ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
సమకూర్పబడిన తుఫాను THE GATHERING STORM డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే. బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము "నోవహు దినము ఎలాగుండెనో, మనస్యకుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసికోనుడు పెండ్లికి వచ్చుచు, జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకోనిపోవు వరకు, ఎరుగక పోయిరి; అలాగుననే మనష్యు కుమారుని రాకడ ఉండును" (మత్తయి 24:37-39). |
ద గేదరింగ్ స్టార్మ్ అనే ప్రముఖ పుస్తకములో విన్స్టన్ చర్చిల్ చెప్పారు ఎలా ఇంగ్లాండ్ నిద్ర పోతుందో హిట్లర్ జెర్మనీ లోని దుష్ట శక్తులు యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు. ఇంగ్లాండ్ సిద్ధంగా లేదు వాళ్ళను కున్నారు శాంతి ఎప్పుడు ఉంటుందని. చర్చిల్ కు మాత్రమే తెలుసు వాళ్ళు నాశనం అంచులో ఉన్నారని. అతని హెచ్చరికలు ఎవ్వరు వినలేదు! ఇప్పుడు అదే అవుతుంది. బైబిలు చెబుతుంది, "లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని చెప్పుకోనుచుండగా; ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక…వారెంత మాత్రమును తప్పించుకోనలేరు" (1 దెస్సలొనీకయులకు 5:3). రష్యా రచయితా అలేక్సంద్ర్ సోల్ జెనిటేసిన్ అన్నారు, "దుష్ట శక్తులు నిర్ణయత్వ అడ్డుకోలు ప్రారంభించాయి." "వచ్చే చీకటి" అధ్యాయములో డాక్టర్ ఎడ్వర్డ్ హిన్సన్ అన్నాడు, "బైబిలు క్రైస్తవత్వనికి వ్యతిరేకంగా మనం తవ్వుకుంటున్నాం" (Ed Hindson, Ph.D., Final Signs, Harvest House, 1996, p. 77). క్రైస్తవుడు అవకమునుపు చార్లెస్ కొల్సన్ అధ్యక్షుడు నిక్సన్ కు ఉన్నత సలహాదారుడు. స్వతంత్ర మీడియా అతనిని నిక్సన్ "ప్రముఖ వ్యక్తి" అన్నాడు. అని చెప్పింది అతని మార్పు తరువాత కొల్సన్ ఎత్తి చూపాడు రోమా సామ్రాజ్యము అవినీతిమయమై విద్య విహీనుల చేతిలోపడింది. అతడు అన్నాడు, "సంఘమే ఒంటరిగా నిలబడాలి చీకటి తరము సంస్కృతికి వ్యతిరేకంగా" (ఐబిఐడి., పేజి 78). కాని ఈ రోజుల్లో సంఘాలే అవినీతిమయమై మన నాగరికతను సంరక్షింపలేకపోతున్నాయి. డాక్టర్ కార్ల్ ఎఫ్. హెచ్. హెన్రీ, గొప్ప సువార్తిక తత్వవేత్త, అన్నాడు, "సక్రమ క్రైస్తవ్యంపై ఉన్న అపోహ భాదాకరం; ఒకరు దానిని సంఘ హాజరు బట్టి చూడవచ్చు...పూర్తి తరము ఎదుగుతూ ఉంది...నిత్వత్వపు చింతన లేకుండా...అదోగతిన పెట్టె నాగరికత దూళి దుస్థితిని నిస్సహాయ సంఘ నీడలు ప్రతి బింబిస్తూ ఉన్నాయి" (Carl F. H. Henry, Ph.D., Twilight of a Great Civilization, Crossway Books, 1988, p. 17). డాక్టర్ హెన్రీ అన్నాడు, "మన రోజుల్లో లోతైన ప్రవాహాలు పూర్తిగా చితికిపోయాయి. మిలీనియం కొరకు కష్టపడిన సంస్థలు అంతరించాయి, మరియు...మన ముందు ప్రశ్న, ప్రస్తుతపు నాగరికత సజీవంగా ఉంటుందా" (ఐబిఐడి., పేజి 16). అతడు అన్నాడు, "నియంతలు వస్తున్నారు. మన సామాన్య అభివృద్ధి ఆ నియంతలచే వారి క్రూర మోసపు కార్యాలకు దుర్వినియోగ పరచవచ్చు. హిట్లర్ నాజిస్ ఇప్పటికే [ఉపయోగించారు] సామాజిక పరిజ్ఞానము సమర్ధ గేస్ చెంబర్లలో వేలమందిని భూస్థాపన చేయడానికి. స్టాలిన్ ఇతర సంపూర్ణ నియంతలు ఎప్పుడో నేర్చుకున్నారు [బహుజన సమూహాన్ని] మాస్ మీడియా దాసోహం చేసుకోగలదని" (ఐబిఐడి.). స్వతంత్ర మీడియా ఈ రోజుల్లో అదే పని చేస్తుంది – బరాక్ ఒబామా ప్రతి స్థితిని అనుమతితో రబ్బరు ముద్రణగా వాడుతుంది. కాంగ్రెస్ వ్యక్తి రెండీ ఫోర్బ్స్ అన్నాడు, "ఈ [రాష్ట్రపతి] పనులు మాట స్వాతంత్ర్యానికి అడ్డుబండులయ్యాయి...