ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
త్రిత్వము ద్వారా రక్షణ – క్రిస్మస్ సందేశము SALVATION THROUGH THE TRINITY – డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు, "ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును, మీ కందరికిని తోడైయుండును. ఆమెన్." (II కొరిందీయులకు 13:14). |
గత మంగళవారము రాత్రి వ్యాయామశాలకు ఈతకు వెళ్ళాను. నీళ్ళ కొలనులోనికి దిగే సరికి బాగా చీకటయింది. తెలిసున్న వ్యక్తి జాకూజీకి వస్తున్నాడు. తిన్నగా చూస్తున్నాడు నన్ను గమనించలేదు. కొన్ని నిమిషాల తరువాత కొలను విడిచి అతనితో జాకూజీలో దిగాను. చల్లని రాత్రి కనుక మేమిద్దరమే ఉన్నాము. మాటల్లో అతని ప్రగాఢ ఒంటరి తనము గమనించాను. రిటైరయ్యాడు బ్యాంకులో అతనికి చాల డబ్బు ఉంది. అతనికి అరవై యేళ్ళు పెళ్లి చేసుకో లేదు. దశాబ్దాల క్రితం వచ్చాడు, కనుక కుటుంబం లేదు. స్నేహితులు కూడా లేరు. క్రిస్మస్ కి ఒంటరిని అని చెప్పినప్పుడా భాధ తన ముఖములో చూసాను. కళాశాల తరగతులు తీసుకుంటూ సమయము గడపడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అవసరము లేకున్నా, డిగ్రీ చేస్తున్నాడు. నలభై యేళ్ళ క్రితం గుడివదిలేసాడు. క్రైస్తవ్యము పట్ల కోపం చేరు అతనికున్నాయి. లోకంలో ఒంటరిగా ఉన్నాడు – కృప, ప్రేమ, సహవాసం లేకుండ – దేవునితో, యితరులతో కూడ. నేను విన్నాను, చనిపోయిన తరువాత తన డబ్బు ఎవరికి ఉంటుందో తనకే తెలియదు. అతని బట్టి నేను విచారపడ్డాను. మన సంఘానికి చాలాసార్లు ఆహ్వానించాను, ఒకసారి, వచ్చాడు, నా కుమారుని వివాహానికి. పెళ్లి అయిన వెంటనే వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. ఎంత చల్లని, భయపెట్టే విషయం – క్రిస్మస్ సమయంలో ఒంటరి తనము! మన ధృడ సంస్కృతిలో ప్రతి జీవితము ముగుస్తుంది. క్రీస్తులో సంఘంలో కేంద్రీకృతము కాని ప్రతి జీవితం అలానే భయంకర అనిశ్చితిలో ముగుస్తుంది. ఎందుకంటే క్రీస్తుకు సంఘానికి బదులు వెలితి. జీవిత ప్రారంభంలో అనిపించకపోవచ్చు, ఆఖరిలో అనిపిస్తుంది. గత యాభై సంత్సరాలుగా దీని గురించి ఆలోచిస్తున్నాను. నా పరిశీలన సత్యము. నా పిన తండ్రి ఒకరు కార్ల బాగాలు అమర్చే, క్రిస్లర్ లో పని చేసాడు. చాల డబ్బు దాచి శాన్డీగో సమీపంలో, ఖరీదైన కోస్తా స్థలములో, సాన్ క్లెమెంటేలో ఒక ఇల్లు కొన్నాడు. ఆ ఇంటి పడక గదిలో ఒంటరిగా చనిపోయాడు. వారం రోజులు అతని మృత దేహము చూడలేదు – ఒక పొరుగు వాడు ఉత్తరాలు జమ అవడం భయంకర మృత దేహము వాసనను బట్టి గుర్తించారు. ఇంకో పిన తండ్రి, అతని భార్య చనిపోయింది, గుండెపోటు వచ్చి పక్షవాతంతో వారం రోజులు పాటు గదిలో ఉండిపోతే ఒక కూటానికి హాజరు కాకపోవడం వలన ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అతిని పడక గది తలుపు లోపల నుండి తాళం