ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
తిరుగుబాటు చేసే ప్రజలకు బోధించుటPREACHING TO A REBELLIOUS PEOPLE డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "ఆయన నాతో ఇట్లనెను, నర పుత్రుడా, నా మీద తిరుగు బాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను: వారుణి వారు పితురులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై యున్నారు. వారు అవమానకరమైన పిల్లలు మరియు కఠిన హృదయులై యున్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు, గనుక వారు విననను, వినక పోయినను, (తమ మధ్య ప్రవక్త యున్నాడని వారు తెలుసు కొనునట్లు,) ప్రభువగు యోహావా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికీ ప్రకటింపవలెను" (యోహేజ్కేలు 2:3-5). |
మళ్ళీ మళ్ళీ మనం బైబిలులో చూస్తాం తిరుగుబాటు చేసే మానవాళి పట్ల ఆశ్చర్యపరిచే దేవుని ఓర్పు. జల ప్రళయం ముందు దేవుడు మనవ జాతి భయంకర దుష్టత్వము చూసాడు. అయినను దేవుడు తన తీర్పును 120 సంవత్సరాలు ఆపాడు - కనుక నోవాహు, "నీతిని గూర్చిన బోధకుడు," వారిని హెచ్చరించాడు (II పేతురు 2:5). తరువాత దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను సూచక క్రియలతో ఆశ్చర్య కార్యములతో విడిపించాడు. కాని వారు ఆయన కనికారానికి బదులు 40 సంవత్సరాలు మోషేపై సణిగి తిరుగుబాటు చేసారు. మళ్ళీ, వారి పాపాన్ని బట్టి తన ప్రజలను బందీలుగా బబులోనుకు పంపినప్పుడు, దేవుడు వారిని విడిచి పెట్టలేదు. ఆయన ప్రవక్త యేహెజ్కేలును వారికి బోధించడానికి పంపాడు, "ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు" (యేహెజ్కేలు 2:4). ఈ రోజు మనం యుగాంతంలో దేవుని తీర్పుకు సమీపంగా ఉన్నాము. ప్రపంచ దేశాలు హింసాత్మక తిరుగుబాటులో ఉన్నారు "ప్రభువుకు వ్యతిరేకంగా, అభిషిక్తినికి వ్యతిరేకంగా, చెప్తున్నారు, మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పార వేయుదము రండి" (కీర్తనలు 2:2, 3). అయినను దేవుడు ఇంకా బోధకులను పంపిస్తున్నాడు వారిని హెచ్చరించడానికి "రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుడి" (మత్తయి 3:7). అవును, ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా, యుగాంతంలో, దేవుడు ఇంకా రాబోవు తీర్పును గూర్చి పాపులను హెచ్చరించడానికి బోధకులను పంపిస్తున్నాడు. కనుక, నమ్మకస్తుడైన బోధకుడు చాలా గుణపాఠాలు ప్రవక్త యేహెజ్కేలు నుండి నేర్చుకోవచ్చు. ఈ ప్రసంగములో కొన్ని మీకు తెలియచేసాను. I. మొదటిది, నమ్మకమైన బోధకుడు ప్రవక్త నుండి తిరుగుబాటు ప్రజలతో మాట్లాడడానికి పంపబడ్డాడని నేర్చుకుంటాడు. మన పాఠ్య భాగము చెప్తుంది, "నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను: వారుణి వారు పితురులను నేటి వరకు, నా మీద తిరుగుబాటు చేసిన వారు" (యేహెజ్కేలు 2:3). బబులోనులో బందీలైన యూదులు మాత్రమే తిరుగుబాటు దేశమని అనుకోకూడదు. తప్పకుండా అలా అనుకోకూడదు! పదము "దేశము" మన పాఠ్యములో హెబ్రీ పదము కాదు దేవునిచే ఎన్నుకోబడిన జనమును గూర్చినది. ఇక్కడ హెబ్రీ పదము "గోయి." అన్యులను వివరించడానికి, యూదులు ఉపయోగించేది, అన్య జనాంగము. దాని అర్ధము బబులొను లోని అన్యుల వలే ఇశ్రాయేలీయులు కూడా సమానముగా చెడ్డవారే! మానవాళిని గూర్చిన ఎంత విచిత్ర చిత్ర పాఠమిది! మనం తిరుగుబాటు జాతివారం! ఏ జాతి? మనవ జాతి! దేవుడు అంటున్నాడు మనం తిరుగుబాటు ప్రజలం, "నామీద తిరుగుబాటు చేసిన తిరుగుబాటు జనాంగము" (యేహెజ్కేలు 2:3). బైబిలు చెప్తుంది, "మనమంతా గొర్రెలవలే త్రోవ తప్పి పోతిమి" (యెషయా 53:6). బైబిలు చెప్తుంది, "ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు" (ఇర్శియా 5:23). సకల మానవాళి తప్పిపోయి, దేవునిపై తిరుగుబాటు చేసి ద్రోహము చేయుచున్నారు! బైబిలు చెప్తుంది, "అందరును త్రోవ తప్పి, మేకముగా పనికి మాలిన వారైరి; మేలు చేయు వాడు లేడు, లేడు, ఒక్కడైనను లేడు" (రోమా 3:12). బైబిలు చెప్తుంది, "ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరి" (రోమా 5:19). ఆదాము దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు. మానవాళి అంతా సహజంగా దేవునిపై తిరుగుబాటును సంక్రమించుకుంది. మనము "స్వభావ సిద్ధంగా ఉగ్రతకు పాత్రులమైతిమి" (ఎఫెసీయులకు 2:3). బైబిలు అంటుంది, "అలాగైన ఏమందుము? మేము వారి కంటే శ్రేష్టులామా? కాదు, తక్కువ వారమా ఎంత మాత్రము కాదు: యూదులేమి గ్రీసు దేశస్తులేమి, అందరును పాపమునకు లోనియున్నారని ఇంతకుముందు దోషారోపణ చేసియున్నాము; ఇందును గూర్చి వ్రాయబడిన దేమనగా, నీతి మంతుడు లేడు, లేడు, ఒక్కడును లేడు: గ్రహించువాడెవాడును లేడు, దేవుని వెతుకు వాడెవాడును లేడు. అందరును త్రోవ తప్పి, మేకముగా పనికి మాలిన వారైరి; మేలు చేయువాడు లేడు, లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి; తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది: వారి నోటి నిండా శపించుట పగయు ఉన్నది: రక్తము చిందించుటకు వారి పాదములు పరుగు లెత్తుచున్నవి: నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి: శాంతి మార్గము వారెరుగరు: వారి కన్నుల ఎదుట దేవుని భయము లేడు" (రోమా 3:9-18). ఇదంతా ఆదాము నుండి మన కొచ్చింది. మన స్వభవములొ దేవునిపై తిరుగుబాటు చేయుట తన ద్వారా సంక్రమించుకున్నాము. డాక్టర్ మార్టిన్ లూయిడ్ జోన్స్ అన్నాడు, పాపములో ఉన్న మానవుని వివరణ సామాన్య సత్యము, భయంకర సత్యము. దానిని పాపమూ తెచ్చింది...