మన దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని పరిపాలన విధానము ద్వారా" (Decision magazine, October 2013, p. 17). బిషఫ్ హేరీ జాక్సన్, ఆప్రికా-అమెరికా చాలా ప్రాముఖ్య మత నాయకుడు, ప్రజాస్వామ్య వ్యక్తి, అన్నాడు ఒబామా ఆచార క్రైస్తవ్యానికి శత్రువయ్యాడని దేశం "చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని" (ఐబిఐడి.). అతడు అన్నాడు "ఉపద్రవానికి సమీప నాగరికతలో ఉన్నాం" (ఐబిఐడి., పేజి 19). బాబ్ ఉద్ వార్డు, స్వతంత్ర పాత్రికేయుడు ఎక్సోపోస్ ఆప్ వాటర్ గేట్ వ్రాసినవాడు, చింత కలిగి ఉన్నాడు. అతడు ఫోక్స్ న్యూస్ బిల్ ఓరిలితో అన్నాడు, "చాలా విషయాలలో, వైట్ హౌస్ పై లోతైన అనుమానము ఉంది, అది మీ సమాచారము బట్టికాదు, రైట్ వింగ్ కాదు కసర్వేటివ్స్ కాదు" (ఐబిఐడి., పేజి 19). చాలా సువార్తికులు నమ్ముతారు బరాక్ ఒబామా వైట్ హౌస్ ను అధిరోహించిన వారందరిలో అతిప్రమాదకర వ్యక్తి అని. బిల్లి గ్రెహమ్ డెసిసన్ మేగజైన్ చెప్పింది ఒబామా "క్లిష్ట మార్గములో" అమెరికాను ఉంచాడని "అధ్యక్షుడు బైబిలు సూత్రాలను మత స్వాతంత్ర్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాడని" (ఐబిఐడి., కవరు కధ). అదే మేగజైన్ లో, రెవ. డాన్ విల్టన్, బాప్టిస్టు కాపరి అన్నాడు, "సాతాను జీవించు ప్రతి వ్యక్తిని నాశనము చేసి అనుమానం పెట్టడం ద్వారా మొగషించడం ద్వారా ఇంకా ఇతర మార్గాల ద్వారా. అతని ఉద్దేశము జయించడం, దొంగిలించడం, విభాగించి నాశనం చెయ్యడం" (ఐబిఐడి., పేజి 29). క్రైస్తవ్యం తగ్గిపోవడం కాకుండా అమెరికాలో సైనిక ఇస్లాము పెరిగి పోతుంది. గత నెల 80 క్రైస్తవ సంఘాలు ఈజిప్టులో ముస్లిములచే బాంబులు వేయబడ్డాయి. అందులో ఒక గుడి భవనము 4వ శతాబ్దము నాటిది! కొన్ని రోజుల క్రితం ముక్కలు ముక్కలు చేసారు! ముస్లిములు క్రైస్తవ్యాన్ని ప్రపంచమంతటా చాలా ఎక్కువగా దాడి చేస్తున్నారు. ఇరాను అటామిక్ బాంబు తయారుచేస్తుంది. వారి నాయకులు పలుమార్లు చెప్పారు వారు ఇజ్రాయెల్ అమెరికాలను నాశనం చేస్తామని. న్యూక్లియర్ ఆయుధాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. మీ తరాన్ని ఎదుర్కొనే మరొక పెద్ద సమస్య భూగోళ క్లిష్టత. ఉదాహరణకు, అమెజాన్ రైన్ అడవుల ద్వంసము, "చరిత్రలోనే అతి గొప్ప విషాద ఉదంతముగా" టైమ్ మేగజైన్ పేర్కొంది (September 18, 1989, pp. 76-80). గత బుధవారం (అక్టోబర్ 2, 2013, పేజి AA1) ద లాస్ ఎంజిలాస్ టైమ్స్ ఒక నివేదిక ఇచ్చింది మూసమైడ్ అతి పెద్ద పతనంపై. నివేదిక చెప్పింది, "అతి పెద్ద ఐస్ గడ్డ పార్కులో మరణ పాశంలో ఉంది, గనుల నిపుణులు అన్నారు." గ్రెన్ స్టాక్, పార్కు గనుల నిపుణుడు, అన్నాడు, "20 సంవత్సరాల ఉనికి ఇచ్చాం – తరువాత అంతరిస్తుంది, గుదిబండల సమూహాన్ని వదిలిపెట్టి" ఆర్టికల్ చెప్పింది. ఈ ఐస్ గడ్డలు అంతరించడం "ప్రపంచ మంతటా సంభవిస్తుంది. ఐస్ గడ్డలు కరిగి, తరువాత భూగోళంలో ఏమి జరుగుతుందో అనే భీతిని కలిగిస్తుంది." ఉపరితల వేడిమి మన జీవిత విధానాన్ని మార్చేస్తుంది వచ్చే రెండు దశాబ్దాలలో. డాక్టర్ హిండ్సన్ భయపెట్టే సమస్య ఇచ్చాడు, "ఈ రోజు అమెరికా, గ్రేట్ బ్రిటన్, ప్రాన్సు, రష్యా, చైనా, ఇజ్రాయెల్ ఇండియా ఇప్పటికే అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి...కాల ప్రవాహంలో నాశనం సంభవించవచ్చు" (ఐబిఐడి., పేజీలు 87, 88). చాలా మంది శాస్త్ర వేత్తలు భవిష్యత్తును గూర్చి వ్యతిరేక భావం కలిగి ఉన్నారు. ఒకరు అన్నారు, "ఒక్క రోజులో మానవ జాతిని నాశనం చేయడం సాధ్యం." కాని ఒక కెనడా శాస్త్ర వేత్త జవాబిచ్చాడు, "నీవు పోరబడ్డావు. మనవ జాతిని ఒక నిమిషంలో నాశనం చెయ్యవచ్చు" (Billy Graham, The Challenge: Sermons From Madison Square Garden, Doubleday and Company, 1969, p. 158). బైబిలు చెబుతుంది, "అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చును; ఆ దినమున ఆకాశములు మహా ద్వనితో గతించి పోవును, పంచ భూతములు మిక్కిటమైన వెండ్రముతో లయమై పోవును, భూమియు దాని మీద నన్న కృత్యములును కాలిపోవును" (II పేతురు 3:10). ఆ రోజు వస్తుంది. అతి తప్పదు. "ప్రభువు దినము రాత్రి వేళ దొంగ వలెవచ్చును." దొంగ రావడం ఊహించవు. కాని అకస్మాత్తుగా వస్తాడు – ఎలాంటి హెచ్చరిక లేకుండా! ఆ విధంగా తీర్పు వస్తుంది. ప్రజలు సిద్ధంగా ఉండరు! ఎక్కువ మంది సిద్ధంగా ఉండరు! "ప్రభువు దినము రాత్రి వేళ దొంగ వచ్చినట్లు ఉండును." యేరూషలేము బయట ఒలివల కొండపైకి, శిష్యులు యేసు నోద్దకు వచ్చారు. ఒక ప్రశ్న ఆయనను అడిగారు, "నీ రాకడను, ఈ యుగ సమాప్తికిని సూచన లేమి?" (మత్తయి 24:3). ఆ ప్రశ్న అడిగినందుకు ఆయన వారిని గద్దించలేదు. యుగ సమాప్తిని గూర్చి చాలా సూచనలు ఆయన చెప్పారు. ఒక సూచన అడిగారు, కాని చాలా సూచనలు ఇచ్చారు "యుగ సమాప్తిని గూర్చి." ఆయన అన్నారు చాలా మంది అబద్ద క్రీసులుంటారు, అబద్ద ప్రవక్త లుంటారు. ఆ సమయం ఆత్మీయ మోసము. మన రోజులలో తెగలకు చెందిన అబద్ధపు "క్రీస్తులు", వేదాంత స్వతంత్ర క్రీస్తు చాలా సేమినరీలలో. క్రీస్తు అన్నాడు. యుద్ధములు యుద్ధ వార్తలు ఉంటాయి. మొదటి ప్రపంచ యుద్ధము నుండి ప్రపంచము ఒక యుద్ధం తరువాత ఇంకొక యుద్ధం చూస్తుంది. స్వతంత్ర వేదాంతులు అనుకున్నారు క్రైస్తవ్యము రాణిస్తుందని, ఇరవై శతాబ్దములో చెప్పలేని శాంతి వస్తుందని. కాని వారి ఆశలు మొదటి ప్రపంచ యుద్ధంతో పటాపంచలయ్యాయి, తరువాత కూడా. హేరీ ఎమెర్ సన్ ఫొస్డిక్, ఒక స్వతంత్రుడు, క్రైస్తవ ఉటోపియా అభిప్రాయాన్ని వదులుకున్నాడు. తాను అన్నాడు, "మన తరము గొప్ప సనములు ఒకని ఆలోచనంతో అధిగమిస్తే, నిరుత్సాహం తప్పదు." కనుక బైబిలు తిరస్కరించే స్వతంత్రులు నిరాశా నిస్పృహలలో ఉనికి తత్వము వైపు మళ్ళారు. ఈ రోజు చాలా నిస్పృహ ఉంది ఆత్మహత్య కాలేజీ యువకులలో మరణానికి ప్రధమ కారణము! ఇది గత వారము ఒక ఆర్టికల్ లో చదివాను. క్రీస్తు అన్నాడు కరువులు, కాతకములు, భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి యుగ సమాప్తిలో. ఆయన అన్నాడు క్రైస్తవులు "నా నామము నిమిత్తము అందరిచే ద్వేషింపబడుదురు." ఆయన ఇంకా అన్నారు క్రైస్తవులు ఒకనికొకడు