకుంటే నువ్వు బుద్ధి హీనుడవు! "అది నీకు సత్యము, నాకు కాదు." అది అవివేకి మాట! సత్యము విషయములో బైబిలు ఆఖరి తీర్పరి. బైబిలు చెప్తుంది, "ప్రతి రోజు దేవుని కోపము దుష్టునిపై ఉన్నది" (కీర్తనలు 7:11). అది సత్యపు మాట. నువ్వు నమ్మినా నమ్మకున్నా అది వాస్తవము. "నీకు కేన్సర్ ఉంది" అని, వైద్యుడు చెప్తే ఏమంటావు? అది సమంజసమా నువ్వు అంటే, "అది నీకు సత్యము, నాకు కాదు"? అలా చేసే వాళ్ళున్నారు! "తిరస్కృతి" లో వారున్నారని మనస్తత్వ వేత్తలు అంటారు. అంటే నిజాన్ని కూడా నిరాకరిస్తారు. నీ పాపాన్ని బట్టి దేవుడు నీ మీద కోపంగా లేదని నీవనుకుంటే, నీవు తిరస్కరించే స్థితిలో ఉన్నావు. నువ్వు ఎంత కాదన్నా, అది వాస్తవమే, "దేవుడు ప్రతి రోజు [నీపై] కోపంగా ఉన్నాడు." అది నిజం నువ్వు అవునన్నా కాదన్న. నమ్మినా నమ్మకున్నా అది వాస్తవము. చంద్రునిలోనికి వెళ్ళినప్పుడు మానవుడు ఏమన్నాడో నాకు గుర్తుంది. అది నమ్మని వారున్నారని మీకు తెలుసా? వాళ్ళున్నారు, "చంద్ర మండలం మీద నడిచిన ఫోటోలు స్టుడియోలో తీసినవి. చంద్రునిలా కనబడేటట్టు అమర్చారు, కాని అది సినిమా సెట్టింగ్." నేను కొంతకాలం ఆ విని ఉండకపోతే, కానీ నేను కొన్ని గింజ అక్కడ భావించేది ఎవరు ఇప్పటికీ ఉంది చెప్పగలను. కానీ "గింజ" ఏమి అంటుందో పట్టింపు లేదు! కొంత సేపు నమ్మినా, నమ్మకున్నా మానవుడు చంద్రుని పై నడిచాడు "అతనికి" అది నిజమైన కాకపోయినా! అలా పాపం విషయంలో దేవుని ఉగ్రత, కోపము విషయం కూడా. నువ్వు నమ్మినా కాకున్నా అది వాస్తవము ! మనస్తత్వవేత్త డాక్టర్ కార్ల్ మెనింగర్ అన్నాడు చాలా ఆధునాతన భావోద్రేగా సమస్యలు పాపమూ పట్ల ఆత్రుత కారణంగా వస్తున్నాయన్నారు (కార్ల్ మెనింగర్ యం. డి., ఆడినా పాపమును బట్టే?, హొతొర్న్ బుక్స్, 1973). అదే చాలా మందితో నిరుత్సాహానికి కారణం వారిపై చేస్తుంది. వారి మనస్సాక్షి మద్యపానము మత్తు పదార్ధాలు. వారి భావాల పాప నేరాన్ని వారికి తెలియజేయండి. దానిని వారి మనస్సు తిరస్కరిస్తుంది, వారి మనస్సాక్షి మద్యపానము, మత్తు పదార్ధాలు, ఆత్మహత్యల వైపు నడిపిస్తుంది. మీకు తెలుసా యవనస్తుల చావుకు ఆత్మహత్య ప్రధమ కారణమని? మొదటి కారణము! వాళ్ళే అంటారు, "అది మీకు వాస్తవము, మాకు కాదు" – ఆ యవనస్తులె ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటారు. లక్షలాది మంది ఇతరులు రోజులు గడిచేలా చూసుకుంటున్నారు. ఎలా బ్రతకాలో వారికీ తెలియదు! ఎలా ఆనందంగా ఉండాలో తెలియదు! బైబిలు చెప్తుంది, "విశ్వాస ఘాతకుల మార్గము కష్టము" (సామెతలు 13:15). పాపంలో జీవించడం చాలా కష్టం. అతి క్రమకారులుగా ఉండడం కష్టం! నాకు క్రీస్తు అక్కరలేదు అన్న ఒక స్త్రీ నాకు తెలుసు. ఆమె కాదు! తను మంచి వ్యక్తీనని క్షమించడానికి