Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




యేసు నందు సామాన్య విశ్వాసము

(యెషయా 53 పై 15 వ ప్రసంగము)
SIMPLE FAITH IN JESUS
(SERMON NUMBER 15 ON ISAIAH 53)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జూలై 21, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, July 21, 2013

"మనష్యులు చూడనోల్లని వాడుగాను ఉండెను" (యెషయా 53:3).


"మనష్యులు చూడనోల్లని వాడుగాను ఉండెను." ఒక ఆధునిక వ్యాఖ్యాత అన్నాడు ఈ మాటలు ఇశ్రాయెలీయులను గూర్చి చెప్పబడ్డాయని "సిలువ వేయబడిన మెస్సియాకు వ్యతిరేకంగా మరియు శరీరదారియై దేవుని కుమారుని పట్ల గౌరవం లేకపోవడం." క్రీస్తు సమయాలకు యూదా ప్రజలను కలపడానికి ఈ వచనాన్ని కుదించాడు. కాని మూడి చెప్పింది నా కిష్టం, "వ్యాఖ్యాతలపై బైబిలు ఎక్కువ వెలుగు ప్రసరింప చేస్తుంది." కాదు, ఈవచనం ఇశ్రాయేలు క్రీస్తు పట్ల "విముఖత" చూపించడం లేదు. వచన ఆరంభము అది తేట తెల్లము చేస్తుంది. అది చెప్తుంది, "ఆయన మనష్యులచే తృణీకరింపబడినవారు మరియు విసర్జింపబడినవాడు." యూదులే కాదు, "మనష్యులు" సామాన్యులు! "మనష్యులచే తృణీకరింపబడుట" – యూదులచే మాత్రమే కాదు. "బైబిలు వ్యాఖ్యాతలపై దృష్టి సారిస్తుంది."

లూథర్ "లేఖన సారుప్యతను" గూర్చి మాట్లాడాడు. గొప్ప సంస్కరణ కర్త ఉద్దేశము మనము లేఖనమును లేఖనముతో పోల్చి చూడాలి, దేవుడు ఒక విషయంపై బైబిలులో మిగిలిన చోట్ల ఏమి చెప్పాడో కనుగొనడానికి. యెషయా 49:7 లో మనం చదువుతాం,

"ఇశ్రాయేలు విమోచకుడును, పరిశుద్ధ దేవుడునగు, యోహావా, మనష్యులచే నిరాకరింప బడినవాడు..." (యెషయా 49:7).

కనుక, ఇక్కడ కూడా, మన చూస్తాం "మానవుడు" సాధరణంగా యేసును నిరాకరిస్తాడు, " పరిశుద్ధ దేవుని." నూతన నిబంధనలో, యేసే చెప్పాడు,

"లోకము మిమ్మును ద్వేశించిన యెడల, మీకంటే ముందుగా నన్ను ద్వేశించేనని మీరెరుగుదురు" (యోహాను 15:18).

ఈ వచనాలలో, మనం చూస్తాం నశించు వారు లోకంలో క్రీస్తును అసహ్యించుకొంటారు, లేక ఆయన నుండి ముఖాలు చాటేసుకొని ఆయనను గూర్చి ఆలోచించరు.

"మనష్యులు చూడనోల్లని వాడుగాను ఉండెను" (యెషయా 53:3).

ప్రజలు యేసు నుండి చాల విధాలుగా ముఖాలు చాటేసుకుంటారు. ఇది మూడు విధాలు.

I. మొదటిది, వీరు క్రీస్తు నుండి వారి ముఖాలను పూర్తి దిక్కారముతో దాచుకుంటారు.

పాష్టరు వర్మ్ బ్రాండ్ పుస్తకం, క్రీస్తు కొరకు హింసింపబడుట పుస్తకము చదువుతూ ఉన్నాను. ప్రతి సంవత్సరం చదివాను. పాష్టరు వర్మ్ బ్రాండ్ క్రీస్తును అసహ్యించుకొనే కమ్యూనిష్టుల నుండి వెళ్ళిన భయంకర స్థితిని గూర్చి చెప్పాడు. తాను అన్నాడు,

