Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




దత్తత!

ADOPTION!
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము ఉదయము, నవంబరు 3, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, November 3, 2013

"మరియు మీరు కుమారులై యున్నందున, నాయనా, తండ్రి అని, మోరపెట్టి, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను" (గలతీయులకు 4:6).


త్రిత్వమును గూర్చిన సిద్ధాంతము మూలము. నిజ క్రైస్తవులు దానిని కాదను బోధలను తిరస్కరిస్తారు. త్రిత్వము సిద్దంతము క్రైస్తవ్యానికి పునాది. ఇక్కడ, మన పాఠములో, ఒకే వచనములో త్రిత్వములొని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మనకు చెప్పబడింది తండ్రి దేవుడు రక్షణకు కర్త. మనకు చెప్పబడింది ఆయన తన కుమారుని పరిశుద్దాత్మను మనము మారినప్పుడు. మన హ్రుదయాలలోనికి పంపిస్తాడు. మనం పూర్తిగా త్రిత్వాన్ని అర్ధం చేసుకోం. కాని లేఖనాలలో ఆయన ప్రత్యక్షత చూస్తాం. కనుక విశ్వాసము ద్వారా త్రిత్వాన్ని నమ్ముతాం.

పాఠము చూపిస్తుంది ముగ్గురు వ్యక్తులు కలిపి దేవుడు. తండ్రి దేవుని గూర్చి పాఠములో రెండు సార్లు చెప్పబడింది – ఒకసారి "దేవుడిని" ఇంకోసారి "తండ్రి" అని. క్రీస్తు దేవుడని పాఠము అగుపరుస్తుంది. ఆయన బౌతికంగా స్త్రీ ద్వారా జన్మించాడు. కాని ఆయన "పంపబడినవాడు" గా వర్ణింపబడ్డాడు – కనుక పుట్టుక మునుపే ఆయన ఉనికితో ఉన్నాడు. "కుమారుడు" అని కూడా పిలువబడ్డాడు – లేఖనాలలో దాని అర్ధము తండ్రి లాంటి (జీవము) ఆయన కలిగి ఉన్నాడు. ఇది క్రీస్తు దైవత్వాన్ని రుజువు చేస్తుంది. తరువాత, దేవుడు చేయగలిగేదే పరిశుద్దాత్మ చేస్తుంది. ఆయన తన పిల్లల హృదయాల్లో జీవిస్తాడు. కనుక త్రిత్వములొని మూడు పేర్లు మనకున్నాయి – "తండ్రి దేవుడు," "ఆత్మ," "ఆయన కుమారుడు."

నిజ క్రైస్తవులకు తెలుసు ముగ్గురు వ్యక్తులు రక్షణకు అవసరమని. మనం తండ్రిని ప్రేమిస్తాం ఎందుకంటే మనలను ఆయన పిల్లలుగా ఎన్నుకున్నాడు. మనం కుమారుని ప్రేమిస్తాం ఎందుకంటే ఆయన మన పాపాలు కడగడానికి సిలువపై రక్తం కార్చాడు. మనం పరిశుద్దాత్మను ప్రేమిస్తాం ఎందుకంటే ఆయన మనకు పాపపు ఒప్పుకోలు కలుగ చేసి, క్రీస్తు దగ్గరకు చేర్చాడు. అందుకే మనం రెండు చిన్న పాటలు పాడటం ప్రతి ఆరాధనలో. మొదటిది, మనం గీతికా పాడుతాం, ఇది 17వ శతాబ్దంలో థామస్ కేన్ చే వ్రాయబడింది.

ఆశీర్వాదాలు క్రుమ్మరించే దేవునికి స్తోత్రం;
క్రింద ఉన్న సృష్టంతా ఆయనను స్తోత్రించాలి;
పైనున్న పరలోక వాసులు, ఆయనను స్తోత్రించాలి;
తండ్రి, కుమారా, పరిశుద్దత్మలను స్తోత్రించాలి. ఆమెన్.
   ("గీతికా" థామస్ కేన్ చే, 1637-1711).

