Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




దేవుడు పాపులను ఎక్కడికి చేర్చుతాడు

WHERE GOD DRAWS SINNERS
(Telugu)

by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జనవరి 12, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, January 12, 2014


నాకు గత వారము ప్రఖ్యాత క్రైస్తవ విశ్వ విద్యాలయములో సంఘ చరిత్ర బోధించే గౌరవనీయ అధ్యాపకుని నుండి ఒక ఈ మెయిల్ వచ్చింది. ఆయన అన్నాడు, "మీ ప్రసంగం వినడంలో ఆనందించాను,సైబర్ స్పేస్ నందు క్రిస్మస్! ’ ఈ మధ్యే, కొత్త పాత కాపీలు [అమెజాన్ నుండి] [మీ పుస్తకంలో] కొన్నాను చనిపోతున్న దేశానికి పురిటాన్ మాట్లాడుట. నేను వాటిని కాపరులకిచ్చి తప్పక చదవమన్నాను."

ఇది గొప్ప మెప్ప నలబై సంవత్సరాలుగా, క్రైస్తవ చరిత్రను, సేవా విద్యార్ధులకు బోధిస్తున్న వ్యక్తీ నుండి!

స్నేహితులారా, ఇది ఒక విశిష్ట వెబ్ సైట్. ఈ ప్రసంగాలు 28 భాషలలో ప్రపంచంలో 170 దేశాలకు వెళ్తాయి. మీకు తెలుసా ప్రపంచంలో ఒక వంతు భాగానికి అమెరికా నుండి ఒక మిస్సనరి కూడా లేదనే సంగతి? వారు 1/3 భాగము ప్రపంచంలో పొందలేరు! కాని అంతర్జాలము అన్ని చోట్లకు వెళ్తుంది – కమ్యునిస్టు చైనా, క్యుభా, ఆఫ్ఘనిస్తాన్, మరియు ఇరాన్ లకు! ఈ ప్రసంగాలు ప్రతి చోటుకు వెళ్తాయి. ఈ సంకుచిత దేశాలలో బోధకులు వాళ్ళ స్వంత భాషల్లోకి నా ప్రసంగాలు ముద్రించి, వాళ్ళ ప్రజలకు బోదిస్తారు. ప్రసంగాలు సిద్ధపడడానికి వారికీ కొన్ని పనిముట్లే ఉన్నాయి. వాళ్ళు నా ప్రసంగాలు ఉపయోహించి ఆశీర్వదింప బడుతున్నారు. మీరు 25 లేక 50 డాలర్లు ప్రతి నెల పంపడం ప్రారంభిస్తారా మరికొన్ని భాషలు జమ చెయ్యడానికి? ఈ ప్రసంగ అనంతరం వినండి, మీరు నెలసరి చందాలు ఎక్కువ భాషలు జమ చెయ్యడానికి ఎలా పంపించాలో వింటారు!

ఇప్పుడు దయచేసి ఇర్శియా 31:3 చూడండి.

"శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు చున్నాను: గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శయా 31:3).

మార్టిన్ లూథర్ రాజు జేమ్స్ బైబిలుతో అంగీకరించాడు హెబ్రీ పదము "మాషక్" అనగా "వెలికితీయడం" లేదా "లాగడం." ఎన్ ఎ ఎస్ వి తర్జుమా కారులు ఈ హెబ్రీ పదాన్ని "లాగడం" గా జేర్మియా 38:13 లో చెప్పబడింది. మనం ఈ విధంగా తర్జుమా చేయవచ్చు:

"నేను నిత్య ప్రేమతో నీ ప్రేమించుచున్నాను: గనుక కృపను తో నేను నిన్ను వైదొలిగాయి" (యిర్మీయా 31:3).

దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన కృప చూపుతున్నాడు!

"ఒకడు మనస్యులను తోడూ (కొని) పొవునట్లుగా, స్నేహ బందములతో నేను వారిని (బంధించి) ఆకర్షించితిని" (హోషేయా 11:4).

