Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సిలువ యొక్క క్రీస్తు

THE CHRIST OF THE CROSS
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము ఉదయము, అక్టోబర్ 10, 2013
A sermon preached on Lord’s Day Morning, October 20, 2013
at the Baptist Tabernacle of Los Angeles

"మరియు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దీనిని అంగీకరించితిరి, దాని యందే నిలిచియున్నారు; మీ విశ్వాసము వ్యర్ధమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో, ఆ సువార్తముననె మీరు రక్షణ పొందు వారై యుందురు. ఆ కియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదే మనగా లేఖనముల ప్రకారము, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను సమాధి చేయబడెను" (I కోరిందీయులకు 15:1-3).


ఇది అపోస్తలుడైన పౌలు యొక్క తేటయైన సంక్షిప్త ఉచ్చారణ క్రైస్తవ సువార్తను గూర్చి. పదము "సువార్త" అర్ధము "శుభవార్త." పౌలు అన్నాడు కోరిందీయు సంఘమునకు సువార్తను గూర్చిన శుభవార్తను బోధించాడని. సువార్తని బట్టి వారు రక్షింపబడ్డారు, అబద్ధపు మార్పిడితో కాకుండా, "మీరు విస్వసముంచకపొతే" (I కోరిందీయులకు 15:12). తరువాత వారి కందించిన సువార్తను తిరిగి చెప్పాడు. సువార్తలో మూడు సామాన్య విషయాలున్నాయి: (1) "క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి చెందాడు, లేఖనముల ప్రకారము." (2) "అతడు సమాధి చేయబడెను." (3) "మూడవ రోజున తిరిగి లేచెను, లేఖనముల ప్రకారము." అదే సువార్త. అది శుభవార్త నిజ బోధకులు శతాబ్దాలుగా బోధిస్తున్నది. నేను అభిషేకింపబడినప్పుడు, నా అభిషేకపు పత్రము చెప్పింది నేను "సువార్త పరిచర్యకు" అబిషేకింపబడ్డానని. అంటే నేను నియమింపబడ్డాను లేక ప్రత్యేకింపబడ్డాను సువార్త బోధించడానికి. "సువార్త పరిచర్యలో" నేను చేయవలసిన ముఖ్య విషయం క్రీస్తు యొక్క మరణము, సమాధి పునరుత్థానములను గూర్చి ప్రకటించుట. అందుకే ప్రతి కాపరి పిలువబడ్డాడు, అభిషేకింపబడ్డాడు, ప్రత్యేకింపబడ్డాడు. పౌలు అన్నాడు, "నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరిచుచున్నాను" (I కోరిందీయులకు 15:1). కాని నేను చాలా విషయాలు చెప్పాలి సువార్త ప్రకటన పిలుపును గూర్చి.

I. మొదటిది, చాలా మంది కాపరులు ఈ రోజుల్లో వారి బోధకు సువార్తను కాకుండా వేరే దానిని ప్రధాన బిందువుగా పెట్టుకుంటారు.

వారు రాజకీయాల గూర్చి బోధిస్తారు. రాజకీయ పరిధిలో ఉండే విషయముపై వారి ప్రసంగము ఆధారపడుతుంది. ఇలాంటి బోధకులు రక్షణను గూర్చి నొక్కి చెప్పారు అది అనవసరం అనుకుంటారు. వారు కేవలం రాజకీయ వ్యక్తులు. సంవత్సరాల క్రితం, నేను సభ్యునిగా ఉన్న చైనీ సంఘములో, ఒక యవ్వనస్తుడనుకున్నాడు డాక్టర్ లిన్ వియాత్నం యుద్ధానికి వ్యతిరేఖంగా బోధించాలని. చివరకు తనతో చాలా మంది యవనస్తులను తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళంతా లాస్ ఎంజిలాస్ సరిహద్దులో ఉన్న, ఆల్ సైయింట్స్ అపిస్కోఫల్ పాసదేనాలో చేరారు. ఆ సంఘము చాలా ఆధునికము. కాపరి, డాక్టర్ జార్జి రిగాస్, ప్రతి ఆదివారము వియాత్నం యుద్ధమునకు వ్యతిరేఖంగా ఇతర రాజకీయ విషయాలపై బోధించాడు. కొంత కాలానికి మా సంఘపు రాజకీయ చర్చ విషయంపై అలసి పోయారు. చివరకు, వాళ్ళంతా ఆ గుడిని వదిలి లోకంలోనికి వెళ్లి పోయారు. నాకు తెలిసి వాళ్ళలో ఎవ్వరు కూడా గుడికి వెళ్ళడం లేదు. అదే పరిస్థితి "ముఖ్య" తెగల సంఘాలలో ఉంది. రాజకీయ ప్రసంగాలు జనాలను ఆపలేవు. ప్రతి పెద్ద సంఘాలు ఇలా వేల కొలది, లక్షల కొలది, సభ్యులను పోగొట్టుకున్నారు, వాళ్ళు దశాబ్దాలుగా సభ్యులుగా ఉండేవారు ఎందుకంటే వాళ్ళ ప్రసంగాలు రాజకీయ ఇతర విషయాలపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి.