మనం ఇంకొకటి పాడతాం "మహిమ పాత్రుడు," పేరు తెలియని వ్యక్తిచే 2వ శతాబ్ధము లో వ్రాయబడింది.

తండ్రికి, కుమారునికి మహిమ,
   పరిశుద్దాత్మకు కూడా;
ఆరంభములో ఉన్నట్టు, ఇప్పుడు
   మరి ఎన్నటికిని,
లోకాంతము వరకు. ఆమెన్, ఆమెన్.
     ("మహిమ పాత్రుడు," మూలము తెలియదు, 2వ శతాబ్ధము ఆరంభము).

ఈ రెండు పాటలు ప్రతి ఆదివారము ఆరాధనలో మనం పాడతాం – ఎందుకంటే అవి త్రిత్వాన్ని స్తుతిస్తాయి, హెచ్చిస్తాయి, మహిమ పరుస్తాయి ఆయనే మన దేవుడు!

మేర్మోనులు అంటారు ముగ్గురు వేర్వేరు దేవుళ్ళని. కాని వారిది తప్పు. ఒకే ఒక్క దేవుడు, ముగ్గురు వ్యక్తులలో. యోహావా సాక్షులు యేసు దైవత్వాన్ని నిరాకరిస్తారు. కాని వారు తప్పు. యేసు దేవుడు, త్రిత్వములొని రెండవ వ్యక్తీ. ముస్లిములు కాదంటారు కుమారుడు ఆత్మ దేవుడంటే. వారు తప్పు. దైవములో ముగ్గురు వ్యక్తులున్నారు. వేదాంత పరంగా, స్వతంత్ర ప్రోటేస్టెంటులు, ముగ్గురు వ్యక్తులను నిరాకరిస్తారు, ఆధునిక యూనిటేరియన్ల వలే – రెండు గుంపుల వారు చాదస్తులు, దేవుడు లేడని చెప్పేవారు. వేదాంత స్వతంత్రత, మృదువైన సెమినరి వాటమైనదైనా, గ్రాడ్యుయేట్ పాఠశాల వాటిమైన దైనా, త్రిత్వాన్ని గతానికి చెందినవా లేదా వేదాంత అసత్యముగా పరిగణిస్తాయి. ఇది, బహుశ, స్వతంత్ర దైవ తలంపులు నియంతృత్వ ధోరణికి దారి తీసాయి – మరియు, చివరకు, నాస్తికత్వానికి దారితీసింది, దేవుడు పూర్తిగా తిరస్కరింపబడ్డాడు.

కాని బైబిలే దేవుడు త్రిత్వముని బోదిస్తుంది – ఆ దేవుని ముందు మనం తలవంచాలి – తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ. మన బాప్టిస్టు ప్రోటేస్టెంట్ స్వార్ధానికి మనం నిరూపణగా ఉండాలి. "క్రైస్తవులు," అని పిలువబడే వారిలో అధికులు కెథలిక్కులు చాదస్తులు, దేవుడు త్రిత్వమని బోధించారు. చారిత్రత్మికంగా బాప్టిస్టులు సువార్తికులు త్రిత్వపు సిద్ధంతాన్ని కలిగి యున్నారు.

"మరియు మీరు కుమారులై యున్నందున, నాయనా, తండ్రి అని, మోరపెట్టి, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను" (గలతీయులకు 4:6).

త్రిత్వాన్ని మన పాఠములో చూసాం. ఇప్పుడు అది మనకేం చెప్పుతుందో చూద్దాం. ఇది చక్కని పాఠము, లోతైన, గొప్ప అర్ధము దాగియుంది.