ఈ వచనాలు దేవుడు వాగ్దానా దేశానికి ఇశ్రయెలీయులను ఈజిప్టు నుండి ఎలా "రప్పించాడో" తెలియపరుస్తున్నాయి. ఇది పాప జీవితాన్నుండి పాపులను ఎలా దేవుడు బయటకి రప్పిస్తాడో చూపిస్తుంది – క్రీస్తు యేసు నందలి రక్షణలోనికి!

ఇది స్పష్టము ఈ వచనాలలో హోషేయా 11:4 మరియు ఇర్శియా 31:3 దేవుడు పాపులను ఏదోలా "రప్పిస్తాడు", రక్షించడానికి. కాని ఇర్శియా హోషేయాలోని వచనాలు నిన్ను ఆయన ఎక్కడ లాగుతాడో తెలియ చేస్తున్నాయి. బైబిలులో ఎక్కడా మనకు స్పష్టంగా చెప్పబడింది, ఎక్కడ దేవుడు లాగుతాడో, ఆయన కృప ద్వారా మనలను రక్షించినప్పుడు.

I. మొదటిది, దేవుడు మిమ్ములను స్థానిక సంఘానికి నడిపిస్తాడు.

నేను యుక్త వయస్సులో గుడికి వచ్చాను ఎందుకంటే ఎవరో నన్ను తీసుకొచ్చారు. ఇటీవల విశ్లేషణ నేను చదివాను అందులో నశించు లోకము నుండి 82% మంది సంఘములోనికి వచ్చిన వారు వాళ్ళ స్నేహితుల ద్వారా రాబడినవారు. తక్కువ శాతము మంది ప్రకటన చూచో కర పత్రము చూచో గుడిలోని వచ్చిన వారుంటారు. అలా నేను గుడికి వచ్చాను. ఒకరు నన్ను గుడికి తెచ్చారు తెస్తూనే ఉన్నారు. ఒక పరిచారకుడు బీన్ గారు నేను తప్పి పోయినప్పుడు నన్ను దర్శించడానికి వచ్చాడు. నన్ను తిరిగి రమ్మని ప్రోత్సాహించాడు. నాకు ఇంకా గుర్తుంది బీన్ గారు ఆయన భార్య, మా అంటి మార్టిల్ ఇంటి ముందరి ద్వారం దగ్గర నిలబడడం. ఈ పెద్దలను బట్టి దేవునికి వందనాలు. ఆయన నీలపు సూటు టై దరించి, ఆమె చక్కగా, గుడికి వచ్చే స్త్రీలు మాదిరిగా, నాగరికతతో సిద్ధ పడేవారు. వాళ్ళు పదిహేను ఏళ్ల బాలుని చూచేవాడు, నేను గుడికి వచ్చానని నిర్ధారించుకోడానికి. నేను బ్రతికి ఉన్నంత కాలము అది మర్చిపోలేను. ఆ వృద్ధ పరిచారకుని బట్టి ఆయన భార్యను బట్టి దేవునికి వందనాలు!

దేవుడు బీన్ దంపతుల లాంటి వారిని గుడికి తీసుకురాడానికి ఉపయోగించుకుంటాడు. డాక్టర్ శ్రీమతి మెక్ గోవన్ వాళ్ళ పిల్లలతో పాటు నన్ను చిన్నప్పుడు గుడికి తీసుకెళ్ళేవారు. ఇరవై సంవత్సరాల వరకు నేను క్రైస్తవుడను కాలేదు, కాని డాక్టర్ శ్రీమతి మెక్ గోవన్ పని ద్వారా నేను గుడికి రాబట్టబడ్డాను. నేను బీన్ దంపతుల ద్వారా తిరిగి గుడికి వచ్చాను. బైబిలు చెప్తుంది,

"మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అను దినము వారితో చేర్చు చుండెను" (అపోస్తలుల కార్యములు 2:47).

బైబిలు, ఇంకా చెప్తుంది:

"గనుక సంఘములు విశ్వాసము నందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించు చుండెను" (అపొస్తలుల కార్యములు 16:5).