     చిత్ర హింసలు భయంకరత్వము ఆగకుండా కొనసాగింది. నేను స్పృహ తప్పినప్పుడు ఒప్పుకోలుకు వీలు లేక చిత్ర హింసలు తట్టుకోలేనప్పుడు, బందీ స్థలానికి వెళ్ళేవాడిని. అక్కడ పరుండి, సగం చనిపోయి, కొంత శక్తి పొంది మళ్ళీ హింసింపబడేవాడిని. ఆ స్థితిలో చాల మంది చచ్చిపోయారు... తరువాత సంవత్సరాలలో, వివిధ కారాగారాల్లో, నా వెన్నెముకలో నాలుగు ఇంకా, చాల ఎముకలను విరగగొట్టారు. పన్నెండు స్థలాల్లో తప్పించారు. నన్ను కాల్చి నా శరీరంలో పద్దెనిమిది రంద్రాలు చేసారు...
     మేము రోజుకు పదిహేడు గంటల చొప్పున కూర్చున్నాం – వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి – వింటూ

     కమ్యునిజం మంచిది!
     కమ్యునిజం మంచిది!
     కమ్యునిజం మంచిది!
     క్రైస్తవ్యం అవివేకం!
     క్రైస్తవ్యం అవివేకం!
     క్రైస్తవ్యం అవివేకం!
     వదిలేయ్!
     వదిలేయ్!
     వదిలేయ్!

(Richard Wurmbrand, Th.D., Tortured for Christ, Living Sacrifice Books, 1998 edition, pp. 38, 39).

అతడు ఎక్కువచేసి చెప్పలేదు. ఆయనను నేను భాగా ఎరుగుదును.

కమ్యూనిష్టులు సోషలిష్టులు క్రీస్తును ఎక్కువగా అసహ్యించు కొంటారు. యేసుకు ఆయన అనుచరులకు సోషలిష్టుల నుండి వచ్చే దాడులు మనం చూస్తాం ఈనాడు అమెరికాలో కూడా – వైట్ హౌస్ నుండి పాఠశాల ఇంటి వరకు. పూర్తి దిక్కారముతో ఉన్నత స్థలములో ఉన్నవారు క్రీస్తు నుండి ముఖాలు దాచుకుంటారు. క్రీస్తును ఆయన అనుచరులను చిన్న చూపుతో చూసేవారు మన పాఠ్య భాగాన్ని తప్పక నెరవేరుస్తున్నారు,

"మనష్యులు చూడనోల్లని వాడుగాను ఉండెను" (యెషయా 53:3).

II. రెండవది, వీరు క్రీస్తు నుండి వారి ముఖాలను ఉదాసీనతతో దాచుకుంటారు.

తప్పకుండా ఈ ఉదయాన్న కొంతమందిని అలా వర్ణించవచ్చు! మీరు క్రైస్తవుని బాధ పెట్టరు, "క్రైస్తవ్యం అవివేకం" అని అరవరు. పాష్టరు వర్మ్ బ్రాండ్ కు కమ్యూనిష్టులు చేసింది చెప్పినప్పుడు మీరు భయంతో నిండుకున్నారు. మీరంటారు, "నేనెప్పుడు అలాంటిది చెయ్యను!" నేను మిమ్మును నమ్ముతాను. ఆ జంతు సమాన కమ్యునిష్టు హింసకులలో ఒకరిలా మీరు యేసుపై దాడి చేసారని నేను అనుకోను. మరియు అయినా...! మరియు అయినా...! మీరు మన పాఠ్యభాగాన్ని మీ చల్లని ఉదాసీనతతో యేసు పట్ల నెరవేరుస్తున్నారు,

"మనష్యులు చూడనోల్లని వాడుగాను ఉండెను" (యెషయా 53:3).

మీరు గుడికి వచ్చి కూర్చుంటారు. నేను యేసును గూర్చి మాట్లాడేటప్పుడు మీ కళ్ళు ఆడిస్తారు. కొంతమంది మీలో కళ్ళు కూడా మూసుకుంటారు. మిగిలిన వారు హృదయాలు మూసుకుంటారు. చల్లని ఉదాసీనతతో, యేసు నుండి మీ ముఖాలు దాచుకుంటారు.

