Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




తప్పిపొయిన సంఘస్తులు గొర్రెలను దొంగిలించే బోధకులు
(ఆఖరి దినాల్లో సంఘాలు – భాగము 11)

LOST CHURCH MEMBERS AND SHEEP STEALING PREACHERS
(THE CHURCHES OF THE LAST DAYS – PART II)
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము సాయంకాలము, అక్టోబర్ 19, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Saturday Evening, October 19, 2013

"యేసు దేవాలయములో నుండి, బయలుదేరి వెళ్ళుచుండగా: ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా? రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిఛియుండకుండ, పడద్రోయబడునని, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండమీద కూర్చుండి యున్నప్పుడు, శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి, చెప్పండి, మాకు, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకును, ఈ యుగ సమాప్తికిని సూచనలేవి?" (మత్తయి 24:1-3).


యేసు యెరుషములోని దేవాలయము నుండి బయటకు వెళ్ళాడు. .ప్రపంచములోనే అది ఒక ప్రాముఖ్య భవనము. శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. దేవాలయానికి సమీపంలో ఉన్న భవనాలను ఆయనకు చూపించాలనుకున్నారు. యేసు దేవాలయము నుండి నడిచి వెళ్లి శిష్యులతో ఇలా అన్నాడు, "మీరు ఇవన్నియు చూచుచున్నారే? సత్యము చెప్తాను, రాయి పై రాయి నిలవకుండా; పడద్రోయబడును" (ఎన్ ఐవి).

నా భార్య నేను యెరుషలేములొ ఉన్నప్పుడు దేవాలయముండే స్థలాన్ని చూసాం. అది అక్కడ లేదు. రోమా జనరల్ తీతు వచ్చి యెరుషలేము పట్టణాన్ని 70 ఎ.డి.లో నాశనం చేసాడు. దేవాలయమంతా కూల్చబడింది, రోమీయులచే రాళ్ళు చెల్లాచెదురయ్యాయి. దేవాలయపు బయటగోడ నిలిచింది. అది "వెయిలింగ్ వాల్." యూదులు ప్రపంచ నలుమూలల నుండి ఈ గోడ దగ్గరకు వచ్చి మెస్సియ వచ్చి తిరిగి దేవాలయాన్ని నిర్మించాలని ప్రార్ధిస్తారు. నా కొడుకు లెస్ లీ అక్కడ ఉన్నప్పుడు, యూదా వస్రాన్ని ధరించాడు. ఆ వెయిలింగ్ గోడపై చేతులుంచి ప్రార్ధించాడు. ఒకరొచ్చి తనను యూదుడనుకున్నాడు. లెస్ లీ వెనుకకు వచ్చి నూనెతో అభిషేకించాడు!

రోమీయులు దేవాలయాన్ని కూల్చివేయడం మనకు పురాతన చరిత్ర. శిష్యులు ఆశ్చర్యపడి ఉండాలి అలా జరుగుతుందని యేసు చెప్పినప్పుడు. ఆయన అన్నాడు, "రాతి మీద రాయి నిలువకుండ, పడద్రోయబడును." ఈ ప్రవచనము నెరవేరింది నలబై సంవత్సరాలలోపే తీతుకు అతని రోము సైన్యముచే.

తరువాత యేసు దేవాలయము నుండి ఒలీవల కొండకు వెళ్ళాడు. కొండకు ప్రక్కగా కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయనను రెండు ప్రశ్నలు అడిగారు.

1. ఇది ఎప్పుడు జరుగును? [దేవాలయము ఎప్పుడు నాశనమవుతుంది?].

2. నీరాకడకును, ఈ యుగ సమాప్తికిని సూచనలేవి – [ఈ తరము; యుగ సమాప్తి?].


మొదటిప్రశ్నకు సమాధానము మత్తయి సువార్తలో వ్రాయబడలేదు. లూకా 21:20-24 లో వ్రాయబడింది. ఆవచానాల్లో ఆయన అన్నాడు యెరుషలేము సైన్యముతో చుట్టబడుతుంది,

"వారు కత్తిచేత కూలుదురు, చేర పట్టబడిన వారై సమస్తమైన ఆన్యజనముల మధ్యకు పోవుదురు: ఆన్య జనముల కాలములు సంపుర్నమగు వరకు, యెరుషలేము ఆన్యజనముల చేత త్రోక్కబడును" (లూకా 21:24).