తరువాత వాళ్ళు మనస్తత్వ శాస్త్రముపై తమ బోధను కేంద్రీకరించేవారు. వాళ్ళ స్వంత బోధలు రాబర్ట్ స్కల్లర్ జోయిల్ ఓ స్టీన్ బోధల్లా ఉంటాయి. కొన్ని సార్లు ఒక బైబిలు వచనము చూపిస్తారు, కాని వాళ్ళ ప్రసంగాలకు బైబిలు కేంద్ర బిందువుగా ఉండదు. ఒఫ్రా విన్ ఫ్రే డాక్టర్ డ్రూ టివి, వర్ధమానికుల వలే వారి బోధనంశము మంచిగా జయవంతంగా ఎలా ఉండాలి అని. గత మంగళ వారము ఒక రోమన్ కేధలిక్ నర్సు తో మాట్లాడాను ఆమె ప్రతి ఆదివారం మాస్ కి వచ్చి టివిలో జోయిల్ ఆస్టిన్ ను కూడా చూస్తారు. ఆమె ఫిలిప్పి నర్సు నేను చికిత్స చేయించుకున్న ఆసుపత్రిలో పని చేస్తారు. ఆమె నేనెప్పుడు చూసినా విషాద ముఖంతో కనిపించేవారు. కొన్ని జోకులు చెప్పినా, ఆమె నవ్వలేదు. ఆమె మతగురువులని అడిగాను, ఆమె చెప్పారు మాస్ కి వెళ్తూ, జోయిల్ ఆస్టిన్ ను ప్రతి ఆదివారం చూస్తానని, ఎందుకంటే ఎలా ఆనందంగా ఉండాలో ఆమెకు నేర్పిస్తాడట! జనాలను సంతోష పెట్టాలని బోధకులు ఇష్టపడతారు, కాని వ్యక్తిగత జీవితమూ ప్రభవితమవ్వదు, నిత్వత్వ ఆత్మల రక్షణపై ఏ ప్రభావమూ ఉండదు!

మూడవదిగా, కొందరు వచనం వెంబడి వచనం బోధిస్తారు. బైబిలులో చాలా విషయాలుంటాయి కాబట్టి, వీరు బోధలలో, ఒక విషయాన్నుండి ఇంకొక విషయానికి, మారుతూ ఉంటారు. చాలా మంది కాపరులు ఇలాంటి బోధ చేస్తుంటారు. అది వృధా ప్రయాస. చాలా తలంపులు ఉద్దేశాలు ఉండి ప్రజల జీవితాలు మార్చవు. నా సహాయకుడు, డాక్టర్ కాగన్, డాక్టర్ జాన్ మాక్ ఆర్డర్ గుడికి చాలా నెలలు హాజరయ్యారు, అతను మారకమునుపు. డాక్టర్ మాక్ ఆర్డర్ ఆసక్తికర వివరణలు ఇచ్చినా, డాక్టర్ కాగన్ రక్షణకు ఉత్ప్రేరణ కలిగించలేదు. ఆయన మారకుండానే గుడికి వెళ్ళినా, క్రైస్తవుడవ్వాలనే ఒక గట్టి ఆశ మాత్రమే ఉండేది. వచనం వెంబడి వచనం బోధించే సంఘాల ఉద్దేశము బైబిలు చదవడం బోధకు అవసరమని. బైబిలే ప్రధాన కేంద్రమైపోతుంది, బైబిలు యొక్క క్రీస్తు కాకుండా. దీనినే పాండిమేనియనిసం అంటారు. ఇలాంటి సంఘాలలో ప్రజలు చల్లగా ఉంటారు, కాని తెలివిగా ఉంటారు, చల్లని పరిశయ్యల వలే.