సంఘములో మీరు క్రీస్తు సువార్త విని రక్షింపబడతారు. 82% మంది ఇలా గుడికి వచ్చేవారు, సువార్త భోదింపబడే ఆ స్థలానికి, ఎవరో ఒకరి ద్వారా తేబడిన వారే. కనుక, స్పష్టం, ఈ నివేదిక నుండి, బైబిలు నుండి కూడా, దేవుడు ప్రజలను మీరు గుడికి రావడానికి ఉపయోగించుకుంటాడు!

తరువాత, గుడిలో, సువార్త భోదింపబడుతుంది. కోరిందులో ఉన్నవారికి పౌలు చెప్పాడు:

"మరియు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియ పరుచుచున్నాను...మీరు దానిని అంగీకరించితిరి దాని యందె నిలిచియున్నారు, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని యున్న యెడల, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందు వారి యుందురు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను; సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారము మూడవ దినమున లెపబడెను" (I కోరిందీయులకు 15:1-4).

పౌలు సంఘంలో ప్రజలకు గుర్తు చేసాడు తానూ "భోదించాడు వారికీ" వారి పాపాల నిమిత్తము క్రీస్తు చనిపోయి పునరుత్థానుడయాడన్న సువార్త.

ఈ రోజుల్లో బైబిలును తిరస్కరించే సంఘాలు చాలా ఉన్నాయి - చాలా తెగలు, అబద్ద మతాలూ కూడా. ఏది వాస్తవమో ఎలా చెప్పగలరు? జవాబు సామాన్యం: వాళ్ళు చెప్తున్నారా సిలువపై క్రీస్తు మరణము ద్వారా పాపపు శిక్ష నుండి ఎలా రక్షింపబడాలో! వాళ్ళ ప్రసంగాలలో ఆ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారా? ప్రతి ఆరాధనలో, మీరు ఎలా రక్షింపబడాలో మేం చెప్తాం. ఇది సువార్త-ప్రకటించే సంఘము, బైబిలు దినాలలో, క్రొత్త నిబంధనలో సంఘాలను గూర్చి చెప్పబడినట్లు.

యేసు క్రీస్తు ద్వారా ఎలా రక్షింపబడాలో బోధింపదానికి దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు! దేవుడు కోరిందీయ సంఘములో పౌలును ఉంచాడు "నేను మీకు బోదించిన సువార్తను ప్రకటించడానికి" (I కోరిందీయులకు 15:1). అదే పని చేయడానికి దేవుడు నన్ను ఈ గుడిలో ఉంచాడు - మీకు బోధించడానికి మరి యేసును నమ్మడం ద్వారా పాపమూ నుండి ఎలా రక్షింపబడాలో చెప్పడానికి.

దేవుడు స్థానిక సంఘంలోనికి నిన్ను ఎందుకు తెస్తాడంటే మిమ్ములను ప్రేరేపించి ప్రోత్సహించడానికి:

"ఒకనికోడడు హెచ్చరించును, సమాజముగా కూడుట మానక; కొందరు మానుకోను చున్నట్టుగా" (హేబ్రీయులకు 10:25).

కొంత మంది చెప్తారు గుడికి వెళ్ళకుండా నీవు క్రైస్తవునిగా ఉండవచ్చని. వారు తప్పు. మీరు గుడిలో ఉండకుండా మారే విధంగా సువార్త మీకు బోధింపబడలేదు. క్రైస్తవ జీవితంలో గుడిలో ఉండకుండా మీరు పురికొల్పబడలేరు ప్రోత్సహింపబడలేరు. బైబిలు చెప్తుంది "జీవము గల దేవుని సంఘము, సత్యమునకు స్థంభమును ఆధారమునై యున్నది" (I తిమోతి 3:15). నూతన నిభందన గుడిలో దేవుడు సత్యాన్ని ఉంచాడు - కనుక సత్యాన్ని కనుగొనడానికి ప్రతి ఆదివారము మీరు గుడిలో ఉండాలి, నిజ క్రైస్తవుడవడానికి, క్రైస్తవ జీవితమూ ఎలా జీవించాలో తెలుసుకోడానికి.