మీకు తెలుసా బోధకుడు కూడా అలా చెయ్యవచ్చని? ఉత్తర శాన్ ప్రాన్సిస్కో లోని దక్షిణ బాప్టిస్టు సెమినరీలా నేను ఉన్నప్పుడు, టామ్ ఫ్రెడరిక్ అనే విద్యార్ధి ఉండేవాడు. ఆయన నాకు స్నేహితుడు అయ్యాడు. టామ్ బోధకుడు. కాని ఒక ఆదివారం తన ప్రసంగమే తన హృదయంలో గుచ్చుకుంది! ఎంతో ఏడ్చి బోధింపలేకపోయాడు. ప్రసంగ వేదిక నుండి దిగి బలిపీఠం దగ్గర మోకరిల్లాడు. అక్కడ రక్షకుని పట్ల తనకు ప్రేమ లేని తనాన్ని బట్టి పశ్చాత్తాపపడ్డాడు. అక్కడ, ఆశ్చర్యపోయే తన సంఘము ముందు, యేసు నుండి తన ముఖం దాచుకోవడం మానేసాడు. రక్షకుని నమ్మి, నిజ క్రైస్తవుడయ్యాడు. దయార్ద హృదయుడయ్యాడు. ప్రతి గురువారం సాయంత్రం నా గదికి వచ్చి ప్రార్ధించే వారితో కలిసేవాడు. బైబిలుకు వ్యతిరేకంగా ఉండే అధ్యాపకులను ఎదిరించడంలో నన్ను బలపరిచేవాడు. సెమినరీ అధ్యక్షుని తన ద్వారము దగ్గర వాగ్వివాదం చేసేటప్పుడు అతడు నాతో ఉన్నాడు. వారు అతనిని "హైమర్స్ పిచ్చోడు" అనినప్పటికినీ నన్ను బలపరిచాడు. నశించు దక్షిణ బాప్టిస్టు బోధకుని నుండి, నిజ క్రైస్తవుడవడానికి వెళ్ళిపోయాడు. ఆయనలో మార్పు ఎప్పుడు వచ్చిందంటే చల్లని ఉదాసీనతతో యేసును చూడడం మానినప్పుడు.

టామ్ కొన్ని వారాల క్రితం చనిపోయాడు. కొంత డబ్బు తన భార్యకు పంపాను. నేను చేసింది చాల తక్కువ నా కృతజ్ఞత వ్యక్తపరచడానికి 1970 లో గోల్డెన్ గెడ్ బాప్టిస్టు సెమినరీలో నన్ను బలపర్చినందుకు. నేను దేవునికి వందనస్తుడను టామ్ హృదయము యేసు తెరచినందుకు, చాల కాలం క్రితం ఆదివారం ఉదయం తను ప్రసంగిస్తూ రక్షింపబడ్డాడు.

ఎవరో అన్నారు, "డాక్టర్ హైమర్స్, నేను టామ్ లా అవడం మీరు కోరుకోరు, కదా?" దేవుడు నాకు సహాయము చెయ్యాలి! పరలోకంలో దేవ దూతల సమక్షంలో నేను ఆనందిస్తాను అతనిలో సగమైన మీరు అయితే! మీలో కొంతమంది యవనస్థులు వారం వెంబడి వారం ఇక్కడ కూర్చుంటారు శ్రద్ధ లేకుండా, మేల్కొనకుండా, ఉదాసీనతో – టామ్ లో చిన్న భాగంలా అయినా మీరు అవాలని దేవునిలో ఆశిస్తున్నాను!

ఇప్పుడు, ఇలా చెప్పండి – మీరు 1971 లేక 1972 లో గోల్డెన్ గేటు సెమినరీలో ఉంటే ఎలా ఉండేవి? మీరు వేరే గుడి నుండి వచ్చి, నేను మీకు పాదిరి కాకుంటే ఎట్లా ఉండేది? ఇప్పుడు ఆలోచించండి! బైబిలును వ్యతిరేకించే అధ్యాపకులను నేను ఎదిరిస్తున్నప్పుడు మీరు నన్ను బలపరచేవారా? ఇప్పుడు ఆలోచించండి! మీరు నన్ను బలపరచేవారా? లేక "చల్లగా" ఉంది వివాదము నుండి తప్పుకునే వారా? ఆలోచించండి!