చివరిగా, "ఆరాధనపై" దృష్టి పెట్టేవారు. ఇది చాలా కొత్త మలుపులకు తావిస్తుంది. ఒక కాపరి స్నేహితుడు నేను ప్రత్యక్ష సాక్షులం ఒక విపరీత "ఆరాధనకు" ప్రజలు సింహాల్లా అరిచారు, కేక లేసారు, ఇతరులు విడిపించబడిన దయ్యాల్లా అరుస్తూ దోర్లారు. ఇంకొక "ఆరాధనలో" నా భార్య పిల్లలు నేను చూసాం ప్రజలు విగ్రహాలను అరాదిస్తూ నవ్వుతో నేలపై సాష్టంగా పడడం. మేము ఉలిక్కి పడి అపవిత్ర స్థలంలో ఉన్నట్టు అనుకుంటున్నాం! ఇంకొక స్థలంలో, క్రైస్తవ కళాశాలలో, అమ్మాయిలు వేశ్యల వలే నాట్య మాడుతున్నారు ఎర్రని పొగ వస్తుంది, సంగీతం వినిపిస్తుంది. ఇంకొకటి, కొన్ని వైపరిత్య "ఆరాధనలలో" గంటల తరబడి పాడిందే పడేటట్టు ఇంద్రజాలం చేస్తారు. అలాంటి కూతాలలో నిజ బోధకు తక్కువ సమయ ముంటుంది. ఇక్కడ చెప్పాలి, ఇలాంటి గుడులలో క్రీస్తుకు ప్రసంగాలలో ప్రాముఖ్యత ఉండదు!

"క్రీస్తు" ఇలాంటిది ఆరాధనలో బోధింపబడేవారు నిజ క్రీస్తు కాదు. క్రీస్తు సువార్త ఉద్దేశము ఒకని వ్యక్తిగత అనుభూతికి మార్చబడుతుంది. అతని దూసుకుపోయే పుస్తకంలో, క్రీస్తు లేని క్రైస్తవ్యము, డాక్టర్ మైకల్ హర్టన్ ఇలా అన్నాడు,

      వ్యక్తిగత సంబంధం దేవునితో యేసు క్రీస్తు ద్వారా మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే, వాస్తవానికి సంబందము ఉనికిలో ఉండడమే లేదు, స్వార్ధముతో తప్ప…యేసు నిజంగా నా బలిపీటం అయ్యాడు (Michael Horton, Ph.D., Baker Books, 2008, p. 43).

నేను ఈ మధ్యే కలిసిన ఒక యవస్తుడు నాతో అన్నాడు, "నాకు బైబిలు వద్దు గుడివద్దు. నాకు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉంది, అది నాకు చాలు." ఈ రోజుల్లో బోధలు అలాంటి వారినే ఉత్పత్తి చేస్తున్నాయి, వాళ్ళ ఉద్దేశాలు అనుభూతులే క్రీస్తు అనుకుంటారు. ఇది ఇంకొక యేసు! ఆయనే అబద్ద క్రీస్తు! ఆ సువార్తను పౌలు బోధించలేదు మన పాఠ్యము భాగములో! అలాంటిది ఆలోచన, అబద్దపు తలంపులు, చాలామంది కాపరుల నుండి వస్తాయి సువార్తను కాకుండా వేరే దానిని బోధకు ప్రధానంగా తీసుకుంటారు. అపోస్తలుడైన పౌలు "మరియొక సువార్త, మీరు అంగీకరింపనిదిను గూర్చి మాట్లాడాడు" (II కోరిందీయులకు 11:4). నేను మాట్లాడిన దంతా "మరియొక సువార్తను" కేంద్రంగా చేసుకుంది. మన పాఠ్యములో పౌలు అన్నాడు,

"నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింతిని, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను" (I కోరిందీయులకు 15:3).

అదే సువార్త!