నేను పాఠశాలలో క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో నేర్చుకోలేదు. రెండు కళాశాలల్లో పట్టా భద్రున్ని మూడు వేదాంత కళాశాలలలో. వాటిలో క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో నేర్చుకోలేదు. వాస్తవానికి ప్రార్ధనను గూర్చి భోదించడం, క్రైస్తవ జీవితం జీవించడం, నా స్థానికి సంఘములో నేర్చుకున్నాను, సంఘములో నా సంఘ కాపరి నుండి ఇతర క్రైస్తవ నాయకుల ద్వారా. నేను దేవునికి వందనస్తున్ని నాకు నమ్మకమైన చైనీ కాపరి ఉన్నాడు క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో నాకు నేర్పించాడు! ఆయన పేరు డాక్టర్ తిమోతి లిన్. నేను ఆయన తొంబైవ పుట్టిన రోజుకు వెళ్ళాను. ఆయన భూస్థాపనములో ప్రసంగించాను! నాకు తెలిసినదంతా నా కాపరి నేర్పించాడు, నేను ఆయనను బట్టి దేవుడికి వందనస్తున్ని. దేవుడు అన్నాడు:

"శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు చున్నాను: కనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శయా 31:3).

ఈ గుడికి ఈ ఉదయాన దేవుడు తీసుకొచ్చాడు. మీరు ఉంటాడనుకుంటున్నాను, నేను యవనస్తునిగా చేసినట్టు. ఇక్కడ ఉండి రక్షింపబడండి! ఉండి బైబిలు నేర్చుకోండి! ఇక్కడ ఉండి క్రైస్తవ జీవితం జీవించడం నేర్చుకోండి!

ఒక యవ్వనస్తుడు ప్రతి ఆదివారం మన గుడికి వస్తున్నాడు. నా బోధ విని మేల్కొలుపు పట్ల పయనించాడు. ఆడ స్నేహితురాలు తనతో ఇలా అన్నాడు, "ఒక గుడి ఇంకొక దాని లాంటిది. వచ్చే ఆదివారం నాగుడికి నాతొ రా." ఆమె మాట విన్నాడు. ఇక్కడ లేదు, ఇంకెప్పుడు, రాలేదు! తనతో సువార్త ప్రకటింపని వేరే గుడికి వెళ్లి పోయాడు. కొన్ని రాత్రుల తరువాత చూసాను. ఏంటో తెలుసా? మేల్కొలుపు కోల్పోయాడు. మునపటిలా పాపంలో నిద్ర పోతున్నాడు. ఎందుకో తెలుసా? తన స్నేహితురాలి గుడిలో ఎలా మారాలో బొదించదు – అందుకే! సాతాను స్నేహితురాలి నోటితో మాట్లాడించింది, "ఒక గుడి ఇంకొక గుడి లాంటిదే. నాతొ పాటు నా గుడికి రా!"

దేవుడు ఆ యవ్వనస్తున్ని మన గుడికి రప్పిస్తున్నారు, కాని సాతాను ఇంకోలా లాగుతున్నాడు – గుడి బయటకు – మానవ క్రియల ద్వారా రక్షణను గూర్చిన తప్పుడు సువార్త వినడానికి – పవిత్ర, ప్రోటేస్టెంట్, క్రీస్తులొ నమ్మడం ద్వారా బైబిలు సందేశం బదులు. దేవుడు అన్నాడు:

"శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు చున్నాను: గనుక (విడువక) నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శియా 31:3).

గుడికి నడిపిస్తున్నప్పుడు దేవుని నిరాకరింపవద్దు. నిజ సువార్త విని రక్షింపబడడానికి తిరిగి రండి. నిరాకరింపవద్దు దేవునికి వ్యతిరేకంగా తిరుగు బాటు చెయ్యవద్దు. ఆయన మిమ్ములను ఇక్కడకు రప్పిస్తున్నపుడు, ఒక వ్యక్తినో, స్నేహితునో బందువునో ఈ గుడి నుండి మిమ్ముల్ని లాగడానికి సాతనుని ఉపయోగించ నివ్వకండి, "సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది" (I తిమోతి 3:15).