I. మొదటిది, పాఠము దత్తత యొక్క సిద్ధంతాన్ని గూర్చి మాట్లాడుతుంది.

వచనం చెపుతుంది, "మీరు కుమారులు." ఇది మునుపటి వచనాన్ని, గూర్చి చెపుతుంది, "...దత్త పుత్రులము కావలెనని." దేవునిచే మనం దత్తత చేసుకోబడాలి ఎందుకంటే మనం సహజ పిల్లలం కాదు. బైబిలు చెబుతుంది "దేవుని సంతానము" (అ.కార్యములు 17:29). అది మన బౌతిక దేహాలను సూచిస్తుంది, అవి దేవునిచే చేయబడ్డాయి. కాని ఇది వేరు గలతీ 4:5 లో వ్రాయబడిన "దత్తపుత్రులం." పునర్నిమాణము, నూతనజన్మ, మనకు దేవుని పిల్లల సహజ స్వభావాన్ని ఇస్తుంది. కాని దత్తత, తిరిగి జన్మించిన తరువాత మన కొచ్చేది, మనకు దేవుని పిల్లలు హక్కులు మనకు ఇస్తుంది.

నేను రెండేళ్ళ వయసులో నా తండ్రి వదిలేసాడు. పదమూడు సంవత్సరాలకు స్థలము లేక తల్లితో నివసించ లేకపోయాడు. కనుక 13. సంవత్సరాలప్పుడు చుట్టాలతో నివశించాను. ఎక్కువ త్రాగుడు గొడవలు ఉన్నందున మధ్యాహ్నం వెనుక ద్వారం ద్వారా పారిపోయి, పాత విరిగిన, కంచె ఎక్కి, డాక్టరు శ్రీమతి మెక్ గోవాన్ ఇంటిలో ప్రవేశించాను. వాళ్ళ కొడుకు కూతురుతో ఆడుకుంటూ టీవీ చూస్తూ ఉండేవాడిని.

వారి ఇంటి వెనుక ద్వారం తడుతూ, కనిపెట్టేవాడిని. ఒక రోజు శ్రీమతి మెక్ గోవాన్ అన్నారు, "రాబర్ట్, తలుపు కొట్టనవసరం లేదు. ఎప్పుడు వచ్చినా లోపలి వచ్చేయి." అప్పటి నుండి కుటుంబ సభ్యులవలే, లోపలి వెళ్ళేవాడిని. చాలా రాత్రులు శ్రీమతి మెక్ గోవాన్ వంట గదికి వచ్చి వారితో బోజనము చెయ్యమని అడిగే వారు. నాకు చాలా ఆనందమనిపించింది, వారి పిల్లలలో ఒకరిలా అనిపించింది. నేనన్నాను "దాదాపు" వారి పిల్లలలో ఒకరిలా. నాలుగు సంవత్సరాలు, 13 నుండి 17 వరకు, సెలవులకు వారితో తీసుకెళ్ళే వారు. వారికీ ఎంతో కృతజ్ఞుడనై, వారికీ అది తెలియ చేసేవాడిని, వారు జీవించినంత కాలము – తల్లుల దినానికి, తండ్రుల దినానికి కార్డులు పంపేవాడిని. క్రిస్మస్ కు బహుమతులు పంపేవాడిని. బాగా ముసలి వారయ్యాక, డాక్టరు మెక్ గోవన్ కు ఖరీదైన కళ్ళద్దాలు ఇచ్చాను కంటి చూపు మెరుగుదలకు. వాటిని సమాధి పెట్టెలో ఉంచారు భూస్తాపనలో నేను మాట్లాడేటప్పుడు. ఆయన తరుచూ అనేవాడు నేను ఆయనకు కొడుకు లాంటి వాడినని. అది నాకు అవసరమని తనకు తెలుసు, ఎందుకంటే ఆయన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు, మారట తండ్రి చిన్న చూపు చూసే వాడు. అవును, నేను ఆయన పిల్లలలో ఒకరి వలే ఉన్నాను – దాదాపు – కానీ పూర్తిగా కాదు.