II. రెండవది, సువార్త కేంద్ర బిందువు క్రీస్తు యొక్క సిలువ.

ఇప్పటి వరకు నేను చెప్పిన బోధలలోని రకాలలో, క్రీస్తు యొక్క సిలువ కేంద్రమే కాదు - ముఖ్య విషయమూ కాదు - క్రైస్తవ్యానికి పునాది కాదు. డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస వెల్ అన్నాడు,

      క్రీస్తు మరణాన్ని...సందేశము నుండి తొలగిస్తే ఏమీ మిగలదు. బోధకునికి "శుభవార్త" ఏమీ మిగల్చదు, మన పాప క్షమాపణ...వీటిలో ...క్రైస్తవ్యపు రకాలు కొత్త నిబంధన క్రైస్తవము? నిస్సందేహంగా అది సిలువ క్రైస్తవత్వము. (W. A. Criswell, Ph.D., In Defense of the Faith, Zondervan Publishing House, 1967, p. 67).

అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"మన ప్రభువైన యేసు క్రీస్తు, సిలువ యందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరవును గాక" (గలతీయులకు 6:14).

"క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి నొందేను." అది పౌలు బోధ ప్రధాన అంశము. నిజానికి, కోరిందీయు సంఘానికి చెప్పాడు, "నేను యేసు క్రీస్తును అనగా, సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరగ కుండునని నిశ్చయించు కొంటిని" (I కోరిందీయులకు 2:2). ఇది బైబిలు క్రైస్తవ్యము అయితే, సిలువ యొక్క క్రైస్తవ్యము అవుతుంది. గొప్ప స్పర్జన్, "ప్రసంగీకులకు రారాజు," అన్నాడు, "సువార్త యొక్క హృదయము విమోచన, విమోచన సారంశము సిలువపై మనకు ప్రతిగా క్రీస్తు త్యాగము."

ఈ రోజుల్లో చల్ల గుడులు వారు విశ్వాసానికి గుర్తుగా పావురపు చిహ్నం పెడుతున్నారు. నాకైతే అది పొరపాటు. పావురము పరిశుద్ధాత్మకు చిహ్నం. కాని పరిశుద్ధాత్మ సువార్త సందేశంలో త్రిత్వములొ ప్రధాన వ్యక్తి కాదు. యోహాను 16 వ అధ్యాయములో యేసు అన్నాడు పరిశుద్ధాత్మ "తనంతట తానూ మాట్లాడదు" (యోహాను 16:13). మళ్ళీ, యేసు అన్నాడు, "ఆయన నన్ను ఘన పరుస్తాడు" (యోహాను 16:14). పరిశుద్ధాత్మ పని ఆయన వైపు దృష్టిని మల్లిన్చుకోవడం కాదు, కాని క్రీస్తుకు మహిమ తీసుకు రావడం. కాబట్టి పరిశుద్ధాత్మపై అసలు ప్రసంగం దృష్టి పెట్టడం నిజ బైబిలు పర గుడి అనిపించుకోదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు మన పరిచర్య అంతటిలో క్రీస్తుకు ప్రాధాన్యత యివ్వాలి మన బోధ అంతటిలో. ఆయన అన్నాడు క్రీస్తు

"...సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, అదే చర్చి: ఎవరు ప్రారంభంలో, మరణం నుండి మరల జన్మించి; అన్ని విషయాలలో అతను ప్రాముఖ్యత కలిగి ఉండవచ్చని [ప్రతిదీ అతను ఆధిపత్యం కలిగి ఉండవచ్చని]. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింప వలెననియు…ఆయన సిలువ రక్తము చేత సంధి చేసియున్నాడు" (కోలోస్సయులకు 1:18-20).

మనకు పాప క్షమాపణ ఉంది, దేవునితో సమాధాన పడవచ్చు, "ఆయన సిలువ రక్తము ద్వారా" – కేవలము క్రీస్తు సిలువ రక్తము ద్వారా మాత్రమే!