మత్తయి సువార్త యేసును ఇజ్రాయెల్ రాజుగా చూపిస్తుంది. ఈ సమాచారము అక్కడ అతకదు. లూకాలో వ్రాయబడింది, అన్యదేశాలను గూర్చి వివరంగా.

రెండవ ప్రశ్నకు సమాధానము శిష్యులకు వివరంగా మత్తయి సువార్తలో యివ్వబడింది. వాళ్లడిగారు, "నీ రాకడకు సూచనలేమిటి, యుగ సమాప్తి ఎలా ఉంటుంది?" ఈ ప్రశ్న అడిగినందుకు ఆయన వారిని గద్ధించలేదు. ఆయన అనలేదు, "సూచనలేవీ ఉండవని." అలా చేయడానికి పరిపూర్ణ అవకాశము, కాని బదులుగా సూచనల పట్టీ యిచ్చాడు. ఇవి ఆయన రెండవ రాకడకు సూచనలు, యుగ సమాప్తి తరము అంతము. అవును, బైబిల్ భోధిస్తుంది ఈ తరము గతిస్తుందని, ప్రపంచము అంతమవుతుందని. బౌద్ధ మతము భోధిస్తుంది చరిత్ర తిరుగుతుందని, అంతములేకుండా. డిస్నిస్ లయన్ కింగ్ జీవిత చక్రాలు గూర్చి మాట్లాడుతూ, బౌద్ధ మతము అభిప్రాయము ఇచ్చాడు. కానీ బైబిలు భోధిస్తుంది చరిత్ర క్రమమని, అంటే, సర్కిల్ లో కాకుండా లైనుగా వెళ్తుందని. దానికి ఆరంభము, మధ్యత్వము, అంతము ఉంటుంది. దేవుడు ప్రపంచాన్ని ఆదిలో ఏమీ లేకుండా సృష్టించాడు. యేసు క్రీస్తు మధ్యలో లోకంలోనికి వచ్చాడు. అంతములో లోకము అగ్నిలో కాల్చి వేయబడుతుంది. అందుకే వాళ్ళు ఆయనను రెండవ రాకడకు యుగ సమాప్తికి సూచనలడిగారు –లోకము అంతము మనకు తెలిసినట్టుగా. ఆయన వారికి చాలా సూచనలిచ్చాడు.

డాక్టర్ జాన్ ఎఫ్. వాల్వొర్ద్ డాలస్ వేదాంత కళాశాలకు చాలా సంవత్సరాలు అద్యక్షులుగా ఉన్నారు. ఆయనకు బైబిలు ప్రవచన తర్జుమాలో మంచి గౌరము ఉంది. 1980 లో మన సంఘములో భోదించాడు. డాక్టర్ వాల్వొర్ద్ "సూచనలను" యేసు ఇచ్చినవి మత్తయి 24:4-14, "సాధారణ సూచనలు, ఇప్పుడు గమనింపదగినివి గొప్ప శ్రమల కాలములో నెరవేరతాయి" (John F. Walvoord, Th.D., Major Bible Prophecies, Zondervan Publishing House, 1991, p. 254).

నేను డాక్టర్ వాల్వోర్డ్ చెప్పిన దానితో ఏకీభవిస్తాను. ప్రపంచములో ఇప్పుడు ఈ "సామాన్య సూచనలు" చూస్తున్నాం. యేసు ఇచ్చిన సూచనలు మత్తయి 24:4-14 లో ఇవి:

1. అబద్ద క్రీస్తులు, 24:5. నేను నమ్ముతాను ఇది క్రీస్తుగా కనబడే దెయ్యాలను గూర్చి చెప్పబడింది. 24 వ వచనంలో యేసు అన్నాడు, "అబద్ద క్రీస్తులు, అబద్ద ప్రవక్తలు లేస్తారు." నేను నమ్ముతాను ఇప్పుడు క్రీస్తును కనుపరచే దెయ్యాలు, ఎలాంటి వంటే మొర్మోను క్రీస్తు, యెహోవా సాక్షులు ఆత్మక్రీస్తు, క్రైస్తవ శాస్త్ర క్రీస్తు, క్రీస్తు, లేక ఇషా, ఖురాన్ ఇస్లామువి, స్వతంత్ర ప్రోటేస్టన్టిసం, క్రీస్తు, రోమన్ కేథలిసం "క్రిస్టో". అబద్ద ప్రవక్తలు అబద్ద క్రీస్తులను చంపిస్తారు! వీరు అబద్ధపు యేసును, కనుపరచే దెయ్యాలు. అబద్ద క్రీస్తుల పెరుగుదల నిజంగా ఆఖరి దినాలలో ఒక సూచన.

2. యుద్ధములు యుద్ధ పుకార్లు. ఇరవై శతాబ్దంలో చరిత్రలో మొదటిసారిగా రెండు ప్రపంచయుద్ధాలు వచ్చాయి. అప్పటి నుండి ప్రపంచ అనేక ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది.

3. కరవులు. ప్రపంచలో ఈనాడు లక్షలాది మందిని ప్రతి ఏటా కరవు నాశనం చేస్తుంది. గత 100 సంవత్సరాలలో చాలామంది ఆకలి బాధకు చనిపోయారు. మనకు అమెరికాలో ఇంకా అధిక భోజనము ఉంది. కాని ప్రకటన 6 లోని "నల్ల గుఱ్ఱము" కరవు భీభత్సాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో తీసుకెళ్ళింది.

4. కాటకాలు. సరియైన గ్రీకు పాఠ్యము చెప్తుంది ఇది ప్రాముఖ్య సూచన అని అంతానికి. కొత్త రోగాలు, ఎయిడ్స్ లాంటివి, అభివృద్ధి ప్రపంచంలో లెక్కలేనన్ని చావులకు కారణమయింది. చాల మారుమూల ప్రాంతాలకు వైద్యము అందుబాటులో లేదు. బర్డ్ ప్లూ స్వైన్ ప్లూ, ఇలాంటి నయము చేయలేని రోగాలు ఈనాడు భయాన్ని కొనసాగిస్తున్నాయి.

5. భూకంపములు. జనాభా పెరుగుదలతో, భూకంపాలు భయంకరంగా పెరిగాయి, చాలమందిని వేదిస్తున్నాయి. క్రీస్తు రెండవ రాకడముందు భయంకర భూకంపాన్ని బైబిలు ఊహిస్తుంది. అది గొప్ప ప్రపంచ పట్టణాలను నాశనం చేస్తుంది. (ప్రకటన 16:18-20).

6. హత సాక్షి శ్రమలు, క్రైస్తవుల శ్రమలు. హతసాక్షులవడం, మన తరములో లక్షణాలు. వారి విశ్వాసాన్ని బట్టి లక్షలాది మంది చనిపోయారు. యేసు దీనిని మత్తయి 24:9-10 లో సూచించాడు.

7. అబద్ద ప్రవక్తలు. గత 100 సంవత్సరంలలో చరిత్రలో మునుపు ఎన్నడులేని విధంగా అబద్ద భోధకులు మతాలు పుట్టుకొచ్చాయి, వేదాంత స్వతంత్రత, బైబిలును తిరస్కరిస్తుంది, అది పెద్ద వేదాంత పాఠశాలలో పాసదేనా, కాలిఫోర్నియాలోని, పుల్లర్ సేమినదీ లాంటి వాటిలో భోధింపబడుతున్నాయి.

8. న్యాయ స్థబ్దత పెరుగుదల క్రైస్తవ ప్రేమ లోపించుట. "అక్రమము విస్తరించుట చేత, అనేకుల (ప్రేమ) ప్రేమ [చల్లారును]" (మత్తయి 24:12).
      (చూడండి జాన్ ఎఫ్. వాల్వొర్ద్, ఐబిఐడి, పేజిలు 354-356).