మీలో కొందరిది అదే మార్గము. మీరు గుడిలోకి వచ్చారు. మీరు దాదాపు భావిస్తారు మీరు ఉమ్మడి కుటుంభానికి చెందిన వారని – దాదాపు. కాని ఒకటి తప్పిపోతుంది. మీరు నిజంగా చెందిన వారి కావని పోసి గడతారు. దత్తత అనేది తప్పిపోతుంది! మీరు దేవునిచే ఆయన పిల్లలుగా దత్తత చేయబడాలి, కాకపొతే మా గుడిలో భాగస్తులు కానేరరు. మీరు ఈ గుడిలో పుట్టి పెరిగినప్పటికిని, మీరు తృప్తి నొందలేరు దేవుని కుటుంబములోనికి దత్తత అయ్యేవరకు. స్పర్జన్ అన్నాడు మారని వ్యక్తీ "బందిపోటు స్థితిలో నిలుస్తాడు, బిడ్డగా కాదు...[దేవునికి] వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినవాడు, తండ్రి ప్రేమను అనుభవింపని బిడ్డ." దత్తత ద్వారా దేవుని బిడ్డగా ఉండేలా నీవు మార్చబడాలి, కుమారత్వము లోని ఆదిక్యతలు అనుభవించాలి. 1777 లో వ్రాయబడిన అనామిక పాట చెప్తుంది,

దేవుని ఎన్నిక ద్వారా మనం కుమారులం,
   యేసు క్రీస్తు నందు నమ్మిక ఉంచువారు;
నిత్వత్వ గంయముతో,
   సౌభాతృత్వ కృప మనం ఇక్కడ పొందుతాం.
(సంఖ్యా 221 "మన స్వంత పాటల పుస్తకములో,"
     రచించబడినది సి. హెచ్. స్పర్జన్ చే, 1834-1892).
     (Number 221 in “Our Own Hymn Book,” compiled by C. H. Spurgeon, 1834-1892).

II. రెండవది, పాఠము మారిన వారిలో పరిశుద్దాత్మ నివసించడాన్ని గూర్చి మాట్లాడుతుంది.

"మరియు మీరు కుమారులై యున్నందున, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల లోనికి పంపెను…" (గలతీయులకు 4:6).

పరిశుద్దాత్మ తండ్రి నుండి మన యొద్దకు వచ్చును. మనం రక్షింప బడినప్పుడు దేవుడు పరిశుద్దాత్మను మన హృదయాల లోనికి పంపుతారు.

గమనించండి పాఠము చెప్తుంది దేవుడు పరిశుద్దాత్మను "మన హ్రుదయాలలోనికి" పంపుతాడు. ఆయన పరిశుద్దాత్మను మన బుర్రలోనికి పంపుతాడని చెప్పడం లేదు. ఆత్మ నీ హృదయము లోనికి వస్తుంది. నీకు నీ హృదయమే కేంద్రము. బైబిలు చెబుతుంది, "ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును" (రోమా 10:10).

మీరు దేవుని పిల్లలైనప్పుడు పరిశుద్దాత్మచే ముద్రింపబడతారు, అది శాంతిని, దేవునితో సహవాసాన్ని ఇస్తుంది. బయట నిలబడే కంటే, పెద్ద కుమారినిలా, దేవుని సహవాసములొనికి రండి, మారిన తప్పిపోయిన కుమారుని వలే. వారు క్రైస్తవులమని చాటుకుంటారు, గాని దానిని అనుభవించరు. వారు పిల్లలు కాదు, ఆత్మ నివసింపును గూర్చి తెలియదు. దాని అర్ధామేంటి అని ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు మనతో కోపపడతారు, వాళ్ళకు లేనిది మనకుందని చెప్పినందుకు. అది ఒక కారణం కయీను హేబెలును చంపడానికి. అందుకే పెద్ద కుమారుడు కోపపడ్డాడు తప్పిపోయిన తన సహోదరుడు తండ్రిచే అంగీకరింపబడి కుమారిని విందు ఏర్పాటు చేసినందుకు. "అతడు కోపపడి, లోపలి వెళ్లి పోవాల్సి పోయెను" (లూకా 15:28). తండ్రి బయటికి వచ్చి "బతిమాలుకొనెను" – లోపలి రమ్మని (లూకా 15:28). దేవుడు నిన్ను బ్రతిమాలుచున్నాడు క్రీస్తు నోద్దకు రమ్మని, దత్త పుత్రునిగా ఆదిక్యతలు అనుభవించమని! ఈ పాత పాట వినండి,