నీవు యేసు నోద్దకు వచ్చావా శుద్ధి చేసే శక్తి కొరకు?
   గొర్రె పిల్ల రక్తములో కడుగ బడ్డావా?
ఈ ఘడియలో నీవు పూర్తిగా ఆయన కృప యందు నమ్ముచున్నవా?
   గొర్రె పిల్ల రక్తములో కడుగ బడ్డావా?
రక్తములో కడుగబడ్డావా, ఆత్మకు శుద్ధి చేసే గొర్రె పిల్ల రక్తములో?
   నీ వస్త్రాలు మచ్చ లేనివా? హిమము వలే తెల్లగా ఉన్నాయా?
గొర్రె పిల్ల రక్తములో కడుగ బడ్డావా?
("రక్తములో కడుగ బడ్డావా?" ఎలీషా ఎ. హాఫ్ మాన్ చే, 1839-1929).
(“Are You Washed in the Blood?” by Elisha A. Hoffman, 1839-1929).

ఓ! ప్రశస్త ప్రవాహం
   హిమము వలే తెల్లగా మార్చేది:
వేరే ప్రవాహం నాకు తెలియదు,
   యేసు రక్తము తప్ప.
("రక్తము ద్వారా మాత్రమే" రోజార్డ్ లోర్, 1826-1899).
(“Nothing But the Blood” by Robert Lowry, 1826-1899).

"నాకియ్యబడిన ఉపదేశమును మొదలు మీకు అప్పగించితిని, అదేమనగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను…" (I కోరిందీయులకు 15:3).

డాక్టర్ క్రీస వెల్ అన్నాడు.

      "మొట్ట మొదటిగా" అనే మాటలలో అర్ధమేమి? ఆయన విషయం సమయంలో ప్రాముఖ్యతతో సంధానింప బడింది...క్రీస్తు మరణం ద్వారా మన పాప పరిహారం అనే సిద్ధాంతం [పాపి స్థానములో] అది కృపకు మూలరాయి, సువార్తకు హృదయము. ఏ సత్యము దీని ముందు నిలువజాలదు...పరిశుద్ధ లేఖనాల గొప్ప సిద్ధాంతాలు సిలువ చెంతకు నడిపిస్తాయి.
      ఒక విమర్శకుడు ఒకసారి చార్లెస్స్ హేడన్ స్పర్జన్ తో అన్నాడు, "నీ ప్రసంగాలన్నీ ఒకేలా ఉన్నాయి," దానికి ప్రపంచ ప్రఖ్యాత లండన్ బోధకుడు జవాబిచ్చాడు, "అవును, నేను నా పాఠ్య భాగాన్ని బైబిలులో ఎక్కడ నుండైనా తీసుకుంటాను [నేరుగా వెళ్తాను] సిలువ దగ్గరకు," ప్రాయశ్చిత్తం లేకుండా క్షమాపణ లేదు; రక్తం చిందింప బడకుండా విమోచన లేదు; అప్పు తీర్చకుండా సమాధాన పర్చబడ లేదు...
      క్రీస్తు ప్రాయశ్చిత్త మరణము యొక్క బోధ విశిష్టమైయింది, నూతన నిబంధన సిద్ధాంతాన్ని ద్రువికరిస్తుంది. ఇతర మతాల నుండి మన విశ్వాసాన్ని వేరుగా చూపిస్తుంది. క్రైస్తవ సందేశం విశిష్టంగా విమోచనం. దాని ప్రాధమిక ఉద్దేశం పాపం యొక్క బంధకం తీర్పు నుండి మానవుని విడుదల చేయడం...అన్నింటి కంటే మిన్నగా విమోచనం సువార్త, సుభవార్త ప్రకటన అదే దేవుడు క్రీస్తు నిమిత్తము మనలను క్షమించాడు (W. A. Criswell, Ph.D., In Defense of the Faith, ibid,. pp. 68-70).