గ్రీకుపదము "అక్రమము" మత్తయిలోని 24:12 అర్ధము "నీతిలేకపోవుట." దాని గ్రీకు పదము "అనోమియా." అది న్యాయములేని జీవితాల "క్రైస్తవులను" గూర్చి చెప్పబడుతుంది. దానికి ఆంగ్ల పదము ఆంటేనోమియన్. అలా యేసు ఊహించడం ఆఖరి దినాలలో సంఘాలు శారీరక నీతిలేని వ్యక్తులతో నింపబడుతుందని. నేను చూసిన సంకుచిత ఆత్మ కలిగినవారిలో ప్రముఖులు అంటేనోమియన్లు క్రైస్తవులని చెప్పుకుంటారు. ఈనాడు సంఘాలు వారితో పోయాయి. వ్యక్తిగతంగా వారు నన్ను ఎలా ఎదుర్కొన్నారో అనే దానిపై ఒక పుస్తకము రాయగలను. ఏదో ఒక రోజు. వారి సంకుచితత్వంతో నా పరిచర్యను వదిలేయాలన్నంతగా నిరుత్సాహపడ్డాను. కొన్ని సార్లు వీరు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే గుడి వదిలేయ్యాలన్నంతగా శోధింపబడ్డాను. నిజ క్రైస్తవులపై వారు అలాంటి ముద్రవేస్తారు. అలాంటి సంకుచితులు వారు తిరిగి జన్మించిన క్రైస్తవులని చెప్పుకున్నారు! ఇలాంటి క్రైస్తవులు పెరగడం వలన, నిజ క్రైస్తవుల "దేవుని" ప్రేమ చల్లారిపోతుంది! అదే క్రీస్తు మత్తయి 24:12 లో ప్రస్తావించాడు. డాక్టర్ మెక్ గీ అన్నాడు, "అక్రమము విస్తరించినప్పుడు, అనేకుల ప్రేమ చల్లారును, ఆఖరి దినాల్లో ఇంకా ఎక్కువ" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, p. 127; note on Matthew 24:12).

చైనీయ బాప్టిస్టు సంఘములో డాక్టర్ తిమోతీలిన్ 23 సంత్సరాలు నాకు కాపరిగా ఉన్నాడు. ఆఖరి దినాల సంఘాలను గూర్చి డాక్టర్ లిన్ అన్నాడు, "ఈనాడు ‘ఒకరినొకరు ప్రేమించుట’ ఒక వల్లింపు మాత్రమే, సంఘాలచే కాని దృష్టి పెట్టదు...ఒక సంఘము ప్రేమ ప్రాముఖ్యము సారాంశాన్ని అర్ధం చేసుకోలేకపోతే...దేవుడు ఆమెతో ఉండుట అసంభవము" (Timothy Lin, Ph.D., The Secret of Church Growth, FCBC, 1992, p. 33).

"అంతము వరకు సహించినవాడెవడో, వాడే రక్షింపబడును" (మత్తయి 24:13).

నిజంగా మారిన వ్యక్తి తట్టుకుంటాడు క్రూర ఆత్మను "దొంగతనముగా ప్రవేశించిన దొంగ సోదరులు" (గలతీయులకు 2:4). ఈ శారీరక సంఘ సభ్యులు ఆఖరి దినాల సంఘాల్లోకి ఎంతో భాధ దు:ఖము తీసుకొస్తారు. బైబిలు వాటి వివరణ యిస్తుంది.