అప్పగించి, ద్వేశించుదురు. న్యాయ రహితము పాపము ప్రబలి క్రైస్తవుల మధ్య ప్రేమ చల్లారుతుంది. క్రీస్తు ఇంకా అన్నాడు "ప్రపంచమంతటా అన్ని దేశాలలో సాక్షులుగా సువార్త ప్రకటింపబడును; అప్పుడు అంతము వచ్చును." ఆయన యుగ సమాప్తికి గొప్ప సూచన ఇచ్చాడు. ఆయన అన్నాడు, "నోవహు దినము ఎలాగుండెనో, మనస్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసికోనుడు పెండ్లికి వచ్చుచు, జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకోనిపోవు వరకు, ఎరుగక పోయిరి; అలాగుననే మనష్యు కుమారుని రాకడ ఉండును" (మత్తయి 24:37-39). శిష్యులు క్రీస్తును ఆయన రాకడను గూర్చి యుగ సమాప్తిని గూర్చి ఒక సూచన అడిగారు. ఆయన చాలా సూచనలు ఇచ్చాడు. తరువాత ఆయన అన్నాడు యుగ సమాప్తి గొప్ప జల ప్రళయము ముందు, నోవహు దినములలో వలే ఉండును. ఆయన అన్నాడు, "జల ప్రళయం ముందు రోజుల వలే...మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును" (మత్తయి 24:38, 39). ఆయన అన్నాడు, అలాగే, యుగ సమాప్తిలో కూడా ఉండును. డాక్టర్ యమ్. ఆర్. డిహాన్, గౌరవప్రద బైబిలు బోధకుడు, చాలా సూచనలు నోవహు రోజులకు సరిపడేవి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆరు సూచనలు ఇవి: 1. మత విద్వేషము ఉండే కాలము. అదంతా వివరించడానికి సమయము లేదు. ఒక పేరా ఇస్తాను నోవహు దినాలను గూర్చి బిల్లీ గ్రేహము గారు 1969 లో మడిసన్ స్వ్కేర్ గార్డెన్ లో బోధించినది. టెలివిజన్ లో ఈ ప్రసంగము చూసాను. ఆయన అన్నాడు, బైబిలు బోధిస్తుంది యుగ సమాప్తిలో, యుద్ధము, నాశనము, చట్టము లేమి, అవినీతి, ఎక్కువగా ఉంటాయి దేవుడే జోక్యము చేసుకుని అంతా ఆపాలి... (బిల్లీ గ్రేహం, "రాబోవు దినములలో," ఐబిఐడి., పేజి 164). (Billy Graham, “The Day to Come,” ibid., p. 164). నోవహు దినములను గూర్చి, బైబిలు చెబుతుంది, "నరుల చెడుతనము భూమి మీద గోప్పదనియు, వారి హృదయము యొక్క తలమ్పులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డ దనియు… యోహావా చూచి, నరులను భూమి మీద నుండ కూడా తుడిచి పేతురు అనెను" (ఆది కాండము 6:5, 7). యేసు అన్నాడు "జల ప్రళయము వచ్చి వారిని కొట్టి కొనిపోవుట, ఎలా తెలియదో; అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును" (మత్తయి 24:39). క్రీస్తు మాటలపై దృష్టి సారించండి, "...జల ప్రళయము వచ్చి, వారిని తీసికొనిపోయెను." ఈ తరము ఆఖరిలో జల ప్రళయము ఉండదు. లోకము సమాప్తికి వస్తుంది దేవుడు ఉగ్రతను క్రుమ్మరించినప్పుడు "తీర్పుపాత్రలో" ప్రకటన 16:1-21. "[దేవుని] యొక్క ఉగ్రత తీవ్రత" ఈ దుష్టలోకంపై పోయబడుతుంది (ప్రకటన 16:19). ఆ భయంకర తీర్పుకు లోకం సిద్ధంగా ఉండదు. నోవహు రోజుల మాదిరి వారు సిద్ధంగా ఉండదు, "జల ప్రళయం వచ్చి, వారిని కొట్టు కొనిపోయెను" (మత్తయి 24:39). ఈ పాఠ్యమును గూర్చి మూడు విషయాలు గమనించండి, స్పర్జన్ గొప్ప ప్రసంగం "నోవహు ప్రళయము" ఆధారంగా. I. మొదటిది, "జల ప్రళయము వచ్చి, అందరిని కొట్టుకొని పోయెను." రక్షింపబడని ప్రతి వ్యక్తిని గొప్ప జల ప్రళయము నాశనం చేసింది. అందరు నీటి సమాధిలో మునిగిపోయారు. రక్షింపబడని ఏ వ్యక్తి వదల బడలేదు. "జల ప్రళయము వచ్చి, అందరిని కొట్టుకొనిపోయెను" (మత్తయి 24:39). బహు