పరిశుద్దాత్మ ద్వారా దేవుడు మునుపు ఒప్పింప చెయ్యాలి. ముందు అలా ఒప్పుకోకపోతే స్వాభావికంగా మనమేంటో తెలుసు కోకపోతే – ఉగ్రత పుత్రులు, ఇతరుల వలె (Martyn Lloyd-Jones, M.D., Romans, Chapter 2:1-3:20, The Righteous Judgment of God, The Banner of Truth Trust, 2005 reprint, p. 214). పాపపు మనిషిని గూర్చిన దేవుని లెక్క ఇది. ఇది అందాల చిత్రము కాదు, కాని ఇది వాస్తవము. 17 సంవత్సరాలప్పుడు నేననుకున్నాను ప్రజలు సులభంగా రక్షింపబడతారని. కాని నాది తప్పు. నా మొదటి ప్రసంగము తిరస్కరించబడింది, ఎప్పుడు అలా బోదింప వద్దన్నారు. కాని "యువ నాయకుడు" నాతో చెప్పిన వారు మతి బ్రమించి, గుడిలో పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే వాడు. దేవుడు నాతో అన్నాడు, "అతని మాట వినవద్దు, రాబర్ట్." సేమినరీలో బోధించే అధ్యాపకుడన్నాడు, "నీవు మంచి బోదకుడివే, కాని తొందర తెచ్చేవాడిగా నీకు చెడ్డ పేరు వస్తుంది." ఆయన అలా ఎందుకన్నాడంటే బైబిలును కించ పరచే వారికి నేను జవాబిచ్చే వాడిని. తరువాత శాన్ ప్రాన్సిస్కొ దగ్గర హిప్పీల మద్య బోధించే వ్యక్తితో పని చేసాను. తను నా ప్రసంగాలు విమర్శిస్తూ ఉండేవారు - చివరకు ఆ గుడికి రాజీనామా యిచ్చి లాస్ ఎంజిలాస్ ఇంటికి వచ్చాను. తరువాత నేను కనుగొన్నాను ఈ బోధకుడు గుడిలో చాలా మంది అమ్మాయిలతో లైంగిక సంబంధము కలిగి ఉండేవాడని. అప్పుడు తెలిసింది తను నా ప్రసంగాలు ఎందుకు విమర్శించే వాడో. పాపపు ఒప్పుకోలు అతనికి ఇష్టము లేదు. చాలా బోధకులు సందేశము పొందుకోరు. వాళ్ళు చెప్పేది ఎందుకు వినరని తిరుగులాడుతూ ఉంటారు. జవాబు అక్కడే ఉంది, బైబిలు పేజీలపై. దేవుడు [ఆయన] పై "తిరుగుబాటు చేసిన జనాంగము వద్దకు మనలను పంపుతున్నాడు" (యొహెజ్కెలు 2:3). నేను డాక్టర్ మెక్ గీ తో ఏకీభవిస్తాను ఆవచనము పై. ఆయన అన్నాడు, సంఘ సభ్యులే కఠినమైన వారు సువార్తతో వెళ్ళడానికి...వారు గుడిలోనే ఉన్నప్పటికీ, వారు నిజానికి దేవునికి వ్యతిరేకులు...ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు నశించిన పాపులని చెప్పడం ఇష్టం ఉండదు...వారు కఠినులు, నా హృదయము సువార్త పనిలో ఉన్నవారితో వెళ్తుంది - వారు కష్టతర స్థలములో కూర్చున్నారు. తన పిలుపుకు సేవ తగినదనుకున్న యవనస్థుని నేను ప్రోత్సహిస్తాను. వాళ్ళు సేవకొచ్చేబదులు భీమా అమ్ముకుంటే మేలు. ఈ రోజుల్లో సేవలో ఉండడం అంతా తేలిక కాదు దేవుని వాక్యానికి నీవు నిలబడితే (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1982, volume III, p. 444; note on Ezekiel 2:3-4). డాక్టర్ మెక్ గీ ఏమి వర్ణించాడు? సంఘాలు నశించు ప్రజలతో నిండి పోవడం ఆయన వర్ణించాడు. వాళ్ళంతా