ఇప్పుడు, మీరు యదార్ధంగా ఉంటే, మీలో కొందరు ఒప్పుకోవాలి మీరు చల్లగా వేరుగా ఉంటారని. డిగ్రీ పుచ్చుకొని, అక్కడ నుండి వెళ్లి పోయేవారు "హైమర్స్ అభిమానులు" అనిపించుకోకుండా, కదా? మీరు అకస్మాత్తుగా మీ స్థితి నుండి మారలేరు, క్రీస్తు కొరకు పౌరుషంతో ఉండలేరు, కదా? ఆలోచించండి! నేను నమ్ముతాను లోపలి వచ్చి వెళ్ళు మీరు ఆ లిబరల్ సెమినరీలో నా పక్షాన ఉండి ఉండేవారు కాదు. కాదు, మీరు ఇప్పటిలా చల్లగా ఉదాసీనతతో ఉండేవారు! ఇలా చెప్పే వారితో మీరు కలవాల్సి ఉంది,

"మనష్యులు చూడనోల్లని వాడుగాను ఉండెను" (యెషయా 53:3).

III. మూడవది, వీరు క్రీస్తు నుండి వారి ముఖాలను నిర్లక్ష్యముతో దాచుకుంటారు.

మీరు చాల కాలంగా యేసు నుండి మీ ముఖాలు దాచుకొని ఉంటారు. నేను యేసును గూర్చి బోధిస్తున్ననో లేదో మీకు లెక్కలేదు. నేను మనస్తత్వమును గూర్చి మాట్లాడితే కుర్చీల్లో నిటారుగా కూర్చొని ఆసక్తితో వినేవారు. నేను రాజకీయాలు మాట్లాడితే ముందుకు వంగి ప్రతి మాట వినేవారు. బైబిలు ప్రవచనముపై నేను మాట్లాడినప్పుడు, ప్రసంగానికి పూర్తి ఆసక్తిని కనుపర్చారు. పరలోకాన్ని గూర్చి కొన్ని వారాల క్రితం మాట్లాడినప్పుడు, ఎంతో ఏకాగ్రతతో విన్నారు, ఎందుకంటే కొత్త అంశము కాబట్టి. నేను సువార్తకు వచ్చేసరికి, మీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నేను యేసును గూర్చి మాట్లాడితే మీరు ఆశక్తి కోల్పోతున్నారు! అవును కదా? అవును కదా?

యవనస్థులైన మీరు ఎక్కువ సమయము శక్తి కళాశాలలో చదవడానికి వినియోగిస్తారు. గంటల తరబడి చదువుతారు తరగతిలో రాణించడానికి. చదవడానికి త్వరగా లేస్తారు. రాత్రులు ఆలస్యంగా చదువుతూనే ఉంటారు. మీరలా చెయ్యడం నాకు సంతోషం ఎందుకంటే పాఠశాలలో చదవకపోతే మీ వృత్తిలో రాణించరు. పాఠశాలలో కష్టపడి చదువుచున్నందుకు అభినందిస్తున్నాను. కాని ఒక గంట కూడా ఆలస్యముగా ఉండరు బైబిలు ప్రసంగాలు చదవడానికి, ప్రతివారం ముద్రింపబడి, ఇవ్వబడుతున్నాయి. ఒక గంట ముందు లేవాలని కూడా అనిపించదు మీ పాపపు ఆత్మను రక్షించడానికి, చనిపోయిన క్రీస్తును గూర్చి చదవటానికి. లోకంలో ప్రతిదే చాల ప్రాముఖ్య మనిపించింది, మిమ్మును ప్రేమిస్తున్న పరలోకంలో మీకై ప్రార్ధిస్తున్న క్రీస్తు కంటే.