గొప్ప వారు ఆగ్రహ ప్రళయముచే మింగబడ్డారు. పేదవారు కూడా వదలబడలేదు. కాదు, ప్రళయం అందరిని కొట్టుకుపోయింది. గొప్ప తత్వ వేత్తలు కూడా తప్పింపబడలేదు. అమాయకులు కూడా మునిగి పోయారు. నేను చెప్పుతున్నాను, తెలివిగాని నిర్లక్ష్యం గాని దేవుని ఉగ్రత నుండి నిన్ను రక్షింపవు! నోవహు ఓడను నిర్మించినప్పుడు అప్పటి వరకు అంత గొప్ప ఓడ నిర్మింపబడలేదు. అది అతి పెద్ద ఓడ. ఆ రోజుల్లో ప్రపంచ అద్బుతాలలో అది ఒకటి. నోవహు దానిని ఆరిన నేలమీద నిర్మించాడు, నదికి సముద్రానికి దూరంగా. ప్రపంచం నలుమూలల నుండి దానిని చూడడానికి వచ్చారు, ఈ రోజుల్లో డిస్నీ లేండ్ చూస్తున్నట్టు. నోవహు పిచ్చివాడని పిలవడం నేను ఊహించగలను. వారిలో చాలా మంది దూర ప్రదేశాల నుండి ఈ వింత ఓడ చూడడానికి వచ్చారు. వాళ్ళు వస్తున్నప్పుడు నోవహు రాబోవు జల ప్రళయం గురుంచి బోధించాడు. బైబిలు అతనిని, "నీతి బోధకుడు" అని పిలిచింది (II పేతురు 2:5). వారు ఆయన బోధతో మారలేదు. ఆ బోధ నుండి తొలగి పోవడం మాత్రమే కాకుండా, వారు నిస్సందేహంగా అతనిని హేళన చేసారు. అయినను ప్రళయం వచ్చి వాడిని కొట్టుకొని పోయింది. తీర్పు వచ్చునప్పుడు, అపహాస్యము ఉండదు. నరకాగ్నిలొ నువ్వు పడుతున్నప్పుడు, సువార్త విని క్రీస్తును నమ్మి ఉండాల్సింది అని అనుకుంటావు. అప్పటికి భాగా ఆలస్యమైపోతుంది. నీ అపనమ్మిక పోతుంది, నీవు రక్షింపబడడానికి నిత్వత్వములొ చాలా ఆలస్యమయి పోయావు, వారికి ఏలా ఉంటుందంటే "జల ప్రళయం వచ్చి, అందరిని కొట్టుకొని పోయెను." II. రెండవది, జల ప్రళయము వచ్చినప్పుడు వారు ఈ లోక విషయాలలో ద్యాస కలిగియున్నారు. ఈ జీవిత విషయాలలో పూర్తిగా నిమగ్నమై వారు నిత్యత్వానికి సంసిద్ధంగా లేరు. క్రీస్తు అన్నారు, "జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసికొనుచు, పెండ్లి కిచ్చుచునుండిరి" (మత్తయి 24:38). వారు తినడం, తాగడం, పెండ్లాడు గురుంచి ఆలోచించారు. మనకు సాయంత్రం 5:30 కు అందమైన వివాహము ఉంది. తరువాత సంబరం ఉంటుంది. దానిలో తప్పేమీ లేదు. కాని నోవహు రోజులలో వాటిని గూర్చే ఆలోచిస్తూ కూర్చున్నారు. ఈ లోక జీవిత విషయాలే ఆలోచించారు. వారు నిత్యత్వం గూర్చి గాని, ఆత్మల రక్షణ గూర్చి గాని ఆలోచించ లేదు. వారు మీలో కొందరు ఉన్నారు, మీరనుకుంటారు ఆదివారం గుడికి రావడం వ్యర్ధ సమయం అని. కాలేజి విద్యార్ధులు, మన గుడిని దర్శించే వారు, అంటారు ఆదివారం చదువు కోవాలని. మన గుడిలో ప్రతి యవసస్థుడు హైస్కూల్లో గాని కాలేజిలో గాని ఉన్నాడు. కాని వారికి తెలుసు తెలివిగా సమయం వాడుకుంటే చదువుకోడానికి చాలా సమయం ఉంటుందని. ప్రతి ఆరాధనలో ఎలా చదువుకోవాలో 12 అంశాల షీటు మీకు ఇస్తాము. అది వెంబడిస్తే ప్రతి ఆదివారం గుడికి రావడానికి కావలసినంత సమయం ఉంటుంది, క్లాసులో కూడా ఎ లో ఉండడానికి. నేను రాత్రి కళాశాలకు వెళ్ళాను, పగలు వారానికి 40 గంటలు పనిచేస్తూ. చదవడానికి గుడి ఎగ గొట్టలేదు. ఆయనను ముందుంచినందుకు దేవుడు నన్ను దీవించాడు. గుడికి ఒక ఆరాధనకే వచ్చినప్పుడు సామాన్య విద్యార్ధిగా ఉన్నాను. ప్రతి ఆదివారం ఉదయం సాయంత్రం గుడికి రావాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్నాక నేను ఎ ఏవరేజ్ గా కాల్ స్టేట్ ఎల్.