III. మూడవది, సిలువ యొక్క క్రీస్తు మన పాపాల నుండి మనలను రక్షిస్తాడు.

ముస్లిములు యేసును నమ్ముతారు – ఒక ఉద్దేశంలో. ఆయనను వారు "ఇషా" అంటారు. ఖురాను చెబుతుంది ఆయన కన్య ద్వారా జన్మించాడని. ఇంకా చెబుతుంది పరలోకానికి ఆరోహణుడు అయ్యెను. కొంత మంది అవివేకులు అనుకుంటారు అది సరిపోతుందని. కాని వందల కొలది యవ్వనస్తులు ముస్లిము ప్రపంచంలో ఖురాన్ లో ఉన్న "ఇషా" యేసు నుండి తొలగి పోవుచున్నారు. చాలా మంది బైబిలు యొక్క యేసు వైపు మరలుతున్నారు గతంలో ఎప్పుడూ లేనంతగా. క్రైస్తవ్య యేసును నమ్మినందుకు శ్రమల ద్వారా కష్టాల ద్వారా వెళ్లారు. ఎందుకు శ్రమపడ్డారు, హింసింపబడ్డారు, మన యేసును నమ్మడానికి? ఎందుకో నేను చెప్తాను! ఖురాను యేసు సిలువపై మరణించలేదు మన పాపాల కొరకు – అందుకే! ఖురాను చెబుతుంది ఆయన సిలువపై మరణించ లేదు మనలను రక్షించడానికి! కాని ఖురాను వాళ్లకు చెప్పాడు పాప క్షమాపణ ఎలా పొందాలో. అది చెబుతుంది మంచి చెయ్యాలని, నియమాలకు లోబడాలని. కాని చెప్పాడు ఎలా క్షమింపబడాలో దేవుని బిడ్డ ఎలా అంగీకరింపబడాలో. ఖురాను వారికి చెప్పలేదు, ఎందుకంటే సిలువపై యేసు మరణించాడనే విషయాన్ని అది నిరాకరిస్తుంది! మన యేసును నమ్మడానికి గొప్ప హింసలు పొందారు ఎందుకంటే వారికి దేవునితో ఆయనే సమాధాన మిచ్చాడు, "ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి యున్నాడు" (కొలస్సయులకు 1:20)?

సిలువ యొక్క క్రీస్తును నమ్మడానికి నీవు హింసల ద్వారా వెళ్తావా? దేవునితో సమాధాన పడడానికి నీ జీవితాన్నే ఫణంగా పెడతావా "[ద] సిలువ రక్తము ద్వారా"? వాళ్ళు చేసారు. ప్రతి రోజు చేస్తారు. అగ్నితో కూడిన ముస్లిము ద్వేషం ద్వారా నువ్వు వెళ్తావా నీ పాప క్షమాపణ కొరకు క్రీస్తు రక్తము ద్వారా నిన్ను రక్షించడానికి సిలువపై కార్చబడింది? వాళ్ళు చేస్తారు. ప్రతి రోజు చేస్తారు.

పాస్టర్ వర్మ్ బ్రాండ్ మేగజైన్ లో కొంత కాలం క్రితం చూసాను ఇండోనేషియాలో ఒక యవ్వన ముస్లిము అమ్మాయి ముఖము. ఆమె యేసును నమ్మినందుకు ముఖముపై యాసిడ్ వేసారు. ఆమె ముఖం వికారమై, వివరణకు అతీతంగా ఉంది. కాని ఆమె నవ్వుతుంది. వాళ్ళున్నారు ఎప్పుడూ నవ్వుతూనే ఉందని. ఆమె అనుకుంది సిలువ యొక్క క్రీస్తును పొందుకోడానికి ముఖము వికారంగా మారినా పర్వ లేదు అని! ఎందుకు? ఎందుకంటే,

"క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను లేఖనముల ప్రకారము" (I కోరిందీయులకు 15:3).

నా పాపమూ – ఓ, ఈ మహిమాయుక్త తలంపులోని దీవెన,
   నా పాపమూ, భాగము కాదు, మొత్తమంతా –
సిలువ వేయబడింది నేను భరించ నక్కర లేదు,
   ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ఓ నా ఆత్మ!
("అంతా మంచిగా ఉంది నా ఆత్మలో" హెచ్. జి. స్పాఫోర్డ్, 1828-1888)
(“It Is Well With My Soul” by H. G. Spafford, 1828-1888).