బైబిలు చెప్తుంది, "సత్యమును ఎదిరించిరి" (II తిమోతి 3:8). వాళ్ళు సత్యాన్ని ఎదిరిస్తే, మీరు కూడా అలా చెయ్యొచ్చు. సైప్రను అన్నాడు, "మీరు పరిశుద్దాత్మను ఎదురిస్తున్నరు" (అపోస్తలుల కార్యములు 7:51). దేవుని నడిపింపును వాళ్ళు ఎదిరించ గలిగినప్పుడు, మీరు కూడా చెయ్యొచ్చు. ఈ విషయం నాకు పూర్తిగా అర్ధం కాదు. బైబిలును ముఖ విలువను బట్టి తీసుకుంటాను. లూథర్ అన్నాడు "వద్దు," అనడానికి మనకు శక్తి ఉండి కాని "అవును" అనడానికిశక్తి లేదు. ముగ్గురు నలుగురు యవనులున్నరు ఈ గుడిలో ఎదిగి వారం వెంబడి వారం దేవుని ఎదురిస్తున్నరు. వారు ఈ గుడికి వస్తారు, కాని ఇంకా దేవుని ఎదిరిస్తారు.

మీరు, కూడా, ఈ గుడిలోకి రాకుండా దేవుని ఎదిరిస్తూ ఉండవచ్చు. ఒక పరిచారకుడు గాని గుడి నాయకుడు గాని మీకు ఫోన్ చేస్తే, మీరనొచ్చు, "నేను తిరిగి రాను." లేక, ఇంకా అసహ్యంగా, మీతల్లో వేరే కుటుంబ సభ్యుడో ఫోన్ ఎత్తి, నీవు ఇంటిలో లేవని చెప్పించవచ్చు. ఇలా మీరు దేవుని ఎదిరించి తిరిగి ఈ గుడికి రావడానికి తిరస్కరించవచ్చు. దేవుడు అన్నాడు:

"శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు చున్నాను: గనుక (విడువక) నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శియా 31:3).

మీరు తిరుగుబాటుతో దేవుని వ్యతిరేకిస్తే, తిరిగి రాకపోతే, మీరు రక్షింప బడలేరు. నిజ క్రైస్తవులు కానేకారు.

II. రెండవది, దేవుడు నిన్ను యేసు క్రీస్తు నొద్దకు రప్పిస్తాడు.

ఆయన క్రీస్తులొనికి నడిపించి నిన్ను రక్షిస్తాడు.

"ఒకడు మనుష్యుని తోడు (కొని) పోవునట్లుగా, స్నేహ బంధముతో నేను వారిని (బంధించి) ఆకర్షించితిని" (హోషేయా 11:4).

యేసును నమ్మడం చాలా సులభము, కాని అది నీకు జరగడానికి కృపాద్భుతం జరగాలి. నీవు క్రీస్తు వైపు "రాబట్టబడాలి" లేకపోతె ఆయనను నువ్వు నమ్మవు, అది సులభంగా కనిపించినప్పటికిని.

యేసు అన్నాడు, "మీరు దేవుని యందు విశ్వాస ముంచుతున్నాడు, నాయందును విశ్వాసముంచుడి" (యోహాను 14:1). యేసును నమ్మడం అంటే అదే. దేవుని నమ్మునట్లు ఆయన యందు విశ్వాసముంచాలి. దేవునిలో ఇప్పటికే ఉన్న విశ్వాసం, దేవుని కుమారుడు యేసు నందు ఉంచాలి, నీవు రక్షింపబడడానికి. బైబిలు చెప్తుంది, "ప్రభువైన యేసు క్రీస్తు నందు, విశ్వాసముంచుము నీవు రక్షింపబడతావు" (అపోస్తలుల కార్యములు 16:31). దేవుని నమ్మునట్లే యేసును కూడా నమ్మండి. "దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నాయకుడి యందు విశ్వాసముంచుడి" (యోహాను 14:1).