ఒక "నిర్ణయం" తీసుకున్నారు – కాని "వాస్తవానికి వారు దేవునికి వ్యతిరేకులు." అమెరికాలో ఉన్న అన్ని గుడులలో అదే పరిస్థితి! ఇప్పుడు ఆ విషయం, వ్యక్తిగతంగా మీకు చెప్తాను. మీరు దేవునిపై తిరుగుబాటు చేసినవారు. అందుకే మీరు రక్షింపబడలేదు. అన్ని సాకులు చెప్తారు, కాని మీ హృదయం దేవునిపై తిరుగుబాటు చేస్తుంది. మిమ్మును గూర్చి విచారిస్తారు, కాని మీ హృదయం పూర్తిగా దేవునిపై తిరుగుబాటు చేస్తుంది. మీ పాపాన్ని బట్టి విలపించలేదు. మీ తిరుగుబాటును బట్టి విచారం లేదు. మీరు, కఠిన ముఖంతో, సజీవుడైన దేవుని నిర్యక్ష్యం చేస్తారు! నేను సూటిగా చెప్తాను మీరు ఎక్కడికి పోతారో. ఒక స్థలముంది వెళ్ళడానికి – అది నరకము! ఒప్పుకోలు లేకపోతే, మీ పాపాలు బట్టి చింతించక పొతే, క్రీస్తును గూర్చిన నిజ అవసరత నీకు అనిపించదు – నీవు తిరుగుబాటు చేస్తూనే ఉంటావు దేవుడు లాగే వరకు – అంతా అంతరించి – ఆరని అగ్నిలో పడవేయ బడతావు! II. రెండవది, నమ్మకమైన బోధకుడు ప్రవక్త నుండి దేవుని వాక్యం బోధించడం కొనసాగించడం నేర్చుకుంటాడు. దేవుడు యోహేజ్కేలుకు చెప్పాడు, "వారు సిగ్గు మాలిన వారును కఠిన హృదయులైయున్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను; వారు తిరుగుబాటు చేయువారు గనుక, ప్రభువగు యెహోవా ఇలాగు చెప్పాడు. వారు, వినినను, వినక పోయినను, ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారికీ ప్రకటింపవలెను..." (యోహేజ్కెలు 2:4-5ఎ). దేవుడు బైబిలు నుండి ఆశ్చర్యరీతిగా నాతో మాట్లాడుతున్నాడు. యోహేజ్కెలు దినాలలో ఆయన నేరుగా అతనితో మాట్లాడాడు, వెనువెంట ప్రత్యక్షతతో. ఇప్పుడు దేవుడు మనతో వ్రాయబడిన వాక్యము ద్వారా, బైబిలు ద్వారా మాట్లాడుతున్నాడు – రెండు సందర్భాలలో కలల ద్వారా స్పష్టంగా నాతో మాట్లాడాడు. ఒక ముస్లిం యవనస్థుని సాక్ష్యము చదివాను మూడు కలల ద్వారా క్రీస్తులొనికి మారాడు (క్రైస్తవ్యము ఈరోజు, జనవరి /ఫిబ్రవరి 2014, పేజీలు 95, 96). దేవుడు తరుచూ ముస్లీము ప్రాంతాలలో, మూడవ ప్రపంచపు దేశాలలో అలా చేస్తాడు. ఎల్లప్పుడూ వ్రాయబడిన వాక్యంతో – బైబిలు ద్వారా దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. ప్రవక్త నుండి, మనం చెప్పడం నేర్చుకుంటాం, "ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు." బైబిలు అధికారం బట్టి మనం అలా చెప్తాం. "లెఖనాలన్ని దైవావేశముచే ఇవ్వబడినవి" (II తిమోతి 3:16). నేను రక్షణ పొందిన రోజునే దేవుడు ఆ సత్యాన్ని చూపించాడు, సెప్టెంబరు 28, 1961. యదార్ధంగా చెప్తున్నాను హెబ్రీ గ్రీకు పదాలనిచ్చిన ఆ దేవుని నేనెప్పుడు అవమానించ లేదు! బోధించడానికి నిలబడినప్పుడు శక్తి గల కంఠంతో మాట్లాడుతాను, ఎందుకంటే నా స్వంత