"నీ హృదయం నాకిమ్ము," పైనున తండ్రి అంటున్నాడు,
   ఏ బహుమతి ప్రాశస్తం కాదు మన ప్రేమ కంటే;
సౌమ్యంగా ఆయన అంటాడు, నీ వెక్కడున్నప్పటికి,
   "కృతజ్ఞతతో నన్ను నమ్ము, నీ హృదయాన్ని నాకిమ్ము."
"నీ హృదయాన్ని నాకిమ్ము, నీ హృదయాన్ని నాకిమ్ము,"
   ఆ సౌమ్య స్వరం విను, నీ వెక్కడున్నప్పటికి:
ఈ అంధకార లోకం నుండి నిన్ను వేరు పరుస్తాడు;
   మృదువుగా అంటాడు, "నీ హృదయం నాకిమ్మని."
("నీ హృదయం నాకిమ్ము" ఎరిజా ఇ. హేవిట్ చే, 1851-1920).

యేసుకు నీ హృదయాన్ని అర్పించినప్పుడు, నీవు పొందగలవు,

నేను రాజు బిడ్డను, రాజు బిడ్డను;
నా రక్షకుడైన యేసుతో, నేను రాజు బిడ్డను.
   ("రాజు బిడ్డను" హేరియాట్ ఇ. భుయెల్ చే, 1834-1910).
   (“A Child of the King” by Harriet E. Buell, 1834-1910).

III. మూడవది, పాఠము నూతన సమీప బంధం దేవుని పట్ల ప్రేమను గూర్చి మాట్లాడుతుంది.

"మరియు మీరు కుమారులై యున్నందున, నాయనా, తండ్రి అని, మోరపెట్టి, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను" (గలతీయులకు 4:6).

పాఠములో ఆఖరి మూడు మాటలు గమనించండి, "నాయనా, తండ్రి, మోర పెట్టటం." గమనించండి ఆత్మ మోర పెట్టుచున్నది, "నాయనా, తండ్రి" అని. ఇది ఆసక్తికరం. రోమా గ్రంధములో అపోస్తలుడైన పౌలు ఇదే చెప్తున్నాడు. తానూ అన్నాడు,

"ఏలయనగా మరల భయపడుటకు మీరు దాశ్యపు ఆత్మను పొందలేదు; గాని దత్త పుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా, తండ్రి అని, మోర పెట్టు చున్నాము" (రోమా 8:15).

మొదట ఆత్మే మోర పెడుతుంది, "అబ్బా, తండ్రి" అని. అప్పుడు మనం మోర పెట్టగలం, "అబ్బా, తండ్రి" అని. పరిశుద్దాత్మ మోర పెడుతుంది, తరువాత మనం మోరపెడతాం – "అబ్బా, తండ్రి" అని. పరిశుద్దాత్మ మనలను ప్రేరేపిస్తుంది అలా మోర పెట్టమని మనం మారి దేవుని పిల్లలమైన తరువాత!

"అబ్బా" బాలుని పదము "తండ్రికి." "అబ్బా" తండ్రికి సూచించే అరమోయిక్ పదము. ఆ పదము తండ్రులను పిలవడానికి చిన్న పిల్లలు వాడతారు. దానిని అనువదింపవచ్చు "పాపా" అని "డాడీ" అని. స్పర్జన్ అన్నాడు అబ్బా "వెచ్చని, సహజ, ప్రేమ మాట, దేవుని చిన్న బిడ్డకు తగినది." గేత్సమనే వనములో యేసు శ్రమ పడుచున్నప్పుడు, నేలపైన పడి మోరపెట్టాడు, "అబ్బా, తండ్రి...ఈ గిన్నె నా యొద్ద నుండి తోలగింపుము" (మార్కు 14:36). ఆవనములోనే సిలువ దగ్గరకు వెళ్ళాక ముందే చనిపోతానే మోనని ఆయన భయబడ్డాడు – అందుకే పరలోక తండ్రికి మోర పెట్టాడు – "అబ్బా, తండ్రి...ఈ గిన్నెను నా యొద్ద నుండి తోలగింపుము." ఆ మోర చూపిస్తుంది కుమారుడైన యేసు తండ్రి దేవునికి ఎంత దగ్గరో!