ఇక్కడ గుడిలో కూడా, యేసును గూర్చి బోధిస్తున్నప్పుడు, ఆయన కంటే ఎక్కువగా మీరు భావిస్తున్న విషయాలపై మనసు తిరిగుతుంటుంది. మీరు గదికి వచ్చినప్పుడు, యేసును గూర్చి మాట్లాడరు. మీరు సిద్ధాంతాలను గూర్చి, కాని యేసును గూర్చి మాట్లాడడం వినను. బైబిలు వచనాలను గూర్చి మాట్లాడడం వింటాను, కాని యేసును గూర్చి మాట్లాడడం వినను! మీ తలంపులో ఆయన లేడు. చాలాసార్లు మీకు అనిపించేది – అనిపించనిది మీరు మాట్లాడుతారు. నిశ్చయతకు ఒక భావన కావాలి, కాని యేసును చూడరు. నిశ్చయత లేని స్థితిని గూర్చి మాట్లాడతారు, కాని రక్షకుని గూర్చి మాట్లాడారు, రక్షణ నిశ్చయత నిచ్చువాడు ఆయనే! కొందరు మీలో అనుకుంటారు, "విరిగిన హృదయము నాకు లేదని." నేను మీకు చెప్తాను, "విరిగిన హృదయం కొరకు చూడొద్దు, యేసును చూడండి!" ఆయన పేరు చెప్పేటప్పుడు, మీకళ్ళు అలసి అనుకుంటారు, "నాకు భావన కావాలి. రక్షింపబడినట్టు అనిపించాలి!" నేనంటాను, "కాదు, మీకు కావలసిందల్లా యేసు." ఆయన పేరు చెబితే వెంటనే ఆశక్తి కోల్పోతారు. నేను చెప్తాను, "యేసును ఇప్పుడే చూడండి, సిలువపై నీ కొరకు రక్తము కార్చువానిని." కాని మీ వైపు చూసుకోండి. మీలో భావన కొరకు చూస్తున్నారు! మీరు యేసు వైపు చూసేలా చెయ్యడం కష్టంగా ఉంది! ప్రవక్త చెప్పింది చెప్తాను, "యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకోనుడి" (యెషయా 55:6). కాని మీరు భావన ఉద్రేకము కొరకు చూస్తున్నారు క్రీస్తును వెదకకుండా, మిమ్ములను ప్రేమించే ఆయనను!

"మనష్యులు చూడనోల్లని వాడుగాను ఉండెను" (యెషయా 53:3).

నేను మిమ్ములను అడుగుచున్నాను యేసును చూడకుండా తిప్పుకోవద్దని. యేసు వైపు తిరిగితే, ఆయన మిమ్ములను రక్షిస్తాడు. బహుశా రక్షణ "భావన" రాదు. నేను యేసుచే రక్షింపబడిన రోజున, ఆ "భావన" నాకు లేదు. చాల నెలల వరకు నేను రక్షింపబడినట్టు కూడా తెలియలేదు. ఆరోజున యేసునే ఎరిగాను! ముందు ఆయనను నమ్మాను, కాని ఆరోజు – నేను చెప్పగలను – యేసు అక్కడ ఉన్నాడు! అది ఆది విశ్వాసము, కాని యేసు నందలి విశ్వాసము, చాల సామాన్యం, చాల అనాదిది – కాని అది యేసు!

పాష్టరు వర్మ్ బ్రాండ్ కమ్యునిష్టులచే చాల మంది క్రీస్తు కొరకు హింసింపబడడం చూసాడు కారాగారములో బోధిస్తున్నప్పుడు. చాల మంది జైలులో ఉన్నవారు, కమ్యునిష్టు గార్డులు, యేసును నమ్మడం చూసాడు. పాష్టరు వర్మ్ బ్రాండ్ అన్నాడు,

ఒకసారి వ్యక్తి విశ్వాసము దగ్గరకు వచ్చినప్పుడు – ప్రాధమిక విశ్వాసము – ఈ విశ్వాసము అభివృద్ధి చెంది ఎదుగుతుంది. చాల కచ్చితం అది జయిస్తుంది ఎందుకంటే భూ గర్భిత సంఘము మళ్ళీ మళ్ళీ ఓడించడం చూసింది. క్రీస్తు కమ్యునిష్టులను ఇతర "విశ్వాసానికి శత్రువులను" ప్రేమిస్తాడు. వారు క్రీస్తు కొరకు జయింపబడాలి (వర్మ్ బ్రాండ్, ఐబిఐడి., పేజి 115).