వేయబడింది, కనుక బద్దలు కొట్టవలసి వచ్చింది. మూత్ర విసర్జనలో చేతిలో ఒక తుపాకీతో ఉన్నాడు - ఎందుకంటే దొంగల భయమువలన. పొరుగింటి తల్లి కుమార్తె ఆసుపత్రిలో తల్లికి అన్నం పెట్టకుండా చావనివ్వమని చెప్పింది. ఇలా చెప్పకపోవచ్చు. ఈ లోకంపై దృష్టి ఉన్న ప్రతి ఒక్కరి జీవితం నిరీక్షణ దేవుడు లేకుండా చనిపోతుంది! స్కూర్క్ గురించి నాకు చెప్పొద్దు. అది ఎప్పుడూ జరగదు. డిక్కిన్స్ లోని’ "క్రిస్మస్" కేరల్ లోని స్కూర్గ్ గా ఎవ్వరు మారరు. అలా ఎవ్వరూ మారరు క్రీస్తు సంఘము తప్ప. ఎవ్వరూ మారరు! అరవై సంవత్సరాల క్రితం, ఒక సినిమా చూసాను, ఒక వ్యక్తి ఊబిలో కురుకుపోయారు. కష్టపడే కొద్దీ - యింకా ఎక్కువ మింగబడ్డాడు. అరిచాడు గోలపెట్టాడు, ఎవరూ రాలేరు. చివరకు ఆ ఊబిలో తల ఒక్కటే బయటుంది. ఇంకొకసారి పిల్చాడు. మునిగిపోయాడు. అది చూచినప్పుడు నేను చిన్న పిల్లవాడిని. గుండె పట్టుకున్నాను. గొంతు నొక్కుకున్నాను. నా చేతులకు చెమటలు పట్టాయి ఇసుక ఊబిలో మునగడం ఆలోచిస్తుంటే! నువ్వు, నిరాశ జీవితంలో, మునిగిపోతావా? లేక తప్పించుకుంటావా? నేను చెప్తుంటాను, ముప్పై సంవత్సరాల తరువాత – ఎవ్వరూ తప్పించు కోలేరు! 80 సంవత్సరాలకు నా తల్లి తప్పించుకుంది – కాని అది అసాధారణము ఎర్ర సముద్రము పాయలవడం లాంటిది – లేక యితర అసంభవ అద్భుతం! జీవిత యిసుక ఊబి నుండి తప్పించుకోడానికి ఒక మార్గమే ఉంది. నేను చెప్తుంది రాసుకోండి! ఒకటే మార్గముంది జీవిత యిసుక ఊబినుండి తప్పించుకోడానికి – ఒకటే మార్గము! యింక వేరేది లేదు! అది ఇదే – "ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును, మీ కందరికిని తోడైయుండును. ఆమెన్." (II కొరిందీయులకు 13:14). కొరిందు సంఘము సరిగ్గా లేరు. పెద్ద విభజనలు, గొడవలు విభేదాలు, తప్పుడు సిన్ద్ధాంతాలు, లైంగిక పాపము, చాల తప్పిన సంఘ సభ్యులు (13:5, 6). పౌలు ఈ అద్భుత ఆశీర్వాదము, వాల్లందరకూ యిచ్చాడు, "మీ అందరికి." ఈ ప్రార్ధన అందరికి అతనికి తెలుసు నిరాశా బ్రతుకు నుండి ఏదీ వారిని తప్పించలేదు. నీకు కూడ ఇదే కావాలి. I. మొదటిది, నీకు ప్రభువైన యేసుక్రీస్తు కృప అవసరము. "ప్రభువైన యేసుక్రీస్తు కృప...మీ అందరితో ఉందును గాక" (II కొరిందీయులకు 13:14). ఆయన ఇక్కడ త్రిత్వాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఆయన యేసు క్రీస్తును గూర్చి, తండ్రియైన దేవుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రార్దిస్తున్నాడు "ప్రభువైన యేసు క్రీస్తు కృప" అందరితో ఉండాలని. అపోస్తలుడు మొదటిగా దాని గూర్చి ప్రార్ధించాడు, ఎందుకంటే అది మనకు ముఖ్యము. త్రిత్వము ద్వారా రక్షణకు ఇది ప్రార్ధన. గమనించండి అపోస్తలుడు "కృపను" క్రీస్తు యొక్క "దేవుని ప్రేమ" కంటే ముందు యిచ్చాడు. ఇంకా గమనించండి క్రీస్తు శీర్షిక పేరు ఇవ్వబడ్డాయి, "ప్రభువైన యేసు క్రీస్తు." ఇది ఆయన దైవిక స్వభావాన్ని చూపిస్తుంది, ఆయన మన ప్రభువు కాబట్టే. అది ఆయన మానవ స్వభావాన్ని చూపిస్తుంది, ఆయన మన యేసు. అది ఆయన స్థితిని, క్రీస్తుగా కనపరుస్తుంది, ఆయన మెస్సియా కాబట్టి. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. ఈ దైవిక మనవ వ్యక్తి కృప మనకు కావాలి. ఈ వ్యక్తి, యేసు క్రీస్తు ప్రభువు, కృప మనకు అనుగ్రహిస్తాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి తెలుసు తాను ప్రభువైన యేసు క్రీస్తు కృప వలన రక్షింపబడ్డాడని. నశించు వారికి ప్రభువైన యేసుక్రీస్తు అవసరత కనిపించదు. వాళ్ళు ఆయనను కాళ్ళ క్రింద త్రోక్కుతారు (హేబ్రీయులకు 10:29). వారు ఆయన త్రుజీకరించి, తిరస్కరించి వారి ముఖములను చాటు చేసుకున్నారు (యెషయా 53:3). ఆయన యొద్దకు రావడానికి నిరాకరించారు (యోహాను 5:40). ఆయన అసహ్యించుకుంటారు (యెషయా 49:7). ప్రజలు గాంధీని గూర్చి జాన్ కెనెడీని గూర్చి మంచి చెప్తారు, ఇద్దరూ వ్యభిచారులే. మహమ్మదును గూర్చి బాగా చెప్తారు, అతను దెయ్యము పట్టినవాడు హంతకుడు. చేగెవెరాను గూర్చి బాగా మాట్లాడుతారు, అతను హంతకుడు దొంగ. యేసు దగ్గర కొచ్చే సరికి, ఆయనను త్రుజీకరిస్తారు. నీవు కాలేజీలో ఉంటే నేను సరియే అని నీకు తెలుసు. కాలేజి అధ్యాపకులు ధైవకుమారున్ని, ప్రభువైన యేసు క్రీస్తును అసహ్యించుకుంటారు! వాళ్ళు అక్టోబర్ 31న అస్థిపంజరాలను చేడుపువారిని నల్ల పిల్లులను బహిస్కరించరు. వారు "హేలోవీన్" పదాన్ని స్టోర్ నుండి స్కూలు నుండి బహిస్కరించరు. కాని వారు "క్రిస్మస్" అనే పదాన్ని అమెరికాలోని ప్రతి స్కూలు నుండి, చాలా షాపుల నుండి బహిష్కరించారు, ఎందుకంటే అందులో "క్రీస్తు" అనే పదము ఉంది కనుక. వారు చిల్లంగి వారిని పంజరాలిని ప్రేమిస్తారు – కాని వారు క్రీస్తు నామమును అసహ్యించు కుంటారు. "క్రిస్మస్" పేరును అసహ్యించుకుంటారు. ఈ సంవత్సరము "క్రిస్మస్" పేరును ఒకేసారి చూసాను. లాస్ ఎంజిలాస్ డౌన్ టౌన్ లో ఒకేసారి చూసాను! అది, "మెర్రీ క్రిస్మస్" "ద పెంట్రీ" పక్కన, పాత హోటల్ అది మునపటి మేయర్ రిచర్డ్ రియోర్ధాన్ కు చెందినది, ఆయన ఆదివారం గుడికి వచ్చే ప్రముఖులలో ఒకడు. లాస్ ఎంజిలాస్ పట్టణంలో క్రిస్మస్ సమయంలో వెలుగులు సిలువ రూపములో ఉన్న దృశ్యము హాయి నిచ్చేది. కాని యింకా లేదు. సైనిక నాస్తికులు దానిని చింపారు, ఏ క్రైస్తవునికి వారిని ఆపడానికి దైర్యము సరిపోలేదు! ఈ రోజు, ప్రభువైన యేసు క్రీస్తు తృనీకరింప బడి, అపహసింపబడి , అసహ్యింప బడుతున్నారు – క్రిస్మస్ సమయంలో కూడా! న్యూయార్క్ లో టైం స్వ్కేర్ లో పెద్ద చిత్ర పటము "అమెరికా నాస్తికులచే" ఉంచబడింది. అది అంటుంది, "క్రిస్మస్ సమయంలో క్రీస్తు ఎవరికీ కావాలి? ఎవ్వరికి వద్దు!" వారు దాడికి గురవుతారు ఒకవేళ యిలా