మాటలు బోధించడం లేదు కాబట్టి. నేను దేవుని మాటలను మాత్రమే బోధిస్తున్నాను – "ప్రభువైన దేవుడు ఇలా సెలవిస్తున్నాడు" (యోహేజ్కెలు 2:4). నేను ఒక తీరే చెప్పడం లేదు నీ పాపం నరకానికి తీసుకెళ్తుంది అని చెప్పేటప్పుడు. దేవుని వాక్యం చెప్తున్నా దాన్నే నేను చెప్తున్నాను. పూర్తీ అధికారంతో, ఎలాంటి అనుమను లేకుండా, నేను మీక చెప్పా గలను, "వీరు నిత్య శిక్షకు పోవుదురు" (మత్తయి 25:46). అలా చెప్పకుండా నన్ను ఎవరు ఆపలేరు పూర్తీ సేమినరీ, రాబ్ బెల్, జోయిల్ ఆస్టిన్, రోమా పోవు గాని. నా చేతిలో దేవుని వాక్యము ఉంది. ప్రవక్త యోహేజ్కెలు వలె, మీకు అది ప్రకటించడానికి దేవుడు నన్ను పిలిచాడు – మాటకు మాట! "ప్రభువులు సెలవిస్తున్నాడు" – "వీరు నిత్య శిక్షకు కొనిపొబదుదురు." మీరంటారు, "నేనదినమ్మను"! అది నన్ను ఏమాత్రము మార్చలేదు! ప్రవక్త వలే, నేను బోధించడానికి పిలువబడ్డాను, "వారు విననను, వినక పోయినను" (యోహేజ్కెలు 2:5). ఆధునిక ఆంగ్లములో – "వాళ్ళు విన్నా లేకున్నా." మీరు ఏమి వింటారో దాని గురుండి నేను కూర్చొని ప్రసంగము సిద్ధపడను! నేనెన్నడు అలా చెయ్యను – నేనలా చేయ్యబోను! మీరు ఏది వినాలో నేను దేవునిని అడుగుతాను. బైబిలులో సరియైన వాక్య భాగము కనుగొని, దానిని మీకు బొధిస్తాను. తీసుకున్న వదిలేసినా! వాళ్ళు విన్నా లేకున్నా! "వారు వినినను, వినక పోయినను." ఆమెన్! మీరు పాపులు. మీరు, నశించిన వారు, పాపానికి బానిసలూ. మీరు విడుదల పొందలేరు! మీరు అగ్ని గుండానికి సంసిద్ధులు! నేనదే మీకు చెప్తాను, మీరు వినినను విననప్పటికిని, మీకు నచ్చిన నచ్చక పోయినా, మీరు నమ్మినా నమ్మక పోయినా, ఆచరించినా లేకపోయినా, మీరు నన్ను పొగిడినా లేక శపించినా. ఎందుకు? "వారి మద్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకుందురు" – అందుకే! దేవుడు ఆ విషయాలు చెప్పడానికి నన్ను పంపాడు తద్వారా మీకు సాకు ఉండదు. నా చేతులు శుబ్రము. దేవుడు చెప్పేది మీకు చెప్పేసాను. తీసుకున్న వదిలేసినా. కాని నరకములో మీరు వాదించలేరు ఫిర్యాదు చెయ్యలేరు. మీరు తెలుసుకుంటారు మీ మడి ఒక ప్రవక్త ఉన్నాడని – దేవుని వాక్యము నుండి సత్యము చెప్పిన ఒక వ్యక్తీ. అలా బోధించడానికి మీరు చాలా గట్టి వారై ఉండాలి. తప్ప చూపడం ఎవరికీ ఇష్ట ముండదు. విమర్శింపబడడం చులకనవడం ఎవ్వరికి ఇష్ట ముండదు. నేను భాహటంగా చెప్పాలి భయంకర విమర్శలతో నేను కొట్టుకు పోయాను. కొన్ని సార్లు పాక్కుంటూ పోయి గుహలో ఎలీయాలా వాక్కోవాలని పించేది. కాని "మెల్లని స్వరం" ఎలియాను పిలిచి, చెప్పింది, "ఎలీయా, ఇక్కడేం చేస్తున్నావు?" (I రాజులు 19:12,13). అప్పుడు బయటకొచ్చి, మళ్ళీ బోధింపనారంభించాను. ఆ రోజుల్లో దేవుడు నాతో ఇలా చెప్తునట్టు