I. మొదటిది, ఆఖరి దినాలలోని సంఘ సభ్యులు చాలామంది తిరిగి జన్మించలేరు.

II తిమోతీ 3:1-7 లో ఆఖరి దినాలలో తప్పిపోయిన సంఘస్థుల వివరణ యిస్తుంది. దయచేసి చూడండి. డాక్టర్ జాన్ మేక్ ఆర్ధర్ క్రీస్తు రక్తము విషయంలో పొరబడ్డాడు, కాని ఈ పాఠ్యము విషయములో సరియే "సామాన్య మానవాళి గూర్చి కాదు రక్షింప ఒకని లోకము కాదు కాని సభ్యులు...క్రీస్తు సంఘములో" (John MacArthur, D.D., The MacArthur New Testament Commentary, 2 Timothy, Moody Press, 1995, p. 108). డాక్టర్ మెక్ గీ అన్నాడు ఈ పాఠ్య భాగము "సంఘ ఆఖరి దినాలు" సూచుస్తుంది (మెక్ గీ ఐబిఐడి., ప్రతి. పేజీ 469). ఆయన అన్నాడు, "తరువాతి వచనాల్లో పంతొమ్మిది వివిధ వివరణలు ఉన్నాయి. అది ఇంపుగా ఉండదు, కాని మనం చూడాలి ఎందుకంటే...సంఘ ఆఖరి దినాల చిత్రాన్ని చూపిస్తుంది...నేను నమ్ముతాను మనము ఈ ‘హీన’ దినాల్లో ఉన్నాము ఈ భాగములో వివరింపబడ్డాయి" (మెక్ గీ, ఐబిఐడి., పేజీలు 469, 470). ఈనాడు మారని సంఘస్థులు ఎలా వచ్చారంటే నిర్లక్ష్య సువార్త సాధనలు చార్లెస్ జి. ఫిద్నీ సేవ ద్వారా వచ్చినది (1792-1875). సంఘస్థులుగా తీసుకోబడుతున్నారు రక్షణ సాక్ష్యాలు జాగ్రత్తగా చూడకుండా. ఈ రక్షింపబడని సంఘస్థులు వివరింపబడ్డారు II తిమోతీ 3:2-4 లో –

1. "తమ్మును తామే ప్రేమించు కొనుదురు." డాక్టర్ మెక్ గీ ఆన్నాడు, "సంఘాలలో ఇది మీరు చూడవచ్చు" (ఐబిఐడి).

2. "ఆశించుట" అనగా ధనం ప్రేమికులు. డాక్టర్ మెక్ గీ అన్నాడు, "స్వప్రేమికులు కాబట్టి ధనం ప్రేమికులయ్యారు. ఈ పాప స్వభావము ఖర్చుకు చాల ధనము నశిస్తూ ఉంటుంది" (ఐబిఐడి).

3. "పోగుడుకోనువారు."

4. "గర్వము."

5. "దేవదూషకులు." గ్రీకు పదము అర్ధము "రూలర్స్." వీరు సంఘస్థులు "వేరే వాళ్ళ విషయాల్లో జోక్యము చేసుకుంటూ ఉంటారు" (మెక్ గీ ఐబిఐడి.). వారు బింకము లాడువారు. వాళ్ళు ఇతరుల మంచి పేరును నాశనం చేయడానికి సంఘములో ప్రయత్నిస్తుంటారు. అది అసలు తలంపు.

6. "తల్లిదండ్రులకు అవిదేయులు". తల్లిదండ్రులను ఎదిరించే యవనస్తులు, డాక్టర్ మెక్ ఆర్ధర్ అన్నారు, "వాళ్ళు ఎవరిమీదైనా తిరగబడడానికి సన్నద్ధులు" (ఐబిఐడి., పేజీ 114). వాళ్ళు గందరగోళము సంఘములో కలిగిస్తారు.

7. "కృతజ్ఞత లేనివారు." ఒక వ్యక్తి కి ఉచిత సెమినెరీ విద్య ఇవ్వబడింది, అతని భార్యకు ఉచిత కళాశాల డిగ్రీ సంఘముచే ఇవ్వబడింది. వాళ్ళ పట్టాలు వచ్చిన వెంటనే, ఆ వ్యక్తి గుడికి ఎదురు తిరిగి నాశనం చేయడానికి ప్రయత్నించాడు! అది నిజమైన కథ. డాక్టర్ మెక్ గీ అన్నారు, "చాలమంది ఇతరుల నుండి దయ పొందుతారు కాని కృతజ్ఞత చూపాలని కూడా ఆలోచింపరు" (ఐబిఐడి).

8. "అపవిత్రులు."