అది సులభంగా కనబడవచ్చు, హాస్యాస్పదంగా ఉండొచ్చు, కదా? నశించు వారందరూ దానిని పొందుకోలేరు. వారు 100% సమయం వ్యర్ధ పరుస్తారు. బోధకులు రక్షణ కొరకు వచ్చిన వారిని సామాన్య ప్రశ్నలడుగుతారు, వారు సమాధానాలు వింటారు - ఆ బోధకులు నేను సరియే అని కనుక్కుంటారు. ప్రఖ్యాత బైబిలు కాలేజీ అద్యక్షుడు ఇటీవల నాతొ అన్నాడు 100 లో ఒకడు మాత్రమే రక్షింపబడతాడు!

ఒకరు అన్నారు, "మీరు కఠిన పరిచారు." ఈ వ్యక్తీ అర్ధం ఏమిటంటే ఆ "నిర్ణయ నేతలు" ప్రతి దానిని రక్షణ అనుభవంగా అంగీకరిస్తారు. "మారినవాడు" దేనినైన నమ్మవచ్చు, బోధించు వాడు అతనిని అంగీకరించి "మారినవాడు" అంటాడు. కానీ దేవును పాత దానిని అంగీకరించడు. దేవుడు ఒక్కనిస్తాడు ఒకటి చెయ్యాలి: యేసునందు విశ్వాసముంచాలి (అపోస్తలుల కార్యములు 16:31). వేరేది చేస్తే, నీవు రక్షింపబడలేవు. కనుక, తెలివైన బోధకులు వింటారు ఆ ఒక్క పని ప్రజలు చేసారో లేదో అని. బుద్దిలేని బోధకులు ఒక్కనించే దానిని వద్దంటారు, "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచు, నీవు రక్షింపబడతావు" (అపోస్తలుల కార్యములు 16:31). తరుచూ అవివేక బోధకులు వ్యతిరేకిస్తారు ఎందుకంటే వల్లే ఆ అవసమైనది చెయ్యలేరు కాబట్టి – కాబట్టి, వారి వల్లే నశించి పోయారు.

ఓ, యేసును నమ్మడం సామాన్యం అనిపించవచ్చు! యేసు అన్నాడు, "మీరు దేవుని యందు విశ్వాసముంచారు, నయందును విశ్వాసముంచుడి" (యోహాను 14:1). లక్షల మంది రక్షింపబడ్డాం అనుకునే వాళ్ళు వారు ఇలా చెయ్యలేరు. వారు "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచలెరు." వేరేది ఏదో చేసారు ఇంకా నశించే ఉన్నారు. (ఉదాహరణ మత్తయి 7:21-23).

విశ్వాసం ద్వారా ఒకరు యేసు నొద్దకు రావానికి దేవుని కృప అవసరం. దేవుడు సువార్త ద్వారా ప్రజలను యేసు నొద్దకు రప్పిస్తాడు. బైబిలు చెప్తుంది,

"నా ఎదుట నీతి మంతుడైనవాడు విశ్వాస మూలముగా జీవించును: గాని అతడు వెనుక తీసిన యెడల, అతని యందు నా ఆత్మకు సంతోష ముండదు" (హేబ్రీయులకు 10:38).

నీవు వెనుదిరిగితే నిన్ను దేవుడు యేసు వైపుకు తిప్పుతున్నప్పుడు, దేవుడు ముందో తరువాతో నిన్ను వదిలి పెడతాడు, నీవు రక్షింపబడడానికి చాలా ఆలస్యమవుతుంది. అది క్షమింపబడని పాపమూ. యేసు అన్నాడు,

"నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించేతేనే గాని, ఎవడును నాయొద్దకు రాలేడు" (యోహాను 6:44).

ఆయన దగ్గరకు "రావడం" అంటే అర్ధం ఏంటి? అంటే ఆయన యందు "నమ్మి." మూడు వచనాలు తరువాత, యేసు అన్నాడు:

"విస్వసముంచు వాడే నిత్య జీవితం కలవాడు" (యోహాను 6:47).