అనిపించేది, యోహేజ్కేలుకు చెప్పినట్టు, "ఇదిగో, వారి ముఖము నీ ముఖమును కఠిన మైనదిగా నేను చేసెదను, వారి నుమారు వాలేనే నీ నుదురును కఠిన మైనదిగా చేసెదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినంగా ఉండు వజ్రము వలే చేసెదను: వారికీ భయ పడకుము, వారందరూ తిరుగుబాటు చేయు వారైనాను వారిని చూచి జడియకుము" (యోహేజ్కెలు 3:8, 9). ప్రతి నిజ బోధకుడు అలాంటి కఠిన అనుభవాల ద్వారా వెళ్ళాలి. అలా చెయ్యలేకపోతే, అతడు, అబద్ద ప్రవక్త అవుతాడు. III. మూడవది, నమ్మకమైన బోధకుడు ప్రవక్త నుండి, నిరుత్సాహమున్నప్పటికి, కొన్ని ఆత్మలు రక్షింపబడతాయని నేర్చుకుంటాడు. మనం బోధించేలా బోధిస్తే ఈ చెడు సమయములో చాలా నిరుత్సాహలు ఎదుర్కొంటున్నాము. దేవుడు యొహెజ్కెలుతొ అన్నాడు, "ఓయీ, నర పుత్రుడా, వారికూ భయపడకుము, వారి మాటలకూ భయపడకుము, నీవు బ్రహ్మ దండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నవు, తేళ్ళ మద్య నివసించచున్నావు: అయినాను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకూ భయపడకుము. వారు తిరుగుబాటు చేయు వారు, గనుక వారు వినినను, వినకపొయినను: నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియ చేయుము" (యోహేజ్కెలు 2:6-7). ఆయన బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తేళ్ళ మద్య నివసించునప్పటికిని, తన పరిశుద్ధ పని నుండి నిజ బోధకుని ఏదియు కదిలింపకూడదు. అవును, దేవుని వాక్యం ప్రకటించడం నిజంగా ఒక పరిశుద్ధ పని. కొంత మంది ఉంటారు వారి హృదయాలను దేవుడు తెరుస్తాడు మేము బోధించేది వినడానికి తద్వారా రక్షింపబడడానికి (అపోస్తలుల కార్యములు 16:14, 15). దేవుడు యెహొజ్కెలుతొ అన్నాడు అతడు చెప్పింది విన్నా వాడు "తప్పకుండా బ్రతుకుతాడు, ఎందుకంటే ఆయన హెచ్చరింపబడ్డాడు కాబట్టి" (యెహొజ్కెలు 3:21). డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్ లో 1960 ప్రారంభంలో నేను హృదయాన్ని విప్పి బోధించాను. ప్రజలు నాపై అరచి, వస్తువులు నాపై విసిరి, నన్ను పిచ్చోడన్నారు. కాని నల్ల సూటు టై వేసుకున్న పెద్ద మనిషి చాలా రోజులు నా బోధ విని, అతని సుందర అపార్ట్ మెంట్ కు బోజనానికి ఆహ్వానించాడు. ఆయన భార్య అక్కడ ఉన్నారు. మా పాఠశాలలో ఆమె ప్రిన్సిపాల్. ఈ వృద్ధ దంపతులు అద్భుత భోజనం పెట్టి, నేను వీధుల్లో బోదిస్తానని ఆయన ఆమెతో చెప్పాడు. వారు ఫోటో ఆల్బం తెచ్చి ఆయన తండ్రి ఫోటో చూపించినారు, ఆటను పాతకాలపు ప్రెస్బి టేరియన్ పాష్టరు. సాయం సమయమున ఆ వృద్ధుడు చెప్పాడు నేను వీధిలో బోధించే ప్రసంగాలు గూర్చి వారిద్దరూ మాట్లాడుకున్నారని. ఆయనన్నాడు తనను ఇంటికి ఆహ్వానించింది వాళ్ళిద్దరూ రక్షింపబడాలనుకున్నారు కాబట్టి – వారిని క్రీస్తు నొద్దకు నన్ను నడిపించమన్నారు! నాకు 22 సంవత్సరాలు. ఒక వృద్ధుని యేసు నొద్దకు నడిపించలేదు. మోకాళ్ళపై ఉండి, వాళ్ళను యేసు నొద్దకు నడిపించాను. మేము లేచినప్పుడు వాళ్ళు కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారాయి. వారు విల్ షైర్ బ్లిడ్ లో ఉన్న ఇమ్మానుయేలు ప్రెస్బిటేరియన్ సంఘ సభ్యులు., కానీ రక్షింపబడలేదు. అలంటి అనుభవం నశించు ప్రపంచానికి ఏమీ చూపించ లేదు – రక్షకుని దగ్గరకు రావడం ఆనందం! దేవుని ఆ రెండు ఆత్మలు, ఏలన్ బ్లేక్ దంపతులను నాకిచ్చారు. నేను లాస్ ఎంజిలాస్ వీధులలో యవనస్తునిగా బోధించడం ఒక అద్భుత విషయంగా నాకు తోచింది! తరువాత నేను శాన్ ప్రాన్సిస్కొ ఉత్తరనున్న, లిబరల్ బాప్టిస్టు సెమినరికి వెళ్ళాను. అక్కడ గడిపిన మూడు సంవత్సరాలు బహు భయంకరం. అక్కడ ఉండడం అసహ్యమనిపించింది, వాళ్ళు బైబిలు చింపడం వింటూ అక్కడ ఉండడం. దేవుని వాక్యం కొరకు నిలబడ్డాను, నన్ను మతి బ్రమించిన వానిలా చూసారు. ఆఖరి సంవత్సరంలో శృతి మించింది పట్టా బద్రుడనవననుకున్నను. కాని పూర్తీ చేసాను. ఆయన తరువాత, ఆ చెడు కాలం చూస్తె, నేను గ్రహించాను నా సాక్ష్యం ద్వారా ఇద్దరు వ్యక్తులు రక్షింప బడ్డారు. ఒకరు కొరియా వ్యక్తీ, ఇంకొకరు దక్షిణాది వ్యక్తీ, జీవితం అంతా బాప్టిస్టు అయినా రక్షింపబడలేదు. వాళ్ళిద్దరూ బుగ్గలపై కన్నీళ్లు కార్చుకుంటూ నా దగ్గరకు వచ్చారు, రక్షణావాసరత వాళ్ళకు చెప్పినందుకు వందనాలు తెల్పారు. వాళ్ళ పేర్లు గిల్ మరియు మూన్. వాళ్ళను మర్చిపోలేను! వాళ్ళ రక్షణ సేమినరీలో నేను పడ్డ పట్లు ఉపయోగమే అని తెల్పింది! నేను, మేరిన్ కౌంటిలో ఉన్నప్పుడు, గోల్డెన్ గెట్ బ్రిడ్జి నుండి శాన్ ప్రాన్సిస్కొకు కొంత మంది యవనస్తులను ప్రతి శుక్రవారము రాత్రి నడిపించే వాడిని. నేను వీధిలో బోధిస్తే వాళ్ళు కర పత్రాలిచ్చెవారు. ఒక రాత్రి వారు ఒక బాలుడిని నా దగ్గరకు తెచ్చారు. తను నాతో చెప్పాడు, ప్రతి రోజు వందల డాలర్లు, మత్తు పదార్ధాలపై పెడుతున్నారని. ఆ అలవాటు వానిని దొంగగా మార్చింది. అన్నాడు, "బోధకుడు, దయచేసి నాకు సహాయము చెయ్యి. బాగు పడాలనుకుంటున్నాను." నా కారులో ఇంటికి తీసుకెళ్ళాను. ఇప్పుడలా చెయ్యడానికి భయపడతాను, కాని అతనిని నా అపార్టు మెంట్ వంట గదిలో ఉంచాను. తను అరచుకుంటూ చాలా రోజులు నేలపై వాంతులు చేసుకుంటూ మత్తు నుండి బయటపడ్డాడు. చివరకు నేమ్మదయ్యాడు. మా గుడికి వచ్చాడు. శాన్ ప్రాన్సిస్కొ వదిలి పెట్టాక అతనితో పరిచయం పోయింది. ఇరవై ఐదు ఏళ్ళు గడిచాయి. ఒక రాత్రి గుడి ఆఫీసు ఫోన్ మోగింది. అతనే! అక్కడున్నావని అడిగాను. వివాహ అనంతరం ప్లోరిడాలో ఉన్నానన్నాడు. ఇద్దరు పిల్లలున్నారు అతని గుడిలో ఆదివారపు బడి చెప్తున్నాడు. మేఘాలలో