అవును, క్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యాడు. కాని ఖురాను అంటుంది అదే! సిలువ లేకుండా పరలోకానికి క్రీస్తు ఆరోహణం నువ్వు కలిగి యుంటే – నీకు రక్షణ లేదు. నీవు తప్పక సిలువ కలిగి యుండాలి! సిలువపై యేసు నీ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాడు. సిలువ లేకుండా పాప పరిహారము లేదు, దేవునితో సమాధానం లేదు. సిలువ యొక్క క్రీస్తు మాత్రేమే పాపము నుండి నిన్ను రక్షిస్తాడు! సిలువ యొక్క క్రీస్తు మాత్రమే అతని రక్తము ద్వారా నీ పాపలన్నింటిని కడుగుతాడు. అవును,

"క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను లేఖనముల ద్వారా" (I కోరిందీయులకు 15:3)

లక్షలాది హత సాక్షులు పరిశుద్దలు అన్నారు, "సిలువ యొక్క క్రీస్తుకు నేనర్పించుకుంటాను! సిలువ యొక్క క్రీస్తుకు నా చేతులు పాదాలు ఇస్తాను! సిలువ యొక్క క్రీస్తునిమిత్తము నా శరీరాన్ని దుష్ట మృగాలకి ఇస్తాను! నా జీవితమంతా సిలువ యొక్క క్రీస్తును అర్పిస్తాను!"

వారు నియంత కఠిన ఉక్కును సమీపించారు,
   సింహపు భయంకర గుహను;
వారి మేడలను మరణానికి అప్పగించారు:
   వారి రైలును ఎవరు వెంబడిస్తారు?
("దైవ కుమారుడు యుద్ధానికి వెళ్తున్నాడు" రేజినార్డ్ హేబర్ చే, 1783-1826).
(“The Son of God Goes Forth to War” by Reginald Heber, 1783-1826).

వాళ్ళున్నారు అది తగినదని సిలువ యొక్క క్రీస్తుచే వారి పాపాలు క్షమింపబడి కడగబడడం.

నీవు క్రీస్తును స్వీకరిస్తావా? ఇప్పుడే ఆయనను నమ్ముతావా, ఈ ఉదయాన్నే? డాక్టర్ వాట్స్ తో పాటు అంటావా, "ఇదిగో, ప్రభువా, నేనర్పించుకుంటాను, ‘ఇదే నేను చేయ గలిగిందంతా"? నువ్వు అంటావా, "నేను సిద్ధంగా ఉన్నాను సిలువ యొక్క క్రీస్తును అర్పించుకోడానికి నా పాపన్నుంచి, నన్ను రక్షించడానికి చనిపోయిన వాడు." నీ కుర్చీ వదిలి ఆవరణము వెనుకకు వెళ్ళు. డాక్టర్ కాగన్ వేరే గదిలోనికి తీసుకెల్లితే నిన్ను రక్షించడానికి నీ కొరకు మరణించిన ఆయనను అర్పించుకోవచ్చు. ఇప్పుడే ఆవరణము వెనుకకు వెళ్ళండి. డాక్టర్ చాన్, ప్రార్ధించండి సిలువ యొక్క క్రీస్తును నమ్మిన వారి కొరకు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే:
I కోరిందీయులకు 15:1-4.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ద ఓల్డ్ రగ్గేడ్ క్రాస్" (జార్జి బెన్నార్ద్ గారిచే, 1873-1958).
“The Old Rugged Cross” (by George Bennard, 1873-1958).


ద అవుట్ లైన్ ఆఫ్

సిలువ యొక్క క్రీస్తు

THE CHRIST OF THE CROSS

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మరియు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దీనిని అంగీకరించితిరి, దాని యందే నిలిచియున్నారు; మీ విశ్వాసము వ్యర్ధమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో, ఆ సువార్తముననె మీరు రక్షణ పొందు వారై యుందురు. ఆ కియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదే మనగా లేఖనముల ప్రకారము, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను సమాధి చేయబడెను" (I కోరిందీయులకు 15:1-3).

I.   మొదటిది, చాలా మంది కాపరులు ఈ రోజుల్లో వారి బోధకు సువార్తను కాకుండా వేరే దానిని ప్రధాన బిందువుగా పెట్టుకుంటారు, II కోరిందీయులకు 11:4.

II.  రెండవది, సువార్త కేంద్ర బిందువు క్రీస్తు యొక్క సిలువ, గలతీయులకు 6:14; I కోరిందీయులకు 2:2; యోహాను 16:13,14; కొలస్సయులకు 1:18-20.

III. మూడవది, సిలువ యొక్క క్రీస్తు మన పాపాల నుండి మనలను రక్షిస్తాడు, కొలస్సయులకు 1:20.