కాని దేవుడు ఆకర్షించితేనే తప్ప నీవు యేసును నమ్మలేవు (సి.ఎఫ్. యోహాను 6:44).

యేసు నందు సామాన్య విశ్వాసము అసంభవం దేవుడు ఆకర్షింపకపోతే.

"శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను: గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శియా 31:3).

దేవుడు ఎంతగానో మిమ్ముల్ని ప్రేమించి గుడికి రప్పించాడు. మీరు వచ్చారు దేవుని ప్రణాళిక ద్వారా, కనుక మీ తల్ల్లి గర్భం ధరించింది. లేక, నిన్ను స్నేహితుడు గుడికి తీసుకొచ్చి ఉండవచ్చు. మిమ్ములను గుడికి రప్పించడానికి దేవుడు మానవులను ఉపయోగించుకుంటాడు. తల్లి గర్భంలోనే నిన్ను ఇక్కడకు రప్పించడం, లేక ఒక వ్యక్తీ ఫోన్ చేసి నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఉండవచ్చు. అవును, ప్రతి ఒక్కరం, నేను కూడా, దేవుని ద్వారానే గుడికి రప్పించబడ్డాను.

కాని ఇప్పుడు దేవుడు నిన్ను యేసు నొద్దకు నడిపిస్తున్నాడు, ఆయన నమ్మడం ద్వారా రక్షణ యివ్వడానికి. "కాని ఎవరైనా వెనుదిరిగితే [దేవుడు అన్నాడు], అతని విషయంలో నా ఆత్మలో సంతోషము లేరు" (హేబ్రీయులకు 10:38). నీవు ఇప్పుడే యేసును విస్వశించాలి, దేవుడు నిన్ను రప్పిస్తున్నప్పుడు. చాలా ఆలస్యమయి పోవచ్చు! ఓ, ఇప్పుడే యేసునందు విశ్వాసముంచు - దేవుడు రప్పిస్తున్నప్పుడు!

"శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను: గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శియా 31:3).

III. కాని, మూడవది, దేవుడు నిన్ను పరలోకానికి నడిపిస్తాడు.

దేవుడు మొదటిగా స్థానిక సంఘానికి నిన్ను నడిపిస్తాడు. రెండవది, దేవుడు, తనకుమారుడైన యేసు క్రీస్తు నొద్దకు నడిపిస్తాడు. కాని, మూడవదిగా, దేవుడు నిన్ను పరలోకాని తీసుకెళతాడు. నీవు నిజ క్రైస్తవుడవైతే దేవుడు నిన్ను పరలోకానికి నడిపిస్తాడు! యేసు అన్నాడు:

"నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, ఎవడును నా యొద్దకు రాలేడు: అంత్య దినమున నేను వానిని లేపుదును" (యోహాను 6:44).

దేవుడు నిన్ను యేసు నొద్దకు రప్పిస్తాడు. ఈ దేవుడే సమాధి నుండి నిన్ను లేవనెత్తి రాకడలో పరలోకానికి నిన్ను తీసుకెళతాడు! దేవుడు నిన్ను గుడికి రప్పిస్తాడు. దేవుడు నిన్ను యేసు నొద్దకు నడిపిస్తాడు. దేవుడు నిన్ను సమాధి నుండి తప్పించి పరలోకానికి తీసుకెళతాడు!

"నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, ఎవడును నా యొద్దకు రాలేడు: అంత్య దినమున నేను వానిని లేపుదును" (యోహాను 6:44).

ఓ, ఎంత గొప్ప నిరీక్షణ ఇది! ఆ దేవుని యందు మనం విశ్వాస ముంచు తున్నాం, ఇప్పటి వరకు నడిపించాడు, ఇంటి వరకు నడిపిస్తాడు - పరలోకానికి! దేవుడు పరలోకానికే మనలను నడిపిస్తాడు!

"శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను: గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శియా 31:3).

"ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బాదతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును: క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు: ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనియు వారితో కూడా ఏకమై ప్రభువును ఎదుర్కొనుటకు, ఆకాశమందల వలనకు మేఘముల మీద కొనిపోబడుదుము: కాగా మనం సదా కాలము ప్రభువుతొ కూడా ఉంచుము" (I దెస్సలొనీకయులకు 4:16-17).

"ప్రభువును ఎదుర్కొనుటకు...ఆకాశమందల, మేఘముల మీద కొని పోబడుదుము!" (I దెస్సలొనీకయులకు 4:16-17). మేఘముల మీద కొని పోబడుదుము!

"గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శియా 31:3).

ఆకాశంలో కొనిపోబదుతాం! యేసు దగ్గరకు వెళ్తాం! పరలోకానికి కొనిపోబడతాం, సదా కాలము!

"గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శియా 31:3).

దేవుడు నిన్ను ఈ గుడికి రప్పించాడు. ఆయను ఎదిరించవద్దు. ప్రతి ఆదివారం రండి. దేవుడు నిన్ను యేసు నొద్దకు నడిపిస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా శ్రమించవద్దు. యేసు నందు విశ్వాస ముంచు. "దేవుని యందు విశ్వాసముంచారు, నాయందును విశ్వాస ముంచుడి." దేవుడు ఒక రోజు పరలోకానికే తీసుకెళతాడు.

ఓ, ఆనందం! ఓ, ఉత్సాహం! మనం వెళ్తాం మరణించకుండా,
   అనారోగ్యం లేదు, విచారం లేదు, భయం లేదు దుఃఖం లేదు,
మద్యాకాశంలో పట్టుపడతాం ప్రభువుతొ మహిమలో,
   ఎప్పుడైతే యేసు "తన స్వంత వారిని" చేర్చుకుంటాడో.
ఓ యేసు ప్రభు, ఎంత కాలం, ఎంత కాలం
   సంతోష గీతం ఆలపిస్తాం,
క్రీస్తు తిరిగి వస్తాడు! హల్లెలూయా!
   హల్లెలూయా! ఆమెన్, హల్లెలూయా! ఆమెన్.
("క్రీస్తు తిరిగి వస్తాడు" హెచ్. ఎల్. టర్నర్ చే, 1878).
(“Christ Returneth” by H. L. Turner, 1878).

రక్షింపబడడానికి మాతో మాట్లాడాలనుకుంటే, దయచేసి మీ స్థలము వదిలి సమాచార గదికి వెళ్ళండి. డాక్టర్ చాన్, ఈ ఉదయం కొందరు మారునట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: యోహాను 6:37-44.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యజమానుడు వచ్చాడు" (శారా డౌడ్ నీ చే, 1841-1926).
“The Master Hath Come” (by Sarah Doudney, 1841-1926).


ద అవుట్ లైన్ ఆఫ్

దేవుడు పాపులను ఎక్కడికి చేర్చుతాడు

WHERE GOD DRAWS SINNERS

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు చున్నాను; గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను" (ఇర్శయా 31:3).

I.   మొదటిది, దేవుడు మిమ్ములను స్థానిక సంఘానికి నడిపిస్తాడు, అపోస్తలుల కార్యములు 2:47; 16:5; I కోరిందీయులకు 15:1-4; హేబ్రీయులకు 10:25; I తిమోతి 3:15; II తిమోతి 3:8; అపోస్తలుల కార్యములు 7:51.

II.  రెండవది, దేవుడు నిన్ను యేసు క్రీస్తు నొద్దకు రప్పిస్తాడు, హోషయా 11:4; యోహాను 14:1; అపోస్తలుల కార్యములు 16:31; మత్తయి 7:21-23; యోహాను 12:32; హేబ్రీయులకు 10:38; యోహాను 6:44, 47.

III. మూడవది, దేవుడు నిన్ను పరలోకానికి నడిపిస్తాడు, యోహాను 6:44; I దెస్సలొనీకయులకు 4:16-17.