పెడితే, "రంజాన్ లో మహమ్మద్ ఎవరికీ కావాలి? అని ఎవరికీ వద్దు!" వాళ్ళు యాంటి సెమైడ్స్ గా ముద్ర వేయబడతారు ఒకవేళ ఇలా పెడితే, "హనుక్కలో ఇశ్రాయేల్ ఎవరికీ కావలి? ఎవరికీ వద్దు!" కాని రాజకీయ వేష దారులకు అది సబబే ఆయన పుట్టిన రోజైన క్రిస్మస్ రోజున ఆయనను నిందించడం! బిల్ ఓ రీలీ, ఫాక్స్ న్యూస్, సరియే! "క్రిస్మస్ రోజున యుద్దము ఉంటుంది"! క్రైస్త్వ్యనికి వ్యతిరేఖంగా యుద్ధముంటుంది! పాపములో ఉన్న వ్యక్తీ యేసు క్రీస్తును అసహ్యిస్తాడు! "విచారాల వ్యక్తీ," ఏమి పేరు ఓ, నేను ఎంతో దుఃఖి స్తాను కొంత మంది యవనస్తులు, ప్రతి ఆదివారము మన గుడికి హాజరవుతారు, కాని యేసును నమ్మెంతగా ప్రేమించరు! ఓ, దేవుని కృపను ఎట్లు అనుభవిస్తావు దెయ్యము వైపు ఉండి? యేసు తిరస్కరిస్తుంటే ఎలా రక్షింపబడతావు, నమ్మెంతగా ఆయనను ప్రేమించకుంటే! దేవుని కృపను దయను ఎలా అనుభవిస్తావు ప్రభువైన యేసు క్రీస్తును తిరస్కరిస్తుంటే? ఒకరోజు జూకూజిలో ఉన్న వృద్ధుని వలే - ఒంటరిగా, నిరీక్షణ లేకుండా, క్రిస్మస్ రోజున. కృప అనేది ప్రతి నేరారోపణ, పాదయిన, నిస్సహాయ పాపికి అవసరము! ఒక యేసు మాత్రమే నీ కొరకు కృప కలిగి యున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళు, ఇంకా ఆలస్యము కాకముందే! అప్పుడు అపోస్తలుడైన పేతురుతో పాటు చెప్పగలవు, "ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము" (అపోస్తలుల కార్యములు 15:11). II. రెండవది, నీకు దేవుని ప్రేమ అవసరము. "ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు…మీకందరికిని తోడైయుండును" (II కోరిందీయులకు 13:14). డాక్టర్ చార్లెస్ హెడ్జ్ చే, 19 వ శాతాభ్దపు వేదాంతి, అన్నాడు, "ఒక దృక్పడంలో [ఒక విధంగా చూస్తె] దేవుని ప్రేమ విమోచనకు మూలము. ఆయన కుమారిని అనుగ్రహించుట ద్వారా దేవుడు తన ప్రేమను ప్రత్యక్ష పరిచాడు, ‘అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరిచియున్నాడు, ఎట్లనగా, మన మింకను పాపులమై యుండగానే, క్రీస్తు మన కొరకు చనిపోయెను’ (రోమా 5:8). కాని వేరే దృక్పదంలో [ఇంకొక విధంగా చూస్తె] క్రీస్తు కృప పనిద్వారా దేవుని ప్రేమ మనకు ఉంది. అంటే, క్రీస్తు పని అనే షరతు మీద, ఆయన ప్రేమ, క్షమాపణ శుద్దీకరణ రక్షణ ఆధారపడ్డాయి. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడ్డాం. మన పాపాలకు ఆయన మరణము అవసరము దేవుని సహవాసము ఆయన ప్రేమలో పాళీ భాగస్తులు కావడానికి అవసరము. కాబట్టి అపోస్తాలుడు క్రీస్తు కృపను దేవుని ప్రేమ ముందు పెట్టాడు, చెప్పినట్టు, ప్రత్యక్షతకు అది షరతు, దాని అభివ్యక్తి ఓటుహక్కును" (Charles Hodge, Ph.D., 1 and 2 Corinthians, The Banner of Truth Trust, 2000 reprint, p. 689; note on II Corinthians 13:14). విలియం ఆర్. నెవెల్ ఇలా అన్నాడు, ఓ, రక్షణ ప్రణాలికను గీచిన ప్రేమ! దేవుని ప్రేమను ఇలా కదా అనుభవిస్తాం? డాక్టర్ లెన్ స్కీ చెప్పాడు "వ్యక్తుల క్రమము వారి తలంతుల క్రమము ప్రాముఖ్యము." మొదట ప్రభువైన యేసు క్రీస్తు కృపను పొందుతా, తరువాత దేవుని ప్రేమను అనుభవిస్తాం. ముందు క్రీస్తు కృపను పొంది, తరువాత దేవుని ప్రేమను తెలుసుకుంటాం (R. C. H. Lenski, Ph.D., The Interpretation of St. Paul’s First and Second Epistles to the Corinthians, Augsburg Publishing House, 1969 edition, p. 1339; note on II Corinthians 13:14). అది నా స్వానుభవము, ఇది (మీది కూడా). నేను యేసు నోద్దకు చేర్చ బడ్డాను. ముందు ప్రభువైన యేసు క్రీస్తు కృపను అనుభవించిన తరువాత, దేవుని ప్రేమను అర్ధము చేసుకోవడం ఆరంభించాను. ఇంకా నీవు నశించిన స్థితిలో ఉంటె, నీవు ముందు యేసు నోద్దకు రావాలి. క్రీస్తు నోద్దకు వచ్చాక దేవుని ప్రేమను ఎరుగుతావు! డాక్టర్ లెన్ స్కీ అన్నాడు, "దేవుని ప్రేమ ఆశీర్వదములొ రెండవ స్థానంలో ఉంది" (ఐబిఐడి.). ముందు, క్రీస్తు నోద్దకు రావాలి. అప్పుడు దేవుని ప్రేమను తెలుసు కుంటావు! అలా పాపులు రక్షింప బడతారు! యేసు నోద్దకురా, అప్పుడు నీవు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసు కుంటావు! జిమ్ లో ఆ ముసలి వ్యక్తిని గూర్చి మళ్ళీ తలస్తున్నాను. సంవత్సరాల క్రితం క్రీస్తు నుండి సంఘము నుండి దూరమయ్యాడు – ఇప్పుడు క్రిస్మస్ సమయంలో ఒంటరిగా ఉన్నాడు – దైవ ప్రేమ లేకుండా! అది నీకు జరగకూడదు! ఇప్పుడే క్రీస్తు నోద్దకురా, అప్పుడు నీవు దేవుని ప్రేమను అనుభవిస్తావు! III. మూడవది, నీకు పరిశుద్దాత్మ సహవాసము అవసరము. "ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును, మీ కందరికిని తోడైయుండును. ఆమెన్." (II కొరిందీయులకు 13:14). గ్రీకు పదము "సహవాసముకు" శుభకర స్నేహ పూరిత పదము కోయినోనియా. దాని అర్ధము "అన్యోన్య" లేక "సహవాస బంధము." నేను డాక్టర్ లెన్ స్కీకి చెప్పింది చెప్పాలి, ఎందుకంటే అది ఆయన ఎంతో సుందరంగా భాగా చెప్పాడు. ఇలా, పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆయన సహవాసములొ మనలను చేర్చుకొని దానిలో మనము ఆయన కృప ప్రేమను కనుగొంటాము. కాని విడిగా ఉంటె కాదు కాని అన్యోన్య సహవసములొ అది మన ఊహకు అందానికి (ఐబిఐడి., పేజి 1341). ఎలీషా హాఫ్ మాన్ సహవాసం లేక అనుబంధం గురిండి పరిశుద్దాత్మతో ఏమన్నాడంటే, "నిత్యత్వహస్తాలకు వంగడం." వినండి, ఏమి సహవాసము, ఏమి దైవిక సంతోషం, నా తల్లి ఆ పాత పాటను ప్రేమించింది. ఆమె రక్షింపబడ్డాక చాలసార్లు కలిసి పాడాం. అది సహవాసము, అది అన్యోన్యము, పరిశుద్దాత్మతో యేసుచే రక్షింపబడిన తరువాత! ఏమి సహవాసం, ఏమి దైవిక ఆనందం, నిత్యత్వ హస్తాలపై ఆనుకొనుట! "ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును, మీ కందరికిని తోడైయుండును. ఆమెన్." (II కొరిందీయులకు 13:14). డాక్టర్ హార్డ్ అన్నాడు, "ఈ పాఠ్య భాగము త్రిత్వ సిద్ధాంతానికి తేట అయిన గుర్తింపు, ఇది క్రైస్తవ్యానికి ప్రాథమిక సిద్ధాంతము. క్రైస్తవుడు అంటే యేసు ప్రభువు కృపను, దేవుని ప్రేమను, పరిశుద్ధాత్మ సహవాసము అనుభవించువాడు" (ఐబిఐడి., పేజీ 690). నేను చాల విచారించాను ఆ వృద్ధుడు జాకూజీ నుండి బయటకు వచ్చి చీకటిలో నడిచిపోయినందుకు. తాను ఆశీర్వాత త్రిత్వమును తెలుసుకున్న ఆనందాన్ని కోల్పోయాడు. గొప్ప భోధకుడు డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రిస్ వెల్ ఇలా అన్నాడు. ఎప్పుడైతే వ్యక్తి నిజదేవున్ని ఆరాదిస్తాడో, ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర తలవంచుతాడో, పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని హృదయంలో ఎప్పుడు అంగీకరిస్తాడో, యేసు రక్షించే కృపను గమనిస్తాడో ఆ వ్యక్తి హెచ్చింపబడతాడు, ఎత్తబడతాడు, శుద్ధి చేయబడతాడు. తన జీవితానికి సంబందించినదంతా శుద్దీకరింపబడి పరిశుద్ధ పరచబడుతుంది. ఒకే దేవుడు ఆయన పేరు మన తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు, మన ఆత్మలలో దేవుడు – కదేలే కృప పరిశుద్ధాత్మ సాక్ష్యము. ఆమెన్. (W. A. Criswell, Ph.D., Great Doctrines of the Bible – Volume 2, Zondervan Publishing House, 1982, p. 77). ఈ రాత్రి నీవు యేసు నొద్ధకు రావాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన నిన్ను వ్యర్ధ స్వార్ధపూరిత పాపపు జీవితము నుండి రక్షిస్తాడు. సిలువపై ఆయన కార్చిన రక్తముతో నిన్ను కడుగుతాడు. యేసు నోద్దకు రా నీవు దేవుని ప్రేమను తెలుసుకుంటావు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము పొందుతావు. యేసును గూర్చి మాతో మాట్లాడాలనుకుంటే, ఇప్పుడే కుర్చీ వదలి ఆవరణ వెనుక భాగానికి వెళ్ళండి. డాక్టర్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి మీతో మాట్లాడి ప్రార్ధిస్తాడు. డాక్టర్ చాన్, దయచేసి వచ్చి ఈ రాత్రి ప్రజలు యేసును నమ్మునట్లుగా ప్రార్ధించు. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: II కోరిందీయులకు 13:11-14. |
ద అవుట్ లైన్ ఆఫ్ త్రిత్వము ద్వారా రక్షణ – క్రిస్మస్ సందేశము SALVATION THROUGH THE TRINITY – డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును, మీ కందరికిని తోడైయుండును. ఆమెన్." (II కొరిందీయులకు 13:14). I. మొదటిది, నీకు ప్రభువైన యేసుక్రీస్తు కృప అవసరము, II కోరిందీయులకు 13:14ఎ; హేబ్రీయులకు 10:29; యెషయా 53:3; యోహాను 5:40;
యెషయా 49:7; II. రెండవది, నీకు దేవుని ప్రేమ అవసరము, II కోరిందీయులకు 13:14బి; రోమా 5:8. III. మూడవది, నీకు పరిశుద్దాత్మ సహవాసము అవసరము, |