క్రీస్తు అవసరం లేదని చెప్పింది. కొంత సేపటికి గ్లాసు నిండా విషం తాగింది. వాళ్ళు కనుగొనే ముందు చేతుల మీద మోకాళ్ళ మీద పాకింది. ఆసుపత్రికి వెళ్తూ దారిలో చనిపోయింది. పాప నేరారోపణతో జీవించిందని విన్నాను, దానిని తిరస్కరించింది. బైబిలు చెప్తుంది, "దుష్టులకు నెమ్మది ఉండదని, నా దేవుడు, సెలవిచ్చుచున్నాడు" (యెషయా 57:12). నువ్వనొచ్చు, "అలాంటిది జరగదని." అంత ఖచ్చితంగా ఉండొచ్చు! జీవితం దీర్ఘకాలం, కష్టతరం, భయంకర స్థితులు ఉంటాయి. యవనస్తుడు ఫిలిప్ సీమర్ హాప్ మెన్ గురుంచి విన్నారా? ఆస్కార్ గెలిచాడు. అంతా ఉంది! కొన్ని రోజులు క్రితం భాత్ రూంలో తనను కనుగొన్నారు, సూది చేతికి గుచ్చబడి. వందల హెరాయిన్ పోట్లాలతో తన గది నింపబడింది! నేరారోపణ నిరాశను అడ్డుకుందా మనుకున్నట్టున్నాడు! ఎంత విషాదము! తరువాత, కూడా, రక్షణ భవిష్యత్తులో దేవుని తీర్పు నుండి మనలను విడిపిస్తుంది. బైబిలు చెప్తుంది ఒక రోజు వస్తుంది. ఒక స్థలంలో "ప్రభువు దినము" అని వ్రాయబడింది. ఇతర స్థలాలలో "ఆదినము" లేక "పగ తీర్చే దినము." అపోస్తలుడైన పౌలు అన్నాడు "అది నాన్న దేవుడు ప్రపంచానికి తీర్పు తీరుస్తాడు" (అపోస్తలుల కార్యములు 17:31). అపోస్తలుడైన పేతురు అన్నాడు "తీర్పు దినము" (II పేతురు 2:9). ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడు బిల్లీ గ్రెహమ్ తన కూటాలలో 1949 ఈ ప్రకటన చేసాడు, లాస్ ఎంజిలాస్ లో, వాషింగ్టన్ కొండ వీధులలో. అన్నిసార్లు తనతో ఏకీభవించను, కాని ఈ ప్రకటన పూర్తిగా వాస్తవము. దేవుడు అన్నాడు, "ఒక దినము ఏర్పాటు చేసాను." ప్రపంచ మంతటికీ ఆయన ప్రకటించాడు...ప్రపంచంలో అవిస్వసులందరూ ఆ దినాన్న తీర్పు తీర్చబడతారు... "ఒక దినం ఏర్పాటు చేసాను ప్రపంచానికి తీర్పు తీరుస్తాడు యేసు క్రీస్తుతో మీరు ఏమి చేసారో." ఈ రాత్రి దేవుని మాటలివి (Billy Graham, Revival in Our Time, Van Kampen Press, 1950, page 159). గ్రేహం గారు 65 సంవత్సరాల క్రితం చెప్పారు. అది జరగదని అర్ధమా? కాదు! అంటే మనం తీర్పు దినానికి 65 సంవత్సరాలు దగ్గరలో ఉన్నాం! రక్షణ మాత్రమే ఆ దినాన దేవుని తీర్పు నుండి రక్షిస్తుంది. ఆ భయంకర దినాన సజీవంగా అగ్ని ఉండములో పడ వేయకుండా క్రీస్తులోని రక్షణే నిన్ను తప్పిస్తుంది! నీకు రక్షణ చాలా అవసరం అని నువ్వను కోకపోవచ్చు – కాని దేవుడనుకుంటాడు! నీ రక్షణ నీకు చాలా అవసరమని యేసును నిన్ను రక్షించడానికి పంపాడని ఆయన అనుకుంటాడు! యేసు తలంచాడు నీ రక్షణ చాలా అవసరమని ఆయన శ్రమపడి నిన్ను రక్షించడానికి సిలువపై మరణించాడని! బైబిలు చెప్తుంది, "పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చెను" (I తిమోతి 1:15). పరిశుద్దాత్మ తలస్తున్ది నీకు రక్షణ చాలా అవసరమని నీ పక్షంగా ఎప్పుడు పని చేస్తాడని. అలా పరిశుద్ద త్రిత్వము అనుకుంటుంది రక్షణ నీకు చాలా ప్రాముఖ్యము. మీ కాపరిగా, నేననుకుంటాను రక్షణ మీకు చాలా ప్రాముఖ్యమైనది నేను మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను! బైబిలులో ఇతర విషయాలు సులభంగా చెప్పవచ్చు. మీ రక్షణ నేను పట్టించుకున్నాను అందుకే క్రీస్తు రక్షణ మార్చిన అవసరత బోదింప బలవంత పెట్టబడుచున్నాను. సంఘము కూడా మీ పట్ల శ్రద్ధ కలిగి ఉంది మా వారు మీరు రక్షింపబడాలని ప్రార్ధిస్తారు. వారి వ్యక్తిగత ప్రార్ధనలలోను, మూడు ప్రార్ధనా కూటాలల్లో, దీర్ఘంగా ప్రార్ధిస్తారు, పట్టుదలతో మీరు రక్షింపబడాలని! దెయ్యము దుష్టు శక్తులు అనుకుంటాయి మీకు రక్షణ అవసరమని దానిని వ్యతిరేకంగా రక్షింపబడకుండా పనిచేస్తూ ఉంటాయి! నరకంలో నశించు ఆత్మలకు కూడా తెలుసు రక్షణ ప్రాముఖ్యత! ధనవంతుడు చనిపోయిన నరకానికి వెళ్లి తన ఐదుగురు సహోదరులను హెచ్చరించడానికి లజరును పంపమంటాడు, "వారు ఈ వేదన కరమైన స్థలమునకు రాకుండునట్లు" (లూకా 16:28). ఆశీర్వాద త్రిత్వము, సంఘ ప్రజలు, దెయ్యము దుష్టులు, నరకంలో నశించిన ఆత్మలు, అందరికి తెలుసు నీ రక్షణ అద్భుతంగా అవసరమని! నీవు లేచి క్రీస్తు యేసు నందలి రక్షణ అవసరత చూడాలి! II. రెండవది, "నీ స్వంత" రక్షణ ను గూర్చి మీరు ఆలోచించాలని నేనాశ పడుతున్నాను. పాఠ్య భాగము "నీ సొంత రక్షణ" గూర్చి చెప్తుంది. ఇప్పుడు మీ "సొంత రక్షణను" గూర్చి ఆలోచించాలని కోరుతున్నాను. "మీ సొంత" పదాలు గ్రీకు పదం – "హియటిక్" గా అనువదింపబడ్డాయి – ఎవ్వరు కాదు, "మీ సొంత రక్షణ! ఇప్పుడు ఆలోచించండి నీవు రక్షింపబడడం ఎంత ప్రాముఖ్యమో! నీ సొంత రక్షణ గూర్చి ఆలోచించు – వేరే ఏమీ కాదు – ఈ ఉదయాన్న! జైలరు అన్నాడు, "రక్షింపబడుటకు నేనేమి చెయ్యాలి?" (అపోస్తలుల కార్యములు 16:30). అదే నీవు ఆలోచించాలి – "రక్షింప బడుటకు నేనేమి చెయ్యాలి?" నీ కొరకు ఏ ఒక్కరు క్రీస్తు రక్తములొ కడుగ బడలేదు. నీవు కడుగ బడాలి! నీవు పశ్చాత్తాపపడాలి! నీవు యేసును నమ్మాలి! నీవు రక్షకుని నమ్మకపోతే, నీవు నిత్వత్వములో నశించి పోతావు! సత్యము ఆలోచించు నువ్వు వ్యక్తిగతంగా చనిపోవాలి. స్నేహితుడో బంధువో చనిపోతాడనుకోకూడదు. మరణపు ద్వారం ద్వారా నేనే వెళ్ళాలి. నువ్వు కూడా అంతే! నీవు చనిపోయినప్పుడు ఆదరింపబడి, ఆనందంగా ఉంటావు లేక భయకంపితుడవై వేదింపబడతావు. నీవు చూస్తావు "సుందరుడైన రాజు" (యెషయా 33:17); లేక చూస్తావు "నిత్య నరకంలో ఉంటావు" (యెషయా 33:14). నిజ క్రైస్తవునికి వ్యక్తిగత పరలోకం ఉంటుంది. "నీ సొంత రక్షణ" అనుభవించినప్పుడే అక్కడికి వెళ్ళగలవు. వ్యక్తిగత నరకము ఉంది – నీవు రక్షణను అనుభవించక పొతే నువ్వు అక్కడికి వెళ్తావు – వేరే వాళ్ళు కాదు. నీవు ఎలా అగ్ని గుండము తప్పించుకుంటావు – నీవు క్రీస్తు యేసుచే నీకు ఇవ్వబడిన రక్షణ నిరాకరిస్తే? పాత పాట అంటుంది, "నా సోదరుడు కాదు, సోదరి కాదు, నేను, ఓ ప్రభూ, నిలుస్తాను ప్రార్ధనా వసరములో!" కొంత మంది "కృపా నిబందన" వెనుక దాక్కుంటారు. వాళ్ళు నమ్ముతారు క్రైస్తవ కుటుంబం నుండి వస్తే తప్పక రక్షింపబడతారని. వాళ్ళు నమ్మవచ్చు కాని నేను కాదు! నిజం, క్రైస్తవ ఇంటిలో జన్మిస్తే ఎక్కువ కృప ఉంటుంది. ఎక్కువ ప్రసంగాలు వింటారు. ఎక్కువ బైబిలు చదువుతాడు. అతని కోసం ఎక్కువ మంది ప్రార్ధిస్తారు, మొదలైనవి. కాని ఎవ్వరు రక్షింప బడలేదు "కృపా నిబందనలో" ఉన్నాడు కాబట్టి. క్రైస్తవులకు అలాంటి నిబంధనలో ఉనికిలో లేదు. అది "మార్పిడి వేదాంతానికి" ఫలితము – అది చెప్తుంది ఇశ్రాయేలును గుడి బర్తీ చేస్తుందని. ఇది దుష్టు సిద్దాంతము అది ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తిరిగి సేమైడ్ వ్యతిరేకులవడానికి కారణమవుతుంది. హీడెల్ బర్గు కేటే కిస్మాస్ చెప్తుంది "కృపా నిబంధన" ఇదే అని: "...బాప్మిస్మము ద్వారా, నిబంధన గుర్తు, పిల్లలు క్రైస్తవ గుడిలోనికి రాబడాలి వారు అవిశ్వాసుల పిల్లలకు వేర్పటై ఉండాలి. ఇది పాత నిబంధనలో సున్నిత ద్వారా చేయబడింది, నూతన నిబంధనలో బాప్మిస్మము బదులైంది" (హీడెల్ బర్గు కేటే కిస్మాస్, ప్రశ్న 74). ఏ లేఖనాలు "బదులు" తలంపును సమర్ధింప లేదు. భప్మిస్మము సున్నతికి బదులు అని చెప్పలేదు. చిన్న పిల్లలు "కృపా నిబంధనలో" భాగస్థులు కనుక బాప్మిస్మమివ్వలని చెప్పబడలేదు. నిజ బాప్టిస్టు ఈ బోధ అంగీకరించాడు. చారిత్రకంగా "విశ్వాసి బాప్తిస్మము" సిద్ధాంతాన్ని నమ్ముతారు. కాబట్టి, నిలకడ గల బాప్టిస్టు "కృపా నిబంధన"ను నమ్మలేదు. బాప్మిస్మము ముందు రక్షింపబడాలి! "ఇంటి బాప్మిస్మాలు" అపోస్తలుల కార్యములో మారిన ప్రతి వ్యక్తీపై ఆధారపడేవి – అదే గొప్ప ఉజ్జేవము సమయంలో జరిగింది – అపోస్తలుల కార్యములలో వలె. ఇంకో వైపు, నాకు తెలిసిన భయంకర దుష్టులు క్రైస్తవ గృహాల నుండి వచ్చారు! ఇంకో వైపు, మన పరిచారకులలో ఏ ఒక్కడు కూడా క్రైస్తవ గృహం నుండి రాలేదు. డాక్టర్ చాన్ గాని, డాక్టర్ కాగన్ గాని, నేను గాని. యేసు నందలి వ్యక్తిగత విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాం, "కృపా నిబంధన" బట్టి కాదు. మీరు "కృపా నిబంధన" వెనుక దాక్కోకూడదు నిర్దేశ గమ్యమా వెనుక దాక్కోన్నట్టు. మీ తల్లిదండ్రులో, దేవుడో, "మీ సొంత రక్షణ" విషయం బాద్యత వహించాలి అనుకోకూడదు. నికొదెము పాత నిబంధనలో ఉన్నాడు. కాని యేసు అన్నాడు, "నీవు తిరిగి జన్మించ వలెను" (యోహాను 3:7). నాకు తెలుసు అది "ఎక్కువైనా" కెవ్వినిస్టులను తృప్తి పరచాడు, గాని