9. "అనురాగ రహితులు." దీని అర్ధం కుటుంబం పట్ల సంఘము పట్ల అభిమానము లేకపోవుట. ఇతరులు వాళ్ళ కొరకు ఏమి చేస్తారోనని ఆశించడం తప్ప, సహాయపడరు ఎందుకంటే వాళ్ళు స్వార్ధపరులు.

10. "అతిద్వేషులు." వీరు ఇతరులను క్షమించరు వారిని క్షమింపనివ్వరు. వారితో సమాదానపడలేము. మాట నిలబెట్టుకోరు. ఏదీ పట్టదు వాళ్ళను వాల్లే తృప్తిపరుచుకుంటారు!

11. "అపవాదకులు." "వారు ఇతరుల పరపతిని జీవితాలను ద్వంశం చేయడంలో సంతోషం పొందుతూ ఉంటారు" (మెక్ ఆర్ధర్, ఐబిఐడి., పేజీ 115). వీళ్ళలో చాలామంది వారే "క్రైస్తవులమని" పిలుచుకుంటారు.

12. "అజితేంద్రియులు." వీరికి వీళ్ళ మీద నియంత్రణ ఉండదు.

13. "క్రూరులు" అనగా భయంకరులు. ఇలాంటి వారు చాలామంది సంఘ సభ్యులు.

14. "సజ్జనద్వేషులు." నిజంగా "మంచివారిని అసహ్యించు వారు." వాళ్ళకు తెలుసు ఏది సరియో మంచిది కాని మంచిని అసహ్యించుకుంటారు – మంచి వారిని అసహ్యించుకుంటారు, కయీను హేచెలును అసహ్యించినట్టు – అతని చంపేసాడు. కయీను లాంటి వారు సంఘాల్లో చాలామంది సభ్యులుగా ఉన్నారు.

15. "ద్రోహులు." ఇలాంటి వారిని నమ్మలేము. వాళ్ళు సంఘాల్లో కుటుంబాలకు స్నేహితులకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుతారు.

16. "మూర్ఖులు" అనగా నిర్లక్షులు.

17. "గర్వాంధులు" గర్వముతో అంధులైనవారు.

18.."దేవునికంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు." వాళ్ళు చెప్తారంతే! వీరు ఆదివారం సాయంత్రము ఆరాధనకురారు, వారు మధ్య కూటాలకు రారు, ఎందుకంటే "దేవునికంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించుతారు."


నేను చెప్పాను ఆఖరి దినాల సంఘాల్లో ఇలాంటి లక్షణాలు కలిగున్న నశించిన, మారని, రక్షింపబడని సంఘస్థులు ఉంటారు. ఇది తేటతెల్లమవుతుంది తరువాతి వచనములో (II తిమోతీ 3:5) వచనము 19.

19. "పైకి భక్తి గల వారివలె ఉండియు, దాని శక్తిని; ఆశ్రయించని వారు" (II తిమోతీ 3:5).


వీళ్ళు బాహ్య క్రైస్తవ్యాన్ని కలిగిన సంఘ సభ్యులు – వాళ్ళ జీవితాల్లో ఎన్నడూ క్రీస్తు రక్షించు శక్తిని అనుభవించనివారు. వారు తిరిగి జన్మింపనివారు. వాళ్ళు నిజక్రైస్తవులు కాదు. వాళ్ళు బైబిలు ఎంత ప్రస్తావించినా, వాళ్ళను గూర్చి చెప్పడానికి ఒక పదమే ఉంది, "దారితప్పినవారు." క్రియ అనువాదము "మరలుటకు" మధ్యస్థ స్వరము. దాని అర్ధము "నిన్ను నీవు" మరలిపో. వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా, చక్కగా మాట్లాడినా, "నిన్ను నీవు" మరలిపో, ఎంత దూరము వీలైతే అంత దూరంగా ఉండడం! అపోస్తలుడైన పాలు అన్నాడు,

"సహోదరులారా, మీరు నేర్చుకొనిన భోధకు, వ్యతిరేకముగా బేధములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టేయుడునని మిమ్ములను బతిమాలు కొనుచున్నాను; వారిలో ఉండి తొలగి పోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు, కాక తమ కడుపునకే రాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు" (రోమా 16:17-18).

మేథ్యూ హెన్రీ వ్యాఖ్యానం అంటుంది, "వారితో సహవాసము వద్దు, వారి ద్వారా కల్మషులు కాకుండా." ఇది కష్టతరమందు, కాని ఇది అవసరం నిజ క్రైస్తవులను తికమక పెట్టేవారి నుండి సంరక్షించడానికి.

II. రెండవది, ఆఖరి రోజుల్లో భోధకులు "గొర్రెలను దొంగిలిస్తారు" ఆత్మలను రక్షించే బదులు.

II తిమోతీ 3:6-7 లో అపోస్తలుడు చెప్పాడు,

"అవివేక స్త్రీల యొక్క యిండ్లలో చొచ్చి వారిని చెర పట్టుకొని పోవువారు, వీరిలో చేరినవారు పాపభరితులై, నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, ఎల్లప్పుడును నేర్చుకోనుచు, సత్య విషయమైన అనుభవజ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని" (II తిమోతీ 3:6-7).

కాపరులు భోధకులు బలహీన స్త్రీలను వశపరచుకొని వాళ్ళ సంఘాలకు బైబిలు పఠనాలకు మళ్ళించేవారి గురిండి చెప్పబడింది. సాదారణంగా వారు స్త్రీలను లోపరుచుకుంటారు, బలహీన పురుషులను కూడ, ఎవరి భార్యలైతే "గొర్రెల దొంగలుచే" వశపరచబడినవారు. డాక్టర్ మెక్ గీ అన్నాడు “‘అవివేక స్త్రీలు’ అంటే స్త్రీ పురుషులిద్దరు" (ఐబిఐడి., పేజీ 471).

గొర్రెల దొంగ బహుశా, నీతో చెప్పడు, "నేను గొర్రెల దొంగను. నేను మీ గుడులు వదిలి నన్ను కలవాలి అని." భయంకర గొర్రెల దొంగ ఈ మధ్య నాతో అన్నాడు, "నేను గొర్రెల దొంగను కాను." వాస్తవానికి ఈయన నిపుణుడైన గొర్రెల దొంగ అయినా, ఫోనులో నాతో అలా చెప్పాడు. వీరు వాళ్ళనే మోసపుచ్చుకుంటారు, వారి పాపము బయటపడకుండ. వారు "మోసగిస్తూ, మోసపోతారు" (II తిమోతీ 3:13).

వారు ఏమి చేస్తారంటే గొర్రెను తన గుడిని గూర్చి మాట్లాడిస్తారు. ఎలాంటి పిర్యాదులు చేయకపోతే గొర్రె దొంగ తనను వదిలేస్తారు. ఒకవేళ పిర్యాదు చేస్తే, బయటకు లాగి మెత్తని ప్రశ్నలడుగుతారు. కాపరికి వ్యతిరేకంగా గొర్రె చెప్పితే, గొర్రెల దొంగ పని ప్రారంబించి, దయగల అవగాహనగల స్నేహితునిగా కనిపిస్తాడు. చివరకు దొంగ ఆ గొర్రెను తన గుడికి లాక్కుంటాడు. నమ్మితే నమ్మండి, ఇలా చేస్తూ భోధకులు భవిష్యత్తు పొందుతుంటారు. అలా లాక్కబడిన వారు చాల మంది ఆ గుడిలో ఉంటారు. ఇటీవల ఒక భోధకుడు చెప్పాడు అలహాబాదులో 66 బాప్టిస్టు సంఘాలున్నాయని. ఆయన అన్నాడు గొర్రెలు ఆయా దొంగల మధ్య వేదింపబడతారు. చెప్పక తప్పదు, ఆ పట్టణములో ఆత్మీయస్థితి చాల అధోగతిలో ఉంటుంది, ఎవ్వరూ రక్షింపబడరు. ఎందుకు? ఎందుకంటే అలాంటి వారు

"ఎల్లప్పుడూ నేర్చుకోనుచున్ననూ, సత్యము విషయమైన అనుభవ జ్ఞానముపొందరు" (II తిమోతీ 3:7).

గొర్రెల దొంగతనాన్ని ఎలా అరికట్టవచ్చంటే మార్పిడి "ఉత్తరము" లేకుండా వేరే సంఘస్థులను కాపరులు వారి సంఘములో చేర్చుకోకూడదు. వారి "వాంగ్మూలము" కారణంగా సభ్యులు అంగీకరింపబడకూడదు. ఇవి చారిత్రాత్మక బాప్తిష్టు స్థానాలు, వీటిని గొర్రెల దొంగలు ఉల్లంఘిస్తున్నారు.

నేను ఈ ప్రసంగము చేయకూడధనుకున్నాను, కాని డాక్టర్ కాగన్ నేను చెయ్యాలన్నారు, అవును ఆయన సరియే. ఇది కొనసాగే సమస్య ఎందుకంటే కొద్ది మంది కాపరులకు తెలుసు ఆఖరి దినాలలో మారిన వారిని ఎలా జయించాలో క్రమపరచాలో. కారణంగా, తరుచూ వాళ్ళు సంఘాలు కట్టుకొంటారు క్రైస్తవులను వారి గుడులను వదిలి వారి దగ్గరకు రమ్మంటారు. నేను చాల బిగ్గరగా చెప్పగా – అలాంటి పరిచర్య నాకు హేయము! గొర్రెల దొంగల భోధకులు 19 శతాబ్దములో భయంకర బందిపోటు దొంగలు లాంటివారు. ఇటీవలే పాతిపెట్టబడిన శవాలను తవ్వి వాటిని వైద్య పాఠశాలలకు పరీక్ష నిమిత్తము అమ్మేస్తారు. గొర్రెలను దొంగిలించే భోధకుడు బందిపోటు దొంగ కంటే హీనుడు నా ఉద్దేశములో!

ప్రసంగము ముగిస్తూ, ఒక విషయము చెప్పాన ఆఖరి రోజులలో సంఘాలు ఎంత చెడ్డగా ఉన్నప్పటికీ, యేసు క్రీస్తే నీ పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఆత్మ కోసం రక్తము కార్చి సిలువపై మరణించాడు. ఆయన ఇప్పుడు నీ కొరకు ప్రార్ధిస్తూ దేవుని కుడి పార్శ్వము ముందున్నాడు. నా ప్రార్ధన నీవు ఆయనను వెదికి కనుగొనాలని. ఆయన అన్నాడు,

"మీరు నన్ను వెదికిన యెడల, పూర్ణ మరస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునేడల, మీరు నన్ను కనుగొనెదురు" (యిర్మియా 29:13).

ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.


ద అవుట్ లైన్ ఆఫ్

తప్పిపొయిన సంఘస్తులు గొర్రెలను దొంగిలించే బోధకులు
(ఆఖరి దినాల్లో సంఘాలు – భాగము 11)

LOST CHURCH MEMBERS AND SHEEP STEALING PREACHERS
(THE CHURCHES OF THE LAST DAYS – PART II)

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"యేసు దేవాలయములో నుండి, బయలుదేరి వెళ్ళుచుండగా: ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా? రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిఛి యుండకుండ, పడద్రోయ బడునని, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండమీద కూర్చుండి యున్నప్పుడు, శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, చెప్పండి, మాకు, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకును, ఈ యుగ సమాప్తికిని సూచనలేవి?" (మత్తయి 24:1-3).

(లూకా 21:24; మత్తయి 24:24, 12, 13; గలతీయులకు 2:4)

I. మొదటిది, ఆఖరి దినాలలోని సంఘ సభ్యులు చాలామంది తిరిగి జన్మించలేరు, II తిమోతి 3:1-5; రోమా 16:17-18.

II. రెండవది, ఆఖరి రోజుల్లో భోధకులు "గొర్రెలను దొంగిలిస్తారు" ఆత్మలను రక్షించే బదులు, II తిమోతి 3:6-7, 13, యిర్మయా 29:13.