నీవు మారినప్పుడు, దేవుని దత్త పుత్రుని వలే, యేసు వలే, ప్రార్ధిస్తావు, "అబ్బా, తండ్రి!"

పాపమూ నుండి వైదొలిగి యేసును నమ్ము. ఆక్షణం ఆయన రక్తము నీ పాపములను కడిగి, ఆయన పునరుత్థాన శక్తి నీ హృదయాన్ని తెరిచి, దేవునిచే దత్తత చేసుకోబడతావు! నిత్యమూ ఆయన బిడ్డగా ఉంటావు! అప్పుడు పాడగలవు "రాజు బిడ్డ" –

ఒకప్పుడు నేను వెలి వేయబడిన వ్యక్తిని భూమిపై,
   ఎన్నికచే పాపిని, పుట్టుకతో అన్యున్ని;
కాని నేను దత్తత చేసుకోబడ్డాను, నాపేరు వ్రాయబడింది,
   వారసునిగా భవనానికి, త్రాడుకి కిరీటానికి.
నేను రాజు బిడ్డను, రాజు బిడ్డను:
   రక్షకుడైన యేసుతో, నేను రాజు బిడ్డను.
("రాజు బిడ్డను" హేరియట్ ఇ. భూయేల్ చే, 1834-1910)
     (“A Child of the King” by Harriet E. Buell, 1834-1910).

మీరు చార్లీ వెస్లితో పాటు పాడ గలుగుతారు,

నా దేవుడు సంధి చేసాడు, ఆయన క్షమించే స్వరాన్ని నేను విన్నాను;
   ఆయన బిడ్డగా నన్ను పొందాడు, నేను ఎన్నటికి భయపడను;
నమ్మకంతో దరి చేరాను, "తండ్రి, అబ్బా, తండ్రి!" మోర,
   మరియు "తండ్రి, అబ్బా, తండ్రి!" మోర.
("లెమ్ము! నా ఆత్మా, లెమ్ము!" చార్లెస్ వెస్లీ చే, 1707-1788).
   (“Arise! My Soul, Arise!” by Charles Wesley, 1707-1788).

విశ్వాసం ద్వారా, యేసు నోద్దకు రా. ఆయనను నమ్ము నీవు వెంటనే దేవుని బిడ్డవుగా మారుతావు! క్రీస్తు ఆయన రక్తము ద్వారా నీ పాపాన్ని కడిగి ఆయన పునరుత్థానము ద్వారా నీకు జీవాన్ని ఇస్తాడు. నిజ క్రైస్తవుడు కావాలనే విషయం మాతో మాట్లాడాలనుకుంటే, మీ సీటు వదిలి ఆవరణ వెనుకకు వెళ్ళండి. డాక్టర్ కాగన్ వేరే గదిలోనికి తీసుకెళ్ళి మీ ప్రశ్నలకు సమాధానాలిచ్చి ప్రార్ధిస్తారు. ఇప్పుడు వెళ్ళండి. డాక్టర్ చాన్, ఈ ఉదయం యేసును నమ్మే వారి కొరకు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే:
గలతీయులకు 4:3-7.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"రాజు బిడ్డను" (హేరియట్ ఇ. భూయేల్ చే, 1834-1910)
“A Child of the King” (by Harriet E. Buell, 1834-1910).


ద అవుట్ లైన్ ఆఫ్

దత్తత!

ADOPTION!

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మరియు మీరు కుమారులై యున్నందున, నాయనా, తండ్రి అని, మోరపెట్టి, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను" (గలతీయులకు 4:6).

OUTLINE