దేవుని వాక్యము సత్యము, "బదులు వేదాంతము" కు సరి పోకపోయినా. (రక్షణ) విషయములో సంస్కరింపబడ్డాను, కాని బదులు వేదాంతము వెంబడించాలని ఎవ్వరు కోరకూడదు! నేను అలా చెయ్యను! నేను సిగ్గులేని "కచ్చిత వ్యక్తిని" ఇశ్రాయేలు సంఘము విషయంలో. దేవుడు యూదులతో భూ సంబంధ నిబంధన కలిగి యున్నాడు. క్రైస్తవులు "నూతన నిబంధన"లో క్రీస్తులో విశ్వాసము ద్వారా తీర్చబడ్డారు! నీవు క్రైస్తవ కుటుంబం నుండి వస్తే, "నీ సొంత రక్షణ" కొరకు క్రీస్తును వెదకాలి. నువ్వు యేసును నమ్మకపోతే, నీ కుటుంబము నుండి ఎప్పటికి వేరు చేయబడతావని భయపడాలి! నీవు రక్షింపబడని కుటుంబం నుండి వచ్చి ఉండొచ్చు. అలా అయితే, వాళ్ళను నరకాగ్నిలోనికి వెంబడించ వద్దు! "నీ సొంత రక్షణ" కొరకు యేసును నమ్మాలి. నీ సొంత రక్షణను మర్చి పోవచ్చు ఇతరులను గూర్చి ఆలోచిస్తూ. నీకు తెలిసిన ఒకరు ఈ సంఘ సభ్యుడు, నిజంగా నశించాడని, తెలుసా? అయి ఉండవచ్చు – నీకు అది ఎలా సహాయ పడుతుంది? నువ్వు వాళ్ళను మరచి "నీ సొంత రక్షణ" గూర్చి ఆలోచించాలి. భూమిపై సమస్తము పరలోకంలో సమస్తము, నరకంలో సమస్తము, దేవుడు కూడా, అన్నిటికి పైగా "నీ సొంత రక్షణ" ను గూర్చి పిలుస్తున్నాయి! ఓ, నా స్నేహితుడా, తీర్పు తీర్చుకో! నీవు రక్షింపబడ్డావా? కాకపొతే, జీవితంలో అన్నిటి కంటే ఎక్కువగా క్రీస్తును వెదుకు! నీ స్వంత పిలుపు ఎన్నిక కచ్చిత పరచుకో! ప్రతి ఒక్కరిని ఈ ఉదయాన్న హృదయ మంతటిలో క్రీస్తును వెదకాలని బ్రతిమాలుతున్నను. అవిశ్వాసములో నిద్ర పోవద్దు. స్వంత తలంపుల నుండి అబద్ద నిరీక్షణ నుండి మరలండి! నీ పాపపు వేల చెల్లించడానికి సిలువపై యేసు మరణించాడు. నీలాంటి పాపికి బదులుగా ఆయన చనిపోయాడు! పశ్చాత్తాప పడి, యేసు వైపు నీ జీవితాన్ని తిప్పుకో, ఆయన నిన్ను రక్షిస్తాడు! అప్పుడు మాత్రమే ధైర్యంగా ఇలా పాడగలవు, నాకు సర్వస్వమైన స్నేహితుడ్ని కనుగొన్నాను, ప్రియ స్నేహితుడా, "నీ సొంత రక్షణను" గూర్చి మాతో మాట్లాడాలనుకుంటే, మీ కుర్చీ వదిలి ఆవరణము వెనుకకు రండి. జాన్ సామ్యుల్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి ప్రార్ధించి ప్రశ్నలకు జవాబిస్తారు. నిజ క్రైస్తవు డవాలని ఆసక్తి ఉంటె ఇప్పుడే ఆవరణము వెనుకకు వెళ్ళండి. డాక్టర్ చాన్, దయచేసి యేసు ద్వారా పాపమూ నుండి రక్షింపబడునట్లు ప్రార్ధించండి. ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: పిలిప్పీయులకు 2:9-13. |
ద అవుట్ లైన్ ఆఫ్ YOUR OWN SALVATION డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "నీ స్వంత రక్షణ" (పిలిప్పీయులకు 2:12). I. మొదటిది, "రక్షణ" అను పదాన్ని గూర్చి మీరు ఆలోచించాలని నా ఆశ,
II. రెండవది, "నీ స్వంత" రక్షణ ను గూర్చి మీరు ఆలోచించాలని నేనాశ |