ఎ., లో ఉన్నాను రోజంతా పని చేసినప్పటికీ, 3 లేక 4 క్లాసులు రాత్రి తీసుకున్నప్పటికీ! యేసు అన్నారు, "ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడు; అప్పుడు అవన్నియు మీకు అనుగ్రహింప బడును" (మత్తయి 6:33). నా నిజ జీవితంలో క్రీస్తు వాగ్దానం నిజమని నిరూపించాను. దేవునికి మొదటి స్థాన మిచ్చి ప్రతి ఆదివారము ఉదయము సాయంత్రము గుడికి వచ్చాను, దేవుడు నాకు కాలేజిలో ఉత్తమ శ్రేణి యిచ్చాడు. నా కుమారుడు లెస్ లీ ఎ కౌంటింగ్ లో ఎ విద్యార్ధి కాల్ స్టేట్ నార్త్ రిడ్జ్ లో. తరగతిలో మొదటి స్థానం వచ్చింది, ముగింపు సందేశం ఇచ్చే గౌరవం దక్కింది. తను, కూడా, గుడి ప్రొద్దున రాత్రి ఎప్పుడూ తప్పలేదు. దేవుని ముందుంచితే గుడి మానకుండా, క్రీస్తు వాగ్దానం యిచ్చాడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయని! కాని నోవహు దినములలో, మన దినాలలో, అది అవివేకమనుకుంటాం. వాళ్ళను కుంటారు వందల గంటలు విడియో గేమ్స్ ఆడడంలోను, భయంకర లైంగిక ప్రేరేపిత సినిమాలు చూడడం అవసరం అని. వారికి, అవి ప్రాముఖ్యం దేవుని ముందుంచి గుడిలో ఉండడం కంటే. గత వారం ఒక ఆర్టికల్ చదివాను అశ్లీల చిత్రాలు చూడడం కూడా శక్తి వంతమైన మత్తు మందుతో సమానము. ఒక్కసారి నీవు ఇరుక్కుంటే బయట పడడం అసంభవం! క్రీస్తు మాత్రమే నిన్ను విడుదల చేయగలడు – నీవు పూర్తిగా నీ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తే! క్రీస్తును తిరస్కరిస్తూ ఉండే వారు వారి పాప భోగాలకు ఇహలోక విధానానికి చాలా మూల్యం చెల్లించాలి. దేవుని తీర్పు లోకంపై వచ్చినప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉండరు. నోవహు దినములలో ప్రజలు సిద్ధంగా లేరు "జల ప్రళయము వచ్చి, వారందరినీ కొట్టుకొని పోయింది" (మత్తయి 24:39). బైబిలు చెబుతుంది, "నా దేవుని ఎదుర్కోటానికి సిద్ధంగా ఉండు" (ఆమోసు 4:12). నీవు దేవుని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నావా? లేక నరకానికి పంపబాడతావా, "అక్కడ అగ్ని ఆరదు"? (మార్కు 9:44). "జల ప్రళయము వచ్చి, వారందరినీ కొట్టుకొని పోయింది." III. మూడవది, జల ప్రళయము వచ్చినప్పుడు ఓడలో ఉన్నవారందరూ సురక్షితముగా ఉన్నారు. స్పర్జన్ అన్నారు, "[ఓడలో] నుండి ఎవరు బయట పడలేదు; ఎవరూ లాగ బడలేదు; ఎవరూ చనిపోలేదు; ఎవరూ విడువబడలేదు [చనిపోడానికి]. అందరూ భద్రంగా ఉన్నారు...ఓడ అందరిని భద్ర పరిచింది, అలాగే యేసు ఆయనలో [ఉన్నవారిని] భద్ర పరుస్తారు. నిత్వత్వములొ సురక్షితముగా ఉంటారు. ఎవరూ నశించరు, ఆయన చేతులలో నుండి ఎవ్వరూ ఎత్తకు పోలేరు" (C. H. Spurgeon, “Noah’s Flood,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1976 reprint, volume XIV, p. 431). నోవహు పదవ, క్రీస్తులోని, రక్షణను చూపించే చిత్ర పటము. హేబ్రీయులకు 11లొ చదువుతాము, "విశ్వాసమును బట్టి నోవహు, అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, భయభక్తులు గలవాడై, తన యింటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను…" (హేబ్రీయులకు 11:7). నోవహు అతని కుటుంబము వారు రక్షింపబడ్డారు వారు సురక్షిత ఓడలో ఉన్నారు కాబట్టి జల ప్రళయ తీర్పులోకాన్ని నాశనము చేయక మునుపు. ఎందుకంటే, నోవహు కుటుంబము