నడుచుకుంటూ గుడి నుండి ఇంటికి వచ్చాను! ఓ, పాత సంతోషము ఒక బోధకునికి ఒకరు జీవిస్తున్నప్పుడు "హెచ్చరింపబడ్డాడు కాబట్టి దైవ జనునిచే" (యొహెజ్కెలు 3:21). నీ సంగతేంటి? బోధకునిగా నా కధ చెప్పాను. గత యాబై సంవత్సరాలలో యోహేజ్కెలులోని ఈ రెండు అధ్యాయాలు నాకెంతో అర్ధవంతం, నేను తొలిసారి రేడియోలో ఈ భాగంపై డాక్టర్ జె. వెర్నాన్ మెక్ గీ బోధించడం విన్నాను. ఈ వచనాలు నా మనసులో నిలిచి పోయాయి ఈ దశాబ్దాలన్నీ సువార్త ప్రకటనలో – పాపులకు చెప్పడం యేసు వారి పాపాల కొరకు సిలువపై మరణించాడని; ఆయన ఎలా మ్రుతులలో నుండి లేచాడో, పరలోకంలో ఎలా జీవిస్తున్నాడో; పాపాలు ఒప్పుకొని రక్షకుని విశ్వషించడం. ఈ రాత్రి నీవు యేసును విశ్వసిస్తావా? అలా చేస్తే నాకు చాలా సంతోషం – మీకు కూడా సంతోషమే – అన్ని సమయాలలో నిత్యత్వానికి! యేసు ద్వారా రక్షింపబడాలని మాతో మాట్లాడాలనుకుంటే, దయ చేసి మీ స్థలం వదిలి ఆవరణము వెనుకకు రండి. జాన్ సామ్యుల్ కాగన్ మిమ్ముల్ని వేరే గదికి తీసుకెళ్ళి మాట్లాడి ప్రార్ధిస్తాడు. డాక్టర్ చాన్, ఈ రాత్రి కొందరు యేసు నొద్దకు వచ్చునట్లు ప్రార్ధించండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: యోహేజ్కేలు 2:3-7. |
ద అవుట్ లైన్ ఆఫ్ తిరుగుబాటు చేసే ప్రజలకు బోధించుట డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "ఆయన నాతో ఇట్లనెను, నర పుత్రుడా, నా మీద తిరుగు బాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను: వారుణి వారు పితురులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై యున్నారు. వారు అవమానకరమైన పిల్లలు మరియు కఠిన హృదయులై యున్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు, గనుక వారు విననను, వినక పోయినను, (తమ మధ్య ప్రవక్త యున్నాడని వారు తెలుసు కొనునట్లు,) ప్రభువగు యోహావా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికీ ప్రకటింపవలెను" (యోహేజ్కేలు 2:3-5). (II పేతురు 2:5; కీర్తనలు 2:2, 3; మత్తయి 3:7) I. మొదటిది, నమ్మకమైన బోధకుడు ప్రవక్త నుండి తిరుగుబాటు ప్రజలతో మాట్లాడడానికి పంపబడ్డాడని నేర్చుకుంటాడు, యోహేజ్కేలు 2:3; యెషయా 53:6; ఇర్శియా 5:23; రోమా 3:12; 5:19; ఎఫెసీయులకు 2:3; రోమా 3:9-18. II. రెండవది, నమ్మకమైన బోధకుడు ప్రవక్త నుండి దేవుని వాక్యం బోధించడం కొనసాగించడం నేర్చుకుంటాడు; యోహేజ్కేలు 2:4-5a; II తిమోతి 3:16; మత్తయి 25:46; I రాజులు 19:12, 13; యోహేజ్కేలు 3:8, 9. III. మూడవది, నమ్మకమైన బోధకుడు ప్రవక్త నుండి, నిరుత్సాహము న్నప్పటికి, కొన్ని ఆత్మలు రక్షింపబడతాయని నేర్చుకుంటాడు, యోహేజ్కేలు 2:6-7; అపోస్తలుల కార్యములు 16:14, 15; యోహేజ్కేలు 3:21. |