యేసు ప్రక్క సిలువపై చనిపోయిన గొండ ఈ లోకాన్ని విడిచే కొన్ని నిమిషాల ముందు రక్షింపబడ్డాడు. ఆయనకు కొంచెమే తెలుసు. ఆయన విశ్వాసము "పరిమితం," పాష్టరు వర్మ్ బ్రాండ్ మాటల్లో. కాని తానూ రక్షింపబడ్డాడు తన హృదయం యేసును నమ్మినప్పుడు. రక్షకుడు తనతో అన్నాడు, "నేడు నీవునాతో కూడా పరదైనులో ఉండవు" (లూకా 23:43). నాకపిస్తుంది ఈ ఉదయం ఎవరో ఉన్నారు ఆ మనష్యుడు చేసినట్టు యేసును నమ్మడానికి. అది చాల సులభం, "పరిమిత" విశ్వాసము, కాని నీవు కొంచెము యేసును నమ్మితే, ఋజువు కొరకు నీ వైపు చూసుకోకుండా, యేసును నమ్మి వదిలేస్తే, ఆత్మ పరిశీలన లేకుండా, యేసు నిన్ను రక్షిస్తాడు. సామాన్యం, బలహీనం, "పరిమితం," యేసులో చిన్న పిల్లలాంటి విశ్వాసము – అదే మీరు చెయ్యాలి. ఒక్కసారి కూడా నీ వైపు చూడవచ్చు. ఒక్కసారి కూడా భావన కొరకు చూడవద్దు. యేసు వైపు చూచి వదిలేయండి. చిందర వందర చెయ్యవద్దు. పరీక్షించవద్దు. విశ్లేషణ చెయ్యవద్దు. యేసును నమ్మి వదిలేయి. మిగిలినదంతా యేసే చూసుకుంటాడు. పడుకునేటప్పుడు, యేసు నందు విశ్వాసపు విత్తనము ఎదుగుతుంది. కాని నీవు యేసును తప్పక నమ్మాలి – కొంచెంగా, సామాన్యంగా, ఆగి ఆగి, పరిమితంగా. యేసును అంత నమ్మితే చాలు. నీవు ఆయన దగ్గరకు వెళ్లి, వదిలెయ్యాలి, నీ స్వంత భావాలు నిశ్చయతల వైపు చూడకుండా. యేసుకు వదిలెయ్యాలి. అప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, ఈ విశ్వాసపు విత్తనము, పాష్టరు వర్మ్ బ్రాండ్ చెప్పినట్టు, "అభివృద్ధి చెంది ఎదుగుతుంది." చాల బలహీన, పరిమిత, ఊహిసలాడే విశ్వాసము యేసు నందు కావాలి! గ్రిఫిత్ గారు పాడిన పాట మళ్ళీ వినండి. అది సామాన్య, ప్రాధమిక యేసు నందలి విశ్వాసమును గూర్చి మాట్లాడుతుంది, భావన లేకుండా!

నా ఆత్మ రాత్రి, నా హృదయం స్టీలు –
   నేను చూడలేను, నేను భావించ లేను;
వెలుగు కొరకు, జీవితం కొరకు, నేను ప్రాదేయపడాలి
   యేసు కొరకు సామాన్య విశ్వాసముతో.
("యేసు నందు" జేమ్స్ ప్రోక్టర్ చే, 1913).
(“In Jesus” by James Procter, 1913).

మీరు కోరితే మీ కొరకు ప్రార్దిస్తాం. నిజ క్రైస్తవుడవడంలో సహాయ పడతాం. మీ స్థలము వదలి ఇప్పుడే ఆవరణము వెనుకకు రండి. డాక్టర్ కాగన్ ప్రశాంత స్థలానికి ప్రార్ధన కొరకు తీసుకెళతాడు. నేను మళ్ళీ ఆ పాట పాడేటప్పుడు మీరు వెళ్ళండి.

వెయ్యి విధాలుగా విఫల ప్రయత్నం చేసాను
   నా భయాలు పోయి, నిరీక్షణలు పెరిగి;
కాని నాకు కావలసింది, బైబిలు చెప్తుంది,
   ఎన్నటికిని, యేసు మాత్రమే.

నా ఆత్మ రాత్రి, నా హృదయం స్టీలు –
   నేను చూడలేను, నేను భావించ లేను;
వెలుగు కొరకు, జీవితం కొరకు, నేను ప్రాదేయపడాలి
   యేసు కొరకు సామాన్య విశ్వాసముతో.
("యేసు నందు" జేమ్స్ ప్రోక్టర్ చే, 1913).
(“In Jesus” by James Procter, 1913).

డాక్టర్ చాన్, దయచేసి వచ్చి స్పందించిన వారి కొరకు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: లూకా 23:39-43.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"యేసు నందు" (జేమ్స్ ప్రోక్టర్ చే, 1913).
“In Jesus” (by James Procter, 1913).