ఓడలోనికి ఆయనను వెంబడించారు, వారు బ్రతికారు, బైబిలు చెబుతుంది దేవుడు "…మరియు ఆయన లోకమును విడిచిపెట్టక, జల ప్రలయమును రప్పించిన్నప్పుడు…నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడెను" (11 పేతురు 2:5). ప్రాచీన వ్యాఖ్యానికులు అన్నారు ఓడ సంఘమునే చూపించే పటమని. అది ఈనాడు తిరస్కరింపబడుతుంది, కాని నేననుకుంటాను పాత తత్వవేత్తలు ఒక మంచి విషయం కలిగియున్నారు. మూడవ శతాబ్దములో తత్వవేత్త సిప్రియన్ (200-258) అన్నాడు, "సంఘము వెలుపల రక్షణ లేదు." జాన్ కెల్విన్, సంఘ సంస్కర్త, అదే అన్నాడు. వారికీ ఒక విషయం ఉంది. డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ (1897-1963) అన్నాడు, "దేవునికి అంగీకారమైన సేవలేదు సంఘము ప్రధాన బిందువు కాకుండా...స్థానిక సంఘాన్ని పాడు చేస్తే క్రీస్తు శరీరాన్ని పాడు చేసినట్టే" (A. W. Tozer, D.D., “The Vital Place of the Church,” from God Tells the Man Who Cares, quoted in Warren W. Wiersbe, The Best of A. W. Tozer, Baker Book House, 1978, pp. 64, 65). కనుక, ఆలోచిస్తే, ఓడ సంఘాన్ని చూపించే పటము. నేనన్నాను, "ఆలోచిస్తే," ఎందుకంటే మీరు గుడికి హాజరవవచ్చు కాని రక్షింపబడక పోవచ్చు. గుడికి వెళ్ళే చాలా మంది నిజ క్రైస్తవులు కారు. నేను ఖచ్చితం తప్పిపోయిన చాలా మంది, బహుశ వేలమంది, ఓడను చూడడానికి వచ్చారు. నేను అంతే ఖచ్చితం వారిలో చాలా మంది ఓడలోనికి వెళ్లారు. నిస్శందేహంగా వారు ఓడలోనికి నడిచి, ఆయా గదులు చూచి, పైకి క్రిందికి వెళ్లి, ఒక అంతస్తు నుండి ఇంకొక అంతస్తుకు వెళ్లి ఉంటారు. అయినను ఓడ భద్రతకు వారు అప్పగించుకోలేదు. వచ్చి వెళ్లి పోయారు. కొన్ని సార్లు అక్కడ వారున్నారు, మరికొన్ని సార్లు అక్కడ లేదు. జల ప్రళయము వచ్చినప్పుడు వారు ఓడలో లేరు, అందుకే నశించి పోయారు. ఓడలో పలికి వచ్చి, అక్కడ ఉంది, అది గుడిలోపలికి వచ్చే రక్షింప బడిన వ్యక్తిని చూపిస్తుంది, యేసు క్రీస్తుని నమ్మి, ఆయనలో నిలిచియుండి. ద ఎన్ ఐవి అనువదిస్తుంది క్రీస్తు మాటలను యోహాను 15:6 లోనివి, "మీరు నాలో నిలిచి యుండకపోతే, మీరు పారవేయబడిన కొమ్మ లాంటివారు.... కాల్చబడడానికి అగ్నిలోనికి." కనుక, క్రీస్తులోనికి పూర్తిగా, ఆయనలో నిలిచినా వారే, రక్షింపబడినవారు. సాధారణంగా సువార్తను తీవ్రముగా తీసుకొని రక్షింపబడక మునుపు గుడికి వస్తారు. అది ప్రజలు రక్షింపబడే చక్కని మార్గము, కాని ప్రస్తుతపు అపోహ చాలా విషయాలలో తికమక చేస్తుంది. మీలో చాలా మంది గుడిలో ఉన్నారు, ఇంకా యేసుని నమ్మి ఉండక పోవచ్చు. సాధ్యమైనంత కచ్చితంగా ఒక విషయం మీకు చెప్పనా - గుడికి హాజరవడం తీర్పు దినాన నీకు సహాయానికి రాదు. ఆలయంలోపలికి వచ్చిన ఒక వ్యక్తిని గూర్చి యేసు మాట్లాడాడు, పెండ్లి వస్త్రము లేకుండా వచ్చాడని. రాజు ఆ వ్యక్తితో అన్నాడు, "పెండ్లి వస్త్రము లేకుండా ఎలా వచ్చావు?" ఆ మనిషి నోట మాట లేదు. అప్పుడు రాజు అన్నాడు, "అతని కాళ్ళను చేతులను బంధించుడి, బయట, చీకటిలో పడవేయండి; అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయును ఉండును" (మత్తయి 22:12, 13). నీకు "పెండ్లి వస్త్రము" లాభిస్తుంది యేసును నమ్మితే. ఆయన దగ్గరకు రావడానికి నిరాకరిస్తే, ఈ లోకంలో పడిపోయే వాళ్ళలా తీర్పును తప్పించుకొనే ఆశ నీకుండదు. యేసు నోద్దకు రావడానికి నిరాకరిస్తే నిత్య నరకాగ్నిని తప్పించుకోలేవు. నేను నమ్ముతాను రక్షింపబడని వడ్రంగి వారు పనివారు, ఇంజనీర్లు, ఓడను నిర్మించే తప్పుడు నోవహుతో ఉండి ఉండవచ్చు. కాని వారు ఓడను నమ్మలేదు. వారికి అంతా తెలుసు. దానికి వారిని అప్పగించుకోలేదు. మీలో కొందరిలా వారు ఉన్నారు గుడికి వచ్చి యేసు నోద్దకు రాకుండా. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, నీవు గుడికి వచ్చి, యేసును నమ్మడానికి నిరాకరిస్తే, నీవు దిగ్బ్రాంతికి గురవుతావు ఆయన నిన్ను నరకాగ్నిలోకి, పంపించి వేస్తే. క్రీస్తే అన్నాడు, "ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా… నీ నామమున దయ్యములను వెల్ల గొట్ట లేదా? నీ నామమున అనేకమైన అధ్బుతములు చేయలేదా అని చెప్పుదురు, అప్పుడు నేను మిమ్ములను ఎన్నడను ఎరుగును: ఆక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును" (మత్తయి 7:22, 23). యేసు సిలువపై మరణించాడు నీ పాపానికి మూల్యము చెల్లించడానికి. కాని ఆయనను నమ్మడానికి నిరాకరిస్తే, తీర్పు వచ్చినప్పుడు నీవు రక్షణ ఓడ బయట ఉంటావు. నీ పాపాలను కడుగడానికి యేసు తన రక్తాన్ని కార్చాడు. కాని నీవు ఆయనను నమ్మక పొతే, తీర్పు వచ్చినప్పుడు నీవు రక్షణ ఓడ బయట ఉంటావు. యేసు మృతులలో నుండి లేచాడు నీకు నూతన జన్మ ఇవ్వడానికి, నిత్య జీవం కూడా, కాని నీవు ఆయనను నమ్మకపోతే ఎప్పుడూ ఆరని అగ్నిలో నీ నిత్యత్వం గడుపుతావు. ఈ ఉదయాన నిన్ను బతిమాలు చున్నాను - యేసు నోద్దకు రా, దైవ కుమారుడు, ఆలస్యము కాక ముందే! కొన్ని నిమిషాల క్రిందట గ్రిఫిత్ పాడినట్టుగా, "ఇలాంటి సమయాలలో, నీకు రక్షకుడు అవసరము." నీవు యేసును నమ్మాలనుకుంటే, నీ కుర్చీ వదిలి ఆవరణము వెనుక భాగానికి వెళ్ళు. డాక్టర్ కాగన్ ప్రశాంత స్థలానికి తీసుకెళ్ళి మాట్లాడి ప్రార్ధిస్తాడు. నీవు నిజ క్రైస్తవుడవు కావాలనుకుంటే, ఆవరణము వెనుక భాగానికి వెళ్ళు ఇప్పుడే. డాక్టర్ చాన్, ఈ ఉదయాన్నే యేసుని నమ్ము రక్షింపబడిన వారి కోసం ప్రార్ధించండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమే చే: మత్తయి 24:32-42. |
ద అవుట్ లైన్ ఆఫ్ సమకూర్పబడిన తుఫాను THE GATHERING STORM డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే. "నోవహు దినము ఎలాగుండెనో, మనస్యకుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసికోనుడు పెండ్లికి వచ్చుచు, జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకోనిపోవు వరకు, ఎరుగక పోయిరి; అలాగుననే మనష్యు కుమారుని రాకడ ఉండును" (మత్తయి 24:37-39). (I దెస్సలొనీకయులకు 5:3; II పేతురు 3:10; మత్తయి 24:3; I. మొదటిది, "జల ప్రళయము వచ్చి, అందరిని కొట్టుకొని పోయెను," మత్తయి 24:39; II పేతురు 2:5. II. రెండవది, జల ప్రళయము వచ్చినప్పుడు వారు ఈ లోక విషయాలలో ద్యాస కలిగియున్నారు, మత్తయి 24:38; 6:33; 24:39; ఆమోసు 4:12; మార్కు 9:44. III. మూడవది, జల ప్రళయము వచ్చినప్పుడు ఓడలో ఉన్నవారందరూ సురక్షితముగా ఉన్నారు, హేబ్రీయులకు 11:7; II పేతురు 2:5; యోహాను 15:6; మత్తయి 22:12, 13; మత్తయి 7:22, 23. |